luxury villa
-
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్‌లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
దుబాయ్‌లో కొత్త పెళ్లికొడుకు ఇల్లు ఎలా ఉందో చూశారా?
ఆసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ముంబైలో అంత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వ్యాపార దిగ్గజాలు, రాజకీయ సినీ ప్రముఖులు తరలిరాగా ప్రపంచం అబ్బురపడేలా అంగరంగ వైభవంగా వేడుకలు సాగాయి.విస్తారమైన వ్యాపార సామ్రాజ్యానికి పేరుగాంచిన అంబానీ కుటుంబానికి చెందిన చిన్న వారసుడు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో వారి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లు, ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. అయితే పెళ్లికి ముందే అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దుబాయ్‌లో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలుసా..? ఆ విలాసవంతమైన ఇంటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనంత్ అంబానీకి దుబాయ్‌లోని పామ్ జుమేరాలో సముద్రతీరంలో అత్యంత ఖరీదైన, విశాలమైన విల్లా ఉంది. ముఖేష్ అంబానీ 2022లో దీన్ని సుమారు రూ.640 కోట్లు పెట్టి కొనుగోలు చేసి అనంత్ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. ఇందులో పది బెడ్రూమ్లు, ప్రైవేట్ స్పా, 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉన్నాయి. ఇది దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన నివాసాలలో ఒకటిగా ఉంది. -
చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులను అందించారు. తాజాగా నీతా అంబానీ కాబోయే చిన్న కోడలికి దుబాయ్‌లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించ నున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా, ఎన్ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్‌లో 640 కోట్ల విల్లాను కానున్నకొత్త కోడలికి గిఫ్ట్‌గా అందించనున్నారు. ఇందుల 10 విలాసవంతమైన బెడ్రూమ్లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్‌గా ఉంటాయిట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. అంతేకాదు బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేసేందుకు కూడా ఇది సరిపోతుందని అంచనా.లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్లో జామ్ నగర్లో ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. హస్తాక్షర్ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.కాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనంత్‌కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు ముఖేష్ అంబానీ. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
లగ్జరీ అపార్ట్మెంట్లు, అదిరిపోయే విల్లాలు: ఫేవరెట్‌గా హైదరాబాద్ రికార్డ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. విలాసవంతమైన గృహాల సరఫరాలో ముందంజలో ఉండటమే 2023 క్యూ3లో రికార్డు సృష్టించింది. తాజా నివేదికల ప్రకారం దేశంలోని అన్ని నగరాలను అధిగమించి భారతదేశంలో లగ్జరీ హౌసింగ్‌కు ఫేవరెట్‌గా హైదరాబాద్ నిలిచింది. విలాసవంతమైన గృహాల సరఫరాలో అసాధారణమైన పెరుగుదలను సాధించింది. 2023 మూడో త్రైమాసికంలో దాదాపు 14,340 యూనిట్లతో లగ్జరీ హౌసింగ్‌కు గో-టు డెస్టినేషన్‌గా హైదరాబాద్ నిలిచింది. హై-ఎండ్ లివింగ్‌కు హైదరాబాద్ బలమైన డిమాండ్‌ను నమోదు చేసిందని అనారాక్ నివేదిక తాజాగా వెల్లడించింది. లగ్జరీ హౌసింగ్ జనాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలను కూడా దాటేసింది హైదరాబాద్. అలాగే గృహ కొనుగోలుదారులలో ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. అలాగే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త లగ్జరీ ప్రాజెక్ట్‌లతో డెవలపర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని పేర్కొంది. (రూ.100 కోట్ల అపార్ట్మెంట్ డీల్: షాక్ అవుతున్న మార్కెట్ నిపుణులు ) Q3 2018లో, ఇక్కడ కేవలం 210 లగ్జరీ యూనిట్లు లాంచ్ అయాయ్యి. 2023 క్యూ3 నాటికి హైదరాబాద్ 14,340 లగ్జరీ యూనిట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో మొత్తం కొత్త లగ్జరీ హౌసింగ్ సరఫరాలో దాదాపు 46 శాతం వాటాను కలిగి ఉంది. కోవిడ్ తర్వాత దాని అసాధారణ పనితీరు కారణంగా డెవలపర్లు లగ్జరీ గృహాల విభాగంలో బలమైన విశ్వాసంతో ఉన్నారు. పాండమిక్ తరువాత టాప్ నాచ్ సౌకర్యాలు, బిగ్ గృహాల కోసం కొనుగోలుదారుల డిమాండ్‌తో దేశంలోని టాప్ ఏడు నగరాల్లో అమ్మకాలు పెరిగాయనిఅనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ అండ్ హెడ్ (పరిశోధన), ప్రశాంత్ ఠాకూర్వ్యాఖ్యానించారు, అనరాక్ ఇటీవలి వినియోగదారుల సెంటిమెంట్ సర్వే ప్రకారం మహమ్మారికి ముందు (H1 2019) నుండి 9 శాతం మంది మాత్రమే రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విలాసవంతమైన గృహాలను ఇష్ట పడ్డారు. అయితే, H1 2023లో ఇటీవలి సర్వేలో, ఈ సంఖ్య 16 శాతానికి పెరిగింది. హౌసింగ్ మార్కెట్లో హైదరాబాద్, ముంబై (MMR), ఢిల్లీ-NCR, పూణే, బెంగళూరు, కోల్‌కతా ,చెన్నైలతో సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 40 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల డిమాండ్ కేవలం 18 శాతం మాత్రమే కావడం గమనార్హం.అయితే హైదరాబాద్‌లో లగ్జరీ హౌసింగ్ విజృంభిస్తున్నప్పటికీ, సరసమైన గృహాల పరిస్థితి భిన్నంగా ఉందని కూడా అనరాక్ నివేదించింది. -
లెజెండరీ క్రికెటర్ల కళ్లు చెదిరే ఇంద్రభవనాలు: అత్యాధునిక ఫీచర్లు
టీమిండియా మాజీ కెప్టెన్ కూల్, మహేంద్ర సింగ్ ధోనీకి తన స్వస్థలం రాంచీ నగరం నడిబొడ్డున విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. సోషల్ మీడియాలో ధోనీ పెద్దగా యాక్టివ్‌గా ఉండపోయినప్పటికీ, ఆయన భార్య భార్య సాక్షి ధోని తరచుగా చేసే సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఈ ఇంటికి సంబంధించిన సంగతులు వెలుగు చూస్తూనే ఉంటాయి. కైలాసపతిగా పేరు పెట్టుకున్న ఫామ్‌హౌస్ 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. టాప్ మోస్ట్ సౌకర్యాలతోపాటు సహజమైన ప్రకృతి దృశ్యం, చక్కటి ఇంటీరియర్స్‌తో ఇదొక ఇంద్ర భవనమని ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. యువరాజ్ సింగ్ ముంబైలోని వోర్లీలోని లావిష్ సీ ఫేస్డ్ అపార్ల్మెంట్కు ఓనర్ మాజీ క్రికెటర్ యువరాజ్ 16,000 చదరపు అడుగుల స్థలంలో ఓంకార్ టవర్స్‌లోని 29వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను 2013లో రూ. రూ. 64 కోట్లకు కొనుగోలు చేశాడు. గ్లాస్ పేటెడ్ బాల్కని ప్రధాన హైలైట్. ఇతనికి గోవాలో హాలిడే హోమ్‌గా ఉంది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్ ముంబైలోని బాంద్రాలోని నాగరిక ప్రాంతంలో లగ్జరి బంగ్లా ఉంది. డోరబ్ విల్లా అని పిలిచే దీనిని 2007లో క్రికెటర్ దానిని కొనుగోలు చేశాడు. దీన్ని అత్యాధునిక సౌకర్యాలు, ఫీచర్లతో పునర్నిర్మాణం చేసి 2011లో మాత్రమే ఇందులోకి మారారు. మూడు అంతస్తుల్లో 6000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఇంటి విలువ రూ. 38 కోట్లు. రోహిత్ శర్మ ఇల్లు, 2015లోదీని విలువ రూ. 30 కోట్లు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని వర్లీలోని అహుజా టవర్స్‌లోని 29వ అంతస్తులో రోహిత్ శర్మకు సముద్రానికి ఎదురుగా భారీ అపార్ట్మెంట్ ఉంది. నాలుగు బెడ్రూమ్లు , ఆకట్టుకునే 13 అడుగుల ఎత్తైన సీలింగ్ ఉన్నాయి. వాక్-ఇన్ వార్డ్రోబ్, ఇతర అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. వాయిస్-కమాండ్ కంట్రోల్ ప్యానెల్ల ద్వారా లైటింగ్, గాడ్జెట్లు, ఉష్ణోగ్రత , ఎంటర్టైన్మెంట్ డివైస్‌లను రిమోట్‌గా నియంత్రించగల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హోమ్ ఆటోమేషన్ దీని ప్రత్యేకత. సునీల్ గవాస్కర్ లెజెండ్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ గోవాలో ఖరీదైన ఇంటిని 2017లో కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన హాలిడే విల్లా 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. పురాతన ఫర్నిచర్‌తో చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరమైన విల్లా ఇది. సురేష్ రైనా సురేష్ రైనా తన స్వస్థలమైన ఘజియాబాద్‌లో అందమైన ఇంటిని నిర్మించుకోవడం విశేషం. రాజ్ నగర్‌లోని పాపులర్ ఏరియాలో అన్ని ఆధునిక హంగులతో బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్ మార్బుల్‌కి తోడు, చుట్టూ విలాసవంతమైన పచ్చదనంతో ఆకర్షణీయంగాఉంటుంది. ఇంకా ఓపెన్ యార్డ్‌లో సురేశ్ కోసం విశాలమైన చక్కటి జిమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్‌లోని రూ.18 కోట్ల విలువైన ఢిల్లీలోని 5 బీహెచ్‌కే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. సౌరవ్ గంగూలీ కోల్‌కతా యువరాజు సౌరవ్ గంగూలీకి కోల్‌కతా నగరం నడిబొడ్డున వంశపారంపర్యంగా వచ్చిన ఆస్థికి యజమాని దాదాపు 45 ఏళ్లుగా ఆస్తి బాగా కరిగిపోయినప్పటికీ కోల్‌కతాలోని అతిపెద్ద ప్రైవేట్ భవనాల్లో ఒదొకటి. దాదా ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడుపుతారట. స్మృతి చిహ్నాలతో నిండిన దాదా రూం ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి. విశాలమైన గార్డెన్, క్రికెట్ పిచ్ , పోర్చ్తో కూడిన ఓపెన్ ఫ్రంట్ యార్డ్ ఉన్నాయి. రవీంద్ర జడేజా: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని ఇంద్రభవనం లాంటి ఇల్లు రాజసంతో ఉట్టి పడుతూ ఉంటుంది. దీనివిలువ 10 కోట్లు ఉంటుందని అంచనా. పలు లగ్జరీ,రాయల్ ఫిట్టింగ్లతోపాటు, చెక్కతో అందంగా తీర్చిదిద్దిన జడేజా ఇంటి ప్రవేశ ద్వారం స్పెషల్ ఎట్రాక్షన్. హార్దిక్ పాండ్యా క్రికెటర్లు, అన్నదమ్ములైన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇద్దరి కలిపి లగ్జరీ ఇల్లు ఉంది. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో ఉంటుంది. ఇందులో ప్రైవేట్ జిమ్, ప్రైవేట్ థియేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.దీని విలువ రూ. 3.6 కోట్లు. విరాట్ కోహ్లీ స్వీట్ హోం హర్యానాలోని గురుగ్రాంలో విరాట్ కోహ్లీ స్వీట్ హోం. 10,000 చదరపు అడుగుల స్థలంలో ఉన్న దీన్ని విలువ రూ. 80 కోట్లు . -
రిటెన్షన్ బోనస్‌తో సీఈవో లగ్జరీ విల్లా: ఇపుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులు దాదాపు 700 మిలియన్ డాలర్లు (రూ. 5780 కోట్లు) స్టాక్ ఆప్షన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ హెచ్ఆర్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ఫ్యాషన్ విభాగం మింత్రా అర్హులైన న ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపింది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని సంస్థ వేలాది ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ బైబ్యాక్ అందింనుంది. కంపెనీ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి. నివేదికల ప్రకారం, ఈ (జూలై) నెలాఖరులోగా ఈ నగదును సదరు ఉద్యగులకు అందించనున్నారు. అర్హత ఉన్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రతి ESOP యూనిట్‌కు రూ. 3615 అందు కుంటారు. ఫ్లిప్‌కార్ట్‌లో 15వేల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మింత్రాలో దాదాపు 3500 మంది ఉద్యోగులున్నారని సమాచారం. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?) వాల్‌మార్ట్ 2018లో కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారట. అందుకే 16 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ తరువాత అతనికి 2 మిలియన్ డాలర్ల రిటెన్షన్ బోనస్ ఆఫర్ చేసినట్టు బిజినెస్ టుడే నివేదించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఈస్ట్ బెంగళూరులో కృష్ణమూర్తి ఓ విల్లా కొన్నాడు. విల్లా 4921 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా ఖరీదు రూ.8 కోట్లు. ఇందులో నాలుగు బెడ్రూమ్లు, ఐదు బాత్రూమ్లు, డ్యూయల్ కిచెన్లు, పూజ, లివింగ్, డైనింగ్, ఆఫీస్, మీడియా, యుటిలిటీ రూమ్‌లు వ్యక్తిగత గ్యారేజీ కూడా ఉంది. మరోవైపు కంపెనీ త్వరలోనే ఐపీఓకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్‌స్టార్‌కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్‌గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్‌కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
లగ్జరీ విల్లాలకు ఊపు: ఎన్ఆర్ఐ, బడాబాబులే తోపు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తర్వాత విల్లాలకు ఊపొచ్చింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా మహమ్మారి లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతుంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ♦ ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది. లాంచింగ్‌లోనూ లగ్జరే.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికే ఏకంగా 28 వేల లగ్జరీ గృహాలను లాంచింగ్ చేశారు. పశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమాది ప్రాంతాలదే హవా కొనసాగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంఇచ కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వృద్ధి కారణాలివే.. 2019 నుంచి 2022 హెచ్1తో పోలిస్తే రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల విక్రయాలలో రెండింతల వృద్ధి నమోదయింది. 2022 హెచ్1లో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. ఇక్కడ 13,670 యూనిట్లు సేలయ్యాయి. ఆ తర్వాతి ఎన్సీఆర్లో 4,160 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019లో ఈ రెండు నగరాలలో 11,890 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలోనే 17,830 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019 నుంచి 2022 హెచ్ 1తో పోలిస్తే ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం 25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఎన్సీఆర్లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. -
అంబానీ రికార్డు బద్దలు: దుబాయ్‌లో మరో లగ్జరీ విల్లా డీల్
న్యూఢిల్లీ: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఇటీవల దుబాయ్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన అంబానీ తాజాగా మరొక బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేశారు. తద్వారా కేవలం నెల రోజుల్లోనే మరో రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ డీల్‌ను సాధించడం విశేషం. అయితే ప్రైవేట్ వ్యవహారంగా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ఇండియా రెండో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ గత నెలలో దుబాయిలో రూ.640 కోట్లతో లగ్జరీ విల్లాను సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకోసం కొనుగోలు చేశారు. తాజాగా కువైట్ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబం నుండి సుమారు 163 మిలియన్లడాలర్లవిలువైన పామ్ జుమేరా మాన్షన్‌ను కొనుగోలు చేశారని కొనుగోలుదారుడి పేరు బహిర్గతం చేయకుండా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ నివేదించింది. కాగా ముఖేశ్ అంబానీ విదేశాలలో భారీగా ఆస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు. 79 మిలియన్ల డాలర్లతో ఐకానిక్ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్‌ను రూ.592 కోట్లతో కొనుగోలు చేశారు. దీన్ని పెద్ద కుమారుడు ఆకాశ్‌కు కేటాయించినట్టు సమాచారం. అలాగే కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్‌లో కూడా ఖరీదైన భవనం కోసం వెతుకుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అంతేకాదు సింగపూర్ ఫ్యామిలీ ఆఫీసు ఏర్పాటులో అంబానీ బిజీగా ఉన్నారని ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. -
ఇవి పాటిస్తే గేటెడ్‌లో నిశ్చింతే!
సాక్షి, హైదరాబాద్ : గేటెడ్ కమ్యూనిటీ అయినా లగ్జరీ విల్లా అయినా నివాసితులంతా రోజువారి పనుల్లో బిజీగా ఉంటారు. అసలు పక్కవారి గురించి ఆలోచించే తీరికే ఉండదు. ఈ నేపథ్యంలో నివాసితుల సంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించడానికి ముందుకొచ్చేవారిని అభినందించాలి. మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవటానికి సలహాలు ఇవ్వాలి. అంతేతప్ప చిన్న పొరపాటునూ భూతద్దంలో చూసి పెద ్దగా చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయా సంఘం బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఎవరూ ముందుకురాకపోవచ్చు. కాబట్టి నివాసితులంతా సంఘం పట్ల బాధ్యతగా మెలగాలి. ⇔ ఒక అపార్ట్మెంట్లోని వ్యవహారాలన్నీ సమర్థంగా నడిపించాల్సిన విధివిధానాల గురించి ‘బైలాస్’లో స్పష్టంగా రాసుకోవాలి. ఏయే సందర్భాల్లో నివాసితులెలా స్పందించాలో ముందే పేర్కొనాలి. కాబట్టి, ఇందులో పొందుపరిచే నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేసినవారి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాసుకుంటే మంచిది. ⇔ సంఘ సభ్యులుగా ఎన్నికయ్యేవారు తోటి సభ్యులతో కలసిమెలసి పనిచేయాలి. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లకూడదు. రాగద్వేషాలకూ తావివ్వకూడదు. నివాసితులందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి. సంఘంలోని కొందరికే మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు. ⇔ నివాసితుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ఎన్నుకోవాలి. ఆయా అభ్యర్థుల ప్రత్యేకతలు, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, సంఘం మేలు కోసం సమయాన్ని వెచ్చించగలరా? అందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోగలరా? లేక వ్యక్తిగత లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుంటారా? ఇలా పలు అంశాల్ని గమనించాకే నిర్ణయం తీసుకోవాలి. ⇔ కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు వ్యక్తులు ‘తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్లుగా వ్యవహరిస్తారు. వాళ్లే కరెక్ట్.. ఇతరులు చెప్పేది తప్పని భావిస్తుంటారు. వాళ్లకు నచ్చిన అంశాన్ని ఇతరులు మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తుం టారు. కాబట్టి ఇలాంటి వారు చెప్పే అంశాన్ని లోతుగా పరి శీలించాకే నివాసితులు అంతి మ నిర్ణయానికి రావాలి.