విడాకుల రూమర్లు: హాట్‌ టాపిక్‌గా ఐష్‌​‍-అభిషేక్‌ బచ్చన్‌ లగ్జరీ విల్లా | Abhishek Bachchan And Aishwarya Rai Rs 16 Crore Dubai Villa Which Has Access To A Golf Course | Sakshi
Sakshi News home page

విడాకుల రూమర్లు: హాట్‌ టాపిక్‌గా ఐష్‌​‍-అభిషేక్‌ బచ్చన్‌ లగ్జరీ విల్లా

Published Tue, Nov 26 2024 12:57 PM | Last Updated on Tue, Nov 26 2024 3:29 PM

Abhishek Bachchan And Aishwarya Rai Rs 16 Crore Dubai Villa Which Has Access To A Golf Course

బాలీవుడ్‌లో అందమైన జంట అనగానే  మొదటగా గుర్తొచ్చే పేర్లు  అందాలతార స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్, హీరో అభిషేక్ బచ్చన్.  ఆర్థికంగా కూడా చాలా బలమైన జంట వీరిది  అనడంలో  ఎలాంటి సందేహం లేదు.  అయితే ఐష్‌, ఇంకా అభిషేక్‌  విడిపోతున్నారనే పుకార్ల మధ్య ఖరీదైన వారి దుబాయ్‌ విల్లా  నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తోంది.

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోయిన్‌ లిస్ట్‌లో టాప్‌లో ఉండే ఐశ్వర్య.. కెరియర్‌ పీక్‌లో ఉండగానే  2007లో బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ను వివాహమాడింది. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. విలాసవంతమైన  కార్లు, బంగ్లాలు, వ్యాపారాలతో ఐశ్వర్యరాయ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ దేశంలో అత్యంత ధనిక జంట అని చెప్పవచ్చు. సీఎన్‌బీసీ  నివేదిక ప్రకారం, ఐశ్వర్య నికర విలువ రూ. 776 కోట్లుగా ఉండగా, అభిషేక్ బచ్చన్ రూ. 280 కోట్లు .  2015లో కొనుగోలు దుబాయ్‌విల్లా  ఇపుడు హాట్‌ టాపిక్‌. 

దుబాయ్‌ విల్లా
దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన ‍ ప్రాంతంలో, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లోని ఈ బంగ్లా  సుమారు 16  కోట్ల రూపాయల విలువ చేస్తుంది  ఈ లగ్జరీ బంగ్లా. అత్యాధునిక సౌకర్యాలతో  శాంక్చురీ ఫాల్స్‌లో ఒక అందమైన విశాలమైన విల్లాను వీరు కొనుగోలు చేశారు. స్విమ్మింగ్ పూల్, ఆధునిక వంటగది, ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్, హోమ్ థియేటర్‌, విశాలమైన వాకింగ్ ట్రాక్  లాంటివి  ఉన్నాయి.  వీటితో  పాటు భారతదేశంలో  5 విలాస వంతమైన బంగ్లాలు,  ముంబైలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లలో అనేక ఖరీదైన అపార్ట్‌మెంట్లు  కూడా ఉన్నాయని తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement