Adipurush Star Hero Prabhas Owns a Villa in Italy, Earns Rs 40 Lakh in Rent - Sakshi
Sakshi News home page

ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?

Published Sat, Jun 24 2023 2:06 PM | Last Updated on Sat, Jun 24 2023 2:35 PM

Adipurush Star Hero owns a villa in Italy earns Rs 40 lakh in rent - Sakshi

ఆదిపురుష్‌ సినిమాతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌​ ప్రభాస్‌  గురించి క్రేజీ అప్‌డేట్‌ ఒకటి హల్‌ చల్‌ చేస్తోంది. సూపర్‌స్టార్‌కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా  నెలకు రూ.40 లక్షల అద్దెను  ఆర్జిస్తున్నాడు అనే  టాక్‌ జోరుగా  నడుస్తోంది.  అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్‌: ఈ రికార్డ్‌ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?)

దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్‌గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్‌ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు.  డ్రెస్సింగ్‌ విషయంలో  కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్‌ ప్రభాస్‌కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్‌ తదితర లగ్జరీ కార్లు  కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్‌)

ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్‌, టాలీవుడ్‌ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్  సినిమాలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. ప్యాన్‌ ఇండియా  హీరోగా పాపులర్‌  అయిపోయాడు. దీంతో  ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ కూడా అదే రేంజ్‌లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే  లేటెస్ట్‌ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్‌.  (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్‌: మరి ఇపుడు)

కాగా  నెక్ట్స్  పాన్ ఇండియా  మూవీ సలార్  బిజినెస్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది  సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్  ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్  తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement