Virender Sehwag Tweet On Adipurush Movie Goes Viral Social Media - Sakshi
Sakshi News home page

Adipurush: వీరేంద్ర సెహ్వాగ్‌పై ఫైర్‌ అవుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌

Jun 25 2023 1:17 PM | Updated on Jun 25 2023 2:45 PM

Virender Sehwag Tweet On Adipurush movie Goes Viral Social Media - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - కృతిసనన్‌ జంటగా ఓం రౌత్‌  తెరకెక్కించిన 'ఆదిపురుష్‌' విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించినప్పటికీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.  

(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్‌ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా)

ఇప్పటికే చాలామంది ప్రముఖులు సినిమాపై విమర్శలతో విరుచకపడ్డారు. రావణుడితో హనుమంతుడి సంభాషణలపై కూడా తీవ్ర దుమారం రేగడంతో మేకర్స్‌ వాటిని మార్చిన విషయం తెలిసిందే.  తాజాగా భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఈ సినిమాపై కామెంట్‌ చేశాడు.  ఆదిపురుష్‌ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైందంటూ ఒక స్మైల్‌ ఎమోజీని చేర్చి ట్వీట్‌ చేశాడు.

దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సెహ్వాగ్‌పై ఫైర్‌ అవుతున్నారు. క్రికెట్‌ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై దృష్టి పెడుతున్నారా..? న్యాయాన్ని ప్రజలు ఎందకు ద్వేషిస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ సెహ్వాగ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాను ఇంకా బెటర్‌గా తీయాల్సిందంటూ ఆయనకు మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో వీరు చేసిన పోస్ట్‌కు సమాధానంగా వచ్చే కామెంట్స్‌ కూడా వైరల్‌ అవతున్నాయి.

(ఇదీ చదవండి: Urvashi Rautela: అందులో ఫోటోలు ఉన్నాయి.. దొరికితే ఇవ్వండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement