Virender Sehwag Tweet
-
ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కృతిసనన్ జంటగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించినప్పటికీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా) ఇప్పటికే చాలామంది ప్రముఖులు సినిమాపై విమర్శలతో విరుచకపడ్డారు. రావణుడితో హనుమంతుడి సంభాషణలపై కూడా తీవ్ర దుమారం రేగడంతో మేకర్స్ వాటిని మార్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశాడు. ఆదిపురుష్ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైందంటూ ఒక స్మైల్ ఎమోజీని చేర్చి ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సెహ్వాగ్‌పై ఫైర్ అవుతున్నారు. క్రికెట్ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై దృష్టి పెడుతున్నారా..? న్యాయాన్ని ప్రజలు ఎందకు ద్వేషిస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ సెహ్వాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాను ఇంకా బెటర్‌గా తీయాల్సిందంటూ ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో వీరు చేసిన పోస్ట్‌కు సమాధానంగా వచ్చే కామెంట్స్ కూడా వైరల్ అవతున్నాయి. Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀 — Virender Sehwag (@virendersehwag) June 25, 2023 (ఇదీ చదవండి: Urvashi Rautela: అందులో ఫోటోలు ఉన్నాయి.. దొరికితే ఇవ్వండి) -
IPL 2022: వడ పావ్ ట్వీట్.. సెహ్వాగ్‌పై ఫైరవుతున్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై, కేకేఆర్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 6) జరిగిన హైఓల్టేజీ పోరులో పాట్ కమిన్స్ (15 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్ల) విధ్వంసం ధాటికి కేకేఆర్ మరో 24 బంతులుండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కమిన్స్ సునామీ ఇన్నింగ్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘నోటికాడి వడా పావ్ లాగేసుకున్నాడు’ అంటూ కమిన్స్ 14 బంతుల అర్ధశతకాన్ని ఉద్దేశిస్తూ.. ప్రత్యర్ధి కెప్టెన్ రోహిత్ శర్మకు చురక తగిలేలా ట్వీట్ చేశాడు. Moonh se nivala cheen liya ,, sorry vada pav cheen liya. Pat Cummins, one of the most insane display of clean hitting , 15 ball 56 … Jeera Batti #MIvKKR pic.twitter.com/Npi2TybgP9 — Virender Sehwag (@virendersehwag) April 6, 2022 సెహ్వాగ్ సరదాగా చేసిన ఈ ట్వీట్ హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. తమ అభిమాన క్రికెటర్‌ను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ వ్యంగ్యమైన ట్వీట్ చేయడాన్ని హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కమిన్స్ పూనకం వచ్చిన వాడిలా ఉగిపోతే రోహిత్ మాత్రం ఏం చేయగలడని వీరూకు కౌంటరిస్తున్నారు. అంతటితో ఆగకుండా రోహిత్ శర్మను పరోక్షంగా వడా పావ్‌తో పోల్చినందుకు గానూ సెహ్వాగ్‌పై ఎదురుదాడికి దిగారు. కొన్ని మ్యాచ్‌ల్లో ఫెయిల్యూర్స్‌కు గాను ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్‌ను అంతలా అవమానించాలా అంటూ సెహ్వాగ్‌పై ట్రోలింగ్‌కు దిగారు. కాగా, ముంబైతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ నిజంగానే మ్యాచ్‌ను ముంబై చేతిలో నుంచి లాగేసుకుంది. 162 పరుగుల లక్ష్య ఛేదనలో 13 ఓవర్లలో 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కేకేఆర్‌ను కమిన్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. కేవలం 19 నిమిషాల పాటు సాగిన ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీల పూర్తి చేసి ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును కేఎల్ రాహుల్‌తో కలిసి సంయుక్తంగా పంచుకున్నాడు. డేనియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన కమిన్స్ ఏకంగా 35 పరుగులు పిండుకుని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు కాలరాత్రి అనుభవాన్ని మిగిల్చాడు. ఈ ఓవర్‌కు ముందు 2 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన సామ్స్.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఎక్స్పెన్సివ్ ఓవర్‌ను వేశాడు. 2011లో ఆర్సీబీతో మ్యాచ్‌లో పరమేశ్వరన్ ఒకే ఓవర్లో 37 పరుగులు, గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఒకే ఓవర్లో 37 పరుగులు సమర్పించుకోగా తాజాగా సామ్స్ వీరి తర్వాత ఐపీఎల్ అత్యంత చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేశాడు. చదవండి: చిరాకులో ఉన్న రోహిత్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఢిల్లీ ఆటగాళ్లు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సెహ్వాగ్ జీవితంలో మార్చి 29 ఎంతో ప్రత్యేకం.. యాదృచ్చికంగా అతని కారు నంబర్ కూడా..!
టీమిండియా మాజీ ఓపెనర్, నజఫ్ఘడ్ నవాబ్, ముల్తాన్ కా సుల్తాన్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు పదేళ్లైనా, నేటికి అతను నెలకొల్పిన కొన్ని రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇందులో అతను టెస్ట్‌ల్లో సాధించిన డబుల్ ట్రిపుల్ హండ్రెడ్ల రికార్డు ఒకటి. భారత క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ సాధించలేకపోయారు. ఓవరాల్‌గా చూసినా ఈ రికార్డును డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ మాత్రమే సాధించగలిగారు. Date mein kya rakha hai? March 29th, a very significant date in my cricketing life. Got to the first triple hundred against Pakistan in Multan on this date and got out on 319 against South Africa on this very date. Coincidentally, without plan have a car which is numbered 2903. pic.twitter.com/tJ1rf3GPbw — Virender Sehwag (@virendersehwag) March 29, 2022 అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. సెహ్వాగ్ సాధించిన రెండు ట్రిపుల్ హండ్రెడ్‌లు ఒకే తేదీన సాధించడం. 2004 మార్చి 29న పాకిస్థాన్‌పై ముల్తాన్ టెస్ట్‌లో తొలి ట్రిపుల్‌ను (309) బాదిన వీరూ.. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత ఇదే తారీఖున (2008 మార్చి 29) చెన్నైలో దక్షిణాఫ్రికాపై రెండో ట్రిపుల్‌ను (319) సాధించాడు. దీంతో సెహ్వాగ్ క్రికెట్ కెరీర్లో ఈ తేదీ చాలా ప్రత్యేకంగా, సెంటిమెంటల్‌గా, లక్కీగా నిలిచింది. యాధృచ్చికంగా సెహ్వాగ్ కారు నంబర్ (2903) కూడా ఇదే తేదీతో ముడిపడి ఉండటం మరో విశేషం. తాజాగా (మార్చి 29, 2022) సెహ్వాగ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. తేదీలో ఏముంది..? మార్చి 29.. నా క్రికెట్ కెరీర్లో చాలా ప్రత్యేకమైన రోజు. ముల్తాన్ టెస్ట్‌లో (పాక్‌పై) ఇదే రోజున తొలి ట్రిపుల్ సెంచరీ కొట్టాను. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇదే తారీఖున దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్ సాధించాను. యాదృచ్చికంగా నా కార్ నెంబర్ (2903) కూడా ఇదే కావడం నిజంగా నమ్మలేకపోతున్నానంటూ వీరూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది. చదవండి: IPL 2022: అతడు వన్డే ప్లేయర్ మాత్రమే! అద్భుతాలు చేయనక్కర్లేదు.. కానీ.. -
‘అతడు ఎప్పటికీ ప్రమాదకర బౌలరే’
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సెలబ్రిటీలలో టీమిండియా మాజీ క్రికెటర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. తన దైన శైలిలో భిన్నంగా స్పందిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేసే ఈ డాషింగ్ ఓపెనర్.. దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ పుట్టిన రోజు సందర్భంగా చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకోంటుంది. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్ డేల్ స్టెయిన్, అతడు బౌలింగ్ చేస్తుంటే మైదానంలో పచ్చిక కూడా పచ్చగా వెలిగిపోద్ది. జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్’ అంటూ ట్వీట్ చేశారు. సెహ్వాగ్ లాంటి భీకర బ్యాట్స్‌మన్ స్టెయిన్‌ను అంతలా పొగడ్తలతో ముంచెత్తడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా స్టెయిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్, నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు. స్టెయిన్ కూడా ఈ క్రికెటర్ల ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. ‘నాకు మీ నుంచి విషస్ రావడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ స్టెయిన్ బదులిచ్చారు. స్టెయిన్‌కు సహచర క్రికెటర్లతో పాటు ఐసీసీ కూడా బర్త్ డే విషస్ చెప్పింది. Whenever you think of the most dangerous bowlers in the world @DaleSteyn62 ka sthan sada rahega. Whenever Steyn bowled, the grass always seemed greener than what it was. Happy Birthday Steyn Gun ! pic.twitter.com/twZeuoFNBq — Virender Sehwag (@virendersehwag) June 27, 2018 A very happy birthday to you @DaleSteyn62. Wish you good health and happiness. pic.twitter.com/DOE2v3ZGiw — Sachin Tendulkar (@sachin_rt) June 27, 2018 -
వైరల్ : లుంగీ1, ప్యాంట్0
సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై పంచ్‌లతో విరుచుకుపడుతూ.. మిత్రులను సరదాగా ఆటపట్టిస్తూ.. ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో మరోసారి తన చతురతను చాటుకున్నాడు. తాజాగా లుంగీ 1, ప్యాంట్ 0 అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్లో భాగంగా నిన్న(సోమవారం) చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ని ఉద్దేశించి సెహ్వాగ్ ఇలా సరదాగా స్పందించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చివరివరకు పోరాడి ఓడింది. అయితే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎన్గిడి చివరి ఓవర్లలో పొదుపైన బౌలింగ్ ద్వారా చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. రిషబ్ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో ఎన్గిడి బౌలింగ్‌లో ఔటవ్వడం ఢిల్లీని దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్‌ని ఎన్గిడి, పంత్‌ల మధ్య పోరుగా అభివర్ణిస్తూ.. సెహ్వాగ్ లుంగీ 1, ప్యాంటు(పంత్) 0 గా ట్వీట్ చేశారు. పంత్ గొప్పగా పోరాడాడని కొనియాడారు. సెహ్వాగ్ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు అదే తరహలో స్పందిస్తున్నారు. Lungi 1, Pant 0. But well played Pant !#CSKvDD — Virender Sehwag (@virendersehwag) April 30, 2018 సెహ్వాగ్ ట్వీట్‌పై అభిమానుల స్పందన pic.twitter.com/C6zp35wdjs — Priya Prakash Varrier (@PriyaPVarrierFA) April 30, 2018 #CSKvDD #WhistlePodu #DilDilli pic.twitter.com/bF5bBAvw0q — 🇮🇳 Anuradha 🇮🇳 (@AnuRadha9082) April 30, 2018 -
భేష్.. సెహ్వాగ్ ట్వీట్!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రియోలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సాక్షి మాలిక్ ను ప్రశంసిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన ట్వీట్ అందరి మన్ననలు అందుకుంది. ఆడపిల్లల పట్ల వివక్ష వద్దన్న సందేశంతో వీరూ ట్వీట్ పెట్టాడు. 'ఆడ పిల్లలను పురిట్లోనే చంపకుండా ఉంటే ఏం జరుగుతుందో సాక్షి మాలిక్ గుర్తు చేసింది. క్రీడల్లో మనదేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మన బాలికలు వెళ్లి, మనదేశ గౌరవం కాపాడార'ని సెహ్వాగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రియోలో పతకం సాధించడంతో సాక్షి మాలిక్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోందని అన్నాడు. బాలికలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఎవరు మాట్లాడకపోవడం శోచనీయమని పేర్కొన్నాడు. సెహ్వాగ్ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. సాక్షి మాలిక్ సొంత రాష్ట్రమైన హర్యానాలో భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హర్యానాలో బాలబాలికల నిష్పత్తి ఆందోళనకర స్థాయిలో ఉంది. అక్కడ ప్రతి 1000 మంది బాలురకు 873 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని సెహ్వాగ్ విజ్ఞప్తి చేశాడు. #SakshiMalik is a reminder of what cn happn if u don't kill a girl child.When d going gets tough,its our girls who get going &save our pride — Virender Sehwag (@virendersehwag) 18 August 2016