వైరల్‌ : లుంగీ1, ప్యాంట్‌0 | Sehwag Funny Tweet On CSK Win Over DD | Sakshi
Sakshi News home page

వైరల్‌ : లుంగీ1, ప్యాంట్‌0

Published Tue, May 1 2018 2:28 PM | Last Updated on Tue, May 1 2018 2:30 PM

Sehwag Funny Tweet On CSK Win Over DD - Sakshi

సోషల్‌ మీడియాలో ప్రత్యర్థులపై పంచ్‌లతో విరుచుకుపడుతూ.. మిత్రులను సరదాగా ఆటపట్టిస్తూ.. ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్‌లో మరోసారి తన చతురతను చాటుకున్నాడు. తాజాగా లుంగీ 1, ప్యాంట్‌ 0 అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో భాగంగా నిన్న(సోమవారం) చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ని ఉద్దేశించి సెహ్వాగ్‌ ఇలా సరదాగా స్పందించారు.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చివరివరకు పోరాడి ఓడింది. అయితే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎన్‌గిడి చివరి ఓవర్లలో పొదుపైన బౌలింగ్‌ ద్వారా చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ తరఫున రిషబ్‌ పంత్‌ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. రిషబ్‌ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో ఎన్‌గిడి బౌలింగ్‌లో ఔటవ్వడం ఢిల్లీని దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్‌ని ఎన్‌గిడి, పంత్‌ల మధ్య పోరుగా అభివర్ణిస్తూ.. సెహ్వాగ్‌ లుంగీ 1, ప్యాంటు(పంత్‌) 0 గా ట్వీట్‌ చేశారు. పంత్‌ గొప్పగా పోరాడాడని కొనియాడారు. సెహ్వాగ్‌ ట్వీట్‌పై క్రికెట్‌ అభిమానులు అదే తరహలో స్పందిస్తున్నారు.

సెహ్వాగ్‌ ట్వీట్‌పై అభిమానుల స్పందన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement