ఐపీఎల్‌–11 అవార్డులు, విశేషాలు | IPL 2018 Complete List of Awards | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 8:46 AM | Last Updated on Mon, May 28 2018 9:04 AM

IPL 2018 Complete List of Awards - Sakshi

స్టయిలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డు అందుకుంటున్న రిషభ్‌ పంత్‌

  • ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌–రూ.10 లక్షలు) విలియమ్సన్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌–735 పరుగులు)
  • పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌–రూ. 10 లక్షలు) ఆండ్రూ టై (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌–24 వికెట్లు)
  • పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ (రూ. 10 లక్షలు): ట్రెంట్‌ బౌల్ట్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌)
  • ఎమర్జింగ్‌ ప్లేయర్‌ (రూ. 10 లక్షలు): రిషభ్‌ పంత్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌–684 పరుగులు)
  • మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (రూ. 10 లక్షలు): సునీల్‌ నరైన్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
  • సూపర్‌ స్ట్రయికర్‌: సునీల్‌ నరైన్‌ (నెక్సా కారు–కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
  • స్టయిలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ (రూ. 10 లక్షలు): రిషభ్‌ పంత్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌)
  • నయీ సోచ్‌ సీజన్‌ అవార్డు: చెన్నై కెప్టెన్‌ ధోని (రూ. 10 లక్షలు)
  • ఫెయిర్‌ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్‌  
  • ఉత్తమ మైదానం: ఈడెన్‌ గార్డెన్స్, కోల్‌కతా (రూ. 50 లక్షలు)
  • రన్నరప్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రూ. 12 కోట్ల 50 లక్షలు)
  • విన్నర్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రూ. 20 కోట్లు)

    ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న విలియమ్సన్‌

విశేషాలు...

  • 735  విలియమ్సన్‌ చేసిన పరుగులు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో 700కు పైగా పరుగులు చేసిన ఐదో ఆటగాడు. గతంలో కోహ్లి (973–2016లో), వార్నర్‌ (848–2016లో), క్రిస్‌ గేల్‌ (733–2012లో), మైక్‌ హస్సీ(733-2013) ఈ ఘనత సాధించారు.  
  • 40తో ఈ సీజన్‌లో చెన్నై, రైజర్స్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచింది. ఐపీఎల్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
  • 4 రాయుడు, హర్భజన్‌ ఐపీఎల్‌ టైటిల్స్‌ సంఖ్య. 3 ముంబై తరఫున సాధించగా ఇది నాలుగోది. రోహిత్‌ శర్మ (4) కూడా నాలుగు టైటిల్స్‌ గెలిచాడు.  
  • 3 కరణ్‌ శర్మ వరుసగా మూడేళ్లు మూడు వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్‌ విజయాల్లో భాగమయ్యాడు. సన్‌రైజర్స్‌ (2016), ముంబై (2017), చెన్నై (2018).
  • 150 కెప్టెన్‌గా టి20ల్లో ధోనికి ఇది 150వ విజయం. మరే కెప్టెన్‌ కూడా 100 మ్యాచ్‌లు గెలిపించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement