IPL final
-
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్‌కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
IPL 2024: కేకేఆర్‌దే 'కిరీటం' (ఫొటోలు)
-
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్
IPL 2024 SRH vs KKR Final Live Updates: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్‌ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.కుప్పకూలిన ఎస్ఆర్హెచ్..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు.అయ్యర్, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..గుర్బాజ్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గుర్భాజ్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి ఇంకా 8 పరుగులు కావాలి.విజయం దిశగా కేకేఆర్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి కేకేఆర్ 72 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(21), వెంకటేశ్ అయ్యర్(40) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్..114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.113 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. కేకేఆర్ బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ పేసర్లు మిచెల్ స్టార్క్, ఆరోరా ఆరంభంలోనే ఎస్ఆర్హెచ్ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్ మూడు వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(24) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(20), క్లాసెన్(16) పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇదే లోయెస్ట్ టార్గెట్ కావడం గమనార్హం.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో ఉనద్కట్ వచ్చాడు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 98/8పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 77 పరుగులకే 7 వికెట్లుఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 77 పరుగులకే సన్‌రైజర్స్ 7 వికెట్లు కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్ ఔట్ కాగా.. రస్సెల్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమద్ సైతం ఔటయ్యాడు. క్రీజులో క్లాసెన్(13), కమ్మిన్స్ 4 పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 82/7పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 62 పరుగులకే 5 వికెట్లు62 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మార్క్రమ్.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షాబాజ్ అహ్మద్ వచ్చాడు.నాలుగో వికెట్ డౌన్నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నితీష్ కుమార్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 21 పరుగులకే 3 వికెట్లుటాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. 21 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.హెడ్ ఔట్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డక్‌గా వెనదిరిగాడు. వైబవ్ ఆరోరా బౌలింగ్‌లో హెడ్.. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్లు నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్కు బిగ్ షాక్.. అభిషేక్ ఔట్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్‌ను ఎస్ఆర్హెచ్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పు చేసింది. తుది జట్టులోకి సమద్ స్ధానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిసన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్.. ఫైనల్‌కు పోరు అర్హత సాధించింది.ఈ క్రమంలో కేకేఆర్ మూడో టైటిల్‌పై కన్నుయేగా.. ఎస్ఆర్హెచ్ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో పలు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆఖరి 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది.ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.ఫైనల్‌కు రిజర్వ్ డే..ఇక బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడనైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న కేకేఆర్‌ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది. -
ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..
ఐపీఎల్-2024లో తుది పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శనివారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్హెచ్ ఫైనల్ పోరులో కేకేఆర్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.కాగా శుక్రవారం చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించి.. ఫైనల్ పోరకు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే? -
IPL 2024: సూపర్ సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అసలు సత్తాను మరోసారి ప్రదర్శించింది. తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన జట్టు రెండో క్వాలిఫయర్‌కు వచ్చేసరికి అన్ని అ్రస్తాలతో చెలరేగింది. ఫలితంగా ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాటింగ్‌లో హెడ్, అభిõÙక్, మార్క్రమ్ విఫలమైనా... క్లాసెన్, త్రిపాఠి ఆదుకోవడంతో హైదరాబాద్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగి ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. బెంగళూరుతో ఎలిమినేటర్‌లో కూడా దాదాపు ఇదే స్కోరును తడబడుతూనే ఛేదించిన రాజస్తాన్ ఈసారి మాత్రం కుప్పకూలింది. చెపాక్ మైదానంలో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు షహబాజ్, అభిõÙక్ శర్మ కలిసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి రాయల్స్ కథను ముగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయమూ వచి్చంది. రెండో టైటిల్ వేటలో ఆదివారం కోల్‌కతాతో సమరానికి సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది. చెన్నై: ఐపీఎల్–17 ఫైనల్ సమరం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50; 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మినహా అంతా విఫలమయ్యారు. రాణించిన త్రిపాఠి... ఓపెనర్ అభిషేక్ (12) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా... హెడ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. అయితే త్రిపాఠి దూకుడైన ఇన్నింగ్స్‌తో స్కోరును పరుగెత్తించాడు. అశి్వన్ ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదిన అతను, బౌల్ట్ ఓవర్లోనూ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి అదే జోరులో తర్వాతి బంతికి అవుటయ్యాడు. అదే ఓవర్లో మార్క్రమ్ (1) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో రాయ ల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హెడ్, క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా 29 బంతుల పాటు బౌండరీనే రాకపోగా, హెడ్ కూడా అవుటయ్యాడు. చహల్ వరుస బంతుల్లో నితీశ్ రెడ్డి (5), సమద్ (0)లను అవుట్ చేసి మరింత దెబ్బ తీశాడు. మరోవైపు 33 బంతుల్లో క్లాసెన్ అర్ధసెంచరీ పూర్తయింది. 18 ఓవర్లు ముగిశాక స్కోరు 163/6 కాగా క్లాసెన్ ఉండటంతో రైజర్స్ మరిన్ని పరుగులు ఆశించింది. అయితే 19వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌల్డ్ కావడంతో ఆఖరి 11 బంతుల్లో 12 పరుగులే వచ్చాయి. టపటపా... ఛేదనలో రాయల్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. టామ్ కోలర్ (10) ప్రభావం చూపలేకపోగా, 5 ఓవర్లలో 32 పరుగులే వచ్చాయి. అయితే భువనేశ్వర్ వేసిన ఆరో ఓవర్లో యశస్వి జైస్వాల్ సిక్స్, 3 ఫోర్లతో చెలరేగడంతో రాజస్తాన్ దారిలో పడినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ముందుకొచ్చి షాట్లు ఆడే క్రమంలో యశస్వి, సామ్సన్ (10), పరాగ్ (6) వెనుదిరిగారు. అశి్వన్ (0) డకౌట్ కాగా, ఆశలు పెట్టుకున్న హెట్‌మైర్ (4) కూడా చేతులెత్తేశాడు. 39 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన స్థితిలో విండీస్ బ్యాటర్ల నుంచి రాజస్తాన్ అద్భుతం ఆశించింది. కానీ హెట్‌మైర్ (4), పావెల్ (6) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. మరోవైపు జురేల్ పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు.స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) అశి్వన్ (బి) సందీప్ శర్మ 34; అభిõÙక్ శర్మ (సి) కోలర్ (బి) బౌల్ట్ 12; త్రిపాఠి (సి) చహల్ (బి) బౌల్ట్ 37; మార్క్రమ్ (సి) చహల్ (బి) బౌల్ట్ 1; క్లాసెన్ (బి) సందీప్ 50; నితీశ్ రెడ్డి (సి) చహల్ (బి) అవేశ్ 5; సమద్ (బి) అవేశ్ 0; షహబాజ్ (సి) జురేల్ (బి) అవేశ్ 18; కమిన్స్ (నాటౌట్) 5; ఉనాద్కట్ (రనౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–57, 4–99, 5–120, 6–120, 7–163, 8–170, 9–175. బౌలింగ్: బౌల్ట్ 4–0–45–3, అశి్వన్ 4–0–43–0, సందీప్ 4–0–25–2, అవేశ్ 4–0–27–3, చహల్ 4–0–34–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సమద్ (బి) షహబాజ్ 42; టామ్ కోలర్ (సి) త్రిపాఠి (బి) కమిన్స్ 10; సామ్సన్ (సి) మార్క్రమ్ (బి) అభిõÙక్ 10; పరాగ్ (సి) అభిషేక్ (బి) షహబాజ్ 6; జురేల్ (నాటౌట్) 56; అశ్విన్ (సి) క్లాసెన్ (బి) షహబాజ్ 0; హెట్‌మైర్ (బి) అభిషేక్ 4; పావెల్ (సి) అభిõÙక్ (బి) నటరాజన్ 6; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–65, 3–67, 4–79, 5–79, 6–92, 7–124. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–33–0, కమిన్స్ 4–0–30–1, నటరాజన్ 3–0–13–1, ఉనాద్కట్ 1–0–5–0, షహబాజ్ 4–0–23–3, అభిషేక్ 4–0–24–2, మార్క్రమ్ 1–0–10–0.2: డెక్కన్ చార్జర్స్ జట్టు తర్వాత ఐపీఎల్ టోరీ్నలో గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడున నిలిచి తర్వాతి సీజన్లో ఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 2023 లో సన్‌రైజర్స్ చివరి స్థానంలో నిలిచింది. 2008 తొలి సీజన్లో డెక్కన్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి 2009లో అగ్రస్థానంలో నిలవడంతోపాటు విజేతగా కూడా అవతరించింది.3: ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 2016లో తొలిసారి విజేత అయింది. 2018లో రన్నరప్‌గా నిలిచింది. -
RR Vs SRH: రాజస్తాన్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. తిప్పేసిన షాబాజ్..అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్‌ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. -
ఆనందంలో సీఎస్కే ఆల్‌రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్
IPL 2023 Winner CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ అజయ్ మండల్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘సర్ జడేజా’, సీఎస్కేకు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు కారణమేమిటంటే.. ఐపీఎల్-2023 ఫైనల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య మే 29 నాటి రిజర్వ్‌డే మ్యాచ్‌లోనూ వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. జడ్డూ మ్యాజిక్ ఈ క్రమంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో 214 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, సీఎస్కే లక్ష్య ఛేదనకు దిగిన కాసేపటికే వర్షం మొదలుకావడం.. ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో అర్ధరాత్రి వరకు వేచి చూశారు. వరణుడు కరుణించడంతో సుమారు 12.05 గంటల ప్రాంతంలో మళ్లీ మ్యాచ్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో చెన్నై బ్యాటర్లు తలా ఓ చేయి వేయగా.. ఆఖరి రెండు బంతుల్లో విజయానికి 10 పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. విన్నింగ్ షాట్ ఆడిన బ్యాట్ లభిస్తే తొలి బాల్‌కు సిక్సర్ బాదిన జడ్డూ.. మలి బంతిని బౌండరీకి తరలించి చెన్నైకి చిరస్మరణీయ విజయం అందించాడు. సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరి.. జడ్డూ విన్నింగ్ షాట్ ఆడిన బ్యాట్ బహుమతిగా లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే కదా! చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించిన జడ్డూ.. ఆ బ్యాట్‌ను అజయ్ మండల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో అజయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు అతడు. సీఎస్కేకు థాంక్స్ ‘‘సర్ రవీంద్ర జడేజా.. ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన వేళ సర్ జడేజా చేసిన అద్భుతం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఇన్నింగ్స్ తర్వాత జడేజా ఆ బ్యాట్‌ను నాకు ఆశీర్వాదంగా అందించాడు. జడ్డూ భాయ్‌తో డ్రెసింగ్ రూం షేర్ చేసుకునే అవకాశమిచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ధన్యవాదాలు’’ అంటూ అజయ్ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ఛత్తీస్‌గఢ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల అజయ్ జాదవ్ మండల్‌ను.. సీఎస్కే ఐపీఎల్-2023 మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఈ లెఫ్టాండర్ ఆల్‌రౌండర్ కోసం రూ. 20 లక్షలు వెచ్చించింది. అయితే, అజయ్‌కు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. టైటిల్ విజేత అయిన జట్టులో భాగమవడంతో పాటు జడేజా అందించిన బ్యాట్ రూపంలో మంచి బహుమతి మాత్రం లభించింది. చదవండి: #MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే.. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు
IPL 2023- MS Dhoni- Tushar Deshpande: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు ముంబై బౌలర్ తుషార్ దేశ్‌పాండే. పదహారో ఎడిషన్ సందర్భంగా తొలిసారి ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకుని పరోక్షంగా చెన్నై ఓటమికి కారణమయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తుషార్‌కు వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే, కొన్ని మ్యాచ్‌లలో సీఎస్కే విజయానికి దోహదం చేసినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో మరోసారి చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు ఈ రైట్ ఆర్మ్ పేసర్. తుషార్ దేశ్‌పాండే (PC: IPL) ఫైనల్ మ్యాచ్‌లోనూ చెత్తగా తన 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. కీలక మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేసి జట్టుకు భారం అనిపించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో బ్యాటర్ల మెరుపుల కారణంగా చెన్నై ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించడంతో తుషార్‌ను పెద్దగా పట్టించుకోలేదు ఫ్యాన్స్. అదే ఏ కాస్త తేడా జరిగినా.. అతడిని ఏకిపారేసేవారే! అదృష్టవశాత్తూ బతికిపోయాడు తుషార్. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటాడన్న అపఖ్యాతి మూటగట్టుకున్న అతడు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లలో తుషార్ మొత్తంగా 564 పరుగులు ఇచ్చి 9.92 ఎకానమీతో 21 వికెట్లు తీశాడు. ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా ఇన్ని మైనస్‌లు ఉన్నా ధోని అతడిని వెనకేసుకురావడం వల్లే తుషార్ దాదాపు ప్రతి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఈ నేపథ్యంలో ధోనిని ఉద్దేశించి తుషార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘మన రాత బాగోలేనపుడు మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి ఉంటే ఎంతో బాగుంటుంది. ధోని భయ్యా నాకు అన్నివేళలా అండగా నిలబడ్డాడు. వైఫల్యాలు ఎదురైనపుడు ధైర్యం చెప్పాడు. ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా. ఆయన చెప్పిన మార్గంలో నడిచాను. ఆయన నన్నెపుడూ సరైన మార్గంలోనే నడిపిస్తారని నాకు తెలుసు’’ అంటూ 28 ఏళ్ల తుషార్ దేశ్‌పాండే భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
మహీ అన్న.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే: జడేజా ట్వీట్ వైరల్
#MS Dhoni- Ravnidra Jadeja: ఐపీఎల్-2023 ఫైనల్.. అసలే వర్షం.. అప్పటికే ఓరోజు వాయిదా పడ్డ మ్యాచ్.. కనీసం రిజర్వ్ డే అయినా వరుణుడు కరుణిస్తాడా లేదా అన్న సందేహాలు.. పర్లేదు వాతావరణం బాగానే ఉంది.. ఆట మొదలైంది.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. సాయి అద్బుత ఇన్నింగ్స్ సాయి సుదర్శన్ తుపాన్ ఇన్నింగ్స్(47 బంతుల్లో 96 పరుగులు) కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు స్కోరు బోర్డుపై ఉంచగలిగింది. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం ఏమవుతుందోనన్న ఆందోళన నడుమ అర్ధరాత్రి మ్యాచ్ మళ్లీ మొదలైంది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఈ నేపథ్యంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై గెలుపొందాలంటే 171 పరుగులు సాధించాలి. కాన్వే అదరగొట్టాడు సీజన్ ఆసాంతం అదరగొట్టిన సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(16 బంతుల్లో 26 పరుగులు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డెవాన్ కాన్వే (25 బంతుల్లో 47 పరుగులు) శుభారంభమే అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అజింక్య రహానే 13 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. ఆతర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 8 బంతుల్లో 19 రన్స్ తీశాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ధోని గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. రవీంద్ర జడేజా మరోసారి మ్యాజిక్ చేశాడు. జడ్డూ విన్నింగ్ షాట్.. ఐదోసారి చాంపియన్‌గా చెన్నై చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మోహిత్ శర్మ మొదటి నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేశాడు. వరుసగా 0, 1,1,1.. మొత్తంగా మూడు పరుగులే వచ్చాయి. సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జడేజా ఉన్నాడు. నరాలు తెగే ఉత్కంఠ.. పదిహేనో ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి ఫోర్ బాదాడు. విన్నింగ్ షాట్‌తో చెన్నైని ఫైవ్‌స్టార్ చేశాడు. అంతే.. సూపర్ కింగ్స్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. సారథి ధోని అయితే ఏకంగా జడ్డూను ఎత్తుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏంటీ విభేదాలా? మహీ అన్న కోసం ఏమైనా చేస్తా! కీలక మ్యాచ్‌లలో చెన్నైని గెలిపించిన జడేజా.. ఐపీఎల్-2023 ఫైనల్లోనూ అద్భుతం చేసి జట్టును విజయతీరాలకు చేర్చి ధోనికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. కాగా ధోని- జడేజా మధ్య విభేదాలంటూ గత కొంతకాలంగా వదంతులు వ్యాపిస్తున్న తరుణంగా రవీంద్ర జడేజా తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. జడ్డూ, తన భార్య రివాబా ట్రోఫీతో ధోనితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఇది కేవలం ఏకైక వీరుడు, ధీరుడు ఎంఎస్ ధోని కోసమే చేశాం. మహీ అన్నా.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే’’ అంటూ ధోనిపై ప్రేమను కురిపించాడు. వేలల్లో రీట్వీట్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రవీంద్ర జడేజా ట్వీట్ దూసుకుపోతోంది. వీరి మధ్య పొరపొచ్చాలు లేవని ఇప్పటికైనా ఇలా చెప్పారంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు We did it for ONE and ONLY “MS DHONI.🏆 mahi bhai aapke liye toh kuch bhi…❤️❤️ pic.twitter.com/iZnQUcZIYQ — Ravindrasinh jadeja (@imjadeja) May 30, 2023 M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 𝙒𝙚 𝙬𝙖𝙣𝙩 𝙩𝙤 𝙙𝙚𝙙𝙞𝙘𝙖𝙩𝙚 𝙩𝙝𝙞𝙨 𝙏𝙞𝙩𝙡𝙚 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 𝙩𝙤 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 💛 Men of the moment @imjadeja & @IamShivamDube recap #CSK's glorious win in the #TATAIPL 2023 #Final 👌🏻👌🏻 - By @ameyatilak Full Interview 🎥🔽 #CSKvGT https://t.co/kDgECPSeso pic.twitter.com/yp09HKKCSn — IndianPremierLeague (@IPL) May 30, 2023 -
ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్
IPL 2023 Final CSK Vs GT- Winner Chennai: ఐపీఎల్-2023 ఫైనల్.. వేదిక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం.. గుజరాత్ టైటాన్స్ సొంత మైదానం.. వర్షం కారణంగా.. లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రిజర్వ్‌డేకు మ్యాచ్ వాయిదా.. సీజన్ ఆరంభంలో ఇక్కడే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి శుభారంభం చేసిన గుజరాత్.. ఫైనల్లోనూ అదే ఫలితం పునరావృతం చేసి వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలని భావించింది. ఒకవేళ వరణుడి కారణంగా మ్యాచ్ రద్దైపోయినా.. టేబుల్ టాపర్‌గా ఉన్న తమనే విజయం వరిస్తుందని కాస్త ధీమాగానే కనిపించింది.. అయితే, సోమవారం వర్షం తెరిపినిచ్చింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం సీఎస్కే ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ(54)తో మెరవగా.. శతకాల ధీరుడు శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో మాత్రం 39 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టును ఆదుకునే బాధ్యతను తీసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి వరుణడి అడ్డంకి కారణంగా సీఎస్కే లక్ష్యం 15 ఓవర్లకు 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. జడ్డూ ఆఖరి బంతికి ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఫోర్ బాది రవీంద్ర జడేజా చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ధోని సేన ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. రెండోసారి టైటిల్ గెలవాలన్న టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. గెలుపోటముల్లో ఒక్కటిగా ఉంటాం ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తమ జట్టును చూసి గర్వపడుతున్నట్లు తెలిపాడు. గెలవడానికి శాయశక్తులా కృషి చేశామని.. గెలుపోటములలో తాము కలిసే ఉంటామని పేర్కొన్నాడు. తమ ఓటమికి సాకులు వెతకదలచుకోలేదన్న పాండ్యా.. సీఎస్కే అద్భుతంగా ఆడి చాంపియన్‌గా నిలిచిందని ప్రశంసించాడు. అయితే, తమ జట్టులోని యువ ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అంత తేలికేమీ కాదని తమిళనాడు బ్యాటర్‌ను కొనియాడాడు. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ.. ఇలా ప్రతి ఒక్కరు జట్టును గెలిపించేందుకు పాటుపడ్డారని పాండ్యా పేర్కొన్నాడు. రాసి పెట్టి ఉందంతే! ఓడినా బాధపడను ఇక సీఎస్కే కెప్టెన్, తన రోల్‌మోడల్ ధోని గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ధోని భాయ్‌ని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! నేను ఒకవేళ ఓడిపోవాల్సి వస్తే అదీ ధోని చేతిలో అయితే అస్సలు బాధపడను. మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తులలో ధోని ఒకడు. ఆ దేవుడు నా వైపు ఉంటాడని అనుకున్నా. కానీ ఈరోజు ధోనిదే అయింది’’ అని హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఐదోసారి చాంపియన్ అయింది. అహ్మదాబాద్ మ్యాచ్‌లో 25 బంతుల్లో 47 పరుగులు సాధించిన చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. We are not crying, you are 🥹 The Legend continues to grow 🫡#TATAIPL | #Final | #CSKvGT | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/650x9lr2vH — IndianPremierLeague (@IPL) May 30, 2023 𝙄𝘾𝙊𝙉𝙄𝘾! A round of applause for the victorious MS Dhoni-led Chennai Super Kings 👏🏻👏🏻#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/kzi9cGDIcW — IndianPremierLeague (@IPL) May 29, 2023 -
IPL 2023: చెన్నై కొంటుందనుకున్నాడు.. కానీ అలా జరుగలేదు! ఫైనల్లో అదే జట్టుపై
IPL 2023 Final CSK Vs GT- Who Is Sai Sudharsan- His Best Innings: ‘సాయి సుదర్శన్ ప్రత్యేకమైన ఆటగాడు. టి20 ఫార్మాట్కైతే సరిగ్గా సరిపోతాడు. సాధ్యమైనంత తొందరగా అతడిని తమిళనాడు జట్టులోకి తీసుకు రండి’... భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జూలై, 2021లో చెప్పిన ప్రశంసాపూర్వక మాట ఇది. ఆ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను అద్భుత బ్యాటింగ్‌తో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ మాట విన్నట్లుగా తమిళనాడు సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేయగా... నవంబర్, 2021లోనే అతను తన తొలి దేశవాళీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గత రెండేళ్లలో అతని ఆట మరింత మెరుగైంది. 21 ఏళ్ల సుదర్శన్ మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ప్రస్తుతం ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. Photo Credit : AFP చెన్నై తీసుకోలేదు.. తన ప్రదర్శన, గుర్తింపు కారణంగా 2022 ఐపీఎల్ వేలంలో తనను చెన్నై జట్టు తీసుకుంటుందని సుదర్శన్ ఆశించాడు. కానీ అది జరగలేదు. చివరకు అతని కనీస విలువ రూ. 20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. విజయ్‌శంకర్‌కు గాయం కావడంతో తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాగా, మొత్తం సీజన్లో 5 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. అయితే అతని మెరుపులు ఆకట్టుకున్నాయి. Photo Credit : AFP విలియమ్సన్ తప్పుకోవడంతో ముఖ్యంగా రబడ బౌలింగ్‌లో కొట్టిన హుక్‌షాట్ బౌండరీ అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. సాయి బ్యాటింగ్‌ను నమ్మిన టీమ్ యాజమాన్యం ఈసారి కూడా కొనసాగించింది. ఈ ఏడాది కూడా విలియమ్సన్ గాయంతో తప్పుకోవడంతో తనకు అందివచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. ఢిల్లీపై అర్ధసెంచరీ చేసిన మ్యాచ్‌లో నోర్జే వేసిన 144 కిలోమీటర్ల బంతిని వికెట్ల వెనుకవైపు సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. Photo Credit : AFP సెంచరీ చేజారినా.. కోల్‌కతాపై కూడా మరో అర్ధ సెంచరీ సాధించిన అతను ఈ సీజన్లో 51.71 సగటు, 141.41 స్ట్రయిక్‌రేట్‌తో 362 పరుగులు సాధించడం విశేషం. ముంబైతో రెండో క్వాలిఫయర్‌లో చివర్లో వేగంగా పరుగులు చేయలేక ‘రిటైర్డ్ అవుట్’గా వెళ్లడంతో అతని దూకుడుపై సందేహాలు తలెత్తాయి. అయితే సోమవారం అతను దానిని పటాపంచలు చేశాడు. సెంచరీ చేజారినా...ఐపీఎల్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. Photo Credit : AFP తల్లిదండ్రులు కూడా సుదర్శన్ ఇంట్లోనే క్రీడలు ఉన్నాయి. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ భారత్ తరఫున దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనగా, తల్లి ఉష జాతీయ వాలీబాల్‌లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేస్తోంది. వివిధ వయో విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అతను దూసుకొచ్చాడు. Photo Credit : AFP తల్లి పర్యవేక్షణలో 2019–20 అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ, రవి బిష్ణోయ్, ప్రియమ్ గార్గ్ అతని ఇండియా ‘ఎ’ జట్టు సహచరులు. ఆరంభంలోనే ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టని సాయి తల్లి పర్యవేక్షణలో పూర్తి ఫిట్‌గా మారడం కూడా అతని కెరీర్‌కు మేలు చేసింది. Photo Credit : AFP చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో 2022లో టైటాన్స్ రూ.20 లక్షలకు తీసుకున్న తర్వాత జరిగిన 2023 తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో సుదర్శన్‌కు రూ. 21.60 లక్షలు దక్కడం విశేషం. సీఎస్కేకే చెందిన జూనియర్ సూపర్ కింగ్స్ టీమ్ సభ్యుడిగా 2018లో సుదర్శన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా, ఆ టీమ్‌కు అంబటి రాయుడు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అదే చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడం కొసమెరుపు! ఈ సందర్భంగా రికార్డుల మోత మోగించాడు సాయి సుదర్శన్. –సాక్షి క్రీడా విభాగం చదవండి: రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. High praise for our young Titan 👏🏻💙 https://t.co/Kep0fr6Pgl — Gujarat Titans (@gujarat_titans) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
IPL 2023 Final: ధోని సేనకు శుభ సూచకం
వర్షం కారణంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య నిన్న జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన నేటికి (మే 29) వాయిదా పడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇది ఓ రకంగా ధోని సేనకు శుభ సూచకమని చెప్పాలి. గడిచిన 15 ఐపీఎల్ సీజన్లలో 12 సీజన్ల ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం రోజున జరిగాయి. ప్రస్తుత సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా ఆదివారానికే షెడ్యూల్ అయినప్పటికీ వర్షం వల్ల అది సోమవారానికి వాయిదా పడింది. నాన్ సండే రోజు జరిగిన మూడు ఫైనల్స్‌లో రెండు సీఎస్కే (2011 ఆర్సీబీతో శనివారం, 2021 కేకేఆర్‌తో శుక్రవారం), ఒకటి ముంబై (2020, డీసీతో మంగళవారం) గెలిచాయి. మూడింట రెండు ఫైనల్స్ సీఎస్కే గెలవడంతో ఆ జట్టు అభిమానులు నాన్ సండే (సోమవారం) రోజు ఐపీఎల్-2023 ఫైనల్స్ జరగడాన్ని శుభ సూచకంగా భావిస్తున్నారు. తమ కొరకే వరుణుడు ఆదివారం మ్యాచ్ జరగకుండా చేశాడని ఫీలవుతున్నారు. #QuickByte: Non-Sunday finals in the IPL ⬇️ 2011: CSK vs RCB (Sat, 28 May) 2020: MI vs DC (Tue, 10 Nov) 2021: CSK vs KKR (Fri, 15 Oct) 2023: CSK vs GT (Mon, 29 May)#IPL2023Finals #CSKvGT pic.twitter.com/lyy7gZCz7E — Cricket.com (@weRcricket) May 28, 2023 సెంటిమెంట్లు బలంగా ఫాలో అయ్యే సీఎస్కే అభిమానులకు ఈ ఈక్వేషన్ అదనపు మనో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సీజన్లో సీఎస్కే తప్పక టైటిల్ గెలుస్తుందని వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఏది జరిగినా తమ మంచి కోసమేనని, ఈసారి ఎలాగైనా ధోని సారధ్యంలో సీఎస్కే టైటిల్ గెలవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇక, సండే, నాన్ సండే సెంటిమెంట్‌ను పెడితే.. వాస్తవానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ కోసం సెలవు దినమైన ఆదివారం రోజు నిర్వహిస్తారు. షెడ్యూల్ కుదరక, అనివార్య కారణాల వల్ల ఐపీఎల్ ఫైనల్స్ నాన్ సండే రోజు నిర్వహించాల్సి వచ్చిందే తప్ప, దీని వెనుక ఎలాంటి మతలబు లేదు. ఏది ఏమైనా ఎవరి సెంటిమెంట్లు వారికి ఉంటాయి కాబట్టి వాటిని గౌరవించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ పని దినమైన సోమవారానికి వాయిదా పడటంతో మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్లు కొనుగోలు ఉద్యోగస్తులు తెగ ఫీలైపోతున్నారు. వర్కింగ్ డే కావడం, అదీ సోమవారం కావడంతో తప్పనిసరిగా ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎంతో శ్రమ కోర్చి బ్లాక్‌లో టికెట్లు కొంటే, తీరా పరిస్థితి ఇలా తయారైందని బాధపడుతున్నారు. చదవండి: IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్కు సంకేతమా..? -
IPL 2023 Final: రుతురాజ్‌ను చూసి వణిపోతున్న గుజరాత్ టైటాన్స్
వర్షం కారణంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య నిన్న జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను చూసి మాత్రం గుజరాత్ టైటాన్స్ వణికిపోతుంది. అందుకు కారణం గుజరాత్‌పై రుతురాజ్‌కు ఉన్న రికార్డు. ఈ సీఎస్కే ఓపెనర్ ఐపీఎల్లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు బాదాడు. క్వాలిఫయర్-1లో 44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు చేసిన రుతు.. ఈ సీజన్ ఓపెనర్‌లో 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంతకుముందు సీజన్లో తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 73 పరుగులు చేసిన గైక్వాడ్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో 49 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మొత్తంగా రుతురాజ్ ఐపీఎల్లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించి 278 పరుగులు స్కోర్ చేశాడు. ఐపీఎల్లో మరే ఆటగాడు గుజరాత్‌పై ఇన్ని పరుగులు చేయలేదు. రుతురాజ్ తర్వాత విరాట్ కోహ్లి అత్యధికంగా గుజరాత్‌పై 232 పరుగులు సాధించాడు. నేటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇదే రికార్డు గుజరాత్ బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ పూర్తి ఓవర్లు సాధ్యపడితే, రుతురాజ్‌ను ఔట్ చేయడం వారికి తలకు మంచిన పనే అవుతుంది. ఈ సీజన్ క్వాలిఫయర్-1 మినహాంచి, గత సీజన్లో రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్‌నే విజయం వరించినప్పటికీ, రుతురాజ్ విషయంలో వారికి ప్రత్యేక ప్రణాళికలు లేకపోతే మూల్యం తప్పించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లీగ్‌లో ఏడో టాప్ స్కోరర్‌గా (15 మ్యాచ్‌ల్లో 146.88 స్ట్రయిక్ రేట్‌తో 564 పరుగులు, 4 హాఫ్‌సెంచరీలు) ఉన్న రుతురాజ్‌ను గుజరాత్ బౌలర్లు ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్లు లేదా 10 ఓవర్లు లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. చదవండి: IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్కు సంకేతమా..? -
IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్కు సంకేతమా..?
ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్‌కు (మే 29, రిజర్వ్ డే) ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు యావత్ భారత క్రికెట్ అభిమానులకు ఓ భయం పట్టుకుంది. ఈ సీజన్‌తోనే ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలుకుతాడేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచే తలాకు ఆఖరిదవుతుందేమోనని కలత చెందుతున్నారు. ధోని రిటైర్మెంట్ విషయంలో ఫ్యాన్స్‌కు ఉన్న భయాల వెనుక ఓ బలమైన కారణం ఉంది. ధోని.. తన అంతర్జాతీయ కెరీర్‌లోని చివరి మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజునే ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు (జులై 10) వాయిదా పడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. ఏడాది అనంతరం 2020, ఆగస్ట్ 15వ తేదీన ధోని అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించాడు. Déjà Vu? 📸: IPL#MSDhoni #India #CSK pic.twitter.com/4cW5RlhFBb — CricTracker (@Cricketracker) May 28, 2023 తాజాగా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్ డే కు వాయిదా పడటంతో అభిమానులు భయపడుతున్నారు. ధోని తన అంతర్జాతీయ క్రికెట్‌కు ఎలాగైతే వీడ్కోలు పలికాడో, ఐపీఎల్‌కు కూడా అలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని దిగులుపడుతున్నారు. తలా లేని ఐపీఎల్‌ను ఊహించుకోలేమంటూ వాపోతున్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన చివరి మ్యాచ్‌ను, ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను కంపేర్ చేసుకుంటూ తెగ ఫీలైపోతున్నారు. ధోనికి అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్ (వన్డే) 350వదని, ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ అతనికి 250వదని చెప్పుకుంటూ ధోని రిటైర్మెంట్పై నిర్ధారణకు వచ్చేశారు. ధోని రిటైర్మెంట్కు లెక్కలు కూడా అనుకూలిస్తున్నాయంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్-చెన్నై జట్ల మధ్య నిన్న (మే 28) జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే, లీగ్ దశలో టేబుల్ టాపర్ అయిన గుజరాత్‌ను విజేతగా ప్రకటిస్తారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. చదవండి: IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టిందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..! -
IPL 2023 Final: చెన్నై ఓడిపోతుందని ముందే డిసైడ్ చేసేశారు..!
గుజరాత్-చెన్నై జట్ల మధ్య నిన్న (మే 28) జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు స్టేడియంలోని జెయింట్ స్క్రీన్‌పై కనిపించిన ఓ ఆసక్తిర దృశ్యం ఇంటర్నెట్ను షేక్ చేసింది. అదేంటంటే.. "చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్" అని బిగ్ స్క్రీన్‌పై కొద్ది సెకెన్ల పాటు ప్రదర్శించబడింది. ఇది చూసిన అభిమానులు వెంటనే స్క్రీన్ షాట్ తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. సెకెన్ల వ్యవధిలో ఈ న్యూస్ దావనంలా వ్యాపించింది. ధోని ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న సీఎస్కే అభిమానులు ఇది చూసి అవాక్కయ్యారు. మ్యాచ్ జరగకుండానే తమను రన్నరప్‌గా ఎలా డిసైడ్ చేస్తారని మండిపడ్డారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. Well, it seems like Mother Nature is having a grand time playing with the emotions of cricket fans today! As for that viral 'RUNNER UP CSK' image, it's almost as if someone hit the "upload" button prematurely and revealed the climactic twist of the match. Perhaps it's a… pic.twitter.com/R8fL02nGHe — Sandeep Nandlal (@ishsagar) May 28, 2023 అయితే స్క్రీన్ టెస్టింగ్‌లో భాగంగా ఇలా జరిగినట్లు నిర్వహకులు ప్రకటించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఏదైనా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు సంబంధించి విన్నర్, రన్నరప్ డిక్లేరేషన్‌ను చెక్ చేసి చూసుకోవడం సంబంధిత విభాగం వారి విధుల్లో భాగంగా జరుగుతుందని నిర్వహకులు వివరణ ఇచ్చారు. రన్నరప్ సీఎస్కే అనే కాకుండా, సీఎస్కే విన్నర్ అనే డిక్లేరేషన్‌ను కూడా చెక్ చేశారని పేర్కొన్నారు. అలాగే గుజరాత్‌కు కూడా విన్నర్, రన్నరప్ డిక్లేరేషన్‌ను చెక్ చేశారని తెలిపారు. ఇది కేవలం స్క్రీన్ టెస్టింగ్‌లో భాగంగా జరిగిందేనని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వరకు వాతావరణం ప్రశాంతంగా ఉండింది. టాస్కు సమయం ఆసన్నమవుతున్న వేళ మొదలైన వర్షం, భారీ వర్షంగా మారి, మ్యాచ్ సాధ్యపడకుండా చేసింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు. ఈ రోజు (రిజర్వ్ డే) కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే, లీగ్ దశలో టేబుల్ టాపర్ అయిన గుజరాత్‌ను విజేతగా ప్రకటిస్తారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. చదవండి: IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టిందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..! -
IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టి ఉందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..!
గుజరాత్-చెన్నై జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. యాదృచ్చికమో ఏమో తెలీదు కానీ, సరిగ్గా ఇదే రోజే గతేడాది ఐపీఎల్ (2022) ఫైనల్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొంది, అరంగేట్రం సీజన్లోనే టైటిల్ నెగ్గింది. వరుణుడి ఆటంకం కారణంగా (షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2023 ఫైనల్ మే 28న జరగాల్సి ఉంది) సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే రోజు టైటిల్ గెలిచే అవకాశం గుజరాత్‌కు వచ్చింది. రిజర్వ్ డేకు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటంతో ఈసారి కూడా గుజరాత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మళ్లీ అదే రోజు (మే 29) టైటిల్ గెలవాలని వారికి రాసి పెట్టిందో ఏమో, అన్నీ వారికి అనుకూలంగా జరుగుతున్నాయి. మరోవైపు మ్యాచ్ పూర్తిగా జరిగినా లేక అరకొరగా సాధ్యపడినా గుజరాత్‌కే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయంటూ గుజరాత్ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. చెన్నైతో పోలిస్తే తమ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్ కొనసాగిస్తాడని.. లీగ్ టాప్-3 వికెట్టేకర్లు షమీ, రషీద్, మోహిత్ మరోసారి సత్తా చాటుతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత రికార్డులు, లక్ కూడా తమకే అనుకూలంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి గుజరాత్ అభిమానులు ప్రచారం చేసుకున్నట్లుగా హార్ధిక్ సేన గెలుస్తుందో, లేక మెజారిటీ శాతం అభిమానుల కోరిక ప్రకారం సీఎస్కే టైటిల్ గెలుస్తుందో వేచి చూడాలి. కాగా, నిబంధనల ప్రకారం రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే (గుజరాత్) విజేతగా ప్రకటిస్తారు. చదవండి: IPL 2023 Final: 'రిజర్వ్ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..! -
IPL 2023 Final: 'రిజర్వ్ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..!
వర్షం కారణంగా నేటికి (మే 29) వాయిదా పడిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.. రిజర్వ్ డే రోజు కూడా సజావుగా సాగే పరిస్థితి కనబడటం లేదు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నిన్నటి లాగా భారీ వర్షం కురవకపోవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. కాగా, ఐపీఎల్ 2023 ఫైనల్స్‌కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత -
ధోనిని ఆరాధించే వాళ్లలో ఒకడు.. కానీ టాస్ సమయంలో! పాండ్యాకు..
IPL 2023 Final CSK Vs GT: ‘‘మహేంద్ర సింగ్ ధోనిని ఆరాధించే చాలా మందిలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. తనే ఈ విషయాన్ని స్వయంగా ఎన్నోసార్లు చెప్పాడు. మ్యాచ్ ఆరంభంలో టాస్ సమయంలో ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ.. ఎంతో స్నేహంగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. హార్దిక్ పాండ్యా చెప్పినట్లు కెప్టెన్‌గా తానేం నేర్చుకున్నాడో వ్యూహాల రూపంలో అమలు చేయాల్సి ఉంటుంది’’ అని టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ అన్నాడు. ఐపీఎల్-2023 ఎక్కడ, ఎలా మొదలైందో అక్కడే ముగియనుంది. నువ్వా- నేనా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ ఆదివారం (మే 28)అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ మైండ్ ధోని ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడతాడా? లేదంటే హార్దిక్ పాండ్యా గత సీజన్ ఫలితాన్ని పునరావృతం చేసి డిఫెండింగ్ చాంపియన్‌ను విజేతగా నిలబెడతాడా? అన్న చర్చ జరుగుతోంది. అప్పుడు అంచనాలే లేవు ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథిగా హార్దిక్ పాండ్యా ఏం నేర్చుకున్నాడో నిరూపించుకునే సమయం ఇదేనని పేర్కొన్నాడు. ‘‘గతేడాది తొలిసారిగా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టినపుడు.. అతడి నుంచి ఏం ఆశించాలో, సారథిగా అతడి ఆటను ఎలా అంచనా వేయాలో కూడా చాలా మందికి అర్థం కాలేదు. అచ్చం ధోనిలాగే ఎందుకంటే పాండ్యా మోస్ట్ ఎగ్జైటింగ్ క్రికెటర్. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జట్టును ఏకంగా టైటిల్ విజేతగా నిలిపాడు. నిజానికి జట్టులో ధోని ఎలాంటి వాతావరణం కల్పిస్తాడో పాండ్యా కూడా అచ్చం అలాగే తమ ఆటగాళ్లను ప్రోత్సహించాడు. గుజరాత్ డ్రెసింగ్రూంలోనూ సీఎస్కే మాదిరి వాతావరణం కల్పించాడు. ఈ విషయంలో హార్దిక్ పాండ్యాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని గావస్కర్ పేర్కొన్నాడు. మిస్టర్ కూల్‌కు ఇదే ఆఖరి సీజన్? కాగా గతేడాది టేబుల్ టాపర్‌గా నిలిచి చాంపియన్‌గా నిలిచిన గుజరాత్.. ఈసారి కూడా అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. విజయాల శాతంలో మెరుగ్గా ఉన్న పాండ్యా వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. మిస్టర్‌కూల్‌కు ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నడుమ తమ సారథి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లు పోటీకి సిద్ధమైంది. చదవండి: గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్.. ఏమన్నాడంటే? 𝗔𝗟𝗟 𝗦𝗘𝗧! 👏 👏 It's time for the 𝗙𝗜𝗡𝗔𝗟 Showdown! 👍 👍#TATAIPL | #Final | #CSKvGT | @ChennaiIPL | @gujarat_titans pic.twitter.com/LXrtHxPDb4 — IndianPremierLeague (@IPL) May 28, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: చరిత్ర సృష్టించనున్న ఎంఎస్ ధోని
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించనున్నాడు. గుజరాత్‌తో నేడు (మే 28) జరుగబోయే ఫైనల్ మ్యాచ్ ఆడటం ద్వారా ఐపీఎల్లో 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఐపీఎల్ హిస్టరీ ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా 250 మ్యాచ్‌లు ఆడలేదు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ధోని రికార్డుల్లోకెక్కనున్నాడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (243), ఆర్సీబీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ (242), ఆర్సీబీ విరాట్ కోహ్లి (237), సీఎస్కే రవీంద్ర జడేజా (225), పంజాబ్ సారధి శిఖర్ ధవన్ (217), సీఎస్కే మాజీ ప్లేయర్లు సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (203), రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (197) వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-10 ప్లేయర్స్ జాబితాలో ఏకంగా ఐదుగురు సీఎస్కేకు చెందిన వారే ఉండటం విశేషం. కాగా, ఇవాల్టి మ్యాచ్‌తో ఐపీఎల్ కెరీర్లో 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్న ధోని.. ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి టైటిల్ సాధిస్తే మరో రెండు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఇందులో మొదటిది.. రోహిత్ శర్మతో సమానంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించడం. రోహిత్ సారధ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్ల టైటిళ్లు సాధించగా.. ధోని నేతృత్వంలో చెన్నై 2010, 2011, 2018, 2021 సీజన్ల టైటిళ్లు గెలుపొందింది. ధోని.. ఐపీఎల్ 2023 టైటిల్ గెలిస్తే రోహిత్‌తో సమానంగా నిలుస్తాడు. మరో రికార్డు ఏంటంటే.. నేటి ఫైనల్లో సీఎస్కే.. గుజరాత్‌ను ఓడించి టైటిల్ సాధిస్తే, అతి పెద్ద వయసులో (41) ఐపీఎల్ టైటిల్ సాధించిన కెప్టెన్‌గా ధోని రికార్డుల్లోకెక్కనున్నాడు. చదవండి: ‘ఫైనల్’ ధమాకా.. సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ -
చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి!
ఐపీఎల్-2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్.. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. తద్వారా గుజరాత్ టైటాన్స్ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్లో తమ తొలి రెండు సీజన్లలో వరుసగా ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా గుజరాత్ చరిత్ర సృష్టించింది. గతేడాది క్వాలిఫియర్-1లో రాజస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన గుజరాత్.. ఈ సారి మాత్రం క్వాలిఫియర్-2 ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుబ్‌మన్ గిల్(129) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో 171 పరుగులకే ముంబై ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్(61), తిలక్ వర్మ(43) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. ఇక గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. షమీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించాడు ఇదే తొలిసారి.. అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్-చెన్నై మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే యాదృచ్చకంగా ఆఖరి మ్యాచ్(ఫైనల్) కూడా ఈ రెండు జట్లే మధ్యే జరగునుంది. వేదిక కూడా ఒక్కటే కావడం గమానర్హం. ఇలా జరగడం 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటి సారి. ఇక మే28న అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐదో సారి టైటిల్‌ను ముద్దడాలని సీఎస్కే భావిస్తుంటే.. గుజరాత్ కూడా వరుసగా రెండో సారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని యోచిస్తోంది. చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్! -
మా వాళ్లకు చుక్కలు చూపిస్తా.. విసిగిస్తా! పాపం వాళ్ల పరిస్థితి చూస్తే: ధోని
IPL 2023- CSK In Final- MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడే అవకాశం వస్తే బాగుండని ప్రతి యువ క్రికెటర్ కోరుకుంటాడనంలో అతిశయోక్తి లేదు. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బోల్తా కొట్టించే ధోని.. తన జట్టులోని ప్రతి ఆటగాడితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేశ్ రైనా వంటి భారత ఆటగాళ్లే కాదు ఐపీఎల్లో భాగంగా తలా కెప్టెన్సీలో ఆడిన కెవిన్ పీటర్సన్ వంటి విదేశీ ప్లేయర్లు సైతం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తా ధోని మైదానంలో ఉన్నాడంటే ఇటు అభిమానులకు.. అటు ఆటగాళ్లకు మజా వస్తుందంతే! అయితే, తాను కనిపించేంత మిస్టర్ కూల్ కాదని.. ప్లేయర్లకు చుక్కలు చూపిస్తానంటున్నాడు ధోని. ఆటగాళ్లకు పదే పదే ఆదేశాలు ఇస్తూ వాళ్లను విసిగిస్తానని సరదాగా వ్యాఖ్యానించాడు. పదోసారి ఫైనల్‌కు ఐపీఎల్-2023 తొలి క్వాలిఫయర్‌లో జయభేరి మోగించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. డిఫెండింగ్ చాంపియన్‌ను చిత్తు చేసి తద్వారా ఐపీఎల్లో పదోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఇక ఇప్పటికే సీఎస్కేను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపి విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ధోని.. ఈసారి కూడా టైటిల్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేతో సంభాషణ సందర్భంగా ధోని చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. అలా ఎలా ధోని? హర్షా భోగ్లే మాట్లాడుతూ.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే పట్టిన సంచలన క్యాచ్‌ల గురించి ప్రస్తావిస్తూ ఫీల్డ్ అంత బాగా ఎలా సెట్ చేయగలరంటూ ధోనిని అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వికెట్, పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డ్ సెట్ చేస్తూ ఉంటా. నిజానికి మా వాళ్లను బాగా విసిగిస్తా. ప్రతిసారి ఫీల్డర్‌ను ఒకచోటి నుంచి మరో చోటికి మారుస్తూనే ఉంటా. పాపం వాళ్ల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి కాబట్టి ఫీల్డర్ ప్రతిసారి నాపై ఓ కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి. ప్రతి రెండు మూడు బంతులకు ఓసారి.. ‘‘నువ్వు రెండు ఫీట్లు అటు జరుగు.. ఓ రెండు ఫీట్లు ఇటు జరుగు’’ అని ఫీల్డర్‌కు చెబుతూ ఉంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి! విసుగురావడం సహజం కదా! నాపై ఓ కన్నేసి ఉంచండి.. సరేనా అయితే, నేను మాత్రం వికెట్, లైన్‌కు అనుగుణంగా నా మనసు చెప్పినదాని బట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. అందుకు తగ్గ ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. ఈ సందర్భంగా మా ఫీల్డర్లకు ఓ విజ్ఞప్తి. మీరు ఎల్లప్పుడూ నాపై ఓ కన్నేసే ఉంచండి. మీరు క్యాచ్ డ్రాప్ చేస్తే నా రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడటానికి మాత్రం కాదు. ఫీల్డ్ సెట్ చేసే అంశం గురించి మాత్రమే’’ అని ధోని వ్యాఖ్యానించాడు. కాగా ధోని మే 28 నాటి ఫైనల్లో క్వాలిఫయర్-2 విజేతతో ఫైనల్లో తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చదవండి: ఫైనల్‌కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది? గుజరాత్, లక్నో కాదు.. చెన్నైతో ఫైనల్లో ఆడేది ఆ జట్టే! Emotions in plenty 🤗 Moments of elation, pure joy and the feeling of making it to the Final of #TATAIPL 2023 💛 Watch it all here 🎥🔽 #GTvCSK | #Qualifier1 | @ChennaiIPL pic.twitter.com/4PLogH7fCg — IndianPremierLeague (@IPL) May 24, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: అంచనాలు లేకుండా బరిలోకి.. వార్న్ గర్వపడుతూ ఉంటాడు: బట్లర్
IPL 2022- Jos Buttler: ‘‘ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగాను. అయితే, యాజమాన్యం, సహచర ఆటగాళ్ల ప్రోత్సాహంతో ఇక్కడి దాకా వచ్చాను. సమిష్టి కృషితో ఫైనల్స్‌లో ప్రవేశించాం. కుమార సంగక్కర, ట్రెవార్ పెన్నీతో సంభాషణలు ఎప్పటికీ మరచిపోలేను’’ అని క్వాలిఫైయర్-2 హీరో, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. ఐపీఎల్-2022 మధ్యలో కాస్త తడబడ్డానని, అప్పుడు ఒత్తిడికి గురయ్యానన్న బట్లర్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పుంజుకోవడంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నానని పేర్కొన్నాడు. కాగా సీజన్ ఆరంభంలో అద్భుతంగా ఆకట్టుకున్న బట్లర్.. ఆ తర్వాత కాస్త వెనుబడ్డాడు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో 89 పరుగులతో అజేయంగా నిలిచి తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలో క్వాలిఫైయర్-2లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన బట్లర్.. 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్ నిలిచి రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. ఆర్సీబీతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించినట్లు తెలిపాడు. వేలాది మంది ప్రేక్షకుల మధ్య, అభిమానుల మద్దతు నడుమ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం తనకు తృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్, రాజస్తాన్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన దివంగత షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్న బట్లర్.. అతడిని తాము మిస్ అవుతున్నామని భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్‌ను ప్రభావితం చేసిన వ్యక్తి షేన్ వార్న్. మొదటి సీజన్లోనే కప్ సాధించిపెట్టాడు. ఆయనను చాలా మిస్ అవుతున్నాం. మా విజయాన్ని ఆయన పై నుంచి చూస్తూనే ఉంటారు. ఈరోజు మా ఆట తీరు చూసి చాలా గర్వపడతారు’’ అని వ్యాఖ్యానించాడు. చదవండి 👇 Jos Buttler: వారెవ్వా.. బట్లర్ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం! Trolls On RCB Fan Girl: 'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు' Moments we'll never forget. 😍 #RRvRCB pic.twitter.com/yhVLY254vq — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 𝑷𝒂𝒅𝒉𝒂𝒓𝒐. 🏨💗 pic.twitter.com/37uqOuC0MP — Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022 -
చెన్నై.. విజిల్ పొడూ మా..!!
సాక్షి, ముంబై : రెండేళ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సత్తా చాటింది. మిస్టర్ కూల్ ధోని కెప్టెన్సీలో సగర్వంగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. హోం గ్రౌండ్లో మ్యాచ్‌లు చూడలేకపోయామనే తమిళ అభిమానుల బాధను టైటిల్ సాధించి ఇట్టే మాయం చేసి.. వారి చేత విజిల్స్ వేయించింది. సీనియర్ల జట్టు అంటూ ఎగతాళి చేసిన వారి ముందే గెలిచి నిలిచింది. అంతేకాకుండా కొత్తగా జట్టులో చేరిన ముంబై మాజీ ఆటగాళ్లు హర్భజన్, అంబటి రాయుడులకు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచామనే అనుభూతిని అందించింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న ధోనీ జట్టుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. జట్టులో భాగస్వాములైన చెన్నై ఆటగాళ్ల విజయానందం వారి మాటల్లోనే.. అంబటి రాయుడు చెన్నై జట్టుకు ఆడడం అదృష్టంగా భావిస్తున్నాను. కష్టపడినందుకు ఫలితం దక్కింది. తొలుత వికెట్ కొంచెం నెమ్మదించింది. కానీ తర్వాత అంతా సర్దుకుంది. ఈ విజయంలో నా వంతు పాత్ర పోషించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. రవీంద్ర జడేజా చాంపియన్స్ టీమ్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో మా ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది. రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మేము చాంపియన్లుగా ఈ సీజన్‌కి ముగింపు పలికాము. లుంగి ఎంగిడి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం బాధ్యతతో కూడుకున్నది. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా సాగింది. అద్భుతమైన ఈ విజయాల్లో భాగస్వాములయ్యే అవకాశం అందరికీ రాదు. ప్రస్తుతం నేను ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను. హర్భజన్ సింగ్ ఇది నాకు నాలుగో ఐపీఎల్ టైటిల్. అద్భుతమైన ఛేజింగ్ ద్వారా మేము విజయాన్ని దక్కించుకున్నాము. ధోని వ్యూహాల్ని చక్కగా అమలు చేశాడు. ఫింగర్ స్పిన్నర్‌తో పోల్చినపుడు ఐపీఎల్లో రిస్ట్ స్పిన్నర్స్కే ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం లభిస్తోంది. వచ్చే సీజన్ నుంచి ఈ ఆనవాయితీ మారుతుందనుకుంటా. కర్ణ్ శర్మచాలా బాగా ఆడాడు. డ్వేన్ బ్రావో ఇదొక ప్రత్యేకమైన సందర్భం. రెండేళ్లుగా ఒక్కొక్కరం ఒక్కో టీమ్‌లో ఉన్నాం. సీఎస్కే పునరాగమనం ద్వారా మళ్లీ ఒక చోటికి చేరాం. ఈ టీమ్‌లో కొందరు కొత్త ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఒక ఆటగాడికి అనుభవం అనేది ఎంత ముఖ్యమో వాట్సన్ మరోసారి నిరూపించాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. వట్టూ నీ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. శార్దూల్ ఠాకూర్ గతేడాది ఐపీఎల్ ఫైనల్లో(రైజింగ్ పుణె తరపున) ఆడే అవకాశం లభించింది. కానీ టైటిల్ సాధించలేకపోయాం. ప్రస్తుతం ఈ విజయంతో నాకు ప్రపంచాన్ని జయించినట్టుగా ఉంది. ఇదే ఆఖరు మ్యాచ్.. కనుక డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయాలనే ఆలోచనతో నా మైండ్ నిండిపోయింది. నా ప్రణాళికను చక్కగా అమలు చేయడం ద్వారా టాప్ విన్నింగ్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. -
ఐపీఎల్ విజేత చెన్నై; ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండేళ్ల నిషేధం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2018 విజేతగా నిలిచింది. ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని జట్టుకు ఇది మూడో ట్రోఫీ. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొంది కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంలో షేన్ వాట్సన్(57 బంతుల్లో 117) వీరబాదుడుకు తోడు మరో సెంటిమెంట్ కూడా కలిసొచ్చిందని చెన్నై సారధి చెప్పుకొచ్చాడు. నంబర్ 7: ‘‘ఫైనల్స్ అన్నాక ప్రతి ఒక్కరూ రకరకాల గణాంకాలను వల్లెవేస్తుంటారు. నా వరకైతే నంబర్ 7 సెంటిమెంట్ కీలకంగా అనిపించింది. ఇవాళ తేదీ మే 27. సాధించాల్సిన స్కోరు 179, నా జెర్సీ నంబర్ కూడా 7. అన్నింటికంటే మించి చెన్నై టీమ్ ఫైనల్స్‌కు రావడం ఇది 7వసారి. అన్ని చోట్లా 7 ఉంది. అలా కలిసొచ్చింది(నవ్వులు). అఫ్కోర్స్, సెంటిమెంట్ల సంగతి ఎలా ఉన్నా టీమ్ పెర్ఫామెన్స్ అనేది విజయానికి అతి ప్రధానం’’ అని చెప్పాడు ధోని. ప్యాడ్స్ కట్టుకోవద్దని చెబుతా: కీలకమైన ఫైనల్స్‌లో చెన్నై ఓపెనర్ ఫ్యాప్ డుప్లిసిస్(10) స్కోరుకే అవుటయ్యాడు. అప్పటికే డ్వేన్ బ్రేవో ప్యాడ్లు కట్టుకుని సిద్ధమైపోవడంతో వన్ డౌన్లో అతనే వస్తాడేమో అనిపించింది. కానీ ఆర్డర్ ప్రకారం రైనానే వచ్చాడు. దీనిపై ధోనీ వివరణ ఇస్తూ.. ‘‘బ్రేవోని సిద్ధంగా ఉండమని నేనేమీ చెప్పలేదు. తనంతట తానే ప్యాడ్స్ కట్టుకుని రెడీ అయిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని అనుకోనేలేదు. ఈసారి అలా ప్యాడ్స్ కట్టుకోవద్దని బ్రేవోని చెబుతా..’’ అని ధోనీ చమత్కరించాడు. నేడు చెన్నైకి..: ఈ సీజన్లో సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సూపర్ కింగ్స్ జట్టు సోమవారం చెన్నైకి వెళ్లనుంది. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానుల్ని కలుసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ధోనీ చెప్పాడు. కావేరీ ఆందోళనల నేపథ్యంలో సీఎస్కే హోం గ్రౌండ్ చెన్నై నుంచి పుణెకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ బౌలర్లు రషీద్, భువీలపై ధోనీ ప్రశంసలు కురిపించాడు. ‘‘మిస్టరీ బౌలర్ రషీద్లాగే భువనేశ్వర్ కూడా చాలా తెలివైన బౌలర్. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. అయితే వాట్సన్ స్టన్నింగ్ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది’’ అని మిస్టర్ కూల్ వివరించాడు. మ్యాచ్ రిపోర్ట్: ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు పొందగా, సురేశ్ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం. -
ఐపీఎల్–11 అవార్డులు, విశేషాలు
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్–రూ.10 లక్షలు) విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్–735 పరుగులు) పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్–రూ. 10 లక్షలు) ఆండ్రూ టై (కింగ్స్ ఎలెవన్ పంజాబ్–24 వికెట్లు) పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) ఎమర్జింగ్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): రిషభ్ పంత్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్–684 పరుగులు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు): సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) సూపర్ స్ట్రయికర్: సునీల్ నరైన్ (నెక్సా కారు–కోల్‌కతా నైట్‌రైడర్స్) స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ (రూ. 10 లక్షలు): రిషభ్ పంత్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) నయీ సోచ్ సీజన్ అవార్డు: చెన్నై కెప్టెన్ ధోని (రూ. 10 లక్షలు) ఫెయిర్ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్ ఉత్తమ మైదానం: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (రూ. 50 లక్షలు) రన్నరప్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 12 కోట్ల 50 లక్షలు) విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 20 కోట్లు) ఆరెంజ్ క్యాప్ అందుకున్న విలియమ్సన్ విశేషాలు... 735 విలియమ్సన్ చేసిన పరుగులు. ఒక ఐపీఎల్ సీజన్లో 700కు పైగా పరుగులు చేసిన ఐదో ఆటగాడు. గతంలో కోహ్లి (973–2016లో), వార్నర్ (848–2016లో), క్రిస్ గేల్ (733–2012లో), మైక్ హస్సీ(733-2013) ఈ ఘనత సాధించారు. 40తో ఈ సీజన్లో చెన్నై, రైజర్స్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచింది. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. 4 రాయుడు, హర్భజన్ ఐపీఎల్ టైటిల్స్ సంఖ్య. 3 ముంబై తరఫున సాధించగా ఇది నాలుగోది. రోహిత్ శర్మ (4) కూడా నాలుగు టైటిల్స్ గెలిచాడు. 3 కరణ్ శర్మ వరుసగా మూడేళ్లు మూడు వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్ విజయాల్లో భాగమయ్యాడు. సన్‌రైజర్స్ (2016), ముంబై (2017), చెన్నై (2018). 150 కెప్టెన్‌గా టి20ల్లో ధోనికి ఇది 150వ విజయం. మరే కెప్టెన్ కూడా 100 మ్యాచ్‌లు గెలిపించలేదు. -
సాధించెన్నై...
రిటర్న్ ఆఫ్ సూపర్ కింగ్స్... పునరాగమనం అంటే ఎంత ఘనంగా ఉండాలో చెన్నై నిరూపించింది. వివాదంతో లీగ్‌కు రెండేళ్లు దూరమై, వేలంలో మూడు పదుల ఆటగాళ్లతో అంకుల్స్ జట్టుగా ముద్ర పడి, సీజన్లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌కే పరిమితమై కూడా ఆ జట్టు అద్భుతాన్ని చేసింది. తమకే సాధ్యమైన రీతిలో విజయయాత్ర కొనసాగించి మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాయకుడిగా తనేమిటో మళ్లీ మళ్లీ చూపించిన ధోని మార్గనిర్దేశనంలో, మదరాసీల అభిమాన జనం ప్రోత్సాహంతో విజిల్ పొడు అంటూ గెలుపు ఈల వేసింది. తొలి 10 బంతుల్లో 0 పరుగులు... ఒక టి20 మ్యాచ్‌లో ఇంతటి చెత్త ఆరంభం ఏ బ్యాట్స్‌మన్ కూడా చేసి ఉండడు. కానీ షేన్ వాట్సన్ అలాగే ఆడాడు. కానీ ఆ తర్వాత అతను వీర విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 117 పరుగులు బాది చెన్నైని విజేతగా నిలిపాడు. ప్రధాన బౌలర్లు భువనేశ్వర్ (0/17), రషీద్ (0/24)లను జాగ్రత్తగా ఆడి మిగిలిన బౌలర్లపై విరుచుకుపడాలనుకున్న చెన్నై వ్యూహం అద్భుతంగా పని చేసింది. ఫలితంగా తుది పోరు ఏకపక్షంగా మారిపోయి ఈ సీజన్లో రైజర్స్పై చెన్నై స్కోరు 4–0గా మారిపోయింది. బలమైన బౌలింగ్ అండగా, కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ముందుండి నడిపించగా... ఫైనల్ వరకు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. చిన్న మైదానమైన వాంఖెడేలో ముందుగా భారీ స్కోరు చేయడంలో తడబడిన ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కూడా విఫలమైంది. ఈ సీజన్లో అతి స్వల్ప స్కోర్లను కూడా రక్షించుకోగలిగిన జట్టుకు తుది పోరులో మాత్రం అది సాధ్యం కాలేదు. అసలు మ్యాచ్‌లో సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ వైఫల్యం రైజర్స్‌ను దెబ్బ తీసింది. విలియమ్సన్ స్ఫూర్తిదాయక నాయకత్వం జట్టును ఫైనల్ వరకు చేర్చినా చివరకు నిరాశ తప్పలేదు. ముంబై: మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు పొందగా, సురేశ్ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం. పఠాన్, బ్రాత్‌వైట్ మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే గోస్వామి (5) వికెట్ కోల్పోయింది. లేని రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతను ఔటయ్యాడు. ఇన్‌గిడి మెయిడిన్ వేయడంతో తొలి 4 ఓవర్లు ముగిసేసరికి జట్టు 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చహర్ వేసిన ఐదో ఓవర్లో విలియమ్సన్ 6, 4 కొట్టి జోరు పెంచాడు. ఆ తర్వాత బ్రేవో బౌలింగ్‌లోనూ విలియమ్సన్ వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరోవైపు శిఖర్ ధావన్ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. అయితే జడేజా తొలి ఓవర్లోనే ధావన్ బౌల్డ్ కావడంతో 51 పరుగుల రెండో వికెట్ (40 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో కెప్టెన్, షకీబ్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. జడేజా ఓవర్లో వీరిద్దరు 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు రాబట్టారు. బ్రేవో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు కొట్టి దూసుకుపోతున్న విలియమ్సన్కు ఎట్టకేలకు కరణ్ శర్మ బ్రేక్ వేశాడు. దూరంగా వెళుతున్న బంతిని ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో అతను స్టంపౌటయ్యాడు. అయితే దూకుడు తగ్గనివ్వని షకీబ్, పఠాన్ 22 బంతుల్లో 32 పరుగులు జత చేశా రు. రైనా అద్భుత క్యాచ్‌కు షకీబ్ వెనుదిరగ్గా, హుడా (3) విఫలమయ్యాడు. ఈ దశలో పఠాన్, బ్రాత్‌వైట్ బ్యాటింగ్ దూకుడు రైజర్స్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు భారీ షాట్లతో 18 బంతుల్లోనే 34 పరుగులు జోడించారు. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు సాధించిన హైదరాబాద్... తర్వాతి 10 ఓవర్లలో 105 పరుగులు చేయడం విశేషం. భారీ భాగస్వామ్యం... ఛేదనను చెన్నై చాలా నెమ్మదిగా ప్రారంభించింది. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను మెయిడిన్ వేయగా... కుదురుకునేందుకు వాట్సన్ చాలా సమయం తీసుకున్నాడు. ఇదే ఒత్తిడిలో డు ప్లెసిస్ (10) వెనుదిరగడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే వాట్సన్, రైనా కలిసి ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. సందీప్ ఓవర్లో వరుసగా 6, 4 బాది తొలిసారి టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత అతడిని ఆపడం సన్‌రైజర్స్ వల్ల కాలేదు. కౌల్ తన తొలి ఓవర్లో 16 పరుగులు సమర్పించుకోవడంతో చెన్నై జోరు మొదలైంది. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 80 పరుగులకు చేరింది. తర్వాతి రెండు ఓవర్లలో రెండు సిక్సర్ల సహాయంతో చెన్నై 24 పరుగులు రాబట్టింది. అనంతరం సందీప్ శర్మ వేసిన ఓవర్లో ఏకంగా 27 పరుగులు రావడంతో సూపర్ కింగ్స్ విజయం దాదాపుగా ఖాయమైంది. రైనా ఔటైనా... 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వాట్సన్ చివరి వరకు నిలిచాడు. అతనికి రాయుడు (16 నాటౌట్) సహకరించడంతో 9 బంతులు మిగిలి ఉండగానే విజయం పూర్తయింది. ఆ ఓవర్... సందీప్ శర్మ 13వ ఓవర్ వేయడానికి ముందు చెన్నై లక్ష్యం 48 బంతుల్లో 75 పరుగులు. ఒకటి, రెండు వికెట్లు పడితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండేది. కానీ వాట్సన్ వరుస బంతుల్లో 4, 6, 6, 6, 4 బాదడంతో మ్యాచ్ చెన్నై వైపు పూర్తిగా మళ్లింది. మరో వైడ్‌తో కలిసి ఈ ఓవర్లో సందీప్ 27 పరుగులిచ్చాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: శ్రీవత్స్ గోస్వామి రనౌట్ 5; ధావన్ (బి) జడేజా 26; విలియమ్సన్ (స్టంప్డ్) ధోని (బి) కరణ్ శర్మ 47; షకీబ్ (సి) రైనా (బి) బ్రేవో 23; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 45; దీపక్ హుడా (సి) సబ్–షోరే (బి) ఇన్‌గిడి 3; బ్రాత్‌వైట్ (సి) రాయుడు (బి) శార్దుల్ ఠాకూర్ 21; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–13, 2–64, 3–101, 4–133, 5–144, 6–178. బౌలింగ్: చహర్ 4–0–25–0, ఇన్‌గిడి 4–1–26–1, శార్దుల్ ఠాకూర్ 3–0–31–1, కరణ్ శర్మ 3–0–25–1, బ్రేవో 4–0–46–1, జడేజా 2–0–24–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ నాటౌట్ 117; డు ప్లెసిస్ (సి అండ్ బి) సందీప్ శర్మ 10; రైనా (సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 32; రాయుడు నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–16, 2–133. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–17–0, సందీప్ శర్మ 4–0–52–1, సిద్ధార్థ్ కౌల్ 3–0–43–0, రషీద్ ఖాన్ 4–1–24–0, షకీబ్ 1–0–15–0, బ్రాత్‌వైట్ 2.3–0–27–1. ‘మేం చేసిన స్కోరు గెలిచేందుకు సరిపోతుందని భావించినా ఆ తర్వాత పిచ్ మారిపోయింది. తొలి 5–6 ఓవర్లతో పాటు మ్యాచ్‌లో చాలా భాగం ముందంజలోనే ఉన్నాం. కానీ వాట్సన్ అంతా మార్చేశాడు. సీజన్ మొత్తం బాగా ఆడి ఇలా ఓడిపోవడం నిరాశగా ఉంది. మా కుర్రాళ్లు చాలా బాధపడుతున్నారు. అయితే మేం గెలవకపోయినా బాగా పోరాడాం. నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉండటం అదృష్టం. అయితే వెనుదిరిగి చూస్తే కొన్ని గుర్తుంచుకునే క్షణాలు ఉన్నా చివరకు ఓటమే దక్కింది. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా బాధ్యతగా రాణించడం సంతృప్తిగా ఉంది. జట్టు ఫైనల్ చేరడం సమష్టి కృషిగానే భావిస్తా’ – కేన్ విలియమ్సన్ ‘రషీద్లాగే భువనేశ్వర్ కూడా చాలా తెలివైన బౌలర్. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. మా బ్యాటింగ్ చాలా బాగా సాగింది. బలమైన మిడిలార్డర్‌ను నమ్ముకున్నాం. ప్రతీ విజయం ప్రత్యేకమే. ఏ ఒక్కటో గొప్పదని చెప్పలేను. నా దృష్టిలో వయసనేది ఒక అంకె మాత్రమే. 33 ఏళ్ల రాయుడు మా ప్రధాన బ్యాట్స్‌మన్. 19–20 ఏళ్ల కుర్రాళ్లు కాకపోయినా మైదానంలో చురుగ్గా ఉండగలవాళ్లే కావాలి. మాకు వయసుకంటే మా ఆటగాళ్ల గురించి, వారి ఫిట్నెస్ గురించి చక్కటి అవగాహన ఉంది కాబట్టి దానికి తగినట్లుగా వ్యూహాలు రూపొందించాం. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానులను కలుసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కప్‌తో చెన్నైకి తిరిగి వెళుతున్నాం.’ – ఎమ్మెస్ ధోని (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐపీఎల్ ఫైనల్; మీ ఓటు ఎవరికి?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రోజ రాత్రి 7 గంటలకు వాంఖెడే మైదానం వేదికగా జరిగే తుదిపోరులో విజయం ఏ జట్టు వరిస్తుందోనని క్రికెట్ అభిమానులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. లీగ్ దశలో పైచేయి సాధించిన ధోని సేనను ఓడించి కప్ అందుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. హైదరాబాద్‌పై తమ ఆధిపత్యం కొనసాగించి విజేతగా నిలవాలని సూపర్స్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఐపీఎల్ తుది సమరంపై సామాజిక మాధ్యమాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. ఇది బిర్యానీ, సాంబార్ మధ్య పోటీగా వర్ణిస్తున్నారు. సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ట్యాగ్ ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అటు బెట్టింగులు కూడా భారీ స్థాయిలో జరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఫైనల్ పోరు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా జరిగి వినోదాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
ఐపీఎల్ ఫైనల్లో 2.ఓ సినిమా టీజర్?
సాక్షి, సినిమా: ఐపీఎల్ క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) సెమీ ఫైనల్‌కి చేరింది. ఇంతకీ ఈ ఐపీఎల్‌కు 2.ఓ చిత్రానికి సంబంధం ఏమిటీ అనేగా మీ ఆలోచన. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కాలా చిత్రం వచ్చే నెల 7న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న మరో చిత్రం 2.ఓ. ఈ భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కాలా చిత్రం కంటే ముందుగా తెరపైకి రావాల్సి ఉండగా గ్రాఫిక్స్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల అలస్యమైంది. అదే విధంగా చిత్ర టీజర్‌ను విడుదలకు చిత వర్గాలు ప్లాన్ చేస్తున్న సమయంలోనే అది కాస్తా లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిత్ర యూనిట్‌కు షాక్‌కు గురైంది. దీంతో శంకర్ మరో టీజర్‌ను తయారు చేశారు. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి అలా సింపుల్‌గా 2.ఓ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తారా? అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఈ చిత్ర ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి లైకా సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2.ఓ చిత్ర టీజర్‌ను ఐపీఎల్ పైనల్ పోటీ వేదికగా జరిగే అవకాశం ఉందా? లేదా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. కెనడా బ్యూటీ ఎమీజాక్సన్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు శంకర్ అద్భుతంగా చెక్కుతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా 2.ఓ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఐపీఎల్ ఫైనల్: ముంబైలో కలవరం!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో తుది అంకానికి రెండుజట్లు రైజింగ్ పుణే సూపర్ జెయింట్, రెండుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ చేరుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణే వరుస విజయాలతో ఫైనల్ చేరగా, ముంబై మాత్రం కొన్ని విషయాలలో ఆందోళన చెందుతుంది. ముంబై ఇండియన్స్‌ను రెండు సెంటిమెంట్లు ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్లో పుణే చేతిలో మూడు పర్యాయాలు ఓడిపోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే.. లీగ్ దశలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడితే లీగ్‌లో రెండో స్థానంలో నిలిచన టీమ్‌ను ఐపీఎల్ కప్ వరిస్తుండటం ముంబైపై ఒత్తిడి పెంచుతుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లకుగానూ 10 మ్యాచ్‌లు నెగ్గి నాలుగింట్లో ఓడగా, రెండు పర్యాయాలు పుణే చేతిలో ఓటమి పాలవడం ఇప్పుడు ముంబై జట్టును కలవరపాటుకు గురిచేస్తుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ తమ చేతిలో ఓడిన ముంబైతో ఫైనల్ మ్యాచ్ కావడం పుణేలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. లీగ్ దశలో 20 పాయింట్లు, 18 పాయింట్లతో పట్టికలో ముంబై, పుణే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌తో సహా ఈ సీజన్లో తలపడిన మూడు పర్యాయాలు పుణే చేతిలో ముంబై ఓటమి పాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై నెగ్గి ముంబై ఫైనల్లోకి దూసుకెళ్లినా పుణే అడ్డంకిని అధిగమిస్తేనే వారు మూడోసారి చాంపియన్‌గా అవతరిస్తారు. మరోవైపు ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్) సంప్రదాయం ప్రవేశపెట్టిన 2011 ఏడాది నుంచి ఫైనల్ విజేతల వివరాలను గమనిస్తే ముంబైకి ఫైనల్ ఫీవర్ తప్పదని చెప్పవచ్చు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ (2), ఆర్సీబీ(1) తలపడగా చెన్నై నెగ్గింది. 2013 ఫైనల్లో ముంబై (2), సీఎస్కే(1) ఆడగా ముంబై టైటిల్ సాధించగా, 2014లో పంజాబ్(1)పై కేకేఆర్(2) విజయం సాధించగా, చివరగా 2015లో చెన్నై(1)ని ముంబై(2) ఓడించి సగర్వంగా కప్పును రెండో సారి అందుకుంది. ముంబై నెగ్గిన రెండు సీజన్లలోనూ లీగ్ లో చెన్నై(1)పైనే రెండో స్థానంలో ఉన్న ముంబై(2) గెలుపొందడం గమనార్హం. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలివే.. ⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై ⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్ ⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై ⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్ ⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై ⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్‌రైజర్స్ ⇒ 2017: పుణే(2) వర్సెస్ ముంబై ఇండియన్స్ (1) - విజేత ? -
నేడే చూడండి... మహా సంగ్రామం
-
నేడే చూడండి... మహా సంగ్రామం
♦ నేడు హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ ♦ ముంబై ఇండియన్స్‌తో రైజింగ్ పుణే ఢీ ♦ మూడో టైటిల్‌పై రోహిత్ సేన దృష్టి ♦ తొలి ట్రోఫీపై స్మిత్ బృందం గురి తొమ్మిదేళ్లలో రెండు సార్లు విజేతగా నిలిచి, మరోసారి ఫైనల్లో ఓడిన జట్టు ఒకవైపు... లీగ్‌లోకి అడుగు పెట్టిన రెండో ఏడాదే టైటిల్‌పై గురి పెట్టిన జట్టు మరోవైపు... అభిమానుల అంచనాలకు తగినట్లుగా రాణించి అగ్రస్థానంలో నిలిచిన టీమ్ ఒకవైపు... ఏడాది క్రితం పరాభవం నుంచి కోలుకొని, ఆపై అనూహ్యంగా దూసుకుపోయి పోటాపోటీగా రెండో స్థానంలో నిలిచిన టీమ్ మరోవైపు... ఐపీఎల్–10లో నిలకడగా రాణించిన రెండు జట్ల మ«ధ్యే అంతిమ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్లో రెండు మరాఠా జట్ల మధ్య పోరులో 3–0తో పుణేదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్‌ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు జరగబోయే ఈ మహా సంగ్రామంలో అంతిమ విజేత ఎవరో? సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ వినోదానికి రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2017 ఫైనల్లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచినా, తొలి క్వాలిఫయర్‌లో ముంబైనే చిత్తు చేసి పుణే ఫైనల్లోకి అడుగు పెట్టగా... టేబుల్ టాపర్ ముంబై రెండో క్వాలిఫయర్‌లో కోల్‌కతాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉండటంతో పాటు తాజా ప్రదర్శన అనంతరం మానసికంగా కూడా ఇరు జట్లు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా మూడు నాకౌట్ మ్యాచ్‌ల తరహాలో కాకుండా ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగాలని అంతా కోరుకుంటున్నారు. ఆ ఇద్దరు... ఎమ్మెస్ ధోనిని పుణే యాజమాన్యం కెప్టెన్‌గా తొలగించిందేమో గానీ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పించలేకపోయింది! ఈ సీజన్లో పుణే అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణేకు తిరుగుండదు. వీరిద్దరు బ్యాటింగ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. తొలి క్వాలిఫయర్‌లో ధోని బ్యాటింగ్ అతని సత్తాను మళ్లీ చూపించగా, స్మిత్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఓపెనింగ్‌కు తోడు రహానే కూడా వేగంగా ఆడటం అవసరం. ఈ సీజన్లో మధ్య ఓవర్లలో (7–15) పుణే బ్యాటింగ్ వేగం మరీ మందకొడిగా ఉంది. దీనిని సరిదిద్దాలంటే మిడిలార్డర్ రాణించాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లోనూ స్టోక్స్ అందుబాటులో లేకపోయినా గట్టెక్కిన పుణే, ఈ సారి ముంబైపై మరింత పదునైన వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. గత మ్యాచ్ నెగ్గిన జట్టులో పుణే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. విదేశీ ఆటగాళ్లలో క్రిస్టియాన్ చివరి ఓవర్లలో కీలకం కానున్నాడు. లీగ్ దశలో తమ చివరి పది మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి సూపర్ ఫామ్ కనబర్చిన పుణే, ఆ తర్వాత క్వాలిఫయర్‌లో కూడా చెలరేగింది. తమ టైటిల్ కలను నిజం చేసే మరో విజయం కోసం ఆ జట్టు ఎంతగా శ్రమిస్తుందో చూడాలి. అంతా బాగుంది... పవర్‌ప్లేలో ప్రత్యర్థికి అతి తక్కువ పరుగులు ఇచ్చి బ్యాటింగ్ సమయంలో మాత్రం చివరి 5 ఓవర్లలో చితక్కొట్టడంలో ఈ సీజన్లో ముంబై విజయమంత్రం దాగి ఉంది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ 43 ఫోర్లు బాదితే, సిక్సర్లే 45 కొట్టడం విశేషం. ఇక బౌలింగ్‌లో ముఖ్యంగా మెక్లీనగన్, బుమ్రా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు రాణించడంతో మలింగ వైఫల్యం పెద్దగా కనపడలేదు. తన ఐపీఎల్ కెరీర్లో మలింగ ఇంతగా ఎప్పుడూ విఫలం కాలేదు. మెక్లీనగన్ కోలుకుంటే అతడిని తుది జట్టులోకి తీసుకుంటారా లేక జాన్సన్‌ను కొనసాగిస్తారా చూడాలి. గత మ్యాచ్‌లో చెలరేగిన కరణ్ శర్మకు ఉప్పల్ మైదానంలో అందరికంటే ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్‌లో కూడా ముంబైకి తిరుగులేదు. సిమన్స్ విఫలమవుతున్నా, ఫైనల్ పోరులో మాత్రం జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. రోహిత్ ఫామ్‌లోకి రాగా.. రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌ల మెరుపులు ముంబైకి భారీ స్కోరు అందించగలవు. అన్నింటికీ మించి వీరిలో తొమ్మిది మందికి ఐపీఎల్ ఫైనల్లో ఆడి ఒత్తిడిని తట్టుకున్న అనుభవం ఉండటం కూడా ముంబైకి అదనపు బలంగా మారనుంది. పదేళ్ల ఐపీఎల్లో అటు ఆటతో పాటు ఇటు భారీ బలగంతో కూడా అందరినీ ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్, మిగతా జట్లను వెనక్కి తోస్తూ ముచ్చటగా మూడో టైటిల్ గెలిస్తే అది సరైన ముగింపు అవుతుంది. ♦ గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేదు. ఫైనల్ అంటే ఫైనలే. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే విజేతగా నిలుస్తారు. –స్మిత్ ♦ పుణేపై మాకు రికార్డు బాగా లేదు. అయితే ఏ ఒక్కరి పైనో ఆధారపడకుండా సమష్టిగా ఆడి ఫైనల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంది. –రోహిత్ శర్మ రాత్రి గం. 8 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం సాధారణ టి20 తరహా బ్యాటింగ్ పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ సీజన్లో అటు పెద్ద స్కోర్లు, ఇటు తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. ఆటగాళ్ల ప్రతిభ మినహా మ్యాచ్ ఫలితాలపై అసాధారణంగా పిచ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం నగరంలో తీవ్రమైన ఎండ. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం లేదు. ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లలో ఒకసారి మాత్రమే కొద్దిసేపు వాన అడ్డు పడినా, ఓవర్ల కోత లేకుండా పూర్తి మ్యాచ్ సాగింది. ⇔ ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. గతంలో 2010లో చెన్నై చేతిలో ఓడిన జట్టు... 2013, 2015లలో చెన్నైనే ఓడించి విజేతగా నిలిచింది. ⇔ ధోని ఐపీఎల్ ఫైనల్ ఆడటం ఇది ఏడో సారి. రెండు సార్లు (2010, 2011) టైటిల్ గెలిచిన జట్టుకు అతను కెప్టెన్. ⇔ ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న అతి పిన్న వయస్కుడు వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 228 రోజులు) తుది జట్ల వివరాలు (అంచనా) రైజింగ్ పుణే సూపర్ జెయింట్: స్మిత్ (కెప్టెన్), రహానే, త్రిపాఠి, మనోజ్ తివారి, ధోని, క్రిస్టియాన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గూసన్, జంపా, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్ పటేల్, అంబటి రాయుడు, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, జాన్సన్/మెక్లీనగన్, కరణ్ శర్మ, బుమ్రా, మలింగ. -
ఆ రోజు ఐపీఎల్ ఫైనల్ జరగకపోతే..
ముంబై: తాజా ఐపీఎల్-10 సీజన్లో ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌డే ఖరారుచేశారు. మే 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఏదేని కారణాల వల్ల ఆ రోజు మ్యాచ్ నిర్వహణ సాధ్యం అవకపోతే అభిమానులు నిరుత్సాహ పడనక్కర్లేదు. ఆ మరుసటి రోజు అంటే మే 22వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. అయితే అంతకుముందు జరగనున్న లీగ్‌లోని మూడు ప్లే ఆఫ్ మ్యాచ్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉండదని బీసీసీఐ వెల్లడించింది. తొలి క్వాలిఫయర్ మే 16న ముంబైలో, ఎలిమినేటర్ మ్యాచ్ మే 17న బెంగళూరులో నిర్వహించనున్నారు. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే మే 19న నిర్వహిస్తారు. మే 21న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియం వేదిక కానున్న విషయం తెలిసిందే. -
ధావన్.. ఇప్పటికైనా ఆడు బాబూ!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఒడిదుడుకులు తప్పడం లేదు. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఓపెనర్‌గా ఆడుతున్న ఈ క్రికెటర్ ఇప్పటివరకు ఐపీఎల్లో 16 మ్యాచ్‌లు ఆడి.. 39.41 సగటుతో 473 పరుగులు చేశాడు. ధావన్ స్థాయి ఆటగాడికి ఇది తక్కువ స్కోరే అని చెప్పాలి. గత ఐసీసీ టీ20 వరల్ కప్ నుంచి ధావన్ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 43 పరుగులు చేసిన ఈ ధనాధన్ బ్యాట్స్‌మన్ ఇటు ఐపీఎల్‌లోనూ వరుసగా విఫలమవుతూ హైదరాబాద్ జట్టు సారథి డేవిడ్ వార్నర్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. తాజాగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ డకౌట్ అయి ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ వార్నర్ కడదాక నిలబడి 93 పరుగులు చేయడంతో సరిపోయిందిగానీ లేకపోతే ధావన్ వికెట్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగానే ఉండేది. ఈ నేపథ్యంలో పడుతూ లేస్తూ.. తడబడుతున్న ధావన్ ఆటతీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. 'ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. పలువురు ఇండియన్ క్రికెటర్లను తీసుకోవడం జట్టుకు కలిసి వచ్చింది. ఆశిష్ నెహ్రా గాయంతో వైదొలిగాడు కానీ అతను ఉండి ఉంటే జట్టు బౌలింగ్ అటాక్ ఇంకా మెరుగ్గా ఉండేది. ఇక శిఖర్ ధావన్ జట్టు కోసం పరుగులు చేయాల్సిన అవసరముంది. ఇప్పటికైనా అతను ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్‌కు ధావన్ కీలక బ్యాట్స్‌మన్. అదేవిధంగా ఈ టోర్నమెంటులోనూ అతను కీలకం. ఫస్ట్ క్వాలిఫైయర్‌లోనూ, సెకండ్ క్వాలిఫైయర్‌లోనూ అతను అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. కనీసం ఫైనల్లోనైనా ఆడి డేవిడ్ వార్నర్, జట్టుకు అండగా నిలుస్తాడని ఆశిస్తున్నా' అని గంగూలీ ఓ టీవీ చానెల్‌తో పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చాలామంది తక్కువ స్కోర్లకు వెనుదిగిరినా డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ఆడాడని, అతడికి చివరిలో బిపుల్ శర్మ నుంచి తగిన మద్దతు లభించడంతో ఒత్తిడిలోనూ హైదరాబాద్ మధురమైన విజయాన్ని అందుకుందని గంగూలీ కొనియాడాడు. -
కోహ్లికి వార్నర్ వార్నింగ్!
సమర్థమైన గేమ్ ప్లాన్‌తో ఫైనల్‌కు సిద్ధమవుతున్నామని వ్యాఖ్య జట్టు సారథిగా డేవిడ్ వార్నర్ సత్తా చాటాడు. ఆసాంతం నిలకడగా ఆడుతూ.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ.. శుక్రవారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ సారథి విశ్వరూపం చూపాడు. వార్నర్ కడదాక నిలబడి 93 పరుగులు చేయడంతో గుజరాత్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఛేదించింది. చివర్లో బిపుల్ శర్మ (27 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఘనంగా హైదరాబాద్ ఫైనల్ లో అడుగుపెట్టింది. దీంతో దీటైన సారథుల నేతృత్వంలోని హైదరాబాద్-బెంగళూరు జట్ల మధ్య తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఇటు డేవిడ్ వార్నర్, అటు విరాట్ కోహ్లి ఇద్దరూ భీకరమైన ఫామ్‌తో విజృంభిస్తుండటంతో ఫైనల్ రసవత్తరంగా జరుగుతుందని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి సేనను నిలువరించడానికి తాము సమర్థవంతమైన గేమ్ ప్లాన్‌తో సిద్ధమవుతామని హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ అన్నాడు. మ్యాచ్ తర్వాత అతను విలేకరులతో మాట్లాడాడు. ఫైనల్లో కోహ్లిపైనే టార్గెట్! 'బెంగళూరుతో చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో చాలా బాగా పుంజుకున్నాం. విరాట్ కోహ్లి నిజానికి అద్భుతమైన ఆటగాడు. మేం అతన్ని తర్వగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. కోహ్లి విఫలమైనా డివిలీయర్స్ ఉండనే ఉంటాడు. కాబట్టి మేం వాళ్ల జట్టులో ఉన్న ఆటగాళ్ల గురించి పెద్దగా చింతించడం లేదు. వారిని నిలువరించాలంటే సమర్థమైన గేమ్ ప్లాన్ కావాలి. దానిని మేం సిద్ధం చేసుకుంటాం' అని వార్నర్ అన్నాడు. ఈ విజయం క్రెడిట్ నాది కాదు! 'మ్యాచ్ ఆసాంతం భాగస్వామ్యాలు కొనసాగేలా చూశాను. మాలో ఏ ఒక్కరూ క్రీజులో ఉన్నా.. మేం గెలుస్తామని భావించాను. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్. ఈ (విజయం) క్రెడిట్‌ను నేను తీసుకోను. మేం అందరం శాయశక్తులా కృషి చేసి మా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంది. ఇక బిపుల్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సత్తా చాటాడు' అని వార్నర్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్-7 ఫైనల్: బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్
బెంగళూరు: అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ -7 గ్రాండ్ ఫైనల్ ఆరంభమైంది. ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్‌ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ఇక్కడి చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ ఓపెనర్లు సెహ్వాగ్, మనన్ వోహ్రా బ్యాటింగ్‌కు దిగారు. పంజాబ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఫామ్‌లో ఉండగా, విధ్వంసక వీరుడు సెహ్వాగ్ కూడా జత కలిశాడు. ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తూ భారీ స్కోర్లు సాధిస్తున్న పంజాబ్‌పై అంచనాలున్నాయి. ఐపీఎల్లో పంజాబ్ ఫైనల్ చేరడమిదే తొలిసారి కాగా.. కోల్‌కతా రెండేళ్ల క్రింత టైటిల్ నెగ్గింది. -
ఐపీఎల్ : ఏడెవరికో.. ఏడుపెవరికో..!
-
ఐపీఎల్ ఫైనల్ బెంగళూరులో
న్యూఢిల్లీ: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) పెద్ద ఝలక్ ఇచ్చింది. జూన్ 1న జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌ను వాంఖడే నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలించింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో ఒకదాన్ని ఈడెన్ గార్డెన్స్‌లో, ఎలిమినేటర్ మ్యాచ్‌ను బ్రబౌర్న్‌లో నిర్వహించనున్నారు. శనివారం జరిగిన ఐపీఎల్ జీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వేదిక మార్పుకు సంబంధించి స్పష్టమైన కారణాన్ని బీసీసీఐ వెల్లడించకపోవడంతో ఎంసీఏ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్‌కు లేఖ రాసింది. వేదిక మార్పుపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన వ్యక్తులు కూడా నోరు మెదపడం లేదు. అయితే వాంఖడే ఆతిథ్య బాక్స్‌లో సౌకర్యాలు బాగాలేవని, మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే ఉన్నతస్థాయి వ్యక్తుల ముందు ఇది చిన్నచూపుగా ఉంటుందని బోర్డు చెబుతోంది. బీసీసీఐ సభ్యులకు వీవీఐపీ కారు పార్కింగ్ పాస్‌లను ఇవ్వడంలో ఎంసీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాదిస్తోంది. పొలార్డ్ (ముంబై), స్టార్క్ (బెంగళూరు)ల గొడవపై కూడా జీసీలో చర్చించారు. సభ్యులందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.