![Sunrisers Hyderabad cancel practice ahead of IPL 2024 final against Kolkata Knight Riders](/styles/webp/s3/article_images/2024/05/25/sun.gif.webp?itok=Gk5N7S6A)
ఐపీఎల్-2024లో తుది పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఈ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శనివారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను ఎస్ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది.
చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఎస్ఆర్‌హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ పోరులో కేకేఆర్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.
కాగా శుక్రవారం చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించి.. ఫైనల్ పోరకు అర్హత సాధించింది.
చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. బట్లర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment