హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఊదిపడేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
కేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫయర్1లో ఓటమి పాలైన ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది.
మే 24న జరగనున్న క్వాలిఫయర్-2లో ఆర్సీబీ లేదా రాజస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.
మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్
"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మాకు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్ ఉంది. సెకెండ్ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.
ప్రస్తుత టీ20 క్రికెట్‌లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్ ఇచ్చాం.
కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది.
ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment