ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ సునాయసంగా చేధించింది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇక పంజాబ్‌పై విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు.
"మా హోం గ్రౌండ్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టును సపోర్ట్ చేసేందుకు మైదానంకు వచ్చిన అభిమానులందరికి ధన్యవాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్‌ను ఎక్కడ నేను చూడలేదు.
మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించాము. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే.
అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసానికి ప్రతీ ఒక్క బౌలర్ భయపడాల్సిందే. నేను కూడా అభిషేక్‌కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అతడు స్వేచ్ఛగా ఆడుతాడు.
ఇక నితీష్ ఒక యువ సంచలనం. అతడొక ఒక క్లాస్ ప్లేయర్. అతడి తన అనుభవానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్‌లో కీలక ఆటగాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment