play offs
-
పాక్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్వదేశీ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. సహజంగా ఇతర దేశాల ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఈసారి ఓ విషయంలో స్వదేశీ బోర్డుపై దుమ్మెత్తిపోశాడు.వివరాల్లోకి వెళితే.. టీ20 వరల్డ్‌కప్ 2024 దృష్ట్యా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా నిషేధాజ్ఞలు విధించింది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో పాక్‌తో జరిగే టీ20 సిరీస్‌లో తప్పక పాల్గొనాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో జోస్ బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్ (ఆర్సీబీ), ఫిల్ సాల్ట్ (కేకేఆర్) లాంటి ఆటగాళ్లు కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా ఈసీబీ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడ్డాడు. మెగా టోర్నీకి ముందు పాక్ లాంటి జట్టుతో స్వదేశంలో సిరీస్ ఆడేకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటేనే ఇంగ్లండ్‌కు మంచి జరిగి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బట్లర్, జాక్స్, సాల్ట్‌లకు భారీ జనసమూహాల మధ్య ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసుండేదని అన్నాడు.ప్రపంచకప్‌కు ముందు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని ఈసీబీ చేజేతులారా జారవిడ్చుకుందని ధ్వజమెత్తాడు. స్వదేశీ ఆటగాళ్ల విషయంలో ఈసీబీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిందో అర్దం కావట్లేదని మండిపడ్డాడు.కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశంలో పాక్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు 28, 30 తేదీల్లో జరుగనున్నాయి. జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో పోటీపడుతున్నాయి. పాక్.. భారత్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో, ఇంగ్లండ్.. ఆసీస్, ఒమన్, నమీబియా, స్కాట్లాండ్లతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్రనిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్సీ.. అశ్విన్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్‌తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ కాగా.. కార్తీక్ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(17) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్సీ(32) నాలుగో స్ధానంలో నిలిచాడు. -
అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఊదిపడేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫయర్1లో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. మే 24న జరగనున్న క్వాలిఫయర్-2లో ఆర్సీబీ లేదా రాజస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మాకు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్ ఉంది. సెకెండ్ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్ ఇచ్చాం. కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
సన్‌రైజర్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్
IPL 2024: KKR vs SRH ipl qualifier 1 live updates:సన్‌రైజర్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కేకేఆర్‌ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్.. 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.రెండో వికెట్ డౌన్... నరైన్ ఔట్67 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహ్మతుల్లా గుర్భాజ్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(12), నరైన్(12) పరుగులతో రాణించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(12), సునీల్ నరైన్(9) పరుగులతో ఉన్నారు.నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఎస్ఆర్హెచ్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 123/7సన్‌రైజర్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 14వ ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలుత రాహల్ త్రిపాఠి(55) రనౌట్ కాగా.. ఆ తర్వాతి బంతికే సన్వీర్ సింగ్ ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.ఐదో వికెట్ డౌన్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో సన్‌రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 115/5నిలకడగా ఆడుతున్న క్లాసెన్, త్రిపాఠి10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(30), రాహుల్ త్రిపాఠి(45) పరుగులతో ఉన్నారు.నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ దాటికి కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(24), హెన్రిచ్ క్లాసెన్(5) ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్‌అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అబిషేక్.. ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(220, నితీష్ కుమార్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. తొలి ఓవర్ ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.ఐపీఎల్-2024లో తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కేకేఆర్ జట్టులోకి ఫిల్ సాల్ట్ స్ధానంలో గుర్భాజ్ వచ్చాడు. ఈ మ్యాచ్‌లో విజయంలో సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిసన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సన్ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్‌రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్. కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101. -
అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ సునాయసంగా చేధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇక పంజాబ్‌పై విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."మా హోం గ్రౌండ్లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టును సపోర్ట్ చేసేందుకు మైదానంకు వచ్చిన అభిమానులందరికి ధన్యవాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్‌ను ఎక్కడ నేను చూడలేదు. మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించాము. ఈ సీజన్లో ఇప్పటివరకు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసానికి ప్రతీ ఒక్క బౌలర్ భయపడాల్సిందే. నేను కూడా అభిషేక్‌కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అతడు స్వేచ్ఛగా ఆడుతాడు. ఇక నితీష్ ఒక యువ సంచలనం. అతడొక ఒక క్లాస్ ప్లేయర్. అతడి తన అనుభవానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్లో కీలక ఆటగాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
బెంగళూరు అద్భుతం
బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు... ఐపీఎల్ ప్రమాణాలు, ఈ సీజన్లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. యశ్ దయాళ్ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్‌గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్ సింగిల్ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. టోర్నీ తొలి 8 మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆర్సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ మాత్రమే! బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. కోహ్లి, డుప్లెసిస్ దూకుడు రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్‌ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. జడేజా, సాన్‌ట్నర్ బౌలింగ్‌లో సిక్స్‌లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. పటిదార్ క్రీజులోకి రాగా డుప్లెసిస్... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సందేహాస్పద రనౌట్‌తో డుప్లెసిస్ క్రీజ్ వీడాడు. ఈ దశలో లైఫ్ వచ్చిన గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పటిదార్‌తో కలిసి ధనాధన్ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం. రాణించిన రచిన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాక్స్‌వెల్ తొలి బంతికే కెప్టెన్ రుతురాజ్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాత మిచెల్ (4) కోహ్లి క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్ రవీంద్ర వికెట్‌కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. రచిన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్ రనౌట్ కాగా, దూబే (7)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. సాన్‌ట్నర్ (3)ను డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు రేపారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 47; డుప్లెసిస్ రనౌట్ 54; పటిదార్ (సి) మిచెల్ (బి) శార్దుల్ 41; గ్రీన్ నాటౌట్ 38; దినేశ్ కార్తీక్ (సి) ధోని (బి) తుషార్ 14; మ్యాక్స్‌వెల్ (సి) ధోని (బి) శార్దుల్ 16; మహిపాల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్: తుషార్ 4–0–49–1, శార్దుల్ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్‌ట్నర్ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్జీత్ 1–0–19–0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) యశ్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రచిన్ రనౌట్ 61; మిచెల్ (సి) కోహ్లి (బి) యశ్ 4; రహానె (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 33; దూబే (సి) ఫెర్గూసన్ (బి) గ్రీన్ 7; జడేజా నాటౌట్ 42; సాన్‌ట్నర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 3; ధోని (సి) స్వప్నిల్ (బి) యశ్ 25; శార్దుల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–25–1, సిరాజ్ 4–0–35–1, యశ్ 4–0–42–2, స్వప్నిల్ 2–0–13–0, కరణ్ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్ 3–0–39–1, గ్రీన్ 2–0–18–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X పంజాబ్‌వేదిక: హైదరాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచిరాజస్తాన్ X కోల్‌కతావేదిక: గువహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024- SRH: ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్‌పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్‌గాంధీ స్టేడియంలో కూడా అవుట్‌ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పేశారు. అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా... నిర్ణీత రాత్రి 7:30 గంటల సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరు చినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 గంటలకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీమ్‌కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్‌రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచి... అదే రోజు రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ చివరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓడితే సన్‌రైజర్స్‌కు రెండో స్థానం ఖాయమవుతుంది. 2020లో చివరిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2021, 2022, 2023 సీజన్లలో వరుసగా 8వ, 8వ, 10వ స్థానాల్లో నిలిచింది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించి తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఢిల్లీకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది.ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడంతో ఢిల్లీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఒక ఈ మ్యాచ్ జరిగి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలై ఉంటే మాథ్యమేటికల్‌గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో పంత్ సేన ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఏడింట విజయాలు, ఏడింట ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 5వ స్ధానంతో సరిపెట్టుకుంది. -
ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్‌రైజర్స్! నేరుగా..
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయిన రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనేలీగ్ దశలో రాజస్తాన్‌కు ఇంకొక్క మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సంజూ సేన మే 19న తలపడనుంది. అయితే, కేకేఆర్‌తో పాటు రాజస్తాన్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరినా.. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే రాజస్తాన్ రెండో స్థానంలో నిలవగలుగుతుంది.అప్పుడు నేరుగా కేకేఆర్‌తో క్వాలిఫయర్-1 ఆడుకోవచ్చు. లేదంటే ఎలిమినేటర్ గండం దాటాల్సి ఉంటుంది. ఇక రాజస్తాన్ ఇలా చిక్కుల్లో పడటం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాలిట వరంలా మారింది.సన్‌రైజర్స్ పాలిట వరం.. ఎందుకంటే?లీగ్ దశలో హైదరాబాద్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్(మే 16), పంజాబ్ కింగ్స్(మే 19)న ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ రెండింటికి రెండూ గెలిస్తే రైజర్స్ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి.సొంతమైదానం ఉప్పల్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనుండటం, ఇప్పటికే సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీకి ఉన్న విధ్వంసకర రికార్డు చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.ఒక్కటి ఓడినా కూడాఅలా కాకుండా.. రాజస్తాన్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడి.. సన్‌రైజర్స్ కూడా ఈ రెండింటిలో ఒకటి ఓడితే.. అప్పుడు కూడా హైదరాబాద్ జట్టు టాప్-2తో ముగించే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు(16) వచ్చినా రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్ ముందుంటే రాజస్తాన్‌ను వెనక్కినెట్టడం ఖాయం. అప్పుడు పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్థానానికి చేరితే క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది.అలా అయితే మొదటికే మోసం మరి!అలా కాకుండా ఆఖరి రెండు మ్యాచ్‌లూ ఓడిపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. కేకేఆర్- రాజస్తాన్, చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదీ సంగతి!ఐపీఎల్-2024 పాయింట్ల పట్టిక(మే 15 నాటికి)లో టాప్-5 ఇలా:1. కేకేఆర్- ఆడినవి 13.. గెలిచినవి 9.. పాయింట్లు 19.. నెట్ రన్‌రేటు 1.428(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)2. రాజస్తాన్- ఆడినవి 13.. గెలిచినవి 8.. పాయింట్లు 16.. నెట్ రన్‌రేటు 0.273(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)3. చెన్నై సూపర్ కింగ్స్- ఆడినవి 13.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్‌రేటు 0.5284. సన్‌రైజర్స్- ఆడినవి 12.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్‌రేటు.. 0.406.5. ఆర్సీబీ- ఆడినవి 13.. గెలిచినవి 6.. పాయింట్లు 12.. నెట్ రన్‌రేటు.. 0.387.విజేతకు దారిలా👉 క్వాలిఫయర్-1(మే 21): టాప్-2 జట్ల మధ్య.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి..👉ఎలిమినేటర్(మే 22): టాప్-3, 4 లో ఉన్న జట్ల మధ్య.. ఓడిన జట్టు ఇంటికి.. 👉గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతుంది.👉క్వాలిఫయర్-2(మే 24): గెలిచిన జట్టు ఫైనల్లో అడుగుపెడుతుంది.👉ఫైనల్(మే 26): క్వాలిఫయర్-1- క్వాలిఫయర్-2 మధ్య పోరు. గెలిచిన జట్టు చాంపియన్.చదవండి: Virat Kohli: కోహ్లి నోట రిటైర్మెంట్ మాట.. ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే! -
IPL 2024: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్‌రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ నెట్ రన్‌రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్‌లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్‌రైజర్స్ మ్యాచ్‌ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్‌రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్‌లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్‌రైజర్స్ గురువారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారుఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.సీజన్ మొత్తం మాకు అదే సమస్యనిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.స్టొయినిస్, పూరన్‌లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం.. ఢిల్లీ👉టాస్: లక్నో.. బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)👉లక్నో స్కోరు: 189/9 (20)👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK— IndianPremierLeague (@IPL) May 15, 2024 -
IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. పటిదార్ ఫటాఫట్... డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మహిపాల్ సిక్స్‌లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. అక్షర్ ఒక్కడే! లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0. -
IPL 2024 CSK Vs RR: గెలిచి నిలిచిన చెన్నై
చెన్నై: రాజస్తాన్ రాయల్స్... చెన్నై సూపర్‌కింగ్స్! మొదటి జట్టు గెలిస్తే నేరుగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుంది. రెండో జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ వేటలో ముందడుగు వేస్తుంది. అలా కీలకమైన ఈ పోరులో సొంతగడ్డపై చెన్నై... పేస్ బౌలింగ్‌తో కట్టడి చేసి... అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించి రాయల్స్‌కు చెక్ పెట్టి... ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేయగలిగింది. రియాన్ పరాగ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... మరెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. చెన్నై పేస్ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిమర్జీత్ సింగ్ (3/26), తుషార్ దేశ్‌పాండే (2/30) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్) కుదురుగా ఆడాడు. రాజస్తాన్ స్పిన్నర్ అశి్వన్‌కు 2 వికెట్లు దక్కాయి. జోరు తగ్గిన రాజస్తాన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో హోరెత్తించింది. కానీ ఈ మ్యాచ్‌లో బోర్ కొట్టించింది. యశస్వి (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు), కెప్టెన్ సంజూ సామ్సన్ (19 బంతుల్లో 15) ఇలా టాపార్డర్ వన్డేను తలపించే ఆటే ఆడటంతో పరుగుల్లో వెనుకబడింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (18 బంతుల్లో 28; 1 ఫోర్లు, 2 సిక్స్)లు కొట్టిన ఆ కాస్తా సిక్సర్లతో ఓ మోస్తరు స్కోరే చేసింది. కనీసం 150 పరుగుల మార్క్ అయిన దాటలేకపోవడంతో చెన్నైకి వారి సొంతగడ్డపై సులువైన లక్ష్యం అయ్యింది. నడిపించిన నాయకుడు రచిన్ రవీంద్ర (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లో ఇన్నింగ్స్ ఆరంభించిన కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ అసాంతం ఒపిగ్గా ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో మిచెల్ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), శివమ్ దూబే (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... లక్ష్యం చిన్నదైనా... రుతురాజ్ మాత్రం గెలిచేదాకా జాగ్రత్త పడ్డాడు. రిజ్వీ (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో 10 బంతులు మిగిలుండగానే చెన్నై లక్ష్యాన్ని చేరింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 24; బట్లర్ (సి) తుషార్ (బి) సిమర్జీత్ 21; సామ్సన్ (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 15; పరాగ్ (నాటౌట్) 47; జురెల్ (సి) శార్దుల్ (బి) తుషార్ 28; శుభమ్ (సి) దూబే (బి) తుషార్ 0; అశి్వన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–43, 2–49, 3–91, 4–131, 5–131. బౌలింగ్: తుషార్ 4–0–30–2, తీక్షణ 4–0–28–0, శార్దుల్ 4–0–32–0, సిమర్జీత్ 4–0–26–3, జడేజా 4–0–24–0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి అండ్ బి) అశి్వన్ 27; రుతురాజ్ (నాటౌట్) 42; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; మొయిన్ అలీ (సి) అవేశ్ ఖాన్ (బి) బర్గర్ 10; దూబే (సి) పరాగ్ (బి) అశి్వన్ 18; జడేజా (అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్) 5; సమీర్ రిజ్వీ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.2 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–32, 2–67, 3–86, 4–107, 5–121. బౌలింగ్: బౌల్ట్ 2.2–0–24–0, సందీప్ శర్మ 3–0–30–0, అశ్విన్ 4–0–35–2, బర్గర్ 3–0–21–1, చహల్ 4–0–22–1, అవేశ్ ఖాన్ 2–0–12–0. -
‘ప్లేఆఫ్స్’కు కోల్‌కతా
కోల్‌కతా: ఈ సీజన్ ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. శనివారం జరిగిన పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. భారీ వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా మొదలవడంతో 16 ఓవర్లకు కుదించారు. ముందుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అనంతరం ముంబై ఇండియన్ 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌వర్మ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మెరిపించిన వెంకటేశ్ ఇన్నింగ్స్ తొలిబంతికే సిక్సర్ బాదిన సాల్ట్ (6)ను ఐదో బంతికే తుషార అవుట్ చేయగా, మరో ప్రమాదకర ఓపెనర్ సునీల్ నరైన్ (0) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో వెంకటేశ్ 4, 6, 4 బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7)ను అన్షుల్ బౌల్డ్ చేసి ముంబై శిబిరాన్ని మురిపించాడు. పవర్‌ప్లే 5 ఓవర్లలో నైట్‌రైడర్స్ 45/3 స్కోరు చేసింది. ఆరో ఓవర్లో జట్టు స్కోరు 50 దాటగా... నితీశ్ రాణా, వెంకటేశ్‌ల దూకుడుతో కోల్‌కతా ఇన్నింగ్స్ పుంజుకుంది. వెంకటేశ్ ధాటికి చావ్లా అడ్డుకట్ట వేయగా, రసెల్ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాకతో నైట్‌రైడర్స్ 10.2 ఓవర్లలో వంద పరుగులు దాటింది. అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును పెంచుతున్న నితీశ్ రాణాను తిలక్ వర్మ చక్కని త్రో రనౌట్ చేయగా, ఓవర్ వ్యవధిలో రసెల్ మెరుపులకు చావ్లా కళ్లెం వేశాడు. తర్వాత ఆఖరి ఓవర్లలో రింకూ సింగ్ (12 బంతుల్లో 20; 2 సిక్స్‌లు), రమణ్‌దీప్ సింగ్ (8 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లు కూడా ధాటిని ప్రదర్శించడంతో ప్రత్యర్థి ముందు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన ఇషాన్ ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (24 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ముంబైకి చక్కని ఆరంభాన్నే ఇచ్చారు. ఓ వైపు రోహిత్ కుదురుగా ఆడుతుంటే మరోవైపు కిషన్ చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. 5 ఓవర్ల పవర్‌ప్లేలో ముంబై 59/0 స్కోరు చేసింది.అయితే ఇంత చక్కని శుభారంభానికి కోల్‌కతా స్పిన్నర్లు తూట్లు పొడిచారు. వరుస ఓవర్లలో నరైన్, ఇషాన్‌ను... రోహిత్‌ను వరుణ్ అవుట్ చేయడంతో ముంబై రూటు మారింది. రసెల్ బంతినందుకొని హిట్టర్లు సూర్యకుమార్ (11), టిమ్ డేవిడ్ (0)లను అవుట్ చేయడంతోనే ముంబై లక్ష్యానికి దూరమైంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అన్షుల్ (బి) తుషార 6; నరైన్ (బి) బుమ్రా 0; వెంకటేశ్ (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 42; శ్రేయస్ (బి) అన్షుల్ 7; నితీశ్ రనౌట్ 33; రసెల్ (సి) అన్షుల్ (బి) చావ్లా 24; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 20; రమణ్‌దీప్ నాటౌట్ 17; స్టార్క్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–6, 2–10, 3–40, 4–77, 5–116, 6–125, 7–148. బౌలింగ్: తుషార 3–0–31–1, బుమ్రా 4–0–39–2, అన్షుల్ 3–0–24–1, హార్దిక్ 3–0–32–0, పియూశ్ చావ్లా 3–0–28–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రింకూ (బి) నరైన్ 40; రోహిత్ (సి) నరైన్ (బి) వరుణ్ 19; సూర్యకుమార్ (సి) రమణ్‌దీప్ (బి) రసెల్ 11; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 32; హార్దిక్ (సి) వైభవ్ (బి) వరుణ్ 2; డేవిడ్ (సి) శ్రేయస్ (బి) రసెల్ 0; నేహల్ రనౌట్ 3; నమన్ (సి) రింకూ (బి) హర్షిత్ 17; అన్షుల్ నాటౌట్ 2; చావ్లా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–65, 2–67, 3–87, 4–91, 5–92, 6–117, 7–136, 8–137 బౌలింగ్: వైభవ్ 2–0–16–0, స్టార్క్ 1–0–11–0, హర్షిత్ 3–0–34–2, నరైన్ 3–0–21–1, వరుణ్ 4–0–17–2, రసెల్ 3–0–34–2. ఐపీఎల్లో నేడుచెన్నై X రాజస్తాన్‌వేదిక: చెన్నైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి బెంగళూరు X ఢిల్లీవేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అలా అయితేనే ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా.. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్కేపై తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవం చేసుకున్నాయి.మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌పై కన్నేశాయి. ఇక ఇప్పటికే రన్‌రేటు పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్(16 పాయింట్లు) రెండో స్థానం ఆక్రమించింది.మూడో స్థానం కోసం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్(12 పాయింట్లు)ను వెనక్కి నెట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్(14 పాయింట్లు) ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌నకు సంబంధించిన కొన్ని సమీకరణలు ఇలా ఉన్నాయి.కేకేఆర్.. టాప్ఇప్పటికే టాప్-1లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. సొంతమైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో రెండు పాయింట్లు ఖాతాలో పడతాయి.ఫలితంగా 18 పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలా కాక ముంబైతో కాకుండా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో ఏ ఒక్కటి గెలిచినా బెర్తు ఖాయమే!అయితే, ఇక్కడో మెలిక ఉంది. రాజస్తాన్, సీఎస్కే, సన్‌రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు 18 పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్‌లో ఓడినా రాజస్తాన్‌పై మాత్రం కచ్చితంగా గెలవాలి.రాజస్తాన్.. రైట్ రైట్చెన్నై, పంజాబ్, కేకేఆర్ రూపంలో రాజస్తాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా, కేకేఆర్, సీఎస్కే, లక్నో/సన్రైజర్స్లలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా రాజస్తాన్ బెర్త్ ఖరారవుతుంది.టాప్-2లో నిలవాలంటే కేకేఆర్‌ను మాత్రం ఓడించడం తప్పనిసరి.సన్‌రైజర్స్ రైజ్ అవ్వాలంటే!సన్‌రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ గెలిస్తే సన్‌రైజర్స్ టాప్-4కు అర్హత సాధిస్తుంది. ఏ ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పని దుస్థితి ఎదురవుతుంది.చెన్నై చమక్ అనాలంటే!డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్కే కాస్త డీలా పడింది. ప్రస్తుతం సీఎస్కేకు రాజస్తాన్, ఆర్సీబీలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సీఎస్కే ప్రయాణా సాఫీగా సాగుతుంది. లేదంటే.. లేదంటే ఢిల్లీ, లక్నోతో సీఎస్కే పోటీపడాల్సి ఉంటుంది. అయితే, రన్‌రేటు పరంగా సీఎస్కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.ఢిల్లీ దబాంగ్ అనిపించుకోవాలంటే..ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో గెలవడం సహా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో చెన్నై, ఢిల్లీతో సమానంగా ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి ఉంది రాహుల్ సేన.కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్-4లో ఉన్న కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్, చెన్నై వీలైనన్ని మ్యాచ్‌లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి.ఆర్సీబీ, గుజరాత్ పరిస్థితి ఇదీ!ఆర్సీబీకి ఢిల్లీ, సీఎస్కేలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కచ్చితంగా గెలిచి.. నెట్ రన్‌రేటు పరంగా మిగతా జట్ల కంటే మెరుగపడటం సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే!గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే. రెండూ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేటు తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం మ్యాచ్ ఫలితంతో పాండ్యా సేన టాప్-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్‌రైజర్స్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.ఎలా అంటే?ఉప్పల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024తద్వారా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్‌లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాప్-2లో తిష్ట వేసిన కేకేఆర్, రాజస్తాన్‌మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్(రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్‌రేటు 0.476) పదకొండేసి మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(రన్‌రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్(రన్‌రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.పాండ్యా సేనకు తప్పని పరాభవంమరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! ఇక అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.చదవండి: #KL Rahul: కెప్టెన్‌పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్.. అందరూ చూస్తుండగానే అలా.. -
Play Offs: స్టార్ ఓపెనర్ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్!
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ సేన.కేకేఆర్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్ నరైన్ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ ఫిలిప్ సాల్ట్ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్- నరైన్ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఐపీఎల్ 2024 సీజన్లో అత్యంత కీలక దశ నడుస్తుంది. లీగ్ మొత్తంలో 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 54 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (16 పాయింట్లు, 1.453 రన్‌రేట్) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.కేకేఆర్ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్‌రేట్), సీఎస్కే (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్‌రేట్), సన్‌రైజర్స్ (10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.072 రన్‌రేట్), లక్నో (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్‌రేట్), ఢిల్లీ (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్‌రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్‌రేట్), పంజాబ్ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్‌రేట్), గుజరాత్ (11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్‌రేట్), ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 6 పాయింట్లు -0.356 రన్‌రేట్) వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతానికి ఏ జట్టూ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ కానప్పటికీ.. ముంబై మాత్రం నిష్క్రమించే జట్ల జాబితాలో ముందువరుసలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్‌కు చేరదు. ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సున్నా అని చెప్పాలి.ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు దాదాపుగా గల్లంతు చేసుకున్న జట్ల జాబితాలో ముంబై తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఈ జట్టు కూడా తదుపరి ఆడే మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇలా జరిగి మిగతా జట్లు తమతమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడితే సమీకరణలు మారతాయి. ఈ జట్టుకు మినుకుమినుకు మంటూ ఒక్క శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.ఇక ముంబై, గుజరాత్ తర్వాత ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించేందుకు రెడీగా ఉన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ ఉన్నాయి. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరలేవు. పంజాబ్‌కు 2 శాతం, ఆర్సీబీకి 3 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మిగతా జట్ల విషయానికొస్తే.. రాజస్థాన్, కేకేఆర్ జట్లు ఫైనల్ ఫోర్ బెర్త్‌లు దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్, సీఎస్కే, లక్నో మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీకి సైతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నా ఆ జట్టుకు కేవలం 12 శాతం ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయి. కేకేఆర్‌కు 99, రాజస్థాన్‌కు 98 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండగా.. సన్‌రైజర్స్‌కు 75, సీఎస్కేకు 60, లక్నోకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అత్యద్భుతాలు జరగకపోతే పై సమీకరణలన్నీ యధాతథంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. -
ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు
న్యూఢిల్లీ: ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ముందుగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌కాగా... బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెరీ అద్భుత ఆటతీరుతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా బంతితో మెరిసిన పెరీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్‌తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 40 పరుగులు సాధించింది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత పొందుతుంది. ఫైనల్లో స్థానం కోసం ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోతే... ఢిల్లీ, ముంబై రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ముంబైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సజన (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) 43 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం ఇచ్చారు. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి సోఫీ డివైన్ బౌలింగ్‌లో హేలీ అవుటవ్వడంతో ముంబై పతనం మొదలైంది. అనంతరం పెరీ తన పేస్ బౌలింగ్‌తో సజన, హర్మన్‌ప్రీత్ (0), అమెలియా కెర్ (2), అమన్‌జ్యోత్ (4), పూజ వస్త్రకర్ (6), నటాలీ సీవర్ బ్రంట్ (10)లను అవుట్ చేసింది. దాంతో ఒకదశలో 43/0తో ఉన్న ముంబై 82/7తో కష్టాల్లో పడింది. చివర్లో ప్రియాంక బాలా (19 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో ముంబై స్కోరు 100 దాటింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. స్మతి (11; 2 ఫోర్లు), సోఫీ మోలినెక్స్ (9; 2 ఫోర్లు), సోఫీ డివైన్ (4) తక్కు వ స్కోరుకే వెనుదిరిగారు. అయితే రిచా ఘోష్ (28 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పెరీ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించి బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. -
ఆర్సీబీకి శుభవార్త
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదివరకే రెండు ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖరారైపోయాయి. ఇక మిగిలింది ఓ బెర్త్. ఈ బెర్త్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో మహాద్భతం జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరదు. ఇవాళ (మార్చి 12) ముంబై ఇండయన్స్తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే భారీ తేడాతో ఓడితే మాత్రం సమీకరణలు మారిపోతాయి. ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ తర్వాత యూపీ వారియర్జ్‌కు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉందని అనుకోవడానికి వీల్లేదు. గుజరాత్ జెయింట్స్ తమ చివరాఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కనీసం 57 పరుగుల తేడాతో ఓడిస్తే ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ బరిలో ఉంటుంది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌నూ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే మాత్రం యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించి, ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే మూడో జట్టు మార్చి 15న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. తదుపరి జరుగబోయే రెండు గ్రూప్ మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిర్దారించబడతాయి. ప్రస్తుతానికి రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్‌లో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నా ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో మార్చి 17న జరిగే అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు భారీ రన్‌రేట్ సాధించాలి. -
ప్రొ కబడ్డీ ‘ప్లే ఆఫ్స్’కు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పదో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కీలక దశ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదికవుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి టోర్నీ విశేషాలను వెల్లడించారు. గత తొమ్మిదో సీజన్లతో పోలిస్తే ఈ సారి టోర్నీ ఇంకా ఎక్కువ సంఖ్యలో అభిమానులకు చేరువైందని... 12 ఫ్రాంచైజీలకు చెందిన నగరాలు అన్నింటిలో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన అన్నారు. గ్రూప్ దశలో టాప్–2లో నిలిచిన పుణేరీ పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో తలపడే ఇతర రెండు జట్లను ఖరారు చేసేందుకు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఢిల్లీని పటా్న, గుజరాత్‌ను హర్యానా ఢీకొంటాయి. ఈ నెల 26న ఎలిమినేటర్ మ్యాచ్‌లు, 28న సెమీఫైనల్స్, మార్చి 1న ఫైనల్ నిర్వహిస్తారు. హైదరాబాద్ నగర అభిమానులు ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 250 – రూ. 3000 మధ్య ‘బుక్‌మైషో’లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్ అర్హత
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన ఐదో జట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. తెలుగు టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–36తో గెలిచింది. పట్నా తరఫున మంజీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో 21 మ్యాచ్‌లు ఆడి 11 విజయాలు అందుకున్న పట్నా 68 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 18వ పరాజయంతో 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగిలి ఉన్న తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో టైటాన్స్ గెలిచినా 29 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్‌ను దాటే అవకాశం లేదు. ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే స్టీలర్స్ ఒక మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. -
ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్, ఫైనల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని పీకేఎల్ నిర్వాహకులైన మషాల్ స్పోర్ట్స్ తెలిపింది. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో పాయింట్ల పట్టికలో టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టాప్–2 జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఫిబ్రవరి 26న ఎలిమినేటర్–1లో ఆరో స్థానం పొందిన జట్టుతో మూడో స్థానంలో నిలిచిన జట్టు... ఎలిమినేటర్–2లో ఐదో స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానం పొందిన జట్టు ఆడతాయి. ఫిబ్రవరి 28న ఎలిమినేటర్–1 విజేత తొలి సెమీఫైనల్లో లీగ్ ‘టాపర్’తో... ఎలిమినేటర్–2 విజేత లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడతాయి. ఫైనల్ మార్చి 1న జరుగుతుంది.