బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్‌లు ఆడిన పట్నా 14 మ్యాచ్‌ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్‌లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది.
పట్నాతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment