![PKL 10 Bengaluru Bulls Beat Telugu Titans Patna Defeat UP - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/20/telugutitans.jpg.webp?itok=a1jGBrMt)
PC: PKL
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు.
అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment