Bengaluru Bulls
-
ప్రదీప్ కూత ఘనం
హరియాణాలోని సోనీపత్.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ ఆటగాళ్లకు కేంద్రం. యోగేశ్వర్ దత్, రవి దహియా, సీమా అంటిల్ తదితర ఆటగాళ్లంతా అక్కడి నుంచి వచ్చినవాళ్లే. సోనీపత్‌లో ఉన్న క్రీడా వాతావరణం అక్కడి సమీప పట్టణాలు, గ్రామాల్లో కూడా కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో స్థానికులంతా కచ్చితంగా ఏదో ఒక ఆటను ఎంచుకొని అందులో కనీస స్థాయి వరకు రాణించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి గ్రామాల్లో ఒకటి.. సోనీపత్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రింఢానా. సుమారు 7 వేల జనాభా గల ఈ ఊర్లో కబడ్డీ ఆటపై ప్రత్యేక ఆకర్షణ ఉంది. చిన్నా, పెద్దా ఒక చోట చేరితే కబడ్డీ కూత పెట్టాల్సిందే. అలాంటి ఊరు నుంచి వచ్చిన ఒక యువకుడు ఇప్పుడు భారత కబడ్డీలో తనదైన ముద్ర వేశాడు. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రో కబడ్డీ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గా నిలిచిన అతనే ప్రదీప్ నర్వాల్. 11 సీజన్ల లీగ్‌లో పది సీజన్లే ఆడినా రికార్డు స్థాయిలో అత్యధిక పాయింట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.రింఢానాలో నర్వాల్ కుటుంబంలో చాలామందికి కబడ్డీ కూడా దినచర్యలో భాగమే. వాళ్లలో ప్రదీప్ బాబాయ్‌కి బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. ఆయనను చూసే ప్రదీప్ కబడ్డీపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన ద్వారానే ఆ ఆటలో మెలకువలు నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రదీప్‌కి కబడ్డీ లోకమైపోయింది. ఎంతగా అంటే బ్యాగ్‌తో స్కూల్‌కు వెళ్లి అటెండెన్స్ అయిపోగానే గ్రౌండ్ వైపు పరుగెత్తేవాడు. బడిలో అతని షెడ్యూల్ అదేనని చాలారోజుల దాకా ఇంట్లో తెలీలేదు. పరీక్షల్లో కనీసం మార్కులు కూడా రాకపోయేసరికి సందేహించిన పెద్దలు ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. అయితే తాను ఆటవైపు పూర్తిస్థాయిలో మళ్లేందుకు అదే మలుపు అని చెబుతాడు ప్రదీప్. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లాడు బాగా చదవడం లేదని తిట్టలేదు. ఆటపై ఆసక్తి ఉంది, బాగా ఆడుతున్నాడు కాబట్టి అందులోనే భవిష్యత్తు వెతుక్కొమ్మంటూ ప్రోత్సహించారు. 11 ఏళ్ల వయసులో స్కూల్ టీమ్ తరఫున మొదటిసారి బరిలోకి దిగిన ప్రదీప్ ఆట అందరినీ ఆకట్టుకుంది. దాంతో మరింత మెరుగైన శిక్షణ కోసం తల్లిదండ్రులు వెంటనే సోనీపత్‌లోని కబడ్డీ అకాడమీలో చేర్పించారు. అక్కడే అతని ఆట పదునెక్కింది. హ్యట్రిక్ టైటిల్స్ అందించి..హరియాణా రాష్ట్ర జట్టు తరఫున పలు టోర్నీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న అనంతరం ప్రదీప్ కెరీర్ 18 ఏళ్ల వయసులో కీలక మలుపు తిరిగింది. 2014లో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ ఒక్కసారిగా దేశంలోని క్రీడా ప్రేమికుల దృష్టి కబడ్డీ వైపు మళ్లేలా చేసింది. కొత్త కొత్త హంగులు, సరికొత్త నిబంధనల మధ్య వచ్చిన ఈ లీగ్.. కబడ్డీ రూపురేఖలను మార్చింది. 2015 టోర్నీ కోసం లీగ్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమంలో ఉన్నారు. ఆ క్రమంలో కొందరు కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్లు హరియాణాలో ప్రదీప్ ఆడిన మ్యాచ్‌లు చూశారు. వెంటనే మరో మాట లేకుండా అతడిని తమ లీగ్ కోసం ఎంచుకున్నారు. 2015లో తొలిసారి బెంగళూరు బుల్స్ తరఫున ప్రో కబడ్డీ లీగ్ ఆడే అవకాశం ప్రదీప్‌కు వచ్చింది. అతని రైడింగ్ నైపుణ్యం అన్ని జట్లనూ ఆకర్షించింది. దాంతో మరుసటి ఏడాది అతణ్ణి పట్నా పైరేట్స్ తమ టీమ్‌లోకి ఎంచుకుంది. తర్వాత నాలుగేళ్ల పాటు అతను లీగ్‌ను తన అద్భుత ఆటతో శాసించాడు. తన మెరుపు రైడింగ్‌తో రికార్డు పాయింట్లు సాధిస్తూ వరుసగా మూడేళ్లు పట్నా పైరేట్స్‌ను విజేతగా నిలబెట్టాడు. ఈ హ్యట్రిక్ టైటిల్స్ ప్రదీప్ స్థాయిని అమాంతం ఆకాశానికి పెంచేశాయి. ఆ తర్వాత రెండు సీజన్ల పాటు యూపీ యోధాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రదీప్.. 2024లో మళ్లీ తన మొదటి జట్టు బెంగళూరుకు చేరాడు.రికార్డులే రికార్డులు..కబడ్డీ.. కబడ్డీ అని కూత పెడుతూ ప్రదీప్ నర్వాల్ ఒక్కసారి ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెట్టాడంటే పాయింట్ల వర్షం కురవాల్సిందే. తన చురుకైన కదలికలతో అటు వైపు ఆటగాడిని టచ్ చేస్తూనే కిందకు వంగుతూ డిఫెండర్లకు అందకుండా సురక్షితంగా లైన్ దాటడంలో అతనికి అతనే సాటి. నీటిలోకి దూకి బయటకు వెళుతున్నట్లుగా ఉండే ఆ ఆట శైలి వల్లే అభిమానులు ప్రదీప్‌కు డుబ్కీ కింగ్ అనే నిక్ నేమ్ పెట్టారు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పెద్ద సంఖ్యలో రికార్డులు అతని పేరిటే ఉండటం విశేషం. అత్యధిక సంఖ్యలో రైడింగ్ పాయింట్లు, అత్యధిక సూపర్ రైడ్లు, అత్యధిక సూపర్ 10 పాయింట్లు, సింగిల్ రైడ్‌లో అత్యధిక పాయింట్లు, ఒకే సీజన్లో అత్యధిక పాయింట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ముందుగా 1000 పాయింట్లు అందుకున్న ఆటగాడిగా మొదలై 1700 పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా అతను నిలిచాడు. అతనికి, రెండో స్థానంలో ఉన్న ఆటగాడికి మధ్య 200 పాయింట్లకు పైగా అంతరం ఉండటం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఈ ఆట ప్రదీప్‌కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న కబడ్డీ ప్లేయర్ కూడా ప్రదీప్ నర్వాలే! గత ఎనిమిదేళ్లుగా భారత సీనియర్ కబడ్డీ సభ్యుడిగా కూడా పలు కీలక విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ∙ -
అర్జున్ సూపర్ రెయిడింగ్.. జైపూర్ ఘన విజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 35–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో విజృంభించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తన సూపర్ రెయిడింగ్‌తో ఆకట్టుకున్న అర్జున్ ప్రత్యర్థి డిఫెన్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. బెంగళూరు బుల్స్ స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... బుల్స్ 12 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. తాజా సీజన్లో 20 మ్యాచ్‌లాడిన పింక్ పాంథర్స్ 11 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. మరోవైపు 20 మ్యాచ్‌లాడిన బుల్స్ 2 విజయాలు, 17 పరాజయాలు, ఒక ‘టై’తో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. తాజా సీజన్లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... యూపీ యోధాస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 31–24 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 11 పాయింట్లు సాధించగా... స్టీలర్స్ తరఫున వినయ్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. లీగ్‌లో ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లాడిన యోధాస్ 11 విజయాలు 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకున్న స్టీలర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. లీగ్‌లో భాగంగా నేడు తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
38 పాయింట్ల తేడాతో...
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ 38 పాయింట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై శుక్రవారం జరిగిన ఈ పోరులో పల్టన్ 56–18 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన పల్టన్ ఓవరాల్‌గా 26 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగళూరు బుల్స్ 11 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. డిఫెన్స్‌లోనూ ఆకట్టుకున్న పల్టన్ 15 పాయింట్లతో మెరిస్తే... బుల్స్ 7 ట్యాకిల్ పాయింట్లే సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసిన పల్టన్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే... బుల్స్ ఒక్కసారి కూడా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. పల్టన్ తరఫున రెయిడర్లు ఆకాశ్ షిండే, మోహిత్ గోయత్, ఆర్యవర్ధన్ తలా 8 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 19 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 8 విజయాలు, 8 పరాజయాలు, 3 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న బెంగళూరు బుల్స్ 19 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది. శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 42–38 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. పట్నా తరఫున అయాన్ 13, దేవాంక్ 12 పాయింట్లతో రాణించగా... తలైవాస్ తరఫున మోయిన్ 11 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో 18 మ్యాచ్‌లాడిన పైరెట్స్ 11 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 63 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
ప్లే ఆఫ్స్‌లో స్టీలర్స్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా హరియాణా స్టీలర్స్ నిలిచింది. బుధవారం జరిగిన పోరులో స్టీలర్స్ 37–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడిన హరియాణా 15 విజయాలు, 4 పరాజయాలతో 77 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు ‘ప్లే ఆఫ్స్’లో చోటు ఖాయం చేసుకుంది. బుధవారం ఏకపక్షంగా సాగిన పోరులో స్టీలర్స్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. హరియాణా తరఫున వినయ్ 9 పాయింట్లు, శివమ్ 8 పాయింట్లతో సత్తా చాటగా... మొహమ్మద్ రెజా 6 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ తరఫున జతిన్ (5 పాయింట్లు) కాస్త పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగళూరు 14 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. మరోవైపు ఈ సీజన్లో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలు, 15 పరాజయాలు, ఒక ‘టై’తో 19 పాయింట్లతో ఉన్న బెంగళూరు బుల్స్... పట్టిక అట్టడుగున (12వ స్థానంలో) కొనసాగుతోంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 47–31 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. లీగ్‌లో భాగంగా గురువారం దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), యూపీ యోధాస్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
బెంగాల్ భారీ విజయం
హైదరాబాద్, నవంబర్ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్ తరపున నితిన్‌కుమార్(14), మన్‌దీప్‌సింగ్(10) సూపర్-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్(11), అజింక్యా పవార్(8) రాణించినా..పర్దీప్ నార్వల్(2) ఘోరంగా విఫలమయ్యాడు.బెంగాల్ జోరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో కీలకమైన ప్లేఆఫ్స్ దశకు చేరుకోవాలంటే గెలక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. మాజీ చాంపియన్ బెంగాల్ తమదైన రీతిలో బెంగళూరుపై జోరు కనబరిచింది. ముఖ్యంగా స్టార్ రైడర్ మన్‌దీప్‌సింగ్ దూకుడు కనబరిచాడు. తన తొలి రైడ్‌లోనే సుబ్రమణ్యంను ఔట్ చేసి బెంగాల్ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు పర్దీప్ నార్వల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్ 16వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన బెంగళూరు రైడర్ అక్షిత్‌ను నితీశ్‌కుమార్ ఉడుం పట్టుతో బెంగాల్‌కు పాయింట్ అందించాడు. రెండు నిమిషాల వ్యవధిలో రైడ్‌కు వెళ్లిన మన్‌దీప్‌సింగ్..ఈసారి నితిన్ రావల్, పర్దీప్ నర్వాల్‌ను ఔట్ రెండు పాయింట్లతో బెంగాల్ జట్టులో జోష్ నింపాడు. బెంగళూరు తరఫున పర్దీప్ నార్వల్ విఫలమైనా..అక్షిత్ వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఓవైపు రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ బెంగాల్ జోరు కనబర్చడంతో బెంగళూరు ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో తొలి అర్ధభాగం ముగిసే సరికి బెంగాల్ 15-12తో బెంగళూరుపై ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలో బెంగాల్ పాయింట్ల వేటలో అదే దూకుడు కనబరిచింది. అంతగా అనుభవం లేని బెంగళూరును బోల్తా కొట్టిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. మ్యాచ్ 17వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన నితిన్‌కుమార్..లకీకుమార్ను ఔట్ చేసి బెంగాల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. నిమిషం తేడాతో రైడ్‌కు వచ్చిన మనిందర్‌సింగ్..నితిన్ నార్వల్, అజింక్యా పవార్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలిసారి ఆలౌటైంది. అంతగా ప్రభావం చూపని పర్దీప్ నార్వల్ స్థానంలో మరో ప్లేయర్‌ను బెంగళూరు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగస్తుందనగా బెంగళూరు రెండో సారి ఆలౌట్ కావడంతో బెంగాల్ విజయం ఖరారైంది. మ్యాచ్ ఆసాంతం మన్‌దీప్‌సింగ్ రైడింగ్ జోరు సాగింది. -
PKL: షెడ్యూల్ పూర్తి వివరాలు.. తొలి మ్యాచ్‌లో తలపడే జట్లు ఇవే
Pro Kabaddi League Season 11: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆరంభ దశ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 18 నుంచి పీకేఎల్ ప్రారంభం కానుండగా... గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగనున్న తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది.అదే రోజు జరగనున్న రెండో మ్యాచ్‌లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ పోటీపడుతుంది. మూడు వేదికల్లో పీకేఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించగా... అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్‌లో పీకేఎల్ తొలి దశ సాగనుంది.ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో లీగ్ సాగనుంది. ఇక ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. గత నెలలో జరిగిన పీకేఎల్ వేలంలో మొత్తం 12 జట్లు తమ అస్త్రశ్రస్తాలకు పదును పెంచుకోగా... లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది మంది ప్లేయర్లు కోటి రూపాయలకు పైగా ధర పలికారు. హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)అక్టోబర్ 18, శుక్రవారం-తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)-దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 19, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 20, ఆదివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు) అక్టోబర్ 21, సోమవారం- యూపీ యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 22, మంగళవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 23, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 24, గురువారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 25, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 26, శనివారం- యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 27, ఆదివారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 28, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 29, మంగళవారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 30, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 31, గురువారం- పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 2, శనివారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 3, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 4, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 5, మంగళవారం- యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 6, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 7, గురువారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 8, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 9, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)నోయిడా (నోయిడా ఇండోర్ స్టేడియం)నవంబర్ 10, ఆదివారం- యూపీ యోధాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 11, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 12, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 13, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 14, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 15, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 16, శనివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 17, ఆదివారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 18, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 19, మంగళవారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 20, బుధవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 21, గురువారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 22, శుక్రవారంజైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 23, శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 24, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 25, సోమవారం- యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 26, మంగళవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 27, బుధవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 28, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 29, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 30, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 1, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)పుణె (బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం)డిసెంబర్ 3, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 4, బుధవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 5, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 6, శుక్రవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 7, శనివారం- యూపీ యోధాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 8, ఆదివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 9, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 10, మంగళవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 11, బుధవారంహర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 12, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 13, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 14, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 15, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 16, సోమవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 17, మంగళవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 18, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 19, గురువారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 20, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 21, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 22, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 23, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 24, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు) -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి. -
గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్.. ఎప్పుడంటే?
క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ప్రో కబాడ్డీ లీగ్ సీజన్ 10లో తమ హోమ్ మ్యాచ్‌లను ప్రారంభించడానికి తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది. హోమ్ మ్యాచ్‌లను జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్‌లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లు bookmyshow లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్‌ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా గొప్ప స్థాయికి పెరిగిందన్నారు. . ప్రో కబడ్డీ లీగ్ ప్రస్తుత సీజన్‌లా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్‌లకు సాక్షిగా నిలబోతుందన్నారు. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్, సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్‌ను జనవరి 19, 2024న బెంగళూరు బుల్స్‌తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్‌ని లైవ్‌లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్‌లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్‌స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. -
PKL 2023: పవన్ పోరాటం వృథా
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆరో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టిన టైటాన్స్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఏడో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అజిత్ పవార్ 5 పాయింట్లు, రజనీశ్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుర్జీత్ సింగ్ (7), భరత్ (6), వికాశ్ కండోలా (5), నీరజ్ నర్వాల్ (5) రాణించారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 39–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 8 పాయింట్లు, గుమన్ సింగ్ 6 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు స్కోరు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. Came like 𝙋𝙖𝙬𝙖𝙣, went with the Bulls 😉#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/azN98ZP8fU — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 SUPE𝐑𝐑𝐑 TACKLE ft. Ajit Pawar 💛#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/fHyLLmze8F — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 -
PKL 2023: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ గెలుపు బోణీ
Pro Kabaddi League 2023- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 35–32తో గెలిచింది. విరామ సమయానికి 12–20తో వెనుకబడి ఉన్న జైపూర్ జట్టు రెండో అర్ధభాగంలో పుంజుకుంది. రెయిడర్ అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 15 పాయింట్లు స్కోరు చేసి జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఈ సీజన్లో జైపూర్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు. మరోవైపు.. గుజరాత్ జెయింట్స్ ఐదింట మూడు గెలిచి 17 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. 2️⃣4️⃣-carat magical raid ft. Sonu 😍#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #JPPvGG #JaipurPinkPanthers #GujaratGiants pic.twitter.com/vDrssOgxDi — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 బెంగళూరు బుల్స్ చేతిలో యూపీ యోధాస్ ఓటమి ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38–36తో యూపీ యోధాస్‌ను ఓడించి ఈ సీజన్లో ఐదో మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరు తరఫున వికాశ్, భరత్ 11 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మంగళవారం జరిగే మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. Announcing the yuddh in his style ⚔️ Pardeep Narwal for you 💪#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvUP #BengaluruBulls #UPYoddhas pic.twitter.com/HrUJXMKK3W — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 -
PKL 2022: సెమీస్ చేరిన నాలుగు జట్లు ఇవే.. ఫైనల్ ఎప్పుడంటే!
Pro Kabaddi League 2022- Semi Finals: ప్రొ కబడ్డీ లీగ్-2022లో భాగంగా మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ యూపీ యోధాస్‌ను ఓడించింది. ట్రై బ్రేక్(36-36) మ్యాచ్‌లో 6-4 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మరో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్.. దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. 56- 24 తేడాతో ఢిల్లీని మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. కాగా అంతకుముందు జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాటి(డిసెంబరు 15) తొలి సెమీస్ మ్యాచ్‌లో జైపూర్‌తో... బెంగళూరు తలపడనుంది. అదే విధంగా రెండో మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌తో తమిళ్ తలైవాస్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లలో విజేతగా నిలిచిన జట్లు డిసెంబరు 17న టైటిల్ పోరుకు సిద్దంకానున్నాయి. చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్.. Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో -
PKL 2022: తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యం.. తొమ్మిదింట 8 పరాజయాలతో..
Pro Kabaddi League 2022- Telugu Titans- పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో తొమ్మిదో మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 24–43 స్కోరు తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ జట్టులో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించలేకపోయారు. ఆదర్శ్, మోహిత్ పహాల్ చెరో 5 పాయింట్లు సాధించారు. మిగతావారంతా నిరాశపరిచారు. యూపీ తరఫున రెయిడర్ సురేందర్ గిల్ (13 పాయింట్లు), ప్రదీప్ నర్వాల్(9) రాణించారు. కాగా 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్ ఒకే ఒక్క విజయంతో అట్టడుగున ఉంది. ఇక బెంగళూరు బుల్స్ ఆరు విజయాలతో 34 పాయింట్లు సాధించి టాప్‌లో కొనసాగుతోంది. చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్ Match 5️⃣0️⃣ belonged to the Pirates while the Yoddhas claimed Match 5️⃣1️⃣ Here's the league table 📊 after tonight's encounters 😃#vivoProKabaddi #FantasticPanga #GGvPAT #UPvTT pic.twitter.com/M3Yhds5cFK — ProKabaddi (@ProKabaddi) October 31, 2022 Full time.#vivoProKabaddi #TeluguTitans #IdiAataKaaduVetaa #MatchDay #WeRiseAgain #TTvsUP #Kabaddi #KabaddiIndia pic.twitter.com/QDL3sLMAXw — Telugu Titans (@Telugu_Titans) October 31, 2022 -
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్‌కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది. హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
Pro Kabaddi League: ఎదురులేని బెంగళూరు బుల్స్.. తొమ్మిదో విజయం
Pro Kabaddi League 2021- 2022: Bengaluru Bulls Beat UP Yoddha: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ జట్టు తొమ్మిదో విజయం సాధించింది. యూపీ యోధతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 31–26 పాయింట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేయగా... డిఫెండర్ అమన్ ఏడు పాయింట్లు సాధించాడు. ఇక యూపీ యోధ తరఫున శ్రీకాంత్ జాదవ్, నితీశ్ కుమార్ ఆరు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 25–34 తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. -
పవన్ ఒంటరి పోరాటం వృథా
ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు ఆరో పరాజయం ఎదురైంది. బెంగళూరులో బుధవారం యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–45తో ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది నాలుగో ఓటమి. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముంబా జట్టులో అభిషేక్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. -
Pro Kabaddi League: బెంగళూరు రికార్డు విజయం... ఏకంగా..
Bengaluru Bulls Record Breaking 39 Point Win: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ ఆరో విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 61–22తో ఘనవిజయం సాధించింది. 39 పాయంట్లతో గెలుపొంది రికార్డు సృష్టించింది. బెంగళూరు రెయిడర్ పవన్ సెహ్రావత్ ఏకంగా 27 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. హరియాణా స్టీలర్స్, యూపీ యోధ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 36–36తో ‘టై’గా ముగిసింది. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పరాజయం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం ముగిసింది. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రజ్నేశ్ 2–6, 6–7 (8/10)తో మాక్సిమిలాన్ మార్టెరర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. గంటా 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 23 అనవసర తప్పిదాలు చేశాడు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు జోరు.. జైపూర్ పై గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన పోరులో బుల్స్ 38–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరుకు ఇది ఐదో విజయం. బుల్స్ తరఫున కెప్టెన్ పవన్ షెరావత్ (18 పాయింట్లు) రాణించాడు. జైపూర్ జట్టులో అర్జున్ 13 పాయింట్లు చేశాడు. పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30 స్కోరుతో టై అయ్యింది. నేడు జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఇక ఆ సిరీస్ కూడా కష్టమే! -
సెమీస్‌లో బెంగళూరు, ముంబా
అహ్మదాబాద్: ఆరంభంలో తడబడినా... పవన్ అసాధారణ పోరాటంతో ఓడాల్సిన మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫలితం కోసం అదనపు సమయం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48–45తో యూపీ యోధపై విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 36–36తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ఆరు నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో వవన్ సూపర్ రైడ్‌తో చెలరేగడంతో బెంగళూరు బుల్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పవన్‌కు సుమిత్ సింగ్ (7 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) సహకరించారు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో యు ముంబా 46–38తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
బెంగళూరుపై యూపీ యోధ గెలుపు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ లీగ్ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో యూపీ యోధ 45–33తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా... అతనికి సహచరుల నుంచి సహకారం అందలేదు. ఒక దశలో 5–14తో వెనుకంజలో ఉన్న యూపీని రైడర్ సురేందర్ గిల్ (9 పాయింట్లు), శ్రీకాంత్ జాదవ్ (9 పాయింట్లు) ఆదుకున్నారు. సూపర్ రైడ్‌తో 4 పాయింట్లు సాధించిన సురేందర్... బెంగళూరు ఆధిక్యాన్ని 14–9కి తగ్గించాడు. తర్వాత కూడా యూపీ యోధ క్రమం తప్పకుండా పాయింట్లు సాధించి మొదటి అర్ధ భాగాన్ని 20–22తో ముగించింది. ఇక రెండో అర్ధ భాగంలో యూపీ డిఫెండర్ ఆశు సింగ్ (5 పాయింట్లు) ప్రత్యర్థి రైడర్లను పట్టేయడంతో ఆధిక్యంలోకెళ్లింది. ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించి విజయాన్ని అందుకుంది. తాజా విజయంతో యూపీ యోధ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలువగా... బెంగళూరు బుల్స్ ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు దబంగ్ ఢిల్లీ–యు ముంబా మ్యాచ్ 37–37తో ‘టై’గా ముగిసింది. ప్లే ఆఫ్ షెడ్యూల్ (వేదిక: అహ్మదాబాద్) అక్టోబర్ 14: ఎలిమినేటర్–1: యూపీ యోధ x బెంగళూరు బుల్స్ అక్టోబర్ 14: ఎలిమినేటర్–2: యు ముంబా xహరియాణా స్టీలర్స్ అక్టోబర్ 16: తొలి సెమీఫైనల్: దబంగ్ ఢిల్లీ xఎలిమినేటర్–1 విజేత అక్టోబర్ 16: రెండో సెమీఫైనల్: బెంగళూరు బుల్స్ x ఎలిమినేటర్–2 విజేత అక్టోబర్ 19: ఫైనల్ (సెమీఫైనల్స్ విజేతలు) -
తమిళ్ తలైవాస్ ఓటమి
చెన్నై: సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఎడో సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 21–32తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. తలైవాస్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లర్, అజయ్ ఠాకూర్లు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు ఆటగాడు పవన్ షెరావత్ సూపర్ ‘టెన్’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీల మ్యాచ్ చివరకు 30–30తో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ ఆటగాడు ప్రవీన్ కుమార్ 11 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు. -
పరాజయాల టైటాన్స్
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47–26తో ఓడిన టైటాన్స్ సీజన్లో మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్ రైడర్ పవన్ కుమార్ (17 పాయింట్లు) రైడింగ్ ముందు నిలబడలేకపోయాడు. దీంతో సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో ‘టై’తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి. -
సైరా కబడ్డీ...
ఆరు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న కబడ్డీ ఆరు నెలలకే మళ్లీ వచ్చేసింది. ఐపీఎల్ తర్వాత అంతటి ఊపును తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ కూత మరోసారి మోత మోగించనుంది. 12 జట్లు... 92 రోజులు... 137 మ్యాచ్‌లు... ఇక వినోదానికి లోటేముంది. నేటి నుంచి జరిగే సీజన్–7తో కబడ్డీ ... కబడ్డీ... కబడ్డీ అంటూ శ్రుతి కలిపేందుకు మీరు సిద్ధమేనా...? సాక్షి, హైదరాబాద్ ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం లీగ్ తెరపైకి వచ్చి అనూహ్యంగా సూపర్ సక్సెస్‌గా నిలిచిన ఈ టోర్నీ విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5న ఆరో సీజన్ ఫైనల్ జరగ్గా అదే జోరులో 2019లో రెండో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్‌లాగే ఈసారి కూడా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. హైదరాబాద్ అంచె పోటీలు ఈనెల 26 వరకు జరుగుతాయి. కొత్త ఫార్మాట్‌తో 137 మ్యాచ్‌లు... ప్రొ కబడ్డీ లీగ్–7కు సంబంధించి ప్ర«ధాన మార్పు ఫార్మాట్ విషయంలో జరిగింది. ఇంతకుముందు రెండు వేర్వేరు జోన్లు, వాటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు తర్వాతి దశ, ఆపై చివరి దశ అంటూ గందరగోళంగా షెడ్యూల్ కనిపించింది. దాంతో దీనిని పూర్తిగా మార్చి అభిమానులకు ఆసక్తి రేపేలా చేశారు. ► ఐపీఎల్ తరహాలో ప్రతీ జట్టు మరో టీమ్‌తో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే ఒక్కో టీమ్ కనీసం 22 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. సొంత వేదికపై మాత్రం గరిష్టంగా నాలుగు మ్యాచ్‌లకు మించి ఏ జట్టుకూ ఆడే అవకాశం రాదు. లీగ్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు బరిలో నిలిస్తే...తర్వాతి ఆరు జట్లు టోర్నీనుంచి తప్పుకుంటాయి. ► తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడి విజయం ద్వారా సెమీస్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది. సరిగ్గా మూడు నెలల సాగే ఈ లీగ్‌లో ఏకంగా 137 మ్యాచ్‌లు జరుగుతుండటం విశేషం. ప్రతీసారి ఏదో ఒక స్లోగన్‌ను లీగ్‌కు ఆకర్షణగా తెస్తున్న నిర్వాహకులు ఈసారి ‘ఇస్ సే టఫ్ కుచ్ నహీ...(ఇంతకంటే క్లిష్టం మరోటి లేదు)’ పేరుతో లీగ్‌కు ప్రచారం నిర్వహించారు. వేదికలు... 12 జట్లు తమ సొంత వేదికలను ఎంచుకున్నాయి. గత సీజన్లో తెలంగాణలో ఎన్నికల కారణంగా వైజాగ్‌లో హోం మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఈసారి హైదరాబాద్‌నే సొంత వేదికగా తీసుకుంది. దీంతో పాటు ముంబై, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, పుణే, జైపూర్, పంచకుల, గ్రేటర్ నోయిడాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ అంచె మ్యాచ్‌లు శనివారం ప్రారంభమవుతాయి. ప్రతి మంగళవారం మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శని, ఆది, బుధ, శుక్రవారాల్లో హోం జట్లు తమ మ్యాచ్‌లను ఆడతాయి. పట్నాదే జోరు... లీగ్‌లో ఆరు సీజన్లలో పట్నా పైరేట్స్ జట్టు దూకుడు కొనసాగింది. ఏకంగా మూడు సార్లు ఆ జట్టు విజేతగా నిలవడం విశేషం. జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. గత సీజన్లో ట్రోఫీ అందుకున్న బెంగళూరు బుల్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్... కబడ్డీ అంటే కుర్రాళ్లు మాత్రమే కాదు మేం కూడా ఆడగలమంటూ కొందరు వయసులో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరిలో జోగీందర్ నర్వాల్ (37 ఏళ్లు–ఢిల్లీ), జీవకుమార్ (38 ఏళ్లు–బెంగాల్), ధర్మరాజ్ చేరలతన్ (43 ఏళ్లు–హరియాణా) ఆటపై అందరి దృష్టి ఉంది. కెన్యా నుంచి కూడా... లీగ్‌లో భారత ఆటగాళ్లతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అందరిలోకి అగ్రభాగం ఇరాన్‌దే. టైటాన్స్ కెప్టెన్ అబోజర్ సహా మొత్తం 15 మంది ఇరాన్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌కు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ) ఆడే డెవిట్ జెన్నింగ్స్‌ను టైటాన్స్ తమ జట్టులోకి తీసుకున్నా... చివరి నిమిషంలో వేరే కారణాలతో అతడిని తప్పించింది. లీగ్ టాపర్స్ అత్యధిక పాయింట్లు: రాహుల్ చౌదరి (876) అత్యధిక రైడ్ పాయింట్లు: పర్దీప్ నర్వాల్ (858) అత్యధిక టాకిల్ పాయింట్లు: మన్జీత్ ఛిల్లర్ (302) ఎక్కువ సార్లు ప్రత్యర్థిని ఆలౌట్: పట్నా పైరేట్స్ (165) మాజీ చాంపియన్స్ సీజన్ విజేత 2014 జైపూర్ పింక్ పాంథర్స్ 2015 యు ముంబా 2016 పట్నా పైరేట్స్ (జనవరి; జూన్) 2017 పట్నా పైరేట్స్ 2018–19 బెంగళూరు బుల్స్ నేటి మ్యాచ్‌లు తెలుగు టైటాన్స్ X యు ముంబా రాత్రి గం. 7.30 నుంచి బెంగళూరు బుల్స్ X పట్నా పైరేట్స్ రాత్రి గం. 8.30 నుంచి సీజన్–7 కెప్టెన్లు వీరే... ► మణీందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్) ► జోగీందర్ నర్వాల్ (దబంగ్ ఢిల్లీ) ► సునీల్ కుమార్ (గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్) ► రోహిత్ కుమార్ (బెంగళూరు బుల్స్) ► దీపక్ హుడా (జైపూర్ పింక్ పాంథర్స్) ► పర్దీప్ నర్వాల్ (పట్నా పైరేట్స్) ► సుర్జీత్ సింగ్ (పుణేరీ పల్టన్) ► అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్) ► అబోజర్ మొహాజిర్ మిగాని (తెలుగు టైటాన్స్) ► నితీశ్ కుమార్ (యూపీ యోధ) ► ఫజల్ అత్రచలి (యు ముంబా) ► ధర్మరాజ్ చేరలతన్ (హరియాణా స్టీలర్స్) -
ప్రొ కబడ్డీ టైటిల్ విజేత బెంగళూర్ బుల్స్
ముంబై: కూత కూతకు గెలుపు సమీకరణాలు మారిపోయాయి. ఫైనల్ మజా ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారే అంతకు మించి హోరు జరిగింది. ఈ సారైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఆడిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు ముంగిట బోల్తాపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ప్రొ కబడ్డీ ఆరో సీజన్ తుది పోరులో బెంగళూరు బుల్స్ విజేతగా అవతరించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38-33 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఆధిక్యంలో నిలిచిన గుజరాత్ రెండో భాగంలో తడబడింది. బెంగళూరు సారథి రోహిత్ ఫైనల్ పోరులో తడబడినా స్టార్ రైడర్ పవన్ మరోసారి తనదైన రీతిలో రెచ్చిపోయి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
బెంగళూరు బుల్స్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి
స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 13 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా... అతనికి సరైన సహకారం అందకపోవడంతో తెలుగు టైటాన్స్ కీలక సమయంలో మరో ఓటమి మూటగట్టుకుంది. హరియాణాలో మంగళవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌లో టైటాన్స్ 28–44తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. బుల్స్ తరఫున పవన్ 13, రోహిత్ కుమార్ 7 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో బెంగళూరు జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్స్’కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39–30తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. -
ఉత్కంఠ పోరులో టైటాన్స్ ఓటమి
పుణే: ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించినా... చివర్లో ఒత్తిడికి గురైన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్లో తొలిసారి బెంగళూరు బుల్స్‌తో తలపడిన టైటాన్స్ హోరాహోరీ పోరులో ఓటమి పాలైంది. జోన్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–26తో టైటాన్స్‌పై గెలిచింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా... ఇరు జట్లు 25–25తో సమంగా నిలిచాయి. ఈ దశలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని ప్రత్యర్థి జట్టు పట్టేయడంతో టైటాన్స్ ఆలౌటైంది. టైటాన్స్ తరఫున రాహుల్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. బుల్స్ తరఫున రోహిత్ (8 పాయింట్లు) రాణించాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్స్ 35–33తో హరియాణ స్టీలర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.