PKL 2022 Highlights: Telugu Titans Beat By UP Yoddha, 8th Loss In Season - Sakshi
Sakshi News home page

PKL 2022: తెలుగు టైటాన్స్‌ దారుణ వైఫల్యం.. తొమ్మిదింట 8 పరాజయాలతో..

Published Tue, Nov 1 2022 10:07 AM | Last Updated on Tue, Nov 1 2022 11:38 AM

PKL 2022: Telugu Titans Beat By UP Yoddha 8th Loss In Season - Sakshi

PC: ProKabaddi Twitter

Pro Kabaddi League 2022- Telugu Titans- పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తెలుగు టైటాన్స్‌ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తొమ్మిదో మ్యాచ్‌ ఆడిన టైటాన్స్‌ ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 24–43 స్కోరు తేడాతో యూపీ యోధాస్‌ చేతిలో ఓడిపోయింది.

తెలుగు టైటాన్స్‌ జట్టులో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించలేకపోయారు. ఆదర్శ్, మోహిత్‌ పహాల్‌ చెరో 5 పాయింట్లు సాధించారు. మిగతావారంతా నిరాశపరిచారు. యూపీ తరఫున రెయిడర్‌ సురేందర్‌ గిల్‌ (13 పాయింట్లు), ప్రదీప్‌ నర్వాల్‌(9) రాణించారు.

కాగా 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్‌ ఒకే ఒక్క విజయంతో అట్టడుగున ఉంది. ఇక బెంగళూరు బుల్స్‌ ఆరు విజయాలతో 34 పాయింట్లు సాధించి టాప్‌లో కొనసాగుతోంది.

చదవండి: T20 WC 2022: భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?  
Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement