Pro Kabaddi League 2022
-
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9 విజేత జైపూర్ పింక్ పాంథర్స్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9 ఛాంపియన్స్‌గా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. శనివారం పుణేరీ పల్టన్స్‌తో జరిగిన ఫైనల్లో జైపూర్ 33-29తో విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 13 రైడ్ పాయింట్లతో పాటు 15 టాకిల్ పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసిన జైపూర్ పింక్ పాంథర్స్ స్పష్టమైన ఆధిక్యం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక పీకేఎల్ తొలి సీజన్లో విజేతగా అవరతరించిన జైపూర్ పింక్ పాంథర్స్ ఎనిమిది సీజన్ల తర్వాత రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ తర్వాత రెండోసారి చాంపియన్‌గా నిలిచిన రెండో జట్టుగా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. ఇక పట్నా పైరేట్స్ అత్యధికంగా మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలవడం విశేషం. 🏆 🏆 🏆 🏆 🏆 🏆 Jaipur 🏆 🏆 Pink 🏆 🏆 Panthers 🏆 🏆 🏆 🏆 🏆 🏆 JAIPUR PINK PANTHERS ARE CROWNED CHAMPIONS OF SEASON 9 🙌#JPPvPUN #vivoProKabaddi #FantasticPanga #vivoPKL2022Final #JaipurPinkPanthers #vivoProKabaddi2022Final #Champions pic.twitter.com/h2Fa7VeI24 — ProKabaddi (@ProKabaddi) December 17, 2022 -
PKL 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పింక్ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ
ముంబై: సుదీర్ఘంగా సాగుతోన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫైనల్ మజిలీకి చేరింది. జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సంపాదించాయి. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో పింక్‌పాంథర్స్ 49–29తో బెంగళూరు బుల్స్‌పై అలవోక విజయం సాధించింది. జైపూర్ తరఫున అజిత్ (13 పాయింట్లు), సాహుల్ కుమార్ (10) రాణించారు. బెంగళూరు జట్టులో భరత్ 7, వికాస కండోల 5, నీరజ్ నర్వాల్, సౌరభ్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో సెమీఫైనల్లో పుణేరి పల్టన్ 39–37తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. రెయిడర్ పంకజ్ మోహితే (16) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన పంకజ్ 11 సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. శనివారం జైపూర్‌తో పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: BBL 2022: ఔట్ అనుకుని వెళ్లిపోయాడు.. అంతలోనే అదృష్టం! ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే? -
PKL 2022: సెమీస్ చేరిన నాలుగు జట్లు ఇవే.. ఫైనల్ ఎప్పుడంటే!
Pro Kabaddi League 2022- Semi Finals: ప్రొ కబడ్డీ లీగ్-2022లో భాగంగా మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ యూపీ యోధాస్‌ను ఓడించింది. ట్రై బ్రేక్(36-36) మ్యాచ్‌లో 6-4 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మరో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్.. దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. 56- 24 తేడాతో ఢిల్లీని మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. కాగా అంతకుముందు జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాటి(డిసెంబరు 15) తొలి సెమీస్ మ్యాచ్‌లో జైపూర్‌తో... బెంగళూరు తలపడనుంది. అదే విధంగా రెండో మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌తో తమిళ్ తలైవాస్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లలో విజేతగా నిలిచిన జట్లు డిసెంబరు 17న టైటిల్ పోరుకు సిద్దంకానున్నాయి. చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్.. Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో -
PKL 2022: సెమీస్‌లో జైపూర్, పుణె.. పట్నాకు పరాభవం!
Pro Kabaddi League 2022- సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్ 44–30తో పట్నా పైరేట్స్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 44–30తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచాయి. మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న పుణేరి, జైపూర్ జట్లు 79 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా జట్లు తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా పుణేరి, జైపూర్ జట్లను దాటే అవకాశం లేదు. కాగా టాప్–6లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటాయి. మిగతా రెండు సెమీఫైనల్ బెర్త్‌ల కోసం నాలుగు జట్లు ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2 మ్యాచ్‌ల్లో తలపడతాయి. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్ The 🔝 2⃣ teams in the #vivoProKabaddi Season 9 league stage are now just 2⃣ steps away from getting their hands on the 🏆#FantasticPanga #JaipurPinkPanthers #PuneriPaltan pic.twitter.com/27Gg62sKMB — ProKabaddi (@ProKabaddi) December 5, 2022 -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి.. మొత్తంగా 16వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో 16వ పరాజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–35తో పుణేరి పల్టన్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ తరఫున ఆదర్శ్ తొమ్మిది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 15 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో ఉంది. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్‌పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్‌పై గెలిచాయి. -
మూడేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో కబడ్డీ సందడి
-
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి, 14 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్‌పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
PKL 2022: తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యం.. తొమ్మిదింట 8 పరాజయాలతో..
Pro Kabaddi League 2022- Telugu Titans- పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో తొమ్మిదో మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 24–43 స్కోరు తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ జట్టులో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించలేకపోయారు. ఆదర్శ్, మోహిత్ పహాల్ చెరో 5 పాయింట్లు సాధించారు. మిగతావారంతా నిరాశపరిచారు. యూపీ తరఫున రెయిడర్ సురేందర్ గిల్ (13 పాయింట్లు), ప్రదీప్ నర్వాల్(9) రాణించారు. కాగా 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్ ఒకే ఒక్క విజయంతో అట్టడుగున ఉంది. ఇక బెంగళూరు బుల్స్ ఆరు విజయాలతో 34 పాయింట్లు సాధించి టాప్‌లో కొనసాగుతోంది. చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్ Match 5️⃣0️⃣ belonged to the Pirates while the Yoddhas claimed Match 5️⃣1️⃣ Here's the league table 📊 after tonight's encounters 😃#vivoProKabaddi #FantasticPanga #GGvPAT #UPvTT pic.twitter.com/M3Yhds5cFK — ProKabaddi (@ProKabaddi) October 31, 2022 Full time.#vivoProKabaddi #TeluguTitans #IdiAataKaaduVetaa #MatchDay #WeRiseAgain #TTvsUP #Kabaddi #KabaddiIndia pic.twitter.com/QDL3sLMAXw — Telugu Titans (@Telugu_Titans) October 31, 2022 -
జైపూర్పై తలైవాస్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తలైవాస్ 38–27 స్కోరుతో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై గెలుపొందింది. తమిళ్ జట్టు రెయిడర్లు నరేందర్ (13 పాయింట్లు), అజింక్యా పవార్ (6 పాయింట్లు) అదరగొట్టారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన పోరు 27–27తో టైగా ముగిసింది. హరియాణా జట్టులో మన్జీత్ (8), మీతు శర్మ (8) రాణించారు. పుణేరి జట్టులో లమోహిత్ గోయత్ 17 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు సాధించాడు. మూడో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34–29తో యూపీ యోధాస్‌ను ఓడించింది. పైరేట్స్‌లో సచిన్ (11), రోహిత్ (7) చక్కని ప్రదర్శన కనబరచగా, యోధాస్ జట్టులో స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ (12) రాణించాడు. చదవండి: T20 WC 2022: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్ బ్యాటర్' -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 24–42 స్కోరుతో హరియాణా స్టీలర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. హరియాణా రెయిడర్ మీతూ శర్మ అదరగొట్టాడు. 18 సార్లు కూతకెళ్లిన మీతూ 13 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మన్జీత్ (7), కెప్టెన్ నితిన్ రావల్ (4), జైదీప్ దహియా (4) రాణించారు. తెలుగు టైటాన్స్‌లో సిద్ధార్థ్ దేశాయ్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు. ఆదర్శ్, విజయ్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. -
చివరి దాకా ఉత్కంఠ.. దబాంగ్ ఢిల్లీ 'హ్యాట్రిక్' విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. యూపీ యోధాస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 44–42తో గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్ 13 పాయింట్లు, మంజీత్ 12 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ తరఫున సురేందర్ గిల్ 21 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 42–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు గెలుపు బోణీ చేసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–21తో నెగ్గింది. టైటాన్స్ తరఫున మోనూ గోయట్ 10 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 27–22 తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. -
కొద్దిగా ఆగి ఉంటే వేరుగా ఉండేది.. ఊహించని ట్విస్ట్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9లో తమిళ్ తలైవాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం కంఠీరవ ఇండోర్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడింది. అయితే మ్యాచ్ సందర్భంగా తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా మ్యాచ్ మొదటి హాఫ్ తొలి 10 నిమిషాల్లోనే జరిగింది. గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్లు 7-7తో సమంగా ఉన్న సమయంలో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ చంద్రన్ రంజిత్ రైడ్‌కు వచ్చాడు. ఆ సమయంలో మ్యాట్‌పై తమిళ్ తలైవాస్ నుంచి ఇద్దరే ఉన్నారు. కెప్టెన్ పవన్ సెహ్రావత్ సహా సాహిలా గులియాలు ఉన్నారు. సూపర్ టాకిల్ చేస్తే పాయింట్లు వచ్చే అవకాశం ఉండడంతో సాహిల్.. చంద్రన్ రంజిత్ అప్పర్ బాడీని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పవన్ చంద్రన్ కాలును గట్టిగా హోల్డ్ చేశాడు. కొద్దిగా ఆగితే పాయింట్లు వచ్చేవే. కానీ ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. పవన్ పట్టు సాధించే క్రమంలో అతని మోకాలు బెణికింది. దీంతో మ్యాట్‌పై పడిపోయిన పవన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. అంతసేపు గట్టిగా అరుస్తున్న అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. వెంటనే మెడికల్ స్టాప్ వచ్చి పవన్ సెహ్రావత్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. నొప్పి చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అయితే తమిళ్ తలైవాస్ కోచ్ జె. ఉదయ్ కుమార్ మాత్రం పవన్ సెహ్రావత్ 2-3 రోజుల్లో కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక పవన్ సెహ్రావత్‌ను తమిళ్ తలైవాస్ రూ. 2.26 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఇక కెప్టెన్ పవన్ సెహ్రావత్ స్థానంలో నరేందర్ రైడర్‌గా అరంగేట్రం చేశాడు. ఇక గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 31–31తో డ్రాగా ముగిసింది. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. చదవండి: Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్ -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం మూడు మ్యాచ్‌లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నాతో మ్యాచ్‌లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
Pro Kabaddi League 9: కూతకు వేళాయె!
బెంగళూరు: ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న కబడ్డీ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, పుణే నగరాల్లో అన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో టీవీలకే పరిమితమైన అభిమానులు ఈ సారి నేరుగా ఆటను ఆస్వాదించడం అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ మూడు వేదికల్లోనూ ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు. మొత్తం 12 జట్లు లీగ్ బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌లో భాగంగా మొత్తం 66 మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి పోరులో యు ముంబాతో డిఫెండింగ్ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. జాతీయ క్రీడల్లో కబడ్డీ ఈవెంట్ ముగిసిన వారం రోజుల్లోపే అందరూ ఆటగాళ్లు లీగ్‌కు సిద్ధమై బరిలోకి దిగుతున్నారు. రాహుల్ రెడీ లీగ్ వేలంలో రూ. 2.26 కోట్ల విలువ పలికిన పవన్‌కుమార్ సెహ్రావత్ (తమిళ్ తలైవాస్)పై అందరి దృష్టీ నిలిచి ఉంది. గత సీజన్లో పునేరీ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ రాహుల్ చౌదరి గాయంనుంచి కోలుకొని ఈ సారి జైపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది సీజన్లలో పట్నా పైరేట్స్ 3 సార్లు విజేతగా నిలవగా...బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టైటాన్స్ రాత మారేనా! ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లలో తెలుగు టైటాన్స్ ఒకటి. ఎనిమిది సీజన్లు కలిపి 148 మ్యాచ్‌లలో 52 గెలిచిన టైటాన్స్, అంతకంటే ఎక్కువ పరాజయాలు (77) నమోదు చేసింది. అయితే ఇతర జట్లకంటే ఎక్కువ ‘డ్రా’లు (19) కూడా టైటాన్స్ ఖాతాలో ఉన్నాయి. వీటిని విజయాలుగా మలచుకోగలిగితే కథ వేరేగా ఉండేదేమో. టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడో సీజన్లో 11వ, ఎనిమిదో సీజన్లో 12వ స్థానాల్లో నిలిచింది. అయితే ఈ సారి జట్టు కాస్త మెరుగ్గా, సమతూకంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న రైడర్ అభిషేక్ సింగ్‌ను తీసుకోగా, మనూ గోయత్, సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అంకిత్ బెనివాల్, రజనీశ్, డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్ జట్టుకు కీలకం కానున్నారు. వెంకటేశ్ గౌడ్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు తమ తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తొలిపోరు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో చివరిదైన పన్నెండో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ తొమ్మిదో సీజన్‌కు సిద్ధమైంది. ఈనెల ఏడో తేదీన బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. కొత్త ఆటగాళ్లు, కొత్త కోచ్‌తో తెలుగు టైటాన్స్ బరిలోకి దిగనుందని, ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తామని టీమ్ యజమానులు శ్రీనివాస్ శ్రీరామనేని, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి, మహేశ్ కొల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు టైటాన్స్‌కు కోచ్‌గా వెంకటేశ్ గౌడ్, కెప్టెన్‌గా రవీందర్ పహల్ వ్యవహరించనున్నారు. సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోనూ గోయట్, రజనీశ్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేశ్, విజయ్ కుమార్, ఆదర్శ్, ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, మొహమ్మద్ షిహాస్, పల్లా రామకృష్ణ, మోసిన్, హమీద్, అంకిత్, మోహిత్ పహల్, సుమిత్ జట్టులోని ఇతర సభ్యులు. -
అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్.. తెలుగు టైటాన్స్ షెడ్యూల్ ఇదే
ప్రో కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ - 9 బెంగళూరులో అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గ్రీన్కో గ్రూప్ కో–ఫౌండర్, చైర్మన్ శ్రీనివాస్ శ్రీరామనేని, ఎన్ఈడీ గ్రూప్‌కు చెందిన మహేష్ కొల్లి, గౌతమ్ రెడ్డి తెలుగు టైటాన్స్ సీజన్ 9 కొత్త జట్టు సభ్యులను పరిచయం చేశారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని మాట్లాడుతూ..''గత సీజన్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ సీజన్‌ను విజయవంతంగా మలుచుకోలుచుకోవాలనుకుంటున్నాం. మా కొత్త స్క్వాడ్‌కి పూర్తి శిక్షణను మా కోచింగ్ సిబ్బంది అందించారు. రాబోయే సీజన్లో అభిమానులకు గర్వకారణంగా మా టీమ్ నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని నేదురుమల్లి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్ 9 వివో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. మా టీమ్‌ను గత సీజన్‌తో పోలిస్తే సమూలంగా మార్చాం. ఇప్పుడు మా టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు నూతన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వెంకటేష్ గౌడ్, మన్జీత్‌ల కాంబినేషన్ టీమ్‌కు కప్‌ను తేగలదని విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం కప్ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్ పోటీపడుతుంది’’ అని చెప్పారు. తెలుగు టైటాన్స్ కోచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ‘‘పర్వేష్ భైంశ్వాల్, విశాల్ భరద్వాజ్, సూర్జీత్ సింగ్, రవీందర్ పహల్ టీమ్‌లో ఉన్నారు. వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలక ఆటగాళ్లు’’ అని తెలిపారు. ఇక మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటుగా డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చని తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9లో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న బెంగళూరు బుల్స్‌తో ఆడనుంది. తెలుగు టైటాన్స్ జట్టు: రవీందర్ పహల్ (కెప్టెన్), సిద్దార్ధ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోను గోయత్, రజ్నీష్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేష్ భైంశ్వాల్, విజయ్ కుమార్, ఆదర్శ్ , ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, ముహమ్మద్ షిహాస్, పళ్ల రామకృష్ణ, మోహసేన్ మగసౌద్లూ, హమీద్ నాడర్, అంకిత్, మోహిత్ పహల్ రిజర్వ్ ప్లేయర్- సుమిత్ తెలుగు టైటాన్స్ మ్యాచ్ షెడ్యూల్.. 7 అక్టోబర్ 2022 శుక్రవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 9 అక్టోబర్ 2022 ఆదివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 11 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 15 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ కె.సి. శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 18 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టన్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 22 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 25 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 29 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్, శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 31 అక్టోబర్ 2022 సోమవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ Vs U.P. యోద్ధ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 2 నవంబర్ 2022 బుధవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs యు ముంబా శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 5 నవంబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే -
PKL 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు
Pro Kabaddi League 2022 Schedule And Other Details: కబడ్డీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)- 2022 వచ్చే నెల(అక్టోబరు)లో ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్‌ను లీగ్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లీగ్ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తో లీగ్ ఆరంభం డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ, యు ముంబా మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 7 పీకేఎల్ సీజన్ 9కు తెరలేవనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధాస్ తలపడనున్నాయి. మొదటి దశలో భాగంగా అక్టోబరు 7 నుంచి నవంబరు 8 వరకు 66 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్లో లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టూ ఇతర జట్లతో పోటీపడుతుంది. అంతకు మించిన వినోదం ఇక వీవో పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మాషల్ స్పోర్ట్స్ హెడ్, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. బెంగళూరు, పుణె, హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సీజన్‌కు మించిన వినోదంతో కబడ్డీ అభిమానుల ముందుకు వస్తున్నామని.. సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తామని పేర్కొన్నారు. లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడంటే.. వివో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టికెట్లు ఎలా? పీకేఎల్-2022 టికెట్లను బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. చదవండి: Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?! Rohit Vs Dinesh Karthik: దినేశ్ కార్తిక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్