
ముంబై: సుదీర్ఘంగా సాగుతోన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫైనల్ మజిలీకి చేరింది. జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సంపాదించాయి. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో పింక్‌పాంథర్స్ 49–29తో బెంగళూరు బుల్స్‌పై అలవోక విజయం సాధించింది. జైపూర్ తరఫున అజిత్ (13 పాయింట్లు), సాహుల్ కుమార్ (10) రాణించారు.
బెంగళూరు జట్టులో భరత్ 7, వికాస కండోల 5, నీరజ్ నర్వాల్, సౌరభ్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో సెమీఫైనల్లో పుణేరి పల్టన్ 39–37తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. రెయిడర్ పంకజ్ మోహితే (16) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన పంకజ్ 11 సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. శనివారం జైపూర్‌తో పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకుంటుంది.
చదవండి: BBL 2022: ఔట్ అనుకుని వెళ్లిపోయాడు.. అంతలోనే అదృష్టం! ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
Comments
Please login to add a commentAdd a comment