
సెమీస్‌లో పుణె, జైపూర్(PC: PKL Twitter)
సెమీస్‌లో పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్
Pro Kabaddi League 2022- సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్ 44–30తో పట్నా పైరేట్స్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 44–30తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచాయి.
మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న పుణేరి, జైపూర్ జట్లు 79 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా జట్లు తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా పుణేరి, జైపూర్ జట్లను దాటే అవకాశం లేదు.
కాగా టాప్–6లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటాయి. మిగతా రెండు సెమీఫైనల్ బెర్త్‌ల కోసం నాలుగు జట్లు ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2 మ్యాచ్‌ల్లో తలపడతాయి.
చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం!
IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్
The 🔝 2⃣ teams in the #vivoProKabaddi Season 9 league stage are now just 2⃣ steps away from getting their hands on the 🏆#FantasticPanga #JaipurPinkPanthers #PuneriPaltan pic.twitter.com/27Gg62sKMB
— ProKabaddi (@ProKabaddi) December 5, 2022