Puneri paltans
-
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9 విజేత జైపూర్ పింక్ పాంథర్స్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9 ఛాంపియన్స్‌గా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. శనివారం పుణేరీ పల్టన్స్‌తో జరిగిన ఫైనల్లో జైపూర్ 33-29తో విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 13 రైడ్ పాయింట్లతో పాటు 15 టాకిల్ పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసిన జైపూర్ పింక్ పాంథర్స్ స్పష్టమైన ఆధిక్యం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక పీకేఎల్ తొలి సీజన్లో విజేతగా అవరతరించిన జైపూర్ పింక్ పాంథర్స్ ఎనిమిది సీజన్ల తర్వాత రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ తర్వాత రెండోసారి చాంపియన్‌గా నిలిచిన రెండో జట్టుగా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. ఇక పట్నా పైరేట్స్ అత్యధికంగా మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలవడం విశేషం. 🏆 🏆 🏆 🏆 🏆 🏆 Jaipur 🏆 🏆 Pink 🏆 🏆 Panthers 🏆 🏆 🏆 🏆 🏆 🏆 JAIPUR PINK PANTHERS ARE CROWNED CHAMPIONS OF SEASON 9 🙌#JPPvPUN #vivoProKabaddi #FantasticPanga #vivoPKL2022Final #JaipurPinkPanthers #vivoProKabaddi2022Final #Champions pic.twitter.com/h2Fa7VeI24 — ProKabaddi (@ProKabaddi) December 17, 2022 -
PKL 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పింక్ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ
ముంబై: సుదీర్ఘంగా సాగుతోన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫైనల్ మజిలీకి చేరింది. జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సంపాదించాయి. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో పింక్‌పాంథర్స్ 49–29తో బెంగళూరు బుల్స్‌పై అలవోక విజయం సాధించింది. జైపూర్ తరఫున అజిత్ (13 పాయింట్లు), సాహుల్ కుమార్ (10) రాణించారు. బెంగళూరు జట్టులో భరత్ 7, వికాస కండోల 5, నీరజ్ నర్వాల్, సౌరభ్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో సెమీఫైనల్లో పుణేరి పల్టన్ 39–37తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. రెయిడర్ పంకజ్ మోహితే (16) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన పంకజ్ 11 సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. శనివారం జైపూర్‌తో పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: BBL 2022: ఔట్ అనుకుని వెళ్లిపోయాడు.. అంతలోనే అదృష్టం! ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే? -
బెంగాల్ వారియర్స్‌కు మరో ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 39–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. పుణేరి పల్టన్ రెయిడర్ ఇనామ్దార్ 17 పాయింట్లు స్కోరు చేశాడు. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నా అతనికి ఇతర సభ్యుల నుంచి సహకారం లభించలేదు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 42–27తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. యూపీ యోధ రెయిడర్ శ్రీకాంత్ జాదవ్ 15 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్; జైపూర్ పింక్‌పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: IPL- 2022: ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! -
Pro Kabaddi League: 3 పరాజయాల తర్వాత ఎట్టకేలకు..
బెంగళూరు: వరుసగా మూడు పరాజయాల తర్వాత జైపూర్ పింక్‌పాంథర్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మళ్లీ విజయం రుచి చూసింది. పుణేరి పల్టన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 31–26తో గెలిచింది. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో జైపూర్, హరియాణా జట్లకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో తెలుగు టైటాన్స్; గుజరాత్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తొలి ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33–34తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. స్టార్ రెయిడర్ సిద్ధార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–14తో ఆధిక్యంలో నిలిచింది. అయితే పుణేరి పల్టన్ వరుస రెయిడ్ పాయింట్లతో పాటు టైటాన్స్ ప్లేయర్లను పట్టేయడంతో మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది. స్కోరు 33–33తో సమంగా ఉన్న సమయంలో కూతకు వెళ్లిన మోహిత్ పుణేరి పల్టన్‌కు పాయింట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ చివరి రెయిడ్‌కు వెళ్లిన అంకిత్ (టైటాన్స్) ఒట్టి చేతులతో రావడంతో పాయింట్ తేడాతో పుణేరి పల్టన్ విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యూపీ యోధ 36–35తో పట్నా పైరేట్స్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 40–38తో హరియాణా స్టీలర్స్‌పై నెగ్గాయి. చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే.. -
ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జట్టు బోణీ కొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 41–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌ను ఓడించింది. ఢిల్లీ రెయిడర్ నవీన్ కుమార్ ఏకంగా 16 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 24 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన నవీన్ 14 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. మ్యాచ్‌లో కనీసం 10 పాయింట్లు స్కోరు చేయడం పీకేఎల్‌లో నవీన్‌కిది వరుసగా 22వ సారి కావడం విశేషం. ఢిల్లీ ఆల్‌రౌండర్లు విజయ్ తొమ్మిది పాయింట్లు, సందీప్ నర్వాల్ మూడు పాయింట్లు స్కోరు చేశారు. పుణేరి పల్టన్ తరఫున కెప్టెన్ నితిన్ తోమర్ ఏడు పాయింట్లు, రాహుల్ చౌదరీ ఐదు పాయింట్లు సాధించారు. గురువారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్ 42–39తో హరియాణా స్టీలర్స్‌పై, గుజరాత్ జెయింట్స్ 34–27తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించాయి. చదవండి: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్దల్ -
హరియాణాను గెలిపించిన వికాశ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్‌ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్‌కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
ఉత్కంఠ పోరులో పుణెరి విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేల్)లో పుణెరి పల్టాన్ మరో అద్భుత విజయాన్ని సాధించింది. శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్ లో పుణెరి పల్టాన్ 34-33 తేడాతో యూపీ యోధాపై గెలిచి సత్తాచాటుకుంది. రెండో అర్ధభాగంలో దాదాపు పది పాయింట్లు వెనుకబడిపోయిన దశలో పుంజుకున్న పుణెరి చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పుణెరి జట్టులో దీపక్ హుడా మూడు సూపర్ రైడ్ లతో కలుపుకుని మొత్తం 16 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరొకవైపు యూపీ యోధా ప్లేయర్ సాగర్ కృష్ణ ఆరు టాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. చివర్లో యూపీ యోధా తిరిగి తేరుకున్నప్పటికీ పాయింట్ తేడాతో మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది. హోరాహోరీ ఈ మ్యాచ్ లో పుణెరికి మంచి ఆరంభం లభించింది. హుడా సూపర్ రైడ్ చేయడంతో ఆ జట్టు 5-2 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే ఏడో నిమిషంలో రిష్నక్ దేవడిగ ఒక సూపర్ రైడ్ చేయడంతో యూపీ యోధా స్కోరును 5-5 తో సమం చేసింది. కాగా, ఎనిమిదో నిమిషంలో దీపక్ హుడా మరొక సూపర్ రైడ్ సాధించి పుణెరి స్కోరు 9-5కు తీసుకుపోయాడు. అయితే పదో నిమిషంలో యోధా సూపర్ టాకిల్ చేయడంతో పుణెరి ఆధిక్యాని తగ్గించింది. ఆట15 నిమిషంలో ఇరు జట్లు స్కోరు సమం కాగా, 18 నిమిషంలో మరొకసారి పుణెరి 15-12తో ఆధిక్యంలో నిలిచింది. ఆపై మరుసటి నిమిషంలోనే యోధా ఆలౌట్ కావటంతో పుణె 18-14తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ఇక సెకండ్ హాఫ్ లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఒక్కసారిగా పుంజుకున్న యూపీ యోధా వరుస పాయింట్లతో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే భారీ వ్యత్యాసాన్ని పుణె ముందు ఉంచింది. కాగా, పాయింట్లను కాపాడుకోవాలనే భావనతో పూర్తి ఆత్మరక్షణలో పడిపోయిన యోధా అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లను కోల్పోయింది. దాంతో ఆట చివరి నిమిషంలో ఆధిక్యంలోకి వచ్చిన పుణెరి దాన్ని కాపాడుకుని పాయింట్ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. -
వరుసగా ఏడో విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఈ జట్టు జయభేరి మోగించింది. శనివారం పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో దబాంగ్ ఢిల్లీతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 27-22 తేడాతో ముంబా నెగ్గింది. పాయింట్ల పట్టికలో 35 పాయింట్లతో ఈ జట్టు టాప్‌లో కొనసాగుతోంది. చివరి ఐదు నిమిషాల వరకు ప్రత్యర్థికంటే వెనుకంజలోనే ఉన్నా ముంబా ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా కీలక సమయంలో జూలు విదిల్చారు. చకచకా పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌ను దక్కించుకున్నారు. రెండు సార్లు ఢిల్లీని ఆలౌట్ చేశారు. అయితే ఢిల్లీ కెప్టెన్ రవీందర్ పాహల్ తన డిఫెండింగ్ నైపుణ్యంతో 9 పాయింట్లు సాధించడం విశేషం. తొలి అర్ధభాగంలో ఢిల్లీ 12-11తో స్వల్ప ఆధిక్యం సాధించింది. కానీ 35వ నిమిషం నుంచి ముంబా చెలరేగింది. అప్పటికి 19-21తో వెనుకబడి ఉన్నా ఏకంగా 8 పాయింట్లు సాధించి...ఢిల్లీకి కేవలం ఒక్క పాయింట్‌ను మాత్రమే ఇచ్చింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 32-28తో పుణెరి పల్టాన్స్ జట్టుపై నెగ్గింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు పుణెరి పల్టాన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ రా. 8.00 గం. నుంచి పట్నా పైరేట్స్ బెంగాల్ వారియర్స్ రా. 9.00 గం. నుంచి స్టార్ స్పోర్ట్స్ 2 లో ప్రత్యక్ష ప్రసారం