వరుసగా ఏడో విజయం | Pro Kabaddi League: Young gun Bhupender helps U Mumba maintain dream run | Sakshi
Sakshi News home page

వరుసగా ఏడో విజయం

Published Sun, Aug 2 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

వరుసగా ఏడో విజయం

వరుసగా ఏడో విజయం

పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌లో యు ముంబా జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఈ జట్టు జయభేరి మోగించింది. శనివారం పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో దబాంగ్ ఢిల్లీతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 27-22 తేడాతో ముంబా నెగ్గింది. పాయింట్ల పట్టికలో 35 పాయింట్లతో ఈ జట్టు టాప్‌లో కొనసాగుతోంది. చివరి ఐదు నిమిషాల వరకు ప్రత్యర్థికంటే వెనుకంజలోనే ఉన్నా ముంబా ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా కీలక సమయంలో జూలు విదిల్చారు.

చకచకా పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌ను దక్కించుకున్నారు. రెండు సార్లు ఢిల్లీని ఆలౌట్ చేశారు. అయితే ఢిల్లీ కెప్టెన్ రవీందర్ పాహల్ తన డిఫెండింగ్ నైపుణ్యంతో 9 పాయింట్లు సాధించడం విశేషం. తొలి అర్ధభాగంలో ఢిల్లీ 12-11తో స్వల్ప ఆధిక్యం సాధించింది. కానీ 35వ నిమిషం నుంచి ముంబా చెలరేగింది. అప్పటికి 19-21తో వెనుకబడి ఉన్నా ఏకంగా 8 పాయింట్లు సాధించి...ఢిల్లీకి కేవలం ఒక్క పాయింట్‌ను మాత్రమే ఇచ్చింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 32-28తో పుణెరి పల్టాన్స్ జట్టుపై నెగ్గింది.

ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
పుణెరి పల్టాన్స్  జైపూర్ పింక్ పాంథర్స్
రా. 8.00 గం. నుంచి
పట్నా పైరేట్స్  బెంగాల్ వారియర్స్
రా. 9.00 గం. నుంచి
స్టార్ స్పోర్ట్స్ 2 లో ప్రత్యక్ష ప్రసారం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement