PC: PKL
బెంగళూరు: వరుసగా మూడు పరాజయాల తర్వాత జైపూర్ పింక్‌పాంథర్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మళ్లీ విజయం రుచి చూసింది. పుణేరి పల్టన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 31–26తో గెలిచింది. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లు స్కోరు చేశాడు.
మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో జైపూర్, హరియాణా జట్లకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో తెలుగు టైటాన్స్; గుజరాత్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.
చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్!
Comments
Please login to add a commentAdd a comment