
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తొలి ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33–34తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. స్టార్ రెయిడర్ సిద్ధార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–14తో ఆధిక్యంలో నిలిచింది. అయితే పుణేరి పల్టన్ వరుస రెయిడ్ పాయింట్లతో పాటు టైటాన్స్ ప్లేయర్లను పట్టేయడంతో మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది.
స్కోరు 33–33తో సమంగా ఉన్న సమయంలో కూతకు వెళ్లిన మోహిత్ పుణేరి పల్టన్‌కు పాయింట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ చివరి రెయిడ్‌కు వెళ్లిన అంకిత్ (టైటాన్స్) ఒట్టి చేతులతో రావడంతో పాయింట్ తేడాతో పుణేరి పల్టన్ విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యూపీ యోధ 36–35తో పట్నా పైరేట్స్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 40–38తో హరియాణా స్టీలర్స్‌పై నెగ్గాయి.
చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment