Telugu Titans
-
ఆఖరి బెర్త్ యు ముంబాదే
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్... ఆ తర్వాత పడుతూ లేస్తూ చివరకు గ్రూప్ దశతోనే పోరాటాన్ని ముగించింది. మంగళవారం ముగిసిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 36–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. యు ముంబా జట్టు ఆఖరి పోరులో 48 పాయింట్ల తేడాతో ఓడిపోయి ఉంటే టైటాన్స్ ఆరో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేది. కానీ యు ముంబా విజయం సాధించడంతో తెలుగు టైటాన్స్ ఏడో స్థానంతో లీగ్ దశకే పరిమితమైంది. కీలక పోరులో ముంబా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు, అజిత్ చవాన్ 6 పాయింట్లు, సునీల్ కుమార్ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 12 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 22 మ్యాచ్‌లాడి 12 విజయాలు, 8 పరాజయాలు, 2 ‘టై’లతో 71 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44–30 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ తరఫున శివమ్ చౌధరీ 13 పాయింట్లు, సురేందర్ గిల్ 9 పాయింట్లతో రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుశీల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. నేడు విశ్రాంతి రోజు. గురువారం జరగనున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
టైటాన్స్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో తెలుగు టైటాన్స్ 12వ విజయాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్ 48–36తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టును కెప్టెన్, రెయిడర్ పవన్ సెహ్రావత్ ముందుండి నడిపించాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన కెపె్టన్ 11 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. 4 బోనస్ పాయింట్లు కలుపుకొని మొత్తం 15 పాయింట్లు సాధించాడు. స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (11) కూడా క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్లలో అంకిత్ (6), అజిత్ పవార్ (3) రాణించారు. పుణేరి జట్టులో రెయిడర్ అజిత్ (10 పాయింట్లు) అదరగొట్టాడు. సబ్‌స్టిట్యూట్‌గా ఆలస్యంగా మైదానంలోకి దిగిన అజిత్ 13 సార్లు కూతకెళ్లి 10 పాయింట్లు చేశాడు. మిగతా సహచరుల్లో రెయిడర్ ఆర్యవర్ధన్ నవలె (8), డిఫెండర్లు అమన్ (5), దాదాసో పూజారి (3) రాణించారు.అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 31–28తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందడంతో ప్లే ఆఫ్స్‌కు ఐదో జట్టుగా అర్హత సాధించింది. జైపూర్ జట్టులో కెప్టెన్, రెయిడర్లు అర్జున్ దేశ్వాల్ (9), అభిజిత్ మాలిక్ (7) నిలకడగా స్కోరు చేశారు. మిగతావారిలో డిఫెండర్లు రెజా మీర్బఘేరి (5), అంకుశ్ రాఠి (3) మెరుగ్గా ఆడారు. బెంగాల్ వారియర్స్ తరఫున రెయిడర్లు ప్రణయ్ (8), అర్జున్ రాఠి (7) ఆకట్టుకున్నారు. డిఫెండర్లలో వైభవ్ గార్జే 4 పాయింట్లు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్... గుజరాత్ జెయంట్స్‌తో పోటీ పడనుండగా, దబంగ్ ఢిల్లీ... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తలపడుతుంది. -
PKL 11: ప్లే ఆఫ్స్‌లో ఢిల్లీ.. తెలుగు టైటాన్స్ పరిస్థితి?
అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఈ సీజన్లో టాప్-6కు అర్హత సాధించిన రెండో జట్టుగా జట్టు నిలిచింది. పుణె వేదికగా బెంగాల్ వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 47–25 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది.ఇక ప్రొ కబడ్డి లీగ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌నకు అర్హత పొందింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 4 మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 71 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 12 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి.మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్లుహరియాణా, ఢిల్లీ ఇప్పటికే తమ అర్హత సాధించగా.. మరో నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బెంగాల్‌తో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ ఏకంగా 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి.. తొమ్మిదిసార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. ఆరుసార్లు పాయింట్ నెగ్గకుండానే తిరిగి వచ్చాడు. మరో మూడుసార్లు విఫలమయ్యాడు.ఈ క్రమంలో.. నాలుగు బోనస్ పాయింట్లతోపాటు 12 టచ్ పాయింట్లు సాధించిన అశు ఒక ట్యాకిల్ పాయింట్ కూడా నెగ్గాడు. ఢిల్లీకే చెందిన యోగేశ్ 9 పాయింట్లు, ఆశిష్ 5 పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున విశ్వాస్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. నితేశ్ కుమార్ ఐదు పాయింట్లు, కెప్టెన్ ఫజల్ అత్రాచలి నాలుగు పాయింట్లు స్కోరు చేశారు.రేసులో పుణేరి పల్టన్ఇక మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 37–32 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో పట్నా పైరేట్స్ 68 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది. తెలుగు టైటాన్స్ ఏస్థానంలో ఉందంటే?ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇరవై మ్యాచ్‌లలో పదకొండు గెలిచిన తెలుగు టైటాన్స్ 60 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది.చదవండి: తమిళ్ తలైవాస్ అవుట్ -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: రెండు వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 36–32తో గుజరాత్ జెయంట్స్‌పై విజయం సాధించింది. స్టార్ రెయిడర్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) కూతకెళ్లిన ప్రతీ సారి ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచర రెయిడర్ ఆశిష్ నర్వాల్ (6) కూడా రాణించాడు. ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ (18) అదరగొట్టాడు. ప్రథమార్ధం ముగిసే ఆఖరి నిమిషంలో గుజరాత్ ఒకసారి తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేస్తే... ద్వితీయార్ధంలో పవన్, ఆశిష్, విజయ్‌లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ గుమన్ సింగ్ (9), రాకేశ్ (10) రెయిడింగ్‌లో ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సంపాదించిన హరియాణ స్టీలర్స్‌కు దబంగ్ ఢిల్లీ షాకిచ్చిoది. ఢిల్లీ జట్టు 44–37తో స్టీలర్స్‌పై గెలుపొందింది. రెయిడర్, ఢిల్లీ కెపె్టన్ అషు మాలిక్ (15) అద్భుతంగా రాణించాడు. అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచరుల్లో రెయిడర్ నవీన్ (7), డిఫెండర్లు యోగేశ్ (4), ఆశిష్ (5) రాణించారు. హరియాణా జట్టులో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (9), రెయిడర్ శివమ్ పతారే (6) ఆదుకున్నారు.సంజయ్, నవీన్, వినయ్ తలా 3 పాయింట్లు చేశారు. జైదీప్, రాహుల్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు (ఆదవారం) జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్... యు ముంబాతో యూపీ యోధాస్ తలపడుతుంది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 27–33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 10 పాయింట్లు, ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. దబంగ్ ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లతో రాణించగా... ఆశు మలిక్ 9 పాయింట్లతో అతడికి సహకరించాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... టైటాన్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించింది. అయితే టైటాన్స్ రెండుసార్లు ఆలౌటై... ప్రత్యర్థి కి 4 పాయింట్లు సమర్పించుకోగా... ఢిల్లీ జట్టు ఒకేసారి ఆలౌటైంది. తాజా సీజన్లో 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 10 విజయాలు, 9 పరాజయాలతో 55 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆరో స్థానంలో నిలవగా... దబంగ్ ఢిల్లీ 18 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో 61 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 11 పాయింట్లతో రాణించగా... బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. పాయింట్ల పట్టికలో యూపీ యోధాస్ (59 పాయింట్లు) నాలుగో స్థానానికి చేరగా... బెంగాల్ వారియర్స్ (40 పాయింట్లు) 9వ స్థానంలో ఉంది. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పట్నా పైరెట్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి..
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జోరుకు హరియాణా స్టీలర్స్ చెక్ పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా ఏకంగా 21 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. స్టీలర్స్ 46–25 స్కోరుతో తెలుగు టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. రెయిడర్ వినయ్ (7) ఆరంభం నుంచే క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టడంతో హరియాణా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మరో రెయిడర్ శివమ్ పతారే (12) కూతలో పాయింట్ల వేగం పెంచడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (5), డిఫెండర్లు రాహుల్ (4), సంజయ్ (3) రాణించడంతో స్టీలర్స్ ఎదురులేని విజయం సాధించింది. టైటాన్స్ తరఫున స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (13) అదరగొట్టాడు. 14 సార్లు కూతకెళ్లిన ఆశిష్ రెయిడింగ్‌లో 11 పాయింట్లు చేశాడు. ప్రత్యర్థి రెయిడర్లు నిలువరించి రెండు టాకిల్ పాయింట్లు సాధించాడు. కెపె్టన్ విజయ్ మాలిక్ 5, డిఫెండర్ అంకిత్ 2 పాయింట్లు చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు ఆడి హరియాణా 14 మ్యాచ్‌ల్లో గెలిచింది.4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 72 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ జట్టు 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 8 పరాజయాలతో 54 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 30–26 స్కోరుతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. దబంగ్ జట్టును కెప్టెన్ అశు మలిక్ (13) ముందుండి నడిపించాడు. 19 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. సహచరుల్లో నవీన్ కుమార్ (4), యోగేశ్ (3), ఆశిష్ (2) స్కోరు చేశారు. పుణేరి జట్టులో అత్యధికంగా రెయిడర్ మోహిత్ గోయత్ 7 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో పంకజ్ మోహితె (5), ఆకాశ్ షిండే (4), అమన్ (3) రాణించారు. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో కలిపి మొత్తం 56 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పుణేరి పల్టన్ 18 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 7 మ్యాచ్‌ల్లో నెగ్గి, 8 మ్యాచ్‌ల్లో ఓడింది. 3 మ్యాచ్‌లను ‘టై’గా ముగించింది. 49 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ (రాత్రి 8 గంటల నుంచి), బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పదో విజయంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 34–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. తెలుగు కెపె్టన్ విజయ్ మాలిక్ 19 సార్లు కూతకెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఆశిష్ నర్వాల్ (9) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ (14), మన్జీత్ (7) అదరగొట్టారు. దీంతో ఇరుజట్ల మధ్య ఆఖరిదాకా హోరాహోరీ సమరం జరిగింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 36–33తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. యూపీ రెయిడర్ గగన్ గౌడ (15) చెలరేగాడు.17 సార్లు కూతకెళ్లిన గగన్ క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్ (6) రాణించగా, కెప్టెన్ సుమిత్ 3, అశు సింగ్, మహేందర్, హితేశ్ తలా 2 పాయింట్లు చేశారు. పల్టన్ జట్టులో పంకజ్ మోహితే (11), మోహిత్ గోయత్ (7) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... యూ ముంబాతో గుజరాత్ జెయంట్స్ తలపడతాయి. -
టైటాన్స్‌కు మరో పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు ఏడో పరాజయం ఎదురైంది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 33–36తో యూపీ యోధాస్ చేతిలో ఓటమి పాలైంది. స్టార్ రెయిడర్ విజయ్ 11 పాయింట్లతో సత్తా చాటినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన యోధాస్ విజేతగా నిలిచింది.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 24 పాయింట్లతో ముందంజ వేసింది. యూపీ యోధాస్ ప్రధాన రెయిడర్ గగన్ నారంగ్ 15 పాయింట్లతో విజృంభించాడు. తాజా సీజన్లో 16 మ్యాచ్‌లాడిన టైటాన్స్ తొమ్మిందిట గెలిచింది. ఏడింటిలో ఓడింది. 49 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39–32తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
నోయిడా: స్టార్ రెయిడర్ విజయ్ 17 పాయింట్లతో పోరాడినా... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–41 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. విజయ్ ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు), అర్జున్ దేశ్వాల్ (11 పాయింట్లు) సత్తా చాటారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 22 రెయిడ్ పాయింట్లు సాధించింది. ట్యాక్లింగ్‌లో పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధించగా... టైటాన్స్ 7 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. టైటాన్స్ మూడు సార్లు ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 6 పాయింట్లు దక్కాయి.తాజా సీజన్లో 15 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 6 పరాజయాలతో 48 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టైటాన్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... జైపూర్ పింక్ పాంథర్స్ (46 పాయింట్లు) పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరెట్స్ 54–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 17 పాయింట్లు, అయాన్ 13 పాయింట్లతో విజృంభించగా... బుల్స్ తరఫున జై భగవాన్ 9 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. 25 పాయింట్ల తేడాతో నెగ్గిన పట్నా జట్టు పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
యు ముంబాపై తెలుగు టైటాన్స్ గెలుపు
నోయిడా: స్టార్ రెయిడర్లు ఆశిష్ కుమార్, విజయ్ చెరో 10 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిన టైటాన్స్... గురువారం జరిగిన పోరులో 41–35 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై ఘనవిజయం సాధించింది. అటు రెయిడింగ్, ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి సత్తా చాటగా... యు ముంబా జట్టు టైటాన్స్‌ను ఒకేసారి ఆలౌట్ చేయగలిగింది. తాజా లీగ్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 9 విజయాలు, 5 పరాజయాలతో 48 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 46 పాయింట్లతో ఉన్న యు ముంబా మూడో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 33–29తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), గుజరాత్ జెయింట్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: ప్రొ కబడ్డి లీగ్ ఫైనల్ తేదీ, వేదిక ఖరారు
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ వేదిక ఖరారైంది. పుణే వేదికగా ఈ మెగా టోర్నీ టైటిల్ పోరు జరుగనుంది. ఈసారి లీగ్‌ను మూడు నగరాల్లో నిర్వహిస్తుండగా... హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నోయిడా వేదికగా పోటీలు జరుగుతున్నాయి.ఇక.. డిసెంబర్ 3 నుంచి మూడో అంచె మ్యాచ్‌లు పుణేలో జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్‌తో పాటు తుదిపోరును పుణేలోనే నిర్వహించనున్నారు. బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాడ్మింటన్ హాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.డిసెంబర్ 29నఇక గ్రూప్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మరోవైపు.. మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో తలపడతాయి. కాగ.. డిసెంబర్ 26న రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు... డిసెంబర్ 27న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 29న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.ఎనభై మ్యాచ్‌లు ముగిసేసరికి ప్రొ కబడ్డి లీగ్ 2024 పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఇలా..1. హర్యానా స్టీలర్స్: ఆడినవి 14.. గెలిచినవి 11.. ఓడినవి మూడు.. పాయింట్లు 562. యు ముంబా: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 4.. టై.. ఒకటి.. పాయింట్లు 453. దబాంగ్ ఢిల్లీ: 14... గెలిచినవి 6... ఓడినవి ఐదు.. టై.. మూడు.. పాయింట్లు 434. తెలుగు టైటాన్స్: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 5.. పాయింట్లు 435. పట్నా పైరేట్స్: ఆడినవి 13... గెలిచినవి 7.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 436. పుణెరి పల్టన్: ఆడినవి 14... గెలిచినవి 6.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 427. జైపూర్ పింక్ పాంథర్స్: ఆడినవి 13.. గెలిచినవి 7.. ఓడినవి ఐదు.. టై ఒకటి.. పాయింట్లు 408. యూపీ యోధాస్: ఆడినవి 13... గెలిచినవి 6.. ఓడినవి 6.. టై ఒకటి.. పాయింట్లు 389. తమిళ్ తలైవాస్: ఆడినవి 13.. గెలిచినవి 5.. ఓడినవి 7.. టై ఒకటి.. పాయింట్లు 3310. బెంగాల్ వారియర్స్: ఆడినవి 13... గెలిచినవి 3.. ఓడినవి 8.. టై 2.. పాయింట్లు 2511. గుజరాత్ జెయింట్స్: ఆడినవి 13.. గెలిచివని 4.. ఓడినవి 8.. టై ఒకటి.. పాయింట్లు 2512. బెంగళూరు బుల్స్: ఆడినవి 14.. గెలిచినవి 2.. ఓడినవి 12.. పాయింట్లు 16.చదవండి: రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్ -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జోరు మీదున్న తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా మూడు విజయాల తర్వాత పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–31 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ 15 పాయింట్లతో సత్తాచాటగా.. ఆశీష్ నర్వాల్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రతీక్ దహియా 11 పాయింట్లతో రాణించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 16 రెయిడ్ పాయింట్లు సాధించగా... తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో జెయింట్స్ 12 పాయింట్లతో సత్తాచాటగా... టైటాన్స్ 6 పాయింట్లకే పరిమితమై పరాజయం పాలైంది. తాజా సీజన్లో 13 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలు, 5 పరాజయాలతో 43 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో విజయం కాగా... 20 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43–30 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున వినయ్, శివమ్ చెరో 11 పాయింట్లతో కదంతొక్కగా... జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. హరియాణా స్టీలర్స్ 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలు 3 పరాజయాలతో 51 పాయింట్లతో పట్టిక ‘టాప్’లో నిలిచింది. లీగ్‌లో భాగంగా ఆదివారం పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్‌తో యూపీ యోధాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్‌దే పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’ విజయాలతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 31–29తో బెంగాల్ వారియర్స్ పై నెగ్గింది. కెప్టెన్ విజయ్ మలిక్ (14 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ కీలక దశలో రెయిడింగ్‌కు వెళ్లిన విజయ్ మూడు పాయింట్లు తెచ్చిపెట్టడం టైటాన్స్ విజయానికి కారణమైంది. డిఫెన్స్‌లోనూ తెలుగు జట్టు ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేసింది. ఆల్‌రౌండర్ శంకర్ గడాయ్, డిఫెండర్ అంకిత్, రెయిడర్ మన్జీత్ తలా 3 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున రెయిడర్ ప్రణయ్ రాణే (9) అదరగొట్టాడు. తొలి అర్ధభాగాన్ని 19–9తో టైటాన్స్ ముగించగా... ద్వితీయార్ధంలో ప్రణయ్ క్రమంగా తెచ్చిపెట్టిన పాయింట్లతో రేసులోకి వచ్చింది. మిగతా వారిలో హేమరాజ్, విశ్వాస్ చెరో 4 పాయింట్లు చేశారు. అయితే తెలుగు కెప్టెన్ విజయ్ మలిక్ చేసిన పోరాటంతో విజయం దక్కింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 32–26తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ జట్టులో రెయిడర్ వినయ్ (12) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా 4, రెయిడర్ శివమ్ 5, డిఫెండర్ సంజయ్ 4 పాయింట్లు చేశారు. బుల్స్ జట్టులో ఒక్క అక్షిత్ (7) మాత్రమే నిలకడగా స్కోరు చేశాడు. స్టార్ రెయిడర్, కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ (1) ఆకట్టుకోలేకపోయాడు. నితిన్ రావల్ (4), జై భగవాన్ (3) మెరుగ్గా ఆడారు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన హరియాణా 9 విజయాలతో టాప్‌లో నిలువగా, 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచిన టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ దూకుడు
నోయిడా: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో ‘టేబుల్ టాపర్’ హరియాణా స్టీలర్స్‌ను మట్టికరిపించిన టైటాన్స్... తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 31–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టైటాన్స్ జట్టు రెయిడింగ్‌లో విఫలమైనా... డిఫెన్స్‌లో రాణించింది. టైటాన్స్ తరఫున ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించగా... సాగర్ నర్వాల్, అజిత్ పవార్, మన్జీత్ తలా 4 పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున రోహిత్ 8 పాయింట్లు, మన్జీత్ 7 పాయింట్లతో పోరాడారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో టైటాన్స్ 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... యు ముంబా 18 పాయింట్లు సాధించింది. లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 7 విజయాలు, 4 పరాజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు యు ముంబా 12 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. నేడు బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
పుష్ప 2 ఫేమస్ డైలాగ్.. ప్రొ కబడ్డీలోనూ వాడేశారు!
పుష్ప-2 ఆ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం రావాల్సిందే. అంతలా సినీప్రియులను ఊపేస్తోంది తాజాగా రిలీజైన ట్రైలర్. ఆ డైలాగ్స్, ఆ మేనరిజం బన్నీ ఫ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఊపేస్తున్నాయి. నవంబర్ 17న పాట్నా వేదికగా భారీస్థాయిలో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. దేశంలో ఇంతవరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డులను పుష్ప-2 సాధించింది.అయితే పుష్పలోని ఆ డైలాగ్ చెబితే ఫ్యాన్స్‌కే కాదు.. ఎవరికైనా పూనకాలే. అంతలా ఫేమస్ అయింది. పుష్ప-2 ట్రైలర్లో 'పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అనే బన్నీ డైలాగ్ ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఇలాంటి ఫేమస్ డైలాగ్‌ను ప్రొ కబడ్డీ లీగ్‌లోనూ వాడేశారు.ఈ సీజన్లో విజయాలతో జోరుమీదున్న తెలుగు టైటాన్ టీమ్ ప్రత్యేకంగా పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ డైలాగ్‌తో ఉన్న టీమ్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. 'టైటాన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను పుష్ప టీమ్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. టైటన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ 🔥#ProKabaddi #PKL11 #LetsKabaddi #ProKabaddiOnStar #TeluguTitans pic.twitter.com/EZXQMMkOKD— ProKabaddi (@ProKabaddi) November 18, 2024 -
తెలుగు టైటాన్స్ తడాఖా
నోయిడా: తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు పది మ్యాచ్‌లాడిన హరియాణా స్టీలర్స్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓడి, ఎనిమిదింట విజయం సాధించిది. అలాంటి మేటి ప్రదర్శన కనబరుస్తున్న హరియాణాపై తెలుగు టైటాన్స్ సాధికార విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ పోరులో కీలకమైన ఆటగాడు, కెప్టెన్ పవన్ సెహ్రావత్ గాయంతో బరిలోకి దిగలేదు. అయినా సరే టైటాన్స్ 49–27తో స్టీలర్స్‌కు ఊహించని పరాజయాన్ని రుచి చూపించింది. ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ రెయిడర్లు, డిఫెండర్లు సత్తా చాటుకోవడంతో హరియాణా ఆలౌటైంది. సరిగ్గా ప్రథమార్ధం ముగిసే సమయానికి (20 నిమిషాలు) మళ్లీ ఆలౌట్ చేసిన టైటాన్స్ ఆధిక్యాన్ని 23–11కు పెంచకుంది. ద్వితీయార్ధంలో స్టీలర్స్ పాయింట్లు చేసినప్పటికీ క్రమం తప్పకుండా తెలుగు టైటాన్స్ చేస్తున్న స్కోరును ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. రెయిడర్లు ఆశిష్ నర్వాల్ (11 పాయింట్లు), కెపె్టన్ విజయ్ మలిక్ (8) అదరగొట్టారు. డిఫెండర్ సాగర్, ఆల్‌రౌండర్ శంకర్ చెరో 5 పాయింట్లు చేశారు. హరియాణా తరఫున కెప్టెన్ రాహుల్ (6), ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (5), రెయిడర్ జయసూర్య (5) రాణించారు. ప్రస్తుతం 10 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టు ఆరో విజయంతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అనంతరం హోరాహోరిగా జరిగిన రెండో మ్యాచ్‌లో యు ముంబా 38–37 ఒకే ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ (10) ఆకట్టుకున్నాడు. అమిర్ మొహమ్మద్, కెప్టెన్ సునీల్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగళూరు జట్టులో ప్రదీప్ నర్వాల్ (10), సుశీల్ (6), నితిన్ రావల్ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి)... బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో వరుసగా నాలుగు విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 34–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ పవన్ సెహ్రావత్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్‌పుత్ 12, భరత్ 11 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 5 విజయాలు, 4 పరాజయాలలతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ లీగ్‌లో నాలుగో మ్యాచ్ నెగ్గి 25 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 35–32 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యు ముంబా తరఫున మన్జీత్ 10 పాయింట్లు, అజిత్ చవాన్ 8 పాయింట్లు సాధించగా... తలైవాస్ తరఫున మోయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. 10 మ్యాచ్‌లాడి 6వ విజయం నమోదు చేసుకున్న యు ముంబా జట్టు 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా... వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైన తమిళ్ తలైవాస్ 22 పాయింట్లతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: దుమ్ములేపిన టైటాన్స్.. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషంలో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(PKL) పదకొండో సీజన్లో భాగంగా.. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. ఆట ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో పుణెరికి చెక్ పెట్టి వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.కాగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు.ఇక పుణెరి జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లతో సత్తా చాటగా.. అతడికి తోడుగా అజిత్ కుమార్ ఆరు,మోహిత్ గోయత్ ఐదు పాయింట్లతో రాణించారు. అయినప్పటికీ ఆఖరికి ఓటమి నుంచి పుణెరి తప్పించుకోలేకపోయింది.ఆధిపత్యం చేతులు మారగాకాగా ఆట ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ వరుస రెయిడ్ పాయింట్లకు తోడు డిఫెండర్లు కూడా రాణించారు. ఇక తన మూడు రెయిడ్స్ లో పవన్ నాలుగు పాయింట్లు రాబట్టగా.. టైటాన్స్ 5–0 ఆధిక్యంతో ఆటలో ఆధిపత్యం కనబరిచింది. ఈ క్రమంలో పుణెరి జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలిపోవడంతో ఆ జట్టు ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది.ఇలాంటి దశలో పంకజ్ బోనస్ పాయింట్‌తో పుణెరి ఖాతా తెరిచాడు. పవన్ మరో టచ్ పాయింట్ట రాబట్టగా.. పుణెరి కోర్టులో పంకజ్ ఒక్కడే మిగిలాడు. తీవ్ర ఒత్తిడిలో కూతకు వెళ్లిన పంకజ్ బోనస్, సూపర్ రెయిడ్‌తో మూడు పాయింట్లతో జట్టును ఆదుకున్నాడు. ఆ వెంటనే పవన్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి 6–6తో స్కోరు సమం చేసింది.తొలి అర్ధభాగం 20–20తో సమంగా అస్లాం, పంకజ్ చెరో పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన విజయ్ను ట్యాకిల్ చేసిన పుణెరి డిఫెండర్లు తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. దాంతో పుణెరి 13–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. జట్టు మొత్తం కోర్టుపైకి వచ్చిన తర్వాత టైటాన్స్ తిరిగి పుంజుకుంది. పవన్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు.మరో రెయిడర్ విజయ్ మాలిక్ కూడా ఆకట్టుకోగా.. డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడంతో పుణెరిని ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న తెలుగు జట్టు 20–18తో తిరిగి ఆధిక్యం సాధించింది. కానీ, విరామం ముంగిట పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోవడంతో తొలి అర్ధభాగం 20–20తో సమంగా ముగిసింది.ఆఖరికి టైటాన్స్ పైచేయిరెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లడంతో ఆట సమంగా సాగింది. విరామం తర్వాత పది నిమిషాల్లో చెరో నాలుగు పాయింట్లు మాత్రమే రాబట్టాయి. అటు టైటాన్స్, ఇటు పల్టాన్ ఏ మాత్రం తప్పిదానికి తావివ్వకుండా ఆడే ప్రయత్నం చేశాయి.ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఎక్కువగా ఎమ్టీ రెయిడ్స్ వచ్చాయి. టైటాన్స్ ఒక్కో పాయింట్ ఆధిక్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసినా పుణెరి వెంటనే స్కోరు సమం చేయడంతో ఆట ఉత్కంఠగా సాగింది. అయితే రెండో భాగంలో పవన్ సెహ్రావత్ వేగం తగ్గింది. విజయ్ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నా.. టైటాన్స్ కోర్టులో తక్కువ మంది ఉండటంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఓ దశలో 31–29తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆలౌట్ అయింది. దాంతో పుణెరి 33–32తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్ ఒక రెయిడ్ పాయింట్‌తో పాటు అజిత్ కుమార్‌ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
టైటాన్స్ అదుర్స్.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
హైదరాబాద్, నవంబర్ 6: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్-8వ సీజన్ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్ నార్వల్(9), విజయ్ మాలిక్(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్ జట్టులో సచిన్ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్‌కు తోడు నితీశ్‌కుమార్(4), నరేందర్(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్లో సచిన్ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్ విజయంతో టైటాన్స్ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్ 21 పాయింట్లతో మూడులో ఉంది.ఇరు జట్లు హోరాహోరీగా..లీగ్ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ప్రతీ పాయింట్‌ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్ 20-17 తేడాతో తలైవాస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్ 18వ నిమిషంలో విజయ్ మాలిక్ రైడ్‌తో టైటాన్స్ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్‌లో పవన్ కూడా జతకలువడంతో టైటాన్స్ టాప్‌గేర్‌లోకి దూసుకొచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్ ఇద్దరిని పవన్ ఔట్ చేయడం ద్వారా తలైవాస్ తొలిసార ఆలౌటై టైటాన్స్‌కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సచిన్ 11వ నిమిషంలో కిషన్, అశిష్‌ను ఔట్ చేసి తలైవాస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన టైటాన్స్ రైడర్ అశిష్ నార్వల్..అభిషేక్‌ను ఔట్ చేసి పాయింట్ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పవన్‌ను..నితీశ్‌కుమార్ సూపర్ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు.పవన్, సచిన్ దూకుడుఓవైపు టైటాన్స్ తరఫున పవన్, మరోవైపు తలైవాస్‌కు సచిన్ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్‌పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్ 14వ నిమిషంలో టైటాన్స్ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్‌కు వెళ్లిన సచిన్ ఔట్ కావడంతో తలైవాస్ గెలుపు ఆశలపై టైటాన్స్ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్, సచిన్ రైడింగ్ జోరు అభిమానులను కట్టిపడేసింది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
హైదరాబాద్, 2 నవంబర్ 2024 : తెలుగు టైటాన్స్ పంజా విసిరింది. బెంగళూర్ బుల్స్‌ను బోల్తా కొట్టించి సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్‌పై గెలుపొందింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పవన్ సెహ్రావత్ (14 పాయింట్లు), ఆశీష్ నర్వాల్ (6 పాయింట్లు), అజిత్ పవార్ (5 పాయింట్లు), విజయ్ మాలిక్ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్ బుల్స్ తరఫున ఆల్‌రౌండర్లు పంకజ్ (9 పాయింట్లు), నితిన్ రావల్ (7 పాయింట్లు), రెయిడర్ అజింక్య పవార్ (9 పాయింట్లు), డిఫెండర్ అరుల్ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్ బుల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్ పవర్ సెహ్రావత్ సీజన్లో అత్యధిక రెయిడ్ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.తెలుగు టైటాన్స్ పంజా : ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. బెంగళూర్ బుల్స్‌పై ధనాధన్ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్ సెహ్రావత్, ఆశీష్ నర్వాల్‌లు కూతకెళ్లి బుల్స్‌ను ఆలౌట్ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్ తిరుగులేని స్థానంలో నిలిచింది. తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్ ట్యాకిల్స్‌తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది.బుల్స్ మెరుపు వేగంతో.. : విరామం అనంతరం బెంగళూర్ బుల్స్ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్ ఆలౌట్ చేసింది. మెరుపు ట్యాకిల్స్‌కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్ బుల్స్. స్టార్ రెయిడర్ పవర్ సెహ్రావత్ విఫలమైతే.. టైటాన్స్ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్‌కు పోటీ ఇచ్చిన బెంగళూర్ బుల్స్ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది. -
ఆశీష్ మెరిసే.. టైటాన్స్ మురిసే
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై మెరుపు విజయం సాధించింది. ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. తెలుగు టైటాన్స్ రెయిడర్లు ఆశీష్ నర్వాల్ (9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5 పాయింట్లు), డిఫెండర్ అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున రెయిడర్లు దేవాంక్(7 పాయింట్లు), అయాన్ (6 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్‌కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం. ప్రథమార్థం హోరాహోరీ : వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్‌తో మ్యాచ్‌లో సైతం శుభారంభం చేయలేదు. స్టార్ రెయిడర్ పవన్ సెహ్రావత్ తొలి కూతలోనే అవుట్ కాగా.. ఐదు నిమిషాల వరకు అతడు బెంచ్‌పైనే కూర్చుకున్నాడు. ఆరో నిమిషంలో పవన్ సెహ్రావత్ రాకతో తెలుగు టైటాన్స్ పాయింట్ల వేట మొదలైంది. పది నిమిషాల అనంతరం 5-7తో టైటాన్స్ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత పట్నా పైరేట్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. పైరేట్స్ రెయిడర్లలో అయాన్, దేవాంక్‌లు మెరువగా.. డిఫెండర్లు దీపక్, అంకిత్‌లు ఆకట్టుకున్నారు. దీంతో ప్రథమార్థం అనంతరం పట్నా పైరేట్స్ 13-10తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడింగ్, డిఫెన్స్‌లో పైరేట్స్‌తో సమవుజ్జీగా నిలిచిన టైటాన్స్.. అదనపు పాయింట్ల రూపంలో ఆధిక్యాన్ని కోల్పోయింది. పుంజుకున్న టైటాన్స్ : విరామం అనంతరం తెలుగు టైటాన్స్ గొప్పగా పుంజుకుంది. ఓ ట్యాకిల్, ఓ రెయిడ్ పాయింట్‌తో 12-13తో పాయింట్ల అంతరాన్ని కుదించింది. పవన్ సెహ్రావత్‌కు ఆశీష్ నర్వాల్ జతకలిశాడు. దీంతో టైటాన్స్ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ద్వితీయార్థం తొలి పది నిమిషాల్లో పది పాయింట్లు సాధించిన టైటాన్స్ 20-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్ రెయిడర్లు దేవాంక్, అయాన్లు మెరవటంతో తెలుగు టైటాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. 22-21తో ఆధిక్యం ఒక్క పాయింట్‌కు చేరుకుంది. ఈ సమయంలో ఆశీష్ నర్వాల్ సూపర్ రెయిడ్‌తో అదరగొట్టాడు. మూడు పాయింట్లు తీసుకొచ్చి 25-21తో టైటాన్స్‌ను ఆధిక్యంలో నిలిపాడు. పైరేట్స్‌కు అయాన్ సూపర్ రెయిడ్ ఇవ్వగా.. ఆ జట్టు 25-25తో స్కోరు సమం అయ్యింది. ఆఖరు నిమిషంలో ఒత్తిడిలోనూ అద్బుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ చివరి రెండు కూతల్లో పాయింట్లు సాధించింది. 28-26తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. -
టైటాన్స్ పరాజయాల ‘హ్యాట్రిక్’
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టిన తెలుగు టైటాన్స్ తర్వాత వరుసగా ఓడిపోతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37–41 స్కోరు తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో కంగుతింది. తెలుగు టైటాన్స్‌కు వరుసగా ఇది మూడో ఓటమి. కెప్టెన్ పవన్ సెహ్రావత్ జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటమే చేశాడు. 17 సార్లు కూతకెళ్లిన పవన్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. 6 బోనస్ పాయింట్లు సహా మొత్తం 18 పాయింట్లు సాధించాడు. మరో రెయిడర్ ఆశిష్ నర్వాల్ (9) కూడా రాణించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ 3, డిఫెండర్ సాగర్ 2 పాయింట్లు తెచ్చారు. అయితే ప్రత్యర్థి దబంగ్ ఢిల్లీ జట్టు తరఫున రెయిడర్లు కెపె్టన్ నవీన్ కుమార్, అశు మాలిక్ చెలరేగారు. ఇద్దరు చెరో 15 పాయింట్లతో జట్టు విజయానికి బాట వేశారు.వీళ్లిద్దరు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టడంతో తెలుగు టైటాన్స్ ఆఖరిదాకా పోరాడిన ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో గెలిచి మూడింట ఓడింది. మూడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగే పోటీల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూపీ యోధాస్‌ను గుజరాత్ జెయింట్స్ ఢీకొంటుంది. బెంగాల్, యూ ముంబా మ్యాచ్ టై అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూ ముంబా, బెంగాల్ వారియర్స్ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ 31–31 స్కోరు వద్ద టై అయ్యింది. వారియర్స్ జట్టులో రెయిడర్ మణిందర్ సింగ్ (8 పాయింట్లు), డిఫెండర్ మయూర్ కదం (6) అదరగొట్టారు. ఒకరు కూతకెల్లి పాయింట్లు తెస్తుంటే మరొకరు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్ చేసి పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో నితీశ్ కుమార్ (4), సుశీల్ కాంబ్రేకర్ (3), నితిన్ ధన్కర్ (3), కెప్టెన్ ఫజల్ అత్రాచలి (3) మెరుగ్గా ఆడారు. యూ ముంబా జట్టులో రెయిడర్ మన్జీత్ (7 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. -
తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి
హైదరాబాద్, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. జైపూర్ జట్టులో అర్జున్ తో పాటు అభిజీత్ మాలిక్ (8) కూడా ఆకట్టుకున్నాడు. ఆతిథ్య టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజయ్ మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్ నాలుగుసార్లు ఆలౌటైంది.ఇరు జట్ల మధ్య ఆరంభం నుంచి ఆట హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగం మొదటి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ మెప్పించగా.. చివరి పది నిమిషాల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పైచేయా సాధించింది. తన తొలి రైడ్‌లోనే టచ్ పాయింట్‌తో కెప్టెన్ పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్ ఖాతా తెరిచాడు. ఆ వెంటనే అర్జున్ దేశ్వాల్ జైపూర్‌కు తొలి పాయింట్ అందించాడు. రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లాయి. 6–6తో స్కోరు సమంగా నిలిచిన దశలో అర్జున్ను ట్యాకిల్ చేసిన టైటాన్స్.. పవన్ వరుస రైడ్ పాయింట్లతో 9–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో పవన్‌ను ఔట్ చేయడంతో పాటు వరుసగా మూడు పాయింట్లు రాబట్టిన జైపూర్ 9–9తో స్కోరు సమం చేసింది. అయితే, 18వ నిమిషంలో జైపూర్ అభిజీత్ చేసిన సూపర్ రైడ్ ఆటను మలుపు తిప్పింది. బోనస్‌తో పాటు అంకిత్, పవన్, క్రిషన్‌లను ఔట్ చేసిన అభిజీత్ ఏకంగా నాలుగు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అర్జున్ కోర్టులో మిగిలిన ఇద్దరు డిఫెండర్ల పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో టైటాన్స్‌ను తొలిసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 18–13తో ఐదు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.రెండో భాగంలో జైపూర్ విజృంభించగా.. తెలుగు జట్టూ పూర్తిగా డీలా పడింది. విరామం తర్వాత అర్జున్ జైపూర్‌కు మరో రైడ్ పాయింట్ అందించగా, విజయ్ మాలిక్ జైపూర్ ఆటగాడు రెజాను టచ్ చేసి వచ్చాడు. కానీ, తన తర్వాతి రైడ్‌లో అర్జున్.. విజయ్, సాగర్‌ను ఔట్ చేసి జట్టుకు మరో రెండు పాయింట్లు తెచ్చి పెట్టడంతో జైపూర్ తన ఆధిక్యాన్ని 21–14కి పెంచుకుంది. ఆపై ఇరు జట్ల డూ ఆర్ డై రైడ్స్‌లో ఇటు పవన్, అటు అర్జున్ సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలో అర్జున్ సూపర్ టెన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కెప్టెన్లు వరుస రైడ్స్ చేయగా.. ఇందులో అర్జున్ పైచేయి సాధించాడు. అర్జున్ వరుసగా రెండు డబుల్ రైడ్స్‌తో సత్తా చాటగా.. పవన్‌ను అంకుష్ ట్యాకిల్ చేశాడు. విజయ్ మాలిక్‌ను కూడా ట్యాకిల్ చేసిన పింక్ పాంథర్స్ జట్టు టైటాన్స్‌ను రెండోసారి ఆలౌట్ చేసి 31–17తో విజయం ఖాయం చేసుకుంది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ మరింత నిరాశ పరిచింది. సెహ్రావత్ సహా రైడర్లు ప్రత్యర్థికి దొరికిపోగా.. డిఫెండర్లు సైతం చేతులెత్తేశారు. దాంతో మరో రెండుసార్లు ఆలౌటైన తెలుగు జట్టు 21–49తో వెనుకబడింది. మరోవైపు అర్జున్ సూపర్ రైడింగ్‌తో జైపూర్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్..
-
PKL: తమిళ్ తలైవాస్ చేతిలో టైటాన్స్ చిత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన ఆతిథ్య తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశ పరిచింది. తమిళ్ తలైవాస్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తలైవాస్ తరఫున నరేందర్ ఖండోలా, సచిన్ సూపర్ టెన్స్ విజృంభించడంతో టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు.హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 44–29 తేడాతో తెలుగు టైటాన్స్ ను చిత్తు చేసింది. ఆరంభంలో విజృంభించిన టైటాన్స్ ప్లేయర్ పవన్ సెహ్రావత్ (10) వరుసగా రెండో సూపర్ టెన్ సాధించినా.. ఆ తర్వాత తడబడ్డాడు. అనంతరం విజయ్ మాలిక్ (9) పోరాడినా ఫలితం లేకపోయింది. తమిళ్ తలైవాస్ జట్టులో నరేందర్, సచిన్ చెరో పది పాయింట్లు తీసుకురాగా.. డిఫెండర్ సాహిల్ గులియా ఐదు పాయింట్లతో హై ఫైవ్ సాధించాడు.టైటాన్స్- తలైవాస్ పోరుసాగిందిలాతలైవాస్తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఆరంభంలో వరుస రైడ్ పాయింట్లతో చెలరేగాడు. మొదటి కూతలోనే సూపర్ రైడ్ చేయడంతో 3–0తో ఆటను ఆరంభించిన తెలుగు టైటాన్స్.. పవన్ డబుల్ రైడ్ పాయింట్‌తో 5–1తో ఆధిక్యం సాధించింది. కానీ,అభిషేక్ చేసిన ట్యాకిల్‌తో పవన్‌ను నిలువరించిన తలైవాస్ ఒక్కసారిగా జోరు పెంచింది. నరేందర్ ఖండోలా ముగ్గురు డిఫెండర్లను ఔట్ చేస్తూ సూపర్ రైడ్ చేయడంతో 7–6తో ఆధిక్యంలోకి వచ్చింది.ఆపై కోర్టులో మిగిలిన క్రిషన్, విజయ్ మాలిన్ ను సచిన్ అవుట్ చేశాడు. ఫలితంగా ఆరో నిమిషంలోనే తెలుగు టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సాహిల్, అభిషేక్ తృత్వంలోని డిఫెండర్లు కూడా సత్తా చాటడంతో సెహ్రావత్ ను మరోసారి కోర్టు బయటికి పంపించిన తమిళ జట్టు తన ఆధిక్యాన్ని 14–9కి పెంచుకుంది.ఈ దశలో టైటాన్స్ రైడర్ విజయ్ మాలిక్ పోరాటంతో ఆతిథ్య జట్టు వెంటవెంటనే పాయింట్లు రాబట్టి 14–15తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, తలైవాస్ రైడర్ నరేందర్‌తో పాటు సచిన్ కూడా జోరు కనబరిచాడు.సెహ్రావత్ ఎక్కువ సేపు కోర్టు బయట ఉంచిన ఆ జట్టు 20–17తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఓవైపు విజయ్ మాలిక్ రైడ్ పాయింట్లు రాబడుతున్నా.. కెప్టెన్ సెహ్రావత్ నిరాశ పరచడంతో మళ్లీ వెనకబడింది. ఇంకోవైపు సచిన్‌ను నిలువరించడంలో టైటాన్స్ డిఫెండర్లు పూర్తిగా విఫలమయ్యారు.31వ నిమిషంలో మరోసారి ఆలౌట్ చేసిన తలైవాస్ 31–21తో ఆధిక్యం సాధించింది. పూర్తి జట్టు కోర్టులోకి వచ్చిన తర్వాత కూడా తెలుగు టైటాన్స్ తడబాటు మారలేదు. నరేందర్ తన సూపర్ టెన్ పూర్తి చేసుకుంటూ అంకిత్, అజిత్ పవార్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో మూడోసారి టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తలైవాస్ 40–24తో భారీ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి ఐదు నిమిమిషాల్లో తెలుగు జట్టు పోరాటం ఓటమి అంతరాన్ని కూడా పెద్దగా తగ్గించలేకపోయింది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. లీగ్‌లో ప్రతీ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన టైటాన్స్ ఈసారి శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించగా ... బెంగళూరు కెపె్టన్ ప్రదీప్ నర్వాల్ కేవలం 3 పాయింట్లే నమోదు చేసి విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–11తో 9 పాయింట్ల తేడాతో ముందంజలో నిలిచింది. అయితే ఆ తర్వాత కోలుకున్న బుల్స్ 18–11 పాయింట్లతో రెండో అర్ధభాగంలో ఆధిక్యం ప్రదర్శించింది. బుల్స్ తమ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయగా... టైటాన్స్ జట్టు బెంగళూరును రెండుసార్లు ఆలౌట్ చేసింది. పవన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో 1200 రైడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు 36–28 పాయింట్ల తేడాతో యు ముంబా జట్టును ఓడించింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
తొడగొట్టేందుకు సిద్ధం.. ప్రో కబడ్డీ లీగ్‌కు సర్వం సిద్దం
సాక్షి, హైదరాబాద్: పది సీజన్లుగా కబడ్డీ అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడాది వ్యవధిలోపే మళ్లీ ముందుకు వచ్చింది. పీకేఎల్ 11వ సీజన్‌కు నేటితో తెర లేవనుంది. గత సీజన్కంటే భిన్నంగా ఈసారి మూడు వేదికలకే టోర్నీ లీగ్ దశను పరిమితం చేస్తున్నారు. సీజన్–10 ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే నేడు టోర్నీ ప్రారంభం అవుతుంది. నవంబర్ 9 వరకు ఇక్కడే పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత నోయిడా, పుణే తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. మరోసారి 12 టీమ్‌లతోనే పీకేఆల్ జరగనుండగా... లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) ఐదు మ్యాచ్‌లతో కలిపి ఓవరాల్‌గా 137 మ్యాచ్‌లు పీకేఎల్‌లో జరుగుతాయి. టోర్నీ తొలిరోజు జరిగే మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తలపడనుండగా... మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, యు ముంబా మధ్య రెండో మ్యాచ్ మ్యాచ్ (రాత్రి 9 గంటల నుంచి) జరుగుతుంది. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 24న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేస్తారు. భారీ వేలంతో మొదలు... సీజన్–11 కోసం నిర్వహించిన వేలంలో ఆటగాళ్లకు భారీ విలువ పలికింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రూ. 1 కోటికి పైగా విలువతో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో ఏకంగా 8 మంది ఉండటం విశేషం. అత్యధికంగా తమిళ్ తలైవాస్ సచిన్ తన్వర్‌ను రూ.2 కోట్ల 15 లక్షలకు దక్కించుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు గురువారం హైదరాబాద్‌లో ట్రోఫీ ఆవిష్కరణ సహా లీగ్ ప్రచార కార్యక్రమం జరిగింది. పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తదితరులు ఇందులో పాల్గొన్నారు. దశాబ్దకాలంగా తమ లీగ్‌కు మంచి ఆదరణ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన మున్ముందు టోర్నీని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ప్రకటించారు. పీకేఎల్ రాకతో తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు వచ్చి0దని... డబ్బుతో పాటు గుర్తింపూ దక్కిందని అగ్రశ్రేణి ఆటగాళ్లు పవన్ సెహ్రావత్, ప్రదీప్ నర్వాల్ వెల్లడించారు. టైటాన్స్ రాత మారేనా... ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైన నాటినుంచి లీగ్‌లో ఉన్న ఎనిమిది జట్లలో తెలుగు టైటాన్స్ కూడా ఒకటి. కానీ మిగతా ఏడు జట్లతో పోలిస్తే టైటాన్స్‌దే ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన. టైటాన్స్ మినహా మిగిలిన ఏడు జట్లు కనీసం ఒక్కసారైనా విజేతగా నిలవడం విశేషం. రెండో సీజన్లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటి వరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లుగానైతే మరీ చెత్త ప్రదర్శనతో చివరిదైన 12వ స్థానంలో నిలుస్తూ వచ్చి0ది. ఓవరాల్‌గా 10 సీజన్లలో కలిపి 192 మ్యాచ్‌లు ఆడితే 56 మాత్రమే గెలిచి 116 ఓడిపోయింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, లీగ్‌లో దబంగ్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ కృషన్ కుమార్ హుడా ఈసారి టైటాన్స్ కోచ్‌గా రావడం జట్టుకు సానుకూలాంశం. అతని నేతృత్వంలో టీమ్ రాత మారుతుందా అనేది ఆసక్తికరం. వేలంలో ఎఫ్బీఎం ద్వారా రూ.1.72 కోట్లకు కెపె్టన్ పవన్ సెహ్రావత్‌ను టీమ్ కొనసాగించింది. విజయ్ మలిక్, అమిత్ కుమార్, సంజీవి వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే పవన్ మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి రైడర్ లేకపోవడం జట్టులో ఒక లోపం. ప్రఫుల్, ఓంకార్, మన్జీత్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. డిఫెన్స్‌లో కృషన్ ధుల్ రూపంలో కీలక ఆటగాడు ఉండగా... మిలాద్, అజిత్, సాగర్ నుంచి సహకారం అవసరం. పీకేఎల్–11లో పాల్గొనే జట్లు: తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యు ముంబా, యూపీ యోధాస్. -
నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. డిసెంబర్ 24 వరకు సాగే లీగ్ దశలో 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్‌తో పాటు నోయిడా, పుణే ఇతర వేదికలుగా ఉన్నాయి. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో బెంగళూరు బుల్స్; ఢిల్లీ దబంగ్‌తో యు ముంబా ఆడతాయి. గురువారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని జట్ల కెపె్టన్లు పాల్గొన్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడాలనుకునే కబడ్డీ అభిమానులు bౌౌజుఝyటజిౌఠీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. రూ.500, రూ.1000, రూ. 2500లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు నవంబర్ 9వ తేదీన ముగుస్తాయి. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలో... డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. -
PKL: షెడ్యూల్ పూర్తి వివరాలు.. తొలి మ్యాచ్‌లో తలపడే జట్లు ఇవే
Pro Kabaddi League Season 11: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆరంభ దశ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 18 నుంచి పీకేఎల్ ప్రారంభం కానుండగా... గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగనున్న తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది.అదే రోజు జరగనున్న రెండో మ్యాచ్‌లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ పోటీపడుతుంది. మూడు వేదికల్లో పీకేఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించగా... అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్‌లో పీకేఎల్ తొలి దశ సాగనుంది.ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో లీగ్ సాగనుంది. ఇక ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. గత నెలలో జరిగిన పీకేఎల్ వేలంలో మొత్తం 12 జట్లు తమ అస్త్రశ్రస్తాలకు పదును పెంచుకోగా... లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది మంది ప్లేయర్లు కోటి రూపాయలకు పైగా ధర పలికారు. హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)అక్టోబర్ 18, శుక్రవారం-తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)-దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 19, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 20, ఆదివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు) అక్టోబర్ 21, సోమవారం- యూపీ యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 22, మంగళవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 23, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 24, గురువారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 25, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 26, శనివారం- యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 27, ఆదివారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 28, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 29, మంగళవారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 30, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 31, గురువారం- పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 2, శనివారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 3, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 4, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 5, మంగళవారం- యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 6, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 7, గురువారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 8, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 9, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)నోయిడా (నోయిడా ఇండోర్ స్టేడియం)నవంబర్ 10, ఆదివారం- యూపీ యోధాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 11, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 12, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 13, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 14, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 15, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 16, శనివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 17, ఆదివారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 18, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 19, మంగళవారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 20, బుధవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 21, గురువారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 22, శుక్రవారంజైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 23, శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 24, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 25, సోమవారం- యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 26, మంగళవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 27, బుధవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 28, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 29, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 30, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 1, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)పుణె (బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం)డిసెంబర్ 3, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 4, బుధవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 5, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 6, శుక్రవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 7, శనివారం- యూపీ యోధాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 8, ఆదివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 9, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 10, మంగళవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 11, బుధవారంహర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 12, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 13, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 14, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 15, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 16, సోమవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 17, మంగళవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 18, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 19, గురువారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 20, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 21, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 22, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 23, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 24, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు) -
ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభ తేదీ ప్రకటన
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన మొదలవుతుంది. మూడు నగరాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబరు 18 నుంచి తొలి అంచె పోటీలు జరుగుతాయి. అనంతరం నవంబరు 10 నుంచి రెండో అంచె మ్యాచ్‌లకు నోయిడా నగరం ఆతిథ్యమిస్తుంది. చివరి అంచె పోటీలు డిసెంబరు 3 నుంచి పుణేలో జరుగుతాయని... పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని పీకేఎల్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. కాగా 2014లో ప్రొ కబడ్డీ లీగ్ మొదలైంది. ఇప్పటి వరకు 10 సీజన్లపాటు ఈ టోర్నీ జరిగింది. పుణేరి పల్టన్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యంపట్నా పైరేట్స్ జట్టు అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలువగా... జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు రెండుసార్లు టైటిల్‌ను దక్కించుకుంది. బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, యు ముంబా, పుణేరి పల్టన్ జట్లు ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి. తెలుగు టైటాన్స్ జట్టు రెండో సీజన్లో మూడో స్థానంలో, నాలుగో సీజన్లో నాలుగో స్థానంలో నిలిచింది. గత మూడు సీజన్లలో తెలుగు టైటాన్స్ జట్టు చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. -
PKL Auction: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ సహా పూర్తి వివరాలు
పది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆగష్టు 15, 16 తేదీల్లో ప్లేయర్ల వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో పీకేఎల్‌లో భాగమైన పన్నెండు ఫ్రాంఛైజీలు.. అంతా కలిపి 88 మంది ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.అయితే, అనూహ్య రీతిలో ప్రదీప్ నర్వాల్, పవన్ షెరావత్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా తదితర స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొననుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా, వేలంలో ఆటగాళ్లను కొనేందుకు పర్సులో మిగిలి ఉన్న మొత్తం, వేలం ఆరంభ సమయం, లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడ తదితర వివరాలు మీకోసం..పన్నెండు జట్లు ఇవేతెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, యూ ముంబా, యూపీ యోధాస్.రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతెలుగు టైటాన్స్అంకిత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, సంజీవి ఎస్, నీల్, శంకర్ భీమ్రాజ్ గడాయ్, అజిత్ పాండురంగ పవార్.బెంగాల్ వారియర్స్శ్రేయాస్ ఉమర్దండ్, ఆదిత్య ఎస్ షిండే, దీపక్ అర్జున్ షిండే, మహరుద్ర గార్జే, నీల్, విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్.బెంగళూరు బుల్స్ఆదిత్య శంకర్ పవార్, అక్షిత్, అరుల్అనంతబాబు, ప్రతీక్, సౌరభ్ నందాల్, పొన్పార్తీబన్ సుబ్రమణియన్, సుశీల్, రోహిత్ కుమార్.దబాంగ్ ఢిల్లీఆశిష్, హిమ్మత్ అంతిల్, మనూ, యోగేశ్, నీల్, అన్షు మాలిక్, విక్రాంత్, నవీన్ కుమార్.గుజరాత్ జెయింట్స్నితిన్, ప్రతీక్ దహియా, రాకేశ్,బాలాజీ డి, జితేందర్ యాదవ్.హర్యానా స్టీలర్స్జయసూర్య ఎన్ఎస్, హర్దీప్, శివం అనిల్ పటారే, విశాల్ ఎస్ టాటే, జైదీప్, మోహిత్, వినయ్, రాహుల్ సేత్పాల్, ఘనశ్యామ్ రోకా మగర్.జైపూర్ పింక్ పాంథర్స్అభిజీత్ మాలిక్, అంకుశ్, అభిషేక్ కేఎస్, అర్జున్ దేశ్వాల్, రెజా మీరాఘెరిపట్నా పైరైట్స్అబినంద్ శుబాంశ్, కునాల్ మెహతా, సుధాకర్ ఎమ్, మనీశ్, అంకిత్, సందీప్ కుమార్.పుణెరి పల్టన్దదాసో శివాజీ పూజారి, నితిన్, తుషార్ దత్తాత్రేయ అధావడె, వైభవ్ బాలాసాహెబ్ కాంబ్లీ, ఆదిత్య తుషార్ షిండే, ఆకాశ్ సంతోశ్ షిండే, మోహిత్ గయత్, అస్లాం ముస్తఫా ఇనాందార్, పంకజ్ మోహితే, సంకేత్ సెహ్రావత్, అబినేశ్ నదరాజన్, గౌరవ్ ఖత్రీ.తమిళ్ తలైవాస్నితేశ్ కుమార్, నితిన్ సింగ్, రొనాక్, విశాల్ చహల్, నరేందర్, సాహిల్, మోహిత్, ఆశిష్, సాగర్, హిమాన్షు, ఎం. అభిషేక్, నీల్.యూ ముంబాబిట్టు, గోకులకన్నన్ ఎం, ముకిలన్ షణ్ముగం, సోంవీర్, శివం, అమీర్ మొహ్మద్ జఫార్దనేశ్, రింకూ.యూపీ యోధాస్గగన గౌడ హెచ్ఆర్, హితేశ్, శివం చౌదరి, సుమిత్, సురేందర్ గిల్, అశూ సింగ్, నీల్.ఒక్కో జట్టులో ఎంత మంది?కనీసం 18 నుంచి అత్యధిక 25 మంది ఆటగాళ్లు ఒక్కో జట్టులో ఉండవచ్చు. ఇప్పటికి 88 మందిని ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి గనుక 212 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.ఎంత మంది విదేశీ ఆటగాళ్లు?ఒక్కో జట్టులో కనీసం రెండు, అత్యధికంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండవచ్చు.టీమ్ పర్సు వివరాలుఒక్కో ఫ్రాంఛైజీ రూ. 5 కోట్ల మేర పర్సు వాల్యూ కలిగి ఉంటుంది. అయితే, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం చెల్లించిన మొత్తం పోగా.. మిగిలిన డబ్బుతో వేలంలో పాల్గొంటాయి.సీజన్-11 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీల పర్సులో మిగిలి ఉన్న మొత్తం👉బెంగాల్ వారియర్స్'- రూ. 3.62 కోట్లు👉బెంగళూరు బుల్స్- రూ. 3.02 కోట్లు👉దబాంగ్ ఢిల్లీ- రూ. 2.66 కోట్లు👉గుజరాత్ జెయింట్స్- రూ. 4.08 కోట్లు👉హర్యానా స్టీలర్స్- రూ. 2.32 కోట్లు👉జైపూర్ పింక్ పాంథర్స్- రూ. 2.29 కోట్లు👉పట్నా పైరేట్స్- రూ. 3.59 కోట్లు👉పుణెరి పల్టన్- రూ. 2.12 కోట్లు👉తమిళ్ తలైవాస్- రూ. 2.57 కోట్లు👉తెలుగు టైటాన్స్- రూ. 3.82 కోట్లు👉యు ముంబా- 2.88 కోట్లు👉యూపీ యోధాస్- 3.16 కోట్లు.నాలుగు కేటగిరీలు👉‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు👉‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. 👉‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు👉‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధర 👉ఈ సారి వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననున్నారు.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?ఆగష్టు 15 రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం(టీవీ). డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: అర్షద్ నదీమ్‌పై కానుకల వర్షం.. ఘన సత్కారం -
‘టై’తో టైటాన్స్ ముగింపు
పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నిర్ణీత 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ ఆడతాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ తెలుగు టైటాన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 55–35 స్కోరుతో టైటాన్స్‌పై విజయం సాధించింది. తెలుగు జట్టు తరఫున మిలాద్ జబారి 9, ప్రఫుల్ జవారే 8, పవన్ సెహ్రావత్ 6 పాయింట్లు సాధించగా...బెంగాల్ ఆటగాళ్ళలో నితిన్ కుమార్ 13 పాయింట్లతో చెలరేగాడు. టైటాన్స్‌కు ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లలో ఇది 17వ పరాజయం. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 44–23 స్కోరుతో యు ముంబాపై గెలుపొందింది. -
PKL 2024: తీరు మార్చుకోని తెలుగు టైటాన్స్.. మరో ఘోర ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ 15వ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం పట్నాలో పుణేరి పల్టన్‌తో జరిగిన పోరులో పవన్ సెహ్రావత్ నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ 29–60 తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పుణేరి ఆల్‌రౌండ్ దెబ్బకు టైటాన్స్ జట్టు నాలుగుసార్లు ఆలౌటైంది. పల్టన్ తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో రాణించాడు. టైటాన్స్ ప్లేయర్ సంజీవి అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (17 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు) టైటాన్స్ చివరి స్థానంలో ఉండగా.. పుణేరి పల్టన్ 16 మ్యాచ్‌ల్లో 12 విజయలతో అగ్రస్థానంలో నిలిచింది. -
తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు 14వ పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పవన్ సెహ్రావత్ కెపె్టన్సీలోని తెలుగు టైటాన్స్ 29–54తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. బుధవారంతో హైదరాబాద్ అంచె పోటీలు ముగిశాయి. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం పటా్నలో జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్; గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా తలపడతాయి. -
తీరు మారని తెలుగు టైటాన్స్.. 13వ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఖాతాలో 13వ పరాజయం చేరింది. హరియాణా స్టీలర్స్‌తో సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–37తో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున సంజీవి, ప్రఫుల్ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–25తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. చదవండి: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం -
ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని సాధించి సొంత ప్రేక్షకుల్ని మురిపించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 49–32 స్కోరుతో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (16 పాయింట్లు), ఓంకార్ (10) రాణించారు. అంతకుముందు జరిగిన తొలిపోరులో దబంగ్ ఢిల్లీ 39–33తో యు ముంబాపై నెగ్గింది. -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్‌తో యూపీ యోధాస్ తలపడతాయి. -
గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్.. ఎప్పుడంటే?
క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ప్రో కబాడ్డీ లీగ్ సీజన్ 10లో తమ హోమ్ మ్యాచ్‌లను ప్రారంభించడానికి తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది. హోమ్ మ్యాచ్‌లను జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్‌లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లు bookmyshow లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్‌ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా గొప్ప స్థాయికి పెరిగిందన్నారు. . ప్రో కబడ్డీ లీగ్ ప్రస్తుత సీజన్‌లా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్‌లకు సాక్షిగా నిలబోతుందన్నారు. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్, సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్‌ను జనవరి 19, 2024న బెంగళూరు బుల్స్‌తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్‌ని లైవ్‌లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్‌లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్‌స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. -
PKL: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. పదకొండో పరాజయం
Pro Kabaddi League Telugu Titans 11th Defeat- జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–38తో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్‌కిది 11వ ఓటమి కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లు స్కోరు చేయగా... సందీప్ ధుల్, రాబిన్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 14 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 37–17తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. పుణేరి పల్టన్ కెప్టెన్ అస్లమ్ ముస్తఫా 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్; యూపీ యోధాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. చదవండి: Ind vs Eng: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన -
Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. సీజన్లో పదో పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 26–46తో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది పదో పరాజయం. టైటాన్స్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పవన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. వారియర్స్ జట్టులో వైభవ్ 9 పాయింట్లు, నితిన్ 9 పాయింట్లు, విశ్వాస్ 8 పాయింట్లు, శుభమ్ 6 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తమిళ్ తలైవాస్; యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
Pro kabaddi League 2023: మళ్లీ ఓడిన టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 18–54 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ జట్టు కెపె్టన్ పవన్ సెహ్రావత్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. పవన్ కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 14 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పవన్ ఒకసారి సఫలమై, మరోసారి బోనస్ పాయింట్ రాబట్టాడు. తొమ్మిదిసార్లు పాయింట్ సాధించకుండానే తిరిగి వచ్చాడు. టైటాన్స్ జట్టు మరో ప్లేయర్ సందీప్ ఐదు పాయింట్లు గెలిచాడు. మరోవైపు పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్, అస్లమ్ ముస్తఫా చెలరేగిపోయారు. మోహిత్ 13 పాయింట్లు, అస్లమ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. గౌరవ్ ఖత్రీ (6), అభినేశ్ (5), మొహమ్మద్ రెజా (5) కూడా రాణించారు. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 48–41తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 21 పాయింట్లతో అదరగొట్టినా తన జట్టును గెలిపించలేకపోయాడు. చదవండి: సంజూ శాంసన్ భారీ సిక్సర్.. బంతి ఎక్కడ పడిందో తెలుసా? వీడియో వైరల్ -
PKL 2024: టైటాన్స్‌కు ఏడో ఓటమి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–54తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. యు ముంబా తరఫున గుమన్ సింగ్ 10 పాయింట్లు, రింకూ 8 పాయింట్లు, సోంబీర్ 8 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున రజనీశ్ 8 పాయింట్లు, రాబిన్ చౌధరీ 7 పాయింట్లు, ప్రఫుల్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–25తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్; తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2023: పవన్ పోరాటం వృథా
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆరో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టిన టైటాన్స్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఏడో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అజిత్ పవార్ 5 పాయింట్లు, రజనీశ్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుర్జీత్ సింగ్ (7), భరత్ (6), వికాశ్ కండోలా (5), నీరజ్ నర్వాల్ (5) రాణించారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 39–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 8 పాయింట్లు, గుమన్ సింగ్ 6 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు స్కోరు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. Came like 𝙋𝙖𝙬𝙖𝙣, went with the Bulls 😉#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/azN98ZP8fU — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 SUPE𝐑𝐑𝐑 TACKLE ft. Ajit Pawar 💛#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/fHyLLmze8F — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 -
PKL: ఎట్టకేలకు బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్.. ఉత్కంఠ పోరులో విజయం
Pro Kabaddi League 2023: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన తమ ఆరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–36తో హరియాణా స్టీలర్స్ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్ పవార్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. When you play for the Steelers, you always 𝐒𝐓𝐄𝐀𝐋 points 😉🔥#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #HSvTT #HaryanaSteelers #TeluguTitans pic.twitter.com/Es9C6C7ZYx — ProKabaddi (@ProKabaddi) December 22, 2023 టాప్‌లో పుణెరి పల్టన్.. టైటాన్స్ చివర ఇక పీకేఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు పుణెరి పల్టన్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు... బెంగాల్ వారియర్స్ ఆరింట మూడు(21 పాయింట్లు), హరియాణా స్టీలర్స్ ఆరింట నాలుగు(21 పాయింట్లు), జైపూర్ పింక్ పాంథర్స్ ఆరింట మూడు (20 పాయింట్లు) గెలిచి టాప్-4లో స్థానం సంపాదించాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది. చదవండి: విండీస్‌దే టి20 సిరీస్ తరూబా (ట్రినిడాడ్): సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టు వన్డే, టి20ల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది. ఇంతకుముందే వన్డే సిరీస్‌ను గెలుచున్న విండీస్ ఇప్పుడు టి20 సిరీస్‌నూ 3–2తో తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో రోవ్‌మన్ పావెల్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (22 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుడకేశ్ మోతీ (3/24) ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్ (43 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోరీ్నలో నాలుగో మ్యాచ్ ఆడిన జట్టు వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కొంది. బుధవారం హోరాహోరీగా జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 38–36 స్కోరుతో టైటాన్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్, రాబిన్ చౌదరి చెరో 7 పాయింట్లు సాధించారు. తలైవాస్ ఆటగాళ్లలో నరేందర్ 10, సాహిల్ 7 పాయింట్లతో జట్టు గెలిపించా రు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 32–30 తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. -
తెలుగు టైటాన్స్‌కు నిరాశ
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–50 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెపె్టన్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో రాణించాడు. పట్నా తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 57–27తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున సురేందర్ 13 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లు స్కోరు చేశారు. -
PKL 2023: తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి
ప్రో కబడ్డీ-2023 సీజన్‌ను ఓటమితో తెలుగు టైటాన్స్ ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జైంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38-32 పాయింట్ల తేడాతో టైటాన్స్ పరాజయం పాలైంది. ఫస్ట్‌హాఫ్‌లో తెలుగు టైటాన్స్ అధిక్యం కనబరచగా.. సెకెండ్ హాఫ్‌లో గుజరాత్ అనూహ్యంగా పుంజుకుని తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గుజరాత్ రైడర్ సోను జగ్లాన్ 5 పాయింట్ల రైడ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుజరాత్ రైడర్లలో సోనూతో పాటు రాకేష్ 5 పాయింట్లు, రోహిత్ గులియా 4 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్‌లో పవన్ సెహ్రావత్ ఆరు, రజనీష్ దలాల్ నాలుగు పాయింట్లు చేశారు. చదవండి: IND vs SA: 'నిజంగా సిగ్గు చేటు'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు -
చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాం..టైటిల్ మనదే
-
సూర్యపేటలో తెలుగు టైటాన్స్ ప్లేయర్ల సందడి
సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువులో తెలుగు టైటాన్స్ కబడ్డీ క్రీడాకారులు సందడి చేశారు. మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం (జాతర) సందర్భంగా మంగళవారం రాత్రి స్థానిక ఫ్రెండ్స్ యూత్ «ఆధ్వర్యంలో మేళ్లచెరువులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. కాగా ఈ పోటీల్లో ప్రో కబడ్డీ జట్టు సభ్యులు తెలుగు టైటన్స్ కెప్టెన్ సిద్ధార్ద్ దేశ్రాయ్, మోనుగోయత్, మల్లికార్జున్, ఆశీష్సింగ్ పాల్గొని సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి.. మొత్తంగా 16వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో 16వ పరాజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–35తో పుణేరి పల్టన్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ తరఫున ఆదర్శ్ తొమ్మిది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 15 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో ఉంది. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్‌పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్‌పై గెలిచాయి. -
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి, 14 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్‌పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
PKL 2022: తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యం.. తొమ్మిదింట 8 పరాజయాలతో..
Pro Kabaddi League 2022- Telugu Titans- పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో తొమ్మిదో మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఎనిమిదో పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 24–43 స్కోరు తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ జట్టులో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించలేకపోయారు. ఆదర్శ్, మోహిత్ పహాల్ చెరో 5 పాయింట్లు సాధించారు. మిగతావారంతా నిరాశపరిచారు. యూపీ తరఫున రెయిడర్ సురేందర్ గిల్ (13 పాయింట్లు), ప్రదీప్ నర్వాల్(9) రాణించారు. కాగా 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్ ఒకే ఒక్క విజయంతో అట్టడుగున ఉంది. ఇక బెంగళూరు బుల్స్ ఆరు విజయాలతో 34 పాయింట్లు సాధించి టాప్‌లో కొనసాగుతోంది. చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్ Match 5️⃣0️⃣ belonged to the Pirates while the Yoddhas claimed Match 5️⃣1️⃣ Here's the league table 📊 after tonight's encounters 😃#vivoProKabaddi #FantasticPanga #GGvPAT #UPvTT pic.twitter.com/M3Yhds5cFK — ProKabaddi (@ProKabaddi) October 31, 2022 Full time.#vivoProKabaddi #TeluguTitans #IdiAataKaaduVetaa #MatchDay #WeRiseAgain #TTvsUP #Kabaddi #KabaddiIndia pic.twitter.com/QDL3sLMAXw — Telugu Titans (@Telugu_Titans) October 31, 2022 -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 24–42 స్కోరుతో హరియాణా స్టీలర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. హరియాణా రెయిడర్ మీతూ శర్మ అదరగొట్టాడు. 18 సార్లు కూతకెళ్లిన మీతూ 13 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మన్జీత్ (7), కెప్టెన్ నితిన్ రావల్ (4), జైదీప్ దహియా (4) రాణించారు. తెలుగు టైటాన్స్‌లో సిద్ధార్థ్ దేశాయ్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు. ఆదర్శ్, విజయ్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు గెలుపు బోణీ చేసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–21తో నెగ్గింది. టైటాన్స్ తరఫున మోనూ గోయట్ 10 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 27–22 తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తొలిపోరు
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో చివరిదైన పన్నెండో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ తొమ్మిదో సీజన్‌కు సిద్ధమైంది. ఈనెల ఏడో తేదీన బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. కొత్త ఆటగాళ్లు, కొత్త కోచ్‌తో తెలుగు టైటాన్స్ బరిలోకి దిగనుందని, ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తామని టీమ్ యజమానులు శ్రీనివాస్ శ్రీరామనేని, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి, మహేశ్ కొల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు టైటాన్స్‌కు కోచ్‌గా వెంకటేశ్ గౌడ్, కెప్టెన్‌గా రవీందర్ పహల్ వ్యవహరించనున్నారు. సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోనూ గోయట్, రజనీశ్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేశ్, విజయ్ కుమార్, ఆదర్శ్, ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, మొహమ్మద్ షిహాస్, పల్లా రామకృష్ణ, మోసిన్, హమీద్, అంకిత్, మోహిత్ పహల్, సుమిత్ జట్టులోని ఇతర సభ్యులు. -
అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్.. తెలుగు టైటాన్స్ షెడ్యూల్ ఇదే
ప్రో కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ - 9 బెంగళూరులో అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గ్రీన్కో గ్రూప్ కో–ఫౌండర్, చైర్మన్ శ్రీనివాస్ శ్రీరామనేని, ఎన్ఈడీ గ్రూప్‌కు చెందిన మహేష్ కొల్లి, గౌతమ్ రెడ్డి తెలుగు టైటాన్స్ సీజన్ 9 కొత్త జట్టు సభ్యులను పరిచయం చేశారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని మాట్లాడుతూ..''గత సీజన్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ సీజన్‌ను విజయవంతంగా మలుచుకోలుచుకోవాలనుకుంటున్నాం. మా కొత్త స్క్వాడ్‌కి పూర్తి శిక్షణను మా కోచింగ్ సిబ్బంది అందించారు. రాబోయే సీజన్లో అభిమానులకు గర్వకారణంగా మా టీమ్ నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని నేదురుమల్లి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్ 9 వివో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. మా టీమ్‌ను గత సీజన్‌తో పోలిస్తే సమూలంగా మార్చాం. ఇప్పుడు మా టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు నూతన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వెంకటేష్ గౌడ్, మన్జీత్‌ల కాంబినేషన్ టీమ్‌కు కప్‌ను తేగలదని విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం కప్ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్ పోటీపడుతుంది’’ అని చెప్పారు. తెలుగు టైటాన్స్ కోచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ‘‘పర్వేష్ భైంశ్వాల్, విశాల్ భరద్వాజ్, సూర్జీత్ సింగ్, రవీందర్ పహల్ టీమ్‌లో ఉన్నారు. వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలక ఆటగాళ్లు’’ అని తెలిపారు. ఇక మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటుగా డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చని తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9లో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న బెంగళూరు బుల్స్‌తో ఆడనుంది. తెలుగు టైటాన్స్ జట్టు: రవీందర్ పహల్ (కెప్టెన్), సిద్దార్ధ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోను గోయత్, రజ్నీష్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేష్ భైంశ్వాల్, విజయ్ కుమార్, ఆదర్శ్ , ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, ముహమ్మద్ షిహాస్, పళ్ల రామకృష్ణ, మోహసేన్ మగసౌద్లూ, హమీద్ నాడర్, అంకిత్, మోహిత్ పహల్ రిజర్వ్ ప్లేయర్- సుమిత్ తెలుగు టైటాన్స్ మ్యాచ్ షెడ్యూల్.. 7 అక్టోబర్ 2022 శుక్రవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 9 అక్టోబర్ 2022 ఆదివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 11 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 15 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ కె.సి. శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 18 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టన్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 22 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 25 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 29 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్, శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 31 అక్టోబర్ 2022 సోమవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ Vs U.P. యోద్ధ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 2 నవంబర్ 2022 బుధవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs యు ముంబా శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 5 నవంబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే -
PKL 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు
Pro Kabaddi League 2022 Schedule And Other Details: కబడ్డీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)- 2022 వచ్చే నెల(అక్టోబరు)లో ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్‌ను లీగ్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లీగ్ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తో లీగ్ ఆరంభం డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ, యు ముంబా మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 7 పీకేఎల్ సీజన్ 9కు తెరలేవనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధాస్ తలపడనున్నాయి. మొదటి దశలో భాగంగా అక్టోబరు 7 నుంచి నవంబరు 8 వరకు 66 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్లో లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టూ ఇతర జట్లతో పోటీపడుతుంది. అంతకు మించిన వినోదం ఇక వీవో పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మాషల్ స్పోర్ట్స్ హెడ్, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. బెంగళూరు, పుణె, హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సీజన్‌కు మించిన వినోదంతో కబడ్డీ అభిమానుల ముందుకు వస్తున్నామని.. సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తామని పేర్కొన్నారు. లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడంటే.. వివో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టికెట్లు ఎలా? పీకేఎల్-2022 టికెట్లను బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. చదవండి: Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?! Rohit Vs Dinesh Karthik: దినేశ్ కార్తిక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ -
ప్రో కబడ్డీ వేలం: ఐపీఎల్ రేంజ్లో ధర పలికిన ప్లేయర్స్.. రికార్డులు బ్రేక్
Pro Kabaddi.. దేశంలో క్రికెట్‌తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్ ఉంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్‌ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, 9వ సీజన్‌కు ముందు ప్రో కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్‌ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి. It's the Hi-Flyer's 🌏 and we're just living in it 🤷♂️ Pawan Sehrawat shatters the #vivoPKLPlayerAuction records to emerge as the most expensive buy in the history of #vivoProKabaddi 🤯@tamilthalaivas can now breathe easy like all of us, eh? 👀 pic.twitter.com/Ej2PtKPqFv — ProKabaddi (@ProKabaddi) August 5, 2022 కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్ షెరావత్‌ను రూ.2.65కోట్లకు తమిళ్ తలైవాస్ దక్కించుకోగా.. వికాస్ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్ అట్రాసలిని పూణేరి పల్టన్స్.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్ సింగ్‌ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్‌గా పేరొందిన ప్రదీప్ నర్వాల్‌ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్‌బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్ షెరావత్.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్ రూ.65.10లక్షలకు అమీర్ హొసైన్‌ను, రవికుమార్‌ను రూ.64.10లక్షలకు(దబాంగ్ ఢిల్లీ), నీరజ్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ రూ.43లక్షలకు కొనుగోలు చేసుకున్నాయి. ನಮ್ಮ ಗೂಳಿ ಪಡೆ 😍 How's that squad looking, #BullsSene? ⚡#FullChargeMaadi #BengaluruBulls #vivoPKLPlayerAuctions pic.twitter.com/oDyrX89itc — Bengaluru Bulls (@BengaluruBulls) August 6, 2022 Ala re ala! We welcome the Sultan to Pune! 🦁 . .#PuneriPaltan #Bhaaripaltan #Gheuntak #vivoPKLPlayersAuction #BhaariAuction pic.twitter.com/CqgL2limse — Puneri Paltan (@PuneriPaltan) August 5, 2022 ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే.. రజనీష్, అంకిత్ బెనివల్ను రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్ సింగ్, మోను గోయల్,పర్వేష్ భైంస్వాల్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, సిద్దార్ధ్ దేశాయ్‌ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్, విజయ్ను రీటైన్ చేసుకుంది. Our first buy of the day Parvesh Bhainswal will be the part of #Titansquad#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/uYFjkcC4jo — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Abhishek Singh is set to expand the strength of the #Titansquad in season-9. How excited are you ?#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/gvJRfJaIkD — Telugu Titans (@Telugu_Titans) August 5, 2022 Pesh hai aapke #PKL2022 #GujaratGiants squad! 💪#Giant family, how do you feel about the team? 🤩#GarjegaGujarat #Adani #vivoProKabaddi #vivoPKLPlayerAuction pic.twitter.com/UCyjmZSGdX — Gujarat Giants (@GujaratGiants) August 6, 2022 ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. -
PKL 2022: 16వ పరాజయం.. మీరు ఆడడం దండగ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకు 16వ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–54 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగు టైటాన్స్ తరఫున ఆడుతున్న తెలంగాణ ప్లేయర్ గల్లా రాజు రెడ్డి అద్భుత రెయిడింగ్‌తో ఆకట్టుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రాజు తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్‌లో నెగ్గి, నాలుగు మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 16 మ్యాచ్‌ల్లో ఓడి 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 52–21తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. -
ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్‌లు ఆడిన పట్నా 14 మ్యాచ్‌ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్‌లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది. -
Pro Kabaddi League: అయ్యో.. మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
Pro Kabaddi League: - బెంగళూరు: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ‘టై’ లేదంటే ఓటమితో పదేపదే నిరాశపరుస్తోన్న తెలుగు జట్టు గురువారం జరిగిన మరో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. తమిళ్ తలైవాస్‌తో జరిగిన ఈ పోరులో తెలుగు టైటాన్స్ 25–43 స్కోరుతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో గల్లా రాజు (9 పాయింట్లు) రాణించాడు. తలైవాస్ జట్టులో రెయిడర్ అజింక్యా పవార్ 10 పాయింట్లు సాధించాడు. ఇంతవరకు ఒక్కటే మ్యాచ్ గెలిచిన టైటాన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌లను ‘టై’ చేసుకుంది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
తెలుగు టైటాన్స్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్, తెలుగు టైటాన్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ 39–39 వద్ద టైగా ముగిసింది. టైటాన్స్ తరఫున అంకిత్ బెనివాల్ 10, రోహిత్ కుమార్ 8, సందీప్, ఆదర్శ్ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 22 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమ 11వ మ్యాచ్‌లో ఎట్టకేలకు తొలి గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–34తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ ఎనిమిది పాయింట్లు... మరో రెయిడర్ ఆదర్శ్ తొమ్మిది పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ 13 పాయిం ట్లు స్కోరు చేశాడు. టైటాన్స్ ప్రస్తుతం 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–30తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. వరుసగా ఎనిమిదో పరాజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. బెంగాల్ వారియర్స్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27–28తో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ రెండు మ్యాచ్‌లను ‘టై’ చేసుకుంది. 12 పాయింట్లతో టైటాన్స్ జట్టు 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉంది. బెంగళూరుతో మ్యాచ్ లో ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ చివర్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 50–40తో పుణేరి పల్టన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. -
Pro Kabaddi League: రాత మారలేదు.. మళ్లీ ఓడిన టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 22–40తో ఓడింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఆరో ఓటమి. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేసి 12 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్ -
PKL 2021: తెలుగు టైటాన్స్‌కు ఐదో ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 38–48తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఐదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున గల్లా రాజు ఎనిమిది పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 37–33తో యూపీ యోధపై, పట్నా పైరేట్స్ 27–26తో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధ తలపడతాయి. చదవండి: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు 39–37తో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. హరియాణా తరఫున మీతూ 12 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ చెరో 9 పాయిం ట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–26తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. -
ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తొలి ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33–34తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. స్టార్ రెయిడర్ సిద్ధార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–14తో ఆధిక్యంలో నిలిచింది. అయితే పుణేరి పల్టన్ వరుస రెయిడ్ పాయింట్లతో పాటు టైటాన్స్ ప్లేయర్లను పట్టేయడంతో మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది. స్కోరు 33–33తో సమంగా ఉన్న సమయంలో కూతకు వెళ్లిన మోహిత్ పుణేరి పల్టన్‌కు పాయింట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ చివరి రెయిడ్‌కు వెళ్లిన అంకిత్ (టైటాన్స్) ఒట్టి చేతులతో రావడంతో పాయింట్ తేడాతో పుణేరి పల్టన్ విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యూపీ యోధ 36–35తో పట్నా పైరేట్స్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 40–38తో హరియాణా స్టీలర్స్‌పై నెగ్గాయి. చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే.. -
‘టై’తో మొదలుపెట్టిన టైటాన్స్
బెంగళూరు: తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ‘టై’తో ఆరంభించింది. బుధవారం టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 స్కోరుతో సమంగా ముగిసింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ 11 పాయింట్లు సాధించగా, డిఫెండర్లలో సందీప్ 5, రుతురాజ్, అరుణ్ మూడేసి పాయింట్లు తెచ్చి పెట్టారు. మ్యాచ్‌లో తలైవాస్ రైడర్ మన్జీత్ సత్తా చాటాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 3 బోనస్ పాయింట్లు సహా 12 పాయింట్లు స్కోరు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే స్టార్ రైడర్ సిద్ధార్థ్, రజ్నీశ్ జట్టుకు వరుస పాయింట్లు సాధించిపెట్టారు. డిఫెండర్ సందీప్ కండోలా కూడా ప్రత్యర్థి రైడర్లను చేజిక్కించుకోవడంతో టైటాన్స్ జట్టు 8 నిమిషాల్లోనే తలైవాస్‌ను ఆలౌట్ చేసింది. అనంతరం తలైవాస్ రైడర్ మన్జీత్ దీటుగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మన్జీత్ చేసిన సూపర్ రైడ్ ఏకంగా 3 పాయింట్లు తెచ్చిపెట్టడంతో నిమిషాల వ్యవధిలో ఆధిక్యం మారిపోయింది. తొలి అర్ధ భాగం 23–21 వద్ద ముగిసింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు శ్రమించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఒక దశలో ఇరు జట్ల రైడర్లు విఫలమైతే డిఫెండర్ల హవా కొనసాగింది. తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేయడం ద్వారా తలైవాస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే సిద్ధార్ధ్ దేశాయ్ కీలక దశలో రైడింగ్‌కు వెళ్లినప్పుడల్లా పాయింట్లు సాధించడంతో టైటాన్స్ పుంజుకుంది. ఇంకో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా తన రైడింగ్ పాయింట్‌తో తమిళ్ తలైవాస్ రెండోసారి ఆలౌటైంది. అక్కడే స్కోరు సమమైంది. టాకిల్‌తో సందీప్, రైడింగ్‌తో సిద్ధార్థ్ తెలుగు జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఇతర మ్యాచ్‌లలో యు ముంబా 46–30తో బెంగళూరు బుల్స్‌పై...బెంగాల్ వారియర్స్ 38–33తో యూపీ యోధపై గెలిచింది. సిద్ధార్థ్ దేశాయ్ -
తెలుగు టైటాన్స్‌తో ట్రూక్ భాగస్వామ్యం
ప్రో కబడ్డీ లీగ్ టీమ్ తెలుగు టైటాన్స్‌తో ట్రూక్ భాగస్వామ్యం చేసుకుంది.అత్యధిక నాణ్యత గల వైర్లెస్ స్టీరియోలు, వైర్లెస్ హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లతో పాటు సంగీత అభిమానుల కోసం బెస్పోక్ అకౌస్టిక్ పరికరాలను రూపొందించే భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆడియో బ్రాండ్ లలో ట్రూక్ ఒకటిగా ఉంది. లీగ్ లో ట్రూక్.. తెలుగు టైటాన్స్ కు అధికారిక ఆడియో పార్ట్నర్ గా ఉండనుంది.ఇటీవలి కాలంలో ట్రూక్ ఆఫర్లు గేమింగ్ TWS సెగ్మెంట్‌పై దృష్టి సారించాయి. ఇక తాజాగా ప్రో కబడ్డీ లీగ్ లో కూడా తాము భాగస్వాములమైనందుకు ట్రూక్ ఇండియా సీఈవో పంకజ్ ఉపాధ్యాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంకజ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..ప్రో-కబడ్డీ లీగ్‌లో అత్యంత ఆశాజనకమైన టీమ్‌లలో ఒకటైన తెలుగు టైటాన్స్ అధికారిక ఆడియో భాగస్వామిగా, దేశంలోని ప్రతి కబడ్డీ అభిమానుల గర్జనను సెట్ చేస్తామని మేము నమ్ముతున్నాము. అలాగే, గేమింగ్-ఓరియెంటెడ్ TWS కంపెనీగా మమ్మల్ని మేము సమలేఖనం చేసుకున్నందున, ఈ అద్భుతమైన కమింగ్-టుగెదర్ అనేది బ్రాండింగ్ కోణంలో ఖచ్చితమైన సమయం కంటే తక్కువ కాదు. మా ఈ ప్రయాణం మాకు అండగా నిలిచే వారందరికీ అద్భుతమైన ఉత్సాహాన్ని, వినోదాన్ని అందిస్తుంది.. ’ అని తెలిపారు. తెలుగు టైటాన్స్ యజమాని శ్రీని శ్రీరామనేని స్పందిస్తూ.. వివో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 కోసం ట్రూక్ తెలుగు టైటాన్ అధికారిక ఆడియో భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. కొత్త బ్రాండ్ అయిన ట్రూక్ మా బృందం శక్తితో సరిపోతుంది. మేము ట్రూక్తో గొప్ప సంబంధం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము" అని అన్నారు. చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి? -
Pro Kabaddi League: ఈనెల 22 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: కబడ్డీ కూతకు రంగం సిద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఈ నెల 22 నుంచి బెంగళూరులో జరగనుంది. ఎనిమిదో సీజన్ మొత్తానికి ఇదే నగరం వేదిక కానుండటం మరో విశేషం. కరోనా కొత్త వేరియంట్ల కలకలం, ఈ ఏడాది ఐపీఎల్ అనుభవాల దృష్ట్యా మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. డిసెంబర్ 22న తొలి మ్యాచ్‌లో యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనుంది. అదే రోజు తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ పోటీ పడతాయి. కరోనా మహమ్మారి పడగ విప్పటంతో గతేడాది ప్రొ కబడ్డీ లీగ్ రద్దయింది. చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలననున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే! -
విజయంతో టైటాన్స్ వీడ్కోలు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 41–36తో యూపీ యోధపై విజయం సాధించింది. సిద్ధార్థ్ దేశాయ్ చక్కగా రాణించాడు. 15 సార్లు రైడింగ్ వెళ్లిన అతను 15 పాయింట్లు తెచి్చపెట్టాడు. మిగతా వారిలో కృష్ణ మదనే, ఫర్హాద్ చెరో 4 పాయింట్లు సాధించారు. యూపీ యోధ జట్టులో శ్రీకాంత్ జాదవ్ (8), రిషాంక్ దేవడిగ (8) అదరగొట్టారు. సుమిత్ (5), మోను గోయత్ (4), నితీశ్ కుమార్ (4) రాణించారు. మొత్తం మీద 22 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 6 విజయాలతో 11వ స్థానంలో నిలిచింది. 4 విజయాలతో తమిళ్ తలైవాస్ అట్టడుగున నిలిచింది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 33–29తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. నేడు (గురువారం) జరిగే పోటీలో యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడుతుంది. -
తీరు మారని టైటాన్స్
గ్రేటర్ నోయిడా: ఇప్పటికే డజను ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్... తాజాగా మరో ఓటమితో ఆ స్థానాన్ని మెరుగు పరుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 38–48తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తయింది. సిద్దార్థ్ దేశాయ్ 13 పాయింట్ల ప్రదర్శన ప్రత్యర్థి రైడర్లు సోను (17 పాయింట్లు), రోహిత్ గులియా (9 పాయింట్లు) ముందు చిన్నదైంది. టైటాన్స్‌కు సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా... దానిని గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకుంటుందో లేక చిట్ట చివరి స్థానానికి పడిపోతుందో చూడాలి. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–33తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై నెగ్గింది. అజిత్‌కుమార్ సూపర్‘టెన్’తో జట్టుకు విజయాన్ని అందించాడు నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్; యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
మళ్లీ ఓడిన టైటాన్స్
పంచకుల: పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు దూరమైన తెలుగు టైటాన్స్... చివరి దశ మ్యాచ్‌ల్లోనైనా సత్తా చాటుతుందని అనుకుంటే దారుణమైన ఆటతీరుతో నిరాశ పరుస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 32–52తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. రైడర్ సిద్దార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), ఆల్ రౌండర్ ఫర్హాద్ (10 పాయింట్లు) పోరాటం... సమష్టిగా రాణించిన హరియాణా ముందు నిలబడలేదు. వికాస్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 41–34తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దీపక్ (16 పాయింట్లు) సత్తా చాటడంతో జైపూర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు ఇప్పటికే ఐదు జట్లు ఢిల్లీ, బెంగాల్, హరియాణా, ముంబై, బెంగళూరు అర్హత సాధించగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం జైపూర్, యూపీ పోటీ పడుతున్నాయి. -
పోరాడి ఓడిన టైటాన్స్
పంచకుల: తెలుగు టైటాన్స్‌ను గెలిపించడానికి రాకేశ్ గౌడ చేసిన పోరాటం వృథా అయ్యింది. గురువారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 50–53తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. ఒక దశలో టైటాన్స్ 21–44 తో వెనుకబడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేట్లు కనిపించింది. అయితే రాకేశ్ గౌడ (17 పాయింట్లు), ఫర్హాద్ మిలాఘర్దన్ (10 పాయింట్లు) చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించారు. పుణేరి తరఫున మంజీత్ (12 పాయింట్లు), సుశాంత్ (11 పాయింట్లు) రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్; హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
టైటాన్స్‌ను గెలిపించిన సిద్ధార్థ్
జైపూర్: తెలుగు టైటాన్స్‌ను సిద్ధార్థ్ దేశాయ్ గెలిపించాడు. ఏకంగా 22 పాయింట్లతో చెలరేగిన అతను జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 51–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తు చేసింది. సిద్ధార్థ్‌కు తోడు రజ్నీశ్ దలాల్ సూపర్ టెన్ (11 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో ఫర్హాద్ మిలాఘర్దాన్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35–33తో యు ముంబాపై గెలుపొందింది. పవన్ షెరావత్ 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధ; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
టైటాన్స్ పదో పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో తెలుగు టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 39–40తో బెంగాల్ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా ట్యాక్లింగ్‌లో సారథి అ»ొజర్ మోహజెర్ మిఘాని ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో చెలరేగినా అది జట్టుకు విజయం అందించలేదు. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగాల్... టైటాన్స్‌ను 15వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మొదటి భాగాన్ని 19–13తో ముగించింది. రెండో భాగంలో జోరు పెంచిన టైటాన్స్ ప్రత్యరి్థని ఆలౌట్ చేసింది. ఈ సమయంలో బెంగాల్‌ను రైడింగ్‌తో ఆదుకున్న మణీందర్ గెలుపు ఖాయం చేశాడు. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 43–34తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు)తో రాణించాడు. నేటి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. -
టైటాన్స్‌కు మరో ‘టై’
పుణే: ప్రత్యర్థిని పట్టేయాలన్న టైటాన్స్ అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌ను టైటిల్ తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన టైటాన్స్, పట్నా పైరేట్స్ మ్యాచ్ 42–42తో ‘డ్రా’గా ముగిసింది. స్పష్టమైన ఆధిక్యాన్ని రెండు సార్లు చేజార్చుకున్న టైటాన్స్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 17 పాయింట్లు సాధించిన పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ జట్టుకు పరాభవాన్ని తప్పించాడు. ఏకంగా మూడు సూపర్ రైడ్లతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), రజ్నీశ్ (10 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 42–38తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ పరాజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 29–37తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. సిద్దార్థ్ దేశాయ్ 12 పాయింట్లతో రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ మాత్రం మరో సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు) సాధించాడు. సీజన్లో టైటాన్స్‌కు మరో ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 38–22తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. -
మళ్లీ ఓడిన టైటాన్స్
న్యూఢిల్లీ: తెలుగు టైటాన్స్‌ది మళ్లీ అదే కథ... అదే వ్యథ! ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్లో ఏరికోరి తెచ్చుకున్న స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ జట్టులో ఉన్నా టైటాన్స్ గతి మారడం లేదు. తాజాగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27–34తో పుణేరి పల్టన్ చేతిలో పరాజయం చవిచూసింది. తెలుగు జట్టులో రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు తెచి్చపెట్టాడు. డిఫెండర్లలో సి.అరుణ్ 6, విశాల్ భరద్వాజ్ 5 పాయింట్లు సాధించారు. పుణేరి తరఫున రైడర్లు మన్జీత్ (9) నితిన్ తోమర్ (8) అదరగొట్టారు. డిఫెండర్లలో అమిత్ కుమార్, సాగర్‌కృష్ణ చెరో 4 పాయింట్లు సాధించారు. 11 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కిది ఆరో ఓటమి! 12 జట్లు బరిలో ఉన్న ఈ టోరీ్నలో ఇప్పటివరకు మూడే మ్యాచ్‌లు గెలిచిన టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో 11వ స్థానంలో ఉంది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 38–35తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్ పోటీపడనుంది. -
వారియర్స్‌తో ‘టై’టాన్స్
అహ్మదాబాద్: గుజరాత్‌పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్‌కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ దేశాయ్ తన రైడ్‌తో పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్‌ను పట్టేయాలని డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్‌ల రైడింగ్ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చిన వారియర్స్ టైటాన్స్‌ను ఆలౌట్ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్ స్కోర్‌ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. యూపీ రైడర్ పవన్ శెరావత్ అటు రైడింగ్‌లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
పరాజయాల టైటాన్స్
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47–26తో ఓడిన టైటాన్స్ సీజన్లో మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్ రైడర్ పవన్ కుమార్ (17 పాయింట్లు) రైడింగ్ ముందు నిలబడలేకపోయాడు. దీంతో సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో ‘టై’తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి. -
టైటాన్స్ నాన్ టెక్నికల్ టై
ముంబై: తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. సాధారణంగా మ్యాచ్ ముగిశాక రిఫరీ వేసే లాంగ్ విజిల్ కంటే ముందుగా కబడ్డీ కోర్టు వెలుపల ఉన్న సహచర ఆటగాళ్లు గెలిచామనే ఆనందంతో కోర్టులోకి దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రిఫరీలు యూపీ యోధకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ కేటాయించడంతో... టైటాన్స్‌కు ఈ సీజన్లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. ముంబై వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, యూపీ యోధ జట్లు నిర్ణీత సమయానికి 20–20తో సమంగా నిలిచాయి. దీంతో ప్రొ కబడ్డీ సీజన్ – 7లో తొలి ‘టై’ నమోదైంది. టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లతో) ఫర్వాలేదనిపించాడు. చేజేతులా... ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో బరిలో దిగిన టైటాన్స్ మొదట ఆధిక్యాన్ని ఆ తర్వాత గెలుపుని చేజేతులా జారవిడుచుకుంది. మొదట 7–3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలసత్వం ప్రదర్శించడంతో యూపీ వరుస పాయింట్లను సాధించి స్కోర్‌ను సమం చేసింది. మళ్లీ చివరి నిమిషంలో అదే అలసత్వం ప్రదర్శించి గెలుపును వదులుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో కూతకెళ్లిన టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్ సాధించి జట్టును 20–19తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో గెలిచామనే ఆనందంలో టైటాన్స్ జట్టు సభ్యులు రిఫరీ లాంగ్ విజిల్ వేశాడా..? లేదా... అనేది చూసుకోకుండా కోర్టులోకి దూసుకురావడంతో రిఫరీలు యూపీ జట్టుకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్‌ను కేటాయించారు. దీనిపై టైటాన్స్ సమీక్షకు వెళ్లగా... టీవీ అంపైర్ రిఫరీల నిర్ణయానికే కట్టుబడటంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త టైగా ముగిసింది. ఆఖరి పంచ్ ముంబైదే.. ముంబై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆఖరి పంచ్ ముంబై కొట్టింది. గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై 20–32తో ముంబై గెలిచి వరుస పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టింది. ముంబై ఆటగాళ్లు సురీందర్ సింగ్ 9 పాయింట్లతో, అభిషేక్ సింగ్ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది. సొంతప్రేక్షకులు మద్దతిచ్చినా... అసలు బోణీనే కొట్టలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యింది. శుక్రవారం జరిగిన హైదరాబాద్ అంచె ఆఖరి పోరులో టైటాన్స్ 22–34 స్కోరుతో పట్నా పైరేట్స్ చేతిలో పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ నిరాశపరిచాడు. స్టార్ రైడర్‌గా బరిలోకి దిగిన దేశాయ్ 12 సార్లు రైడింగ్‌కు వెళ్లి కేవలం 5 పాయింట్లే తెచ్చాడు. ఒక టాకిల్ పాయింట్ సాధించాడు. డిఫెండర్లు అబొజర్ మిఘాని (2), విశాల్ భరద్వాజ్ (2)లు ప్రత్యర్థి రైడర్లను టాకిల్ చేయలేకపోయారు. దీంతో తెలుగు జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. మరోవైపు పట్నా జట్టులో స్టార్ ఆటగాళ్లయిన ప్రదీప్ నర్వాల్, జైదీప్‌లు ఆరంభం నుంచే పట్టుబిగించారు. రైడింగ్‌లో నర్వాల్ 7 పాయింట్లు సాధించగా, డిఫెం డర్ జైదీప్ (6) టైటాన్స్ రైడర్లను చక్కగా ఒడిసిపట్టాడు. మిగతా ఆటగాళ్లలో జంగ్ కున్ లీ (4), నీరజ్ కుమార్ (3) ఆకట్టుకున్నారు. మొహమ్మద్ ఎస్మెల్, హాది ఒస్తరక్ చెరో 2 పాయింట్లు చేశారు. అంతకుముందు మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 44–19 స్కోరుతో యూపీ యోధపై ఘనవిజయం సాధించింది. గుజరాత్ తరఫున రైడింగ్‌లో రోహిత్ గులియా (10), డిఫెన్స్‌లో పర్వేశ్ బైస్వాల్ (6) రాణించారు. యూపీ జట్టులో రైడర్ శ్రీకాంత్ జాదవ్ (5) ఒక్కడే మెరుగనిపించాడు. నితీశ్ కుమార్, మోను గోయత్, ఆజాద్ రెండేసి పాయింట్లు చేశారు. అతిథిగా కోహ్లి నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ముంబైలో జరుగుతాయి. శనివారం ఇక్కడ జరిగే ఆరంభ వేడుకకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అతిథిగా హాజరు కానున్నాడు. నేటి మ్యాచ్‌లు యు ముంబా X పుణేరి పల్టన్ రా.గం. 7.30 నుంచి జైపూర్ X బెంగాల్ వారియర్స్ రా.గం. 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్–2లో ప్రత్యక్షప్రసారం -
టైటాన్స్‌ది అదే కథ.. అదే వ్యథ
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్-7లో తెలుగు టైటాన్స్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. హ్యాట్రిక్ ఓటమి అనంతరం కూడా టైటాన్స్ ఆటగాళ్ల తీరు మారలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కనీస పోరాట పటిమను ప్రదర్శించిన టైటాన్స్ ఆటగాళ్లు పట్నా పైరేట్స్ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. పట్నా డిఫెండింగ్ ధాటికి టైటాన్స్ రైడర్లు పూర్తిగా తేలిపోయారు. టైటాన్స్ స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ ఓ మోస్తారుగా రాణించగా.. గత మ్యాచ్ హీరో సూరజ్ దేశాయ్ పూర్తిగా నిరాశపరిచాడు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34-22 తేడాతో టైటాన్స్‌ను చిత్తు చేసింది. పట్నా స్టార్ రైడర్, సారథి పర్దీప్ నర్వాల్ 7 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. డిఫెండర్ జైదీప్ 6 పాయింట్లతో టైటాన్స్ పనిపట్టాడు. పట్నా ధాటికి టైటాన్స్ తొలి రెండు నిమిషాలు ఖాతానే తెరవలేదు. దీంతో 0-4తో వెనుకంజలో ఉంది. అయితే ఈ సమయంలో విశాల్ భరద్వాజ్ సూపర్ టాకిల్‌తో టైటాన్స్‌కు రెండు పాయింట్లు అందించి ఖాతా తెరిచాడు. ఈ ఆనందం కూడా టైటాన్స్ అభిమానుల్లో ఎంతసేపు నిలువలేదు. పట్నా ఆటగాళ్లు అటాకింగ్ ఆడటంతో టైటాన్స్ ఆటగాళ్లు విలవిల్లాడారు. దీంతో తొలి ఆర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ జట్టు 9-23 తేడాతో భారీ వెనుకంజలో ఉంది. ఇక రెండో అర్థభాగంలో సిద్దార్థ్ దేశాయ్ ఒంటరి పోరాటంతో స్కోర్ అంతరాన్ని తగ్గించాడు కానీ ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. పట్నా జట్టు 12 రైడ్, 16 టాకిల్ పాయింట్లతో దడదడలాడించగా.. టైటాన్స్ జట్టు 10 రైడ్, 8 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. -
టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో పరాజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. కానీ ఈ సారి గెలిచేందుకు చివరిదాకా కష్టపడింది. మ్యాచ్ ముగిసే దశలో కాస్త ఉత్కంఠరేపినా... స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకున్న దబంగ్ ఢిల్లీ కేసీ జట్టు 34–33తో తెలుగు టైటాన్స్‌పై గట్టెక్కింది. కేవలం పాయింట్ తేడాతో టైటాన్స్ పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్ దేశాయ్ నిరాశపరిచాడు. జట్టు తురుపుముక్కగా బరిలోకి దిగిన ఈ రైడర్ 13 సార్లు కూతకు వెళ్లి కేవలం 8 పాయింట్లే చేశాడు. ఇతని సోదరుడు సూరజ్ దేశాయ్ అదరగొట్టాడు. 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి 18 పాయింట్లు తెచ్చిపెట్టాడు. స్టార్ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ కూడా నిరాశపరిచాడు. ప్రత్యర్థి రైడర్లను పట్టేందుకు 7 సార్లు కష్టపడిన భరద్వాజ్ కేవలం 4 పాయింట్లే సాధించాడు. మిగతా ఆటగాళ్లలో అమిత్ 2 పాయింట్లు చేశాడు. దబంగ్ ఢిల్లీ జట్టులో రైడర్లు నవీన్ కుమార్ (14 పాయింట్లు), చంద్రన్ రంజీత్ (6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. డిఫెండర్లలో జోగిందర్ నర్వాల్ (4), రవీందర్ పహల్ (3) రాణించారు. యూపీ యోధ చిత్తుగా... అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధ 17–48 స్కోరుతో బెంగాల్ వారియర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. రైడర్లు మొహమ్మద్ నబీబ„Š (10), మణిందర్ సింగ్ (9) చెలరేగారు. డిఫెండర్లు కూడా తమ వంతుగా రాణించడంతో బెంగాల్ స్కోరు అమాంతం పెరిగింది. బల్దేవ్ సింగ్ 7, రింకూ నర్వాల్ 4, జీవా కుమార్ 3 పాయింట్లు సాధించారు. యూపీ యోధ తరఫున మోను గోయత్ (6), సురేందర్ సింగ్, నితీశ్ కుమార్ చెరో 3 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ జట్టు తలపడుతుంది. -
టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి..
హైదరాబాద్ : ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమిని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో యు ముంబా, తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైన టైటాన్స్ జట్టు దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ నిరాశపర్చింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 18 పాయింట్లతో రెచ్చిపోయినప్పటికీ ఢిల్లీ చేతిలో ఓటమిని తప్పించలేకపోయాడు. సూరజ్ దేశాయ్ తొలి రైడ్‌లోనే రెండు పాయింట్లతో టైటాన్స్‌కు మంచి శుభారంభాన్ని అందించాడు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరుజట్లు తొలి అర్ధభాగం ముగిసేసరికి 14-13తేడాతో టైటాన్స్ స్వల్ప ముందంజలో నిలిచింది. అయితే రెండో అర్థభాగంలో కూడా ఇరుజట్లు చాలా జాగ్రత్తగా ఆడాయి. దీంతో చివరి కూత వరకు ఇరుజట్ల మధ్య విజయం నీదా నాదా అన్నట్లు సాగింది. అయితే ఢిల్లీ రెండు ఎక్సట్రా పాయింట్లు సాధించడం, టైటాన్స్ జట్టు ఓ సారి ఆలౌట్ అవ్వడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే చివరి రైడ్‌లో టైటాన్స్ విజయానికి మూడు పాయింట్లు అవసరం కాగా సిద్దార్థ్ దేశాయ్ ఒక్కటే సాధించాడు. దీంతో టైటాన్స్ ఓడిపోయింది. దబాంగ్ ఢిల్లీ 23 రైడ్ పాయింట్లు, 7 టాకిల్ పాయింట్లు సాధించగా.. తెలుగు టైటాన్స్ 27 రైడ్ పాయింట్లు, 6 టాకిల్ పాయింట్లు సాధించింది. టైటాన్స్ ఆటగాళ్లలో సూరజ్ దేశాయ్‌తో పాటు సిద్దార్థ్ దేశాయ్(8), విశాల్ భరద్వాజ్(4) ఫర్వాలేదనిపించారు. ఇక ఢిల్లీ ఆటగాళ్లలో నవీన్ కుమార్(14), చంద్రన్ రంజిత్(6), జోగిందర్ నర్వాల్(4) ఆకట్టుకున్నారు. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ఎన్నో అంచనాల నడుమ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 బరిలో దిగిన తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 26–39 స్కోరుతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ నుంచి తలైవాస్‌కు వెళ్లిన స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి (10 రైడ్ పాయింట్లు, 2 టాకిల్ పాయింట్లు) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడుగా మంజీత్ చిల్లర్ 5 పాయింట్లతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. టెటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లు) మళ్లీ మెరిపించలేకపోయాడు. తొలి పది నిమిషాలే నిలబడింది... తలైవాస్‌తో పోరులో టైటాన్స్ మొదటి పది నిమిషాలే పోటీ ఇవ్వగలిగింది. తొలి నిమిషంలోనే రాహుల్ తలైవాస్‌కు బోణీ చేశాడు. అయితే 4వ నిమిషంలో టైటాన్స్ సూపర్ టాకిల్ చేసి స్కోర్‌ను 3–4కు తగ్గించింది. టెటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ్ తన మొదటి పాయింట్‌ను సాధించడానికి 6 నిమిషాల సమయం పట్టింది. తొలి 10 నిమిషాల ఆట ముగిసేసరికి టైటాన్స్ 7–6తో ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి ఓటమికి తలైవాస్ ఆటగాడు షబీర్ బాపు బాటలు వేశాడు. మొదట సూపర్ టాకిల్‌తో రెండు పాయింట్లు సాధించిన షబీర్... తర్వాత వెంట వెంటనే రెండు రైడ్ పాయింట్లు తెచ్చాడు. 16వ నిమిషంలో రాహుల్ రెండు రైడ్ పాయింట్లతో.. 18వ నిమిషంలో అజయ్ థాకూర్ సూపర్ రైడ్‌తో అదరగొట్టడంతో మొదటి అర్ధ భాగం ముగిసే సరికి తలైవాస్ 20–10తో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ పాయింట్ల కోసం శ్రమించినా తలైవాస్ మోహిత్, మంజీత్ల పటిష్టమైన డిఫెన్స్‌ను చేధించడంలో సఫలం కాలేకపోయారు. అంతకుముందు జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ 42–24 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్; పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. మ్యాచ్‌లను రాత్రి గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
తెలుగు టైటాన్స్ తడబాటు
ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ కూడా తెలుగు టైటాన్స్‌కు నిరాశాజనకంగా ఆరంభమైంది. సొంతగడ్డపై జరిగిన ఆరంభ పోరులో మాజీ చాంపియన్ యు ముంబాకు టైటాన్స్ తలవంచింది. కీలక సమయంలో పాయింట్లు సాధించడంలో విఫలమైన తెలుగు జట్టు... చివర్లో వరుస పాయింట్లతో ప్రత్యర్థికి చేరువగా వచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైంది. సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–25 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 17–10తో ఆధిక్యంలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. సమష్టి వైఫల్యం... టైటాన్స్ ఆటలో ఆరంభం నుంచి కూడా దూకుడు కనిపించలేదు. స్కోరు 1–1తో ఆట మొదలైన తర్వాత సిద్ధార్థ్ ఖాళీ రైడ్‌తో వెనక్కి రావడం మొదలు మ్యాచ్‌లో చాలా వరకు అలాంటి స్థితే కనిపించింది. ముంబా కోర్టులో ఫర్హద్ దొరికిపోవడంతో 4–5తో తొలిసారి వెనుకంజ వేసిన టైటాన్స్ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత ముంబా ఆధిక్యం 8–5నుంచి 17–8 వరకు సాగింది. తొలి అర్ధ భాగం చివర్లో రాకేశ్, రోహిత్ రైడ్లతో రెండు పాయింట్లు సాధించిన తెలుగు టీమ్ పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్ ఒక సారి ఆలౌట్ అయింది. రెండో అర్ధభాగంలో మాత్రం టైటాన్స్ ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోసారి ఆలౌట్ అయినా కూడా టైటాన్స్ మొత్తం 15 పాయింట్లు సాధించగా, ముంబా 14 పాయింట్లు మాత్రమే గెలుచుకుంది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో టైటాన్స్‌కు వరుసగా పాయింట్లు వచ్చాయి. అయితే బలమైన డిఫెన్స్‌ను ప్రదర్శించిన ముంబా మ్యాచ్ తమ చేజారుకుండా చూసుకుంది. సిద్ధార్థ్ విఫలం... వేలంలో భారీ మొత్తానికి ధర పలకడంతో పాటు ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఆటగాడు సిద్ధార్థ్ దేశాయ్ నిరాశపర్చాడు. తొలి అర్ధభాగంలో ఆరు సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాడు. మూడు సార్లు అతడిని ప్రత్యర్థి జట్టు పట్టేయగా, రెండు సార్లు ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. ఒకసారైతే ‘డు ఆర్ డై’ రైడ్‌లో కూడా ఖాళీగా రావడంతో టైటాన్స్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. అన్యమనస్కంగా కనిపించిన అతడిని కోచ్ రెండో అర్ధభాగంలో తొలి తొమ్మిది నిమిషాలు డగౌట్లోనే కూర్చోబెట్టాడంటే అతని ఆట ఎలా సాగిందో అర్థమవుతోంది. ఎట్టకేలకు తన ఎనిమిదో ప్రయత్నంలో బోనస్ ద్వారా పాయింట్ సాధించిన అతను చివర్లో మాత్రం బాగా ఆడేందుకు ప్రయత్నించాడు. జట్టు సాధించిన ఆఖరి 10 పాయింట్లలో 5 దేశాయ్ రైడింగ్‌లో తెచ్చినవే ఉన్నాయి. టైటాన్స్ తరఫున గరిష్టంగా రజనీశ్ 8 పాయింట్లు సాధించగా, కెప్టెన్ అబోజర్ 2 టాకిల్ పాయింట్లకే పరిమితమయ్యాడు. ముంబా తరఫున అభిషేక్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య టాకిల్ పాయింట్లు సమంగా (10) ఉండగా రైడింగ్ పాయింట్లలో ముంబా 1 ఎక్కువగా సాధించింది. అయితే రెండు సార్లు ఆలౌట్ కావడంతో పోగొట్టుకున్న 4 పాయింట్లే తుది ఫలితంలో తేడాగా మారాయి. మరో మ్యాచ్‌లో విజయంతో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ సీజన్–7లో శుభారంభం చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బుల్స్ 34–32 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. బెంగళూరు తరఫున పవన్ సెహ్రావత్ 9 పాయింట్లు స్కోరు చేయగా, పట్నా తరఫున పర్దీప్ నర్వాల్ 10, ఇస్మాయిల్ 9 పాయింట్లు సాధించారు. -
తొలి వేట యు ముంబాదే..
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో యు ముంబా శుభారంభం చేసింది. సొంత మైదానంలో జరుగుతున్న సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చేతులెత్తేసింది. శనివారం హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31-25 తేడాతో యు ముంబా ఘనవిజయం సాధించింది. ముంబై ఆటగాడు అభిషేక్ సింగ్ పది రైడింగ్ పాయింట్లతో చెలరేగగా.. డిఫెండర్స్ రోహిత్ బలియాన్, సందీప్ నర్వాల్ తలో నాలుగు ట్యాకిల్ పాయింట్లతో టైటాన్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. టైటాన్స్ ఆటగాళ్లలో రజ్నిష్ 8 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా వారి నుంచి సహకారం అందలేదు. సారథి అబోజర్ నాలుగు సార్లు ట్యాకిల్‌లో విఫలమవడం టైటాన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. -
సైరా కబడ్డీ...
ఆరు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న కబడ్డీ ఆరు నెలలకే మళ్లీ వచ్చేసింది. ఐపీఎల్ తర్వాత అంతటి ఊపును తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ కూత మరోసారి మోత మోగించనుంది. 12 జట్లు... 92 రోజులు... 137 మ్యాచ్‌లు... ఇక వినోదానికి లోటేముంది. నేటి నుంచి జరిగే సీజన్–7తో కబడ్డీ ... కబడ్డీ... కబడ్డీ అంటూ శ్రుతి కలిపేందుకు మీరు సిద్ధమేనా...? సాక్షి, హైదరాబాద్ ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం లీగ్ తెరపైకి వచ్చి అనూహ్యంగా సూపర్ సక్సెస్‌గా నిలిచిన ఈ టోర్నీ విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5న ఆరో సీజన్ ఫైనల్ జరగ్గా అదే జోరులో 2019లో రెండో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్‌లాగే ఈసారి కూడా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. హైదరాబాద్ అంచె పోటీలు ఈనెల 26 వరకు జరుగుతాయి. కొత్త ఫార్మాట్‌తో 137 మ్యాచ్‌లు... ప్రొ కబడ్డీ లీగ్–7కు సంబంధించి ప్ర«ధాన మార్పు ఫార్మాట్ విషయంలో జరిగింది. ఇంతకుముందు రెండు వేర్వేరు జోన్లు, వాటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు తర్వాతి దశ, ఆపై చివరి దశ అంటూ గందరగోళంగా షెడ్యూల్ కనిపించింది. దాంతో దీనిని పూర్తిగా మార్చి అభిమానులకు ఆసక్తి రేపేలా చేశారు. ► ఐపీఎల్ తరహాలో ప్రతీ జట్టు మరో టీమ్‌తో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే ఒక్కో టీమ్ కనీసం 22 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. సొంత వేదికపై మాత్రం గరిష్టంగా నాలుగు మ్యాచ్‌లకు మించి ఏ జట్టుకూ ఆడే అవకాశం రాదు. లీగ్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు బరిలో నిలిస్తే...తర్వాతి ఆరు జట్లు టోర్నీనుంచి తప్పుకుంటాయి. ► తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడి విజయం ద్వారా సెమీస్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది. సరిగ్గా మూడు నెలల సాగే ఈ లీగ్‌లో ఏకంగా 137 మ్యాచ్‌లు జరుగుతుండటం విశేషం. ప్రతీసారి ఏదో ఒక స్లోగన్‌ను లీగ్‌కు ఆకర్షణగా తెస్తున్న నిర్వాహకులు ఈసారి ‘ఇస్ సే టఫ్ కుచ్ నహీ...(ఇంతకంటే క్లిష్టం మరోటి లేదు)’ పేరుతో లీగ్‌కు ప్రచారం నిర్వహించారు. వేదికలు... 12 జట్లు తమ సొంత వేదికలను ఎంచుకున్నాయి. గత సీజన్లో తెలంగాణలో ఎన్నికల కారణంగా వైజాగ్‌లో హోం మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఈసారి హైదరాబాద్‌నే సొంత వేదికగా తీసుకుంది. దీంతో పాటు ముంబై, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, పుణే, జైపూర్, పంచకుల, గ్రేటర్ నోయిడాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ అంచె మ్యాచ్‌లు శనివారం ప్రారంభమవుతాయి. ప్రతి మంగళవారం మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శని, ఆది, బుధ, శుక్రవారాల్లో హోం జట్లు తమ మ్యాచ్‌లను ఆడతాయి. పట్నాదే జోరు... లీగ్‌లో ఆరు సీజన్లలో పట్నా పైరేట్స్ జట్టు దూకుడు కొనసాగింది. ఏకంగా మూడు సార్లు ఆ జట్టు విజేతగా నిలవడం విశేషం. జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. గత సీజన్లో ట్రోఫీ అందుకున్న బెంగళూరు బుల్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్... కబడ్డీ అంటే కుర్రాళ్లు మాత్రమే కాదు మేం కూడా ఆడగలమంటూ కొందరు వయసులో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరిలో జోగీందర్ నర్వాల్ (37 ఏళ్లు–ఢిల్లీ), జీవకుమార్ (38 ఏళ్లు–బెంగాల్), ధర్మరాజ్ చేరలతన్ (43 ఏళ్లు–హరియాణా) ఆటపై అందరి దృష్టి ఉంది. కెన్యా నుంచి కూడా... లీగ్‌లో భారత ఆటగాళ్లతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అందరిలోకి అగ్రభాగం ఇరాన్‌దే. టైటాన్స్ కెప్టెన్ అబోజర్ సహా మొత్తం 15 మంది ఇరాన్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌కు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ) ఆడే డెవిట్ జెన్నింగ్స్‌ను టైటాన్స్ తమ జట్టులోకి తీసుకున్నా... చివరి నిమిషంలో వేరే కారణాలతో అతడిని తప్పించింది. లీగ్ టాపర్స్ అత్యధిక పాయింట్లు: రాహుల్ చౌదరి (876) అత్యధిక రైడ్ పాయింట్లు: పర్దీప్ నర్వాల్ (858) అత్యధిక టాకిల్ పాయింట్లు: మన్జీత్ ఛిల్లర్ (302) ఎక్కువ సార్లు ప్రత్యర్థిని ఆలౌట్: పట్నా పైరేట్స్ (165) మాజీ చాంపియన్స్ సీజన్ విజేత 2014 జైపూర్ పింక్ పాంథర్స్ 2015 యు ముంబా 2016 పట్నా పైరేట్స్ (జనవరి; జూన్) 2017 పట్నా పైరేట్స్ 2018–19 బెంగళూరు బుల్స్ నేటి మ్యాచ్‌లు తెలుగు టైటాన్స్ X యు ముంబా రాత్రి గం. 7.30 నుంచి బెంగళూరు బుల్స్ X పట్నా పైరేట్స్ రాత్రి గం. 8.30 నుంచి సీజన్–7 కెప్టెన్లు వీరే... ► మణీందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్) ► జోగీందర్ నర్వాల్ (దబంగ్ ఢిల్లీ) ► సునీల్ కుమార్ (గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్) ► రోహిత్ కుమార్ (బెంగళూరు బుల్స్) ► దీపక్ హుడా (జైపూర్ పింక్ పాంథర్స్) ► పర్దీప్ నర్వాల్ (పట్నా పైరేట్స్) ► సుర్జీత్ సింగ్ (పుణేరీ పల్టన్) ► అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్) ► అబోజర్ మొహాజిర్ మిగాని (తెలుగు టైటాన్స్) ► నితీశ్ కుమార్ (యూపీ యోధ) ► ఫజల్ అత్రచలి (యు ముంబా) ► ధర్మరాజ్ చేరలతన్ (హరియాణా స్టీలర్స్) -
టైటిల్ వేటలో తెలుగు టైటాన్స్
కబడ్డీ... కబడ్డీ... అంటూ ఆరేళ్లుగా తెలుగు టైటాన్స్ ఆడుతోంది. కానీ టైటిల్ వేటలో కనీసం ఫైనల్ మెట్టయినా ఎక్కలేకపోయింది. ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకునేందుకు టైటాన్స్ కష్టపడుతోంది. జట్టులో మార్పులు కూడా చేసింది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌లతో జట్టు కూత పెట్టేందుకు సిద్ధమైంది. మరీ ఈ కూత ఎందాకో తెలియాలంటే మనం మూడు నెలలు ఆగాలి! ఎందుకంటే ఫైనల్ అక్టోబర్‌లో కదా జరిగేది!! సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో కసిదీరా ఆడేందుకు తెలుగు టైటాన్స్ సన్నద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఆరంభమే హైదరాబాద్‌లో జరగనుండటంతో తొలి అంచె పోటీల్లో స్థిరమైన విజయాలు సాధించాలని ఆశిస్తోంది. ఆరేళ్లుగా టైటాన్స్ ఆశల పల్లకి మోసిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి జట్టును వీడాడు. అతని స్థానంలో మరో స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ రాగా... సారథ్య బాధ్యతల్ని ఇరానీ డిఫెండర్ అబొజర్ మిఘానికి అప్పగించింది. చీఫ్ కోచ్‌గా ఇరాన్‌కు చెందిన గోలమ్ రెజాను నియమించింది. ఇలా జట్టుకు కొత్త దిశను చూపిన యాజమాన్యం తమ దశమారాలని గంపెడాశతో బరిలోకి దిగుతోంది. డిఫెండర్లపై విశ్వాసం ఈ సారి జట్టు కుర్రాళ్లపై నమ్మకముంచింది. దీంతో అనుభవజ్ఞులకంటే యువ ఆటగాళ్లే తొడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్, కెప్టెన్ అబొజర్ మిఘానిలు ఓ పట్టుపడితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. గత సీజన్లో విశాల్ చక్కగా రాణించాడు. 60 టాకిల్ పాయింట్లు సాధించిన అతడు సగటున మ్యాచ్‌కు మూడున్నర పాయింట్లు తెచ్చిపెట్టాడు. ఆరో సీజన్లో మూడో ఉత్తమ ప్రదర్శన అతనిదే. ఇక రైట్ కార్నర్లో మెరుగైన డిఫెండర్ అబొజర్. కీలక సమయంలో ప్రత్యర్థులను, పాయింట్లను ఒడిసి పట్టాడు. ఆరో సీజన్లో అతను విశాల్‌కు కాస్త తక్కువగా 57 పాయింట్లు సాధించాడు. 2.7 సగటు నమోదు చేశాడు. రైడర్ల పాలిట వీళ్లిద్దరు టైటాన్స్‌కు బ్రహ్మాస్త్రాలైతే తెలుగు జట్టుకు తిరుగుండదు. యు ముంబా మాజీ కోచ్ అయిన గొలమ్ రెజాను చీఫ్ కోచ్‌గా నియమించడం, కెప్టెన్ కూడా ఇరానీ ఆటగాడే కావడం... ఇద్దరి సమన్వయం జట్టుకు దోహదం చేసే అవకాశముంది. కలిసిరాని హైదరాబాద్ టైటాన్స్‌కు ఇప్పటివరకు సొంత మైదానం కలిసిరాలేదు. ఆరు సీజన్లలో మూడు వైజాగ్‌లో ఆడగా మరో మూడు ఇక్కడే ఆడింది. ఆడిన మూడు సీజన్లూ హైదరాబాదీ అభిమానుల్ని టైటాన్స్ నిరాశపరిచింది. ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ కేవలం ఐదే మ్యాచ్‌లు గెలిచింది. 9 మ్యాచ్‌లో ఓటమి ఎదురవగా... రెండు టైగా ముగిశాయి. ఈ సారైనా తమ తలరాత మారాలని జట్టు ఆశిస్తోంది. సెమీసే అత్యుత్తమం తెలుగు టైటాన్స్ 6 సీజన్లు పోరాడినా టైటిల్ వేటలో ఒక్కసారి కూడా నిలువలేకపోయింది. పీకేఎల్‌లో తెలుగు టీమ్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనలే! రెండు, నాలుగో సీజన్లలో రెండు సార్లు సెమీస్ చేరింది. గత రెండు సీజన్లలోనూ పేలవమైన ప్రదర్శనతో జోన్ ‘బి’లో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తమ్మీద ఈ ఆరేళ్లలో గెలిచిన మ్యాచ్లకంటే ఓడిన మ్యాచ్‌లే ఎక్కువ! 104 మ్యాచ్‌లాడిన టైటాన్స్ జట్టు 45 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... 47 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో 13 టైగా ముగిశాయి. తెలుగు టైటాన్స్ జట్టు అబొజర్ (కెప్టెన్), విశాల్, అరుణ్, కృష్ణ, మనీశ్, ఆకాశ్, ఆకాశ్ దత్తు (డిఫెండర్లు); సిద్ధార్థ్ దేశాయ్, అమిత్, అంకిత్, కమల్, ముల శివ, రజనీశ్, రాకేశ్, సూరజ్, మల్లికార్జున్, (రైడర్లు); అర్మాన్, ఫర్హాద్ మిలగర్దన్ (ఆల్‌రౌండర్లు). అందరి కళ్లు సిద్ధార్థ్పైనే సిద్ధార్థ్ దేశాయ్... ఒక్క సీజన్‌తో స్టార్ అయిన మహారాష్ట్ర ఆటగాడు. గతేడాది యు ముంబా తరఫున కూత పెట్టించాడు. సంచలన రైడింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థులను హడలెత్తించాడు. లీగ్‌లో గత సీజన్ మాత్రమే ఆడిన ఈ మహారాష్ట్ర కబడ్డీ ప్లేయర్‌పై తెలుగు టైటాన్స్ భారీ ఆశలే పెట్టుకుంది. అందుకనే ఏకంగా సుమారు రూ. కోటిన్నర (రూ.1.45 కోట్లు) వెచ్చించి మరీ అతన్ని కొనుక్కుంది. ప్రొ కబడ్డీ వేలంలోనే ఇది అత్యధిక మొత్తం కావడం విశేషం. రాహుల్ చౌదరి తరలిపోయిన లోటును దేశాయ్ సమర్థంగా భర్తీ చేయగలడనే విశ్వాసంతో టైటాన్స్ యాజమాన్యం ఎంత మొత్తానికైనా వెనుకాడలేదు. నిజంగా సిద్ధార్థ్‌కు అంత సీనుందా అంటే... గత సీజన్ ప్రదర్శన చూస్తే ఔననాల్సిందే. పీకేఎల్–6లో ఆడిన 21 మ్యాచ్‌ల్లో ఏకంగా 218 పాయింట్లు సాధించాడు. సగటున మ్యాచ్‌కు 10 పాయింట్లు తెచ్చిపెట్టిన రైడర్‌గా నిలిచాడు. అందుకే ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును ఎగరేసుకుపోయాడు. గత సీజన్లో కేవలం ముగ్గురు రైడర్లే ఈ ఘనత సాధించారు. ఇక ప్రస్తుత తెలుగు టైటాన్స్ రైడర్లంతా కలిపి చేసిన పాయింట్లు (69), సిద్ధార్థ్ ఒక్కడే చేసిన పాయింట్లకూ ఎంతో వ్యత్యాసముంది. అతని సగం పాయింట్లకు సరిపోని దూరంలో ఉన్నాయి. ఈ ఖరీదైన ఆటగాడు మంచి పాటగాడు (గాయకుడు) కూడా! అంతేనా... డ్యాన్సర్ కూడా. బరిలో కూత పెట్టడమే కాదు... మ్యాచ్‌లు గెలిస్తే ఆటపాటలతో హోరెత్తిస్తానంటున్నాడు సిద్ధార్థ్. -
అబొజర్‌కు తెలుగు టైటాన్స్ పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఇరాన్ డిఫెండర్ అబొజర్ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. ఈ నెల 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్లన్నీ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. తొలి అంచె పోటీలు ముందుగా హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి. ఈ సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త సారథిని అధికారికంగా ప్రకటించారు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి లేకపోయినా జట్టుకు ఢోకా లేదని జట్టు యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని తెలిపారు. గతేడాది నిరాశపరిచిన తమ జట్టు ఈ సారి టైటిల్‌పై గురిపెట్టిందని ఆయన చెప్పారు. ఆరంభం నుంచే ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్‌లో మొదలయ్యే ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో జరిగే ఫైనల్‌తో ఏడో సీజన్ ముగుస్తుంది. ఆన్లైన్లో టికెట్లు.... హైదరాబాద్ అంచె ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల టికెట్లు https://www. eventsnow.com వెబ్సైట్లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500; రూ.800; రూ. 3000గా నిర్ణయించారు. మరో రెండు ఫ్రాంచైజీలు కూడా కొత్త కెప్టెన్లను ప్రకటించాయి. యు ముంబా కూడా ఇరానీ ప్లేయర్ ఫజల్‌ని సారథిగా నియమించగా, పుణేరి పల్టన్ జట్టు సుర్జీత్ సింగ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. -
కూతేస్తే.. కేకలే
క్రికెట్ ప్రపంచకప్ పండుగ ముగిసింది. కప్పు గెలిచిన ఇంగ్లండ్ సంబరాల్లో ఉండగా, అదృష్టం వెక్కిరించి గెలుపుగీతను దాటని న్యూజిలాండ్ దుఃఖ సాగరంలో మునిగింది. మూడోసారి జగజ్జేతగా నిలవాలనుకున్న భారత్ సెమీస్‌లోనే ఓడి ఇంటి ముఖం పట్టింది. ఈ పరాజయంతో నైరాశ్యంలో మునిగిన క్రీడాభిమానులను అలరించడానికి మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ‘కబడ్డీ’ సమాయత్తమవుతోంది. ఆటగాళ్ల అద్భుత రైడింగ్ విన్యాసాలు, అదిరిపోయే ఉడుంపట్టు డిఫెన్స్ మెరుపులతో క్షణక్షణం ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రొ కబడ్డీ సీజన్–7 సిద్ధమైంది. పల్లె క్రీడకు కార్పొరేట్ సొబగులద్దడంతో ప్రొ కబడ్డీ రూపంలో పిల్లాడి నుంచి పండు ముసలి వరకు, గ్రామం, పట్టణం, నగరాలనే తేడాల్లేకుండా అనతి కాలంలోనే క్రికెటేతర క్రీడల్లో కబడ్డీ అగ్రగామిగా మారింది. తమ అద్భుతమైన ఆటతో గత కొన్ని సీజన్లుగా వీక్షకుల మనసులు దోచిన కొందరు కూతగాళ్ల గురించి తెలుసుకుందాం.. డుబ్కీ వీరుడు పర్దీప్: ప్రొ కబడ్డీలో అందరికంటే ఎక్కువగా 858 రైడ్ పాయింట్లను అతి తక్కువ మ్యాచుల్లో (85) పర్దీప్ నర్వాల్ సాధించాడు. ‘డుబ్కీ కింగ్’ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పర్దీప్ ప్రొ కబడ్డీలో బెంగళూరు జట్టు నుంచి అరంగేట్రం చేశాడు. కానీ అతడికి ఎక్కువ అవకాశాలిచ్చింది మాత్రం పట్నా జట్టు. పట్నా పైరేట్స్ మూడుసార్లు టైటిల్ గెలవడంలో డుబ్కీ కింగ్ కీలకపాత్ర పోషించాడు. హాదీ ఓస్తరక్, జాంగ్ కున్ లీ, సురేందర్ నాడా, మహ్మద్ మగుసొద్లూ లాంటి సీనియర్ ఆటగాళ్ల కలబోతతో ఉన్న పట్నా పైరేట్స్‌ను పర్దీప్ టైటిల్ రేసులో నిలపడానికి తొడగొడుతున్నాడు. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్న పర్దీప్ నర్వాల్ రైడ్ మెషీన్ రాహుల్: ప్రొ కబడ్డీలో పర్దీప్ నర్వాల్ తర్వాత అత్యధిక రెడింగ్ పాయింట్లను రాహుల్ చౌదరి నమోదు చేశాడు. అభిమానులు రాహుల్‌ను ముద్దుగా ‘ప్రొ కబడ్డీ పోస్టర్ బాయ్’, ‘రైడ్ మెషీన్’ అంటుంటారు. తొలి సీజన్ నుంచి తెలుగు టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాహుల్.. రైడింగ్‌లో సూపర్ సక్సెస్ అయినా జట్టుకు కప్పు సాధించడంలో విఫలమయ్యాడు. ఈసారి జట్టు మారిన అతడు తమిళ్ తలైవాస్ టీమ్‌లో అజయ్ ఠాకూర్‌తో కలసి ఆడబోతున్నాడు. తెలుగు టీమ్‌కు కప్పు తీసుకురాలేకపోయిన రాహుల్ తమిళ టీమ్తోనైనా కప్పు గెలిచి తన కోరికను తీర్చుకోవాలని కసిగా ఉన్నాడు. హ్యాండ్ టచ్ యత్నంలో రాహుల్ చౌదరి సొగసరి అజయ్ ఠాకూర్: భారత కబడ్డీ జట్టుకు అజయ్ ఠాకూర్ సారథనే విషయం తెలిసిందే. సంప్రదాయ ఆటతీరుతో అజయ్ ఆటతీరు సొగసుగా ఉంటుందంటుంటారు విశ్లేషకులు. అజయ్ రన్నింగ్ హ్యాండ్ టచ్‌లకు పేరున్న డిఫెండర్లు కూడా ఔటవ్వాల్సిందే. ప్రొ కబడ్డీలో గత రెండు సీజన్లుగా తమిళ్ తలైవాస్ టీమ్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్న అజయ్ ఆయా సీజన్లలో యువ ఆటగాళ్లను బాగా ప్రోత్సహించాడు. శక్తివంచన లేకుండా పోరాడిన అజయ్ సారథ్యంలోని తలైవాస్ జట్టు చాలా మ్యాచుల్లో చివరి నిమిషాల్లో గెలిచింది. అజయ్ అద్భుత ఆటతో ఈ గెలుపులు సాధ్యమయ్యాయి. రాహుల్ చౌదరీ, షబ్బీర్ బాబు. మంజీత్ చిల్లర్ లాంటి ప్రముఖ ఆటగాళ్ల రాకతో ఇటు రైడింగ్, అటు డిఫెన్స్ దుర్బేధ్యంగా తయారైన తలైవాస్‌ను విజేతగా నిలపాలని అజయ్ ఠాకూర్ ఉవ్విళ్లూరుతున్నాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్‌కు ప్రయత్నిస్తున్న అజయ్ ఠాకూర్ ఆల్‌రౌండర్‌కు మారుపేరు మంజీత్: వన్ మ్యాన్ ఆర్మీగా మంజీత్ చిల్లర్ కబడ్డీ ప్రేక్షకులకు సుపరిచితం. మొదటి రెండు సీజన్లలో బెస్ట్ డిఫెండర్, మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచిన మంజీత్.. తొలుత బెంగళూరుకు ఆడినా రెండేళ్ల క్రితం తమిళ్ తలైవాస్ జట్టుకు మారాడు. మంజీత్ ఫామ్‌లో ఉంటే ఎదుటి జట్టుకు చెమటలు పట్టడం ఖాయం. డిఫెన్స్‌లో కీలకంగా ఉండే మంజీత్ రైడర్లను ఒడిసిపట్టడంలో, డ్యాష్లతో భయపెట్టడంలో సిద్ధహస్తుడు. మంజీత్ది ఉడుంపట్టని అనొచ్చు. కుస్తీతో కూడిన అతడి డిఫెన్స్‌కు ఎంతటి రైడరైనా పట్టు చిక్కాల్సిందే. రైడర్‌ను నిలువరిస్తున్న మైటీ మంజీత్ చిల్లర్ వణుకు పుట్టించే అట్రాచలి: ఇరాన్ ఆటగాడైన ఫజల్ అట్రాచలి ప్రొ కబడ్డీలో చురుకైన డిఫెన్స్ స్కిల్స్‌తో తన మార్క్ చాటుకున్నాడు. లెఫ్ట్ కార్నర్లో ఆడే ఫజల్ నుంచి పాయింట్లు రాబట్టడం రైడర్లకు అంత సులువు కాదు. ఈసారి సందీప్ నర్వాల్, రాజ్‌గురు సుబ్రహ్మణ్యం, సురేందర్ సింగ్ లాంటి అనుభవజ్ఞుల అండతో డ్యాష్, యాంకిల్ హోల్డ్, బ్లాక్ లాంటి దాడులు చేస్తూ, ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఫజల్ తన డిఫెన్స్ బృందంతో సంసిద్ధమవుతున్నాడు. రైడర్‌ను పట్టుకోవడానికి పోరాడుతున్న ఫజల్ అట్రాచలి యూపీ యోధుడు రిషాంక్: యూపీ యోధాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషాంక్ దేవడిగా రైడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూ–ముంబాకు ఆడినప్పుడు వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందుకున్న రిషాంక్ మూడో సీజన్లో 115 పాయింట్లు సాధించాడు. ఆ ప్రదర్శనతోనే యూపీ జట్టుకు కెప్టెన్‌గా అవకాశం అందుకున్నాడు. ఐదో సీజన్లో యూపీ తరఫున చెలరేగిన రిషాంక్ 170 పాయింట్లతో అందరి మనసులూ గెలుచుకున్నాడు. డూ ఆర్ డై స్పెషలిస్ట్‌గా పేరున్న రిషాంక్తోపాటు మోనూ గోయత్, శ్రీకాంత్ జాదవ్, మోసెన్ మొక్సూదులూతో యూపీకి కీలకం అవనున్నారు. కలసికట్టుగా ఆడితే ఏ జట్టునైనా చిత్తుచేయగల సామర్థ్యమున్న యూపీ కప్పు కలను రిషాంక్ మోయనున్నాడు. టో–టచ్ ప్రయత్నంలో రిషాంక్ దేవడిగా విరుచుకుపడే విశాల్: ప్రొ కబడ్డీలో విశాల్ భరద్వాజ్ ప్రస్థానం తెలుగు టైటాన్స్‌తో మొదలైంది. ఇప్పుడు అదే జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 5వ సీజన్లో 71 డిఫెండింగ్ పాయింట్లతో విశాల్ అందరి దృష్టిలో పడ్డాడు. రాహుల్ చౌదరీని కోల్పోయినా బిడ్డింగ్‌లో గత సీజన్ హీరో సిద్ధార్థ్ దేశాయ్‌ను దక్కించుకోవడంతో ఈసారి టైటాన్స్ జట్టు కప్పుపై ఆశలు పెంచుకుంది. అబోజర్ మిఘానీ, సి.అరుణ్ వంటి వారితో బలమైన డిఫెన్స్ బృందంతో రైడర్లపై విరుచుకుపడటానికి సమాయత్తమవుతున్న విశాల్ ఈ యేడు ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల కప్పు కలను నెరవేర్చుతాననే నమ్మకంతో ఉన్నాడు. రైడర్‌ను లాఘవంగా ఒడిసిపడ్తున్న విశాల్ భరద్వాజ్ సిసలైన బుల్ రోహిత్: పట్నా జట్టుతో రోహిత్ కుమార్ ప్రొ కబడ్డీ ప్రయాణం మొదలైంది. గత మూడు సీజన్లుగా బెంగళూరు బుల్స్‌కు ఆడుతున్న అతడు, గతేడాది జరిగిన సీజన్–6లో బెంగళూరును చాంపియన్‌గా నిలిపాడు. రోహిత్, పవన్ షెరావత్ రైడింగ్‌లో చెలరేగితే అడ్డుకోవడం ప్రత్యర్థులకు కత్తి మీద సామే. పవన్ షెరావత్, ఆశిశ్ కుమార్, వినోద్ కుమార్, మోహిందర్ సింగ్‌లతో మంచి సమతూకంతో ఉన్న బుల్స్ జట్టును మళ్లీ విజేతను చేయడానికి రోహిత్ వ్యూహాలు రచిస్తున్నాడు. డిఫెండర్లపై దూసుకొస్తున్న రోహిత్ కుమార్ నిప్పులు చెరిగే నితిన్: యూపీ బాహుబలిగా పిలుచుకునే నితిన్ తోమర్ మూడో సీజన్‌తో ప్రొ కబడ్డీలో అడుగుపెట్టాడు. బెంగాల్, యూపీ, పట్నాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదో సీజన్లో పుణెరి తరఫున నితిన్ ఆడుతూ 177 పాయింట్లతో అందరిని ఆకర్షించాడు. ఎస్కేప్, రన్నింగ్ టచ్ హ్యాండ్, కీలక సమయాల్లో బోనస్, టర్నింగ్ స్కిల్స్‌తో నితిన్ చెలరేగిపోతుంటే అవతలి జట్టుకు ఆపడం కష్టతరమే. పవన్ కుమార్, గిరీష్ ఎర్నాక్, సుర్జీత్ సింగ్‌లతో కూడిన పుణేరి పల్టన్ జట్టును టైటిల్ వేటలో ముందుంచడానికి ఉరిమే ఉత్సాహంతో నితిన్ సిద్ధమవుతున్నాడు. రైడ్ చేస్తున్న నితిన్ తోమర్ - నిధాన్ సింగ్ పవార్ -
తెలుగు టైటాన్స్‌లో కడప కుర్రాడి సింహగర్జన..!
గ్రామీణ క్రీడ కబడ్డీ.. ఆధునిక హంగులు అద్దుకునిప్రొ కబడ్డీగా రూపుదిద్దుకుంది. మైదానంలో క్రీడాకారుల సింహగర్జనలో కబడ్డీ కొత్త ఎత్తులను చూస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామసీమలోసరదాగా ఆడుకునే ఓ పల్లెటూరు కుర్రోడుమూల శివగణేష్‌రెడ్డి ఏకంగా తెలుగుటైటాన్స్జట్టుకు ఎంపికయ్యాడు. దేశానికి ప్రాతినిథ్యంవహించడమే తన లక్ష్యమని జూలైలో నిర్వహించే మ్యాచ్‌లకు సన్నద్ధమవుతున్నాడు..ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్: వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మోటార్‌మెకానిక్ రామసుబ్బారెడ్డి, నాగమల్లమ్మ దంపతుల కుమారుడైన మూల శివగణేష్‌రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కమలాపురంలోని డిగ్రీ కళాశాలలో తృతీయ బీఏ చదువుతున్న ఈయన ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో తెలుగుటైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. రాయలసీమ నుంచి ప్రొకబడ్డీకి ఎంపికైన తొలి క్రీడాకారుడుగా ఈయన చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు మాత్రమే ప్రొ కబడ్డీలో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించగా అందులో శివగణేష్‌రెడ్డి ఒకరు కావడం విశేషం. మూడు సంవత్సరాల కాలంలోనే అసమాన్య ప్రతిభ.. తన సోదరుడు జనార్ధన్‌రెడ్డి కబడ్డీ క్రీడలో రాణిస్తుండటం చూడటం.. ఆయన ప్రోత్సహించడంతో ఇంటర్ పూర్తయిన తర్వాత కబడ్డీ సాధన ప్రారంభించాడు. కబడ్డీ శిక్షకుడు టి. జనార్ధన్ ఆధ్వర్యంలో ఆటలో ఓనమాలు దిద్దుకున్న ఈయన అనతికాలంలోనే పలు అవకాశాలను దక్కించుకున్నాడు. 2018లో నరసాపురంలో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది ముంబైలోని రోహులో నిర్వహించిన సీనియర్ నేషనల్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో సైతం ఏపీ నుంచి ప్రాతినిత్యం వహించాడు. గత సీజన్లో ప్రొ కబడ్డీ ఎంపికలకు వెళ్లిన ఈయన త్రుటిలో జట్టులో అవకాశం కోల్పోయాడు. వైజాగ్‌లో నిర్వహించిన క్యాంపులో ప్రతిభను గుర్తించిన తెలుగుటైటాన్ నిర్వాహకులు ఆల్‌రౌండర్‌గా అవకాశం కల్పించారు. ప్రొకబడ్డీ లీగ్ ఏడోసీజన్ కోసం ఇటీవల నిర్వహించిన వేలంలో జిల్లాకు చెందిన శివగణేష్‌రెడ్డిని రూ.6లక్షలకు టైటాన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ పోటీలు జూలై నెలలో దేశవ్యాప్తంగా వివిధ వేదికల్లో నిర్వహించనున్నారు. ఈయన ప్రస్తుతం విజయవాడలో ఇండియన్ కబడ్డీ సాయ్ కోచ్ పద్మజబాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. సన్మానించిన కబడ్డీ సంఘం.. తెలుగుటైటాన్స్‌కు ఎంపికైన మూల శివగణేష్‌రెడ్డిని జిల్లా కబడ్డీ సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఆయనకు పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి చిదానంద్‌గౌడ్, కోశాధికారి, కోచ్ టి. జనార్ధన్, ఉపాధ్యక్షులు గోవిందు నాగరాజు, ఎం. సుకుమార్, కె.వి.శివప్రసాద్‌యాదవ్, జాయింట్ సెక్రటరీ ఎం. జనార్ధన్‌రెడ్డి, సభ్యులు టి.శ్రీవాణి, ఎం. ప్రసాద్, పి.జయచంద్ర, సుశీల, సీనియర్ క్రీడాకారులు పి.సురేంద్ర, విష్ణుప్రసాద్యాదవ్, చందముని రాకేష్, తేజరెడ్డి పాల్గొన్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు వేలంలో పలికిన ధర చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన తెలుగుటైటాన్స్‌కు ధన్యవాదాలు. అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సోదరుడు జనార్ధన్‌రెడ్డి, శిక్షకుడు జనార్ధన్, అసోసియేషన్ సభ్యులకు నా కృతజ్ఞతలు. – మూల శివగణేష్‌రెడ్డి, తెలుగు టైటాన్స్ జట్టు సభ్యుడు, కడప -
‘నాకు పలికిన ధర చూసి ఉక్కిరిబిక్కిరయ్యా’
ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌కు సంబంధించి రెండు రోజుల పాటు సాగిన వేలం మంగళవారం ముగిసింది. 12 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 200 మంది ఆటగాళ్లను ఎంచుకున్నాయి. వీరిలో 173 మంది భారత ఆటగాళ్లు కాగా, 27 మంది విదేశీయులు ఉన్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీలు మొత్తం రూ. 50 కోట్లు ఖర్చు చేశాయి. కేటగిరీ ‘బి’లో డిఫెండర్ మహేందర్ సింగ్, రైడర్ మన్జీత్ సింగ్‌లకు అత్యధిక మొత్తాలు లభించాయి. మహీందర్‌ను బెంగళూరు బుల్స్ రూ. 80 లక్షలకు తీసుకోగా, మన్‌జీత్‌ను పుణేరీ పల్టన్ రూ. 63 లక్షలకు ఎంచుకుంది. ఆల్‌రౌండర్స్ కేటగిరీలో యు ముంబా రూ. 89 లక్షలతో సందీప్ నర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేసుకుంది. ఇక తొలి రోజు సోమవారం సాగిన ప్రధాన వేలంలో ఇద్దరు ఆటగాళ్లు సిద్ధార్థ్ దేశాయ్ (రూ. 1.45 కోట్లు), నితిన్ తోమర్ (రూ.1.20 కోట్లు)లకు కోటి రూపాయలకు పైగా విలువ లభించింది. రెండో రోజు ‘ఎ’ కేటగిరీ డిఫెండర్స్ విభాగంలో రూ.60 లక్షలకు విశాల్ భరద్వాజ్‌ను తెలుగు టైటాన్స్ సొంతం చేసుకుంది. సీజన్-7 ఈ ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతుంది. మరో వైపు తనకు భారీ మొత్తం లభించడంపై సిద్ధార్థ్ దేశాయ్ స్పందిస్తూ... ‘వేలంలో నాకు పలికిన ధర చూసి ఉక్కిరిబిక్కిరయ్యాను. నాది సాధారణ కుటుంబం. మా నాన్న రైతు. కబడ్డీ ఆటగాడిగా ఎదగడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నన్ను ఇంత పెద్ద మొత్తానికి ఎంచుకొని నా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన తెలుగు టైటాన్స్‌కు కృతజ్ఞతలు. టోర్నీలో బాగా ఆడి జట్టును గెలిపించేందుకు వంద శాతం కృషి చేస్తా’ అని అన్నాడు. తెలుగు టైటాన్స్ జట్టు ఇదే... సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్, రాకేశ్ గౌడ (రైడర్స్), విశాల్ భరద్వాజ్, కృష్ణ మదన్, సి. అరుణ్, అబోజర్ మిగాని (డిఫెండర్స్), అర్మాన్, డ్యూయెట్ జెన్నింగ్స్, ఫర్హద్ రహీమి, శివగణేశ్ రెడ్డి, మనీశ్, ఆకాశ్ చౌదరి, అమిత్ కుమార్ (ఆల్‌రౌండర్లు) -
సిద్ధార్థ్ దేశాయ్‌కు రూ.1.45 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ –7 కోసం జరిగిన వేలంలో 27 ఏళ్ల సిద్ధార్థ్ శిరీష్ దేశాయ్ పంట పండింది. సోమవారం ఇక్కడ జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్ జట్టు సిద్ధార్థ్‌ను రూ. 1 కోటి 45 లక్షలకు సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సిద్ధార్థ్ గత సీజన్లో యు ముంబాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరో సీజన్లో అతను అత్యధిక పాయింట్ల జాబితాలో మూడో స్థానంలో (221 పాయింట్లు) నిలిచాడు. వేలంలో కోటి రూపాయలు దాటిన జాబితాలో రెండో ఆటగాడిగా నితిన్ తోమర్ నిలిచాడు. పుణేరీ పల్టన్ రూ. 1.20 కోట్లు చెల్లించి ‘ఫైనల్ బిడ్ మ్యాచ్’ ద్వారా తోమర్‌ను రిటైన్ చేసుకుంది. వేలంలో జరిగిన ప్రధాన మార్పులలో హర్యానా స్టీలర్స్ టాప్ రైడర్ మోను గోయత్... యూపీ యోధ (రూ. 93 లక్షలు)కు తరలి వెళ్లగా... ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమమైన నాటినుంచి తెలుగు టైటాన్స్‌తోనే ఉన్న స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి ఈ సారి తమిళ్ తలైవాస్ (రూ. 94 లక్షలు)కు మారాడు. మరో ఆటగాడు సందీప్ నర్వాల్‌ను యు ముంబా (రూ. 89 లక్షలు) దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లలో ఇరాన్‌కు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్ నబీ బ„Š కు అత్యధిక మొత్తం దక్కింది. బెంగాల్ వారియర్స్ రూ. 77.75 లక్షలకు ఇస్మాయిల్‌ను తీసుకుంది. ఇరాన్‌కే చెందిన అబోజర్ మొహజల్ మిగానికి రూ. 75 లక్షలు చెల్లించి తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకోవడం విశేషం. విదేశీ ఆటగాళ్లలో జంగ్ కున్ లి (పట్నా– రూ. 40 లక్షలు), మొహమ్మద్ ఇస్మాయిల్ మగ్సూదు (పట్నా – రూ. 35 లక్షలు), డాంగ్ గియోన్ లీ (యు ముంబా – రూ. 25 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తెలుగు టైటాన్స్ అబోజర్‌తో పాటు విశాల్ భరద్వాజ్‌ను కొనసాగించింది. జూలై 19నుంచి టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ జూలై 19 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతుంది. గత సీజన్లో ప్రేక్షకాదరణ తగ్గడంతో మళ్లీ పాత షెడ్యూలునే ఖారారు చేశారు. ఆరో సీజన్ చాలా ఆలస్యంగా అక్టోబర్‌లో ప్రారంభించారు. అయితే ఆ సమయంలో వరుసగా పెద్ద పండగలు ఉండటంతో వీక్షకుల శాతం తగ్గింది. దీంతో ఏడో సీజన్‌ను గతంలోలాగే జూలైలోనే మొదలుపెట్టి ఫెస్టివల్స్‌కు ముందే ముగిస్తామని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. -
రాహుల్ చౌదరిని వదిలేసిన టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. జూలై 19 నుంచి పీకేఎల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి సారించాయి. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లను కొత్త సీజన్ కోసం తమతో అట్టిపెట్టుకున్నాయి. హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ తమ కెప్టెన్ రాహుల్ చౌదరీని ఈసారి వేలంలో ఖరీదు చేసేందుకే నిర్ణయించుకున్నట్లుంది. రాహుల్‌కు బదులుగా అర్మాన్, మోహ్సీన్ మసౌదుల్జఫారీ, ఫర్హాద్ రాహిమి మిలాహర్దన్, కృష్ణ మదానేలను రిటెయిన్ చేసుకుంది. తమిళ్ తలైవాస్ జట్టు అజయ్ ఠాకూర్, మంజీత్ ఛిల్లర్, విక్టర్ ఓన్యాంగ్ ఓబెరోలను తమతో కొనసాగిస్తుండగా... పట్నా పైరెట్స్ జట్టు స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్, వికాస్ జగ్లాన్, తుషార్ పాటిల్, జవహర్లను తమతో అట్టిపెట్టుకుంది. ఇతర ఫ్రాంచైజీలు బెంగాల్ వారియర్స్ జట్టు బల్దేవ్ సింగ్, మణీందర్ సింగ్... బెంగళూరు బుల్స్ జట్టు రోహిత్ కుమార్, పవన్ కుమార్ సెహ్రావత్, ఆశిష్ కుమార్ సాంగ్వాన్... దబంగ్ ఢిల్లీ కేసీ జట్టు మేరాజ్, జోగీందర్ నర్వాల్... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు సచిన్, సునీల్ కుమార్... హరియాణా స్టీలర్స్ జట్టు కుల్దీప్ సింగ్, వికాస్ ఖండోలా... జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు దీపక్ నివాస్ హుడా, సందీప్ కుమార్ ధూల్... యు ముంబా జట్టు ఫజెల్ అత్రాచలి, రాజగురు సుబ్రమణియన్, అర్జున్ దేశ్వాల్, యూపీ యోధా జట్టు అమిత్, సచిన్ కుమార్‌లను రిటెయిన్ చేసుకుంది. పుణేరి పల్టన్ జట్టు తమ మొత్తం ఆటగాళ్లను వేలం కోసం విడుదల చేసింది. మొత్తం 29 మంది ఎలైట్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు తమతో అట్టిపెట్టుకున్నాయి. గతంలో 21 మంది ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకునే వీలుండేది. మరోవైపు గత సీజన్లో ఒక్కో టీమ్ గరిష్టంగా కేవలం నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకునే వీలుండగా... ఈసారి ఈ సంఖ్యను ఆరుకు పెంచారు. దీనితో పాటు మరో కొత్త అంశాన్ని కూడా లీగ్ నిబంధనల్లో జోడించారు. ‘రిటెయిన్డ్ యంగ్ ప్లేయర్స్’ కేటగిరీ ప్రకారం ఇకనుంచి ఫ్రాంచైజీలు రెండేళ్ల కాంట్రాక్టును పూర్తి చేసుకున్న కొత్త కుర్రాళ్లను తమతో రిటెయిన్ చేసుకోవచ్చు. రిటెయిన్డ్ యంగ్ ప్లేయర్ల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఫ్రాంచైజీలు వదిలేసుకున్న క్రీడాకారులు ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే వేలంలో అందుబాటులో ఉంటారు. -
ఓటమితో ముగిసిన టైటాన్స్ పోరు
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌ను తెలుగు టైటాన్స్ పరాజయంతో ముగించింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 34–39తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్’ అవకాశాలను చేజార్చుకున్న టైటాన్స్ చివరి మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. జోన్ ‘బి’లో 22 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 8 విజయాలు, 13 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 51 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి సగంలో జోరు కనబరిచిన టైటాన్స్ చివరి 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే నెగ్గి చేజేతులా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దూరం చేసుకుంది. మంగళవారం మ్యాచ్‌లో స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి, నిలేశ్ బరిలో దిగలేదు. అర్మాన్ 13 పాయింట్లతో పోరాడాడు. వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 12, సుర్జీత్ సింగ్ 7 పాయింట్లు సాధించారు. తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 40–40తో ‘డ్రా’గా ముగిసింది. జోన్ ‘ఎ’లో హరియాణా చివరి స్థానంలో నిలవగా... జోన్ ‘బి’లో తమిళ్ తలైవాస్ చివరి స్థానంతో సీజన్ ముగించింది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే జోన్ ‘ఎ’ నుంచి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, యు ముంబా, దబంగ్ ఢిల్లీ... జోన్ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ ‘ప్లే ఆఫ్’ దశకు అర్హత సాధించాయి. చివరిదైన ఆరో బెర్త్ కోసం పట్నా పైరేట్స్ (55 పాయింట్లు), యూపీ యోధ (52 పాయింట్లు) జట్లు రేసులో ఉన్నాయి. -
టైటాన్స్ మరో ఓటమి
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి క్వాలిఫయింగ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 20–35తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. ట్యాక్లింగ్‌లో సత్తా చాటిన పుణేరి పల్టన్ విజయం సాధించింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి పూర్తిగా విఫలమవడంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. 12 రైడ్లు చేసిన అతను కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించాడు. రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లో అదరగొట్టిన పల్టన్ సునాయాసంగా గెలుపొందింది. పల్టన్ తరఫున జీబీ మోరే 10 పాయింట్లతో మెరవగా... రవికుమార్, రింకూ నర్వాల్ చెరో 5 పాయింట్లు సాధించారు. టైటాన్స్ తరఫున ఫర్హద్ 5, నీలేశ్ 3 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 27–24తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యూ ముంబాతో యూపీ యోధా, బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
బెంగళూరు బుల్స్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి
స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 13 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా... అతనికి సరైన సహకారం అందకపోవడంతో తెలుగు టైటాన్స్ కీలక సమయంలో మరో ఓటమి మూటగట్టుకుంది. హరియాణాలో మంగళవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌లో టైటాన్స్ 28–44తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. బుల్స్ తరఫున పవన్ 13, రోహిత్ కుమార్ 7 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో బెంగళూరు జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్స్’కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39–30తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. -
టైటాన్స్‌ను గెలిపించిన రాహుల్ చౌదరి
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై చివరి మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 41–36తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 12 పాయింట్లతో చెలరేగగా... నీలేశ్ 9, మోసిన్ 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ తరఫున ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. జోన్ ‘బి’లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 8 మ్యాచ్‌ల్లో గెలిచి 50 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. వైజాగ్‌లో మ్యాచ్‌లు ముగియగా... శుక్రవారం నుంచి పోటీలు హరియాణాలోని పంచకులలో జరుగనున్నాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 24–37తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (4 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. నీలేశ్ 6 పాయింట్లు సాధిం చాడు. బుల్స్ తరఫున పవన్ 13 పాయింట్లతో మెరిశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 47–37తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. సొంతగడ్డపై జరిగే చివరి మ్యాచ్‌లో నేడు పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. -
టైటాన్స్ జోరుకు బ్రేక్
సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య రెండు వరుస విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 20–27తో యూపీ యోధా చేతిలో ఓడింది. రాహుల్ చౌదరి, అబోజర్ చెరో 6 పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున ప్రశాంత్ 8, నితేశ్ 5 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 44–19తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
టైటాన్స్ గెలుపు బాట
సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు తెలుగు టైటాన్స్‌కు ఓ గెలుపు. ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టైటాన్స్... సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 36–26తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు పోరాడటంతో టైటాన్స్ 17–13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలో రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లోనూ రాణించి గెలుపును అందుకుంది. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి, నీలేశ్ చెరో 8 పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో అనిల్ కుమార్ (4 పాయింట్లు) రాణించాడు. పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా 10, అజింక్యా పవార్ 6, సందీప్ ధుల్ 5 పాయింట్లు స్కోర్ చేశారు. సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన తెలుగు ప్లేయర్ గంగాధరి మల్లేశ్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 31–20తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
కూతకు సై
విశాఖ స్పోర్ట్స్: కబడ్డీ కూతకు ఆతిథ్య తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. ఆరో సీజన్ దీటుగానే ప్రారంభించినా మధ్యలో కాస్త తడబాటుతో వెనుకబడింది. హోమ్‌టౌన్‌లోనే టైటాన్స్ చెలరేగనుండటంతో ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు నిలిచే ఉన్నాయి. ఈ సీజన్లో 12 జట్టు రెండు జోన్లుగా తలపడుతున్నాయి. 12 వారాల పాటు సాగనున్న ఈ సీజన్లో ఇప్పటికే ఎనిమిది వారాలు అయిపోయాయి. ఇక చివరి నాలుగు వారాల్లో విజేత ఎవరో తేలిపోనుంది. కీలకమైన ఈ లెగ్ హోమ్‌టౌన్‌లోనే జరగనుండటంతో తెలుగు టైటాన్స్ భవితవ్యం తేలిపోనుంది. ఇంకా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆడాల్సి ఉండగా.. ఇక్కడే ఆరు మ్యాచ్‌లు ఆడనుండటంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తామనే దీమాను తెలుగు టైటాన్స్ జట్టు గురువారం జరిగిన మీడియా సెషన్లో వ్యక్తం చేసింది. ఏ జోన్లో ఆరు జట్లు ఉండగా తొలి రెండు స్థానాల్లో యు ముంబ, ఫార్చున్ జెయింట్స్ కొనసాగుతున్నాయి. జోన్–బిలో తెలుగు టైటాన్స్ ఆడుతుండగా తొలి రెండు స్థానాల్లో బెంగళూర్ బుల్స్, పాట్నా పైరేట్స్ కొనసాగుతున్నాయి. రైడింగ్ నుంచి డిఫెన్స్‌కు... తెలుగు టైటాన్స్ జట్టులో స్టార్ ఆటగాడు రాహుల్ రైడింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పటికే 700 పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా నమోదయ్యాడు. అయితే రాహుల్‌ను ప్రత్యర్థి జట్లు డిఫెండ్ చేయడంతో జట్టులోని మిగిలిన ఆటగాళ్లపై ఆధారపడ్డామని జట్టు సీఈఓ పవన్ అంటున్నారు. సీజన్లో చావోరేవో తెల్చుకోవల్సిన మ్యాచ్‌ల్లో విజయమే లక్ష్యంగా పోరాడతామంటున్నారు. జట్టు మేనేజర్ త్రినాథ్ మాట్లాడుతూ ఆట జరిగే రోజును బట్టి వ్యూహాలు మారుతాయంటున్నారు. హోమ్ లెగ్ కలిసొచ్చేనా.. జోన్–బీలో ఆడుతున్న తెలుగు టైటాన్స్ ప్రస్తుత ఆరో సీజన్లో ఇప్పటికి పదమూడు మ్యాచ్‌లాడింది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. జోన్–బీలో ఆడుతున్న ఆరు జట్లలో తెలుగు టైటాన్స్ ప్రస్తుతానికి నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న లెగ్‌లో తెలుగు టైటాన్స్ హోమ్‌టౌన్‌లో ఆడుతున్నందున వరుస విజయాలందుకుంటే ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలున్నాయి. అయితే జోన్–బీలో కనీసం మూడో స్థానానికైనా చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖలో ఆరుమ్యాచ్‌లు ఆడనుంది. బి జోన్లోనే టాప్–2లో నిలిచిన జట్లతో ఆడాల్సి ఉంది. ఇక ఇదే జోన్లో చివరి స్దానంలో కొనసాగుతున్న యోధా జట్టుతోనూ తలపడనుంది. అయితే కలిసి వచ్చే అంశం పూల్‌ఏలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోనూ మ్యాచ్‌లున్నాయి. దీంతో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. తెలుగు టైటాన్స్ వీరే... ఆల్‌రౌండర్ విశాల్ భరద్వాజ్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా రైడింగ్ దిట్ట రాహుల్ ఉండనే ఉన్నాడు. అంకిత్, కమల్, మోసిన్, నీలేష్, రజ్నీష్, రక్షిత్‌లు రైడింగ్‌కు సిద్ధంగా ఉన్నారు. అనుజ్, ఫర్హాద్, సొంబిర్ రైట్ కవర్లో డిఫెండ్ చేయనుండగా అనిల్, మనోజ్, దీపక్ లెఫ్ట్ కవర్లో డిఫెండ్ చేయనున్నారు. సెంటర్లో అబ్జోర్, కృష్ణ ఉండగా అర్మాన్, మహేందర్ ఆల్‌రౌండ్ ప్రతిభ చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. తప్పులు సరిదిద్దుకుంటున్నాం... చివరి లెగ్ పోటీల్లో డూ ఆర్ డైగా తలపడాల్సి ఉంది. హోమ్‌లెగ్‌లో ఆడుతుండటం కలిసివచ్చే అంశమే. కనీసం ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గినా ప్లేఆఫ్‌కు చేరుకున్నట్లే. ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు ఈ సీజన్లో ఆడాల్సి వుంది. సీజన్ ప్రారంభంలో బలమైన జట్టుగా ఉన్న తెలుగు టైటాన్స్ కాస్తా వెనుకబడింది. తొలి లెగ్‌లో ఆడిన జట్టే ఇక్కడ ఆడనుంది. 18 మందిలో ఏడుగురు సీనియర్లు ఈ పోటీల్లో తలపడనున్నారు. – తెలుగు టైటాన్స్ కెప్టెన్ విశాల్ భరద్వాజ్ తెలుగు టైటాన్స్‌తో... 7వ తేదీన రాత్రి 8 గంటలకు ఫారŠుచ్యన్ జెయింట్స్‌తో 8వ తేదీన రాత్రి 9 గంటలకు పింక్ ఫాంథర్స్తో 9వ తేదీన రాత్రి 9 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో 11వ తేదీన రాత్రి 9 గంటలకు యూపి యోధాతో 12వ తేదీన రాత్రి 9 గంటలకు బెంగళూర్ బుల్స్‌తో 13వ తేదీన రాత్రి 8 గంటలకు పాట్నా పైరెట్స్‌తో -
ఉత్కంఠ పోరులో టైటాన్స్ ఓటమి
పుణే: ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించినా... చివర్లో ఒత్తిడికి గురైన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్లో తొలిసారి బెంగళూరు బుల్స్‌తో తలపడిన టైటాన్స్ హోరాహోరీ పోరులో ఓటమి పాలైంది. జోన్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–26తో టైటాన్స్‌పై గెలిచింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా... ఇరు జట్లు 25–25తో సమంగా నిలిచాయి. ఈ దశలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని ప్రత్యర్థి జట్టు పట్టేయడంతో టైటాన్స్ ఆలౌటైంది. టైటాన్స్ తరఫున రాహుల్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు. బుల్స్ తరఫున రోహిత్ (8 పాయింట్లు) రాణించాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్స్ 35–33తో హరియాణ స్టీలర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
పుణే: ప్రారంభంలోనే దక్కిన ఆధిక్యాన్ని చేజార్చుకున్న తెలుగు టైటాన్స్... తమిళ్ తలైవాస్ చేతిలో ఓడింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా రెండు జట్ల మధ్య సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 31–25 తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు తరఫున మన్జీత్ ఛిల్లర్, అజయ్ ఠాకూర్ ఏడేసి పాయింట్లతో మెరిశారు. రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37–27తో యూపీ యోధాను ఓడించింది. లీగ్‌కు మంగళవారం విరామం. బుధవారం హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్, బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
తెలుగు టైటాన్స్‌కు ఐదో గెలుపు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిన టైటాన్స్ తిరిగి పుంజుకొని పుణేరీ పల్టన్స్‌ను చిత్తుచేసింది. జోన్ ‘బి’లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–25తో పుణేరీ పల్టన్స్‌పై గెలిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8, నీలేశ్ 6 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో కృష్ణ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో 5 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 27–17తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ అనూహ్యంగా తడబడి... ప్రత్యర్థికి వరుసగా 7 పాయింట్లు సమర్పించుకొని 27–23తో నిలిచింది. ఈ దశలో రాహుల్ చౌదరి సంయమనంతో ఆడి జట్టును గెలిపించాడు. పుణేరీ పల్టన్స్ తరఫున సందీప్ నర్వాల్ 7, మోను 5 పాయింట్లు సాధించారు. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 41–24తో యూపీ యోధాపై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్, యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్ మూడో ఓటమి మూటగట్టుకుంది. జోన్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 25–30తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో ఫర్హద్ (5 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 48–24తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్, యూపీ యోధా మ్యాచ్ ‘డ్రా’
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో తెలుగు టైటాన్స్ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం టైటాన్స్, యూపీ యోధా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు చివరకు 26–26తో ‘డ్రా’గా ముగిసింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్‌లో ఆ జోరు కనబర్చలేకపోయింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (3 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో టైటాన్స్ తొలి అర్ధభాగంలో 10–19తో వెనుకబడింది. రెండో సగంలో ఇటు రైడింగ్‌లో, అటు ట్యాక్లింగ్‌లో అద్భుతంగా చెలరేగిన టైటాన్స్ చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించింది. నీలేశ్, మొహ్సిన్, అబోజర్ నాలుగేసి పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున సచిన్ కుమార్ 5, శ్రీకాంత్, రిశాంక్ దేవడిగ చెరో 4 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 38–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి -
యు ముంబా చేతిలో టైటాన్స్ ఓటమి
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్‌కు యు ముంబా చేతిలో పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన పోరులో యు ముంబా 41–20తో టైటాన్స్‌పై భారీ విజయాన్ని సాధించింది. ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన దేశాయ్ 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఫజల్ అత్రాచలి 4, సురేందర్, వినోద్, అబొల్ఫజల్ తలా 2 పాయింట్లు చేశారు. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లలో రాహుల్ చౌదరి ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. 15 సార్లు రైడింగ్‌కు వెళ్లిన రాహుల్ కేవలం 7 పాయింట్లే తెచ్చాడు. ఫర్హాద్ 4, అనిల్, మోసిన్, అర్మాన్ రెండేసి పాయింట్లు సాధించారు. అనంతరం రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 36–31తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ (12 పాయింట్లు) అదరగొట్టాడు. జస్వీర్ 8, సుఖేశ్ హెగ్డే, మన్జీత్ చిల్లర్ చెరో 4 పాయింట్లు చేశారు. పుణేరి తరఫున నితిన్ తోమర్ (8) ఆకట్టుకున్నాడు. రవికుమార్ 4, మోను 3 పాయింట్లు చేశారు. నేడు జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టన్‌తో యూపీ యోధ తలపడతాయి. -
టైటాన్స్‌తో జతకట్టిన బీకే టైర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తెలుగు టైటాన్స్ జట్టుతో బీకే టైర్స్ సంస్థ జతకట్టింది. ఈసీజన్‌కు గానూ తెలుగు టైటాన్స్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఇకనుంచి టైటాన్స్‌కు సంబంధించిన జెర్సీలు, కిట్లపై బీకే టైర్స్ లోగో కనిపించనుంది. ఈ ఒప్పందంతో బీకే టైర్స్ భాగస్వామ్యం ప్రొ కబడ్డీ లీగ్‌లో ఏడు జట్లకు చేరింది. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విజయవంతమైన టైటాన్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని బీకే టైర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ పొద్దార్ అన్నారు. ఈ భాగస్వామ్యంపై తెలుగు టైటాన్స్ సీఈవో మండ పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
తెలుగు టైటాన్స్‌కు మూడో గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–31తో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 14–17తో వెనుకబడింది. రెండో సగంలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి చెలరేగడంతో టైటాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా... తెలుగు టైటాన్స్ 30–31తో వెనుకంజలో ఉంది. ఆ సమయంలో రైడింగ్‌కు వచ్చిన పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్‌ను టైటాన్స్ ఆటగాళ్లు పట్టేయడంతో 32–31 తో నిలిచింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కాపాడు కుంటూ జాగ్రత్తగా ఆడి విజయం సొంతం చేసుకుంది. టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి (7 పాయింట్లు), నీలేశ్ (5 పాయింట్లు) రైడింగ్‌లో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో విశాల్ (6 పాయింట్లు) రాణించా డు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 29–25తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, పుణేరీ పల్టన్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తొలి ఓటమి చవిచూసింది. జోన్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 25–30తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరీ (2 పాయింట్లు) విఫలమవడంతో టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. విజేత జట్టు తరఫున మణీందర్ సింగ్ 11 రైడ్ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో శ్రీకాంత్ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. టైటాన్స్ తరఫున నీలేశ్ 5 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో అబోజర్ మిఘాని (5 పాయింట్లు) రాణించాడు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–33తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ రెండో విజయం
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జోన్ ‘బి’లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 34–29 తో యూపీ యోధాపై గెలిచింది. ట్యాక్లింగ్‌లో అబోజర్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. యూపీ యోధా తరఫున ప్రశాం త్ 11, రిషాంక్ 7 పాయింట్లు సాధించా రు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 53–26తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. యు ముంబా తరఫున అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా... హరియాణా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. నేడు పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్ జట్లు తలపడనున్నాయి -
తెలుగు టైటాన్స్ బోణీ
చెన్నై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్–6లో శుభారంభం చేసింది. మంగళవారం జోన్ ‘బి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), మోసిన్ (7 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 33–28తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. ఆట ఆరంభమైన తొలి పది నిమిషాలు ఇరు జట్లు హోరాహారీగా తలపడినా ఆ తర్వాత రాహుల్ చౌదరి ధాటిగా ఆడటంతో తమిళ్ తలైవాస్ జట్టు ఆలౌటైంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 17–11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తలైవాస్ పుంజుకొని పోటీనిచ్చినా లాభం లేకపోయింది. తమిళ్ తలైవాస్ తరఫున కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో అమిత్ (6 పాయింట్లు) సత్తా చాటాడు. జోన్ ‘ఎ’లో భాగంగా గుజరాత్ ఫార్చూన్‌జెయింట్స్, దబంగ్ ఢిల్లీల మధ్య జరిగిన మరో మ్యాచ్ 32–32తో ‘డ్రా’గా ముగిసింది. ప్రారంభంలో తడబడిన ఢిల్లీ రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకొని చివరకు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది. ఆట ఆరంభమైన ఏడు నిమిషాల లోపే ఢిల్లీ ఆలౌటైంది. ప్రత్యర్థి చక్కటి డిఫెన్స్‌కు తోడు తమ స్వీయ తప్పిదాలతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 12–17తో వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో తేరుకొని ప్రత్యర్థికి గట్టి పోటీని చ్చింది. దబంగ్ ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 9 రైడ్ పాయింట్లతో చెలరేగగా... ట్యాకిల్‌లో రవీందర్ (3 పాయింట్లు) రాణించాడు. గుజరాత్ తరఫున సచిన్ 7 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... సునీల్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా, తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ జట్లు తలపడతాయి. -
తొడగొట్టే టైమొచ్చింది
కబడ్డీ కూతకు మళ్లీ రంగం సిద్ధమైంది. అమిత వేగంగా అభిమానులకు చేరువైన ప్రొ కబడ్డీ లీగ్ ఆరోసారి ఆకట్టుకునేందుకు ముందుకు వచ్చింది. ఐదు సీజన్లలో అద్భుతంగా చెలరేగిన ఆటగాళ్లు ఉండి కూడా ఇటీవల ఆసియా క్రీడల్లో భారత జట్టు పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో లీగ్‌లో మళ్లీ తొడగొట్టి ఫ్యాన్స్ మనసులు గెలుచుకోవాలని ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. గత ఏడాదిలాగే దాదాపు మూడు నెలల సుదీర్ఘ సమయం పాటు టోర్నీ సాగనుంది. చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్ నేటి నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. తొలి రోజు జరిగే మ్యాచ్‌లలో తమిళ్ తలైవాస్‌తో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్... పుణేరీ పల్టన్‌తో యు ముంబా తలపడతాయి. మొత్తం 12 జట్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి. మంగళవారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య తమిళ్ తలైవాస్‌ను తెలుగు టైటాన్స్ ఎదుర్కొంటుంది. కొచ్చిలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరగనుండగా... జనవరి 5న ముంబైలో ఫైనల్ నిర్వహిస్తారు. ఐదు సీజన్లలో గత మూడు సార్లు వరుసగా పట్నా పైరేట్స్ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగే ప్రారంభ కార్యక్రమంలో శ్రుతి హాసన్ షో ప్రధాన ఆకర్షణ కానుండగా...మరో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఇందులో పాల్గొంటాడు. డిసెంబర్ 7 నుంచి వైజాగ్‌లో! ఆరో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌ను మొత్తం 13 వేదికల్లో నిర్వహిస్తారు. 12 టీమ్‌ల సొంత వేదికలతో పాటు టీమ్ లేకపోయినా కేరళలో కబడ్డీని ప్రమోట్ చేసేందుకు కొచ్చిలో మ్యాచ్‌లు జరుపుతున్నారు. తెలుగు టైటాన్స్ కేంద్రం హైదరాబాద్ అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 7 నుంచి 13 వరకు జరగాల్సిన మ్యాచ్‌లను వైజాగ్‌కు తరలించినట్లు సమాచారం. లీగ్ వేలంలో భారీ మొత్తాలు పలికిన ఆటగాళ్లపై ఈ సారి అందరి దృష్టి నెలకొంది. హరియాణా స్టీలర్స్ తరఫున బరిలోకి దిగుతున్న మోనూ గోయత్ అత్యధికంగా రూ.1.51 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కోటి దాటిన ఇతర ఆటగాళ్లలో రాహుల్ చౌదరి (1.29), దీపక్ హుడా (1.15) కూడా ఉన్నారు. -
వరుసగా ఎనిమిదో స్వర్ణం సాధిస్తాం: రాహుల్ చౌదరీ
సనత్‌నగర్: వరుసగా ఏడుసార్లు విజేత... ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు ఘనత. ఇదే ఆనవాయితీని కొనసాగించేందుకు అజయ్ ఠాకూర్ సేన సిద్ధమైంది. ఆగస్టులో ఇండోనేసియా వేదికగా జరుగనున్న ఈ క్రీడల్లో ఎనిమిదో స్వర్ణాన్ని సాధించడమే తమ లక్ష్యమంటున్నాడు భారత స్టార్ రైడర్ రాహుల్ చౌదరి. మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఫర్ గోల్డ్’ పేరిట జరుగుతోన్న ప్రచార కార్యక్రమంలో రాహుల్ చౌదరి పాల్గొన్నాడు. బేగంపేట్‌లోని గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో పాఠశాల విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. చిన్నారులతో కబడ్డీ ఆడుతూ వారిని ప్రోత్సహించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయకరణ్, ప్రిన్సిపల్ మాయ సుకుమారన్, ఫిజికల్ ట్రైనర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో రాహుల్ చౌదరీ విద్యార్థుల ప్రశ్న: 1990లో తొలి స్వర్ణం సాధించి నప్పటికీ, ఇప్పటికీ జట్టులో తేడా ఏమైనా ఉందా? రాహుల్: మొదటిసారి పోటీలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఉంటారో? వారి బలాలు, బలహీనతలు ఏంటి? అనే అంశాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాం. కానీ అప్పుడు ఇప్పుడూ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రోజూ ప్రాక్టీస్‌కు ఎంత సమయం కేటాయిస్తారు? ఉదయం 45 నిమిషాల వ్యాయామం, వాకింగ్‌తో సరిపెడితే కుదరదు. కోచ్ పర్యవేక్షణలో 6 గంటలు, స్వతహాగా టీమ్ సభ్యులందరం కలిసి మరో 6 గంటలు... మొత్తం 12 గంటలు ప్రాక్టీస్‌కే అంకితమవుతాం. ఫిట్నెస్ కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు? పిజ్జాలు, బర్గర్లకు చాలా దూరంగా ఉంటాం. సహజమైన పోషకాలు లభించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాం. డ్రైప్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకుంటాం. వరుసగా ఎనిమిదోసారి బంగారు పతకం సాధిస్తామని గట్టిగా ఎలా చెబుతున్నారు? ఏడేళ్లుగా వివిధ దేశాల జట్ల ఆటతీరును నిశితంగా పరిశీలించాం. వారి బలాలు, బలహీనతలు స్పష్టంగా అవగతమయ్యాయి. వీటితో పాటు యావత్ భారత జాతి కూడా మాకు మద్దతుగా ఉంది. కచ్చితంగా స్వర్ణం సాధిస్తామనే విశ్వాసం బలంగా ఉంది. -
కబడ్డీ కూత... కోటిన్నర మోత...
కబడ్డీ కూత కోటి కాదు రూ.కోటిన్నరను దాటేసింది. ఆల్‌రౌండర్లు, ‘ఎ’ కేటగిరీ ప్లేయర్లు ఆటకు ముందు వేలం పాటలో సూపర్ హిట్టయ్యారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో రూ. కోటి మార్కు దాటిన తొలి భారత ఆటగాడిగా దీపక్ నివాస్ హుడా గుర్తింపు పొందగా... ఆ వెంటనే కోటిన్నర దాటిన ఆటగాడిగా మోనూ గోయట్ కొత్త చరిత్ర సృష్టించాడు. ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి : తెరపైకి ఎన్ని లీగ్‌లు వచ్చినా ఒక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పైనే ఎక్కువ చర్చ జరిగేది. ఇకపై ఐపీఎల్ గురించే కాదు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) గురించి కూడా చర్చించుకునే రోజులొచ్చేశాయి. ప్రేక్షకుల ఆదరణలో ఐపీఎల్ అంత కాకపోయినా ఆ తర్వాత స్థానంలో ఉన్న కబడ్డీ లీగ్‌లోనూ ఆటగాళ్లు రూ. కోట్లు కొల్లగొట్టారు. మోనూ గోయట్ రికార్డు స్థాయిలో రూ.1.51 కోట్లు పలికాడు. అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు హరియాణా స్టీలర్స్ అతన్ని చేజిక్కించుకుంది. వేలం మొదటి రోజు ఇరాన్ ఆటగాడు ఫజల్ అట్రాచలి ముందుగా ‘కోటి’ క్లబ్లో చేరాడు. ఆ తర్వాత ఐదుగురు భారత ఆటగాళ్లు కోటిని దాటేశారు. తొలిరోజు వేలంలో భారత ఆటగాళ్లు దీపక్ నివాస్ హుడా, నితిన్ తోమర్‌లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి. తొలి రోజు రెండు సెషన్ల పాటు వేలం జరిగింది. తొలి సెషన్లో ఇరాన్ డిఫెండర్ ఫజల్ రూ. కోటి క్లబ్లో చేరాడు. ఇక రెండో సెషన్లో భారత ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంచైజీలన్నీ వేలంపాటలో ఉత్సాహం కనబరిచాయి. ఆశ్చర్యకరంగా స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని వదిలేసుకున్న తెలుగు టైటాన్స్ అతన్ని ఫైనల్ బిడ్ మ్యాచ్ (ఎఫ్‌బీఎమ్)తో రూ. కోటి 29 లక్షలకు చేజిక్కించుకుంది. ఎఫ్‌బీఎమ్ అంటే ఫ్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్లను వేలంలో వేరే ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే గత ఫ్రాంచైజీలు ఎఫ్‌బీఎమ్ కార్డ్‌తో దక్కించుకోవచ్చు. నితిన్, దీపక్ హుడా రూ. కోటి 15 లక్షలు పలికారు. నితిన్‌ను పుణేరి, దీపక్‌ను జైపూర్ దక్కించుకున్నాయి. -
గెలుపు ముంగిట టైటాన్స్ బోల్తా
జైపూర్: రైడింగ్‌లో అదరగొట్టిన హరియాణా స్టీలర్స్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైడర్ వజీర్ సింగ్ (14 పాయింట్లు) కీలక పాయింట్లు సాధించడంతో హరియాణా 32–30తో టైటాన్స్‌పై గెలుపొందింది. స్కోరు 30–30తో సమమైన దశలో వజీర్ సింగ్ 2 రైడ్ పాయింట్లు తెచ్చి హరియాణాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 25 రైడింగ్ పాయింట్లు సాధించిన హరియాణా ట్యాకిల్‌లో కేవలం ఒక పాయింట్ మాత్రమే చేయగలిగింది. మరోవైపు రాహుల్ చౌదరి (11 పాయింట్లు) రాణించడంతో తెలుగు టైటాన్స్ 22 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేసింది. ట్యాకిల్‌లోనూ 5 పాయింట్లతో రాణించింది. ఇరుజట్లు చెరో 2 సార్లు ఆలౌటయ్యాయి. అయితే చివర్లో ఒత్తిడికి చిత్తయిన టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–32తో యు ముంబాపై విజయం సాధించింది. జైపూర్ జట్టులో జస్వీర్ సింగ్ (9 పాయింట్లు) ఆకట్టుకోగా, యు ముంబా జట్టులో కశ్‌లింగ్ అడాకే (6 పాయింట్లు) మెరుగ్గా ఆడాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ జయభేరి
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్–5లో తొలిసారి తెలుగు టైటాన్స్ చెలరేగింది. ప్రత్యర్థి జట్టుకు అందనంత వేగంగా పాయింట్లు కొల్లగొట్టింది. దీంతో ఇంటర్ జోన్ చాలెంజ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 44–22 స్కోరులో దబంగ్ ఢిల్లీపై భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు రైడింగ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లను వణికించింది. వరుసగా పాయింట్లు సాధించి ఢిల్లీపై ఒత్తిడి పెంచింది. ఆ జట్టును ఏకంగా మూడు సార్లు ఆలౌట్ చేసింది. రైడర్ రాహుల్ చౌదరి (16) కదంతొక్కాడు. 21 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 15 పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్‌లో మరో పాయింట్ చేశాడు. మిగతావారిలో మోసిన్ (7), నీలేశ్ సాలుంకే (5) రాణించగా... డిఫెండర్ విజయ్ భరద్వాజ్ 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ తరఫున అబొల్ఫజల్ 7 పాయింట్లు చేయగా, రోహిత్ బలియాన్, సత్పాల్, స్వప్నిల్ షిండే తలా 4 పాయింట్లు సాధించారు. ఈ సీజన్లో 19 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరో విజయం కాగా... దబంగ్ ఢిల్లీకి 13వ పరాజయం. యు ముంబా గెలుపు... అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కశిలింగ్ అడకె (17 పాయింట్లు) అద్భుతమైన ప్రదర్శనతో యు ముంబా 42–30 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ఆట మొదలైన తొలి నిమిషంలోనే అనూప్ కుమార్, కశిలింగ్ చెరో పాయింట్ చేసి యు ముంబాకు 2–0తో శుభారంభమిచ్చారు. ఇదే జోరుతో తొలి అర్ధభాగంలో కశిలింగ్ ఏకంగా 15 పాయింట్లు సాధించిపెట్టాడు. దీంతో యు ముంబా 23–13తో ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధంలో అనూప్ కుమార్ (5), డిఫెండర్ సురీందర్ సింగ్ (6)లు రాణించడంతో ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన ముంబా జట్టు బెంగళూరును సులువుగానే ఓడించింది. బెంగళూరు బుల్స్ తరఫున రోహిత్ కుమార్ రైడింగ్‌లో 12 పాయింట్లు చేయగా, హరీశ్ నాయక్, గుర్విందర్ సింగ్, సునీల్ జైపాల్ తలా 3 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పుణేరి పల్టన్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిన టైటాన్స్ శుక్రవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత చెత్తగా ఆడింది. దీంతో 30–46 తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో జట్టుకిది 11వ ఓటమి కావడం గమనార్హం. ప్రథమార్ధం ఆరంభంలో బాగానే ఆడినా ఆ తర్వాత ఆట గతి తప్పింది. దీంతో 16–23తో వెనకబడింది. ఆ తర్వాత కూడా పట్నా ఆటగాళ్లు సులువుగా కట్టడి చేయడంతో టైటాన్స్ ఓటమి ఖాయమైంది. ప్రదీప్ నర్వాల్ 14 రైడింగ్ పాయింట్లు సాధించగా టైటాన్స్ నుంచి రాహుల్ చౌధరి 7 పాయింట్లు మాత్రమే సాధించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 39–28 తేడాతో యు ముంబాపై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
సాక్షి, కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–42 తేడాతో ఓడింది. ప్రారంభం నుంచే టైటాన్స్ వెనకబడిపోయి ఏ దశలోనూ ప్రత్యర్థిని అధిగమించలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాల వరకు టైటాన్స్ జట్టు ఖాతా తెరవకపోవడం గమనార్హం. అప్పటికి పుణేరి పల్టన్ 18 పాయింట్లతో ముందంజలో ఉంది. దీంతో ప్రథమార్ధం ముగిసేసరికి పుణేరి జట్టు 26–12తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ జట్టు ఓ మాదిరి పోరాటం కనబర్చడంతో ఓటమి వ్యత్యాసాన్ని కాస్త తగ్గించుకోగలిగింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 9 రైడింగ్ పాయింట్లు సాధించగా... పుణేరి నుంచి దీపక్ హుడా కూడా 9 పాయింట్లతో నిలిచాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 31–31తో టైగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్; గుజరాత్ సూపర్ జెయింట్స్‌తో యూపీ యోధ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ గెలిచింది...
ప్రొ కబడ్డీ లీగ్ ముంబై: కొంత విరామం తర్వాత తెలుగు టైటాన్స్ మళ్లీ గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 33–28 స్కోరుతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. డిఫెండర్ సోమ్‌బీర్ (10) టాకిల్‌లో అద్భుతంగా రాణించాడు. రైడింగ్‌లో విఫలమైనప్పటికీ... మ్యాచ్‌లో గెలిచిందంటే అది సోమ్‌బీర్ ప్రదర్శన వల్లే! అతని ఉడుం‘పట్టు’కు ప్రత్యర్థి రైడర్లు సులభంగా చేతికి చిక్కారు. అతను టాకిల్‌కు ప్రయత్నించిన పది సార్లు కూడా సఫలం కావడం విశేషం. రైడింగ్‌లో నీలేశ్ సాలుంకే 5, రాహుల్ చౌదరి 3 పాయింట్లు సాధించారు. మిగతావారిలో ఫర్హాద్ మిలగర్దన్ (4), మోసిన్ (3) రాణించారు. తమిళ జట్టు తరఫున అజయ్ ఠాకూర్ (8) ఆకట్టుకున్నాడు. ప్రపంజన్ 5, దర్శన్ 4, అమిత్ హుడా, ప్రదీప్ చెరో 2 పాయింట్లు చేశారు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది మూడో విజయం. గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 36–32 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్‌తో తలపడనుంది. -
మళ్లీ ఓడిన టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్ లక్నో: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 23–25 స్కోరుతో యూపీ యోధ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టుకిది ఎనిమిదో ఓటమి. గత మ్యాచ్‌లో యు ముంబాపై అద్భుత విజయాన్ని సాధించిన టైటాన్స్ ఈ మ్యాచ్‌లోనూ పోరాడింది. అయితే ప్రత్యర్థి రైడర్ల జోరు ముందు తలవంచింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరి విఫలమయ్యాడు. 23 సార్లు రైడింగ్‌కు వెళ్లిన రాహుల్ కేవలం 4 పాయింట్లే చేశాడు. ఓవరాల్‌గా అతను 6 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో ఫర్హాద్ మిలగర్దన్ 4, సోంబిర్ 3 పాయింట్లు చేశారు. యోధ తరఫున నితిన్ తోమర్ (6), నితీశ్ కుమార్ (5) కీలక పాయింట్లు సాధించారు. సురేందర్ సింగ్, జీవ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్ పింక్‌పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్‌కు ఏడో ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. బుధవారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19–29తో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో తెలుగు జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. ఆరంభంలో తమిళ్ తలైవాస్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచిన రాహుల్ చౌదరి సేన ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేకపోయింది. గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పేలవంగా ఆడింది. తొలి అర్ధభాగం ముగిసే సరికే 8–20తో పరాజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న టైటాన్స్ రెండో అర్ధభాగంలోనూ చెప్పుకోదగ్గ ఆటతీరును కనబరచడంలో విఫలమైంది. రైడింగ్, టాకిల్‌లో గుజరాత్ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగింది. తెలుగు జట్టు తరఫున రాహుల్, వికాస్ చెరో మూడు పాయింట్లు చేయగా, రాకేశ్ కుమార్, విశాల్ భరద్వాజ్ చెరో 2 పాయింట్లు సాధించారు. గుజరాత్ ఆటగాళ్లలో సచిన్ (11) అద్భుతంగా రాణించాడు. సుకేశ్ హెగ్డే 7, అబోజర్ మిగని 4 పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన హర్యానా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 25–25తో టై అయ్యింది. నేడు జరిగే పోటీల్లో దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
తెలుగు టైటాన్స్ ఆరో‘సారీ’
► యూపీ యోధ చేతిలో ఓటమి ► ప్రొ కబడ్డీ లీగ్ అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 32–39 పాయింట్ల తేడాతో యూపీ యోధ చేతిలో పరాజయం చవిచూసింది. లీగ్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కిది ఆరో ఓటమి. టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి (12 పాయింట్లు) అద్భుతంగా రాణించినప్పటికీ సహచరుల తోడ్పాటు లేక జట్టు కంగుతింది. ఆరంభంలో స్వల్ప ఆధిక్యంలో నిలిచినా... మ్యాచ్ జరిగే కొద్దీ తేలిపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి టైటాన్స్ 13–14తో వెనుకబడింది. ఇక ద్వితీయార్ధంలో నితిన్ తోమర్ (10 పాయింట్లు) యూపీ జట్టుకు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిపెట్టాడు. రిషాంక్ 6 పాయింట్లు చేశాడు. టాకిల్‌లో రాజేశ్ నర్వాల్ (4) ఆకట్టుకున్నాడు. టైటాన్స్ తరఫున డిఫెండర్ విశాల్ భరద్వాజ్ టాకిల్‌లో 4 పాయింట్లు చేశాడు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 29–25తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. గుజరాత్ జట్టులో సచిన్ 8, సునీల్ కుమార్ 3 పాయింట్లు చేశారు. ఢిల్లీ జట్టులో మెరాజ్ షేక్ 8, రవి దలాల్ 2 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
బెంగళూరుతో టైటాన్స్ మ్యాచ్ టై
నాగ్‌పూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య మంగళవారం ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 21–21తో టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆటగాళ్లు తుదికంటా పోరాడిన తీరు ఆకట్టుకుంది. తొలి అర్ధభాగంలో బెంగళూరు 9–8తో పాయింట్ తేడాతో ఆధిక్యంలో నిలువగా... రెండో అర్ధభాగంలో మ్యాచ్ జరిగేకొద్దీ పుంజుకుంది. ప్రత్యర్థులకు దీటుగా కదిలిన టైటాన్స్ ఆటగాళ్లు చివరి క్షణాల్లో ఒక్కసారిగా రైడింగ్‌లో 5 (3, 2) పాయింట్లు తెచ్చారు. దీంతో స్కోరు 20–20 వద్ద సమమైంది. ఆ తర్వాత ఇరు జట్లు ఆఖరి రైడ్‌కు వెళ్లి ఒక్కోపాయింట్ తెచ్చాయి. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి రాణించాడు. 29 సార్లు రైడింగ్‌కు వెళ్లి 8 పాయింట్లు సాధించాడు. నీలేశ్ సాలుంకే 4, రాకేశ్, విశాల్ భరద్వాజ్ చెరో 2 పాయింట్లు, టాకిల్‌లో రాకేశ్ కుమార్ 2 పాయింట్లు చేశారు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ 5, ఆశిష్ 3 పాయింట్లు చేయగా... మహేందర్, ప్రీతమ్ చిల్లర్, రవీందర్ పాహల్ తలా రెండు పాయింట్లు సాధిం చారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32–20తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్... బెంగాల్ వారియర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ‘స్టార్ స్పోర్ట్స్–2’లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. -
వరుసగా ఐదో ఓటమి
పట్నా పైరేట్స్ చేతిలో టైటాన్స్ చిత్తు ప్రొ కబడ్డీ లీగ్ హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో సొంత వేదికపై జరిగిన చివరి మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్ ఆటతీరు మారలేదు. గురువారం డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36–43 తేడాతో టైటాన్స్ ఘోరంగా ఓడింది. ఇది ఈ జట్టుకు వరుసగా ఐదో పరాజయం కావడం గమనార్హం. ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ మినహా అన్నింట్లోనూ ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రాహుల్ చౌదరి 10 రైడ్ పాయింట్లు సాధించగా, పట్నా నుంచి పర్దీప్ నర్వాల్ 12 పాయింట్లతో చెలరేగాడు. నేటి (శుక్రవారం) నుంచి 10 వరకు నాగ్‌పూర్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్ 24–30 స్కోరుతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో తెలుగు జట్టుకిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టైటాన్స్ జట్టులో వికాస్ (9 పాయింట్లు) రాణించగా, రాహుల్ చౌదరి, నీలేష్ సాలుంకే తలో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున మణిందర్ సింగ్ (11) రెచ్చిపోయాడు. జంగ్ కున్ లీ 8 పాయింట్లు సాధించాడు. బెంగాల్ డిఫెండర్లు టైటాన్స్ రైడర్లను అద్భుతంగా కట్టడి చేశారు. మణిందర్ ప్రదర్శనతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 19–14తో బెంగాల్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి రైడింగ్‌లో నిరాశపరిచాడు. హర్యానా, గుజరాత్ మ్యాచ్ టై అంతకుముందు హర్యానా స్టీలర్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ 27–27తో టైగా ముగిసింది. మ్యాచ్ ముగిసే దశలో హర్యానా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలో 13 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ తరఫున సుర్జీత్ సింగ్, వికాస్ ఆరేసి పాయింట్లు చేయగా, గుజరాత్ జట్టులో మహేంద్ర కుమార్ 5 పాయింట్లు సాధించాడు. హైదరాబాద్ అంచె పోటీల్లో భాగంగా గురువారం జరిగే చివరి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
టైటాన్స్‌కు మళ్లీ నిరాశ
సొంతగడ్డపై వరుసగా మూడో ఓటమి హైదరాబాద్: తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో మళ్లీ నిరాశపరిచింది. సొంత ప్రేక్షకుల మధ్య వరుసగా మూడోసారీ ఓడింది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సేన 18–31 స్కోరు తేడాతో కొత్త జట్టు యూపీ యోధ చేతిలో కంగుతింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. దీంతో 11–12తో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో వెనుకబడింది. కానీ ద్వితీయార్ధంలో పేలవమైన ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ జరిగే కొద్దీ ప్రత్యర్థి జోరు పెరిగింది. టైటాన్స్ మాత్రం చేష్టలుడిగింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి 7 పాయింట్లతో రాణించగా, వికాస్, విశాల్ చెరో 3, రాకేశ్ 2 పాయింట్లు చేశారు. యూపీ ఆటగాళ్లు సమష్టిగా కదంతొక్కారు. నితిన్ తోమర్ (6) సహా... రిషాంక్ దెవాడిగా, నితీశ్ కుమార్ చెరో 5 పాయింట్లు సాధించారు. మహేశ్ గౌడ్ (4), సురీందర్ సింగ్ (3), రాజేశ్ నర్వాల్ (2), జీవ కుమార్ (2) రాణించారు. మరో మ్యాచ్‌లో కొత్త జట్టు గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ 26–20తో దబాంగ్ ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్ (రాత్రి గం. 8.00 నుంచి); బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి గం. 9.00 నుంచి) తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
టైటాన్స్ ఫ్లాప్ షో...
►వరుసగా రెండో పరాజయం ►అంతగా ఆకట్టుకోని రాహుల్ చౌదరి ►రోహిత్ కుమార్ సూపర్ రైడింగ్ ►బెంగళూరు బుల్స్ గెలుపు ► ప్రొ కబడ్డీ లీగ్ హైదరాబాద్ : తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 21–31 స్కోరుతో బెంగళూరు బుల్స్ ధాటికి పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. టాకిల్‌లో పట్టుకోల్పోయారు. రైడింగ్‌లో తేలిపోయారు. కెప్టెన్ రాహుల్ చౌదరి, రాకేశ్ కుమార్ చెరో నాలుగు పాయింట్లు సాధించగా, వికాస్, నీలేశ్ మూడేసి పాయింట్లు చేశారు. ప్రత్యర్థి జట్టులో మాత్రం రోహిత్ కుమార్ (12 పాయింట్లు) అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి పాయింట్లు తెచ్చిపెట్ట డంలో సఫలమయ్యాడు. అజయ్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. టాకిల్‌లో మహేందర్ సింగ్ తెలుగు టైటాన్స్ ఆటగాళ్లను సమర్థంగా కట్టడి చేశాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండ్ షోకు ఏ దశలోనూ టైటాన్స్ ఎదురు నిలువలేకపోయింది. ఏకంగా రెండుసార్లు ఆలౌటైంది. తొలి అర్ధభాగాన్ని 15–10తో ముగించిన బెంగళూరు బుల్స్ ఆ తర్వాత రెండో అర్ధభాగంలోనూ ఇదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా టాకిల్‌లో బెంగళూరు ఆటగాళ్ల సమన్వయం టైటాన్స్ రైడర్లను పదే పదే బోల్తా కొట్టించింది. మ్యాచ్ రెండు అర్ధభాగాల్లోనూ తెలుగు జట్టు ఏ దశలోనూ ఆధిక్యం వైపు చూడలేదు. బెంగళూరు రైడర్లలో రోహిత్‌తో పాటు అజయ్ కుమార్ రాణించాడు. రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ చెరో 3 పాయింట్లు చేశారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు రైడింగ్‌లో 17, టాకిల్‌లో 9 పాయింట్లు సాధించగా, హైదరాబాద్ రైడింగ్‌లో 15, టాకిల్‌లో కేవలం రెండే పాయిం ట్లు సాధించింది. మ్యాచ్ ఆసాంతం రైడింగ్‌లో అదరగొట్టిన రోహిత్ కుమార్‌కు ‘పర్ఫెక్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అజయ్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ జట్టుకిది వరుసగా రెండో పరాజయం కాగా... ఆడిన తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు గెలుపుతో టోర్నీలో శుభారంభం చేసింది. గట్టెక్కిన యు ముంబా... లీగ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా రెండో మ్యాచ్‌తో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో యు ముంబా జట్టు 29–28 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌పై గెలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబా జట్టు పాయింట్ తేడాతో గట్టెక్కింది. ఈ జట్టులో కశిలింగ్ (7 పాయింట్లు), అనూప్ కుమార్ (6) రాణించారు. సురీందర్ సింగ్ 4, సురేశ్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. హర్యానా తరఫున వజీర్ సింగ్ (6), వికాస్ (6) ఆకట్టుకున్నారు. సుర్జీత్ సింగ్ 4, రాకేశ్ సింగ్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి హర్యానా 15–11తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధం ప్రారంభంలోనూ హర్యానా ఆటగాళ్ల జోరే కొనసాగింది. దీంతో ఈ జట్టు ఒక దశలో 19–12తో స్పష్టమైన ఆధిక్యంలో నిలి చింది. అయితే ముంబా వరుస రైడింగ్‌లతో, టాకిల్ పాయిం ట్లతో టచ్‌లోకి వచ్చింది. దీంతో క్షణాల వ్యవధిలో ఒక్కసారిగా ఆధిక్యం తారుమారైంది. 22–20తో ముంబా ఆధిపత్యం మొదలైంది. అక్కడి నుంచి జాగ్రత్తగా ఆడిన ముంబా ఆటగాళ్లు ఆధిక్యాన్ని తుదికంటా కాపాడుకొని విజయం సాధించారు. ►హైదరాబాద్ అంచె పోటీలకు నేడు (సోమవారం) విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ, యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
పట్నా చేతిలో టైటాన్స్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం తమిళ్ తలైవాస్‌పై నెగ్గిన తెలుగు టైటాన్స్ అదే జోరును రెండో మ్యాచ్‌లో పునరావృతం చేయలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–35తో ఓడిపోయింది. పైరేట్స్ సారథి పర్దీప్ నర్వాల్ (15 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. సొంత ప్రేక్షకుల మద్దతుతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ ... ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. రాహుల్ చౌదరీ 7 పాయింట్లు సాధించగా, నీలేశ్ 6, వికాస్, విశాల్ చెరో ఐదు పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు 30–26తో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై గెలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
‘తెలుగు’ వెలిగింది
►టైటాన్స్ జట్టు శుభారంభం ►తొలి మ్యాచ్‌లో తలైవాస్‌పై ఘన విజయం ►ఘనంగా ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ తొలి రోజు తెలుగు టైటాన్స్ కూత బలంగా వినిపించింది. సొంత గడ్డపై అట్టహాసంగా ఆరంభమైన ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్, నీలేశ్ దూకుడైన ఆట టైటాన్స్‌ను గెలిపించింది. మరోవైపు సచిన్, చిరంజీవిలాంటి హేమాహేమీలు యజమానులుగా తొలిసారి లీగ్‌లోకి అడుగు పెట్టిన తమిళ్ తలైవాస్ నిరాశాజనకంగా లీగ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ జట్టుకు ఘనమైన ఆరంభం లభించింది. ఐదో సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో టైటాన్స్ 32–27 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. మూడు సార్లు డూ ఆర్ డై రైడింగ్‌లలో పాయింట్లు రాబట్టిన నీలేశ్ సాలుంకే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రాహుల్ సూపర్ 10... ఇరు జట్లు తొలి రైడ్లలో రక్షణాత్మక ధోరణి కనబర్చగా... ప్రపంజన్ పాయింట్‌తో తమిళ్ ముందుగా ఖాతా తెరిచింది. ఆ తర్వాత రాహుల్ ప్రదర్శనతో టైటాన్స్ 4–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తలైవాస్ పోరాడటంతో స్కోరు 8–8తో సమమైంది. ఈ దశలో నీలేశ్ రెండు పాయింట్లతో మళ్లీ ఆధిక్యంలో నిలపగా... తర్వాతి నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి తెలుగు టీమ్ 14–8తో దూసుకుపోయింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 18–11తో ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో కోలుకున్న తలైవాస్ ఆఖర్లో గట్టి పోటీనిచ్చింది. 37వ నిమిషంలో టైటాన్స్ 32–21తో గెలుపునకు చేరువైంది. ఈ దశలో తలైవాస్ వరుసగా ఆరు పాయింట్లు రాబట్టడం విశేషం. అయితే చివరకు టైటాన్స్‌దే పైచేయి అయింది. తెలుగు ఆటగాళ్లలో రాహుల్ 10 పాయింట్లు సాధించగా, నీలేశ్ 7 పాయింట్లు, విశాల్ 5 పాయింట్లు స్కోర్ చేశారు. కబడ్డీ లీగ్‌లో ఓవరాల్‌గా రాహుల్‌కు ఇది 25వ సూపర్–10 స్కోర్ కావడం విశేషం. తలైవాస్ జట్టు తరఫున ప్రపంజన్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, అజయ్ ఠాకూర్ 6 పాయింట్లు సాధించాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన చేశాడు. రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 33–21తో యు ముంబాను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
ఈసారి గెలుస్తాం: తెలుగు టైటాన్స్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను గెలుస్తామని తెలుగు టైటాన్స్ జట్టు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో టైటాన్స్ యాజమాన్యం జట్టు సభ్యులను పరిచయం చేసింది. ఈ సందర్భంగా టైటాన్స్ జట్టు యజమాని గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ టైటిలే లక్ష్యంగా ఈసారి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. తమ జట్టు సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సీజన్లో కూడా రాహుల్ చౌదరి కెప్టెన్ కొనసాగనున్నాడు. ఈనెల 28నుంచి ఆగస్టు 3వరకు హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, సచిన్ యజమానిగా వ్యవహరిస్తోన్న తమిళ్ తలైవాస్ జట్టుతో తలపడుతుంది. ఈసారి సీజన్లో 4 కొత్త ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం 12 ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఇందులో 9 దేశాలకు చెందిన 27 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
తొలి మ్యాచ్ సచిన్ జట్టుతో
తమిళ్ తలైవాస్‌తో తలపడనున్న తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ షెడ్యూల్ విడుదల ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. జూలై 28న ప్రారంభమయ్యే ఈ టోర్నీ మొత్తం 12 నగరాలలో జరుగుతుంది. హైదరాబాద్ వేదికగా రాహుల్ చౌదరీ సారథ్యంలోని తెలుగు టైటాన్స్ జట్టు (హైదరాబాద్ ఫ్రాంచైజీ), సచిన్ యజమానిగా ఉన్న తమిళ్ తలైవాస్ (చెన్నై ఫ్రాంచైజీ) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. ఈ సీజన్లో పాల్గొనే మొత్తం 12 జట్లను రెండు జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్లో ఉండే ఆరు జట్లు తమ జోన్ పరిధిలో 15 మ్యాచ్‌లు, అంతర్ జోన్ పరిధిలో 7 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌లో 3 క్వాలిఫయర్స్, 2 ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ముంబై, చెన్నై వేదికగా జరుగుతాయి. ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యమిస్తుంది. షెడ్యూల్ విడుదల సందర్భంగా వివో ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ... పీకేఎల్– 5 సీజన్‌ను అత్యంత ప్రభావవంతమైన టోర్నీగా నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు. సుదీర్ఘంగా జరిగే ఈ సీజన్ కబడ్డీ క్రీడాభిమానులకు ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. భారత్‌లో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తామని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సీఈఓ దేవ్‌రాజ్ చతుర్వేది పేర్కొన్నారు. -
తెలుగు టైటాన్స్‌తోనే రాహుల్
ముంబై: ఐపీఎల్ తర్వాత ఎంతో ప్రజాదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించనుంది. జూలైలో లీగ్ జరగనున్న నేపథ్యంలో మే 22, 23 తేదీల్లో ఢిల్లీలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. మొత్తం 350 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండగా... గత సీజన్లో తమ జట్ల తరఫున అసాధారణ ప్రతిభతో రాణించిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు తమతోనే కొనసాగించనున్నాయి. లీగ్‌లో అత్యంత సక్సెస్ఫుల్ రైడర్‌గా పేరొందిన రాహుల్ చౌదరీని తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకుంది. రాహుల్‌తో పాటు యు–ముంబా కెప్టెన్ అనూప్ కుమార్, దబంగ్ ఢిల్లీ ఆల్‌రౌండర్ మిరాజ్ షేక్, బెంగాల్ వారియర్స్ తరఫున జంగ్ కౌన్ లీ, బెంగళూరు బుల్స్ డిఫెండర్ ఆశిష్ కుమార్, పాట్నా పైరేట్స్‌కు అత్యంత విలువైన ఆటగాడు ప్రదీప్ నర్వాల్, పుణేరి పల్టన్ జట్టులో దీపక్ హుడా ఐదో సీజన్లోనూ ఆయా ఫ్రాంచైజీలకే ప్రాతినిధ్యం వహించనున్నారు. కేవలం జైపూర్ పింక్ పాంథర్స్ మాత్రం మిగతా ప్రాంచైజీలకు భిన్నంగా ఏ ఆటగాడినీ తమతో కొనసాగించడం లేదు. ఇదిలా ఉండగా గతేడాది పోలిస్తే ఈసారి అదనంగా 4 జట్లు లీగ్‌లో చేరనున్నాయి. తమిళనాడు, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా ఫ్రాంచైజీలకు చెందిన జట్లు ఈసారి అరంగేట్రం చేయనున్నాయి. -
తెలుగు టైటాన్స్‌కు షాక్
-
టైటాన్స్‌కు షాక్
వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేని తెలుగు టైటాన్స్ కీలక పోరులో చతికిలపడింది. సొంత గడ్డపై పూర్తి స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించినా మరోసారి సెమీఫైనల్లోనే చిత్తయ్యింది. ప్రథమార్ధంలో తెగువ చూపించినా ఆ తర్వాత పేలవ ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచింది. అటు పెద్దగా స్టార్ ఆటగాళ్లు లేకున్నా సమష్టి ఆటతీరుతో రాణించిన జైపూర్ పింక్ పాంథర్స్ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో పట్నా జట్టు పుణెరిపై గెలిచింది. * సెమీస్‌లో జైపూర్ చేతిలో ఓటమి * ప్రొ కబడ్డీ లీగ్ సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై తెలుగు టైటాన్స్‌కు షాక్ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టైటాన్స్ 24-34 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో మట్టికరిచింది. తొలి సీజన్లో విజేతగా నిలిచిన జైపూర్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. టైటాన్స్ నుంచి రాహుల్ చౌదరి 9, నీలేశ్ 6 రైడింగ్ పాయింట్లు సాధించగా జైపూర్ తరఫున కెప్టెన్ జస్వీర్ సింగ్ 7 రైడింగ్, 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జైపూర్ జట్టు పట్నా పైరేట్స్‌తో ఢీకొంటుంది. మూడో స్థానం కోసం జరిగే పోరులో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టన్‌తో ఆడుతుంది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు కొదమసింహాల్లా తలపడడంతో పాయింట్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. దీంతో 18వ నిమిషం వరకు కూడా స్కోరు 8-8తో సమానంగానే ఉంది. ఈ దశలో టైటాన్స్‌కు నీలేష్ ఓ పాయింట్ తేగా వెంటనే జైపూర్‌కు అజయ్ కుమార్ రెండు పాయింట్లు తేవడంతో 10-9తో పైచేయి సాధించింది. ఆ తర్వాత రాహుల్ విజయవంతమైన రైడ్‌తో జట్టు ప్రథమార్ధాన్ని 11-10స్వల్పఆధిక్యంతో ముగించింది. కానీ ద్వితీయార్ధంలో టైటాన్స్ ఆట పూర్తిగా గతి తప్పింది. దీంతో జైపూర్ రెచ్చిపోయింది. జస్వీర్ సింగ్ సూపర్ రైడింగ్‌తో అదరగొట్టాడు. దీంతో వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్‌ను ఆలౌట్ చేయడంతో జైపూర్ 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒక్క పాయిం ట్నూ కోల్పోకుండా టైటాన్స్‌ను మరోసారి ఆలౌట్ చేయడంతో స్కోరు 26-14కు పెరిగింది. 33వ నిమిషంలో రాహుల్ వరుసగా తన రెండు రైడింగ్‌లలో రెండేసి చొప్పున 4 పాయింట్లు సాధించాడు. 34వ నిమిషంలో జైపూర్ సూపర్ ట్యాకిల్‌లో రాహుల్‌ను అవుట్ చేసి రెండు పాయింట్లు రాబట్టింది. చివరి రెండు నిమిషాల్లో వ్యత్యాసం పది పాయింట్లు తేడా ఉండడంతో టైటాన్స్ చేసేదేమీ లేకుండా పోయింది. పట్నా వరుసగా రెండోసారి: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఈ జట్టు 37-33 తేడాతో పుణెరి పల్టన్‌పై నెగ్గింది. పట్నా నుంచి పర్దీప్ నర్వాల్ 8, రాజేశ్ 6 రైడింగ్ పాయింట్లతో రాణించగా కుల్దీప్ 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పుణెరిలో దీపక్ హుడా 9 పాయింట్లు సాధించాడు. తొలి పది నిమిషాలపాటు మ్యాచ్ 6-6 పాయింట్లతో పోటాపోటీగా సాగింది. ఈ దశలో పర్మోద్ నర్వాల్ మూడు పాయింట్లు తేవడంతో పుణెరి ఆధిక్యంలోకి వెళ్లినా మరో ఆరు నిమిషాల వరకు పట్నా హవా సాగింది. వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి 15-9తో పుంజుకుంది. ఇదే జోరుతో తొలి అర్ధభాగాన్ని 16-13తో ముగించింది. అయితే ద్వితీయార్ధంలో పుణెరి మెరుగ్గా ఆడింది. 32వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేయడంతో పుణెరి 25-22తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యం దాదాపు చివరి వరకు కాపాడుకున్నా ఆ తర్వాత మాత్రం చేజార్చుకుంది. 37వ నిమిషంలో రాజేశ్ మొండల్ రెండు పాయింట్లు తేవడంతో పట్నా మ్యాచ్‌ను 29-29తో సమం చేసింది. ఇక పర్దీప్ నర్వాల్ సూపర్ రైడ్‌తో దూసుకెళ్లిన పట్నా మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
తెలుగు టైటాన్స్ నాకౌట్ ‘కూత’
హైదరాబాద్: నగరంలో మరోసారి కబడ్డీ సందడి మొదలైంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు నేడు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. తెలుగు టైటాన్స్ నాకౌట్ బరిలో ఉండటంతో నగర అభిమానులు ఈ మ్యాచ్‌లపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. సీజన్ అసాంతం నిలకడగా రాణించిన పట్నా పైరేట్స్ శుక్రవారం జరిగే తొలి సెమీస్‌లో పుణెరి పల్టన్‌తో పోటీపడనుంది. రెండో సెమీస్‌లో తెలుగు టైటాన్స్... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అభిమానుల ఆగ్రహం గచ్చిబౌలి : సెమీఫైనల్ మ్యాచుల్ని ప్రత్యక్షంగా తిలకించాలనుకున్న హైదరాబాదీ అభిమానులకు నిర్వాహకుల నుంచి నిరాశ ఎదురైంది. పరిమిత సంఖ్యలో ఉన్న టికెట్లను ఇదివరకే ఆన్లైన్లో విక్రయించిన నిర్వాహకులు స్టేడియం ముందు ఏర్పాటు చేసిన కౌంటర్లో మొక్కుబడిగా కేవలం పదుల సంఖ్యలో అందుబాటులో ఉంచారు. దీంతో టికెట్ల కోసం గురువారం క్యూలైన్లో బారులు తిరిన అభిమానులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు టికెట్లు ఇవ్వాలని నిలదీశారు. కౌంటర్లో ఇస్తామన్న 175 టికెట్లలో కేవలం 80 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. -
టైటాన్స్ జోరు కొనసాగేనా?
సెమీస్‌లో నేడు జైపూర్‌తో అమీతుమీ ప్రొ కబడ్డీ లీగ్ హైదరాబాద్: వరుస విజయాలతో ఊపు మీదున్న తెలుగు టైటాన్స్ సొంత గడ్డపై నాకౌట్ సమరానికి సిద్ధమయింది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి జట్టులోనే ఉన్నా టైటాన్స్ ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలనే కసితో ఉన్న ఈ జట్టు నేటి (శుక్రవారం) రెండో సెమీఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తలపడనుంది. సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా చెరో విజయంతో సమానంగా ఉన్నాయి. 2015 సీజన్లో మాత్రమే సెమీస్‌కు చేరిన టైటాన్స్ అందులో ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరుపై ఓడింది. అనంతరం తాజాగా మరోసారి సెమీస్‌కు రాగా ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావీయకూడదనే ఆలోచనతో ఉంది. లీగ్ ఆరంభంలో టైటాన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. కానీ తర్వాత పుంజుకుని తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా 50 పాయింట్లతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే రాహుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ భీకర ఫామ్‌తో జట్టుకు పాయింట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఓవరాల్‌గా లీగ్ చరిత్రలో రాహుల్ అత్యధికంగా 455 రైడింగ్ పాయింట్లు సాధించి చరిత్ర సృష్టించాడు. తనపై జట్టు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగానే రాణించి టైటాన్స్‌ను తొలిసారి ఫైనల్‌కు చేర్చాలని భావిస్తున్నాడు. రైడింగ్‌లో సుకేశ్, అతుల్, నీలేశ్ కూడా కీలకం కానున్నారు. ఇక ఆల్‌రౌండర్ సందీప్ నర్వాల్ ప్రత్యర్థికి తన పట్టు పవర్ చూపిస్తే విజయం సులభమే. మరోవైపు మాజీ చాంపియన్ పింక్ పాంథర్స్‌ను తక్కువ అంచనా వేయలేం. టైటాన్స్లా కాకుండా ఈ జట్టు సమష్టి కృషితో రాణిస్తోంది. కెప్టెన్ జస్వీర్ సింగ్, అజయ్ కుమార్, షబీర్ రైడింగ్‌లో మెరుపులు మెరిపించేవారే. ఈ సీజన్లో కొన్ని రోజులు టాప్ పొజిషన్లో కొనసాగిన జైపూర్‌ను ఓడించాలంటే టైటాన్స్ పూర్తి స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉంది. పట్నాతో పుణెరి ఢీ శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు పుణెరి పల్టన్‌తో తలపడుతుంది. ఇప్పటిదాకా ప్రతీ సీజన్లో సెమీస్ వరకు చేరిన టేబుల్ టాపర్ పట్నాను ఓడించాలంటే మంజీత్ చిల్లర్ సారథ్యంలోని పుణెరి జట్టు చెమటోడ్చాల్సిందే. -
తెలుగు టైటాన్స్ జోరు కొనసాగేనా?
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-4లో అంచనాలు మించి రాణించిన జట్టు తెలుగు టైటాన్స్. వరుస విజయాలతో దుమ్మురేపిన టైటాన్స్ ఇప్పుడు టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలించింది. ఈ సీజన్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై టోర్నీలో వెనుకబడిన తెలుగు టైటాన్స్ .. ఆ తరువాత అధ్బుతమైన ఆట తీరుతో చెలరేగిపోయింది. ఈ టోర్నీలో ఎనిమిది విజయాలను కైవసం చేసుకున్న తెలుగు టైటాన్స్.. . రెండు మ్యాచ్‌లను టై చేసుకుని సెమీస్ బరిలో నిలిచింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ తో పాటు, పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టాన్లు సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి.. తొలి సెమీస్‌లో పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టాన్ తలపడుతుండగా, జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లూ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి గం.8.00ల.కు ఆరంభం కానున్నాయి. ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ సీజన్ లో టైటిల్ ను కైవసం చేసుకోలేని తెలుగు టైటాన్స్ ఈసారి ఆ లక్ష్యం దిశగా సాగుతోంది. ప్రొ కబడ్డీ-2 సీజన్ లో భాగంగా 2015లో ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ కు చేరిన టైటాన్స్.. గత సీజన్లో చివర్లో చతికిలబడి ఐదో స్థానానికే పరిమితమైంది. అయితే ఈ సీజన్ ఆరంభంలో టైటాన్స్ పై పెద్దగా అంచనాలు లేవు. కొంతమంది కీలక ఆటగాళ్లు వేరే జట్లుకు మారడంతో టైటాన్స్ సెమీస్ కు చేరడం కష్టంగానే కనిపించింది. కాగా, కెప్టెన్ రాహుల్ చౌదరి, సందీప్ నర్వాల్, సందీప్ ధుల్లు విశేషంగా రాణించడంతో టైటాన్స్ సులభంగానే సెమీస్ కు చేరుకుంది. ఓవరాల్ ప్రొ కబడ్డీలో 400కు పైగా రైడింగ్ పాయింట్లు సాధించి రికార్డు సృష్టించిన రాహుల్.. ఈ సీజన్లో 123 రైడింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అత్యుత్తమ రైడర్ గా కొనసాగుతున్నాడు. మరోసారి రాణించి తన జట్టును తొలిసారి ఫైనల్ కు చేర్చాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నాడు. మరోవైపు తొలి సీజన్ లో టైటిల్ సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్.. ఈ సీజన్ లో ఎనిమిది విజయాలతో సెమీస్ కు చేరింది. అయితే లీగ్ దశలో తలో మ్యాచ్‌లో గెలిచిన ఇరు జట్లు సెమీస్‌లో మరోసారి తమ సత్తా నిరూపించుకునేందుకు సన్నద్ధమయ్యాయి.. ప్రొ కబడ్డీ టైటిల్ ను రెండోసారి తన ఖాతాలో వేసుకోవాలని జైపూర్ భావిస్తుండగా, తొలిసారి టైటిల్ ను గెలిచి తీరాలని టైటాన్స్ పట్టుదలగా ఉంది. దీంతో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది. -
ఎదురులేని టైటాన్స్
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పట్నాపై విజయం ముంబై: వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా తెలుగు టైటాన్స్ తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట పట్నా పైరేట్స్‌పై 46-25 తేడాతో రాహుల్ బృందం ఘనవిజయాన్ని అందుకుంది. మూడు వరుస పరాజయాలతో లీగ్‌ను ఆరంభించిన టైటాన్స్ పాయింట్ల పట్టికలో 50 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో పట్నా, మూడో స్థానంలో జైపూర్ ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో జరిగే సెమీఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఇక పట్నాతో జరిగిన మ్యాచ్‌లోనూ రాహుల్ చౌధరి చెలరేగి 11 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకోగా సందీప్ నర్వాల్ ఆరు ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పట్నా నుంచి అబోల్ఫజల్ 9 పాయింట్లు సాధించాడు. పుణెరి సెమీస్ ఆశలు సజీవం మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 39-34 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీపై నెగ్గి తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీపక్ నివాస్ హుడా అత్యధికంగా 17 రైడింగ్ పాయింట్లతో అదరగొట్టి జట్టును గెలిపించాడు. నేడు (బుధవారం) ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో యు ముంబా ఓడిపోవడంతో పాటు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుపై నెగ్గితే పుణెరి జట్టు సెమీస్ చేరుతుంది. -
సెమీస్‌లో తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ సెమీఫైనల్స్‌కు చేరింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ తన స్టార్ ప్రదర్శనను కొనసాగించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 35-23 తేడాతో టైటాన్స్ నెగ్గింది. ఇప్పటికే జైపూర్‌తో పాటు పట్నా సెమీస్‌కు చేరాయి. రాహుల్ 11 రైడింగ్ పాయింట్లతో జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. నీలేష్ 5 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 41-20తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. -
టైటాన్స్‌కు మరో టై
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో టై ఎదురైంది. గురువారం యు ముంబాతో జరిగిన మ్యాచ్ 25-25తో ముగిసింది. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కు ఇది రెండో టై. కెప్టెన్ రాహుల్ చౌదరి 8 రైడింగ్, సందీప్ నర్వాల్ మూడు రైడింగ్, మూడు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబా ఆరంభం నుంచే ఆధిక్యం చూపింది. దీంతో ప్రథమార్ధం 15-7తో ముగించింది. అయితే రాహుల్ రైడింగ్ ద్వారా చకచకా పాయింట్లు సాధించిన టైటాన్స్ 31వ నిమిషంలో 18-17తో మ్యాచ్‌లో తొలిసారిగా ఆధిక్యం చూపింది. 39వ నిమిషం వరకు టైటాన్స్ ఆధిక్యంలో ఉన్నా... చివరకు టైతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 24-22 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీని ఓడించి తిరిగి పట్టికలో టాప్కు చేరింది. నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో పట్నా, యు ముంబాతో బెంగాల్ తలపడతాయి. -
రాహుల్ ఆల్‌రౌండ్ షో
ఢిల్లీపై తెలుగు టైటాన్స్ విజయం కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ తెలుగు టైటాన్స్ జట్టు చెలరేగుతోంది. కెప్టెన్ రాహుల్ చౌధరి ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో మంగళవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 36-28 తేడాతో నెగ్గింది. మూడు వరుస ఓటములతో టోర్నీ ఆరంభించిన టైటాన్స్ గత ఆరు మ్యాచ్‌ల్లో పరాజయమే లేకుండా పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాహుల్ కీలక సమయంలో విజృంభించి ఏకంగా 14 రైడింగ్ పాయింట్లతో పాటు ఓ సూపర్ టాకిల్ సహా 2 పాయింట్లు అందించాడు. ఢిల్లీ నుంచి మెరాజ్ షేక్ ఎనిమిది, సెల్వమణి ఐదు రైడింగ్ పాయింట్లు చేశారు. తొలి అర్ధభాగం 18 నిమిషాల వరకు మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. 8-8తో సమానంగా ఉన్న దశలో రాహుల్ చౌధరి సూపర్ రైడ్‌తో ఆలౌట్ చేసి జట్టును 12-8కి తీసుకెళ్లాడు. 26వ నిమిషంలో మూడు పాయింట్లు సాధించిన రైడ్‌లో తను గాయపడగా చికిత్స అనంతరం తలకు బ్యాండేజితో బరిలోకి దిగాడు. అటు చివర్లో మరింత దూకుడును ప్రదర్శించిన టైటాన్స్ సునాయాసంగా నెగ్గింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 27-25తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత బెంగళూరు గెలవడం విశేషం. ప్రొ కబడ్డీలో నేడు యు ముంబా X పుణెరి పల్టాన్ రాత్రి 8 గంటల నుంచి మహిళల లీగ్‌లో.. స్టార్మ్ క్వీన్స్ X ఫైర్ బర్డ్స్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం