
తెలుగు టైటాన్స్‌కు ఆరో ఓటమి (PC: PKL)
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆరో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టిన టైటాన్స్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఏడో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది.
టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అజిత్ పవార్ 5 పాయింట్లు, రజనీశ్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుర్జీత్ సింగ్ (7), భరత్ (6), వికాశ్ కండోలా (5), నీరజ్ నర్వాల్ (5) రాణించారు.
మరో మ్యాచ్‌లో యు ముంబా 39–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 8 పాయింట్లు, గుమన్ సింగ్ 6 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు స్కోరు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి.
Came like 𝙋𝙖𝙬𝙖𝙣, went with the Bulls 😉#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/azN98ZP8fU
— ProKabaddi (@ProKabaddi) December 24, 2023
SUPE𝐑𝐑𝐑 TACKLE ft. Ajit Pawar 💛#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/fHyLLmze8F
— ProKabaddi (@ProKabaddi) December 24, 2023
Comments
Please login to add a commentAdd a comment