తెలుగు టైటాన్స్‌ ‘హ్యాట్రిక్‌’ | Telugu Titans Beat U Mumba In Pro Kabaddi League, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League: తెలుగు టైటాన్స్‌ ‘హ్యాట్రిక్‌’

Sep 11 2025 4:12 AM | Updated on Sep 11 2025 12:22 PM

Telugu Titans beat U Mumba in Pro Kabaddi League

యు ముంబాపై విజయం 

వైజాగ్‌లో పీకేఎల్‌ మ్యాచ్‌లకు నేడు ముగింపు  

విశాఖ స్పోర్ట్స్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌–12లో తెలుగు టైటాన్స్‌ వరుసగా మూడో విజయంతో సత్తా చాటింది. హోం గ్రౌండ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌ తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా...ఇప్పుడు ‘హ్యాట్రిక్‌’ విజయంతో వైజాగ్‌ అంచెను ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్‌ 45–37 స్కోరుతో యు ముంబాను చిత్తు చేసింది. 

టైటాన్స్‌ తరఫున భరత్‌ హుడా 13 పాయింట్లతో చెలరేగగా... చేతన్‌ సాహు 6, కెపె్టన్‌ విజయ్‌ మలిక్‌ 5 పాయింట్లతో అతనికి సహకరించారు. చివరి 10 నిమిషాల్లో కాస్త పోరాడిన ముంబా ప్రత్యర్థిని ‘ఆలౌట్‌’ చేయగలిగినా పాయింట్ల అంతరం మాత్రమే తగ్గించ గలిగింది. ముంబా ఆటగాళ్లలో సందీప్, ఆమిర్‌ మొహమ్మద్‌ చెరో 7 పాయింట్లు సాధించారు.

మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌ 43–32 తేడాతో యూపీ యోధాస్‌పై గెలిచిది. నేడు జరిగే మ్యాచ్‌లలో యు ముంబాతో పట్నా పైరేట్స్, దబంగ్‌ ఢిల్లీతో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడతాయి. తొలి 28 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖపట్నంలో నేటితో పీకేఎల్‌ పోటీలు ముగియనున్నాయి. రేపటి నుంచి జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా టోర్నీ కొనసాగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement