u mumba
-
సెమీస్ బెర్త్ ఎవరిదో!
పుణే: గత రెండు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్ దశ పోటీలు ముగియగా... ఇక నాకౌట్ సమరాలకు వేళయింది. పాయింట్ల పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచిన హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా... ఆ తర్వాత 3 నుంచి 6వ స్థానం వరకు నిలిచిన జట్ల మధ్య గురువారం ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.ఇందులో విజయం సాధించిన జట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుండగా... రాత్రి 9 గంటల నుంచి జరగనున్న రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా పోటీపడుతుంది. పీకేఎల్‌లో యూపీ యోధాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోగా... జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు చాంపియన్‌గా నిలవగా... యు ముంబా కూడా ఒకసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. తాజా సీజన్లో యూపీ యోధాస్ 13 విజయాలు సాధించి 79 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా... పింక్ పాంథర్స్ 12 విజయాలతో 70 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కెపె్టన్ సురేందర్ గిల్‌తో పాటు శివమ్ చౌధరీ యోధాస్‌కు కీలకం కానుండగా... పింక్ పాంథర్స్ జట్టు సారథి అర్జున్ దేశ్వాల్పై ఎక్కువగా ఆధారపడుతోంది. మరి ఈ కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. లీగ్ చివరి మ్యాచ్ విజయంతో యు ముంబా ముందడుగు వేయగా... పట్నా పైరేట్స్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి నాకౌట్లో అడుగు పెట్టింది. యు ముంబా జట్టు తరఫున కెప్టెన్ సునీల్ కుమార్, అజిత్ చౌహాన్, మన్జీత్ రాణిస్తుండగా... పైరేట్స్ తరఫున దేవాంక్, దీపక్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్లు శుక్రవారం జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. -
ఆఖరి బెర్త్ యు ముంబాదే
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్... ఆ తర్వాత పడుతూ లేస్తూ చివరకు గ్రూప్ దశతోనే పోరాటాన్ని ముగించింది. మంగళవారం ముగిసిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 36–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. యు ముంబా జట్టు ఆఖరి పోరులో 48 పాయింట్ల తేడాతో ఓడిపోయి ఉంటే టైటాన్స్ ఆరో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేది. కానీ యు ముంబా విజయం సాధించడంతో తెలుగు టైటాన్స్ ఏడో స్థానంతో లీగ్ దశకే పరిమితమైంది. కీలక పోరులో ముంబా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు, అజిత్ చవాన్ 6 పాయింట్లు, సునీల్ కుమార్ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 12 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 22 మ్యాచ్‌లాడి 12 విజయాలు, 8 పరాజయాలు, 2 ‘టై’లతో 71 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44–30 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ తరఫున శివమ్ చౌధరీ 13 పాయింట్లు, సురేందర్ గిల్ 9 పాయింట్లతో రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుశీల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. నేడు విశ్రాంతి రోజు. గురువారం జరగనున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
హరియాణా స్టీలర్స్ ‘టాప్’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్ లీగ్ దశలో హరియాణా స్టీలర్స్ జట్టు అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 47–30 పాయింట్లతో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. హరియాణా తరఫున శివమ్ పటారె అత్యధికంగా 14 పాయింట్లు స్కోరు చేశాడు. మొహమ్మద్ రెజా, వినయ్ 6 పాయింట్ల చొప్పున సాధించగా... రాహుల్ 5 పాయింట్లు సంపాదించాడు. యు ముంబా తరఫు సతీశ్ కన్నన్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హరియాణా జట్టు 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా 84 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 42–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున హిమాన్షు 13 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ రెయిడర్ సుశీల్ 15 పాయింట్లతో మెరిసినా తన జట్టును గెలిపించుకోవడంలో విఫలమయ్యాడు. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8 గంటల నుంచి); పుణేరి పల్టన్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. ఇప్పటికే హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్, జైపూర్ పింక్ పాంథర్స్ ‘ప్లే ఆఫ్స్’ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. చివరిదైన ఆరో బెర్త్ కోసం యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్లు రేసులో ఉన్నాయి. బెంగాల్ వారియర్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో యు ముంబా గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్‌ను దక్కించుకుంటుంది. -
రెండు మ్యాచ్‌లూ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 32–32 పాయింట్లతో... జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ 22–22 పాయింట్లతో ‘టై’ అయ్యాయి. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, నవీన్ 8 పాయింట్లతో రాణించారు. యోధాస్ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు, భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించారు. మాŠయ్చ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రక్షణాత్మక ధోరణిలో ముందుకు సాగిన ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్‌లో పింక్ పాంథర్స్, యు ముంబా జట్లు తుదికంటా పోరాడాయి. జైపూర్ తరఫున రెజా అత్యధికంగా 6 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున సోమ్‌బీర్ 7 పాయింట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు డిఫెన్స్‌లో దుమ్మురేపాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లాడిన యు ముంబా 54 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. పింక్ పాంథర్స్ 49 పాయింట్లతోఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అజిత్ సూపర్ రెయిడింగ్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో యు ముంబా జట్టు తమ ఖాతాలో తొమ్మిదో విజయం జమ చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన యు ముంబా మంగళవారం జరిగిన పోరులో 43–29 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్‌ను బోల్తా కొట్టించింది. యు ముంబా తరఫున అజిత్ చవాన్ 12 పాయింట్లతో సత్తా చాటగా... సునీల్ కుమార్, మన్జీత్, సోమ్‌బీర్ తలా 5 పాయింట్లు సాధించారు. పుణేరి పల్టన్ తరఫున పంకజ్ మోహిత్ 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యు ముంబా 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 14 పాయింట్లకే పరిమితమై పరాజయం వైపు నిలిచింది. తాజా సీజన్లో 15 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 51 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 16 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 47 పాయింట్లు సాధించిన పుణేరి పల్టన్ ఆరో స్థానంలో ఉంది. బెంగళూరు బుల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన పోరు 34–34 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. బెంగళూరు బుల్స్ తరఫున నితిన్ 7 పాయింట్లు సాధించగా... ప్రదీప్ నర్వాల్, సుశీల్ చెరో 6 పాయింట్లు సాధించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
యు ముంబాపై తెలుగు టైటాన్స్ గెలుపు
నోయిడా: స్టార్ రెయిడర్లు ఆశిష్ కుమార్, విజయ్ చెరో 10 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిన టైటాన్స్... గురువారం జరిగిన పోరులో 41–35 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై ఘనవిజయం సాధించింది. అటు రెయిడింగ్, ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకున్న తెలుగు టైటాన్స్ జట్టు ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి సత్తా చాటగా... యు ముంబా జట్టు టైటాన్స్‌ను ఒకేసారి ఆలౌట్ చేయగలిగింది. తాజా లీగ్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 9 విజయాలు, 5 పరాజయాలతో 48 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 46 పాయింట్లతో ఉన్న యు ముంబా మూడో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 33–29తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), గుజరాత్ జెయింట్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: ప్రొ కబడ్డి లీగ్ ఫైనల్ తేదీ, వేదిక ఖరారు
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ వేదిక ఖరారైంది. పుణే వేదికగా ఈ మెగా టోర్నీ టైటిల్ పోరు జరుగనుంది. ఈసారి లీగ్‌ను మూడు నగరాల్లో నిర్వహిస్తుండగా... హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నోయిడా వేదికగా పోటీలు జరుగుతున్నాయి.ఇక.. డిసెంబర్ 3 నుంచి మూడో అంచె మ్యాచ్‌లు పుణేలో జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్‌తో పాటు తుదిపోరును పుణేలోనే నిర్వహించనున్నారు. బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాడ్మింటన్ హాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.డిసెంబర్ 29నఇక గ్రూప్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మరోవైపు.. మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో తలపడతాయి. కాగ.. డిసెంబర్ 26న రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు... డిసెంబర్ 27న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 29న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.ఎనభై మ్యాచ్‌లు ముగిసేసరికి ప్రొ కబడ్డి లీగ్ 2024 పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఇలా..1. హర్యానా స్టీలర్స్: ఆడినవి 14.. గెలిచినవి 11.. ఓడినవి మూడు.. పాయింట్లు 562. యు ముంబా: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 4.. టై.. ఒకటి.. పాయింట్లు 453. దబాంగ్ ఢిల్లీ: 14... గెలిచినవి 6... ఓడినవి ఐదు.. టై.. మూడు.. పాయింట్లు 434. తెలుగు టైటాన్స్: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 5.. పాయింట్లు 435. పట్నా పైరేట్స్: ఆడినవి 13... గెలిచినవి 7.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 436. పుణెరి పల్టన్: ఆడినవి 14... గెలిచినవి 6.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 427. జైపూర్ పింక్ పాంథర్స్: ఆడినవి 13.. గెలిచినవి 7.. ఓడినవి ఐదు.. టై ఒకటి.. పాయింట్లు 408. యూపీ యోధాస్: ఆడినవి 13... గెలిచినవి 6.. ఓడినవి 6.. టై ఒకటి.. పాయింట్లు 389. తమిళ్ తలైవాస్: ఆడినవి 13.. గెలిచినవి 5.. ఓడినవి 7.. టై ఒకటి.. పాయింట్లు 3310. బెంగాల్ వారియర్స్: ఆడినవి 13... గెలిచినవి 3.. ఓడినవి 8.. టై 2.. పాయింట్లు 2511. గుజరాత్ జెయింట్స్: ఆడినవి 13.. గెలిచివని 4.. ఓడినవి 8.. టై ఒకటి.. పాయింట్లు 2512. బెంగళూరు బుల్స్: ఆడినవి 14.. గెలిచినవి 2.. ఓడినవి 12.. పాయింట్లు 16.చదవండి: రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్ -
తెలుగు టైటాన్స్ దూకుడు
నోయిడా: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో ‘టేబుల్ టాపర్’ హరియాణా స్టీలర్స్‌ను మట్టికరిపించిన టైటాన్స్... తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 31–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టైటాన్స్ జట్టు రెయిడింగ్‌లో విఫలమైనా... డిఫెన్స్‌లో రాణించింది. టైటాన్స్ తరఫున ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించగా... సాగర్ నర్వాల్, అజిత్ పవార్, మన్జీత్ తలా 4 పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున రోహిత్ 8 పాయింట్లు, మన్జీత్ 7 పాయింట్లతో పోరాడారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో టైటాన్స్ 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... యు ముంబా 18 పాయింట్లు సాధించింది. లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 7 విజయాలు, 4 పరాజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు యు ముంబా 12 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. నేడు బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
PKL 11: యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం.. పాయింట్ల పట్టికలో పైపైకి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో మాజీ చాంపియన్ యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా జరుగుతున్న రెండో అంచె పోటీల్లో ఆదివారం యు ముంబా జట్టు ఉత్కంఠ పోరులో 35–33తో యూపీ యోధాస్‌పై గెలిచింది.యు ముంబా తరఫున అజిత్ చవాన్, రోహిత్ రాఘవ్ చెరో 8 పాయింట్లతో రాణించగా... యూపీ యోధాస్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభంలో ఆకట్టుకున్న యూపీ జట్టు ప్రత్యర్థిపై పైచేయి కనబర్చినా దాన్ని చివరి వరకు కొనసాగించలేక పోయింది.ఇక తాజా సీజన్లో యు ముంబా 8 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘టై’తో 29 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు.. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న యూపీ యోధాస్ 20 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఓటమిమరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 39–23 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. హరియాణా స్టీలర్స్ తరఫున రాహుల్ 8 పాయింట్లు... వినయ్, రెజా చెరో 7 పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (7 పాయింట్లు) మినహా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. హరియాణా 26 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు... గుజరాత్ జెయింట్స్ 7 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇప్పటి వరకు పుణెరి పల్టన్ అస్థానంలో కొనసాగుతోంది. -
యు ముంబా ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా ఉత్కంఠ విజయం అందుకుంది. ఆధిపత్యం చేతులూ మారుతూ సాగిన పోరులో ఆఖరి క్షణాల్లో పట్నాను ఆలౌట్ చేసిన ముంబా పైచేయి సాధించింది. అజిత్ చవాన్ 19 పాయింట్లతో విజృంభించడంతో బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో యు ముంబా 42–40 తేడాతో పట్నాను ఓడించింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చవాన్ తో పాటు మంజీత్ (5) ఆకట్టుకున్నాడు. పట్నా జట్టులో దేవాంక్ 15 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ముంబాకు ఇది నాలుగో విజయం కాగా.. ఆరు మ్యాచ్‌ల్లో పట్నా మూడోసారి ఓడిపోయింది.హోరాహోరీలో ముంబా పైచేయితొలి అర్ధభాగంలో ఆరంభం నుంచి చివరి వరకు ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్, అయాన్ అదరగొట్టగా.. అటు యు ముంబా రెయిడర్ అజిత్ చవాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని దేవాంక్ పట్నా పైరేట్స్ జట్టు ఖాతా తెరవగా.. మంజీత్ ముంబాకు తొలి పాయింట్ అందించాడు. దేవాంక్ జోరుతో పట్నా 9–6తో ముందంజ వేసింది. కానీ, డిఫెన్స్‌లో మెరుగైన ముంబా వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో 11–11తో స్కోరు సమం చేసింది.డూ ఆర్ డై రైడ్‌లో సందీప్ ఓ పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన సునీల్, మంజీత్‌ను అయాన్ ఔట్ చేశాడు. దాంతో ముంబైని ఆలౌట్ చేసిన పట్నా 16–12తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో అజిత్ తన రెయిడింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. వరుసగా రెండు సూపర్ రెయిడ్స్‌తో ఐదుగురిని కోర్టు బయటకు పంపించాడు. దాంతో పైరేట్స్‌ను ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న ముంబా 21–17తో ఆధిక్యంలోకి వచ్చింది. అదే జోరుతో 24–-21తో మూడు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగించింది. దేవాంక్ దూకుడు.. చివర్లో ముంబా మ్యాజిక్విరామం నుంచి వచ్చిన వెంటనే పట్నా పైరేట్స్ జట్టు పుంజుకుంది. అటువైపు అజిత్ రెయిండింగ్ జోరు కొనసాగించినా.. పైరేట్స్ ఆటగాడు దేవాంక్ ముంబా డిఫెండర్లను ఏమార్చాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని వస్తూ ఒకే రెయిడ్‌లో మూడు పాయింట్లు రాబట్టాడు. దాంతో పైరేట్స్ 30–28తో మళ్లీ ఆధిక్యం అందుకుంది. పట్నా డిఫెండర్లు కూడా పుంజుకొని ముంబా రెయిడర్లను నిలువరించారు. ఈ క్రమంలో జఫర్దానేష్ను ట్యాకిల్ చేసిన పట్నా జట్టు ముంబాను రెండోసారి ఆలౌట్ చేసి తన ఆధిక్యాన్ని 33–29కి పెంచుకుంది.దేవాంక్ మరో రెండు టచ్ పాయింట్లు రాబట్టడంతో పైరేట్స్ ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అజిత్‌కు తోడు ఆల్‌రౌండర రోహిత్ వెంటవెంటనే రెండు పాయింట్లు రాబట్టడంతో ముంబా 36–37తో ప్రత్యర్థికి చేరువై మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఆపై డూ ఆర్ డై రైడ్‌లో అజిత్ విజయం సాధిచడంతో స్కోరు 37–37తో సమం అయింది. చివరి నిమిషంలో పైరేట్స్ కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలగా.. దీన్ని ముంబా సద్వినియోగం చేసుకుంది. పట్నా ఆటగాడు సందీప్ ఓ పాయింట్ తెచ్చి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, చివరి క్షణాల్లో అతడిని ట్యాకిల్ చేసిన ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి రెండు పాయింట్లతో ఉత్కంఠ విజయం అందుకుంది -
యూ ముంబాదే విజయం
హైదరాబాద్, నవంబర్ 5: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూ ముంబా 32-26తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. మంజీత్(9 పాయింట్లు), జాఫర్దనేశ్(5), సోమ్‌బీర్(3)..యూ ముంబా విజయంలో కీలకమయ్యారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు ఓటములు, ఒక టై ఎదుర్కొన్న ముంబా ప్రస్తుతం 19 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మరోవైపు పోరాడి ఓడిన ఢిల్లీ 14 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. ఢిల్లీ తరఫున అషు మాలిక్(11) సూపర్-10 సాధించినా లాభం లేకపోయింది. యోగేశ్(6), రింకూ నార్వల్(2) ఆకట్టుకున్నారు.ఆది నుంచే హోరాహోరీ: యూ ముంబా, దబాంగ్ ఢిల్లీ ఆది నుంచే హోరాహోరీగా తలపడ్డాయి. స్టార్ రైడర్ నవీన్‌కుమార్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగగా, యూ ముంబా సమిష్టి తత్వాన్ని నమ్ముకుంది. ఇరు జట్లు తమ తొలి రైడ్లలో పాయింట్లను సొంతం చేసుకోలేకపోయాయి. లీగ్‌లో వరుస ఓటములతో ఢిల్లీ తల్లడిల్లుతుంటే యూ ముంబా ప్రయాణం పడుతూలేస్తూ అన్నట్లు సాగుతున్నది. సందీప్‌ను ఔట్ చేసిన అజిత్ చవాన్..ముంబాకు తొలి పాయింట్ అందించగా, డూ ఆర్ డైకు వెళ్లిన ఢిల్లీ రైడర్ అషు మాలిక్..పర్వేశ్‌ను ఔట్ చేసి ఢిల్లీ పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గేర్ మార్చిన యూ ముంబాకు మంజీత్ ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు అందించి మంచి జోష్ నింపాడు.మరోవైపు అషు మాలిక్ వరుస రైడ్లలో ఢిల్లీకి పాయింట్లు అందిస్తూ పోవడంతో ఇరు జట్లు స్కోరు సమంగా సాగింది. ఢిల్లీ రైడర్ వినయ్ ఉత్త చేతులతో తిరిగిరాగా, అషు మాలిక్ తనదైన జోరు కొనసాగించాడు. మ్యాచ్ 13వ నిమిషంలో మంజీత్ స్థానంలో లోకేశ్ ముంబా జట్టులోకి వచ్చాడు. 11వ నిమిషంలో ముంబా రైడర్ జాఫర్దనేశ్..రింకూ నార్వల్ను ఔట్ చేసి జట్టును ముందంజలో నిలిపాడు. అయితే 8వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన జాఫర్దనేశ్కు యోగేశ్ నుంచి చుక్కెదురైంది. ఇలా ఇరు జట్ల రైడర్లు, డిఫెండర్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రథమార్ధం ముగిసే సరికి యూ ముంబా 13-13 ఢిల్లీ దబాంగ్ సమవుజ్జీలుగా నిలిచాయి.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలోనూ ఇరు జట్ల ప్లేయర్లు అదే దూకుడు కొనసాగించారు. ఎక్కడా వెనుకకు తగ్గకుండా పాయింట్ల వేటలో దూసుకెళ్లారు. డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన ఢిల్లీ రైడర్ మోహిత్‌ను సోమ్భీర్ గట్టిగా పట్టుకోవడంతో ముంబా ఖాతాలో పాయింట్ చేరింది. అదే ఊపులో 17వ నిమిషంలో యోగేశ్, సందీప్‌ను ఔట్ చేసిన మంజీత్..ముంబాకు రెండు పాయింట్లు అందించాడు. నిమిషం తేడాతో జాఫర్దనేశ్..అశిష్, రింకూ నార్వల్ను ఔట్ చేయడంతో ఢిల్లీ తొలిసారి ఆలౌటైంది. ఈ క్రమంలో రెండు జట్లు సబ్స్టిట్యూషన్స్కు మొగ్గుచూపుతూ మార్పులు చేశాయి.ఓవైపు ఢిల్లీకి అషు మాలిక్ కీలకమైతే..మరోవైపు యూ ముంబాకు సునీల్ పెద్దదిక్కు అయ్యాడు. ఆట సాగుతున్నా కొద్ది యూ ముంబా కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అషు మాలిక్ రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి ఢిల్లీకి పాయింట్ అందించడంలో సఫలమయ్యాడు. అయితే అతనికి రైడింగ్‌లో సహకరించే వారు కరువయ్యారు. మ్యాచ్ 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన రోహిత్ రాఘవ్‌ను బిజేంద్ర పట్టేయడంతో ఢిల్లీకి పాయిట్ దక్కింది. మ్యాచ్ చివరి క్షణాల్లో ఢిల్లీ గెలిచేందుకు ప్రయత్నించినా..పట్టు వదలకుండా పోరాడిన యూ ముంబా విజయం సొంతం చేసుకుంది. -
PKL 11: యూ ముంబా మెరుపు విజయం.. మాజీ చాంపియన్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదకొండో సీజన్లో యూ ముంబా రెండో విజయం నమోదు చేసింది. జైపూర్ పింక్ పాంథర్స్‌పై 39-37తో గెలుపొందింది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో గురువారం మాజీ చాంపియన్లు యు ముంబా- జైపూర్ పింక్ పాంథర్స్ తలపడ్డాయి.ఈ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూ ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (14 పాయింట్లు) సూపర్ టెన్ షోతో అదరగొట్టాడు. మరోవైపు.. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆట తొలి పది నిమిషాల వరకు ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజఇటు జైపూర్, అటు యూ ముంబా రెయిడర్లు, డిఫెండర్లు వరుసగా పాయింట్లు సాధించారు. ఆట మొదలైన పది నిమిషాల అనంతరం 9-9తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అయితే, ఫస్టాఫ్ చివర్లో యూ ముంబా ముందంజ వేసింది. జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఆలౌట్ చేసి విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది.ప్రథమార్థం ముగిసే సరికి యూ ముంబా 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా.. రెయిడింగ్‌లో ఇరు జట్లు పదేసి పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్‌లో యూ ముంబా ఐదు, జైపూర్ ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. కానీ అదనపు పాయింట్లు యూ ముంబాను ఆధిక్యంలో నిలబెట్టాయి.ద్వితీయార్థం మరింత ఉత్కంఠఇక ఇరుజట్ల మధ్య ద్వితీయార్థం ఆట మరింత ఉత్కంఠ రేపింది. యూ ముంబా ముందంజలో కొనసాగినా.. జైపూర్ పింక్ పాంథర్స్ పట్టు వదల్లేదు. ఆఖరు వరకు యూ ముంబాను తిప్పలు పెట్టింది. మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉండగా నీరజ్ నర్వాల్ సూపర్ రెయిడ్‌తో 32-32తో జైపూర్ పింక్ పాంథర్స్.. యూ ముంబా స్కోరును సమం చేసింది.కానీ ఆ తర్వాతి రెయిడ్‌లోనే రోహిత్ రాఘవ్ సూపర్ రెయిడ్‌తో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో యూ ముంబా మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకున్న యూ ముంబా మెరుపు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన జైపూర్‌కు ఇది రెండో ఓటమి.చదవండి: హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం -
‘టై’తో టైటాన్స్ ముగింపు
పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నిర్ణీత 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ ఆడతాయి. -
Pro Kabaddi League: పుణేరి, ముంబా మ్యాచ్ ‘టై’
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ తొలి ‘టై’ నమోదు చేసింది. యు ముంబా, పుణేరి పల్టన్ జట్ల మధ్య గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ 32–32 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా ప్లేయర్ గుమన్ సింగ్ 15 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. సీజన్లో ఏడో విజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 40–34తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో దబంగ్ ఢిల్లీకిది ఏడో విజయం కావడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ జట్టు 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబాతో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. మంజీత్ ఆరు పాయింట్లు, యోగేశ్ నాలుగు పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 11 పాయింట్లు, గుమన్ సింగ్ 9 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35–33తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు బుల్స్ తరఫున సచిన్ నర్వాల్ 9 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. -
PKL 2024: టైటాన్స్‌కు ఏడో ఓటమి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–54తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. యు ముంబా తరఫున గుమన్ సింగ్ 10 పాయింట్లు, రింకూ 8 పాయింట్లు, సోంబీర్ 8 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున రజనీశ్ 8 పాయింట్లు, రాబిన్ చౌధరీ 7 పాయింట్లు, ప్రఫుల్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–25తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్; తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2023: పవన్ పోరాటం వృథా
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆరో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టిన టైటాన్స్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఏడో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31–33తో బెంగళూరు బుల్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అజిత్ పవార్ 5 పాయింట్లు, రజనీశ్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున సుర్జీత్ సింగ్ (7), భరత్ (6), వికాశ్ కండోలా (5), నీరజ్ నర్వాల్ (5) రాణించారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 39–37తో బెంగాల్ వారియర్స్ జట్టును ఓడించింది. యు ముంబా జట్టు తరఫున అమీర్ మొహమ్మద్ 8 పాయింట్లు, గుమన్ సింగ్ 6 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ అత్యధికంగా 11 పాయింట్లు స్కోరు చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. Came like 𝙋𝙖𝙬𝙖𝙣, went with the Bulls 😉#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/azN98ZP8fU — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 SUPE𝐑𝐑𝐑 TACKLE ft. Ajit Pawar 💛#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvTT #BengaluruBulls #TeluguTitans pic.twitter.com/fHyLLmze8F — ProKabaddi (@ProKabaddi) December 24, 2023 -
మాజీ ఛాంపియన్‌కు షాక్.. గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 39–37తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో గుజరాత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. రెయిడర్ సోనూ జగ్లాన్ 11 పాయింట్లు స్కోరు చేసి గుజరాత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. రాకేశ్ (9 పాయింట్లు), రోహిత్ గులియా (7 పాయింట్లు) కూడా రాణించారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్, అమీర్ మొహమ్మద్ పది పాయింట్ల చొప్పున స్కోరు చేసినా కీలకదశలో గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్; యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్‌పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్‌పై గెలిచాయి. -
Pro Kabaddi League 9: కూతకు వేళాయె!
బెంగళూరు: ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న కబడ్డీ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, పుణే నగరాల్లో అన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో టీవీలకే పరిమితమైన అభిమానులు ఈ సారి నేరుగా ఆటను ఆస్వాదించడం అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ మూడు వేదికల్లోనూ ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు. మొత్తం 12 జట్లు లీగ్ బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌లో భాగంగా మొత్తం 66 మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి పోరులో యు ముంబాతో డిఫెండింగ్ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. జాతీయ క్రీడల్లో కబడ్డీ ఈవెంట్ ముగిసిన వారం రోజుల్లోపే అందరూ ఆటగాళ్లు లీగ్‌కు సిద్ధమై బరిలోకి దిగుతున్నారు. రాహుల్ రెడీ లీగ్ వేలంలో రూ. 2.26 కోట్ల విలువ పలికిన పవన్‌కుమార్ సెహ్రావత్ (తమిళ్ తలైవాస్)పై అందరి దృష్టీ నిలిచి ఉంది. గత సీజన్లో పునేరీ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ రాహుల్ చౌదరి గాయంనుంచి కోలుకొని ఈ సారి జైపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది సీజన్లలో పట్నా పైరేట్స్ 3 సార్లు విజేతగా నిలవగా...బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టైటాన్స్ రాత మారేనా! ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లలో తెలుగు టైటాన్స్ ఒకటి. ఎనిమిది సీజన్లు కలిపి 148 మ్యాచ్‌లలో 52 గెలిచిన టైటాన్స్, అంతకంటే ఎక్కువ పరాజయాలు (77) నమోదు చేసింది. అయితే ఇతర జట్లకంటే ఎక్కువ ‘డ్రా’లు (19) కూడా టైటాన్స్ ఖాతాలో ఉన్నాయి. వీటిని విజయాలుగా మలచుకోగలిగితే కథ వేరేగా ఉండేదేమో. టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడో సీజన్లో 11వ, ఎనిమిదో సీజన్లో 12వ స్థానాల్లో నిలిచింది. అయితే ఈ సారి జట్టు కాస్త మెరుగ్గా, సమతూకంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న రైడర్ అభిషేక్ సింగ్‌ను తీసుకోగా, మనూ గోయత్, సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అంకిత్ బెనివాల్, రజనీశ్, డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్ జట్టుకు కీలకం కానున్నారు. వెంకటేశ్ గౌడ్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు తమ తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
PKL 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు
Pro Kabaddi League 2022 Schedule And Other Details: కబడ్డీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)- 2022 వచ్చే నెల(అక్టోబరు)లో ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్‌ను లీగ్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లీగ్ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తో లీగ్ ఆరంభం డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ, యు ముంబా మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 7 పీకేఎల్ సీజన్ 9కు తెరలేవనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధాస్ తలపడనున్నాయి. మొదటి దశలో భాగంగా అక్టోబరు 7 నుంచి నవంబరు 8 వరకు 66 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్లో లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టూ ఇతర జట్లతో పోటీపడుతుంది. అంతకు మించిన వినోదం ఇక వీవో పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మాషల్ స్పోర్ట్స్ హెడ్, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. బెంగళూరు, పుణె, హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సీజన్‌కు మించిన వినోదంతో కబడ్డీ అభిమానుల ముందుకు వస్తున్నామని.. సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తామని పేర్కొన్నారు. లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడంటే.. వివో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టికెట్లు ఎలా? పీకేఎల్-2022 టికెట్లను బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. చదవండి: Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?! Rohit Vs Dinesh Karthik: దినేశ్ కార్తిక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ -
పవన్ ఒంటరి పోరాటం వృథా
ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌కు ఆరో పరాజయం ఎదురైంది. బెంగళూరులో బుధవారం యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 34–45తో ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది నాలుగో ఓటమి. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముంబా జట్టులో అభిషేక్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. -
Pro Kabaddi League: దబంగ్ ఢిల్లీకి ఏడో విజయం.. అగ్రస్థానంలోకి
Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఏడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 32–29తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ సందీప్ నర్వాల్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఈ లీగ్ చరిత్రలో సందీప్ రెయిడింగ్ పాయింట్ల సంఖ్య 250 దాటింది. గుజరాత్ జెయింట్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్ 24–24తో ‘టై’ అయింది. చదవండి: IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు! -
తమిళ్ తలైవాస్, యు ముంబా మ్యాచ్ టై
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మూడో ‘టై’ నమోదైంది. తమిళ్ తలైవాస్, యు ముంబా జట్ల మధ్య సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ 30–30 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా తరఫున వి.అజిత్ కుమార్ 15 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ఖాతాలో ఇది రెండో ‘టై’ కావడం గమనార్హం. లీగ్ తొలి రోజు తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను తమిళ్ తలైవాస్ 40–40తో ‘టై’ చేసు కుంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–29తో యూపీ యోధపై నెగ్గింది. నేడు పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్; తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే.. -
నవీన్ అదుర్స్ దబంగ్ ఢిల్లీకి రెండో విజయం
బెంగళూరు: దబంగ్ ఢిల్లీ జట్టు స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్‌లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను పట్టేసి మరో పాయింట్‌ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్ 500 రెయిడింగ్ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్‌గా నవీన్ నిలిచాడు. సహచరుడు జోగిందర్ సింగ్ నర్వాల్ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 38–30తో తమిళ్ తలైవాస్‌పై, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 31–28తో గుజరాత్ జెయింట్స్ గెలిచాయి. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్; పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
సెమీస్‌లో బెంగళూరు, ముంబా
అహ్మదాబాద్: ఆరంభంలో తడబడినా... పవన్ అసాధారణ పోరాటంతో ఓడాల్సిన మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫలితం కోసం అదనపు సమయం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48–45తో యూపీ యోధపై విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 36–36తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ఆరు నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో వవన్ సూపర్ రైడ్‌తో చెలరేగడంతో బెంగళూరు బుల్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పవన్‌కు సుమిత్ సింగ్ (7 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) సహకరించారు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో యు ముంబా 46–38తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
యు ముంబా విజయం
గ్రేటర్ నోయిడా: తన అద్భుతమైన ట్యాక్లింగ్‌తో ప్రత్యర్థిని పట్టేసిన యు ముంబా సారథి ఫజల్ అత్రాచలి జట్టుకు విజయాన్ని అందించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 39–33తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. ట్యాక్లింగ్‌లో మెరిసిన అత్రాచలి 8 పాయింట్లతో అదరగొట్టాడు. అతనికి రైడర్ అజింక్యా కప్రె (9 పాయింట్లు) చక్కటి సహకారం అందించాడు. హరియాణా రైడర్ వినయ్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
ప్లే ఆఫ్స్‌కు యు ముంబా
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–7)లో తాజాగా యు ముంబా ప్లే ఆఫ్స్‌కు చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబా జట్టు 30–26తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. యు ముంబా జట్టులో అభిషేక్ సింగ్ (7), అతుల్ (5), రోహిత్ బలియన్ (5), ఫజల్ అత్రాచలి (4) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున ప్రదీప్ నర్వాల్ (8) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 59–36తో హరియాణా స్టీలర్స్‌పై భారీ విజయం సాధించింది. బెంగళూరు తరఫున పవన్ షెరావత్ ఒక్కడే రికార్డు స్థాయిలో 39 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్ తలపడుతుంది. -
ప్లే ఆఫ్స్‌కు చేరువగా ముంబా
పంచకుల: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ ప్లే ఆఫ్స్‌కు యు ముంబా మరింత చేరువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబా 36–32తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. దీంతో 59 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై రైడర్ అభిషేక్ సింగ్ సూపర్ ‘టెన్’తో ఆకట్టుకున్నాడు. తలైవాస్ రైడర్ అజిత్ (16 పాయింట్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యు ముంబాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో... ఒక్క మ్యాచ్ గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది. ఒక వేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ 42–33తో దబంగ్ ఢిల్లీపై నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరాయి. -
యూపీ యోధపై యు ముంబా గెలుపు
పుణే: అభిషేక్ సింగ్ (11 రైడ్ పాయింట్లు) చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం యూపీ యోధపై మాజీ చాంపియన్ యు ముంబా 39–36 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో యూపీ ఆధిపత్యం చూపినా ముంబై తేరుకుని మొదటి భాగాన్ని 16–15తో ముగించింది. రెండో భాగమూ పోటాపోటీగానే సాగింది. ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అభిõÙక్ మూడు రైడ్ పాయింట్లతో ఫలితాన్ని మలుపు తిప్పాడు. పుణేరి పల్టన్–తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 36–36తో ‘డ్రా’గా ముగిసింది. -
యు ముంబా సిక్సర్...
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో యు ముంబా జట్టు జయాపజయాలను సమం చేసింది. స్థానిక కంఠీరవ స్టేడియంలో శనివారం మ్యాచ్‌లో యు ముంబా 47–21తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తుగా ఓడించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబా 6 మ్యాచ్‌ల్లో గెలిచి మరో ఆరింటిలో ఓడినట్లయింది. అభిషేక్ సింగ్ 18 సార్లు రైడింగ్‌కు వెళ్లి 10 సార్లు సఫలమయ్యాడు. మరో 7 పర్యాయాలు పాయింట్లేమీ తీసుకురాకుండా, ఒకసారి మాత్రం ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోయాడు. మరో రైడర్ అర్జున్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. హరేంద్ర ఐదుగురిని పట్టేసి ఐదు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లలో రైడింగ్‌లో నితిన్ రావల్ (5 పాయింట్లు), ట్యాకిల్‌లో అమిత్ హుడా (3 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32–23తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. విజేత జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. బెంగళూరు జట్టులో సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ ఆడతాయి. -
యు ముంబా విజయం
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 మ్యాచ్‌లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. యు ముంబా రైడర్ రోహిత్ బలియాన్ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 22–19తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై విజయం సాధించింది. జైపూర్ రైడర్ దీపక్ నివాస్ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి. తొలి రోజు తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్; బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్‌లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్‌లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్‌తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్‌లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
జయహో... యు ముంబా
ముంబై: మొదటి అర్ధభాగంలో పోటీ ఇచ్చిన పుణేరి పల్టన్ తర్వాత చేతులెత్తేయడంతో యు ముంబా విజయాన్ని పట్టేసింది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో రెండు మరాఠా జట్ల పోరులో తొలి విజయం ముంబైని వరించింది. శనివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 33–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. అభిషేక్ సింగ్ 5 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యు ముంబా సారథి ఫజేల్ అత్రాచలి, రోహిత్, సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లు చెరో 4 పాయింట్లతో రాణించా రు. పుణేరి తరఫున సుర్జీత్ సింగ్ 6 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ గీతం ఆలపించాడు. నెమ్మదిగా మొదలై.. ఆరంభంలో రెండు జట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్లు ఎక్కువగా రాలేదు. పుణే తరఫున తొలి కూతకు వెళ్లిన మంజీత్ రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. అనంతరం ముంబై తరఫున కూతకు వెళ్లిన లీ డాంగ్ జీన్‌ను పుణే పట్టేయడం అదే సమయంలో లీ బోనస్ లైన్‌ను దాటడంతో ఇరు జట్లు ఒకేసారి ఖాతా తెరిచాయి. 2–5తో యు ముంబా వెనుకంజలో ఉన్నప్పుడు ఫజేల్ అత్రాచలి మంజీత్‌ను సూపర్ టాకిల్ చేశాడు. ఆ వెంటనే అభిషేక్ ఒక రైడ్ పాయింట్ తీసుకురావడంతో స్కోరు 5–5తో సమమైంది. పుణే తరఫున సుర్జీత్ సింగ్ సూపర్ టాకిల్ చేయడం, ఆ వెంటనే రైడ్‌కు వెళ్లి సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లను ఔట్ చేసి పుణేని 9–8తో ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే ఈ దశలో ముంబై చకచకా మూడు పాయింట్లు సాధించి 11–9తో విరామానికి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కాసేపటికే యు ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 15–10తో దూసుకెళ్లింది. ఇదే అధిక్యాన్ని చివరి వరకు కొనసాగించిన ముంబై జట్టు విజేతగా నిలిచింది. గట్టెక్కిన జైపూర్... మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 27–25తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. చివరి మూడు నిమిషాల్లో తడబడిన బెంగాల్ మూల్యం చెల్లించుకుంది. జైపూర్ డిఫెండర్ సందీప్ ధుల్ (8 టాకిల్ పాయింట్లు)తో బెంగాల్‌ను పట్టేశాడు. రైడర్ దీపక్ హుడా 6 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా
ముంబై: సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో యు ముంబా అదరగొట్టింది. సుర్జీత్ సింగ్ సారథ్యంలోని పుణెరీ పల్టన్‌ను యు ముంబా బోల్తా కొట్టించి విజయం సాధించింది. శనివారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 33-23 తేడాతో పుణెరీ పల్టన్‌పై విజయాన్ని అందుకుంది. దీంతో పుణెరి ఖాతాలో రెండో ఓటమి పడింది. తొలి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరంభంలో ధాటిగా ఆడిన పుణెరి ఆటగాళ్లు.. మ్యాచ్ జరిగే కొద్దీ ఢీలా పడ్డారు. ప్రత్యర్థి జట్టుకు దాసోహమయ్యారు. రైడింగ్‌లో, టాకిల్‌లో పూర్తిగా విఫలమయ్యారు. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్ల వేగం తగ్గింది. అయితే రెండో అర్ద భాగంలో యు ముంబా ఆటగాళ్లు విరుచుకపడ్డారు. ఇక ఈ మ్యాచ్‌లో యు ముంబా ఆటగాళ్లు ఒకరిపై ఆధారపడకుండా సమిష్టిగా ఆడారు. రైడర్లు అభిషేక్ సింగ్(5), రోహిత్ బలియాన్(4) రాణించగా.. డిఫెండర్లు సురిందర్ సింగ్(4), సందీప్ నర్వాల్(4), ఫజల్ అత్రచలి(4) పుణెరి పని పట్టారు. ఇక పుణెరీ ఆటగాళ్లలో సారథి సుర్జీత్ సింగ్(4) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు స్టార్ డిఫెండర్ గిరీష్ ఎర్నాక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క టాకిల్ కూడా చేయలేకపోయాడు. ముంబా జట్టు 15 రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 12 రైడ్, 11 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. యు ముంబా ధాటికి పుణెరి పల్టాన్ జట్టు రెండు సార్లు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. -
జైపూర్ పింక్ పాంథర్స్ పంజా
సాక్షి, హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో సీజన్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను ఓడించి దూకుడు మీదున్న యు ముంబా ఆటలు జైపూర్ పింక్ పాంథర్స్ ముందు సాగలేదు. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 42–23 తేడాతో యు ముంబాను ఓడించింది. జైపూర్ జట్టు 25 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా... యు ముంబా 18 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో పాంథర్స్‌ను అందుకోలేకపోయింది. పాంథర్స్ తరపున దీపక్ హుడా 11 పాయింట్లతో మెరిశాడు. అతనికి నితిన్ (7 పాయింట్లు), దీపక్ (6 పాయింట్లు), అమిత్ హుడా (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. యు ముంబా తరపున అభిషేక్ (7 పాయింట్లు), డాంగ్ జీన్ లీ (6 పాయింట్లు) పర్వాలేదనిపించారు. దడదడలాడించిన దీపక్... ఆట ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన పాంథర్స్ ఏ దశలోనూ యు ముంబాకు కోలుకునే అవకాశాన్నివ్వలేదు. ముఖ్యంగా దీపక్ హుడా తన రైడ్లతో ప్రత్యర్థిని దడదడలాడించాడు. తన తొలి రెండు రైడ్లలో మూడు పాయింట్లు సాధించి జైపూర్‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఖాతా తెరవడానికే 4 నిమిషాల సమయం తీసుకున్న యు ముంబా ఏ దశలోనూ జైపూర్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. మొదటి అర్ధ భాగం ముగిసే సరికి జైపూర్ 22–9 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలోనూ పింక్ పాంథర్స్ ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసిన పాంథర్స్ ఒక్క సారి కూడా ఆలౌట్ కాలేదు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు 34–24తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. హరియాణా జట్టు స్టార్ రైడర్ నవీన్ 14 పాయింట్లతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. మంగళవారం మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
యు ముంబా చిత్తుచిత్తుగా
హైదరాబాద్ : ప్రొ కబడ్డీ సీజన్-7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా చిత్తయింది. తెలుగు టైటాన్స్‌పై విజయంతో ఊపుమీదున్న యూ ముంబా జట్టుకు జైపూర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 23-42 తేడాతో జైపూర్ చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రైడ్‌లోనే దీపక్ హుడా రెండు పాయింట్లతో జైపూర్‌కు శుభారంభాన్ని అందించాడు. అక్కడి నుంచి జైపూర్ అటాకింగ్ గేమ్ ఆడి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 22-9తో జైపూర్ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యు ముంబా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. ఫజల్ అత్రచెలీతో సహా అందరూ విపలమయ్యారు. జైపూర్ స్టార్ రైడర్స్ దీపక్ హుడా 11 పాయింట్లతో రెచ్చిపోగా.. నితిన్ రావల్ 7 పాయింట్లతో, దీపక్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. యు ముంబా రైడర్ అభిషేక్ సింగ్ ఒక్కడే 7 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. -
తెలుగు టైటాన్స్ తడబాటు
ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ కూడా తెలుగు టైటాన్స్‌కు నిరాశాజనకంగా ఆరంభమైంది. సొంతగడ్డపై జరిగిన ఆరంభ పోరులో మాజీ చాంపియన్ యు ముంబాకు టైటాన్స్ తలవంచింది. కీలక సమయంలో పాయింట్లు సాధించడంలో విఫలమైన తెలుగు జట్టు... చివర్లో వరుస పాయింట్లతో ప్రత్యర్థికి చేరువగా వచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైంది. సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–25 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 17–10తో ఆధిక్యంలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. సమష్టి వైఫల్యం... టైటాన్స్ ఆటలో ఆరంభం నుంచి కూడా దూకుడు కనిపించలేదు. స్కోరు 1–1తో ఆట మొదలైన తర్వాత సిద్ధార్థ్ ఖాళీ రైడ్‌తో వెనక్కి రావడం మొదలు మ్యాచ్‌లో చాలా వరకు అలాంటి స్థితే కనిపించింది. ముంబా కోర్టులో ఫర్హద్ దొరికిపోవడంతో 4–5తో తొలిసారి వెనుకంజ వేసిన టైటాన్స్ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత ముంబా ఆధిక్యం 8–5నుంచి 17–8 వరకు సాగింది. తొలి అర్ధ భాగం చివర్లో రాకేశ్, రోహిత్ రైడ్లతో రెండు పాయింట్లు సాధించిన తెలుగు టీమ్ పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్ ఒక సారి ఆలౌట్ అయింది. రెండో అర్ధభాగంలో మాత్రం టైటాన్స్ ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోసారి ఆలౌట్ అయినా కూడా టైటాన్స్ మొత్తం 15 పాయింట్లు సాధించగా, ముంబా 14 పాయింట్లు మాత్రమే గెలుచుకుంది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో టైటాన్స్‌కు వరుసగా పాయింట్లు వచ్చాయి. అయితే బలమైన డిఫెన్స్‌ను ప్రదర్శించిన ముంబా మ్యాచ్ తమ చేజారుకుండా చూసుకుంది. సిద్ధార్థ్ విఫలం... వేలంలో భారీ మొత్తానికి ధర పలకడంతో పాటు ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్ ఆడిన టైటాన్స్ ఆటగాడు సిద్ధార్థ్ దేశాయ్ నిరాశపర్చాడు. తొలి అర్ధభాగంలో ఆరు సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాడు. మూడు సార్లు అతడిని ప్రత్యర్థి జట్టు పట్టేయగా, రెండు సార్లు ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. ఒకసారైతే ‘డు ఆర్ డై’ రైడ్‌లో కూడా ఖాళీగా రావడంతో టైటాన్స్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. అన్యమనస్కంగా కనిపించిన అతడిని కోచ్ రెండో అర్ధభాగంలో తొలి తొమ్మిది నిమిషాలు డగౌట్లోనే కూర్చోబెట్టాడంటే అతని ఆట ఎలా సాగిందో అర్థమవుతోంది. ఎట్టకేలకు తన ఎనిమిదో ప్రయత్నంలో బోనస్ ద్వారా పాయింట్ సాధించిన అతను చివర్లో మాత్రం బాగా ఆడేందుకు ప్రయత్నించాడు. జట్టు సాధించిన ఆఖరి 10 పాయింట్లలో 5 దేశాయ్ రైడింగ్‌లో తెచ్చినవే ఉన్నాయి. టైటాన్స్ తరఫున గరిష్టంగా రజనీశ్ 8 పాయింట్లు సాధించగా, కెప్టెన్ అబోజర్ 2 టాకిల్ పాయింట్లకే పరిమితమయ్యాడు. ముంబా తరఫున అభిషేక్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య టాకిల్ పాయింట్లు సమంగా (10) ఉండగా రైడింగ్ పాయింట్లలో ముంబా 1 ఎక్కువగా సాధించింది. అయితే రెండు సార్లు ఆలౌట్ కావడంతో పోగొట్టుకున్న 4 పాయింట్లే తుది ఫలితంలో తేడాగా మారాయి. మరో మ్యాచ్‌లో విజయంతో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ సీజన్–7లో శుభారంభం చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బుల్స్ 34–32 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. బెంగళూరు తరఫున పవన్ సెహ్రావత్ 9 పాయింట్లు స్కోరు చేయగా, పట్నా తరఫున పర్దీప్ నర్వాల్ 10, ఇస్మాయిల్ 9 పాయింట్లు సాధించారు. -
తొలి వేట యు ముంబాదే..
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో యు ముంబా శుభారంభం చేసింది. సొంత మైదానంలో జరుగుతున్న సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చేతులెత్తేసింది. శనివారం హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31-25 తేడాతో యు ముంబా ఘనవిజయం సాధించింది. ముంబై ఆటగాడు అభిషేక్ సింగ్ పది రైడింగ్ పాయింట్లతో చెలరేగగా.. డిఫెండర్స్ రోహిత్ బలియాన్, సందీప్ నర్వాల్ తలో నాలుగు ట్యాకిల్ పాయింట్లతో టైటాన్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. టైటాన్స్ ఆటగాళ్లలో రజ్నిష్ 8 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా వారి నుంచి సహకారం అందలేదు. సారథి అబోజర్ నాలుగు సార్లు ట్యాకిల్‌లో విఫలమవడం టైటాన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. -
సైరా కబడ్డీ...
ఆరు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న కబడ్డీ ఆరు నెలలకే మళ్లీ వచ్చేసింది. ఐపీఎల్ తర్వాత అంతటి ఊపును తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ కూత మరోసారి మోత మోగించనుంది. 12 జట్లు... 92 రోజులు... 137 మ్యాచ్‌లు... ఇక వినోదానికి లోటేముంది. నేటి నుంచి జరిగే సీజన్–7తో కబడ్డీ ... కబడ్డీ... కబడ్డీ అంటూ శ్రుతి కలిపేందుకు మీరు సిద్ధమేనా...? సాక్షి, హైదరాబాద్ ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం లీగ్ తెరపైకి వచ్చి అనూహ్యంగా సూపర్ సక్సెస్‌గా నిలిచిన ఈ టోర్నీ విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5న ఆరో సీజన్ ఫైనల్ జరగ్గా అదే జోరులో 2019లో రెండో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్‌లాగే ఈసారి కూడా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. హైదరాబాద్ అంచె పోటీలు ఈనెల 26 వరకు జరుగుతాయి. కొత్త ఫార్మాట్‌తో 137 మ్యాచ్‌లు... ప్రొ కబడ్డీ లీగ్–7కు సంబంధించి ప్ర«ధాన మార్పు ఫార్మాట్ విషయంలో జరిగింది. ఇంతకుముందు రెండు వేర్వేరు జోన్లు, వాటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు తర్వాతి దశ, ఆపై చివరి దశ అంటూ గందరగోళంగా షెడ్యూల్ కనిపించింది. దాంతో దీనిని పూర్తిగా మార్చి అభిమానులకు ఆసక్తి రేపేలా చేశారు. ► ఐపీఎల్ తరహాలో ప్రతీ జట్టు మరో టీమ్‌తో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే ఒక్కో టీమ్ కనీసం 22 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. సొంత వేదికపై మాత్రం గరిష్టంగా నాలుగు మ్యాచ్‌లకు మించి ఏ జట్టుకూ ఆడే అవకాశం రాదు. లీగ్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు బరిలో నిలిస్తే...తర్వాతి ఆరు జట్లు టోర్నీనుంచి తప్పుకుంటాయి. ► తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడి విజయం ద్వారా సెమీస్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది. సరిగ్గా మూడు నెలల సాగే ఈ లీగ్‌లో ఏకంగా 137 మ్యాచ్‌లు జరుగుతుండటం విశేషం. ప్రతీసారి ఏదో ఒక స్లోగన్‌ను లీగ్‌కు ఆకర్షణగా తెస్తున్న నిర్వాహకులు ఈసారి ‘ఇస్ సే టఫ్ కుచ్ నహీ...(ఇంతకంటే క్లిష్టం మరోటి లేదు)’ పేరుతో లీగ్‌కు ప్రచారం నిర్వహించారు. వేదికలు... 12 జట్లు తమ సొంత వేదికలను ఎంచుకున్నాయి. గత సీజన్లో తెలంగాణలో ఎన్నికల కారణంగా వైజాగ్‌లో హోం మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఈసారి హైదరాబాద్‌నే సొంత వేదికగా తీసుకుంది. దీంతో పాటు ముంబై, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, పుణే, జైపూర్, పంచకుల, గ్రేటర్ నోయిడాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ అంచె మ్యాచ్‌లు శనివారం ప్రారంభమవుతాయి. ప్రతి మంగళవారం మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శని, ఆది, బుధ, శుక్రవారాల్లో హోం జట్లు తమ మ్యాచ్‌లను ఆడతాయి. పట్నాదే జోరు... లీగ్‌లో ఆరు సీజన్లలో పట్నా పైరేట్స్ జట్టు దూకుడు కొనసాగింది. ఏకంగా మూడు సార్లు ఆ జట్టు విజేతగా నిలవడం విశేషం. జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. గత సీజన్లో ట్రోఫీ అందుకున్న బెంగళూరు బుల్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్... కబడ్డీ అంటే కుర్రాళ్లు మాత్రమే కాదు మేం కూడా ఆడగలమంటూ కొందరు వయసులో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరిలో జోగీందర్ నర్వాల్ (37 ఏళ్లు–ఢిల్లీ), జీవకుమార్ (38 ఏళ్లు–బెంగాల్), ధర్మరాజ్ చేరలతన్ (43 ఏళ్లు–హరియాణా) ఆటపై అందరి దృష్టి ఉంది. కెన్యా నుంచి కూడా... లీగ్‌లో భారత ఆటగాళ్లతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అందరిలోకి అగ్రభాగం ఇరాన్‌దే. టైటాన్స్ కెప్టెన్ అబోజర్ సహా మొత్తం 15 మంది ఇరాన్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌కు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ) ఆడే డెవిట్ జెన్నింగ్స్‌ను టైటాన్స్ తమ జట్టులోకి తీసుకున్నా... చివరి నిమిషంలో వేరే కారణాలతో అతడిని తప్పించింది. లీగ్ టాపర్స్ అత్యధిక పాయింట్లు: రాహుల్ చౌదరి (876) అత్యధిక రైడ్ పాయింట్లు: పర్దీప్ నర్వాల్ (858) అత్యధిక టాకిల్ పాయింట్లు: మన్జీత్ ఛిల్లర్ (302) ఎక్కువ సార్లు ప్రత్యర్థిని ఆలౌట్: పట్నా పైరేట్స్ (165) మాజీ చాంపియన్స్ సీజన్ విజేత 2014 జైపూర్ పింక్ పాంథర్స్ 2015 యు ముంబా 2016 పట్నా పైరేట్స్ (జనవరి; జూన్) 2017 పట్నా పైరేట్స్ 2018–19 బెంగళూరు బుల్స్ నేటి మ్యాచ్‌లు తెలుగు టైటాన్స్ X యు ముంబా రాత్రి గం. 7.30 నుంచి బెంగళూరు బుల్స్ X పట్నా పైరేట్స్ రాత్రి గం. 8.30 నుంచి సీజన్–7 కెప్టెన్లు వీరే... ► మణీందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్) ► జోగీందర్ నర్వాల్ (దబంగ్ ఢిల్లీ) ► సునీల్ కుమార్ (గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్) ► రోహిత్ కుమార్ (బెంగళూరు బుల్స్) ► దీపక్ హుడా (జైపూర్ పింక్ పాంథర్స్) ► పర్దీప్ నర్వాల్ (పట్నా పైరేట్స్) ► సుర్జీత్ సింగ్ (పుణేరీ పల్టన్) ► అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్) ► అబోజర్ మొహాజిర్ మిగాని (తెలుగు టైటాన్స్) ► నితీశ్ కుమార్ (యూపీ యోధ) ► ఫజల్ అత్రచలి (యు ముంబా) ► ధర్మరాజ్ చేరలతన్ (హరియాణా స్టీలర్స్) -
యుముంబా కెప్టెన్ ఫజల్ అట్రాచలీ
ముంబై : ప్రపంచకప్ ముగియడంతో క్రీడా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ సీజన్-7 సిద్ధమైంది. జులై 20న హైదరాబాద్ వేదికగా ఈ మెగాఈవెంట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్న ఆయా ఫ్రాంచైజీలు.. టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. యుముంబా తమ జట్టు సారథిగా ఫజల్ అట్రాచలీ(ఇరాన్)ని కొనసాగిస్తూ.. వైస్ కెప్టెన్‌గా సందీప్ నర్వాల్‌ను ప్రకటించింది. యు ముంబా కబడ్డీ జట్టు సారథ్య బాధ్యతలు మరోసారి అప్పగించడం సంతోషంగా ఉందని, జట్టును విజయం దిశగా తీసుకెళ్తానని ఫజల్ అట్రాచలీ మీడియా సమావేశంలో తెలిపాడు. వ్యూహాలు, క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనివ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేసిన సందీప్ నర్వాల్.. వ్యూహాలు రచించడం ఆటలో కీలకమని అభిప్రాయపడ్డాడు. వైస్ కెప్టెన్‌గా వ్యూహాలు రచించడంలో ముందుంటానని, ఆదిశగా సాధన చేస్తానని తెలిపాడు. ఇక యుముంబా జులై 20న హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో తన క్యాంపైన్ ప్రారంభించనుంది. పుణెరి పల్టాన్ కెప్టెన్‌గా సుర్జీత్ సింగ్ పుణెరి పల్టాన్ తన కెప్టెన్‌గా సుర్జీత్ సింగ్‌ను ప్రకటించింది. జట్టును నడిపించే సత్తా సుర్జీత్‌కు ఉందని కోచ్ అనూప్ కుమార్ ధీమా వ్యక్తం చేశాడు. నితిన్ తోమర్చ గిరిష్ ఎర్నాక్, పవన్ కుమార్, దర్శన్ కడియన్లతో పుణెరి పల్టాన్ పటిష్టంగా ఉంది. -
చెన్నై స్పార్టన్స్‌పై యు ముంబా గెలుపు
ప్రొ వాలీబాల్ లీగ్‌లో ఎట్టకేలకు బోణీ కొట్టిన యు ముంబా వాలీ జట్టు సెమీస్ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది. శనివారం చెన్నై స్పార్టన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 15–14, 15–8, 15–10, 10–15, 10–15తో నెగ్గింది. యు ముంబా కెప్టెన్ దీపేశ్ సిన్హా (11 పాయింట్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతను 5 స్పైక్, 2 బ్లాక్, మరో 4 సర్వీస్ పాయింట్లు సాధించాడు. నాలుగు మ్యాచ్‌లాడిన యు ముంబాకిది తొలి గెలుపు కాగా... చెన్నై కూడా నాలుగు మ్యాచ్‌లాడి ఒకటే గెలిచింది. నేడు చెన్నై స్పార్టన్స్‌తో అహ్మదాబాద్ డిఫెండర్స్ తలపడుతుంది. -
యు ముంబాపై యూపీ విజయం
కోల్‌కతా: ఉత్కంఠ పోరులో యూపీ యోధాను విజయం వరించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధా 34–32తో యు ముంబాపై గెలుపొందింది. ఇరుజట్లు పాయింట్ల కోసం పోటీ పడటంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి యూపీ యోధా 20–15తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత విజృంభించిన యు ముంబా 20–20తో స్కోర్లు సమం చేసినా... చివరకు ఆధిక్యం కనబరిచిన యోధా విజయం సాధించింది. యు ముంబా తరఫున రోహిత్ 10, అబోఫజల్ 5 పాయింట్లు సాధించారు. యోధా తరఫున ప్రశాంత్ 8, రిషాంక్, సచిన్ చెరో 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39–23తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడనుంది. -
పట్నా పైరేట్స్ పరాజయం
పట్నా: ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ చెలరేగినా... ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పట్నా పైరేట్స్ పరాజయం పాలైంది. శనివారం యు ముంబాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి వరకు రేసులో నిలిచిన పట్నా ఆఖరకు 39–40తో ఓడింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 17 రైడ్ పాయింట్లతో దుమ్మురేపాడు. ట్యాక్లింగ్‌లో జైదీప్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్ దేశాయ్ 14, రోహిత్ 11 రైడ్ పాయింట్లతో చెలరేగారు. ట్యాక్లింగ్‌లో ఫజల్ (6 పాయింట్లు) సత్తాచాటాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39–28తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధా, పట్నా పైరేట్స్‌తో హరియాణా స్టీలర్స్ ఆడతాయి. -
యు ముంబా చేతిలో టైటాన్స్ ఓటమి
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్‌కు యు ముంబా చేతిలో పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన పోరులో యు ముంబా 41–20తో టైటాన్స్‌పై భారీ విజయాన్ని సాధించింది. ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన దేశాయ్ 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో ఫజల్ అత్రాచలి 4, సురేందర్, వినోద్, అబొల్ఫజల్ తలా 2 పాయింట్లు చేశారు. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లలో రాహుల్ చౌదరి ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. 15 సార్లు రైడింగ్‌కు వెళ్లిన రాహుల్ కేవలం 7 పాయింట్లే తెచ్చాడు. ఫర్హాద్ 4, అనిల్, మోసిన్, అర్మాన్ రెండేసి పాయింట్లు సాధించారు. అనంతరం రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 36–31తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ (12 పాయింట్లు) అదరగొట్టాడు. జస్వీర్ 8, సుఖేశ్ హెగ్డే, మన్జీత్ చిల్లర్ చెరో 4 పాయింట్లు చేశారు. పుణేరి తరఫున నితిన్ తోమర్ (8) ఆకట్టుకున్నాడు. రవికుమార్ 4, మోను 3 పాయింట్లు చేశారు. నేడు జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టన్‌తో యూపీ యోధ తలపడతాయి. -
బెంగాల్40 40 యూపీ
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. జోన్ ‘బి’లో భాగంగా శనివారం ఇక్కడ బెంగాల్ వారియర్స్, యూపీ యోధా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 40–40తో డ్రాగా ముగిసింది. బెంగాల్ తరఫున మణిందర్ సింగ్ 16, జాంగ్ కున్ లీ 7 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో సుర్జీత్ సింగ్ (6 పాయింట్లు) రాణించాడు. యూపీ తరఫున ప్రశాంత్ 13, రిషాంక్ 9 రైడ్ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 33–32తో యు ముంబాపై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్, పుణేరీ పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
2 నిమిషాల్లో తారుమారు
న్యూఢిల్లీ: మ్యాచ్ ముగిసేందుకు ఇక రెండే నిమిషాలు మిగిలుంది. దబంగ్ ఢిల్లీ 28–26తో ఆధిక్యంలో ఉంది. కానీ రెండు నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారింది. విజయం యు ముంబాను వరించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యు ముంబా 30–28 స్కోరుతో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో రైడర్ శ్రీకాంత్ జాదవ్ (11) రాణించాడు. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను పది పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్‌లో మరో పాయింట్ చేశాడు. కశ్‌లింగ్ అడకె 7, అనూప్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. దబంగ్ ఢిల్లీ తరఫున అబొల్ ఫజల్ 6, రోహిత్ బలియాన్, మిరాజ్ షేక్ చెరో 4 పాయింట్లు చేశారు. సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆట ఆరంభం నుంచి ఆధిపత్యం చాటిన ఢిల్లీ... ఒకానొక దశలో 12–3తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. చాలా ఆలస్యంగా పుంజుకున్న యు ముంబా చక్కని రైడింగ్‌లతో ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసిరింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ముంబా 16–17తో ఒక పాయింట్‌తో వెనుకబడింది. తర్వాత ద్వితీయార్ధంలో మ్యాచ్ ముగిసే దశలో మెరుపు రైడింగ్‌లతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. లీగ్‌లో ఢిల్లీకిది ఎనిమిదో పరాభవం కాగా... యు ముంబాకు ఎనిమిదో విజయం. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్; దబంగ్ ఢిల్లీతో పుణేరి పల్టన్ తలపడతాయి. -
యు ముంబా హ్యాట్రిక్
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 37–31తో గెలిచింది. ముంబా తరఫున అనూప్ కుమార్ 11 పాయింట్లు, శ్రీకాంత్ జాదవ్, కాశిలింగ్ అడకె ఎనిమిదేసి పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 38–30తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. దబంగ్ ఢిల్లీ కెప్టెన్ మేరాజ్ షేక్ 14 పాయింట్లు సాధించడం విశేషం. -
యు ముంబా గెలుపు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 38–32 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ముంబా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రైడింగ్‌లో ఇరు జట్లు 21 పాయింట్లు సాధించగా... టాకిల్‌లో ముంబా 14 పాయింట్లు చేస్తే, హర్యానా 7 పాయింట్లే చేయగలింది. ఇదే మ్యాచ్‌ను ప్రభావితం చేసింది. ముంబా తరఫున అనూప్ 8, కుల్దీప్ 7 పాయింట్లు చేశారు. హర్యానా జట్టులో వికాస్ 9, వజీర్ సింగ్ 7, దీపక్ దహియా 5 పాయింట్లు సాధించారు. నేడు తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
యు ముంబా విజయం
లక్నో: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా జట్టు 37–34 తేడాతో యూపీ యోధను ఓడించింది. యు ముంబా నుంచి రిశాంక్ దేవడిగ 14 రైడ్ పాయింట్లతో కీలకంగా నిలిచాడు. యూపీలో షబీర్ 13 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ప్రథమార్ధం ముగిసేసరికి యోధ జట్టు 15–12తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరును చివరి ఏడు నిమిషాల వరకు కూడా కొనసాగించిన యూపీ జట్టు 31–28తో పైచేయి సాధించింది. అయితే ఈ సమయంలో యు ముంబా అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి యోధకు షాక్ ఇచ్చింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 30–28 తేడాతో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్, యు ముంబాతో... యూపీ యోధ, హర్యానా స్టీలర్స్‌తో తలపడతాయి. -
గుజరాత్ జెయింట్స్ గెలుపు
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో పటిష్ట యు ముంబాకు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ 39–21 తేడాతో ముంబాను చిత్తు చేసింది. రైడర్లు రోహిత్ 9, సచిన్ 8, సుకేశ్ 4 పాయింట్లతో జట్టుకు భారీ విజయాన్ని అందించారు. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
యు ముంబా గెలుపు
నాగపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబాకు మరో విజయం దక్కింది. శనివారం ఇక్కడ జరిగిన జోన్ ‘ఎ’ మ్యాచ్‌లో యు ముంబా 36–22 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీని చిత్తు చేసింది. ముంబా ఆటగాళ్లలో అనూప్ కుమార్, షబీర్ బాపు చెరో 7 పాయింట్లతో చెలరేగారు. ఢిల్లీ తరఫున కెప్టెన్ మిరాజ్ షేక్ 7 పాయింట్లు స్కోర్ చేయగా, నీలేశ్ షిండే 5 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 32–27 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. యూపీ తరఫున నితిన్ తోమర్ 9 పాయింట్లతో దూకుడు కనబర్చగా, రిషాంక్ 5 పాయింట్లు సాధించాడు. బుల్స్ ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ కుమార్ ఒక్కడే 11 పాయింట్లతో ఎదురు దాడి చేసినా... జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. ఆదివారం జరిగే బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ, బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. ఈ పోటీలను స్టార్ స్పోర్ట్స్–2 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
యు ముంబా జోరు
దబాంగ్ ఢిల్లీపై విజయం ప్రొ కబడ్డీ లీగ్ జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో యు ముంబా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన ఉత్కంఠ పోరులో 27-25 స్వల్ప తేడాతో యు ముంబా నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఢిల్లీ 14-12తో కాస్త పైచేయిలోనే ఉంది. అయితే ద్వితీయార్ధంలో ముంబా తమ వ్యూహాలను మార్చుకుని సత్తా చాటింది. 28వ నిమిషం వరకు 15-16తో వెనుకబడి ఉన్నా ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచింది. ఈ సమయంలో రిషాంక్ దేవడిగ (8 రైడింగ్ పాయింట్లు) సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు తేవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబా వైపు తిరిగింది. ఢిల్లీ నుంచి కెప్టెన్ కశిలింగ్ అడికే 6, సెల్వమణి 5 రైడింగ్ పాయింట్లు సాధించారు. దీపక్ నర్వాల్ తన 11 రైడింగ్ ప్రయత్నాల్లో ఒక్క పాయింట్ మాత్రమే తేవడం జట్టు ఫలితాన్ని ప్రభావితం చేసింది. జైపూర్‌దే విజయం: నువ్వా.. నేనా అనే రీతిలో సాగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 36-33 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిక్యం ఇరు జట్ల మధ్య మారుతూ వచ్చింది. అయితే కెప్టెన్ జస్వీర్ సింగ్ మరోసారి సూపర్ ఆటతో 13 రైడింగ్ పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు. బెంగాల్ నుంచి నితిన్ మదానే, మోను గోయట్ ఎనిమిదేసి పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీలో నేడు దబాంగ్ ఢిల్లీ కేసీ గీ బెంగళూరు బుల్స్ రాత్రి 8 గంటల నుంచి జైపూర్ పింక్ పాంథర్స్ గీ పుణెరి పల్టాన్ రాత్రి 9 గంటల నుంచి -
పట్నా పట్టేసింది...
► ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్ ► ఫైనల్లో యు ముంబా ఓటమి ► విజేతకు రూ. కోటి ప్రైజ్‌మనీ ► రన్నరప్‌కు రూ.50 లక్షలు ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నూతన చాంపియన్‌గా పట్నా పైరేట్స్ అవతరించింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పట్నా జట్టు 31-28 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాను ఓడించింది. సూపర్ రైడింగ్‌తోనే కాకుండా అద్భుత డిఫెన్స్‌తో దుమ్ము రేపిన పట్నా పైరేట్స్‌కు ఇది తొలి టైటిల్. విజేతకు రూ.కోటి ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్‌గా నిలిచిన ముంబాకు రూ.50 లక్షలు అందాయి. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థిగా డిఫెండింగ్ చాంపియన్ ఉన్నా... పట్నా మాత్రం తన దూకుడును తగ్గించుకోలేదు. తొలి పాయింట్ ముంబా సాధించినా ఆ తర్వాత పట్నా జోరు సాగించింది. 7వ నిమిషంలోనే ఆ జట్టును ఆలౌట్ చేయగలిగింది. 17వ నిమిషంలో రోహిత్ కుమార్ సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు సాధించాడు. అయితే ఆ వెంటనే తన మరో రైడ్‌లో మాత్రం ముంబా కోర్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు సూపర్ టాకిల్‌తో పట్టేసి రెండు పాయింట్లు సాధించారు. ఇక అప్పటి నుంచి ప్రథమార్ధం మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనే వరకు ముంబా ఆటగాళ్లు అద్వితీయ ఆటను ప్రదర్శించారు. 6-19తో వెనుకబడిన ఈ దశ నుంచి వరుసగా 5 పాయింట్లు సాధించి 11-19కి ఆధిక్యం తగ్గించారు. ఇక ద్వితీయార్ధం ఆట ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఆరంభంలో పట్నా పాయింట్లు సాధించినా ఒక్కసారిగా ముంబా పుంజుకుని 29వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేసింది. దీంతో 20-24 స్కోరుతో పట్నాపై ఒత్తిడి పెరిగింది. చివరి ఐదు నిమిషాల్లో అయితే ఈ రెండు ఉత్తమ డిఫెన్స్ జట్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు కనిపించింది. స్టార్ రైడర్ రోహిత్‌పై దృష్టి పెట్టిన ముంబా సఫలం కావడంతో పట్నా ఇబ్బంది పడింది. 39వ నిమిషంలో అనూప్ కుమార్ పాయిం ట్‌తో ముంబా 28-28తో స్కోరును సమం చేసి ఉత్కంఠను పెంచింది. అయితే దీపక్ నర్వాల్ పట్నాకు పాయింట్ అందించగా స్కోరు 29-28కి పెరి గింది. మరోవైపు ముంబా కెప్టెన్ అనూప్ ఫౌల్ కావడంతో పాటు చివరి సెకన్లలో సందీప్ నర్వాల్ పాయిం ట్‌తో పట్నా 31-28తో విజయం అందుకుంది. పుణెరికి మూడో స్థానం ఫైనల్‌కు ముందు జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో పుణెరి పల్టన్ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. పుణెరి 31-27తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పుణెరికి రూ.30 లక్షల ప్రైజ్‌మనీ, బెంగాల్‌కు రూ.20 లక్షలు దక్కాయి. దీపక్ హుడా 8, అజయ్ ఠాకూర్ 4 పాయింట్లు సాధించారు. బెంగాల్ నుంచి జాంగ్ కున్ లీ 8, మహేంద్ర గణేష్ 5 పాయింట్లు సాధించారు. -
పట్నా vs యు ముంబా
ప్రొ కబడ్డీ ఫైనల్లో నేడు అమీతుమీ సెమీస్‌లో ఓడిన పుణెరి, బెంగాల్ న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో అత్యంత పటిష్ట జట్లుగా పేరుతెచ్చుకున్న డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా, పట్నా పైరేట్స్ తుది పోరుకు అర్హత సాధించాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిల్చిన ఈ జట్లు సెమీఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై స్థాయికి తగ్గ ఆటతీరును చూపి ఏకపక్ష విజయాలు సాధించాయి. నేడు (శనివారం) రాత్రి తొమ్మిది గంటల నుంచి జరిగే ఫైనల్లో ముంబా, పట్నా తలపడుతాయి. దీనికి ముందు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో పుణెరి పల్టన్, బెంగాల్ వారియర్స్ తలపడుతాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో పట్నా పైరేట్స్ 40-21 తేడాతో పుణెరి పల్టన్‌ను చిత్తు చేసింది. ప్రదీప్ నర్వాల్ 10, రోహిత్ కుమార్ 6 రైడింగ్ పాయింట్లు సాధించారు. పుణెరి నుంచి దీపక్ హుడా ఆరు పాయింట్లు సాధించాడు. లీగ్ దశలో ఈ జట్లు రెండు సార్లు తలపడగా డ్రా ఫలితమే వచ్చింది. అయితే లీగ్ మ్యాచ్‌ల్లో చూపించిన తెగువ కీలక సెమీస్‌లో పుణెరి చూపలేకపోయింది. తొలి నిమిషం నుంచే ప్రత్యర్థిపై పట్నా ఎదురుదాడికి దిగింది. రైడ్‌కు వెళితే చాలు పాయింట్ ఖాయం అన్నట్టుగా ఆటగాళ్లు రెచ్చిపోయారు. దీంతో తొమ్మిదో నిమిషంలోనే పుణే ఆలౌట్ అయ్యింది. ఈ ఊపు అలాగే కొనసాగగా.. 12వ నిమిషంలో ప్రదీప్ నర్వాల్ సూపర్ రైడ్‌తో పట్నాకు ఆరు పాయింట్లు దక్కాయి. పుణెరి కోర్టులో ఉన్న నలుగురు ఆటగాళ్లను తను ఒకేసారి అవుట్ చే సి కోర్టును ఖాళీ చేశాడు. దీంతో తొలి అర్ధభాగానికి పట్నా 25-7తో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. అయితే ద్వితీయార్ధంలో పుణెరి గేరు మార్చింది. వరుసగా 9 పాయింట్లు సాధించడంతో పాటు పట్నాను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత వెంటనే పుంజుకున్న పట్నా తిరిగి పైచేయి సాధించింది. పట్నా సూపర్ రైడింగ్ ముందు పుణెరి డిఫెన్స్ పూర్తిగా తేలిపోవడంతో వారికి పరాజయం తప్పలేదు మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 41-29 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను మట్టికరిపించింది. రిషాంక్ దేవ డిగ 11, అనూప్ కుమార్ 6 రైడ్ పాయింట్లు సాధించారు. ఆది నుంచే చెలరేగిన ముంబా ఆటగాళ్లు ప్రత్యర్థిని తొమ్మిదో నిమిషంలో ఆలౌట్ చేశారు. ఆ తర్వాత కూడా బెంగాల్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ప్రథమార్ధం 26-8తో ముగించింది. ద్వితీయార్ధంలోనూ బెంగాల్ ఏమాత్రం ప్రభావం చూపకపోగా ముంబా ఆటగాళ్లు చ కచకా పాయింట్లు సాధిస్తూ తమ స్కోరును పెంచుకుంటూ వెళ్లడంతో విజయం ఖాయమైంది. -
యు ముంబా జోరు
జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ జోరును కొనసాగిస్తోంది. లీగ్ ఆరంభంలో కాస్త తడబడ్డ యు ముంబా ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 30-17 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. తద్వారా ఈ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని, ఓవరాల్‌గా ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ మొదలైన తొలి క్షణం నుంచే ముంబా జట్టు తమ పట్టు బిగించింది. ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి 10-2తో ముందంజ వేసి తమ ఆధిక్యాన్ని ఎనిమిది పాయింట్లకు పెంచుకుంది. విరామ సమయానికి 17-6తో ఆధిక్యంలో ఉన్న ముంబా జట్టు చివరి నిమిషం వరకు తమ జోరును కొనసాగించి వారియర్స్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. ముంబా జట్టులో రిషాంక్, ఫాజిల్ ఆరేసి పాయింట్లు సాధించగా... అనూప్ కుమార్ ఐదు పాయింట్లు సంపాదించాడు. బెంగాల్ జట్టులో జాంగ్ కున్ లీ ఒక్కడే కాస్త రాణించి నాలుగు పాయింట్లు స్కోరు చేశాడు. పట్నా చేతిలో జైపూర్ చిత్తు సొంత వేదికపై మ్యాచ్‌లను జైపూర్ పింక్ పాంథర్స్ హ్యాట్రిక్ పరాజయాలతో ముగించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 47-24 తేడాతో జైపూర్‌ను చిత్తుగా ఓడించింది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో జైపూర్ ఒక్కటి మాత్రమే నెగ్గింది. లీగ్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న పట్నా ఆటగాళ్ల దూకుడుకు జైపూర్ బెంబేలెత్తింది. వీరి ఖాతా తెరవడానికి ముందే పట్నా 10 పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం 5-27తో వెనుకబడిన జైపూర్ చివర్లో కాస్త పుంజుకుంది. స్కోరు 9-42గా ఉన్న దశలో రాజేశ్ నర్వాల్ (10 పాయింట్లు) రాణించడంతో చివరకు ఓమాదిరి స్కోరైనా అందుకోగలిగింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు. -
యు ముంబాకు ప్రో కబడ్డీ ట్రోఫీ
అంతర్జాతీయం ప్రధాని మోదీ యూఏఈ పర్యటన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 16 నుంచి రెండురోజుల పాటు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటించారు. అబుదాబిలో యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్నహియాన్తో చర్చలు జరిపారు. మధ్యప్రాచ్య, గల్ఫ్ దేశాల్లో కొన్ని చోట్ల హింస, అస్థిర పరిస్థితులు ఉండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని యువరాజు అల్ నహియాన్ ప్రధానికి హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా మోదీ... మూడో అతిపెద్ద చారిత్రక మసీదు షేక్ జాయేద్ గ్రాండ్‌ను సందర్శించారు. ఆగస్టు 17న దుబాయ్‌లో 50 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాటం జరపాలని ఆయన పిలుపునిచ్చారు. దుబాయ్‌లో వ్యాపారవేత్తల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు.. అవార్డులు 2015 ధ్యాన్‌చంద్ పురస్కారం 2015 ధ్యాన్‌చంద్ పురస్కారం ముగ్గురికి లభించింది. హైదరాబాద్‌కు చెందిన డేవిస్ కప్ మాజీ కెప్టెన్ ఎస్.పి.మిశ్రా, వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్ కీపర్ రోమియో జేమ్స్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. క్రీడా విభాగాల్లో అత్యున్నత సేవలందించినందుకు ధ్యాన్‌చంద్ పేరిట జీవిత సాఫల్య పురస్కారం ప్రభుత్వం అందజేస్తుంది. ప్రొ.పురుషోత్తం రెడ్డికి కుల్దీప్సింగ్ అవార్డు హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ టి.పురుషోత్తం రెడ్డికి జస్టిస్ కుల్దీప్ సింగ్ అవార్డును ఆగస్టు 21న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి పురుషోత్తం రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. రాష్ట్రీయం తాడేపల్లిగూడెంలో నిట్‌కు శంకుస్థాపన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 20న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. రూ.300 కోట్లతో నిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సోలార్ నగరాలు కేంద్ర కొత్త, పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఎంపిక చేసిన సోలార్ నగరాల ాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తెలంగాణలోని మహబూబ్‌నగర్ పట్టణాలకు చోటుదక్కింది. ఆగస్టు 22న ప్రకటించిన జాబితాలో మొత్తం 50 నగరాలు/పట్టణాల్లో విజయవాడ, మహబూబ్‌నగర్ ఉన్నాయి. ఒక్కో నగరానికి అక్కడ నివసిస్తున్న జనాభా ఆధారంగా రూ.50 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తుంది. ఏపీలోని గ్రామాలను టాటా గ్రూప్ దత్తత విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 264 గ్రామాలను టాటా ట్రస్టులు దత్తత తీసుకున్నాయి. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా గ్రూప్‌ల మధ్య విజయవాడలో ఆగస్టు 24న సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టాటా ట్స్ట్ల్ర చైర్మన్ రతన్ టాటా పాల్గొన్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు ట్రస్టులు కృషి చేస్తాయి. వార్తల్లో వ్యక్తులు శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే ఆగస్టు 21న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఆగస్టు 17న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) విజయం సాధించింది. పార్లమెంటులోని 225 స్థానాలకు యూఎన్‌పీ 106 స్థానాలు గెలుచుకుంది. ఈ పార్టీకి పార్లమెంటులో మెజార్టీకి మరో ఏడు స్థానాలు కావాల్సి ఉంది. సిరిసేన నేతృత్వంలోని ఫ్రీడం పార్టీతో కలిసి విక్రమ సింఘే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి సతీమణి సువ్రా ముఖర్జీ మృతి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ (74) న్యూఢిల్లీలో ఆగస్టు 18న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె 1940, సెప్టెంబరు 17న ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌లో జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలను పాటలు,నృత్యరూపకాలుగా ప్రపంచమంతటా ఆమె ప్రచారం చేశారు. ఇందుకోసం ఆమె 1982లో గీతాంజలి ట్రూప్‌ను స్థాపించారు. ఆమె పెయింటింగ్‌లతో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇందిరా గాంధీతో తన అనుబంధంపై ‘చోఖేర్ అలోయి’, చైనా పర్యటనల అనుభవాలపై ‘చెనా అచెనాయ్ చిన్’ అనే పుస్తకాలు రాశారు. గ్రీసు ప్రధాని రాజీనామా గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఆగస్టు 20న తన పదవికి రాజీనామా చేశారు. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంత పార్టీలో వ్యతిరేకత రావడంతో ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు వచ్చే మూడేళ్లకు గ్రీసు 86 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ యూరోజోన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థికం బంధన్ బ్యాంకు ప్రారంభం దేశీయ బ్యాంకింగ్ రంగంలో కోల్‌కతాలో మరో పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకు ‘బంధన్’ ఆగస్టు 23న ప్రారంభమమైంది. దీన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో తొలివిడతగా 501 శాఖలు, 2,022 సర్వీస్ సెంటర్లు, 50 ఏటీఎంలతో కార్యకలాపాలను ప్రారంభించినట్లు బంధన్ బ్యాంకు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 27 రాష్ట్రాల్లో మొత్తం 632 శాఖలు, 250 ఏటీఎంలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా తమ సేవలను కొనసాగిస్తామని తెలిపింది. ‘కస్టమర్ ఫస్ట్’ తమ వ్యాపార సిద్ధాంతమని బ్యాంకు చీఫ్ చంద్రశేఖర ఘోష్ తెలిపారు. నల్లధనంపై సెబీ యుద్ధం పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకుంటున్న 59 సంస్థలపై మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు ప్రత్యక్షంగా/పరోక్షంగా స్టాక్ మార్కెట్లో ఎలాంటి కొనుగోలు/అమ్మకం వంటి కార్యకలాపాలు నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిలో హెచ్ఎన్ఐ, శ్రీకమోడిటీస్, మహాకాళేశ్వర్ మైన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. పతనమైన రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్ల పతనం కారణంగా ఆగస్టు 24న రూపాయి విలువ తగ్గింది. డాలర్‌తో పోల్చితే దేశీ కరెన్సీ మారకం విలువ 66 స్థాయి కంటే కిందకు పడిపోయింది. 82 పైసలు క్షీణించి 66.65 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే రూపాయి విలువ ఇంతగా పడిపోవడం ఈ ఏడాదిలోనే ఇది తొలిసారి. ఇది రెండేళ్ల కనిష్టం కూడా. చైనా తమ కరెన్సీని డీవాల్యూ చేయడంతో గత రెండు వారాల్లో ఏకంగా 202 పైసలు పడిపోయింది. జాతీయం బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లోని అరాలో ఆగస్టు 18న జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటికే బీహార్‌లో కేంద్ర నిధులతో కొనసాగుతున్న రూ.40 వేల కోట్ల విలువైన కార్యక్రమాలకు ప్రస్తుత ప్యాకేజీ అదనం. బీహార్‌లోని 21 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 18న వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించింది. దీనివల్ల నూతన తయారీ పరిశ్రమలు, భవనాల ఏర్పాటుకు 15 శాతం ఆదాయపన్ను రాయితీ లభిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆగస్టు 27న జీఎస్ఎల్వీ-డీ6 ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆగస్టు 27న సాయంత్రం 4.52 గంటలకు జీఎస్ఎల్వీ-డీ6 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. జీఎస్ఎల్వీ రాకెట్‌కు అన్ని పరీక్షలు జరిపి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా బోర్డు నిర్వహించింది. ఆగస్టు 26 మధ్యాహ్నం 11.52 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి, 29 గంటల తర్వాత ఆగస్టు 27 సాయంత్రం 4.52కు ప్రయోగం నిర్వహించాలని నిర్ణయించారు. క్రీడలు యు ముంబాకు ప్రో కబడ్డీ ట్రోఫీ ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను యు ముంబా గెలుచుకుంది. ముంబైలో ఆగస్టు 23న జరిగిన ఫైనల్లో బెంగళూరు బుల్స్‌ను యు ముంబా ఓడించింది. టైటిల్ గెలిచిన యు ముంబా జట్టుకు రూ.కోటి, బెంగళూరుకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీగా సందీప్ (టైటన్స్), రైడర్ ఆఫ్ ది టోర్నీగా కషిలింగ్ (ఢిల్లీ), డిఫెండర్ ఆఫ్ ది టోర్నీగా రవీందర్ (ఢిల్లీ), ఆల్‌రౌండర్ ఆఫ్ ది టోర్నీగా మంజీత్ చిల్లర్ (బెంగళూరు) నిలిచారు. హామిల్టన్‌కు బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 23న జరిగిన రేసులో హామిల్టన్ టైటిల్ సాధించగా, రోస్‌బర్గ్, గ్రోస్యెన్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. ఉసేన్ బోల్ట్‌కు 100 మీటర్ల టైటిల్ 2015 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జమైకాకు చెందిన స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచాడు. బీజింగ్‌లో ఆగస్టు 23న జరిగిన 100 మీటర్ల పరుగులో బోల్ట్ 9.79 సెకన్లలో రేసును ముగించి మొదటి స్థానం సాధించాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ 9.80 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు. బోల్ట్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. మహిళల 100 మీటర్ల రేసులో జమైకాకు చెందిన షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ రేసులో డాఫ్నీ చిపర్స్(నెదర్లాండ్స్) రజతం, టోరీ (అమెరికా) కాంస్యం సాధించారు. ఫెదరర్‌కు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్ సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. సిన్సినాటి (అమెరికా)లో ఆగస్టు 24న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఫెదరర్ ఓడించాడు. ఈ టైటిల్ ఫెదరర్ గెలుచుకోవడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. ఫైనల్లో సిమోనా హాలెప్‌ను సెరెనా ఓడించింది. క్రికెట్ నుంచి విరమించుకున్న సంగక్కర శ్రీలంక క్రికెట్‌కు 15 ఏళ్లుగా సేవలందించిన సీనియర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర(37) ఆట నుంచి విరమించుకున్నాడు. ఆగస్టు 24న కొలంబోలో భారత్‌తో ముగిసిన రెండో టెస్టు నుంచి ఆయన తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆయనకు తోటి ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తదితరులు పాల్గొన్నారు. 134 టెస్టులు ఆడిన సంగక్కర 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. 404 వన్డేల్లో 14,234 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. -
ప్రొ కబడ్డీ లీగ్: ఫైనల్లో యు ముంబా
ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా యు ముంబా ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి జరిగిన రెండో సెమీస్ లో పట్నా పైరేట్స్‌పై 35-18 తేడాతో యు ముంబా విజయం సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి 22-6తో పట్నాపై యు ముంబా ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలోనూ అదే జోరును కొనసాగించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఫైనల్లో బెంగళూరు బుల్స్ తో అమితుమీ తేల్చుకోనుంది. తొలి సెమీస్ లో తెలుగు టైటాన్స్ పై 39-38 తేడాతో బెంగళూరు బుల్స్ గెలిచిన విషయం విదితమే. లీగ్ మ్యాచ్ ల్లో అగ్రస్థానాన నిలిచిన యు ముంబా ఫైనల్ కూ దూసుకెళ్లింది.