PKL 11: యూ ముంబా మెరుపు విజయం.. మాజీ చాంపియన్‌కు షాక్‌ | PKL 11 Hyderabad: U Mumba Beat Jaipur Pink Panthers With 39 37 In Thriller | Sakshi
Sakshi News home page

PKL 11: యూ ముంబా మెరుపు విజయం.. మాజీ చాంపియన్‌కు షాక్‌

Published Fri, Nov 1 2024 6:25 PM | Last Updated on Fri, Nov 1 2024 7:18 PM

PKL 11 Hyderabad: U Mumba Beat Jaipur Pink Panthers With 39 37 In Thriller

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ పదకొండో సీజన్‌లో యూ ముంబా రెండో విజయం నమోదు చేసింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై 39-37తో గెలుపొందింది.  గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో గురువారం మాజీ చాంపియన్లు యు ముంబా- జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడ్డాయి.

ఈ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూ ముంబా రెయిడర్‌ అజిత్‌ చౌహాన్‌ (14 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో అదరగొట్టాడు. మరోవైపు.. పింక్‌ పాంథర్స్‌ తరఫున నీరజ్‌ నర్వాల్‌ (12 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆట తొలి పది నిమిషాల వరకు ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.

ఫస్టాఫ్‌ చివర్లో యూ ముంబా ముందంజ
ఇటు జైపూర్‌, అటు యూ ముంబా రెయిడర్లు, డిఫెండర్లు వరుసగా పాయింట్లు సాధించారు. ఆట మొదలైన పది నిమిషాల అనంతరం 9-9తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అయితే, ఫస్టాఫ్‌ చివర్లో యూ ముంబా ముందంజ వేసింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఆలౌట్‌ చేసి విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

ప్రథమార్థం ముగిసే సరికి యూ ముంబా 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా.. రెయిడింగ్‌లో ఇరు జట్లు పదేసి పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్‌లో యూ ముంబా ఐదు, జైపూర్‌ ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. కానీ అదనపు పాయింట్లు యూ ముంబాను ఆధిక్యంలో నిలబెట్టాయి.

ద్వితీయార్థం మరింత ఉత్కంఠ
ఇక ఇరుజట్ల మధ్య ద్వితీయార్థం ఆట మరింత ఉత్కంఠ రేపింది. యూ ముంబా ముందంజలో కొనసాగినా.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పట్టు వదల్లేదు. ఆఖరు వరకు యూ ముంబాను తిప్పలు పెట్టింది. మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉండగా నీరజ్‌ నర్వాల్‌ సూపర్‌ రెయిడ్‌తో 32-32తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌.. యూ ముంబా స్కోరును సమం చేసింది.

కానీ ఆ తర్వాతి రెయిడ్‌లోనే రోహిత్‌ రాఘవ్‌ సూపర్‌ రెయిడ్‌తో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో యూ ముంబా మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు వరకు ఆధిక్యం నిలుపుకున్న యూ ముంబా మెరుపు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన జైపూర్‌కు ఇది రెండో ఓటమి.

చదవండి: హర్యానా స్టీలర్స్‌ హ్యాట్రిక్‌ విజయం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement