
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో పుణేరి పల్టన్ తొలి ‘టై’ నమోదు చేసింది. యు ముంబా, పుణేరి పల్టన్ జట్ల మధ్య గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ 32–32 పాయింట్లతో ‘టై’గా ముగిసింది.
యు ముంబా ప్లేయర్ గుమన్ సింగ్ 15 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.