సమంగా ముగిసిన ఢిల్లీ–యూపీ; జైపూర్–యు ముంబా మ్యాచ్‌లు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 32–32 పాయింట్లతో... జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ 22–22 పాయింట్లతో ‘టై’ అయ్యాయి. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, నవీన్ 8 పాయింట్లతో రాణించారు.
యోధాస్ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు, భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించారు. మాŠయ్చ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రక్షణాత్మక ధోరణిలో ముందుకు సాగిన ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్‌లో పింక్ పాంథర్స్, యు ముంబా జట్లు తుదికంటా పోరాడాయి.
జైపూర్ తరఫున రెజా అత్యధికంగా 6 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున సోమ్‌బీర్ 7 పాయింట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు డిఫెన్స్‌లో దుమ్మురేపాయి. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లాడిన యు ముంబా 54 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది.
పింక్ పాంథర్స్ 49 పాయింట్లతోఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment