TiE
-
పట్నా, గుజరాత్ మ్యాచ్ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో భాగంగా శనివారం పట్నా పైరెట్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 10 పాయింట్లతో సత్తా చాటగా... సుధాకర్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 9 పాయింట్లు సాధించగా... గుమన్ సింగ్, జితేందర్ యాదవ్ చెరో 8 పాయింట్లతో మెరిశారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పట్నా 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... గుజరాత్ 18 రెయిడ్ పాయింట్లకు పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో వెనుకబడిన పట్నా 11 పాయింట్లతో సరిపెట్టుకోగా... గుజరాత్ 20 ట్యాకింగ్స్‌తో సత్తాచాటింది. ఇరు జట్ల మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరు చివరకు సమంగా ముగిసింది. పట్నా జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో పాటు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... గుజరాత్ 21 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 13 పరాజయాలు, 3 ‘టై’లతో 38 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 33–31 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అశు మాలిక్ 12 పాయింట్లతో రాణించగా... జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లతో పోరాడాడు. ఢిల్లీ, జైపూర్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
రెండు మ్యాచ్‌లూ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 32–32 పాయింట్లతో... జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ 22–22 పాయింట్లతో ‘టై’ అయ్యాయి. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, నవీన్ 8 పాయింట్లతో రాణించారు. యోధాస్ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు, భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించారు. మాŠయ్చ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రక్షణాత్మక ధోరణిలో ముందుకు సాగిన ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మరో మ్యాచ్‌లో పింక్ పాంథర్స్, యు ముంబా జట్లు తుదికంటా పోరాడాయి. జైపూర్ తరఫున రెజా అత్యధికంగా 6 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున సోమ్‌బీర్ 7 పాయింట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు డిఫెన్స్‌లో దుమ్మురేపాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లాడిన యు ముంబా 54 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. పింక్ పాంథర్స్ 49 పాయింట్లతోఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
ఢిల్లీ, పుణేరి హోరాహోరీ
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హోరాహోరీ సమరాలు కొనసాగుతున్నాయి. మంగళవారం దబంగ్ ఢిల్లీ–పుణేరి పల్టన్ మధ్య జరిగిన పోరు 38–38 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ తరఫున అషు మాలిక్ 17 పాయింట్లతో సత్తాచాటగా... మోహిత్ దేశ్వాల్ (6 పాయింట్లు) అతడికి సహకరించాడు. ఇతర ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తన సూపర్ రెయిడ్లతో అషు పాయింట్లు సాధించడంతో ఢిల్లీ జట్టు పోటీలో నిలిచింది. మరోవైపు పల్టన్ తరఫున ఆకాశ్ షిండే (8 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు), అమన్ (6 పాయింట్లు) రాణించారు. ఓవరాల్‌గా దబంగ్ ఢిల్లీ మ్యాచ్‌లో 24 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పుణేరి పల్టన్ 18 పాయింట్లకే పరిమితమైంది. ట్యాకిలింగ్‌లో ఢిల్లీ 9 పాయింట్లు సాధిస్తే... పల్టన్ 13 పాయింట్లతో సత్తాచాటింది. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... దంబగ్ ఢిల్లీ జట్టుకు ఒక సూపర్ రెయిడ్ పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో తాజా సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 5 విజయలు, 2 పరాజయాలు, 2 ‘టై’లతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ప్లేస్‌లో కొనసాగుతోంది. 10 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి పట్టిక ఐదో స్థానంలో ఉంది. అర్జున్ అదరహో..పీకేఎల్‌లో భాగంగా మంగళవారమే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఘనవిజయం సాధించింది. షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 39–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో దుమ్మురేపాడు. రెండుసార్లు పీకేఎల్ టైటిల్ సాధించిన జైపూర్ జట్టను అర్జున్ ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టాడు. రెయిండింగ్‌లో అర్జున్ దూకుడు కనబరిస్తే... డిఫెన్స్‌లో లక్కీ శర్మ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ నర్వాల్ గైర్హాజరీలో బరిలోకి దిగిన బెంగళూరు బుల్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రధాన ఆటగాడు దూరం కావడంతో... ఆ జట్టు పింక్ పాంథర్స్‌కు పోటీనివ్వలేకపోయింది. అజింక్యా పవార్ (9 పాయింట్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పింక్ పాంథర్స్ 19 పాయింట్లు సాధించింది. ట్యాకిలింగ్‌లో బుల్స్ 8 పాయింట్లకు పరిమితం కాగా... జైపూర్ 14 పాయింట్లతో సత్తాచాటింది. జైపూర్ పింక్ పాంథర్స్‌కు 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం కాగా... 3 పరాజయాలు, ఒక ‘టై’తో 25 పాయింట్లు సాధించి పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన తమ్మిది మ్యాచ్‌ల్లో ఏడో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్ పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. -
హారిస్-ట్రంప్ హోరాహోరీ.. అదే జరిగితే..
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు. 2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహోర్ ఎన్నో విలక్షణమైన సినిమాలను నిర్మించి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా తానెంటో చూపించడమే గాక బుల్లి తెరపై కూడా వ్యాఖ్యతగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడూ లగ్జరీ ఫ్యాషన్ ట్రెండ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఉండే ఆయన ఆహార్యం ఫ్యాషన్‌కే ఐకానిక్‌గా నిలిచేలా ఉంటుంది. ఎప్పుడు అత్యంత లగ్జరియస్ బ్రాండ్ వేర్లతో కనిపించే కరణ్ తాజాగా ఈసారి అత్యంత ఖరీదైన టైతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సాధారణం 'టై' అత్యంత ఖరీదైనదైన వేలకు మించి పలకదు ధర. కానీ కరణ్ ధరించిన 'టై' అత్యంత విలక్షణమైనది, అత్యంత ఖరీదైనది కూడా. ఇటీవల ముంబైలో జరగిన జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్లో షియపరెల్లి బ్రాండ్‌కి చెందిన లేత గోధమ కలర్ కోట్తో వెరైటీ టైతో కనిపించారు.ఈ 'టై'ని హెయిర్‌తో రూపొందిచడం విశేషం. ఆ కోట్కి తగ్గ కలర్లో ఇంగీష్ వాళ జట్టుమాదిరిగా ఉంటుంది. చెప్పాలంటే ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ల దృష్టి అంతా ఆ 'టై' పైనే ఉంది. ఇంతకీ అదెంత ఖరీదు తెలిస్తే కంగుతింటారు. దీని ధర సుమారు రూ. 1.93 లక్షలు.. అంటే దగ్గర దగ్గర రెండు లక్షలు పలుకుతోంది.(చదవండి: 'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!) -
పురుషుల జట్టుకు అన్నీ ‘డ్రా’లే
బుడాపెస్ట్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు అజేయంగా సాగుతోంది. శుక్రవారం ఉజ్బెకిస్తాన్ జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో టై చేసుకుంది. ఈ పోరులో బరిలోకి దిగిన నలుగురు ఆటగాళ్లు కూడా తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో వరుసగా ఎదురులేని విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌ను నిలువరించిన జట్టుగా ఉజ్బెకిస్తాన్ నిలిచింది. దొమ్మరాజు గుకేశ్... నొదిర్బెక్ అబ్దుసత్తొరొవ్తో, ప్రజ్ఞానంద.... జవొఖిర్ సిందరొవ్తో, విదిత్ గుజరాతి... జకొంగిర్ వఖిదొవ్తో, ఇరిగేశి అర్జున్... షంసిద్దీన్తో తమ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి భారత్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మహిళల విభాగంలో తొమ్మిదో రౌండ్లో భారత బృందం 2–2తో అమెరికా జట్టుతో టై చేసుకుంది. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత 2–1తో అమెరికా ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో వంతిక అగర్వాల్ వేసిన ఎత్తులు భారత్‌ను పైఎత్తుకు చేర్చింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో ఆమె ఇరినా క్రుశ్ను ఓడించి 2–2తో స్కోరును సమం భారత మహిళల జట్టు ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు ఎనిమిదో రౌండ్లో అమ్మాయిల జట్టు పోలండ్ చేతిలో ఓడింది. దీంతో ఏడురౌండ్ల దాకా అజేయంగా నిలిచిన భారత మహిళల జట్టుకు ఈ టోరీ్నలో తొలిసారి ఓటమి ఎదురైంది. ఉత్తమ ఆటగాళ్లుగా కార్ల్సన్, పోల్గర్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తమ శతాబ్ది ఉత్సవాలను బుడాపెస్ట్‌లోనే ఘనంగా నిర్వహించింది. ‘ఫిడే 100’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఒలింపియాడ్‌లో ఎనిమిదో రౌండ్ పోటీలు ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. తమ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని మొత్తం 18 కేటగిరీల్లో ‘ఫిడే’ అవార్డులు అందజేసింది. శతాబ్ది అత్యుత్తమ ఆటగాళ్లుగా పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్, మహిళల విభాగంలో జూడిత్ పోల్గర్ ఎంపికయ్యారు. కార్ల్సన్ క్లాసిక్ విభాగంలో ఐదు సార్లు, ర్యాపిడ్ విభాగంలో ఐదు సార్లు, బ్లిట్జ్ విభాగంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యుత్తమ రేటింగ్ (2882) సాధించిన ఘనత కార్ల్సన్ సొంతం. మహిళల చెస్‌కు సుదీర్ఘ కాలం చిరునామాగా నిలిచిన పోల్గర్ 15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ అయింది. 12 ఏళ్లకే టాప్–100 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పోల్గర్ 2700 రేటింగ్ దాటిన ఏకైక మహిళ. -
విశాఖ: వందేళ్ల చరిత్ర సాక్ష్యానికి రక్షాబంధన్ (ఫొటోలు)
-
శ్రీలంక 230... భారత్ 230
కొలంబో: శ్రీలంక చేసిన స్కోరు 230/8. ఇదేమంత పెద్ద లక్ష్యమేం కాదు... సులువైందే కానీ కష్టం, అసాధ్యం కానేకాదు. కానీ పిచ్ స్పిన్‌కు దాసోహమైంది. ఇది ఆతిథ్య బౌలర్లకు కలిసొచ్చింది. టి20 సిరీస్‌లో తేలిపోయిన లంకేయులు... తొలి వన్డేలో మాత్రం పట్టు సడలించకుండా పోరాడారు. ఫలితం ‘టై’ అయినప్పటికీ రోహిత్, కోహ్లిలు ఉన్న పటిష్ట జట్టును శ్రీలంక సమష్టిగా నిలువరించింది. దీంతో భారత్ 11 బంతులున్నా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దునిత్ వెలలగే (65 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), పతున్ నిసాంక (75 బంతుల్లో 56; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్, ఓపెనర్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 58; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (57 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 31; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఆదుకున్న వెలలగే ఆరంభంలోనే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ నిసాంక, కుశాల్ మెండిస్ (14) కుదురుగా ఆడటంతో రెండో వికెట్‌కు 39 పరుగులు జతయ్యాయి. తర్వాత స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. కుశాల్, సమరవిక్రమ (8) వికెట్లను పారేసుకోవడంతో 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత కెప్టెన్ అసలంక (14), నిసాంక వికెట్లను కాపాడుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. 91 పరుగుల వద్ద అసలంక, 67 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాక నిసాంక కూడా అవుటవడంతో లంక జట్టు 101 పరుగుల వద్ద సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లియనాగే (26 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), దునిత్ వెలలగే వికెట్ల పతనానికి కాసేపు బ్రేక్ వేయడంతో ఆరో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం జతయ్యింది. మరింత బలపడకముందే ఈ జోడీని అక్షర్ విడగొట్టాడు. హసరంగ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధనంజయ (17)లతో కలిసి దునిత్ జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. రాణించిన రోహిత్ సులువైన లక్ష్యానికి సరైన శుభారంభాన్ని ఓపెనర్లు రోహిత్, శుబ్‌మన్ గిల్ (16) ఇచ్చారు. కెపె్టన్ రోహిత్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగాడు. 5.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. పదో ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ 71/0 స్కోరు చేసింది. తర్వాత 11వ ఓవర్ నుంచి లంక బౌలర్ల ప్రతాపం మొదలైంది. పరుగుల రాక గగనమైంది. ఈ ఐదు ఓవర్లలో కేవలం 15 పరుగులే చేసిన భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తదనంతరం సుందర్ (5) అవుటయ్యాడు. 12 పరుగుల వ్యవధిలోనే ఈ మూడు వికెట్లు కూలడంతో భారత్ 87/3 స్కోరు చేసింది. ఈ దశలో కోహ్లి (24; 2 ఫోర్లు), అయ్యర్ (23; 4 ఫోర్లు) నింపాదిగా ఆడి జట్టు స్కోరును వంద దాటించారు. నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాక కోహ్లిని హసరంగా ఎల్బీగా పంపగా, కాసేపటికే, బుల్లెట్‌లాంటి బంతితో ఫెర్నాండో అయ్యర్‌ను బౌల్డ్ చేయడంతో 132/5 స్కోరు వద్ద భారత్ కష్టాల్లో పడింది. తర్వాత రాహుల్, అక్షర్ మెరుగ్గా ఆడినా, దూబే (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) సిక్స్‌లు, ఫోర్‌తో గెలుపు మెట్టుపై నిలబెట్టినా... కెప్టెన్ అసలంక వేసిన 48వ ఓవర్లో దూబే, అర్‡్షదీప్ అవుటవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.2 భారత్, శ్రీలంక జట్ల మధ్య ‘టై’ అయిన మ్యాచ్‌లు. ఈ రెండు జట్ల మధ్య 2012లో హోబర్ట్ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నీ మ్యాచ్ తొలిసారి ‘టై’గా ముగిసింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 169 వన్డేల్లో తలపడ్డాయి. 99 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 57 మ్యాచ్‌ల్లో లంక గెలిచింది. 11 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సూపర్ ఓవర్ ఉండదా? ఐసీసీ నిబంధనల ప్రకారం ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో సూపర్ ఓవర్‌కు అవకాశం లేదు. రెండు కంటే ఎక్కువ జట్లు అనగా, ఆసియా కప్, ముక్కోణపు సిరీస్, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఫలితం కోసం ‘సూపర్ ఓవర్’ను అనుమతిస్తారు.స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 56; అవిష్క (సి) అర్‡్షదీప్ (బి) సిరాజ్ 1; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దూబే 14; సమరవిక్రమ (సి) గిల్ (బి) అక్షర్ 8; అసలంక (సి) రోహిత్ (బి) కుల్దీప్ 14; జనిత్ (సి) రోహిత్ (బి) అక్షర్ 20; వెలలగే (నాటౌట్) 67; హసరంగ (సి) అక్షర్ (బి) అర్‡్షదీప్ 24; ధనంజయ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 17; షిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–7, 2–46, 3–60, 4–91, 5–101, 6–142, 7–178, 8–224. బౌలింగ్: సిరాజ్ 8–2–36–1, అర్‡్షదీప్ 8–0–47–2, అక్షర్ 10–0–33–2, దూబే 4–0–19–1, కుల్దీప్ 10–0–33–1, సుందర్ 9–1–46–1, గిల్ 1–0–14–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 58; గిల్ (సి) కుశాల్ మెండిస్ (బి) వెలలగే 16; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) హసరంగ 24; సుందర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ధనంజయ 5; అయ్యర్ (బి) అసిత ఫెర్నాండో 23; రాహుల్ (సి) వెలలగే (బి) హసరంగ 31; అక్షర్ (సి) కుశాల్ మెండిస్ (బి) అసలంక 33; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 25; కుల్దీప్ (బి) హసరంగ 2; సిరాజ్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1–75, 2–80, 3–87, 4–130, 5–132, 6–189, 7–197, 8–211, 9–230, 10–230. బౌలింగ్: అసిత ఫెర్నాండో 6–1–34–1, షిరాజ్ 4–0–25–0, వెలలగే 9–1–39–2, ధనంజయ 10–0–40–1, హసరంగ 10–0–58–3, అసలంక 8.5–0–30–3. -
‘టై’తో టైటాన్స్ ముగింపు
పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నిర్ణీత 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ ఆడతాయి. -
జీ20 సమ్మిట్: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్..
ఢిల్లీ: జీ20 సమావేశాలకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన భార్య అక్షతా మూర్తి మధ్య ప్రేమానురాగాలకు సంబందించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌కు స్వయంగా అక్షతా మూర్తి టై కట్టారు. ఈ దృశ్యాలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. జీ20 సమ్మిట్ కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి దిగారు. విమానం నుంచి కిందకు దిగే క్రమంలో అక్షతా మూర్తి తన భర్త రిషి సునాక్‌కు టై కట్టారు. సునాక్ నల్లని సూటు ధరించి ఆరెంజ్ కలర్లో టై ధరించారు. అక్షతా మూర్తి తెల్లని షర్ట్‌తో కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) రిషి సునాక్‌కు అక్షతా మూర్తి టై కట్టిన దృశ్యాలపై నెటిజన్లు స్పందిస్తూ.. భార్యభర్తల మధ్య ప్రేమకు నిదర్శనమని కామెంట్లు పెట్టారు. రిషి సునాక్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు తెలుపుతున్నాయని మరికొందరు స్పందించారు. బ్యూటిఫుల్ పిక్చర్ అంటూ కామెంట్ చేశారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూమార్తే. కాగా.. రిషి సునాక్, అక్షతామూర్తిలకు 2009లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. భారత్‌కు చేరుకున్న రిషి సునాక్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలికారు. భారత్‌కు రావడం తనకు చాలా ప్రత్యేకమని రిషి సునాక్ తెలిపారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే.. -
తాలిబాన్ సంచలన నిర్ణయం.. వాటిపై నిషేధం, అలా జరిగితే ఇదే మొదటి సారి
2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆ దేశ ప్రజలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అందులో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి, యూనివర్సిటీ విద్యను అభ్యసించడాన్ని నిషేధించడంతోపాటు పాఠశాల విద్యపైనా అనేక ఆంక్షలు విధించారు. చివరికి మహిళలు బ్యూటీ పార్లర్లను నిషేధించారు. తాజాగా పురుషుల దుస్తులపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్దమయ్యారు తాలిబన్లు. వివరాల్లోకి వెళితే.. పురుషులు ధరించే నెక్టైలపై నిషేధం విధించేందుకు తాలిబన్లు సిద్ధమయ్యారు. నెక్‌టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. ఈ విషయాన్ని ‘ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్’ డైరెక్టర్ మొహమ్మద్ హషిమ్ షాహీద్ వ్రార్ వెల్లడించారు. అఫ్గాన్‌లో మతపరమైన విధానాలను నిర్ణయించే స్వతంత్ర సంస్థ ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్. ఆయన దీనిపై మాట్లాడుతూ.. "కొన్నిసార్లు, నేను ఆసుపత్రులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఆఫ్ఘన్ ముస్లిం ఇంజనీర్ లేదా డాక్టర్ నెక్‌టైని ఉపయోగించడం చూశాను. నెక్టైకి మూలం ఏంటి.. క్రిస్టియన్ శిలువను పోలి ఉందని, వీటిని నిషేధించాల్సి ఉందని" అని పేర్కొన్నాడు. నెక్టీలపై నిషేధం విధించినట్లయితే, తాలిబాన్ అధికారులు పురుషుల దుస్తులపై ఆంక్షలు విధించడం ఇదే మొడటి సారి అవుతుంది. Video: Mohammad Hashim Shaheed Wror, General Director of the Invitation and Guidance Directorate (an independent body that determines religious policies within the interim govt), said that the necktie originated from the Christian cross and that it is “ordered in Shariah that you… pic.twitter.com/UMHesWX6TM — TOLOnews (@TOLOnews) July 26, 2023 చదవండి US Woman Got 100 Amazon Orders: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
డేవిస్ కప్‌లో నార్వేతో భారత్ పోరు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1లో భారత్ తలపడే ప్రత్యర్థి ఖరారైంది. ఈ పోరులో నార్వేతో భారత ఢీకొంటుంది. గురువారం ఈ ‘డ్రా’ విడుదల చేయగా, నార్వే వేదికగానే భారత్ తమ ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్ 16–18 మధ్య డేవిస్ కప్ మ్యాచ్ జరుగుతుంది. అయితే దాదాపు అదే తేదీల్లో ఆసియా క్రీడలు కూడా జరగనుండటంతో జట్టు ఎంపిక భారత టెన్నిస్ సంఘానికి (ఏఐటీఏ) ఇబ్బందిగా మారనుంది. ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 10–14 మధ్య టెన్నిస్ మ్యాచ్ జరగనుండగా...తక్కువ వ్యవధిలో నార్వే చేరుకొని భారత్ ఆడటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో తేదీల్లో మార్పు చేసే విషయంపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు ఏఐటీఏ విజ్ఞప్తి చేయనుంది. డేవిస్ కప్ చరిత్రలో భారత్, నార్వే ఎప్పుడూ ప్రత్యర్థులుగా తలపడలేదు. ఆ జట్టులో వరల్డ్ నంబర్ 8 కాస్పర్ రూడ్ రూపంలో అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నాడు. -
‘టై’తో మొదలుపెట్టిన టైటాన్స్
బెంగళూరు: తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ‘టై’తో ఆరంభించింది. బుధవారం టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 స్కోరుతో సమంగా ముగిసింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ 11 పాయింట్లు సాధించగా, డిఫెండర్లలో సందీప్ 5, రుతురాజ్, అరుణ్ మూడేసి పాయింట్లు తెచ్చి పెట్టారు. మ్యాచ్‌లో తలైవాస్ రైడర్ మన్జీత్ సత్తా చాటాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 3 బోనస్ పాయింట్లు సహా 12 పాయింట్లు స్కోరు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే స్టార్ రైడర్ సిద్ధార్థ్, రజ్నీశ్ జట్టుకు వరుస పాయింట్లు సాధించిపెట్టారు. డిఫెండర్ సందీప్ కండోలా కూడా ప్రత్యర్థి రైడర్లను చేజిక్కించుకోవడంతో టైటాన్స్ జట్టు 8 నిమిషాల్లోనే తలైవాస్‌ను ఆలౌట్ చేసింది. అనంతరం తలైవాస్ రైడర్ మన్జీత్ దీటుగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మన్జీత్ చేసిన సూపర్ రైడ్ ఏకంగా 3 పాయింట్లు తెచ్చిపెట్టడంతో నిమిషాల వ్యవధిలో ఆధిక్యం మారిపోయింది. తొలి అర్ధ భాగం 23–21 వద్ద ముగిసింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు శ్రమించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఒక దశలో ఇరు జట్ల రైడర్లు విఫలమైతే డిఫెండర్ల హవా కొనసాగింది. తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేయడం ద్వారా తలైవాస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే సిద్ధార్ధ్ దేశాయ్ కీలక దశలో రైడింగ్‌కు వెళ్లినప్పుడల్లా పాయింట్లు సాధించడంతో టైటాన్స్ పుంజుకుంది. ఇంకో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా తన రైడింగ్ పాయింట్‌తో తమిళ్ తలైవాస్ రెండోసారి ఆలౌటైంది. అక్కడే స్కోరు సమమైంది. టాకిల్‌తో సందీప్, రైడింగ్‌తో సిద్ధార్థ్ తెలుగు జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఇతర మ్యాచ్‌లలో యు ముంబా 46–30తో బెంగళూరు బుల్స్‌పై...బెంగాల్ వారియర్స్ 38–33తో యూపీ యోధపై గెలిచింది. సిద్ధార్థ్ దేశాయ్ -
మహిళల క్రూరత్వం, రోదిస్తున్నా వినకుండా..
చండీగడ్: అక్కడ ఏం జరిగిందో తెలీదగానీ ఓ మూగజీవి పై మహిళలు వారి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. చివరికి దాని ఆర్తనాదాలు కూడా వారి చెవినపడలేదు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్యాలా కి చెందిని ఇద్దరు మహిళలు క్రూరంగా ఓ కుక్కని వారి స్కూటీ వెనకాల కట్టి ఈడ్చుకెళ్లారు. ఆ జంతువు అరుస్తున్న కనీసం కనికరం కూడా లేకుండా దానీ అలా రోడ్డుపై కొంత దూరం లాక్కెళ్లి విడిచి పెట్టారు. దీని ఫలితంగా కుక్క తీవ్రంగా గాయపడింది. కాగా సమీపంలో కొందరు ఆ కుక్క దీనావస్థని చూసి వైద్యం చేయగా అప్పటికే తీవ్రంగా గాయలపాలవడంతో ఆ కుక్క మృతి చెందింది. ఈ ఘటన జూన్ 20న జరగగా, జున్ 24 మరణించింది. ఇదంతా పరిసరాల్లోని సీసీటీవిలో రికార్డ్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా తాజాగా ఈ వీడియో వైరల్ అయ్యింది. మరో వైపు జంతు ప్రేమికులు ఆ మహిళల క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు కూడా స్పందించి వారిపై కేసు నమోదు చేశారు. చదవండి: దారుణం: నడిరోడ్డుపైనే ప్రాపర్టీ డీలర్‌ను.. -
వారియర్స్‌తో ‘టై’టాన్స్
అహ్మదాబాద్: గుజరాత్‌పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్‌కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ దేశాయ్ తన రైడ్‌తో పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్‌ను పట్టేయాలని డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్‌ల రైడింగ్ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చిన వారియర్స్ టైటాన్స్‌ను ఆలౌట్ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్ స్కోర్‌ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. యూపీ రైడర్ పవన్ శెరావత్ అటు రైడింగ్‌లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
టైటాన్స్ నాన్ టెక్నికల్ టై
ముంబై: తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. సాధారణంగా మ్యాచ్ ముగిశాక రిఫరీ వేసే లాంగ్ విజిల్ కంటే ముందుగా కబడ్డీ కోర్టు వెలుపల ఉన్న సహచర ఆటగాళ్లు గెలిచామనే ఆనందంతో కోర్టులోకి దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రిఫరీలు యూపీ యోధకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ కేటాయించడంతో... టైటాన్స్‌కు ఈ సీజన్లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. ముంబై వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, యూపీ యోధ జట్లు నిర్ణీత సమయానికి 20–20తో సమంగా నిలిచాయి. దీంతో ప్రొ కబడ్డీ సీజన్ – 7లో తొలి ‘టై’ నమోదైంది. టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లతో) ఫర్వాలేదనిపించాడు. చేజేతులా... ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో బరిలో దిగిన టైటాన్స్ మొదట ఆధిక్యాన్ని ఆ తర్వాత గెలుపుని చేజేతులా జారవిడుచుకుంది. మొదట 7–3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలసత్వం ప్రదర్శించడంతో యూపీ వరుస పాయింట్లను సాధించి స్కోర్‌ను సమం చేసింది. మళ్లీ చివరి నిమిషంలో అదే అలసత్వం ప్రదర్శించి గెలుపును వదులుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో కూతకెళ్లిన టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్ సాధించి జట్టును 20–19తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో గెలిచామనే ఆనందంలో టైటాన్స్ జట్టు సభ్యులు రిఫరీ లాంగ్ విజిల్ వేశాడా..? లేదా... అనేది చూసుకోకుండా కోర్టులోకి దూసుకురావడంతో రిఫరీలు యూపీ జట్టుకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్‌ను కేటాయించారు. దీనిపై టైటాన్స్ సమీక్షకు వెళ్లగా... టీవీ అంపైర్ రిఫరీల నిర్ణయానికే కట్టుబడటంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త టైగా ముగిసింది. ఆఖరి పంచ్ ముంబైదే.. ముంబై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆఖరి పంచ్ ముంబై కొట్టింది. గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై 20–32తో ముంబై గెలిచి వరుస పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టింది. ముంబై ఆటగాళ్లు సురీందర్ సింగ్ 9 పాయింట్లతో, అభిషేక్ సింగ్ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
బ్రాడ్‌మన్ తర్వాత కోహ్లినే!
రెండో వన్డే ‘టై’గా ముగియడం నా దృష్టిలో సరైన ఫలితమే. ఎందుకంటే ఇరు జట్ల బౌలర్లు కూడా తమ జట్టును గెలిపించే స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. కెప్టెన్లు ఇద్దరూ తమ బౌలింగ్ బలగాల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా టి20 క్రికెట్ ప్రభావం వల్ల వన్డేల్లో కూడా జోరు పెరిగింది. ఒక జట్టు 300 పరుగుల స్కోరు సాధించడం గతంలోలాగా అరుదుగా కాకుండా ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. అతని మాటలు ఇప్పుడు నిజంలాగే అనిపిస్తున్నాయి. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. కోహ్లి నిలకడ గురించి చెప్పాలంటే అద్భుతం అనే మాట కూడా సరిపోదు. అయితే దీనికి మించి అతను పరిస్థితులను అర్థం చేసుకుంటూ జట్టుకు ఏది అవసరమో దాని ప్రకారం తన ఆటను మార్చుకుంటూ ఆడటమే మరింత పెద్ద విశేషం. అతను బ్యాటింగ్‌కు వెళుతున్నాడంటే చాలు కచ్చితంగా సెంచరీ సాధిస్తాడనే విషయంలో కించిత్ కూడా సందేహం కనిపించడం లేదు. గతంలో ఇలాంటి స్థితి ఒక్క సర్ డాన్ బ్రాడ్‌మన్ విషయంలోనే కనిపించేది. నాడు బ్రాడ్‌మన్ మైదానంలోకి దిగుతుంటే చూడచక్కగా స్టైల్‌గా కనిపించేది. ఇప్పుడు కోహ్లి తనదైన శైలిలో గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో వెళుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా చేయడం లేదు. అయితే భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌లో మలుపులు సాగుతున్నప్పుడు మాత్రం తన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ కోహ్లి మామూలు మానవుడిలా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్‌ను ఈసారి 300లోపు కట్టడి చేసే బౌలింగ్ బలగం భారత్‌కు ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గత మ్యాచ్లకంటే ఈసారి మరింత మెరుగ్గా ఫీల్డింగ్ చేయాలని కూడా జట్టు భావిస్తోంది. రనౌట్‌కు అవకాశం లేకున్నా అనవసరంగా స్టంప్స్‌పైకి బంతిని విసిరే అలవాటుపై కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సి ఉంది. -
విశాఖ సమరం సమం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత్‌లో టి20 ప్రపంచకప్ సెమీఫైనల్. విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక మనదే విజయం అనుకున్నారంతా! కానీ, ఒత్తిడిని తట్టుకుని వెస్టిండీస్ భీకర హిట్టింగ్తో లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ఆనాటి టి20 మ్యాచ్‌ను... వన్డే స్వరూపంలో ఆడిస్తే ఊహకు ఎలా ఉంటుందో అచ్చం అలాగే సాగింది బుధవారం నాటి విశాఖపట్నం మ్యాచ్. కాకపోతే నాడు అలవోక విజయం సాధించిన విండీస్... నేడు త్రుటిలో దానిని చేజార్చుకుని ‘టై’తో సంతృప్తి పడింది. ఛేదనలో తొలుత కొంత తడబడినా... హెట్‌మైర్ మెరుపులు, షై హోప్ నిలకడతో నిలిచిన పర్యాటక జట్టు అందివచ్చిన గెలుపును ఒడిసి పట్టలేకపోయింది. కోహ్లి 10వేల పరుగుల మైలురాయిని దాటిన ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయాన్ని తప్పించుకుంది. సాక్షి, విశాఖపట్నం: పరాజయ పరంపర నుంచి వెస్టిండీస్‌కు ఉపశమనం. అయితే, అది గెలుపుతో మాత్రం కాదు! ‘టై’తో దక్కిన ఊరట. బుధవారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానంలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు పోరాడి ఓటమిని తప్పించుకుంది. శతకాల రారాజు, కెప్టెన్ విరాట్ కోహ్లి (129 బంతుల్లో 157 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) రికార్డుల వేటకు వేదికగా నిలిచిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు (80 బంతుల్లో 73; 8 ఫోర్లు) అర్ధ శతకంతో సారథికి అండగా నిలిచాడు. ఛేదనలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ షై హోప్ (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌కు, యువ హెట్‌మైర్ (64 బంతుల్లో 94; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) విజృంభణ తోడవడంతో వెస్టిండీస్ దీటుగా బదులిచ్చింది. అయితే, చివర్లో తడబడి ఏడు వికెట్లకు 321 పరుగుల వద్ద ఆగిపోయింది. కుల్దీప్ (3/67) మూడు వికెట్లతో రాణించగా... షమీ, ఉమేశ్, చహల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. కెరీర్లో 37వ శతకం చేసిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య మూడో వన్డే శనివారం పుణెలో జరుగుతుంది. వారిద్దరి సమన్వయం భారత ఇన్నింగ్స్ ఆసాంతం కోహ్లి, రాయుడు చుట్టూనే సాగింది. ఆడిన బంతులు (209), కలిపి చేసిన పరుగుల (230) గణాంకాల ప్రకారం చెప్పాలంటే 70 శాతం ఆటను వీరిద్దరే నడిపించారు. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ చేయడం ఎలానో చెబుతూ, స్కోరు బోర్డును నడిపించడం ఎలానో చూపుతూ జట్టుకు పరుగులందించింది ఈ జోడీ. దీనికిముందు టీమిండియాకు మరోసారి శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ శతక వీరుడు రోహిత్ (4) నాలుగో ఓవర్లోనే వెనుదిరిగ్గా... ధావన్ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు నిలిచాడు. చక్కటి షాట్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన అతడు నర్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే, కోహ్లి, రాయుడు బాధ్యతనంతటినీ భుజాన వేసుకున్నారు. ఓవైపు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, మరోవైపు రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటూపోయారు. వీలున్నప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో మెకాయ్ బౌలింగ్‌లో సింగిల్‌తో తొలుత కోహ్లి (56 బంతుల్లో), అనంతరం బౌండరీతో రాయుడు (61 బంతుల్లో) అర్ధశతకాలు అందుకున్నారు. ఇక్కడినుంచి జోరు చూపిన రాయుడు కోహ్లిని దాటుకుని చకచకా 70ల్లోకి వెళ్లిపోయాడు. కానీ, నర్స్ ఓవర్లో స్వీప్‌నకు యత్నించి బౌల్డయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్‌కు జత కలిసిన ధోని (20) ఓ సిక్స్ బాది అలరించాడు. కానీ, మెకాయ్ స్లో బంతి అతడి వికెట్లను పడగొట్టింది. రిషభ్ పంత్ (17) మెరుపులు మెరిపించలేకపోయాడు. ఈ రెండు వికెట్లు కోల్పోవడానికి మధ్యలోనే 90ల్లోకి వచ్చిన కోహ్లి... 44 ఓవర్లో శామ్యూల్స్ వేసిన బంతిని కవర్స్‌లో బౌండరీకి పంపి 37వ శతకాన్ని (106 బంతుల్లో) సాధించాడు. అంతకుముందు 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను విండీస్ కెప్టెన్ హోల్డర్ వదిలేశాడు. దానికి విండీస్ భారీ మూల్యమే చెల్లించు కుంది. జీవనదానం తర్వాత కోహ్లి మరో 113 పరుగులు చేయడం విశేషం. సెంచరీ తర్వాత చెలరేగి ఆడిన కోహ్లి మెకాయ్, రోచ్ల బౌలింగ్‌లో 9 బంతుల వ్యవధిలో మూడు సిక్స్‌లు, ఫోర్ సహా 32 పరుగులు పిండుకుని జట్టు స్కోరును 300 దాటించాడు. అయితే, 49వ ఓవర్లో మెకాయ్ ఐదు పరుగులే ఇచ్చి జడేజా (13) వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్లో స్ట్రయికింగ్ తీసుకున్న కోహ్లి... స్వభావానికి భిన్నంగా స్కూప్ షాట్‌తో బౌండరీ కొట్టి ఆశ్చర్యపరిచాడు. అనంతరం 2 పరుగులతో 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. వెంటనే లాంగాన్ లో సిక్స్ కొట్టాడు. ‘హిట్’మైర్భయపెట్టాడు... ‘హోప్’ నిలిపాడు గత మ్యాచ్‌లో తాము విధించిన లక్ష్యానికి దాదాపు సమానమైన స్కోరును ఛేదించేందుకు దిగిన విండీస్‌కు ఓపెనర్లు కీరన్ పావెల్ (18), హేమ్రాజ్ (32, 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. అయితే షమీ... పావెల్‌ను ఔట్ చేసి ప్రమాదం తప్పించాడు. బౌండరీలతో దూకుడు మీదున్న హేమ్రాజ్, శామ్యూల్స్ (13)లను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. 78/3తో నిలిచి... చేతులెత్తేస్తుంద నుకున్న జట్టును హోప్, హెట్‌మైర్ మళ్లీ పోటీలో నిలిపారు. ముఖ్యంగా హెట్‌మైర్ ఎడాపెడా సిక్స్‌లు కొట్టాడు. తనకంటే ముందు దిగిన హోప్‌ను దాటిపోయి అర్ధశతకం (41 బంతుల్లో) పూర్తి చేశాడు. తర్వాత మరింత రెచ్చిపోయి చహల్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదాడు. హోప్ సైతం 64 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడీ జోరుతో విండీస్ 30వ ఓవర్లోనే 200 స్కోరు దాటింది. సాధించాల్సిన రన్‌రేట్ 5కు చేరిన నేపథ్యంలో ఆ జట్టు విజయం ఖాయం అనిపించింది. కానీ హెట్‌మైర్ భారీ షాట్‌కు ప్రయ త్నించి కవర్స్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. పావెల్‌ను కుల్దీప్ అవుట్ చేసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. హోప్ శతకం (113 బంతుల్లో) చేసి క్రీజులో ఉన్నా అనవసర పరుగుకు యత్నించి కెప్టెన్ హోల్డర్ (12) ఔటవ్వడం జట్టును మరింత ఇబ్బందుల్లో పడేసింది. చివరి మూడు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో 48, 49వ ఓవర్లలో చహల్ 2, షమీ 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. చివరి ఓవర్లో ఉమేశ్ 13 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి విజయం కోసం 5 పరుగులు చేయాల్సి ఉండగా హోప్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టై అయ్యింది. ►2 భారత్, విండీస్ జట్ల మధ్య ‘టై’ అయిన మ్యాచ్‌ల సంఖ్య. తొలి ‘టై’ 1991లో డిసెంబరు 6న పెర్త్‌లో ముక్కోణపు సిరీస్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత భారత్... అనంతరం విండీస్ 121 పరుగులకు ఆలౌటయ్యాయి. -
టైగా ముగిసిన వైజాగ్ రెండో వన్డే
-
టైగా ముగిసిన వైజాగ్ వన్డే
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా భారత్, వెస్టీండ్‌స్‌ల మధ్య జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు నిరాశే మిగిలింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 321 పరుగులు సాధించింది. భారత్ తరఫున కోహ్లి 157 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగగా, అంబటి రాయుడు 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన విండీస్ జట్టు దాటిగా ఆడింది. 78 పరుగులకే మూడు వికెట్లు కొల్పోయిన విండీస్.. ఆ తర్వాత వేగం పెంచింది. హెట్‌మైర్(94), హోప్(123 నాటౌట్) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. హెట్‌మైర్ జౌటైన తర్వాత విండీస్ వికెట్లు కొల్పోయినప్పటికీ.. సెంచరీ సాధించిన హోప్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. అఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా హోప్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది. -
‘టై’గా ముగిసిన భారత్, అఫ్గానిస్తాన్ పోరు
-
భారత్- అఫ్గానిస్తాన్ మ్యాచ్ టై
-
ఊరించి... ఉత్కం‘టై’
దుబాయ్: చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్‌తో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పసికూనలాంటి జట్టే అయినా అఫ్గానిస్తాన్ అసమాన పోరాట పటిమ కనబర్చగా... ఐదుగురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమికి చేరువగా వచ్చి చివరకు బయటపడింది. అయితే నిజాయితీగా చెప్పాలంటే మన జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోగా... ఓటమి అంచుల నుంచి ‘టై’ వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్ సగర్వంగా ఆసియా కప్ నుంచి తిరుగు ముఖం పట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (49 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. నేడు జరిగే చివరి సూపర్–4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్‌తో ఆడుతుంది. రాణించిన నబీ... అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం ఓపెనర్ షహజాద్ అద్భుత బ్యాటింగ్. టాప్–6 లో మిగతా ఐదుగురు విఫలమైన చోటు అతనొక్కడే మెరుపు ప్రదర్శనతో జట్టును నడిపించాడు. దీంతో పాటు చివర్లో నబీ ఆడిన ఇన్నింగ్స్ అఫ్గాన్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. అనుభవం తక్కువగా ఉన్న భారత పేసర్లు తడబడటంతో షహజాద్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 పరుగుల వద్ద మిడాఫ్‌లో సునాయాస క్యాచ్‌ను రాయుడు వదిలేయడంతో బతికిపోయిన షహజాద్ 37 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 63 పరుగులకు చేరింది. అయితే స్పిన్నర్లు రంగప్రవేశం చేసి మరో ఎండ్‌లో అఫ్గాన్ లైనప్‌ను దెబ్బ తీశారు. 17 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. అహ్మదీ (5), రహ్మత్ (3)లను జడేజా ఔట్ చేయగా... వరుస బంతుల్లో హష్మతుల్లా (0), అస్గర్ (0)లను కుల్దీప్ పెవిలియన్ పంపించాడు. అయితే షహజాద్ మాత్రం జోరు తగ్గించలేదు. తన ధాటిని కొనసాగించిన అతను చహర్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి 88 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో జట్టు స్కోరు 131 కాగా, షహజాద్వే 103 పరుగులు ఉండటం అతని బ్యాటింగ్ దూకుడును చూపిస్తోంది. ఎట్టకేలకు జాదవ్ ఈ మెరుపు బ్యాటింగ్‌కు ముగింపు పలికాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతో షహజాద్ ఆట ముగిసింది. అయితే మరో ఎండ్‌లో నబీ కూడా ధాటిని ప్రదర్శించాడు. 45 బంతుల్లోనే అతనూ హాఫ్ సెంచరీ సాధించి 48వ ఓవర్లో వెనుదిరిగాడు. చివరి పది ఓవర్లలో అఫ్గానిస్తాన్ 63 పరుగులు చేసింది. సెంచరీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్‌కు కొత్త ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన రాహుల్, రాయుడు అఫ్గాన్ బౌలర్లపై చెలరేగారు. 10 పరుగుల వద్ద రాయుడుకు అదృష్టం కలిసొచ్చింది. ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యే అవకాశం కనిపించినా... అఫ్గాన్ జట్టు రివ్యూ కోరకపోవడంతో బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు దూసుకుపోయారు. ముఖ్యంగా గుల్బదిన్ వేసిన 4 ఓవర్ల స్పెల్‌లో భారత్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు రాబట్టింది. ముందుగా 43 బంతుల్లో రాయుడు అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అదే జోరులో మరో భారీ షాట్ ఆడబోయిన అతను వెనుదిరిగాడు. తర్వాతి బంతికే హాఫ్ సెంచరీని చేరుకున్న రాహుల్ కూడా తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. దురదృష్టవశాత్తూ ధోని (8) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అహ్మదీ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా... భారత్ అప్పటికే రివ్యూ కోల్పోవడంతో మరో అవకాశం లేకపోయింది. రీప్లేలో బంతి లెగ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. పాండే (8) మరోసారి తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జాదవ్ (19) రనౌట్ కాగా, కార్తీక్ (66 బంతుల్లో 44; 4 ఫోర్లు) కూడా కీలక సమయంలో ఔటయ్యాడు. ఆ తర్వాత అనుభవం లేని భారత బ్యాటింగ్ తీవ్ర ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. -
టీ షర్ట్స్‌తో ఆఫీస్‌కు వస్తే..
లండన్ : ఆఫీస్ అనగానే సూటూ, బూటూ, టైతో బయలుదేరే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే..టై ధరించడంతో మెదడుకు రక్త సరఫరా ఇతరులతో పోలిస్తే 7.5 శాతం తక్కువగా ఉన్నట్టు జర్మన్ పరిశోధకుల అథ్యయనంలో వెల్లడైంది. ఆఫీస్‌కు ట్రెడిషనల్ వేర్ కన్నా టీ షర్ట్స్ ధరించి వచ్చేవారే మెరుగ్గా పనిచేస్తున్నట్టు అథ్యయనం సూచించింది. సౌకర్యవంతమైన దుస్తులతోనే ఉద్యోగులు మంచి సామర్థ్యం కనబరుస్తారని తేలింది. జర్మనీ పరిశోధకులు 30 మంది ఎగ్జిక్యూటివ్‌లపై జరిపిన ఎంఆర్ఐ స్కాన్‌లో వారి మెదడుకు రక్త సరఫరా టైలు ధరించని వారితో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఇది ఆయా ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అథ్యయనం హెచ్చరించింది. టైలతో కళ్లపై ఒత్తిడి పెరుగుతుందని గతంలోనూ పలు అథ్యయనాలు హెచ్చరించాయి. శరీరంలోని అవయవాలు చురుకుగా పనిచేసేందుకు అవసరమైన సంకేతాలు పంపేందుకు మెదడుకు నిరంతరాయంగా రక్త సరఫరా అత్యంత కీలకం. అథ్యయన వివరాలు జర్నల్ స్ర్టింగర్లో ప్రచురితమయ్యాయి. -
పెళ్లి కోసం పాకిస్తానీ ఏంచేశాడంటే..?
లాహోర్ : పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి ఏంటి వైరల్ అవడం ఏంటి అని అనుకోకండి. అది సాదా సీదా పెళ్లికాదు. ఎందుకంటే పెళ్లికొడుకు ధరించిన టై, షూలు అంత కాస్ట్లీ మరి. వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌కు చెందిన హఫీజ్ సల్మాన్ షాహిద్ పెద్ద వ్యాపార వేత్త. కుటుంబానికి ఏకైక కుమారుడు. ఇంకేముంది తన పెళ్లి అందరూ చెప్పుకునే విధంగా ఉండాలని భావించాడు. అనుకున్నదే తడవుగా 17లక్షల రూపాయలు పెట్టి బంగారు షూ చేయించాడు. అంతేకాదు మరో ఐదు లక్షలు పెట్టి టై కూడా తయారు చేయించాడు. దీనితో పాటు బంగారు షూట్ చేయించాడు. వాటికి అదనంగా రంగురాళ్లతో డిజైన్ కూడా కుట్టించాడు. వీటితో పాటు పలు అదనపు హంగులు అన్నీ కలిపి సుమారు 25లక్షల రూపాయలను పెట్టి ప్రత్యేకంగా పెళ్లి వస్తువులను డిజైన్ చేయించుకున్నాడు. పెళ్లిలో వాటికి కాపలాగా భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాడు. "The Golden Groom" This groom in Lahore wore an outfit on his valima which consisted GOLD and was worth around Rs. 25 lakhs! Imagine if he got kidnapped💲💲💲#GoldRush pic.twitter.com/aNXyL9ZXgH — Rayan Ibrahim (@Rayanibrahim77) April 11, 2018 -
నాగాలాండ్‌లో ఉత్కం‘టై’
కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఫలితం. శనివారం ఉదయం నుంచి నువ్వా?నేనా? అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేకెత్తించి, చివరికి ప్రధాన పక్షాల మధ్య సమంగా ముగిసింది. ఏ పార్టీ, కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించక అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), బీజేపీ–నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) కూటము లు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసినా, అందులో బీజేపీ భాగస్వామిగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీపీపీతో ఎన్నికల ముందస్తు పొత్తు పెట్టుకున్న బీజేపీ..అంతకు ముందు ఎన్పీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ఎన్డీపీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నేఫియూ రియో ఉత్తర అంగామి 2 స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ఎన్పీఎఫ్ చీఫ్ టీఆర్ జెలియాంగ్ 5,432 ఓట్ల తేడాతో పెరెన్ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీ 20 స్థానాల్లో, మిత్ర పక్షం ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీచేశాయి. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది. బీజేపీకి ఎన్పీఎఫ్ ఆహ్వానం.. తమతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని బీజేపీని సీఎం టీఆర్ జెలియాంగ్ ఆహ్వానించారు. ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీ ఎన్పీఎఫ్తో తెగతెంపులు చేసుకుని, నేఫియూ రియో నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీపీపీతో జట్టుకట్టింది. ఇతర పార్టీలతో కలసి నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్చార్జ్ కిరణ్ రిజిజు వెల్లడించారు. నాగాలాండ్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నికకాలేదు. బరిలో నిలిచిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. -
కబడ్డీ లీగ్‌లో మరో టై
జైపూర్, బెంగళూరు మ్యాచ్ జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో మరో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ ఆద్యంతం పూర్తి ఆధిక్యత ప్రదర్శించిన బెంగళూరు బుల్స్ చివర్లో తడబడింది. అటు కొన్ని సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా కెప్టెన్ జస్వీర్ సింగ్ కీలక పాయింట్‌తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు. అలాగే చివరి మూడు నిమిషాల్లోనూ నాలుగు పాయింట్లు సాధించడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్ 28-28తో టై అయ్యింది. అంతకుముందు తొలి 30 నిమిషాల పాటు బెంగళూరు 23-16తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోయింది. మ్యాచ్ ముగిసేందుకు నిమిషం కూడా లేని సమయంలోనూ బుల్స్ 28-26 తేడాతో ముందుంది. అయితే జస్వీర్ సింగ్ ఒక పాయింట్‌తో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు రోహిత్‌ను టాకిల్ చేయడంతో బెంగళూరుకు విజయం దూరమైంది. జస్వీర్ 9, రాజేశ్ నర్వాల్ 4 రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి వినోద్ కుమార్ 5, రోహిత్ 4 పాయింట్లు సాధించారు. ఐస్ దివాస్ బోణీ మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఐస్ దివాస్ జట్టు తొలి విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో స్టార్మ్ క్వీన్‌ను 28-15తేడాతో ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు యు ముంబా X దబాంగ్ ఢిల్లీ కేసీ రాత్రి 8 గంటల నుంచి జైపూర్ పింక్ పాంథర్స్ X బెంగాల్ వారియర్స్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం -
ముఫ్పై ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కారు!
రాంచీ: కలిసి జీవిస్తూ దాదాపు ముఫ్పై ఏళ్ల తర్వాత 21 జంటలు పెళ్లి పీటలెక్కిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతిలో చోటుచేసుకుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నీలకంఠ సింగ్ ముండా తన నియోజకవర్గంలోని గిరిజన జాతుల్లో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలను గుర్తించి.. నిమిత్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో వారికి జీవిన విధానాల మీద అవగాహన కల్పించి పెళ్లిళ్లు చేసుకునేలా అంగీకరింపజేశారు. ‘ముండా’ గిరిజన తెగలకు చెందిన వీరు ఆర్థికంగా బాగా వెనుకబడిన వారు కావడంతో వారికి ఆర్థిక సాయం కూడా స్వచ్ఛంద సంస్థే చేసింది. నిమిత్ ఫౌండర్-డైరెక్టర్ నిఖిత సిన్హా మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత కోసం ముఖియా ఇండక్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా నాగ్ అనే వ్యక్తి పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా సాయం కోరారని తెలిపారు. ప్రపంచబ్యాంకు సహకారంతోనే గ్రామంలో పరిశుభ్రతకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
కడితే ‘టై’... కుడితే ఆభరణం...
న్యూలుక్ మగవారే కాదు మగువలూ కార్పోరేట్ డ్రెస్సుల మీదకు ‘టై’ని ఉపయోగిస్తుంటారు. కొన్ని టైలు నప్పక, మరికొన్ని చాలా రోజులు ఉపయోగించి, ఇంకొన్ని మధ్యలో కుట్లు ఊడిపోయి.. ఇలా రకరకాల కారణాలతో ఖరీదైన టైలను ఓ పక్కన పడేస్తుంటారు. ఉపయోగంలో లేని ‘టై’లను మరింత అకర్షణీయంగా ఎలా మార్చుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం... టై ముందు భాగాన్ని కుచ్చులు పెట్టి, పైన లేస్తో పువ్వుల్లా చేసి బటన్ పెట్టి కుట్టాలి. ఇది మరో అందమైన నెక్ డిజైన్‌గా అమరిపోతుంది. చేతి గడియారానికి టై ని బెల్ట్‌లా వాడితే.. అందరి చూపు మీ మణికట్టు మీదే! సింపుల్ అండ్ క్లాస్‌గా అనిపించే నెక్ డిజైన్‌గా మారిన టై. ప్లెయిన్ టీ షర్ట్‌కి ‘నెక్’ భాగంలో టైని ఇలా ఓ వైపు కుచ్చులు పెట్టి, దాని మీదుగా ముత్యాల హారం కూడా జత చేస్తే పార్టీవేర్‌గా మారిపోతుంది. కలర్‌ఫుల్ టై ఫోన్ పౌచ్గానూ, మినీ పర్స్గానూ.. అరచేతికి అందమైన అలంకరణ. -
డ లైఫ్ ఆఫ్ ‘టై’
ఇదో చిత్రమైన రెస్టారెంట్.. ఏంటీ విశేషం అనుకుంటున్నారా? ఒక్కసారి పైకి లుక్కేయండి. వేలాది టైలు వేలాడుతూ కనిపించడం లేదూ.. అమెరికాలోని అరిజోనాలో ఉన్న పినాకిల్ పీక్ రెస్టారెంట్లో టై ధరించడం నిషిద్ధం. ఎవరైనా పొరపాటున టై ధరించి వస్తే.. వెంటనే సిబ్బంది కత్తెరతో దాన్ని కోసి.. కోట గుమ్మానికి వేలాడదీసినట్లుగా వాటిని రెస్టారెంట్లో ఇలా వేలాడదీస్తారు. 1957లో ఓ కిరాణా షాపులా మొదలైన పినాకిల్ పీక్ తర్వాతి కాలంలో రెస్టారెంట్‌గా మారింది. అయితే.. ఈ టైలకు కత్తెరేసే సంప్రదాయం కొన్నేళ్ల క్రితం ప్రారంభమైంది. ఓ రోజు రాత్రి ఈ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తన యజమానితో పాటు డిన్నర్‌కు కూర్చున్నాడు. తన రెస్టారెంట్లో అంతా సింపుల్‌గా ఉండాలని.. అందుకే ఆ టైను తీసేయాలని యజమాని ఆదేశించాడు. దాన్ని సదరు ఎగ్జిక్యూటివ్ పట్టించుకోకపోవడంతో దగ్గర్లో ఉన్న కత్తి తీసుకుని.. దాన్ని కట్ చేసి పారేశాడు. అయితే.. ఈ ఘటనకు గుర్తుగా తన టైను అందరికీ కనిపించేటట్లుగా రెస్టారెంట్లో వేలాడదీయాలని ఎగ్జిక్యూటివ్ యజమానిని కోరాడు. దీంతో అలా మొదలైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ప్రతీ టై మీద ఆ టై యజమాని పేరు అతికించి ఉంటుంది. ఇప్పటివరకూ దాదాపు 10 లక్షల టైలు ఇలా కట్ చేసి ఉంటారని అంచనా. -
పోలీస్ పవర్!
దాదాపు 140 నిమిషాల పాటు సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘టై’. శ్రీకాంత్ హీరోగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ మస్తాన్ నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ కాసెట్టి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ‘‘ఇంతకు ముందు కూడా పోలీస్ పాత్రల్లో నటించాను. కానీ ఈ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటునిగా నాకు తృప్తినిచ్చిన సినిమా ఇది’’ అని హీరో శ్రీకాంత్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, కెమెరా: శ్యాం ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి. -
‘దేశం’లో రచ్చ..రచ్చ!
సాక్షి, ఒంగోలు: సంతనూతలపాడు (ఎస్సీ) నియోజకవర్గాన్ని టీడీపీ ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. ఈ వ్యవహారం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించింది. ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన తెలుగుతమ్ముళ్లు అధినేతతో అమీతుమీకి సిద్ధపడుతున్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలో చేరిన బీఎన్ విజయ్‌కుమార్‌ను పార్టీ తరఫున పోటీకి నిలపాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించి బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.దీనిపై సోమవారం సాయంత్రం కొందరు హైదరాబాద్ చేరుకుని టీడీపీ నేతలు సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహనరావును కలిశారు. సీనియర్లు మౌనం.. ఎన్నికలొచ్చిన ప్రతీసారి పొత్తుల పేరిట చంద్రబాబు తన మిత్రపక్షానికి సంతనూతలపాడునే కేటాయించడం వెనుక మతలబేంటనేది ఆ పార్టీ శ్రేణులకు ప్రశ్నగా మిగిలింది. 1989, 1994, 2009లోనూ ఆ సీటును ఇతరులకే అప్పగించారు. అక్కడ గెలుపు నమ్మకం లేకపోవడంతోనే త్యాగం చేస్తున్నారా, లేక పార్టీ నేతల ఆధిపత్యపోరు నేపథ్యంలో సంతనూతలపాడు నేతలు, కార్యకర్తలు బలవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై సీనియర్ నేత కరణం బలరాం, జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నోరు మెదపలేదు. కష్టపడినా పార్టీలో సరైన గుర్తింపు లేనప్పుడు తాజా ఎన్నికల్లో పనిచేయడం వృథా ప్రయాస అని నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల నేతల్లో భయం.. ఒకవేళ సంతనూతలపాడుపై చంద్రబాబు తన నిర్ణయం మార్చుకుంటే, అనంతరం ఏ నియోజకవర్గానికి ఎసరు పెడతారనే భయం జిల్లా నేతల్లో మొదలైంది. ఉప ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోమారు టికెట్ ఆశిస్తుండగా, అక్కడ అతని ప్రాధాన్యతను తగ్గించే వ్యూహాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో దామచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కరణం బలరాంను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కనిగిరికి కదిరి బాబురావును ఖరారు చేశారో లేదోననే అయోమయంతో అక్క డ పార్టీ శ్రేణులు అనుమానంగానే పనిచేస్తున్నాయి. గిద్దలూరుకు సాయికల్పనారెడ్డి పేరును కాదని, ఆమె కొడుకు అభిషేక్‌రెడ్డికి సీటు కేటాయింపుపై ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. దర్శిలో శిద్దా రాఘవరావుది అదే పరిస్థితి. చీరాలలో పోతుల సునీతకు ప్రత్యామ్నాయంగా కాపు సామాజికవర్గ అభ్యర్థిని తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంతనూతలపాడు బీజేపీకి వెళ్లడం వెనుక జిల్లా పార్టీలో ఉన్న కీలకనేతలు చక్రం తిప్పినట్లు కేడర్ ఆరోపిస్తుండగా, చంద్రబాబు నిర్ణయంలో మార్పువస్తే, కొండపి నియోజకవర్గాన్ని బీజేపీకి అప్పగిస్తారనే ఊహాగానాలూ లేకపోలేదు. -
టీడీపీకి సత్తాలేకే బీజేపీతో పొత్తు
కృష్ణాయపాలెం (మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడే సత్తా లేక భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకుందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. మంగళగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)తో కలసి ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. కృష్ణాయపాలెంలో బాలశౌరి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి సొంతగా పోటీచేసి గెలవగలమనే విశ్వాసమే వుంటే బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తాను చేసిన చారిత్రాత్మక తప్పిదం అని గతంలో చంద్రబాబు చెప్పారని, అయితే నేడు ఆ తప్పు ఏమైంది.. ఆయన విశ్వసనీయత ఏమైంది.. విలువలు ఏమయ్యాయని బాలశౌరి ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పో యి బీజేపీ వారి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు రావడం సిగ్గుచేటన్నారు. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ దెబ్బకు ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ బీజేపీల పొత్తుతో రాష్ట్రంలోని మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలంతా ఏకమవుతున్నారని.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌లను అభిమానించే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలంతా గమనిస్తూనే వున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్‌ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి 16 నెలల పాటు జైల్లో పెట్టినా కడిగిన ముత్యంలా బెయిలుపై బయటకు వచ్చారని ఆయన గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను, విజయమ్మను, షర్మిలను గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాలశౌరి కోరారు. రానున్న ఎన్నికల్లో అంతిమ విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. -
టీడీపీతో బీజేపీ పొత్తు ఖరారు ?
-
మూడో వన్డే టై
-
ఔత్సాహికుల కోసం టై సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒకచోట చేరుస్తూ అతిపెద్ద సదస్సు నిర్వహించడానికి ‘ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టై)’ సిద్ధమయింది. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు హెచ్ఐసీసీలో జరిగే ఈ సదస్సులో ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొంటారని టై హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు మురళి బుక్కపట్నం, టై సదస్సు కన్వీనర్ అనంతరావు తెలియజేశారు. ఈ వెంచర్ క్యాపిటలిస్టులలో హెలియాన్ వెంచర్ పార్ట్నర్, యాక్సెల్ పార్ట్నర్స్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, టీవీఎస్ క్యాపిటల్, కాలరి క్యాపిటల్, వెంచర్ఈస్ట్, పీపుల్ క్యాపిటల్, యునిలేజర్ వెంచర్స్, శ్రీ క్యాపిటల్, ఇండియన్ ఏంజిల్ నెట్వర్క్ తదితర సంస్థలున్నట్లు వారు తెలియజేశారు. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు ఏకకాలంలో తెలుసుకోవటానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ‘‘ఆలోచనలు కంపెనీ ఏర్పాటు స్థాయికెళ్లాలి. కంపెనీ ఏర్పాటయ్యాక ఫండింగ్ రావాలి. ఫండింగ్ వచ్చాక విస్తరణ జరగాలి. ఆ తరవాత బయటపడాలి. అక్కడి నుంచి సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి. అన్నిటికన్నా ప్రధానమైనది, ఎక్కువ అడ్డంకులు ఎదురయ్యేది ఒక ఐడియాను కంపెనీగా మార్చడం, దానికి తగ్గ ఆర్థిక వనరులను సంపాదించడమే. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవటమే ప్రధానంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం’’ అని మురళి వివరించారు. కాగా, ఇన్వెస్టర్లు ఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారో కూడా అర్థం చేసుకోవచ్చని అనంతరావు తెలియజేశారు. నిజానికి సిలికాన్ వ్యాలీలో విజయపతాకం ఎగురవేసిన భారతీయ సంతతి వ్యాపారులు మరింత మందిని తమలా తీర్చిదిద్దేందుకు ఈ ై‘టె’ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 61 చాప్టర్లు, 15,000 మంది సభ్యులతో విస్తరించిన ఈ సంస్థకు భారత్‌లో 17 చాప్టర్లున్నాయి. తాజా సదస్సులో అపోలో గ్రూపు సంస్థల చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, మైహోమ్ గ్రూప్ సంస్థల చైర్మన్ జే రామేశ్వరరావు, సినీ నిర్మాత రోనీ స్క్రూవాలా ప్రభృతులు పాల్గొంటారు. తాము ఎదుర్కొన్న ఆటుపోట్లను, అధిగమించిన తీరును వివరిస్తారు. సదస్సులో పాల్గొనాలనుకునేవారు http://www.tiesummit.com ద్వారా సంప్రతించవచ్చని నిర్వాహకులు చెప్పారు.