జీ20 సమ్మిట్‌: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. | G20 Summit Pic Of Akshata Murty Fixing Husband Rishi Sunak Tie | Sakshi
Sakshi News home page

G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్..

Published Sat, Sep 9 2023 8:03 PM | Last Updated on Sat, Sep 9 2023 8:44 PM

G20 Summit Pic Of Akshata Murty Fixing Husband Rishi Sunak Tie - Sakshi

ఢిల్లీ: జీ20 సమావేశాలకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన భార్య అక్షతా మూర్తి మధ్య ప్రేమానురాగాలకు సంబందించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌కు స్వయంగా అక్షతా మూర్తి టై కట్టారు. ఈ దృశ్యాలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. 

జీ20 సమ్మిట్‌ కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ భారత్‌కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి దిగారు. విమానం నుంచి కిందకు దిగే క్రమంలో అక్షతా మూర్తి తన భర్త రిషి సునాక్‌కు టై కట్టారు. సునాక్ నల్లని సూటు ధరించి ఆరెంజ్ కలర్లో టై ధరించారు. అక్షతా మూర్తి తెల్లని షర్ట్‌తో కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 రిషి సునాక్‌కు అక్షతా మూర్తి టై కట్టిన దృశ్యాలపై నెటిజన్లు స్పందిస్తూ.. భార్యభర్తల మధ్య ప్రేమకు నిదర్శనమని కామెంట్లు పెట్టారు. రిషి సునాక్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు తెలుపుతున్నాయని మరికొందరు స్పందించారు. బ్యూటిఫుల్‌ పిక్చర్ అంటూ కామెంట్ చేశారు.

అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూమార్తే. కాగా.. రిషి సునాక్‌, అక్షతామూర్తిలకు 2009లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. భారత్‌కు చేరుకున్న రిషి సునాక్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలికారు. భారత్‌కు రావడం తనకు చాలా ప్రత్యేకమని రిషి సునాక్ తెలిపారు.

ఇదీ చదవండి: జీ20 సమ్మిట్‌: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement