Fixing
-
పాక్ సెలక్టర్‌గా ‘మ్యాచ్ ఫిక్సర్’
ఫిక్సింగ్ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన మాజీ ఆటగాడు సల్మాన్ బట్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జాతీయ జట్టు సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అతనితో పాటు మరో ఇద్దరు మాజీలు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అంజుమ్ కూడా సెలక్టర్లుగా ఎంపికయ్యారు. చీఫ్ కోచ్ వహాబ్ రియాజ్‌తో కలిసి వీరిద్దరు పని చేస్తారు. సల్మాన్ బట్ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో కెప్టెన్‌గా ఉన్న బట్ సహచరులు ఆసిఫ్, ఆమిర్‌లతో నోబాల్స్ వేయించి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ నిషేధంతో పాటు బట్కు 30 నెలల జైలు శిక్ష కూడా పడింది. అయితే 7 నెలలకే విడుదలైన బట్ 2016లో తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టాడు. దేశవాళీలో మంచి ప్రదర్శన కనబర్చినా...పాక్ జట్టు కోసం అతని పేరును మళ్లీ పరిశీలించలేదు. అయితే ఇప్పుడు సెలక్టర్‌గా అతను అధికారిక పదవిలోకి వచ్చాడు. -
జీ20 సమ్మిట్: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్..
ఢిల్లీ: జీ20 సమావేశాలకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన భార్య అక్షతా మూర్తి మధ్య ప్రేమానురాగాలకు సంబందించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌కు స్వయంగా అక్షతా మూర్తి టై కట్టారు. ఈ దృశ్యాలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. జీ20 సమ్మిట్ కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి దిగారు. విమానం నుంచి కిందకు దిగే క్రమంలో అక్షతా మూర్తి తన భర్త రిషి సునాక్‌కు టై కట్టారు. సునాక్ నల్లని సూటు ధరించి ఆరెంజ్ కలర్లో టై ధరించారు. అక్షతా మూర్తి తెల్లని షర్ట్‌తో కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) రిషి సునాక్‌కు అక్షతా మూర్తి టై కట్టిన దృశ్యాలపై నెటిజన్లు స్పందిస్తూ.. భార్యభర్తల మధ్య ప్రేమకు నిదర్శనమని కామెంట్లు పెట్టారు. రిషి సునాక్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు తెలుపుతున్నాయని మరికొందరు స్పందించారు. బ్యూటిఫుల్ పిక్చర్ అంటూ కామెంట్ చేశారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూమార్తే. కాగా.. రిషి సునాక్, అక్షతామూర్తిలకు 2009లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. భారత్‌కు చేరుకున్న రిషి సునాక్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలికారు. భారత్‌కు రావడం తనకు చాలా ప్రత్యేకమని రిషి సునాక్ తెలిపారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే.. -
ఆ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయట..!
Boxing Bouts In 2016 Olympics Were Fixed: 2016 రియో ఒలింపిక్స్‌కు సంబంధించిన ఓ సంచలన విషయం తాజాగా వెలుగు చూసింది. ఆ విశ్వక్రీడల్లో రెండు పతకాల పోరులు(ఫైనల్స్) సహా మొత్తం 14 బాక్సింగ్ బౌట్లు ఫిక్స్ అయ్యాయని మెక్లారెన్ గ్లోబల్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ (ఎమ్‌జీఎస్‌ఎస్) అనే సంస్థ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనే ఈ ఫిక్సింగ్ స్కాంకు బీజం పడినట్లు సదరు సంస్థ తమ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ)చే నియమించబడిన రిఫరీలు, న్యాయనిర్ణేతలే ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. ఇందుకు నాటి ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొంది. కాగా, రియో ఒలింపిక్స్ క్వార్టర్స్ పోరులో రష్యా బాక్సర్ వ్లాదిమిర్ నికితిన్పై ప్రపంచ ఛాంపియన్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ కోన్లాన్ పిడిగుద్దులతో విరుచుకుపడినప్పటికీ రిఫరీ, న్యాయనిర్ణేతలు అతను ఓడిపోయినట్లు ప్రకటించారు. దీంతో మైఖేల్ సహనం కోల్పోయి న్యాయ నిర్ణేతలపై దూషణకు దిగాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సైతం ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. న్యాయనిర్ణేతలు ప్రత్యర్ధులకు అనుకూలంగా వ్యవహరించారంటూ భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: సీఎస్కేలో 10 మందే బ్యాటర్లు.. ధోని కీపర్, కెప్టెన్ మాత్రమే..! -
క్లీనర్ సహాయంతో ఫిక్సింగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ షబ్బీర్ హుస్సేన్ వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు అనుమానించారు. స్టేడియంలో ఒక మూలన అతడిని చూసి పోలీసులు ప్రశ్నించగా తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లు చెప్పాడు. అదే నంబర్‌కు మళ్లీ డయల్ చేయమని అడగ్గా, ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు. అతడిని పట్టుకునే లోపే రెండు ఫోన్లను వదిలేసి పారిపోయాడు. మ్యాచ్ జరుగుతున్న అసలు సమయానికి, టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది. దీనిని వాడుకొని ప్రతీ బంతికి ఫిక్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరో కేసు విచారణ సందర్భంగా ఐపీఎల్ దొంగ అక్రిడేషన్లు పొందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులను ఒక చోటికి చేర్చి దీనిపై çపూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని షబ్బీర్ హుస్సేన్ చెప్పారు. -
‘అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు’
కరాచీ: అవినీతి ఆరోపణలపై మూడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌లో కనీసం పశ్చాత్తాపం ఎక్కడా కనబడటం లేదని పీసీబీ క్రమశిక్షణా ప్యానల్ పేర్కొంది. తనకు పడిన నిషేధంపై ఎటువంటి చింతా లేని అక్మల్.. బోర్డుకు కూడా క్షమాపణలు తెలుపలేదని ప్యానల్ చీఫ్ ఫజల్ ఈ మిరాన్ చౌహాన్ తెలిపారు. ఉమర్ అక్మల్ కేసులో సమగ్ర నివేదికను పీసీబీకి అందజేసిన ఫజల్.. దర్యాప్తు చేసేటప్పుడు కూడా అధికారుల్నిముప్పు తిప్పలు పెట్టడన్నారు. కనీసం బాధ్యత లేకుండా విచారణకు సైతం సహకరించలేదన్నారు. ఆర్టికల్ 2.4.4 నియమావళిని అక్మల్ అతిక్రమించిన కారణంగా అతనిపై సుదీర్ఘ కాలం నిషేధం పడిందన్నారు. బుకీలు సంప్రదించినప్పుడు దాన్ని బోర్డుకు చెప్పకుండా దాచి పెట్టడం అతి పెద్ద నేరమని ఫజల్ తెలిపారు. దీనిలో భాంగానే ఉమర్ అక్మల్ మూడేళ్ల నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉమర్ అక్మల్ విచారణకు సహకరించకపోవడంతోనే రెండు నెలల సమయం పట్టిందన్నారు.(అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్) పీఎస్ఎల్కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ చేయమంటూ అక్మల్‌ను కొందరు సంప్రదించారు. దానికి అక్మల్ అంగీకరించలేదు. కానీ తనను బుకీలు సంప్రదించిన విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ విషయంపై కొన్ని నెలల క్రితం బయటపడటంతో ఉమర్‌పై వేటు తప్పలేదు. ఉమర్‌పై నిషేధమే సబబు అని భావించి పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు ఫిట్నెస్ టెస్టుకు హాజరైన క్రమంలో ట్రైనర్‌తో ఉమర్ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. ఆ సమయంలోనే అక్మల్‌పై వేటు పడుతుందని భావించినా దాని నుంచి తప్పించుకున్నాడు.కేవలం ఒక వార్నింగ్‌తో పీసీబీ సరిపెట్టడంతో ఉమర్ బయటపడ్డాడు. అయితే ఫిక్సింగ్ వివాదంలో మాత్రం అక్మల్ నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చింది. గతంలో మికీ ఆర్థర్ కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఉమర్ ప్రవర్తన విసుగు తెప్పించేది. ఆర్థర్‌పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి తరచు వార్తల్లో నిలిచేవాడు ఉమర్. తన అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్ ఆడాడు.గత అక్టోబర్‌లో పాకిస్తాన్ తరఫున అక్మల్ చివరిసారి ప్రాతినిథ్యం వహించాడు. (ధావన్ ఒక ఇడియట్.. స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
కేపీఎల్ ఫిక్సింగ్: అంతర్జాతీయ బుకీ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో పలు మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు యత్నించిన ఒక అంతర్జాతీయ బుకీని అరెస్టు చేశారు. మ్యాచ్‌లను ఫిక్సింగ్‌కు చేయడానికి పాల్పడ్డ హర్యానాకు చెందిన సయ్యమ్ అనే వ్యక్తిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలబ్రేటీ డ్రమ్మర్ భవేశ్ బఫ్నా సాయంతో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి సయ్యర్ యత్నించాడు. అయితే అతనిపై ముందుగా లుక్ ఔట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు.(ఇక్కడ చదవండి: క్రికెటర్ గౌతమ్ అరెస్ట్) ఈ క్రమంలోనే వెస్టిండీస్‌లో దాక్కొన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల బళ్లారి టస్కర్స్ కెప్టెన్ సీఎం గౌతమ్‌తో పాటు అబ్రార్ కాజీలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడానికి రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా బుకీని కూడా అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. -
క్రికెటర్ గౌతమ్ అరెస్ట్
బెంగళూరు: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశవాళీ క్రికెటర్ చిదంబరం మురళీధరన్ గౌతమ్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై గౌతమ్‌ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు సహచర క్రికెటర్ అబ్రార్ కాజీను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో బల్లారి టస్కర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరిపై ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో గౌతమ్, కాజీలను క్రైమ్ బ్రాంచ్ విభాగం అదుపులోకి తీసుకుంది. బల్లారీ టస్కర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్.. ఫిక్సింగ్ చేయడానికి నగదు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాటింగ్ స్లోగా చేయడానికి ఈ జోడికి రూ. 20 లక్షలు బుకీలు అందజేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా హబ్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.(ఇక్కడ చదవండి: టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్!) దేశవాళీ టోర్నీల్లో భాగంగా గతంలో కర్ణాటక తరఫున ఆడిన గౌతమ్.. గోవాకు మారిపోయాడు. ఇక కాజీ మిజోరాం తరఫున ఆడుతున్నాడు. కాగా, శుక్రవారం నుంచి ఆరంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల జట్టులో చోటు దక్కించుకున్న సమయంలో అరెస్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. భారత-ఏ మాజీ ఆటగాడైన గౌతమ్.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. 94 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ 4,716 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013-14, 2014-15 సీజన్లో కర్ణాటక గెలిచిన మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించాడు. -
‘ధోని-కోహ్లిలను కలిసే ధైర్యం చేయరు’
ముంబై : భారత క్రికెట్లో ఫిక్సింగ్ భూతం మరోసారి అలజడి రేపింది. గత మూడేళ్లుగా అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరుగాంచిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కొందరు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో తేలింది. అయితే అంతర్జాతీయ క్రికెటర్ కూడా ఈ ఫిక్సింగ్ ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బుకీలు ఎప్పుడూ సులువైన మార్గాన్నే ఎంచుకుంటారు. ఎవరు ఈజీగా ట్రాప్‌లో పడతారో వారినే వెతుక్కుంటారు. అంతేకాని ధోని, కోహ్లి వంటి దిగ్గజాలను, క్రికెట్ పట్ల అంకితాభావం ఉన్నవారిని సంప్రదించే ధైర్యం చేయరు. ఎందుకంటే వారిని కలిస్తే ఏమవుతుందో బుకీలకు తెలుసు. వారిని కలిసి సమయం వృథా చేసుకోవడం కంటే డబ్బులు, మాయ మాటలకు(జాతీయ జట్టులో ఆడే అవకాశం కల్పిస్తాం) లొంగే ఆటగాళ్లను బుకీలు ఎంచుకుంటారు. ఓ స్థాయి క్రికెటర్ ఫిక్సింగ్‌కు పాల్పడి తమకున్న మంచి పేరును చెడగొట్టుకోరు. బుకీలు తమకు ఏ టోర్నీ సౌలభ్యంగా ఉంటుందో అక్కడికే వెళతారు. ఇక్కడ(భారత్‌లో) సాధ్యం కాకుంటే విదేశీ టోర్నీలపై దృష్టి పెడతారు. ఫిక్సింగ్‌లో కోచ్ పాత్ర గురించి.. గతంలో ఐపీఎల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీతో కూడా ఆ కోచ్ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడని అతను ఐపీఎల్ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో, టీఎన్‌పీఎల్‌తో ఎలా జత కలిశాడో కూడా కూడా ఆశ్చర్యకరం. ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరు’ అని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. -
ప్రపంచకప్‌లో అవినీతి నిరోధానికి..
లండన్: వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ తదితర అంశాలకు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా వ్యవస్థను ఏర్పాటు చేసింది. టోర్నీలో పాల్గొంటున్న ప్రతీ జట్టుతో పాటు ఒక్కో అవినీతి నిరోధక అధికారి తోడుగా ఉంటారని ఐసీసీ ప్రకటించింది. మొత్తం 10 జట్లకుగాను పది మందిని ఇందు కోసం ఎంపిక చేసినట్లు, వార్మప్ మ్యాచ్‌ల నుంచి ఫైనల్ వరకు వారు అన్ని సమయాల్లో జట్టుతోనే ఉంటారని వెల్లడించింది. గతంలో ఒక్కో వేదిక వద్ద ఒక్కో అవినీతి నిరోధక అధికారి ఉండేవారు. ఇప్పుడు కొత్తగా నియమిస్తున్నవారు జట్టు బస చేసే హోటల్లోనే ఉంటారని... క్రికెటర్ల ప్రాక్టీస్, ప్రయాణ సమయంలో కూడా జట్టుతోనే కలిసి తిరుగుతారు. టీమ్‌తోనే పాటే ఉండటం వల్ల ఆటగాళ్లకు దగ్గర కావాలని ప్రయత్నించే వారిని, సహాయక సిబ్బందితో పరిచయం పెంచుకోవాలనుకునే వారిని సునాయాసంగా గుర్తించడంతో పాటు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతీ ఒక్కరిపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. -
ఫిక్సింగ్‌లో లంక మాజీ క్రికెటర్!
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో మరో శ్రీలంక ఆటగాడు చిక్కుకున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై లంక మాజీ పేసర్ దిల్హారా లొకుహెట్టిగేపై ఐసీసీ నిషేధం విధించింది. గత ఏడాది డిసెంబర్లో యూఏఈలో జరిగిన టి10 లీగ్ సందర్భంగా ఫిక్సింగ్ చోటు చేసుకుందనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి లొకుహెట్టిగేపై ఐసీసీ మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసింది. ఇటీవల దాదాపు ఇదే తరహాలో ఆరోపణలతో మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై కూడా ఐసీసీ అభియోగాలు మోపడం గమనార్హం. శ్రీలంక తరఫున 9 వన్డేలు, 2 టి20లు ఆడిన లొకుహెట్టిగే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నా... అతను లంక బోర్డుకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. -
భారత్‌తో ఫిక్సింగ్ చేయమన్నారు : పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన ఆరోపణలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్ వెల్లడించాడు. ‘‘2015 ప్రపంచకప్‌లో భారత్‌తో అదే మా తొలి మ్యాచ్. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, ఇలాంటి ఉద్దేశాలతో మరోసారి నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా హెచ్చరించా’’ అని అక్మల్ చెప్పాడు. ఈ వ్యాఖ్యల అనంతరం ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్‌కు సమన్లు జారీ చేశాయి. 2015 ఫిబ్రవరి 15న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో దిగిన పాక్ మహమ్మద్ షమీ బౌలింగ్ ధాటికి 224 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 76 పరుగులతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 107 పరుగులతో చెలరేగిపోయాడు. Umar Akmal claims he was offered $200,000 during World Cup to leave two deliveries, tells @Shoaib_Jatt that he was also offered money to skip games against India. I wonder if Akmal had ever reported these approaches, if not then this statement will get him in more troubles. pic.twitter.com/inIQLN5Np4 — Faizan Lakhani (@faizanlakhani) June 24, 2018 -
మరిన్ని చిక్కుల్లో షమీ!
న్యూఢిల్లీ: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కష్టాలు మరిన్ని పెరిగాయి. భార్య హసీన్ జహాన్ గృహహింస ఆరోపణలు, బీసీసీఐ కాంట్రాక్ట్ నిలిపివేత, పోలీసు కేసుల నమోదు అనంతరం ఇప్పుడు క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) రంగంలోకి దిగింది. హసీన్ చేసిన ఆరోపణల్లో ‘టెలిఫోన్ సంభాషణ’పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ నీరజ్ కుమార్‌ను సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించారు. వారం రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. అయితే నీరజ్‌కు ఇచ్చిన ఈ ఆదేశాల్లో ఎక్కడా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే పదం మాత్రం వాడలేదు. ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారవేత్త మొహమ్మద్ భాయ్ చెప్పడంతో అలీస్బా అనే పాకిస్తాన్ మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని ఆ ఫోన్‌కాల్‌లో హసీన్ ఆరోపించింది. ‘షమీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నాం. షమీ, అతని భార్యకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను మేం విన్నాం. బయట కూడా అది అందుబాటులో ఉంది. ఈ ఒక్క అంశంలో మాత్రమే విచారణ చేస్తాం. కేసుకు సంబంధించిన ఇతర విషయాల జోలికి వెళ్లదల్చుకోలేదు’ అని రాయ్ వ్యాఖ్యానించారు. మొహమ్మద్ భాయ్, అలీస్బా ఎవరు, నిజంగానే వారి నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడా, ఒక వేళ తీసుకుంటే ఎందుకు తీసుకున్నాడు అనే మూడు విషయాలపై విచారణ జరిపి నీరజ్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. -
క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారు!
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను ఫిక్సింగ్ భూతం వదిలేటట్లు కనబడుటం లేదు. ఇప్పటికే పలువురు పాక్ క్రికెటర్లు ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా నిషేధాని గురవ్వగా, తాజాగా పీఎస్ఎల్లో మరొకసారి ఫిక్సింగ్ కలకలం రేగింది. దుబాయ్‌లో జరుగుతున్న పీఎస్ఎల్ క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారనే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.' 'కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా బుకీలు ఆటగాళ్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఆటగాళ్ల నుంచి వారికి ఎలాంటి స్పందన దక్కలేదు. ఈ సమస్యను ఇప్పటికే ఆటగాళ్లు మా దృష్టికి తీసుకువచ్చారు. అప్రమత్తమైన మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం' అని సదరు ప్రతినిధి తెలిపారు.పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకల చెలరేగడం ఇది తొలిసారి కాదు. గత సీజన్లో లతీఫ్, షర్జీల్ ఖాన్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఐదేళ్ల నిషేధం పడగా, నాసీర్ జంషెడ్‌పై ఏడాది నిషేధం విధించారు. -
నిషేధం తొలగించండి
కొచ్చి: బీసీసీఐచే జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. ఇటీవలే స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు బోర్డు అతడికి ఎన్వోసీ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇప్పటికే నాలుగేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, తగిన న్యాయం చేయాల్సిందిగా ప్రస్తుత పరిపాలక కమిటీని పర్యవేక్షిస్తున్న వినోద్ రాయ్‌కు శ్రీశాంత్ లేఖ రాశాడు. 2013లో జరిగిన ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయినా ఢిల్లీ పోలీసులచే క్లీన్చిట్ పొందానని, అయినా గత బోర్డు పెద్దలు ఇంకా తనపై కక్ష సాధిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందాడు. దీంతో గతంలో చాలాకాలం కేరళలో ఐఏఎస్‌గా పనిచేసిన వినోద్ రాయ్ జోక్యం కోసం శ్రీశాంత్ ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడా విఫలమైతే తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా కోర్టుకెక్కే ఆలోచనలో ఉన్నాడు. -
పాక్ క్రికెటర్ జంషెద్ అరెస్ట్
ఫిక్సింగ్ ఆరోపణలతో లండన్‌లో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు పాక్ క్రికెటర్ నాసిర్ జంషెద్‌గా తేలింది. దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో జంషెద్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ ఏజెన్సీ నిర్ధారించింది. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించినా... వారి పేర్లను ముందుగా వెల్లడించలేదు. పోలీసులు అదుపులోకి తీసుకోక ముందే పాక్ క్రికెట్ బోర్డు జంషెద్పై అనుమానంతో అతడిపై నిషేధం విధించింది. గత ఏడాది పీఎస్ఎల్ బరిలోకి దిగిన జంషెద్ ఈ సీజన్లో టోర్నీలో ఆడటం లేదు. పాక్ తరఫున 2 టెస్టులు, 48 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల జంషెద్... తన కెరీర్లో మూడు అంతర్జాతీయ సెంచరీలను భారత్‌పైనే వన్డేల్లో సాధించాడు. -
పాక్ క్రికెటర్ జంషేడ్‌పై నిషేధం
కరాచీ: దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మరో పాకిస్తాన్ క్రికెటర్ నాసిర్ జంషేడ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ఫిక్సింగ్ ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు పాక్ క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. 27 ఏళ్ల జంషేడ్ పాక్ తరఫున రెండు టెస్టులు, 48 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌లు ఆడాడు. జంషేడ్ కోరినందుకే అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్‌కు చెందిన వ్యక్తితో తాము భేటీ అయ్యామని విచారణ సందర్భంగా షర్జీల్, లతీఫ్ వెల్లడించడంతో పాక్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. -
జీవిత కాల నిషేధం విధించాల్సిందే:ఆమిర్
కరాచీ: మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్లకు జీవిత కాల నిషేధం విధించడమే సబబని గతంలో ఫిక్సింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఫిక్సర్లకు జీవిత కాల నిషేధమే తగిన శిక్షని ఇటీవల ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ మద్దతు తెలిపాడు. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే వారిపై జీవిత కాలం నిషేధం విధించడం ఒకటే సరైన మార్గమన్నాడు. తాను కూడా ఫిక్సింగ్ కు పాల్పడిన తరువాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేస్తానని అస్సలు అనుకోలేదని తన చేదు జ్ఞాపకాల్ని ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. మళ్లీ తాను టెస్టు క్రికెట్ ఆడటం నిజంగా అదృష్టమేనన్నాడు. ఇంకా ఇప్పటికే తన పునరాగమనం నమ్మశక్యంగా లేదన్నాడు. తన టెస్టు క్రికెట్ జీవితం తిరిగి ఇంగ్లండ్‌లోని ప్రారంభం కావడంపై ఆమిర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తో సిరీస్‌కు ఆతృతగా ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 2010లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన ఆమిర్ ఐదు సంవత్సరాల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. ఇటీవల పాక్ జట్టులో పునరాగమనం చేసిన ఈ స్టార్ పేసర్ ఆసియా కప్‌లో రాణించి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో అతని ఇంగ్లండ్ వెళ్లే పాక్ జట్టులో స్థానం కల్పించారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి: బీసీసీఐ కార్యదర్శి షిర్కే
క్రికెట్లో అవినీతిని, ఫిక్సింగ్‌ను అరికట్టాలంటే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడమే మేలనే లోధా కమిటీ సిఫారసుకు తాను మద్దతు ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే చెప్పారు. ‘బీసీసీఐ ఆటగాళ్లను ఎడ్యుకేట్ చేస్తుంది. కానీ వాళ్లమీద అనుక్షణం నిఘా పెట్టలేం. కాబట్టి లోధా కమిటీ ప్రతిపాదనను అమల్లోకి తెస్తే మేలనేది నా అభిప్రాయం’ అని షిర్కే తెలిపారు. -
దక్షిణాఫ్రికా క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ మరో సారి ఫిక్సింగ్ వార్తల్లో నిలిచింది. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ ఒకరు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు బయటపడింది. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా దేశవాళీ టి20 టోర్నీ ‘రామ్‌స్లామ్’లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఆటగాడు ఎవరనేది స్పష్టంగా తెలియకపోయినా... తమ బోర్డు నిబంధనల ప్రకారం ఇప్పటికే విచారణ మొదలు పెట్టినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. -
చెన్నై, రాజస్తాన్ రెండేళ్లు అవుట్
వాటి స్థానంలో రెండు కొత్త ఐపీఎల్ జట్లకు అవకాశం టైటిల్ స్పాన్సరర్‌గా వీవో మొబైల్స్ నవంబర్ 9న ఏజీఎం బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు ముంబై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంతో మసకబారిన ప్రతిష్టను పెంచుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నడుం బిగించింది. రెండేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను పూర్తిగా రద్దు చేయకుండా... వాటి స్థానంలో మరో రెండు కొత్త జట్లను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈమేరకు వచ్చే రెండు సీజన్ల కోసం రెండు కొత్త జట్లను ఎంపిక చేసేందుకు బిడ్స్‌ను ఆహ్వానించనుంది. దీంతో ఐపీఎల్‌ను ఎనిమిది జట్లతోనే జరుపుతామని బోర్డు స్పష్టం చేసినట్టయ్యింది. బీసీసీఐ నూతన అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అధ్యక్షతన జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని సభ్యులు భావించారు. దీంతో 2016, 2017 సీజన్లకు చెన్నై, రాజస్తాన్ జట్లు దూరంగా ఉంటాయి. వీటి స్థానాలను మరో రెండు కొత్త జట్లు భర్తీ చేస్తాయి. అందరూ ఊహించినట్టుగానే ఈ మాజీ చాంపియన్లను రద్దు చేసేందుకు మెజారిటీ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో రెండేళ్ల అనంతరం... అంటే 2018 సీజన్ నుంచి ఇవి తిరిగి బరిలో ఉంటాయి. అయితే కొత్తగా చేరిన రెండు జట్లకు తోడు చెన్నై, రాజస్తాన్‌లను కలిపి 2018 సీజన్‌ను పది జట్లతో ఆడిస్తారా.. లేదా అనే విషయంలో బోర్డు స్పష్టత ఇవ్వలేదు. ‘ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన నాలుగు ప్రతిపాదనల్లో ఒక్కదానికి మాత్రమే కమిటీ ఆమోదం తెలిపింది. ఖాళీ అయిన రెండు జట్ల స్థానంలో రెండేళ్ల కోసం బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తాం. ఆ తర్వాతే ఐపీఎల్‌ను 10 జట్లతో కొనసాగించాలా? లేక 8 జట్లతోనే ఉంచాలా అని నిర్ణయిస్తాం’ అని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి రెండేళ్లు ముందుగానే వైదొలిగిన పెప్సీకో స్థానంలో చైనాకు చెందిన వీవో మొబైల్ కంపెనీ హక్కులు దక్కించుకుంది.బోర్డు వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నవంబర్ 9న జరుగుతుంది. -
ఆ మ్యాచ్ ఫిక్స్ కాలేదు!
ముంబై: గత ఏడాది ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగినట్లుగా ప్రచారంలో ఉన్న చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై విచారణ జరుపుతున్న ముద్గల్ కమిటీకి సౌరవ్ సహకరిస్తున్నాడు. ఆ మ్యాచ్‌కు సంబంధించి సౌరవ్‌ను కమిటీ స్పష్టమైన అభిప్రాయం కోరగా... ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని దాదా చెప్పాడు. -
మోడీ.. మళ్ళీ తన సత్తా చాటుతాడా?
-
ఫిక్సింగ్ : బాధ్యులెవరో ? బాధితులెవరో ?
-
ఫిక్సింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఆస్ట్రేలియన్లు అరెస్ట్!
కాన్ బెర్రా: మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ఏ క్రీడను వదలి పెట్టడం లేదు. ఇప్పటి వరకూ ప్రముఖంగా క్రికెట్ లో కనిపించే ఫిక్సింగ్ మహమ్మారి ఇప్పుడు టెన్నిస్ కూడా సోకింది. ఇటీవల కాలంలో జరిగిన ఒక అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ను ఫిక్సింగ్ చేయడానికి యత్నించిన ఆరుగురు ఆస్ట్రేలియన్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది టెన్నిస్ ఆటగాళ్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిని మెల్ బోర్న్, విక్టోరియా పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. విక్టోరియా పట్టణంలో ముఠాగా ఏర్పడిన కొంతమంది బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఫిక్సింగ్ ముఠా రాష్ట స్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. ఇందుకు టెన్నిస్ ఆటగాళ్లనే ప్రధానంగా ఎంచుకుని ఫిక్సింగ్ చేస్తున్నారన్నారు. -
నిను వీడని నీడను...
-
బుకీలతో ఫిక్సయ్యాడు.. ఐసీసీకి బుక్కయ్యాడు!
-
ఫిక్సింగ్ టు కుకింగ్
ఒకప్పుడు అష్రాఫుల్ బంగ్లాదేశ్‌లో పెద్ద క్రికెట్ స్టార్. తన ముద్దుపేరు ‘బంగ్లా సచిన్’. ఒకప్పుడు ఆ దేశంలోని కార్పొరేట్ సంస్థలన్నీ తన వెనక పడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 29 ఏళ్ల వయసులో తన సహచరులు ఇంకా ఆడుతుంటే తాను మాత్రం క్యాటరింగ్ ఆర్డర్స్ కోసం అదే కార్పొరేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నాడు. అవును... అష్రాఫుల్ ఇప్పుడు ఢాకాలో ఓ చైనీస్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. బత్తినేని జయప్రకాష్ ఓల్డ్ ఢాకా... సాయంత్రం 7 గంటలు... వెళ్లాల్సిన ప్రదేశం షెజ్వాన్ గార్డెన్స్... విపరీతమైన రద్దీ.. చుట్టూ బోర్డులన్నీ బెంగాలీలో... ఒక్కళ్లకీ హిందీ, ఇంగ్లీష్ రావడం లేదు... ఎలా..? ‘మీరు అడ్రస్ అడిగితే ఎవరూ చెప్పరు. అష్రాఫుల్ రెస్టారెంట్ ఎక్కడ?’ అని అడగండి (ఫోన్లో అష్రాఫుల్). ఫర్వాలేదు... అష్రాఫుల్కు ఇంకా గిరాకీ బాగానే ఉంది. పది నిమిషాల్లోనే రెస్టారెంట్‌కు వెళ్లగలిగిన పరిస్థితి. మ్యాచ్ ఫిక్సర్‌గా ముద్రపడ్డా తన రెస్టారెంట్‌కు డిమాండ్ కూడా బాగానే ఉంది. ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడం సహజం. పరిస్థితి బాగోక మారిపోయేవాళ్లు కొంతమందైతే... చేజేతులా కెరీర్‌ను నాశనం చేసుకునేవాళ్లు మరికొందరు. ఇందులో రెండో కోవలోకి వచ్చే క్రికెటర్ అష్రాఫుల్. 2013 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా గ్లాడియేటర్స్‌కు కెప్టెన్‌గా ఆ జట్టు ఆడిన మ్యాచ్‌ను ఫిక్స్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనివల్ల ఎదురైన పరిణామాలకు ఎలా స్పందించాడు? భవిష్యత్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకు అష్రాఫుల్ చెప్పిన సమాధానాలు అతడి మాటల్లోనే... కోపంతో చేశా బంగ్లాదేశ్ లీగ్ తొలి సీజన్లో ఢాకా గ్లాడియేటర్స్ నన్ను 1.60 కోట్ల టాకా(బంగ్లాదేశ్ కరెన్సీ)లకు కొనుక్కుంది. రెండో సీజన్ సమయానికి నా ఫామ్ పోయింది. కేవలం 48 లక్షల టాకాలకే అదే జట్టు కొనుక్కుంది. అయితే తొలి సీజన్‌కు సంబంధించి వాళ్లు నాకు కేవలం 86 లక్షల టాకాలు మాత్రమే ఇచ్చారు. మిగతావి ఇవ్వలేదు. దీంతో ఢాకా జట్టు ఓనర్‌కి, నాకు చాలాసార్లు వాగ్వాదాలు జరిగాయి. ఒక రోజు ఒక బుకీ నా దగ్గరకు వచ్చి 10 లక్షల టాకాలు ఇస్తా, మ్యాచ్ ఫిక్స్ చేయమని అడిగాడు. కానీ నేను ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు ఢాకా ఓనర్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత... నేను ఆ కోపంలో ఉండగానే బుకీ వచ్చాడు. 10 లక్షల టాకాలు ఇస్తా మ్యాచ్ ఓడిపోమని అడిగాడు. ఆ సమయంలో ఏం ఆలోచించానో తెలియదు. నా డబ్బులు నాకు రాలేదని కోపం బహుశా నన్ను అలా ఆలోచించేలా చేసిందేమో. నేను ఒప్పుకున్నాను. నా జీవితంలో నేను చేసిన తప్పు అదొక్కటే. డబ్బు మనిషిని కాను నిజానికి నేను డబ్బు మనిషినే అయితే గనక ఎప్పుడో ఐసీఎల్లోనే నాకు 15 కోట్ల టాకాలకు కాంట్రాక్ట్ ఇస్తామని వచ్చారు. కానీ ఆ లీగ్‌లో నేను ఆడితే బంగ్లాదేశ్ అభిమానులు నన్ను డబ్బు మనిషిగా భావిస్తారని వెళ్లలేదు. దేశం, అభిమానులు ముఖ్యమని అనుకున్నా కాబట్టే అప్పట్లో అంత భారీ మొత్తం ఇస్తామన్నా వెళ్లలేదు. ఐసీసీ విచారణ ఐసీసీ విచారణలో మొదట గంట పాటు నేనేం చెప్పలేదు. కానీ అప్పటికే నా మీద నిషేధం ఖాయమని తెలుసు. ఓ గంట తర్వాత ఎందుకో నా మనసుకు అనిపించింది. ఎందుకు అబద్దం చెప్పడం.? అదేదో నిజం చెప్పే నిషేధాన్ని ఎదుర్కొందాం అనుకున్నాను. బంగ్లాదేశ్ క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అభిమానులు నన్ను ఎంతో ఆరాధించారు. కానీ తిరిగి వాళ్లకు నేనేం ఇచ్చాను. ఎలాగూ నా కెరీర్ ముగిసిపోతోంది. ఇక ఎందుకు అబద్దం ఆడటం? స్నేహితులతో కలిసి రెస్టారెంట్ నిషేధం తర్వాత స్నేహితులు నాలో ధైర్యం పెంచారు. వాళ్లలో ఎక్కువమంది చిన్నప్పుడు నాతో కలిసి క్రికెట్ ఆడినవాళ్లే. నేనేంటో వాళ్లకు తెలుసు. అందుకే అందరం కలిసి ఈ రెస్టారెంట్ (షెజ్వాన్ గార్డెన్) పెట్టుకున్నాం. మా వాళ్లు సంబంధాలు చూస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పటివరకూ గర్ల్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవడానికి సమయం సరిపోలేదు. క్రికెట్‌తో బిజీగా గడిపాను. ఇప్పుడు సమయం దొరికింది. కాస్త దైవం మీద కూడా శ్రద్ధ పెరిగింది. హజ్ వెళ్లి రావాలని అనుకుంటున్నాను. ఆ రోజులు మరవలేను 2001లో 17 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ క్రికెట్ రాతను మార్చాను నేను. ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించే దేశంలో అభిమానులను క్రికెట్ వైపు మళ్లించింది నేనే. 17 ఏళ్ల వయసులో తొలి టెస్టు సెంచరీ చేయడంతో నాకు క్రేజ్‌వచ్చింది. ఓ దశలో జట్టు ఎలా ఆడినా, గెలిచినా ఓడిపోయినా వేరే వాళ్లు పరుగులు చేసినా... ఏం జరిగినా అన్ని పేపర్లలో మొదటి పేజీలో నా ఫొటోనే వచ్చేది. ఒకప్పుడు ‘అష్రాఫుల్’ అనేది బంగ్లాదేశ్ క్రికెట్‌కు మారుపేరు. క్షమించండి: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నన్ను ఆదరించారు. కానీ నేను తిరిగి వాళ్లకు ఏమీ ఇవ్వలేకపోయాను. కేవలం ఒక్క బీపీఎల్ మ్యాచ్‌లో మాత్రమే నేను తప్పు చేశాను. నన్ను క్షమించి మరొక్క అవకాశం ఇస్తే అందరి రుణం తీర్చుకుంటాను. -
ఐపీఎల్ అంతా ఫిక్సింగే!
ముంబై: వివాదాల్లో ఇప్పటికే నిండా మునిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై నటుడు విందూ సింగ్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అసలు గొడవంతా శరద్‌పవార్, శ్రీనివాసన్‌లకు సంబంధించిందేనని, తనలాంటి వారిని పావులుగా మార్చారని అతను అన్నాడు. ఇక ఆర్సీబీ యజమాని విజయ్ మాల్యా అయితే బెట్టింగ్ ద్వారానే కోట్లు గడించారని అన్నాడు. విందూ సింగ్ తమ శూలశోధనలో ఇదంతా బయట పెట్టాడంటూ ‘జీ న్యూస్’ చానల్ ప్రకటించింది. ‘జీ’ కథనం ప్రకారం...బెట్టింగ్‌లో తన పాత్ర ఏమీ లేకపోయినా శరద్ పవార్ చెప్పడం వల్లే జైల్లో ఉండాల్సి వచ్చిందంటూ స్వయంగా తనతో పోలీసులు చెప్పారని విందూ అన్నాడు. అయితే పవార్‌లాంటి పెద్ద వ్యక్తి ముందు నేనెంత అని అతను చెప్పాడు. ఐపీఎల్లో అంతా ఫిక్సింగ్ జరుగుతుందని, విజయ్ మాల్యా ఒక్కడే రూ. 100-200 కోట్లు బెట్టింగ్ ద్వారా సంపాదించారని విందూ వెల్లడించాడు. బాలీవుడ్ తారలంతా బెట్టింగ్ చేస్తారని, అయితే ఫిక్స్ చేయలేరని అతను చెప్పాడు. ఫిక్సింగ్ చేసేవాళ్లు ఆటగాళ్లకు ఒక్కసారిగా రూ. 14-15 కోట్లు ఇచ్చి తమ బుట్టలో పడేసుకుంటారని, ఆ తర్వాత వారు చెప్పినట్లుగా ఆటగాళ్లు చేస్తారని సంచలన వ్యాఖ్య చేశాడు. ఐపీఎల్‌తో బాగా కలిసిపోయిన ఆటగాళ్లు ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లను కూడా ఫిక్స్ చేస్తారన్న విందూ...శ్రీశాంత్ ఎలాంటి తప్పూ చేయలేదని మద్దతు పలికాడు. లలిత్ మోడి సహకారంతో శ్రీనివాసన్‌ను నిలువరించాలన్న శరద్ పవార్ వ్యూహంలో భాగంగానే ఐపీఎల్లో ఇన్ని విపరిణామాలు చోటు చేసుకున్నాయని విందూ సింగ్ వెల్లడించాడు. -
ఫిక్సర్లకు రాయితీలు..!
రాష్ట్ర విభజన అంశాన్ని నేతలు క్రికెట్‌తో పోలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తానింకా బ్యాటింగే మొదలుపెట్టలేదని సీఎం చెబుతుండగా విభజన ప్రక్రియ అంతా అయిపోతున్న సమయంలో చివరి బంతికి సెంచరీ ఎలా చేస్తారని తెలంగాణ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మ్యాచ్ ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కొందరు సీమాంధ్ర నేతలతో ఫిక్సింగ్ చేసుకుని తన పని సాఫీగా చేసుకుపోతోందని అసెంబ్లీ లాబీల్లో చర్చ. సమైక్య బ్యాటింగ్ మొదలెట్టాలని కొందరు సీమాంధ్ర ఎంపీలను హైకమాండే ఫీల్డ్‌లోకి దింపిందట. బ్యాటు పట్టుకోవడమే తెలియని వారికి గేమ్‌ప్లాన్ వివరించిందట. ‘వీర లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించండి. మీకు మీరే చాంపియన్లుగా కూడా ప్రచారం చేసుకోండి. అవసరమైతే చివరి బంతిలోనూ సెంచరీ చేస్తామని చెప్పండి. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే కొద్ది రోజుల్లో మరో కొత్త మ్యాచ్ ప్రారంభించాల్సి ఉంటుంది’ అంటూ నూరిపోసిందట. ఇంకేం.. వారంతా రంగంలోకి దిగి స్లోగన్లు, పోస్టర్లు, హోర్డింగ్‌లు, చానెళ్లలో నినాదాలను ఊదరగొట్టడం మొదలెట్టారు. దాంతో.. సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధం కావాలని హైకమాండ్ ఆదేశించిందట. మళ్లీ ఇదేమిటని అనుకుంటున్నారా! కొత్త పార్టీ పెట్టి జనంలోకి వెళ్లడం.., ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చి పాత టీమ్ (కాంగ్రెస్)లో చేరిపోవడం. ఇటీవలే ఏఐసీసీ మీటింగ్‌కు హాజరైన ఓ నేత అసెంబ్లీ లాబీల్లో ఈ మ్యాచ్ (ఫిక్సింగ్) వివరాలను వెల్లడించారు. దీనివల్ల మనోళ్లకి లాభమేనండీ అని కూడా చెప్పారట. ‘సెకండ్ ఇన్సింగ్స్కయ్యే ఖర్చులకు భారీఎత్తున జేబులు నింపడంతో పాటు ఆ ప్లేయర్లకు చెందిన కంపెనీలకు హైకమాండ్ అనేక రాయితీలు ప్రకటించింది. లేదంటే ఈ ‘ఫిక్సర్లు’ ఊరికే ఫీల్డ్‌లోకి దిగుతారనుకుంటున్నారా?’ అని ఆయన చెప్పడంతో అక్కడున్న వారంతా ‘ఓహో! దీని వెనుక ఇంత కథ ఉందా!’ అనుకున్నారు. -
అవినీతి నిరోధక కోడ్‌కు మార్పులు
లండన్: ప్రపంచ క్రికెట్లో రోజురోజుకూ వేళ్లూనుకుంటున్న ఫిక్సింగ్ జాడ్యానికి అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా తమ అవినీతి నిరోధక కోడ్‌ను సవరించి మరింత పకడ్బందీగా రూపొందించారు. కోడ్‌ను ఆమోదం కోసం వచ్చే జనవరిలో జరిగే సమావేశం ముందు ఉంచనున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు చెందిన తొమ్మిది మంది ఆటగాళ్ల ఫిక్సింగ్ వ్యవహారంపై వివరాలను సమీక్షించారు. అలాగే పాక్ యువ పేసర్ మహ్మద్ ఆమిర్‌పై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఎత్తివేసే అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ సవరించిన కోడ్ అమల్లోకి వచ్చాక పరిశీలించేందుకు నిర్ణయించారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం స్టేడియాల నిర్మాణానికి తుది గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. ఈనెల 27న ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఢాకాలో ప్రకటించనున్నారు. తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న అఫ్ఘానిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (ఐడీఐ) బోర్డు 1.1మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు అనుమతించింది. -
మరో నలుగురు!
ముంబై: ఐపీఎల్-6 ఫిక్సింగ్ ఉదంతంలో మరో నలుగురు క్రికెటర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు హనుమ విహారి, ఆశిష్ రెడ్డి, కరణ్ శర్మ, తిసారా పెరీరా కలిసి రూ. 6 కోట్లు తీసుకున్నారని ఓ బుకీ ముంబై పోలీసులకు చెప్పాడు. గత శనివారం ఫైల్ చేసిన చార్జిషీట్లో ముంబై పోలీసులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ఏప్రిల్ 17న పుణే, సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ నలుగురు ఆటగాళ్లు తమకు సహకరించారని బుకీ చంద్రేశ్ పటేల్ విచారణలో పోలీసులకు చెప్పాడు. ‘సన్‌రైజర్స్ మ్యాచ్‌ను ఫిక్స్ చేయడానికి రూ. 5 కోట్లు ఆటగాళ్లకు ఇవ్వాలని, ఒక కోటి తమకు కమిషన్ అని యూసుఫ్ అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించాడు. ఏప్రిల్ 16న పుణేలోని ఒక హోటల్లో ఈ నలుగురు ఆటగాళ్లను మాకు పరిచయం చేశాడు. సన్‌రైజర్స్ స్కోరు తొలి 10 ఓవర్లలో 60, మొత్తం 20 ఓవర్లలో 140 పరుగులు దాటకూడదని మాట్లాడుకున్నాం. అలాగే మ్యాచ్ ఓడిపోవాలని కూడా అడిగాం’ అని పటేల్ చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచింది. మ్యాచ్ మీద రూ.9 కోట్లు పందెం కాసిన చంద్రేశ్ ఆ మొత్తం ఓడిపోయాడు. స్కోర్ల మీద రూ.3.5 కోట్లు పందెం కాసి గెలిచాడు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా వెలువడే ఓ ఆంగ్ల పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఆటగాడి సోదరుడు సూత్రధారి? చార్జిషీట్లో ముంబై పోలీసులు హైదరాబాద్ ఆటగాడు ఆశిష్ రెడ్డి సోదరుడు ప్రీతమ్ రెడ్డి పేరును ప్రస్తావించారు. ‘బుకీలు ప్రీతమ్తోనే డీల్ కుదుర్చుకున్నారు. రూ. 6 కోట్లు ఇస్తామని ఫిక్సింగ్ చేయాలని బుకీలు అతడిని కోరారు. దీనికి అతను అంగీకరించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వికెట్ పడితే డీల్ ఓకే అయినట్లని ప్రీతమ్ బుకీలతో చెప్పాడు. (ఆ మ్యాచ్‌లో డి కాక్ రెండో ఓవర్లో అవుటయ్యాడు) దీంతో బుకీలు పందేలు కాశారు’ అని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. విచారణకు ఎందుకు పిలవలేదు? పోలీసులు చార్జిషీట్లో ఈ నలుగురు క్రికెటర్ల పేర్లను ప్రస్తావించారు. బుకీ చంద్రేశ్ జూన్ 17న ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నలుగురు క్రికెటర్లను పోలీసులు విచారణకు ఎందుకు పిలవలేదనేది పెద్ద ప్రశ్న. అంటే బుకీ చెప్పిన విషయాన్ని పోలీసులు నమ్మలేదా? లేక తగిన సాక్ష్యాలు లభించలేదా? అనేది తేలాల్సి ఉంది. ఏమైనా విహారి, ఆశిష్ రెడ్డి లాంటి వర్ధమాన క్రికెటర్ల భవిష్యత్‌కు ఇది పెద్ద దెబ్బ. ప్రస్తుతం జట్టుతోనే... ఆరోపణలు వచ్చిన నలుగురు క్రికెటర్లు ప్రస్తుతం చాంపియన్స్ లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. వీరంతా జట్టుతో పాటే మొహాలీలో ఉన్నారు. ఒకవేళ వీళ్ల మీద అనుమానం ఉంటే కనీసం బీసీసీఐకి గానీ, జట్టుకు గానీ పోలీసులు చెప్పాల్సింది. కానీ ఇప్పటివరకూ జట్టుకు అలాంటి సమాచారం ఏమీ లేదు. మేం నమ్మడం లేదు: లంక బోర్డు తమ ఆటగాడు తిసారా పెరీరా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన కథనాలను శ్రీలంక బోర్డు ఖండించింది. పెరీరా మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని పేర్కొంది. ‘ఈ విషయం గురించి భారత్‌లోని అధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. మా క్రికెటర్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతను అలాంటి పనులకు పాల్పడడు’ అని లంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ‘మా అబ్బాయి మీద నమ్మకం ఉంది’ ఫిక్సింగ్ కథనాన్ని విహారి తల్లి విజయలక్ష్మి ఖండించారు. ఇవన్నీ ఆధారం లేని కథనాలని పేర్కొన్నారు. ‘మా అబ్బాయి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుర్రాడు ఇలా ఎందుకు చేస్తాడు? ఇవన్నీ నిరాధార కథనాలు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రస్తుతం ఇంతకంటే మాట్లాడటానికేం లేదు’ అని ఆమె ‘సాక్షి’తో చెప్పారు. -
తప్పుగా అర్థం చేసుకున్నారు
న్యూఢిల్లీ: ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలతో క్రికెట్ విశ్వసనీయత దెబ్బతింటుందనే తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకున్నాయని భారత జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ‘నేనన్న మాటలను కొంతమంది మరో రకంగా అర్థం చేసుకోవడం నిరాశ కలిగించింది’ అని ద్రవిడ్ చెప్పినట్టు ‘క్రిక్ ఇన్ఫో’ వెబ్సైట్ ట్వీట్ చేసింది. అలాగే విశ్వసనీయత గురించి ద్రవిడ్ చెప్పిన మాటల సారాంశాన్ని అర్థం చేసుకోవడంలో గందరగోళం నెలకొందని, పూర్తి ఇంటర్వ్యూ కోసం బుధవారం వరకు వేచి ఉండాలని కోరింది. ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ కారణంగా నెలకొన్న పరిస్థితుల గురించి ఆవేదన చెందిన ద్రవిడ్... ఆటపై విశ్వసనీయత పెరిగేలా ఆటగాళ్లు, పరిపాలకులు ప్రయత్నించాలని సూచించాడు. అభిమానుల కారణంగానే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని గుర్తుచేశాడు. క్రికెట్ పాలకులు కూడా ఆటగాళ్లు, అభిమానుల వల్లే ఆటను ముందుకు తీసుకెళుతున్నారని, అందుకే క్రికెట్ బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా విశ్వసనీయతతో పనిచేయాల్సి ఉంటుందన్నాడు.