ఫిక్సింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఆస్ట్రేలియన్లు అరెస్ట్! | Six Australians nabbed from 'tennis match-fixing ring' | Sakshi
Sakshi News home page

ఫిక్సింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఆస్ట్రేలియన్లు అరెస్ట్!

Published Fri, Jul 18 2014 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

Six Australians nabbed from 'tennis match-fixing ring'

కాన్ బెర్రా: మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ఏ క్రీడను వదలి పెట్టడం లేదు. ఇప్పటి వరకూ ప్రముఖంగా క్రికెట్ లో కనిపించే ఫిక్సింగ్ మహమ్మారి ఇప్పుడు టెన్నిస్ కూడా సోకింది. ఇటీవల కాలంలో జరిగిన ఒక అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ను ఫిక్సింగ్ చేయడానికి యత్నించిన ఆరుగురు ఆస్ట్రేలియన్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది టెన్నిస్ ఆటగాళ్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిని మెల్ బోర్న్, విక్టోరియా పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

 

విక్టోరియా పట్టణంలో ముఠాగా ఏర్పడిన కొంతమంది బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఫిక్సింగ్ ముఠా రాష్ట స్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు.  ఇందుకు టెన్నిస్ ఆటగాళ్లనే ప్రధానంగా ఎంచుకుని ఫిక్సింగ్ చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement