Melbourn
-
ఆస్ట్రేలియాలో అవధానార్చన
తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం, సమయస్ఫూర్తి, ధారణ ఏక కాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్యప్రక్రియ తెలుగు భాషా వైభవానికి నిత్యసాక్ష్యం. తటవర్తి గురుకులం ద్వారా వివిధ దేశాల పృచ్ఛకులతో అంతర్జాలంలో జరుగుతున్న అవధానార్చన ఈ ఏడాది ఇప్పటిదాకా 55 అవధానాలను పూర్తి చేసుకుని, 56వ అష్టావధానం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరం వేదికగా భాషాభిమానుల నడుమ డిసెంబరు మూడున ప్రత్యక్షంగా జరుగుతోంది. తెలుగుభాషను తమ సామాజిక భాషలలో ఒకటిగా గుర్తించిన ఆస్ట్రేలియాలో, తెలుగు భాషాభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూ, పద్యరచనను నేర్పి నూతన పద్య కవులను తయారుచేస్తూ అవధానార్చనలు నిర్వహిస్తోంది తటవర్తి గురుకులం. ఈ కార్యక్రమం భారతదేశంలో ఆలయాల అభివృద్ధికి అంకితం చేస్తూ ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి నిర్వహిస్తున్నారు. అవధాని, పృచ్ఛకులు, సంచాలకులు అందరూ మెల్బోర్న్ వారే అవ్వడం, అందులోనూ చంటిపిల్లల తల్లులు కూడా పృచ్ఛకులుగా వస్తూ తమ భాషాభిమానాన్ని తెలుగు వైభవాన్ని చాటడానికి పూనుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమానికి సంచాలకులుగా, ఆస్ట్రేలియాలో ప్రముఖ పద్యకవి డా.వేణుగోపాల్ రాజుపాలెం వ్యవహరిస్తున్నారు. పృచ్ఛకాంశాలైన సమస్యాపూరణం యామిని చతుర్వేదుల , దత్తపది మనోజ్ మోగంటి , వర్ణన అమరేందర్ అత్తాపురం , నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం, న్యస్తాక్షరి రాజశేఖర్ రావి, ఆశువు రంజిత ఓగిరాల, చిత్రానికి పద్యం అర్చన విస్సావజ్ఝుల , అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహిస్తున్నారు. ఈ అవధానార్చనను ఆంధ్రప్రదేశ్ కొవ్వూరులో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంకితంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ATAI వారు సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా తెలుగు సాహిత్యానికి నూతన సొబగులద్దేందుకు సిద్ధమౌతున్నఈ విశిష్ట అవధానార్చన, ప్రవాసతీరాలలో తెలుగుభాషా వికాసానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిద్దాం. -
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం
చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిచ్చిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ చివరి ఓవర్లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతిని అంపైర్లు 'నో బాల్'గా ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరి ఓవర్ నాలుగో బంతిని నవాజ్ ఫుల్ టాస్ వేయగా కోహ్లి దాన్ని సిక్సర్‌గా మలిచాడు. నడుము ఎత్తులో వచ్చిన ఈ బంతిని అంపైర్లు నో బాల్‌గా ప్రకటించారు. వెంటనే పాకిస్థాన్ టీం సభ్యులంతా అంపైర్లతో వాదించారు. అయినా వాళ్లు నిర్ణయాన్ని మార్చుకోలేదు. నో బాల్ తర్వాత ఫ్రీ హిట్‌గా వచ్చిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లను గిరాటేసిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో కోహ్లి- దినేశ్ కార్తీక్ మూడు పరుగులు తీశారు. ఫ్రీ హిట్ అయినందున బ్యాటర్ బౌల్డ్ అయినా ఔట్ ఉండదనే నిబంధనను కోహ్లి చక్కగా వినియోగించున్నాడు. ఈ బంతితోనే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులే అవసరమయ్యాయి. అయితే ఈ నోబాల్ వ్యవహారంపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ట్విట్టర్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. నడుము ఎత్తులో వచ్చిన బంతిని అంపైర్లు రివ్యూ తీసుకోకుండానే నో బాల్‌గా ఎలా ప్రకటించారని అడిగాడు. ఫ్రీ హిట్ బాల్‌కు కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించాడు. Why was no ball not reviewed, then how can it not be a dead ball when Kohli was bowled on a free hit. #INDvPAK #T20worldcup22 pic.twitter.com/ZCti75oEbd — Brad Hogg (@Brad_Hogg) October 23, 2022 ఈ నో బాల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. బంతి బ్యాటర్ నడుము ఎత్తుకు పైకి వస్తేనే నో బాల్ అని కొందరు అంటున్నారు. అంతిమ నిర్ణయం అంపైర్లదే అని, దానికి ఇరు జట్లు కట్టుబడి ఉండాలని మరికొందరు అంటున్నారు. మరికొందరేమో కోహ్లి దాదాపు క్రీజు బయట ఉన్నాడు.. అలాంటప్పుడు బంతి నడుము ఎత్తుపైకి వచ్చినా నో బాల్ కాదు అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతి వరకు అద్భుత పోరాటపటిమ ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కింగ్ కోహ్లి తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తనకు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లి -
Glenn Maxwell: ఆ విషయం గురించి అతడు చెప్పేంత వరకు తెలియదు!
Glenn Maxwell Wedding: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన విని రామన్‌ను అతడు వివాహమాడనున్నాడు. మెల్బోర్న్లో ఈ వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా మాక్సీ- వినీ పెళ్లి కార్డు ఇదేనంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలా కార్డు ఆన్లైన్లో లీక్ కావడం పట్ల మాక్స్వెల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. వేదిక ఎక్కడో తెలిసిపోవడంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాపోయాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20 అనంతరం ఫాక్స్ క్రికెట్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో నాతో పాటు ఆడిన ఓ క్రికెటర్ నా పెళ్లికార్డుకు సంబంధించిన ఫొటో పంపించాడు. తమిళ్లో ఉన్న లేఖను పంపాడు. ఇందులో అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఉంది. దురదృష్టవశాత్తూ ఇది ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కాబట్టి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగే మా వివాహ వేడుకను భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ 11 కోట్లు వెచ్చించి మాక్సీని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి నేపథ్యంలో అతడు పాకిస్తాన్ టూర్‌కు దూరం కానున్నాడు. అదే విధంగా ఆరంభ ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. చదవండి: Aus Vs Sl- Mitchell Starc: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి -
హిందూ సంప్రదాయం ప్రకారం గ్లెన్ మాక్స్వెల్ వివాహం.. వైరలవుతున్న వెడ్డింగ్ కార్డ్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్‌మాక్స్‌వెల్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిరకాల గర్ల్‌ఫ్రెండ్ ఎన్నారై విని రామన్ మెడలో ఇండియన్ స్టైల్లో మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నాడు. 2022 మార్చి 27న మెల్బోర్న్లో ఈ పెళ్లి జరుగనుంది. అయితే పూర్తిగా హిందూ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరగనుంది. ఈ మేరకు తమిళంలో ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది. గ్లెన్‌మాక్స్‌వెల్ ఎన్నారై యువతి విని రామన్‌తో ప్రేమలో పడ్డాడు. చాలా కాలంగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో 2020లో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. రెండేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమిళ వైష్ణవ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. విని తల్లిదండ్రులు చాన్నాళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో సెటిలయ్యారు. విని రామన్ సైతం అక్కడే పుట్టి పెరిగారు. వృత్తిరీత్యా ఆమె ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు. గ్లెన్‌మాక్స్‌వెల్ ఒత్తిడిలోనై డిప్రెషన్లో ఉన్నప్పుడు అతనికి విని అండగా నిలిచారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. -
ఆస్ట్రేలియాలో గణేష్ చతుర్థి వేడుకలు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. టీమ్ ఎన్విజన్ విద్యార్థులు 14 రోజులు పాటు దేవుడికి దూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి గణేష్ ఉత్సవాలను జరిపారు. దాదాపు 2 వేల మంది తెలుగు విద్యార్థులు, తెలుగు ఎన్ఆర్ఐలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. లేబర్ పార్టీ ఎంపీ నటాలీ హాచిన్స్ కూడా గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ.5 లక్షలకు గణేషుడి లడ్డూను ఆస్ట్రేలియా అల్లుడు సోషల్ మీడియా ఛానల్, డెలీషియస్ మెల్బోర్న్ టీమ్ దక్కించుకుంది. లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బును తెలుగు విద్యార్థుల చారిటీ నిధులుగా వాడుతామని టీమ్ ఎన్విజన్ నిర్వాహకులు అరుణ్ సోనిక్ అండ్ టీమ్ తెలిపారు. -
మెల్బోర్న్లో కత్తి పోట్లు కలకలం
-
వైఎస్ జగన్ పాదయాత్ర అభినందనీయం
-
ప్రపంచంలోనే తొలి వర్చువల్ నేత
మెల్బోర్న్: ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పు, సమానత్వం తదితర విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నిక్ అభిప్రాయపడ్డారు. శామ్ చట్టప్రకారం నిబంధనలకు లోబడి పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది. -
ఫిక్సింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఆస్ట్రేలియన్లు అరెస్ట్!
కాన్ బెర్రా: మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ఏ క్రీడను వదలి పెట్టడం లేదు. ఇప్పటి వరకూ ప్రముఖంగా క్రికెట్ లో కనిపించే ఫిక్సింగ్ మహమ్మారి ఇప్పుడు టెన్నిస్ కూడా సోకింది. ఇటీవల కాలంలో జరిగిన ఒక అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ను ఫిక్సింగ్ చేయడానికి యత్నించిన ఆరుగురు ఆస్ట్రేలియన్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది టెన్నిస్ ఆటగాళ్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిని మెల్ బోర్న్, విక్టోరియా పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. విక్టోరియా పట్టణంలో ముఠాగా ఏర్పడిన కొంతమంది బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఫిక్సింగ్ ముఠా రాష్ట స్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. ఇందుకు టెన్నిస్ ఆటగాళ్లనే ప్రధానంగా ఎంచుకుని ఫిక్సింగ్ చేస్తున్నారన్నారు.