Australia Batter Glenn Maxwell Marriage With Vini Raman In Tamil Tradition - Sakshi
Sakshi News home page

Glenn Maxwell Marriage: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మెల్‌బోర్న్‌లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పెళ్లి

Published Mon, Feb 14 2022 3:51 PM | Last Updated on Tue, Feb 15 2022 4:34 PM

Glenn Maxwell going To Marry Vini Raman In Hindu Tradition - Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌మాక్స్‌వెల్‌ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిరకాల గర్ల్‌ఫ్రెండ్‌ ఎన్నారై విని రామన్‌ మెడలో ఇండియన్‌ స్టైల్‌లో మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నాడు. 2022 మార్చి 27న మెల్‌బోర్న్‌లో ఈ పెళ్లి జరుగనుంది. అయితే పూర్తిగా హిందూ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరగనుంది. ఈ మేరకు తమిళంలో ప్రింట్‌ చేయించిన వెడ్డింగ్‌ కార్డ్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

గ్లెన్‌మాక్స్‌వెల్‌ ఎన్నారై యువతి విని రామన్‌తో ప్రేమలో పడ్డాడు. చాలా కాలంగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో 2020లో ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. రెండేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమిళ వైష్ణవ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి.

విని తల్లిదండ్రులు చాన్నాళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో సెటిలయ్యారు. విని రామన్‌ సైతం అక్కడే పుట్టి పెరిగారు. వృత్తిరీత్యా ఆమె ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు. గ్లెన్‌మాక్స్‌వెల్‌ ఒత్తిడిలోనై డిప్రెషన్‌లో ఉన​‍్నప్పుడు అతనికి విని అండగా నిలిచారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement