hindu traditional
-
స్టార్మర్ దీపావళి వేడుకలు
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. భారతీయులపై ప్రశంసల జల్లుబ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
అమెరికా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి.. పెళ్లి మామూలుగా లేదుగా..
సాక్షి, హన్మకొండ: అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు. మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలయ్యారు. హిందూ సాంప్రదాయం పద్దతిలో ఓరుగల్లు వేదికగా ఖండాంతరం వివాహం చేసుకున్నారు. ఆదర్శ వివాహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు బంధుమిత్రులు హాజరై నవ దంపతులను అభినందించి ఆశీర్వదించారు. చదవండి: పెట్స్.. అదో స్టేటస్! అమెరికా కు చెందిన యువతి డాక్టర్ జెన్నా బ్లెమర్ను హనుమకొండకు చెందిన పుట్ట అరవింద్ రెడ్డి వివాహం చేసుకున్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సాంప్రదాయ పద్దతిలో ఇరు కుటుంబ సభ్యులు వివాహ వేడుక నిర్వహించారు. హన్మకొండకు చెందిన అనిత మోహన్‌రెడ్డి దంపతుల కుమారుడు అరవింద్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా అక్కడ డాక్టర్ జెన్నా బ్లెమర్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు తెలుపగా ఇరువురి పేరెంట్స్ ఓకే చెప్పారు. ఇంకేముంది ముహుర్తం ఖరారు చేసుకుని హిందు సాంప్రదాయ పద్దతిలో హన్మకొండలో వివాహం జరిపించారు. అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరకట్టులో అమెరికా అమ్మాయి, వారి పేరెంట్స్ ముస్తాబై ముచ్చటపడ్డారు. కన్యాదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు హిందూ వివాహ సాంప్రదాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా, హిందుసాంప్రదాయాలు చాలా బాగున్నాయని నవవదువు జెన్న బ్లెమర్ తెలిపారు. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నామని వరుడు అరవింద్ చెప్పారు. అమెరికాకు చెందిన వధువు పేరెంట్స్ అచ్చం తెలుగువారిలా పంచే, చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. హిందూ సంప్రదాయాలు పెళ్ళితంతు నచ్చిందని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు. అబ్బాయికి నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించడం సంతోషంగా ఉందని వరుడి పేరెంట్స్ తెలిపారు. -
హిందూ సంప్రదాయం ప్రకారం గ్లెన్ మాక్స్వెల్ వివాహం.. వైరలవుతున్న వెడ్డింగ్ కార్డ్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్‌మాక్స్‌వెల్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిరకాల గర్ల్‌ఫ్రెండ్ ఎన్నారై విని రామన్ మెడలో ఇండియన్ స్టైల్లో మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నాడు. 2022 మార్చి 27న మెల్బోర్న్లో ఈ పెళ్లి జరుగనుంది. అయితే పూర్తిగా హిందూ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరగనుంది. ఈ మేరకు తమిళంలో ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్‌గా మారింది. గ్లెన్‌మాక్స్‌వెల్ ఎన్నారై యువతి విని రామన్‌తో ప్రేమలో పడ్డాడు. చాలా కాలంగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో 2020లో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. రెండేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమిళ వైష్ణవ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. విని తల్లిదండ్రులు చాన్నాళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో సెటిలయ్యారు. విని రామన్ సైతం అక్కడే పుట్టి పెరిగారు. వృత్తిరీత్యా ఆమె ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు. గ్లెన్‌మాక్స్‌వెల్ ఒత్తిడిలోనై డిప్రెషన్లో ఉన్నప్పుడు అతనికి విని అండగా నిలిచారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. -
అమెరికా అమ్మాయి.. హనుమకొండ అబ్బాయి కట్ చేస్తే..
సాక్షి,హన్మకొండ: అమెరికా అమ్మాయి, హనుమకొండ అబ్బాయి ఇరువురు వివాహం చేసుకున్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో హిందు సంప్రదాయం ప్రకారం శుక్రవారం వైభవంగా వారి వివాహం జరిగింది. హనుమకొండ సూదుల సువర్ణ – సమ్మిరెడ్డి దంపతుల కుమారుడు బస్వంత్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న అమెరికాకు చెందిన హంఫ్రే బిల్రావు – వెరోనిక కుమార్తె ఎలీషాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారగా, ఇరువురు వివాహం చేసుకున్నారు. మరో ఘటనలో.. వినియోగదారులకు ‘రక్షణ’ చట్టం హసన్‌పర్తి: వినియోగదారులకు రక్షణ చట్టం.. రక్షణగా నిలుస్తోందని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్‌సింగ్ అన్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా రక్షించబడే హక్కును ఈ రక్షణ చట్టం ద్వారా బాధితుడు పొందగలుగుతాడని వివరించారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను జాతీయ వినియోగదారుల వ్యవహారాల విభాగం టోల్‌ఫ్రీ నంబర్ 1800 1114000, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం టోల్‌ఫ్రీ నంబర్లు 1800 42500333, 1800 42501967 ద్వారా నమోదు చేసుకుని సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల సమాచార కేంద్రం హసన్‌పర్తి చైర్మన్ అనుమాండ్ల విద్యాసాగర్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు బండా కాళిదాస్, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్‌రాం పాల్గొన్నారు. చదవండి: కేపీహెచ్బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి -
జలారాధన హిందూ సంప్రదాయం
వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ‘కృష్ణా పుష్కర ప్రాశస్త్యం’ పుస్తకం ఆవిష్కరణ వెదురుపాక (రాయవరం) : సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారమైన జలాన్ని దేవత రూపంలో ఆరాధించడం హిందూ సంప్రదాయంలో భాగమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) అన్నారు. మురమళ్లకు చెందిన బాణాల దుర్గాప్రసాద్ సిద్ధాంతి రచించిన ‘సార్థ త్రికోటి తీర్థరాజ సహిత కృష్ణా పుష్కరాలు’ పుస్తకాన్ని మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శుక్రవారం గాడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ నది, కోనేరు, సముద్ర, మాఘ, మంగళ స్నానాలు అనే సంప్రదాయాలన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయన్నారు. నదీ స్నానాలన్నింటిలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పేర్కొన్నారు. తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఔషధాలు, ఔషధాల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయన్నారు. జీవరాశులకు ప్రధానమైన జలస్నాన ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలన్నారు. కృష్ణా పుష్కరాల ప్రాశస్తా్యన్ని వివరిస్తూ పుస్తకం రాసిన దుర్గాప్రసాద్ సిద్ధాంతిని అభినందించారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల విశిష్టతను, ఏ నక్షత్రం వారు ఎక్కడ పుష్కర స్నానమాచరించాలి, పుష్కరాల 12 రోజుల్లో చేయాల్సిన దానధర్మాలు, దర్శించాల్సిన క్షేత్రాలు, పిండ ప్రదానం, పుష్కర స్నాన నియమాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి), కమిటీ సభ్యులు భాస్కర నారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.