
సాక్షి,హన్మకొండ: అమెరికా అమ్మాయి, హనుమకొండ అబ్బాయి ఇరువురు వివాహం చేసుకున్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో హిందు సంప్రదాయం ప్రకారం శుక్రవారం వైభవంగా వారి వివాహం జరిగింది. హనుమకొండ సూదుల సువర్ణ – సమ్మిరెడ్డి దంపతుల కుమారుడు బస్వంత్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న అమెరికాకు చెందిన హంఫ్రే బిల్‌రావు – వెరోనిక కుమార్తె ఎలీషాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారగా, ఇరువురు వివాహం చేసుకున్నారు.
మరో ఘటనలో..
వినియోగదారులకు ‘రక్షణ’ చట్టం
హసన్‌పర్తి: వినియోగదారులకు రక్షణ చట్టం.. రక్షణగా నిలుస్తోందని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్‌సింగ్ అన్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా రక్షించబడే హక్కును ఈ రక్షణ చట్టం ద్వారా బాధితుడు పొందగలుగుతాడని వివరించారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను జాతీయ వినియోగదారుల వ్యవహారాల విభాగం టోల్‌ఫ్రీ నంబర్ 1800 1114000, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం టోల్‌ఫ్రీ నంబర్లు 1800 42500333, 1800 42501967 ద్వారా నమోదు చేసుకుని సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల సమాచార కేంద్రం హసన్‌పర్తి చైర్మన్ అనుమాండ్ల విద్యాసాగర్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు బండా కాళిదాస్, రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌రాం పాల్గొన్నారు.
చదవండి: కేపీహెచ్‌బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి