hanmakonda
-
రెండో రాజధానిగా వరంగల్: మంత్రి కొండా సురేఖ
సాక్షి, వరంగల్: దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క మీడియాతో మాట్లాడారు.ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. ఈ సభ కూడా విజయవంతం చేయాలి’’ అని కొండా సురేఖ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీకే ఆ చరిత్ర ఉంది: మంత్రి సీతక్కబీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని.. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. హైడ్రాకు అడ్డుపడుతున్నారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది?. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసింది. కానీ మేము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. మాకు మూటలు మోసే అలవాటు లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారు.. ఇప్పుడు తిడుతున్నారు..కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నాం. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నాం. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. ఆరు గ్యారంటీల్లో... ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశాం’’ అని సీతక్క తెలిపారు. -
బీసీ డిక్లరేషన్ హామీలు ఎటు పోయాయి?: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హన్మకొండ: బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?ఎటు పోయాయి? అంటూ కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆదివారం ఆయన హన్మకొండలో మాట్లాడుతూ.. ఏడాది కింద ఇదే రోజు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ పేరిట చాలా వాగ్ధానాలు ఇచ్చారు. కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు ఉన్న పథకాలు తీసేసింది.’’ అని మండిపడ్డారు.‘‘కాంగ్రెస్ పార్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ బంధుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాతర వేసింది. కుల గణన కోసం ఇళ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని అడుగుతుంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. అడ్డమైనా హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీసీ ఓట్ల కోసం.. కులగణనతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీసింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. బీసీ డిక్లరేషన్‌తో కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తుంది. మహారాష్ట్రలో సీఎం రేవంత్ తెలంగాణకు 500 బోనస్ ఇచ్చామంటూ బోగస్ మాటలు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడదాం’’ అని కేటీఆర్ చెప్పారు.ఇదీ చదవండి: ఈ గందరగోళమేంటి ‘సర్వే’శా! -
కడియంను ఓడించాలనే కసి మీలో కనిపిస్తోంది: హరీశ్‌రావు
సాక్షి, హన్మకొండ: కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక పార్టీలో జోష్ పెరిగిందని, ఆయనకు గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్ రావు కడియంపై మండిపడ్డారు. ‘కడియంకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. కడియంపార్టీ ఎందుకు మారారో చెప్పాలి. కాంగ్రెస్‌లో కడియం ఇంకో గ్రూప్ పెడతారా?. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి’ హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తనకు కుమార్తెకు ఎంపీ టికెట్ అడిగి.. చివరి నిమిషంలో బీఆర్ఎస్కు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హరీష్ కోరారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కావ్య మా నాన్న(కడియం) బ్రాండ్ అంటోంది.. వెన్నుపోటు పొడవటంలోనా బ్రాండా? ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం. ఆరూరి రమేష్, పసునూరి దయాకర్‌ను వెళ్లగొట్టిందే కడియం. కడియం లాంటి ద్రోహులను ప్రజలు క్షమించరు. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’అని పల్లా మండిపడ్డారు. -
కాజీపేట్ రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం
సాక్షి, హనుమకొండ: కాజీపేట్ రైల్వేస్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగీ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు. -
Warangal: హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనా?
సాక్షి, హసన్‌పర్తి: హన్మకొండ జిల్లాలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థిని దీప్తి హాస్టల్ రూమ్‌లో సూసైడ్ చేసుకుంది. ఇక, ఆమె ఆత్మహత్యకు ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని తెలుస్తోంది. వివరాల ప్రకారం.. హన్మకొండలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న దీప్తి ఆత్మహత్య చేసుకుంది. అయితే, దీప్తి తన క్లాస్మేట్ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తోటీ విద్యార్థులు చెబుతున్నారు. కాగా, ఇటీవలే వీరి మధ్య గొడవలు కావడం, ఇటీవల వచ్చిన పరీక్ష ఫలితాల్లో ఒక్క సబ్జెక్ట్‌లోనే పాస్ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీప్తి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇక, ఆమె ఆత్మహత్య యూనివర్సిటీలలో కలకలం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
హనుమకొండ: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
హనుమకొండ, సాక్షి: జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. గాయపడిన వాళ్లను వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లంతా ఏటూరునాగారంకు చెందిన ఒకే కుటుంబంగా నిర్ధారణ అయ్యింది. దైవదర్శనం కోసం శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాల్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతులు మంతెన కాంతయ్య(72) మంతెన శంకర్(60) మంతెన భారత్(29) మంతెన చందన(16) చికిత్స పొందుతున్నవాళ్లు మంతెన రేణుక(60) మంతెన భార్గవ్(30) మంతెన శ్రీదేవి(50) -
ర్యాష్ డ్రైవింగ్ కు మహిళ బలి
-
హన్మకొండ జిల్లా కాజీపేటలో కారు ఆక్సిడెంట్..మహిళ అక్కడిక్కడే..!
-
సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. సెకన్లలో నిండు ప్రాణం బలి
సాక్షి, హన్మకొండ: అతి వేగంగా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. హైస్పీడ్‌తో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా, ఓ సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నడిరోడ్డుపై ఓ మహిళ మృతిచెందింది. అయితే, ఉన్నతాధికారి కొడుకు నిందితుడు కావడంతో పోలీసులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ వద్ద కవిత బైక్ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్‌లో వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఎక్సైజ్ సీఐ శరత్ కొడుకు వంశీ TS03 FA9881 నెంబర్ కారును అధిక వేగంతో డ్రైవ్ చేసి రాంగ్ సైడ్‌లో బైక్‌ను ఓవర్టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే మాట్లాడున్న కవితను కారు బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. #JustIn Kazipet road accident!@HiWarangal @TriCityWarangal pic.twitter.com/hY54Ts8LNj — Fasi Adeeb🇮🇳 (@fasi_adeeb) December 1, 2023 అయితే, ఈ ప్రమాదంలో నిందితుడి వంశీపై చర్యలు తీసుకోవాలని కవిత కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వంశీని ఈ కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నాడు. దీంతో, నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్లో ధర్నా చేశారు. దీంతో, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక, కవితకు వివాహం కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు సమాచారం. -
ఉమ్మడి జిల్లాకు.. ఆత్మీయ 'చంద్రమోహను'డు!
సాక్షి, వరంగల్: కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం కన్నుమూశారు. అందరికీ ఆత్మీయుడైన చంద్రమోహన్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థల కళాకారుడు, డిప్యూటీ డీఈఓ బూర విద్యాసాగర్‌గౌడ్ అధ్యక్షతన 1993లో వరంగల్ నటరాజ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ నాటిక ప్రదర్శనలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు నటులు రాళ్లపల్లి, పీజేశర్మ, సాయికుమార్, నటి కిన్నెర, వందేమాతరం శ్రీనివాస్ నటించారు. చంద్రమోహన్‌తో కలిసి భోజనం చేస్తున్న మైక్రో ఆర్టిస్ట్ అజయ్‌కుమార్ (ఫైల్) ఈ మేరకు రంగస్థల కళాకారుడు బూరవిద్యాసాగర్ గౌడ్, మైక్రోఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌కుమార్, ఓరుగల్లు శారదానాట్యమండలి నిర్వాహకుడు జేఎన్ శర్మ, పద్యనాటక కళాకారుడు జూలూరు నాగరాజు, ఫ్రెండ్స్ కల్చరల్ సొసైటీ నిర్వాహకుడు బిటవరం శ్రీధరస్వామి, జేబీ కల్చరల్ సొసైటీ జడల శివ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు చంద్రమోహన్ అడుగు ఎత్తుంటే సినీ ఇండస్ట్రీని ఏలే వారని మహానటుడు ఎన్టీఆర్‌తో పాటు పలువురు సీనియర్ నటులు ప్రశంసించారని, చంద్రమోహన్‌కు నాటకాలంటే ప్రాణమని వరంగల్‌కు చెందిన కళాకారులు గుర్తు చేసుకున్నారు. -
ఎస్సై రివాల్వర్‌ను కాజేసి మరీ అత్తను కాల్చి..
సాక్షి, హనుమకొండ/మంచిర్యాల: ఆర్థిక లావాదేవీల వ్యవహారంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన ఘటన హనుమకొండలో కలకలం రేపింది. అయితే.. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు కీలక విషయం వెలుగు చూసింది. సివిల్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ప్రసాద్.. ఎస్సై రివాల్వర్‌ను కాజేసి మరీ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హనుమకొండ జిల్లా గుండ్లసింగారం ఇందిరమ్మ కాలనీలో కమలమ్మ కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె కూతురు రమాదేవిని ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రసాద్-రమాదేవికి ఇద్దరు కూతుళ్లు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. గురువారం ఉదయం మంచిర్యాల నుంచి హనుమకొండలోని అత్తింటికి వచ్చిన ప్రసాద్.. కమలమ్మపై ఉన్నట్లుండి కాల్పులకు దిగాడు. ఒక రౌండ్ కాల్పులు జరగ్గా.. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆపై భార్యాకూతురిపైనా దాడికి యత్నించిన ప్రసాద్‌ను స్థానికులు అడ్డుకుని చితకబాదారు. గాయపడిన ప్రసాద్‌ను చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. డబ్బుల విషయంలో గొడవ పెద్దదై.. కుటుంబ కలహాలతో పాటు.. ఆర్థిక లావాదేవీలు ఈ నేరానికి కారణమని తెలుస్తోంది. ప్రసాద్ కమలమ్మకు రూ.4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు విషయంలోనే ప్రధానంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పటికే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కమలమ్మపై ప్రసాద్ కాల్పులు జరిపాడని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ చెబుతున్నారు. నా భర్తను చంపేయండి భర్త ప్రసాద్ నిత్యం తాగొచ్చి గొడవ పడడంతో.. తాను పుట్టింటికి వచ్చేశానని రమాదేవి చెబుతోంది. వారం కిందట భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. ఉదయం పదిన్నర గంటలకు ఇంటికి వచ్చిన ప్రసాద్.. తన కళ్ల ముందే తల్లిని కాల్చి చంపినట్లు రమాదేవి చెప్పింది. అది చూసిన తనపై, తన కూతురిపైనా ప్రసాద్ దాడికి యత్నించాడని తెలిపిందామె. అయితే.. ప్రసాద్ బతకడానికి అర్హుడు కాడని.. అతన్ని చంపేయాలని రమాదేవి కన్నీటి పర్యంతం అయ్యింది. ‘‘నా భర్త పచ్చి తాగుబోతు. నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడనే పుట్టింటికి వచ్చేశా. ఇవాళ ఇంటికి వచ్చి నా తల్లిని పంచాడు. టవల్‌తో ఉరేసి చంపాలనుకున్నానని.. కానీ, స్థానికులు నన్ను అడ్డుకున్నారు. సివిల్ కానిస్టేబుల్ అయిన ప్రసాద్‌కు సర్వీస్ రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యమూ ఉన్నట్లు స్పష్టమవుతోంది’’ అని ప్రసాద్ భార్య రమాదేవి అంటోంది. ఉన్నతాధికారుల సీరియస్ కానిస్టేబుల్ ప్రసాద్ కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోంది. సంఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ సందర్శించారు. అయితే పేలిన తూటా గొట్టం కోసం క్లూస్ టీం ఇంకా గాలింపు జరుపుతోంది. మరోవైపు సివిల్స్ కానిస్టేబుల్ ప్రసాద్‌కు సర్వీస్ రివాల్వర్ ఎలా వచ్చిందనే విషయంపై జరిపిన విచారణలో కీలక విషయం బయటపడింది. కోటపల్లి స్టేషన్ లో ఎస్సై సురేష్ రివాల్వర్ కానిస్టేబుల్ ప్రసాద్ దొంగతనం చేసినట్లు తేలింది. గత రాత్రి తుపాకీని దొంగిలించి.. తన వెంట హనుమకొండకు తీసుకెళ్లాడు ప్రసాద్. ఆ రివాల్వర్తోనే కమలను కాల్చి చంపాడు. దీంతో రివాల్వర్ చోరీ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్లోనే ఈ చోరీ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు. -
బీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు
హన్మకొండ: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో బీజేపీ కార్యకర్తలతోపాటు, పోలీసులకు గాయాలయ్యాయి. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గురువారం హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిది. దీంతో పోలీసులు క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్లు ముళ్ల కంచెతో మూసివేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి నేతృత్వంలో పార్టీనేతలు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అయితే అప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముళ్లకంచె వరకు చేరుకుని నినాదాలు చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో దాడికి దిగడంతో, బీజేపీ కార్యకర్తలు ఆ కర్రలను లాక్కొని ప్రతి దాడికి దిగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పూనుకోగా బీజేపీ కార్యకర్తలు సైతం రాళ్లతో దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఆరెస్టు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకి గాయాలు అంతకు ముందు హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ క్యాంపు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీఫ్‌విప్ క్యాంపు కార్యాలయ ముట్టడికి వస్తున్న పద్మను పోలీసులు అడ్డుకున్న క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు పద్మను జుట్టు పట్టి లాగడంతో మెడకు, చేతికి గాయమైంది. అనంతరం పద్మతో పాటు నాయకులు, కార్యకర్తలను ధర్మాసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
వరంగల్ పశ్చిమ: అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు!
జిల్లాల పునఃర్విభజనతో ఏర్పడిన హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బిన్నరాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులే పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో అదృష్ట్యాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నగరంలోని హన్మకొండ కాజీపేట ప్రాంతాలను కలుపుకుని ఉంది. కాకతీయుల నాటి చెరువులు కుంటలు కబ్జాకు గురికావడంతో వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు ముంచెత్తడం.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, స్మార్ట్ సిటిగా పేరొందినప్పటికి మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, నిలువనీడలేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు అందకపోవడం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ అమలుకు నోచుకోకపోవడం వంటి అనేక సమస్యలు నగర ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. విద్యావంతులు మేధావులు, రాజకీయ నేతలకు నిలయంగా ఉన్న హన్మకొండ రాజకీయం ప్రత్యేకతను చాటుకుంటుంది. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నేతలైనా, అధికారులైనా వారి నివాసాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రమైన హన్మకొండలోనే ఉన్నాయి. కానీ సమస్యలకు పుట్టినిల్లుగా అనేక సమస్యలతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ దాస్యం వినయ్ భాస్కర్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ నాయిని రాజేందర్‌రెడ్డి జంగా రాఘవరెడ్డి బీజేపీ రావు పద్మ ఏనుగుల రాకేష్ ధర్మారావు వృత్తిపరంగా ఓటర్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నగర ప్రాంతం కావడంతో ఉద్యోగులు వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. శివారు కాలనీల్లోరైతులు ఉన్నప్పటికి వారిప్రభావం పెద్దగా ఉండదు. మతం/కులం పరంగా ఓటర్లు హిందువులు ఎక్కువగా ఉంటారు. బిసి జనాబా ఎక్కువగా ఉంది. 30 వేల మంది రెడ్డి ఓటర్లు ఉంటారు. ఎన్నికల్లో రెడ్డి ఓట్లు కీలకంగా మారుతాయి. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : గ్రేటర్ వరంగల్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గం అధికార పార్టీ బిఆర్ఎస్కు కలిసొచ్చే స్థానంగా చెప్పుకోవాలి. పశ్చిమ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పశ్చిమలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. 2009 నుంచి టీఆర్ఎస్కు పశ్చిమలో వినయ్ భాస్కర్ తప్ప మరో వ్యక్తి లేడనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్‌కు టికెట్ దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ చీప్ విప్‌గా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పదవులకు తోడు కాంగ్రెస్, బిజేపిలోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్‌కు అనుకూలంగా మారుతున్నాయి. హంగు ఆర్బాటం లేకుండా అందరితో కలివిడిగా ఉండే వినయ్ భాస్కర్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ప్రత్యర్థి పార్టీలోని గ్రూప్ రాజకీయాలు ఆయనకు కొండంత అండగా నిలువనున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు వినయ్ భాస్కర్‌కి అంత ఈజీగా ఉండవన్న చర్చ ప్రజల్లో సాగుతుంది. అభివృద్ది సంక్షేమం విషయంలో నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు నగరంలో జరిగినప్పటికి ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అభివృద్ది సంక్షేమ ఫలాలు కొందరికే పరిమితం కావడంతో వినయ్ భాస్కర్‌కు మైనస్గాగా మారుతుంది. బాల సముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పూర్తై రెండేళ్ళు కావస్తున్న ఇంకా లబ్దిదారులకు అప్పగించకపోవడతో గృహ ప్రవేశం కాక ముందే ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. లబ్దిదారులకు అప్పగించకపోవడానికి ప్రధాన కారణం నిర్మించిన ఇళ్ళు 596 అయితే లబ్దిదారులు ఐదు వేలకుపైగా ఉండడంతో లబ్దిపొందేవారికంటే ఇళ్ళ కెటాయింపు జరిగితే శత్రువులుగా మారే వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో లబ్దిదారుల ఎంపికలో ఆలస్యం అవుతుంది. 31వ డివిజన్ శాయంపేటలో మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం.. అప్పగింతలో ఆలస్యం అవడంతో కమ్యూనిష్టులతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కమ్యూనిష్టులు ఏకంగా నగర శివారులోని ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారు. నగరంలో నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కెటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కాజీపేట కోచ్ ప్యాక్టరీ హామీ నెరవేరకపోవడం, కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు, పోతన కళాక్షేత్రం పనులు, చారిత్రాత్మకమైన వేయి స్థంబాల గుడి కళ్యాణమండపం పనులు మూడు అడుగులు మందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉండడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆశిస్సులతో భద్రకాళి బండ్ పనులు పూర్తై ప్రజల వినియోగంలోకి రాగ ఆలయ మాడవీదుల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అర్హులైన వారందరికి అందితే ఇక వినయ్ భాస్కర్ విజయానికి తిరుగేఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంటుంది. బీఆర్ఎస్ సిట్టింగ్‌ల ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు టికెట్ వరించడంతో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలోని గ్రూప్ రాజకీయాలు అంతర్గత విబేధాలతో పోటీపడే వారు ఎక్కువ మంది ఉండడంతో వారిలోని పోటీ తత్వం గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీల కొంపముంచే అవకాశాలున్నాయని ఓరుగల్లు ప్రజలు భావిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నవారు చివరిక్షణంలో టిక్కెట్ దక్కకుంటే పార్టీ మారే అవకాశాలు సైతం లేకపోలేదని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్, బిజేపి లోని అనైక్యత బిఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశాలు మెండుకా ఉన్నాయి. అదే జరిగితే వరంగల్ పశ్చిమలో కారుజోరు బ్రేక్లులు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కొండలు అడవులులేవు ఆలయాలు మాత్రం కాకతీయులు నిర్మించిన వేయిస్థంభాల గుడి, భద్రకాళి అమ్మవారు ఆలయం ఉంది. పర్యాటకులను ఆకర్శించేలా వేయిస్థంభాల గుడి ఉంది. భద్రకాళి బండ్ ఏర్పాటు చేశారు. -
విషాదానికి ముందు.. ఎంజీఎంలో చిన్నారి రాజు సరదా క్షణాలు
-
‘నా కొడుకా.. నీకప్పుడే నూరేళ్లు నిండాయారా’
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఆ చిన్నారిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. ఆపై గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక.. అక్కడా అయినవాళ్ల నడుమ ఆడుకుంటూ కనిపించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు. హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన విషాదం.. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తోంది. వీధి కుక్కలు మరో చిన్నారిని బలిగొన్నాయి. కిందటి నెలలో కుక్కల దాడిలో గాయపడి.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు(18 నెలలు) కన్నుమూశాడు. దీంతో కాజీపేట రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజు కుటుంబం ఉంటోంది. గత నెల(జూన్) 17వ తేదీన ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 18 నెలల రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. మొహంపై గాయాలతో పాటు చెంప కొంత వరకు తెగిపోయింది. పిల్లల అరుపులు విన్న స్థానికులు.. ఇళ్లలోంచి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. ఆపై పిల్లలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చిన్నారి రాజు ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఆడుకుంటున్న దృశ్యాలను మొబైల్లో బంధించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. క్రమక్రమంగా రాజు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. 25 రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. -
స్కూల్లో దింపుతానని వెళ్లి.. కుమారుడితో కలిసి..
సాక్షి,కాజీపేట: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ తండ్రి.. కుమారుడిని పాఠశాలలో దించివస్తానని వెళ్లి వడ్డెపల్లి ట్యాంక్‌బండ్ రిజర్వాయర్‌లో కొడుకుతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలో శనివారం వెలుగులోకి వచ్చింది. వరంగల్ నగరంలోని కనకదుర్గ కాలనీకి చెందిన శిలమంతుల రవీందర్ (35) రెండేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో చికిత్స తీసుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం కుమారుడు శ్రీచరణ్ (7)ను పాఠశాలలో దించి వస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన రవీందర్ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో భార్య దివ్య భర్త, కుమారుడు కనిపించట్లేదంటూ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం వడ్డెపల్లి ట్యాంక్‌బండ్‌లో రెండు మృతదేహాలు తేలినట్లు అందిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దివ్యను పిలిపించగా అవి భర్త, కుమారుడివేనని ఆమె గుర్తించారు. చదవండి: కరెంట్ కట్ చేశాడని.. లైన్‌మన్‌పై పెట్రోల్ పోశాడు -
నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని..
-
హన్మకొండ: ఖాజీపేటలో వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
-
మందుబాబు చెంప చెల్లుమనిపించిన ఎస్ఐ రాజు
-
నిరుద్యోగ మార్చ్ కి మద్దతు తెలిపిన కేయూ, ఓయూ, జేఏసీలు
-
టెన్షన్.. టెన్షన్.. హన్మకొండ కోర్టుకు బండి సంజయ్
-
హన్మకొండలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం
-
నాన్న జోలికొస్తే ఊరుకోము.. రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య విజయ విహారం వరంగల్‌లోని హన్మకొండలో నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ వేదికపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవిగారిని ఏమైనా అనగలిగితే కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే అనగలరు. నాన్న సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు. ఆయన సైలెంట్‌గా ఉంటారేమోకాని మేం ఉండం.మేం క్వైట్‌గా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి' అంటూ రామ్‌చరణ్ హెచ్చరించాడు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మరింది. ఈ సందర్భంగా కొందరు నిర్మాతలకు సైతం చరణ్ చురకలించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో పనిచేసిన హీరోలందరికి హిట్లు ఇచ్చారని, కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి, ఎలా చూసుకోవాలనేది అంటూ చరణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
లేడీస్ హాస్టల్స్ టార్గెట్.. ఊహించని రీతిలో దొరికాడు
క్రైమ్: లేడీస్ హాస్టల్స్‌ను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి.. అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల చోరీ కలకలం రేగింది. ఏకంగా హాస్టల్లో ఓ బాత్రూం డోర్ బద్దలు కొట్టి మరీ చోరీలు చేశాడు ఆగంతకుడు. దీంతో.. బెంబేలెత్తిన విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన సైతం చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. అందరినీ హడలెత్తించిన దొంగ ఊహించని విధంగా దొరికాడు. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను దొంగలించి రాత్రి పొలాల గుండా పారిపోతుండగా.. చీకట్లో ఓ వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఉదయం కేకలతో అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తాడు సాయంతో బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుత్ కనెక్షన్‌పై ఏసీడీ.. ఇంటి యజమానే చెల్లించాలి
హన్మకొండ: ఇంటి యజమానులు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న సమయంలో తక్కువ లోడ్‌తో కనెక్షన్ తీసుకుంటారని, ఆనంతరం అవసరాలు పెరగడంతో లోడ్ పెరుగుతుందని, పెరిగిన లోడ్‌పై రెండు నెలల డిపాజిట్‌ను ఏసీడీ (అదనపు వినియోగ డిపాజిట్) రూపంలో విధిస్తున్నట్లు టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిపాజిట్‌కు విద్యుత్ సంస్థ ఏడాదికి ఒకసారి వడ్డీ చెల్లిస్తుందన్నారు. డిపాజిట్ రూపంలో ఉంటున్నందున, దీనిని కిరాయిదారుడు కాకుండా ఇంటి యాజమాని చెల్లించడం సబబుగా ఉంటుందన్నారు. ఇంటి యజమానికి విద్యుత్ అవసరం తీరి కనెక్షన్ తొలగించుకునే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. చాలామంది వినియోగదారులు ఏసీడీని కిరాయిదారుడు చెల్లించాలా? లేదా ఇంటి యజమాని చెల్లించాలా? అని సందేహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పష్టంచేశారు. వినియోగదారులకు ఇంకా సందేహాలుంటే విద్యుత్ రెవెన్యూ కార్యాలయం, బిల్లులు చెల్లించే కౌంటర్ వద్ద నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.