సాక్షి, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానంనించి, మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అయితే దీనిని తాము రాజకీయంగానే ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. హన్మకొండ కేడీసీ గ్రౌండ్‌లో ఆదివారం (సెప్టెంబరు 22) మాదిగ మహా దీక్షను చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను మందకృష్ణ మాదిగ శనివారం స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా.. మాదిగ మహా దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు హాజరుకావాలని పిలుపనిచ్చారు. సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేపు జరిగే సభలో ఒకవేళ భారీ వర్షం కురిసినా కూడా యథాతథంగా నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు. ఉద్యామాన్నిఎంత అణచి వేయాలని ప్రయత్నిస్తే.. అంతా ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుందని ఆయన హెచ్చరించారు. ఓసీ కులంలో వెలమ, రెడ్లు మాత్రమే ఉన్నారా? వైశ్య, బ్రహ్మణ కులాలలో లేరా? వారిని ఓసీ కులాల నుంచి తొలగించే ప్రయత్నం ఏమైనా చేశారా?అని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment