Madiga Reservation Porata Samithi (MRPS)
-
చంద్రబాబుకు అమ్ముడుపోయిన మంద కృష్ణకు బుద్ధి చెబుతాం
సాక్షి, అమరావతి: వర్గీకరణ పేరుతో ముప్పై ఏళ్లుగా మాదిగలకు వెన్నుపోటు పొడుస్తున్న మంద కృష్ణ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు తమ జాతిని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతాడని మాదిగ సంఘాలు మండిపడ్డాయి. చంద్రబాబుకు ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ ఈ నెల 30న గుంటూరులో జరిగే సభకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించాయి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం గురువారం జరిగింది. రాష్ట్రంలోని 25 మాదిగ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మనువాద బీజేపీ, మోసకారి చంద్రబాబు కూటమికి ఎందుకు ఓటెయ్యాలని పలువురు మాదిగ సంఘాల నేతలు ప్రశ్నించారు. మనువాద విష కౌగిలికి మాదిగలను చేర్చేందుకు మంద కృష్ణ ప్రయత్నిస్తున్నాడని, చంద్రబాబుతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ పదేళ్లు అయినా పట్టించుకోలేదని, వర్గీకరణను అడ్డుపెట్టుకుని చంద్రబాబు మాదిగల ఓట్లతో రాజకీయ లబ్ధి పొందుతున్నాడని మండిపడ్డారు. ఇకపై మంద కృష్ణ ఆటలు సాగనివ్వబోమని, అతని ఎత్తులను కచ్చితంగా తిప్పి కొడతామని మాదిగ నేతలు హెచ్చరించారు. మాదిగల ద్రోహులు బాబు, మంద కృష్ణలకు గుణపాఠం చెబుతామన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయాలను సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. బాబు దగా చేస్తే.. జగన్ మేలు చేశారు నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ సమాఖ్య అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ద్వారా చంద్రబాబు హయాంలో మాదిగలకు 22 వేల ఉద్యోగాలొచ్చాయని మంద కృష్ణ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడన్నారు. ముప్పై ఏళ్లుగా టీడీపీ చంకలో దూరిన మంద కృష్ణ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలకు మాదిగలను దూరం చేసి జాతికి తీరని ద్రోహం చేశాడన్నారు. చంద్రబాబు పాలనలో మాదిగలకు జరిగిన మేలు ఏమిటో ఒక్కటి కూడా మంద కృష్ణ చెప్పలేడన్నారు. ఓట్లు పొందుతున్న చంద్రబాబు తగినన్ని సీట్లు కేటాయించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు పది సీట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. చంద్రబాబు హయాంలో పది శాతం మాదిగ కుటుంబాలకు మేలు జరిగితే గొప్పలు చెప్పుకునేవారని, అదే సీఎం వైఎస్ జగన్ పాలనలో 90 నుంచి 96 శాతం మాదిగ కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. ఊరి చివర ఉండే వెలివాడల్లోని తమ ఇళ్ల వద్దకే వచ్చి సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల సమస్యను అర్థం చేసుకుని ప్రతి ఊరిలో ఒక ఎకరం చొప్పున కేటాయించేలా ప్రభుత్వం చర్య తీసుకుందన్నారు. మాదిగలకు నిజమైన మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వడం తమ ధర్మం అన్నారు. ఏ హక్కుతో ఏపీకి వస్తావ్ ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. మాదిగలకు ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మంద కృష్ణ మద్దతివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు, ఓటు హక్కు కూడా లేని మంద కృష్ణకు ఏ హక్కు ఉందని ఎన్నికలు వచ్చే సరికి మాదిగ జాతి మొత్తాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ తన తీరు మార్చుకోకపోతే ఈ నెల 30న నిర్వహిస్తున్న సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. గుంటూరులో ఎలా అడుగుపెడతాడో చూస్తామని, నీ సంగతి తేలుస్తామని అల్టిమేటం ఇచ్చారు. మాదిగలను అంబేడ్కర్ వాదం నుంచి మనువాదం వైపు నడిపే మంద కృష్ణ ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. మాట్లాడిన వారిలో సువర్ణరాజు(ఏపీ ఎమ్మార్పీఎస్), చెరుకూరి కిరణ్(మాదిగ కార్పొరేషన్ సాధన సమితి), కొరిటిపాటి ప్రేమ్‌కుమార్(మాదిగ మహాసేన), మంద క్రిష్ణయ్య(ఆర్ఎంఆర్పీఎస్), గడ్డం బాపిరాజు(ఐఎన్ఎఫ్ఓఆర్ఎం), పొన్నెకంటి రమే‹Ù(మాదిగ దండోర), జానయ్య (జైభీమ్ ఎమ్మార్పిస్), ఈపూరి ఆదాం(బహుజన పరిరక్షణ సమితి), జుజ్జవరపు రవిప్రకా‹Ù(దళితసేన), మల్లవరపు నాగయ్య(అమరావతి ఎమ్మార్పిఎస్), వరదరాజులు(నేషనల్ ఎమ్మార్పీఎస్), పులిదాసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి), బి.మేరీ కుమారి ఉన్నారు. మాదిగలకు మేలు చేసిన జగన్ మాదిగలను చంద్రబాబు దగా చేస్తే సీఎం వైఎస్ జగన్ మేలు చేశారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు స్పష్టం చేశారు. మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి సంఘీభావంగా హాజరైన వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదిగలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారన్నారు. మాదిగలను అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా లబి్ధపొందిన మంద కృష్ణ మోసాలు ఇక సాగవన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ మాదిగ జాతిని చంద్రబాబుకు తాకట్టు పెడితే సహించేదిలేదన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే మాదిగలు ఉన్నారని స్పష్టం చేశారు. -
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హోం, న్యాయ, గిరిజన సంక్షేమ, సామాజిక న్యాయం, సిబ్బంది, శిక్షణ శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కలి్పంచారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు, వీలైనంత త్వరగా తమ నివేదికను అందించేందుకు వీలుగా ఈ కమిటీ ఈనెల 23న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని గత నవంబర్ 24న ఆదేశించారు. గౌబా కమిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. -
ఎస్సీ వర్గీకరణపై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. శుక్రవారం కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులతో ఈ మేరకు ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వరూప మహాసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు, మాదిగల సాధికారతకు సాధ్యమైన మార్గాలపై కేంద్రం త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మారీ్పఎస్ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా మందకృష్ణ చేస్తున్న ప్రతి పోరాటానికీ బీజేపీ మద్దతుగా నిలించిందని ఆయన పేర్కొన్నారు. ‘‘మీది న్యాయ పోరాటం. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే మాదిగ ఉప కులాల కోరిక అత్యంత న్యాయమైనది. మీకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఇందుకోసం వెంటనే కమిటీ వేస్తామని హమీ ఇస్తున్నా. ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది’’ అని ఆయన చెప్పారు. కాగా, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ చర్చనీయంగా మారింది. -
మాదిగ నేతలు టీడీపీని వీడాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల భయంతో కులాల కుంపట్లు రాజేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటేనని ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, బొమ్మి ఇజ్రాయెల్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవటాన్ని నిరసిస్తూ టీడీపీకి చెందిన మాదిగ నేతలంతా ఆ పార్టీని వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా మాదిగలకు ఒక్కటైనా మేలు చేసిందా? అని ప్రశ్నించారు. మాల మాదిగలను గౌరవిస్తూ, రాజ్యాధికారంలో వాటా కల్పిస్తూ సీఎం జగన్ ఐదు కీలక శాఖలను కేటాయించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలతోపాటు ఉన్నత చదువులు అభ్యసించేలా తోడుగా నిలిచి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దురహంకారంతో మాట్లాడిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈమేరకు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. దూషించేందుకే ఆ సమావేశం చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మాదిగలకు టీడీపీ చేసిన మేలు ఒక్కటైనా ఉందా? టీడీపీ అధినాయకత్వాన్ని దళితులంతా నిలదీయాలి. టీడీపీకి చెందిన మాదిగ నాయకులంతా సంక్షేమంపై చర్చించకుండా సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషించేందుకే సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏడాది రాగానే కులాల కుంపట్లు రాజేయడం చంద్రబాబుకు అలవాటే. విద్య, సంక్షేమ పథకాలతో దళితుల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు. ఇద్దరు మాదిగలు, ముగ్గురు మాలలకు కీలక శాఖలు అప్పగించారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 30 లక్షల మందికిపైగా ఉచితంగా ఇళ్ల స్థలాలను అందించారు. అమరావతి ప్రాంతంలో మరో 50 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారు. ఒకేసారి అంతమందికి ఉచితంగా ఇళ్ల స్థలాలిచి్చన పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందా? – డొక్కా మాణిక్య వరప్రసాద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దళిత ద్రోహులంతా టీడీపీలోనే చంద్రబాబు ఆది నుంచీ దళితులకు వ్యతిరేకమే. ఎన్నికల భయంతో మాదిగల ఓట్ల కోసం ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా మాదిగల పట్ల ఎంత నీచంగా వ్యవహరించారో, ఎలా అవమానించారో మాదిగ జాతి మరిచిపోలేదు. మాదిగలు, మాలలకు పెద్దపీట వేస్తూ ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. మాదిగల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యను అభ్యసిస్తున్నారు. దీనిపై కూడా కోర్టులకెక్కి అడ్డుపడ్డ దళిత ద్రోహి చంద్రబాబు. పేదల ఇళ్లను సమాధులతో పోల్చిన వ్యక్తి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉండగా ఏ ఒక్క పేదవాడికైనా సెంటు స్థలమిచ్చారా? దళితులను అవమానించిన ద్రోహులంతా టీడీపీలోనే ఉన్నారు. దళితులంతా సీఎం జగన్ వెంటే నడుస్తారు. –కొమ్మూరి కనకారావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ జగన్ అంటే సోషల్ ఇంజనీరింగ్ పేద బిడ్డలను ప్రోత్సహిస్తూ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తెచ్చిన సమూల మార్పులు టీడీపీ నేతలకు కనపడటం లేదా? దళిత నేతలు ఇప్పటికైనా చంద్రబాబు నైజాన్ని గ్రహించి టీడీపీని వీడి బయటకు రావాలి. సోషల్ ఇంజనీరింగ్ అంటే సీఎం జగన్... జగన్ అంటేనే సోషల్ ఇంజినీరింగ్! సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, ఆర్బీకేలు, అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా లాంటి విప్లవాత్మక చర్యలే ఇందుకు నిదర్శనం. దళితులకు హిందూ దేవాలయాల్లో ప్రవేశం ఎందుకని నాడు ఇదే టీడీపీ పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఆలయాల్లో ప్రవేశాలతోపాటు మాల మాదిగలు, రెల్లి కులస్తులకు ఆలయ పాలకవర్గాల్లో సభ్యులుగా నియమించడంతోపాటు నిర్వహణ బాధ్యత కూడా అప్పగించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏరోజైనా మాల, మాదిగ, రెల్లి, యానాది కులాలకు చెందిన వారిని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీలకు చైర్మన్‌గా నియమించారా? నామినేటెడ్ పనులు, పదవుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రికి సలహాదారులుగా మాదిగలు, మాలలు ఉన్న పరిస్థితిని మనమంతా చూస్తున్నాం. హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంటూ ఓ చెత్తబుట్టను ప్రకటించారు. – బొమ్మి ఇజ్రాయెల్, ఎమ్మెల్సీ -
MRPS: సభలో ప్రసంగిస్తూ ఎమ్మార్పీఎస్ నేత మృతి
చోడవరం: మాదిగ రిజర్వేషన్ పోరాట మితి (ఎమ్మార్పీఎస్) పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాశరావు గుండెపోటుకు గురై మరణించారు. విశాఖ జిల్లా చోడవరం అంబేద్కర్ భవనంలో శనివారం రాత్రి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సభ నిర్వహించారు. దీనికి హాజరైన ప్రకాశరావు ప్రసంగిస్తూ సభావేదికపై కుప్పకూలిపోయారు. నాయకులు, కార్యకర్తలు అతనిని అంబులెన్స్‌లో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం కంచరపాలేనికి తరలించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని లోబరచుకుని..) -
'మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారు'
సాక్షి, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానంనించి, మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అయితే దీనిని తాము రాజకీయంగానే ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఆదివారం (సెప్టెంబరు 22) మాదిగ మహా దీక్షను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను మందకృష్ణ మాదిగ శనివారం స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా.. మాదిగ మహా దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు హాజరుకావాలని పిలుపనిచ్చారు. సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేపు జరిగే సభలో ఒకవేళ భారీ వర్షం కురిసినా కూడా యథాతథంగా నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు. ఉద్యామాన్నిఎంత అణచి వేయాలని ప్రయత్నిస్తే.. అంతా ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుందని ఆయన హెచ్చరించారు. ఓసీ కులంలో వెలమ, రెడ్లు మాత్రమే ఉన్నారా? వైశ్య, బ్రహ్మణ కులాలలో లేరా? వారిని ఓసీ కులాల నుంచి తొలగించే ప్రయత్నం ఏమైనా చేశారా?అని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. -
‘ఖబర్దార్ మందకృష్ణ.. అడ్డుకుని తీరతాం’
సాక్షి, విజయవాడ : ఉద్యమాల పేరుతో మాదిగల ఆత్మ గౌరవాన్ని రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాడు అంటూ మంద కృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చర్చలు జరపకుండా అసెంబ్లీని ముట్టడి చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేయడం సరికాదని విమర్శలు గుప్పించారు. మందకృష్ణ మాదిగ అసెంబ్లీ ముట్టడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏపీ ఎమ్మార్పీఎస్, గిరిజన సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...రాష్ట్రంలో మందకృష్ణ ఆటలు సాగన్విమన్నారు. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఏపీ గిరిజన సంఘాల జేఏసీ నాయకులు పాలకీర్తి రవి మాట్లాడుతూ... 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఎల్లప్పుడు తన కులం వారికే పెద్ద పీట వేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు మాదిగలను దూరం చేసేందుకే మందకృష్ణ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి ఖబర్దార్ మందకృష్ణ అంటూ హెచ్చరించారు. -
‘అప్పుడు దళితులు.. ఇప్పుడు కాపుల వంతు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని అటెకెక్కించింది చంద్రబాబేనని మండిపడ్డారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ పేరుతో నాడు దళితులను మోసం చేసిన బాబు, నేడు కాపులను మోసం చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ చేయడం చేతగాని చంద్రబాబు కాపులకు ఏం ఒరగబెడతాడని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బాబు చేసే ప్రతి పనీ ఓట్లు, సీట్లు కోసమే ఉంటుందని అన్నారు. ఏపీ, తెలంగాణాల్లో టీడీపీ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మార్పీఎస్ 25వ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్ చౌక్ వద్ద శనివారం జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొన్నాల నారాయణ మాట్లాడుతూ తరతరాల నుంచి మాదిగ జాతి అన్ని విధాలుగా నష్టపోతుందని, మంద కృష్ణ మాదిగ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా సమస్యలు మాత్రం తీరడంలేదన్నారు. నేటికీ ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నామన్నారు. మాదిగల సమస్యలు తీరాలంటే మంద కృష్ణ మాదిగ చేపడుతున్న ఉద్యమంలో మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని, ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధానకార్యదర్శి ఇప్ప నాగరాజు, నాయకులు అంజన్న, మోతె నారాయణ, సాగర్, నరేష్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు -
వర్ల రామయ్యకు అహంకారం పెరిగింది..
సాక్షి, గుంటూరు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ ... వర్ల రామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘వర్ల రామయ్యకు పదవి రావడంతో అహంకారం పెరిగింది. వెంటనే మాదిగలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని వర్ల రామయ్య కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రావెల కిషోర్...గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని అసైన్డ్ భూములను పరిశీలించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు ఉపాధి చూపించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు సేకరించాలని రావెల కిషోర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వండి
నెల్లూరు రూరల్: ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్ నేతలు కోరారు. ఈ మేరకు పొదలకూరురోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షుడు మంద పెంచలయ్యమాదిగ మాట్లాడు తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ఎంపీలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లుగా తెలి పారు. జిల్లాలోని అన్ని మం డల కేంద్రాల్లో ఈ నెల 21న రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి కోలగట్ల రమేష్, పాపయ్య, బెల్లంకొండ గోపి, బర్రె ప్రసాద్, సుధా, మునె య్య పాల్గొన్నారు. -
సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు
సాక్షి, నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయం వద్ద ఉన్న సెల్‌టవర్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎక్కి తమ నిరసన తెలియజేశారు. కాగా... ట్యాంక్‌బండ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన మంద క్రిష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
వెంకయ్య నాయుడిపై ఆరోపణలు
న్యూఢిల్లీ: మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. ఎస్సీలను ఏబీసీడీలు వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జంతర్‌మంతర్ వద్ద మాదిగ జేఏసీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాదిగలను వెంకయ్య నాయుడు ఉపయోగించుకుని ఉపరాష్ట్రపతి అవుతున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల వరకైనా వర్గీకరణ అంశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని నిన్న పిడమర్తి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయించిందన్నారు. అయినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. -
పెద్ద మాదిగనవుతానని మోసం చేశారు..
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగల ద్రోహిగా మిగిలిపోయారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తాను పెద్ద మాదిగనవుతానని మోసం చేశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని చంద్రబాబు ఢిల్లీ తీసుకు వెళ్లాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. జూలై 7న అమరావతిలో మాదిగల కురుక్షేత్రం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. -
వర్గీకరణపై నివేదికలను అమలు చేయాలి
హైకోర్టులో మాదిగ సంఘాల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ నిమిత్తం జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలోని జాతీయ ఎస్సీ కమిషన్ 2008లో ఇచ్చిన నివేదికను, 1999లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదికలను అమలు చేసేలా కేంద్రంతోపాటు, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం వివక్ష చూపడమే నంటూ మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమిటీ సం యుక్త కార్యదర్శి రాయవరపు చిరంజీవరావు, మాదిగ రిజర్వేషన్ సా«ధన సమితి అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వ రరావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
మామా.. మజాకా!
– కోడలిని కిడ్నాప్ చేసిన మేనమామ – తనకు దక్కదేమోననే ఉద్దేశంతోనే కిడ్నాప్‌నకు యత్నం – బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా పట్టుకున్న ధర్మవరం పోలీసులు -------------------------------------------------------- అనంతపురం సెంట్రల్/ధర్మవరం అర్బన్ : తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడో ఏమో మేనకోడలిని కిడ్నాప్ చేయబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడో మేనమామ. కాలేజీ వద్ద వదులుతానంటూ బాలికను నమ్మించి, బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్న అతని కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన నరసింహులు కుమారుడు బోయ రాజు(23) బేల్దారి పని చేసేవాడు. రుద్రంపేట పంచాయతీలో ఉంటున్న తన అక్కబావల కుమార్తె(16) అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీసత్యసాయి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజు పథకం రచించాడు. రోజూలాగే శనివారం కూడా తన అక్క ఇంటి వద్దకు వెళ్లాడు. కాలేజీ దగ్గర వదులుతానంటూ ఆమెను నమ్మించాడు. నిజమేనని నమ్మిన ఆ అమాయకురాలు అతని వెంట బైక్‌పై బయలుదేరింది. రుద్రంపేట వద్దకు రాగానే అనంతపురంలోకి కాకుండా బైక్ జాతీయ రహదారి వైపు పరుగులు పెట్టించాడు. అనుమానం వచ్చిన ఆమె నిలదీసింది. అయినా సమాధానం చెప్పకుండా బైక్‌ను వేగంగా నడిపాడు. రాప్తాడు దాటిన తర్వాత సదరు బాలిక గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించారు. ధర్మవరంలోని విలేకరుల కాలనీ సమీపానికి బైక్ చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. అనంతరం బాలికతో పాటు ఆమె మేనమామను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు. -
'మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలి'
హైదరాబాద్: మాదిగలది 50 ఏళ్ల ఆవేదన అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష మాదిగ అన్నారు. మాదిగల ఆకాంక్షలు నెరవేర్చాలని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల ధర్మయుద్ధం మహాసభలో ఆయన డిమాండ్ చేశారు. డబ్బులిస్తే మాదిగలు ఇక్కడకు రాలేదని, తమకు దోచుకున్న దాచుకున్న డబ్బుల్లేవన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసైనా ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష తెలిపారు. భారత్ మాతాకీ జై అనగానే సరిపోదు.. మాదిగల పోరాటానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హామీఇచ్చారు. మాదిగలకు సమన్యాయం జరగాలన్నారు. మాదిగల పోరాటానికి రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. మాదిగాల ఎస్సీ వర్గీకరణ లక్ష్యం సిద్ధించాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ వాళ్లు సభకు రాకపోయినా నష్టం లేదన్నారు. భారత్ మాతాకీ జై అనగానే సరిపోదని, అందరూ అభివృద్ధి చెందినప్పుడే సమన్యాయం జరిగినట్టన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మేలు జరగాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు నేతలు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మాదిగలు తరలివచ్చారు. -
ధర్మయుద్ధం మహాసభ ప్రారంభం
హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లుపెట్టాలని మాదిగలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాదిగల ధర్మయుద్ధం మహాసభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష మాదిగ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు నేతలు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మాదిగలు తరలివచ్చారు. -
‘ధర్మయుద్ధం’ విజయవంతం చేయండి
♦ పలు పార్టీల నాయకుల పిలుపు ♦ వర్గీకరణ జరిగితేనే దళితుల అభివృద్ధి సాధ్యం: సర్వే హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న ధర్మయుద్ధం మహా సభను విజయవంతం చేయాలని పలు పార్టీలకు చెందిన నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం హైద రాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మాల, మాదిగల పంచాయితీ ఆం ధ్రా, తెలంగాణ లాంటిదని, రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలసి ఉంటామన్నట్లే, ఎస్సీ రిజర్వేషన్ చేస్తేనే దళితులంతా అభివృద్ధి చెందుతారని అన్నారు. సీఎం కేసీఆర్ గంజిలో ఈగను తీసేసినట్లు రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాదిగ ధర్మయుద్ధం సభకు హాజరు కావాలని అన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజ య్య మాట్లాడుతూ తాను ఎంఆర్పీఎస్ కార్యకర్తగా ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు. మాదిగలంతా వర్గీకరణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ 23 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని, 59 ఉప కులాలకు సమన్యాయం జరిగేందుకే వర్గీకరణ అని అన్నారు. బీజేపీ వర్గీకరణ చేసేందుకు సిద్ధంగా ఉందని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ సమస్యను భుజాన వేసుకున్నారని అన్నారు. వర్గీకరణ కోసం అంతిమ పోరాటమిది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన దిశ గా జరిగే అంతిమ పోరాటమే ఈ ధర్మయుద్ధం అని అన్నారు. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీల పూర్తి మద్దతు ఉందన్నారు. కేంద్రంలో కూడా అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయని అన్నారు. కేవ లం మాలల్లోని కొంతమంది స్వార్థపరులు రెండు సార్లు వర్గీకరణను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ లేకపోవడంవల్లే తాము వెనక బడి ఉన్నామని చెప్పేందుకే ఈ ధర్మ యుద్ధమని అన్నారు. దళితులే కాకుండా ధర్మం పక్షాన నిలబడే అందరూ పార్టీలకతీతంగా ధర్మయుద్ధాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తదితరులు పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, బీజేపీ నాయకులు రాములు, సాంబమూర్తి, బొట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే
–మాలల రూపంలో స్వార్ద శక్తులు పొంచిఉన్నాయి –ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం –మాదిగల ధర్మయుద్ద సన్నాహక సభలో మంద కృష్ణమాదిగ –సంఘీభావం ప్రకటించిన దేవాదాయశాఖా మంత్రి పైడికొండల –జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మాదిగలు తాడేపల్లి గూడెం: ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుంది. పోరాటంలో మలుపులు. అవరోధాలు అధిగమిస్తూ విజయంలోని వెయ్యి మెట్లలో 999వ మెట్టుకు చేరుకున్నాం. దళితుల్లో అభివృద్ది రూపంలో ముందడుగు వేసిన వారే ప్రతిబంధకాలు సష్టించారు. ఉద్యమంలో ఎదిగిన వారు పాలకవర్గాల కొమ్ముకాసి ఉద్యమాన్ని దెబ్బతీశారు. లక్ష్యానికి చేరువగా ఉన్నాం. మూడు సార్లు వర్గీకరణ ఫలాలు అందినట్టే అంది. చేజారి పోడానికి కారకులైన స్వార్ధపరులైన మాలలు అవకాశాలను దెబ్బతీయడానికి పొంచి ఉంటారు అయ్యినా విజయం మనదే అని ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు కృష్ణమాదిగ భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్దానిక గమిని ఫంక్షన్ ప్లాజా వద్ద జరిగిన మాదిగల ధర్మయుద్ద సన్నాహక జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల చేపట్టిన దీక్షల తర్వాత విజయం లో 999వ మెట్టుకు చేరుకున్నామన్నారు. దీక్షలకు ప్రతిపక్షాలు ,వామపక్షాలు మద్దతు పలకడం మామూలే. కేంద్రంలో అధికార పక్షానికి చెందిన వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు దీక్షలకు మద్దతు ప్రకటించారు. అందుకే వర్గీకరణ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని కృష్ణమాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వైపు న్యాయం ఉందని వెంకయ్య అన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి కసరత్తు చేశామో అదే కసరత్తు ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో చేస్తామని వెంకయ్య చెప్పారన్నారు. మాలల రూపంలో శత్రువు పొంచి ఉన్నాడు మాదిగలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైనికుని కునుకుపాడు ఉడీ లాంటి సంఘటనకు కారణమైందో .ప్రస్తుతం మాదిగలు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం వస్తుందని గమనించాలన్నారు. యుద్ధం నుంచి పారిపోతే జాతికి విముక్తి ఉండదన్నారు. సమాజం మద్దతు ఉంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అయ్యినా సాధించిన విజయాలను పలుకుబడితో లాక్కున్నవారు ఉన్నారు. అయ్యినా రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే వచ్చే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. 1997 లో వర్గీకరణ సాధించాం. మాల కులానికి చెందిన హనుమంతప్ప ఎస్సీఎస్టీ చైర్మన్‌గా ఉండటంతో ఫలాలు అందకుండా పోయాయన్నారు. 1999 నవంబరులో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ తెచ్చుకున్నాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చట్టం అమలు జరిగింది. స్వార్ధపర మాలల వర్గం కన్నేసింది. సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా అదే కులానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. వందకు పైగా కులాలున్న బీసీలకు వర్గీకరణ ఉండాలని తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు, 50 కులాలు కలిగిన ఎస్సీ వర్గీకరణ కుదరదని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఉన్న మాలలు అడ్డుకున్నారని మంద ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని . దీనికనుగుణంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా, సోనియా గాంధీ, మన్మోçßæన్సింగ్, రాహుల్ గాంధీలకు కార్యదర్శులుగా ఉన్న మాలలు వర్గీకరణ జరుగకుండా చక్రం తిప్పారని కష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ జరుగకుండా చీకట్లో ఓడించే కుట్రలు పార్లమెంటు లో జరిగే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కర్ణాటకకు చెంది , మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే రూపంలో ప్రమాదం పొంచి ఉందని గమనించాలన్నారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరుకొనే శక్తులను దేశవ్యాప్తంగా కూడకడుతున్నాం. ఏ ప్రమాదం వచ్చినా అడ్డుకోడానికే ధర్మయుద్ద మహాసభ అన్నారు. మీరిచ్చిన నైతిక సై ్ధర్యంతో ముందుకెళుతున్నాం. యుద్దంలో గెలవనంతకాల చీకట్లో ఉంటాం. వెలుగుకోసం ధర్మయుద్దంలో అంతిమగెలుపుకోసం నవంబరు సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే
–మాలల రూపంలో స్వార్ద శక్తులు పొంచిఉన్నాయి –ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం –మాదిగల ధర్మయుద్ద సన్నాహక సభలో మంద కృష్ణమాదిగ –సంఘీభావం ప్రకటించిన దేవాదాయశాఖా మంత్రి పైడికొండల –జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మాదిగలు తాడేపల్లి గూడెం: ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుంది. పోరాటంలో మలుపులు. అవరోధాలు అధిగమిస్తూ విజయంలోని వెయ్యి మెట్లలో 999వ మెట్టుకు చేరుకున్నాం. దళితుల్లో అభివృద్ది రూపంలో ముందడుగు వేసిన వారే ప్రతిబంధకాలు సష్టించారు. ఉద్యమంలో ఎదిగిన వారు పాలకవర్గాల కొమ్ముకాసి ఉద్యమాన్ని దెబ్బతీశారు. లక్ష్యానికి చేరువగా ఉన్నాం. మూడు సార్లు వర్గీకరణ ఫలాలు అందినట్టే అంది. చేజారి పోడానికి కారకులైన స్వార్ధపరులైన మాలలు అవకాశాలను దెబ్బతీయడానికి పొంచి ఉంటారు అయ్యినా విజయం మనదే అని ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు కృష్ణమాదిగ భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్దానిక గమిని ఫంక్షన్ ప్లాజా వద్ద జరిగిన మాదిగల ధర్మయుద్ద సన్నాహక జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల చేపట్టిన దీక్షల తర్వాత విజయం లో 999వ మెట్టుకు చేరుకున్నామన్నారు. దీక్షలకు ప్రతిపక్షాలు ,వామపక్షాలు మద్దతు పలకడం మామూలే. కేంద్రంలో అధికార పక్షానికి చెందిన వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు దీక్షలకు మద్దతు ప్రకటించారు. అందుకే వర్గీకరణ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని కృష్ణమాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వైపు న్యాయం ఉందని వెంకయ్య అన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి కసరత్తు చేశామో అదే కసరత్తు ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో చేస్తామని వెంకయ్య చెప్పారన్నారు. మాలల రూపంలో శత్రువు పొంచి ఉన్నాడు మాదిగలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైనికుని కునుకుపాడు ఉడీ లాంటి సంఘటనకు కారణమైందో .ప్రస్తుతం మాదిగలు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం వస్తుందని గమనించాలన్నారు. యుద్ధం నుంచి పారిపోతే జాతికి విముక్తి ఉండదన్నారు. సమాజం మద్దతు ఉంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అయ్యినా సాధించిన విజయాలను పలుకుబడితో లాక్కున్నవారు ఉన్నారు. అయ్యినా రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే వచ్చే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. 1997 లో వర్గీకరణ సాధించాం. మాల కులానికి చెందిన హనుమంతప్ప ఎస్సీఎస్టీ చైర్మన్‌గా ఉండటంతో ఫలాలు అందకుండా పోయాయన్నారు. 1999 నవంబరులో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ తెచ్చుకున్నాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చట్టం అమలు జరిగింది. స్వార్ధపర మాలల వర్గం కన్నేసింది. సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా అదే కులానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. వందకు పైగా కులాలున్న బీసీలకు వర్గీకరణ ఉండాలని తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు, 50 కులాలు కలిగిన ఎస్సీ వర్గీకరణ కుదరదని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఉన్న మాలలు అడ్డుకున్నారని మంద ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని . దీనికనుగుణంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా, సోనియా గాంధీ, మన్మోçßæన్సింగ్, రాహుల్ గాంధీలకు కార్యదర్శులుగా ఉన్న మాలలు వర్గీకరణ జరుగకుండా చక్రం తిప్పారని కష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ జరుగకుండా చీకట్లో ఓడించే కుట్రలు పార్లమెంటు లో జరిగే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కర్ణాటకకు చెంది , మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే రూపంలో ప్రమాదం పొంచి ఉందని గమనించాలన్నారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరుకొనే శక్తులను దేశవ్యాప్తంగా కూడకడుతున్నాం. ఏ ప్రమాదం వచ్చినా అడ్డుకోడానికే ధర్మయుద్ద మహాసభ అన్నారు. మీరిచ్చిన నైతిక సై ్ధర్యంతో ముందుకెళుతున్నాం. యుద్దంలో గెలవనంతకాల చీకట్లో ఉంటాం. వెలుగుకోసం ధర్మయుద్దంలో అంతిమగెలుపుకోసం నవంబరు సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
మాదిగలను విస్మరించడం దారుణం
అనంతపురం న్యూటౌన్ : అధికారం రాగానే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కృషి చేసి పెద్దమాదిగనవుతానని చెప్పిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మాదిగలను విస్మరించడం దారుణమని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ విమర్శించారు. ఆదివారం నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంఈఎఫ్ (మాదిగ ఉద్యోగుల సమాఖ్య) కార్యకర్తల సమావేశం జరిగింది. ఎంఈఎఫ్ నాయకులు డాక్టర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బండారు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించుకుందామని, ఉద్యమానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ నెల 25 నుంచి అక్టోబరు 23 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో సమాయత్త సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవంబరు 20న హైదరాబాదులో మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరుగనున్న మాదిగల ధర్మయుద్ధ మహాసభకు మాదిగలందరూ కుటుంబ సమేతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు అమర్నాథ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, సాకే నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్ 20 మాదిగల ధర్మయుద్ధం
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు గాను మాదిగల ధర్మయుద్ధం పేరుతో నవంబర్ 20న హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాదిగ విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ తెలిపారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 20న నిర్వహించే మహా సభకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావాలని పిలుపు నిచ్చారు. అందులో భాగంగానే ఈ నెల 20న జహీరాబాద్ నుంచి పాద యాత్ర ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో నాయకులు సింహచలం, శ్రీహరి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పండుగ రోజు దారుణం
అందరూ వినాయక చవితి పండుగ సంబరాల్లో మునిగి ఉన్నారు. అంతలోనే ఓ దారుణం వెలుగు చూసింది. ఓ వివాహిత మహిళ కిరాతకంగా హత్యకు గురవడం కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకునే వ్యక్తే ఆమెను చంపి ఉంటాడని ఊరు ఊరంతా కోడైకూసింది. తన అవసరాలకు డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలతెలవారుతుండగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆత్మకూరు : ఆత్మకూరు మండలం మదిగుబ్బ ఎస్సీ కాలనీకి చెందిన పెద్దన్న అలియాస్ సన్నప్పయ్య భార్య ఎనుముల లక్ష్మిదేవి(35) సోమవారం తెల్లవారుజామున దారణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం... లక్ష్మిదేవి, సన్నప్పయ్యకు వివాహమై పదిహేనేళ్లవుతోంది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు. జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చి.. ఈ నేపథ్యంలో లక్ష్మిదేవి అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామితో సన్నిహితంగా ఉంటోంది. భర్త తన సంపాదనను తెచ్చి భార్యకిస్తే, ఆమె ప్రియుడికి ఇచ్చేది. ఈ నేపథ్యంలోనే ఎర్రిస్వామి తనకు డబ్బు అవసరముందని, తెచ్చివ్వాలని లక్ష్మిదేవిని ఆదివారం డిమాండ్ చేశాడు. ప్రస్తుతానికి తన వద్ద డబ్బు లేదని ఆమె బదులిచ్చింది. దీంతో అతనిలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అందరూ చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని న డి వీధిలోకి ఈడ్చుకువచ్చాడు. అందరూ చూస్తుండగానే కసితీరా కొట్టాడు. ఆ తరువాత సోమవారం తెల్లవారుజామునకల్లా ఆమె మృతదేహమై పడి ఉంది. భర్త ఫిర్యాదుతో... భార్య మృతదేహాన్ని చూసిన పెద్దన్న నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని లక్ష్మిదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంట్లోని చెక్కతో బలంగా కొట్టడంతోనే ఆమె మరణించినట్లు గుర్తించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? లక్ష్మిదేవి హత్యకు సంబంధించి అనుమానితుడైన ఆమె ప్రియుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తమదైన శైలిలో అతన్ని విచారించినట్లు సమాచారం. -
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి
కరీంనగర్ : తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఉద్యమించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి(ఎంహెచ్పీఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్య«క్షుడు మైస ఉపేందర్ కోరారు. సోమవారం కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి దీక్షలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ జ నాభా గల మాదిగ ఉపకులాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను రూ.5లక్షలకు పెంచాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆర్.రాజు, ప్రధాన కార్యదర్శి గజ్జెల నాగేశ్వర్రావు, నాయకులు దామెర సతీశ్, కనకం రవి, ప్రభాకర్, బాబు, వివిధ నియోజక వర్గాల ఇన్చార్జీలు లక్ష్మణ్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, మంద శ్రీనివాస్, సురేష్, రాజు పాల్గొన్నారు. 5న మాదిగల ధూంధాం కరీంనగర్‌లోని రెవెన్యూగార్డెన్లో ఈనెల 5న ధూంధాం నిర్వహిస్తున్నట్లు సామాజిక తెలంగాణ ధూంధాం రాష్ట్ర కన్వీనర్ మారంపెల్లి రవీందర్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా ఈ కార ్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రెస్‌భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే వందరోజుల్లో ఎస్సీవర్గీకరణ చేపడతామన్న బీజేపీ స్పందించడం లేదన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల సాగర్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాతంగి రమేశ్, నాయకులు గోష్కి అజయ్, గంగారాజు, భాస్కర్, మహేశ్, మహేందర్, రాజేశ్, శశి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
చర్మకారులకు రూ.2వేల పింఛన్ ఇవ్వాలి
ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ దండేపల్లి : మాదిగకులస్తుల చర్మకారులకు, డప్పులు వాయించే వారికి నెలకు రూ.2వేల ఫించన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బిరుదుల ధర్మయ్య, లింగంపల్లి బాపు, బచ్చల అంజన్న డిమాండ్ చేశారు. దండేపల్లి ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మండంలోని అన్ని గ్రామాల మాదిగ కులస్తులు సోమవారం సమావేశమై సమస్యలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీరణ చేపట్టాలన్నారు. అట్రాసిటి కేసులపై అవగాహన కల్పించాలని, సపాయి పని చేసే వారందనీ పర్మినెంట్ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ అశోక్‌కు అందజేశారు. ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జిల్లపెల్లి వెంకటేశ్, కొల్లూరి సతీశ్, తగరపు సత్యం, మల్యాల శ్రీనివాస్, శనిగారపు శంకరయ్య, మండలం లోని పలు గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
27న మాదిగ జేఏసీ జిల్లా సదస్సు
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగహంలో జిల్లా మాదిగ జేఏసీ సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ విజయమోహన్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సురేష్, సుందర్, నర్సింహులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మాదిగలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
హన్మకొండ : బీజేపీ, టీఆర్ఎస్ మాదిగలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశా ల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డి మాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్(టీఎస్) ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిలపార్కు వ ద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరాయి. దీక్షలకు నాయిని సంఘీబావం తెలిపి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన రెండు పార్టీలు అధికారంలోకి రాగా నే మాట తప్పాయని ధ్వజమెత్తారు. ఎ మ్మార్పీఎస్ (టీఎస్)చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఎమ్మార్పీఎస్(టీఎస్) జిల్లా ఇంచార్జి మేకల నరేం దర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వర్గీకరణపై తన వైఖరి స్పష్టం చేయాలని డిమాం డ్ చేశారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య, యువసేన జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి విజ య్, నాయకులు వినయ్, ప్రవీణ్, మధు, ప్రశాంత్, యోబు, దాలీ, అరుణ్, నరేం ద ర్, రాజేష్, ప్రత్యూష్, టోనీ, పవన్, మా ర్క్ రవి, యోహాన్ కూర్చున్నారు. దీక్షలకు ఆప్ జిల్లా కన్వీనర్ దాడబోయిన శ్రీ కాంత్, ఎమ్మార్పీఎస్(టీఎస్) నాయకులు మాదాసి రాంబాబు, పి.సంజీవ, ఎం.బాబురావు, డాక్టర్ రామకృష్ణ, అనిల్‌కుమార్, రాజేష్‌ఖన్నా, కిశోర్, బాబు, సారంగపాణి సంఘీభావం తెలిపారు. -
'బాబూ.. ఇకనైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకో'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మార్చి 10న నారావారిపల్లె నుంచి మాదిగ చైతన్య రధయాత్ర చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో చంద్రబాబు తల్లిదండ్రుల విగ్రహాల వద్ద నివాళులు ఆర్పిస్తామని చెప్పారు. ఏప్రిల్ 30న విజయవాడలో 10 లక్షల మందితో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని మందకృష్ణమాదిగ తెలిపారు. -
మాదిగలకు ద్రోహం చేసిన చంద్రబాబు
- ఎస్సీ వర్గీకరణకు ఢిల్లీని ముట్టడిస్తాం - రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి షాబాద్ : వర్గీకరణ విషయంలో మాదిగలకు చంద్రబాబు ద్రోహం చేశారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. షాబాద్ మండలంలోని నాగరగూడచౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాదిగలకు అన్యాయం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తే బొందపెట్టేది ఖాయమన్నారు. అంబేద్కర్ ఆశయసాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వర్గీకరణ కోసం వచ్చే నెలలో ఢిల్లీని ముట్టడిస్తామన్నారు. బాబూ జగ్జీవన్‌రాం, కాన్షీరాం ఆశయాల సాధన కోసం మాదిగలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించిందన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేంతవరకు శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. దండోరా పేరుతో 20 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ మాదిగలకు అన్యాయం చేశారన్నారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం భూ పంపిణీ , క ల్యాణలక్ష్మి, విదేశాల్లో చదివే దళిత విద్యార్థులకు ఆర్థికసాయంలాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులోభాగంగా ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే వంద కోట్లతో దళితుల అభ్యున్నతికి కేటాయించామన్నారు. భూమిలేని దళితుల కోసం భూ కోనుగోలుకు జిల్లాలో రూ.25 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు రాందాస్, శ్రీనివాస్, రమేశ్, శంకర్, జోగు అశోక్‌కుమార్, జోగు వెంకటయ్య, రాజారత్నం, రవికుమార్, నరసింహులు, గోపాల్, కిరణ్, పెంటయ్య, రామకృష్ణ, అంజిబాబు, వీరబాబు, పరిగి రవి, వెంకటేష్, రవీందర్, పాండు, బుచ్చయ్య, అబ్రహాం, వెంకటయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
'వరంగల్ ఎంపీ టికెట్టు మాకే ఇవ్వాలి'
వరంగల్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఉన్నికలో ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగలకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఎంపీ టికెట్‌ను మాదిగలకే ఇస్తామని గతంలో ప్రకటించిన మంత్రి కడియం శ్రీహరి.. ఇప్పుడు తన కూతురును బరిలో నిలపాలని యోచించడం వెనుక ఆంత్యర్యమేంటని ప్రశ్నించారు. మాదిగల సహకారంతోనే కడియం రాజకీయంగా నిలదొక్కుకున్నారనేది గమనించాలన్నారు. మోసం చేయాలని చూస్తే శ్రీహరిని మాదిగలు శత్రువుగా పరిగణిస్తారన్నారు. తెలంగాణ పలెల్లో కడియం శ్రీహరి తిరగకుండా అడ్డుకుంటామన్నారు. తక్కువ శాతం ఉన్న మాలలకు ఎంపీ టికెట్ కట్టబెట్టి మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. సంక్షేమ రంగాల్లో వర్గీకరణ ప్రకటించే విషయంపై కడియం శ్రీహరి తక్షణమే సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతకు పార్లమెంట్లో బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. -
పాతపల్లి మాదిగల్ని కాపాడేదెవరు?
పాతపల్లి అనే గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం, వనపర్తి నియోజకవర్గంలో ఉంది. మే 1, 2015న రఘురాం అనే మాదిగ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు నూతన దంపతులిద్దరు దేవుని దర్శనం కోసం గుడిలోకి వెళ్లారు. మాదిగలు గుడిలోకి వెళ్లినందుకు పూజారి గుడిని శుద్ధి చేయించాడు. మే 2 నుంచి గుడికి తాళం వేశారు. ఆ రోజు నుంచి ఒక రకం గా బోయలు మాదిగల్ని వెలివేశారు. మాదిగలను రకర కాలుగా వేధింపులకు గురిచేశారు. మే 4న స్థానిక ఎమ్మా ర్వో గ్రామంలో ప్రజావాణి నిర్వహించాడు. మాదిగలు వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎమ్మార్వో మే 6న పోలీసులను తీసుకొని ఊళ్లోకి వచ్చాడు. మాదిగలను దేవాలయ ప్రవే శం చేయించాడు. అధికారులు వెళ్లిపోయాక బోయలు మాదిగల మీద దాడి చేశారు. వారికి తాగునీరు సప్లయ్ చేస్తున్న ట్యాంకర్‌ను బందు చేశారు. ఘర్షణను నివారిం చడానికి ఊళ్లోకి వచ్చిన పోలీసుల సమక్షంలోనే 400 మంది బోయలు మాదిగల్ని పరుగెత్తించి కొట్టారు. రాజకీయ నాయకులకు కూడా 180 మాదిగల ఓట్లకంటే 900 బోయల ఓట్లే సంఖ్యాపరంగా ఎక్కువ. కనుక అధి కార, ప్రతిపక్ష పార్టీల నాయకులంతా బోయలకే మద్ద తుగా ఉండటం వలన అధికార యంత్రాంగమంతా బోయలను కాపాడుతోంది. ఇప్పటివరకు ఆ ఊరికి చాలామంది దళిత నాయకులు, ప్రజా సంఘాల నాయ కులు వెళ్లి మాదిగల పోరాటానికి మద్దతు పలికారు. కానీ ఏ నాయకుడు కూడా వాళ్ల వెంట స్థిరంగా ఉండి పోరాటాన్ని నడిపింది లేదు. రెండు నెలలుగా పాతపల్లి మాదిగలు ఆత్మగౌరవం కోసం, భూమి కోసం పోరాటం చేస్తున్నా న్యాయం జరగటం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘మాది దళిత శ్రేయస్సు కోరే ప్రభుత్వమని’ చెబుతున్నది. మరి దళితుల మీద దాడులు జరుగుతుం టే, మాదిగల్ని వెలివేస్తుంటే మౌనంగా ఎందుకు ఉంది? చాలా మంది బీసీ మేధావులు ఎస్సీ సమాజాన్ని ఆధారం చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్యత గురించి మాట్లాడుతుంటారు. కానీ వాళ్ల కులాలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించవు. వీలు దొరికితే మావోయిస్టులను విమర్శించే ఈ మేధావు లకు ఈ దాడులు కనిపించవు. అగ్రకుల బ్రాహ్మణీయ సంకెళ్ల నుంచి బీసీ కులాలను బయటికి తీసుకొచ్చే పనిని ఈ మేధావులు చేయకపోతే రాబోయే రోజుల్లో దళితులకు బీసీలకు మధ్య వైరుధ్యం తీవ్రమవుతుంది. ఇప్పటికే చాలాచోట్ల దళితుల మీద దాడులు చేస్తున్నది బీసీలే. నడుస్తున్న చరిత్రలో దళిత, బీసీ మేధావులు పాతపల్లి ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పాలి. (వ్యాసకర్త డా॥సి.కాశీం) అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ: 97014 44450 -
దళితుల ప్రతిఘటనా పోరాట దిక్సూచి ‘కారంచేడు’
30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని సంపన్న గ్రామం కారంచేడులో మున్నంగి సువార్త అనే మాదిగ స్త్రీ ఆ ఊరి కమ్మ యువకులపై మంచినీళ్ల బిందెతో దాడిచేసింది. కారణం మాదిగ, మాల పల్లెలు మంచినీళ్లు తాగే చెరువులో ఇద్దరు కమ్మ యువకులు తమ గేదెలు కడుగుతూ, కుడితి నీళ్లను చెరువులో పోయటమే కాకుండా, ప్రశ్నించిన మున్నంగి సువార్తను, చర్నాకోలతో కొట్టారు. దాంతో ఆమె వారికి బిందెతో బుద్ధి చెప్పింది. వేలాది ఎకరాల సుసంపన్న భూములు, రాజకీయ, సినీ, వ్యాపార రంగాలలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన ప్రముఖులతో పాటు, స్వయానా అప్పటి సీఎం ఎన్.టి.రామారావు వియ్యంకుడు దగ్గుపాటి చెంచురామయ్య స్వగ్రామం అది. ఆ అహంకారమే మాదిగల మంచినీళ్ల చెరువులో గేదెలను కడిగేందుకు పురికొల్పింది. ఈ సంఘటనను కారణంగా చూపి జూలై 17, 1985న వేలాది మంది కమ్మ యువకులు బరిసెలు, గొడ్డ ళ్లు, కత్తులతో మాదిగ పల్లెపై దాడి చేశారు. స్త్రీలపై అత్యా చారాలు చేశారు. విచక్షణ లేకుండా రాక్షసంగా, క్రూరాతి క్రూరంగా వెంటపడి పాశవికంగా దాడి చేశారు. ఈ కులోన్మాద మృగాల దాడిలో దుడ్డు రమేష్, దుడ్డు వంద నం, దుడ్డు అబ్రహాం, తేళ్ల ఎహోషువా, తేళ్లమోఫే, తేళ్ల ముత్తయ్యలు నేలకొరిగారు. కారంచేడు ఘటన భారత దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. అప్పటి వరకూ హరి జనులుగా గుర్తింపు పొందిన మాల మాదిగల్ని దళితులు అని పిలవటం ప్రారంభమైంది. కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది దళితులు తమ అస్థిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్లు బిగించారు. 1989లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అనేక అస్థిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమ స్ఫూర్తి కారణం. కారంచేడు ఉద్యమమే భారత దేశం గుండెలపై కులం ప్రశ్నను ముద్రించింది. దళితుల సమస్యలన్నింటికీ పరిష్కారం రాజ్యాధికారమే అన్న డా॥అంబేడ్కర్ వాక్కును దళితుల మెదళ్లలో నింపింది. అయితే మహత్తరమైన దళితోద్యమాన్ని నిర్వీర్యం చేసిం ది దళిత నాయకత్వం. కోట్లాది మంది దళితుల ఆశలు నెరవేర్చేందుకు దిక్కు చూపే వేగుచుక్కలా అన్యాయా న్ని, అక్రమాన్ని ఎదుర్కొనేందుకు గర్జించే కోడెవయసు సింహంలా, ఉండాల్సిన దళితోద్యమం నేడు మోడువారి పోయింది. జాతి కోసం ఒక వీరుణ్ణి తయారు చేయలేక పోయింది దళిత నాయకత్వం. ‘నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించం డి.. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్లీ మళ్లీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను!’’ అన్న కలేకూరి కవితా స్ఫూర్తి తో కారంచేడు నెత్తుటి త్యాగాలను స్మరించుకుందాం. దళితోద్యమ విజయాలను దళిత నాయకత్వానికి, విదేశీ నిధులు అడుక్కునే స్వచ్ఛంద సంస్థలకు వదిలేద్దాం. వైఫ ల్యాలకు బాధ్యత వహిద్దాం. మోడువారిన 30 సంవ త్సరాల దళితోద్యమాన్ని సమీక్షించుకుందాం. డా॥అం బేడ్కర్ ఆశయ సాధన కోసం కారంచేడు వీరుల స్ఫూర్తితో ముందుకు కదులుదాం. (వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, మాల మహాసభ) మొబైల్: 92913 65253 -
మాదిగలపై కేసీఆర్ వివక్ష
‘మీట్ ది ప్రెస్’లో మంద కృష్ట మాదిగ ఆరోపణ పంజగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగ సామాజిక వర్గంపై కక్ష పూనారని, అందుకే రాజయ్యను మంత్రి వర్గం నుంచి బర్త్ చేసి పగ తీర్చుకున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణల వల్ల ఓ మంత్రిని బర్త్రచేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటే కేసీఆర్ ప్రభుత్వంపై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వెంటనే గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్త్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మంత్రివర్గంలో ఉన్న కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిపై కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మరి వారినెందుకు ఉపేక్షిస్తున్నారని మంద కృష్ణ ప్రశ్నించారు. కేవలం దళితుడైనందుకే రాజయ్యను తొలగించారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మూడుసార్లు పర్యటించి, మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం నిద్రించి, అక్కడి సమస్యలు తెలుసుకుంటూ మంచి పేరు సంపాదిస్తున్న రాజయ్యపై కక్షగట్టే మంత్రి వర్గం నుంచి తొలగించారన్నారు. ఇకపై కేసీఆర్‌ను వెంటాడుతాం, వే టాడుతామని, రాజకీయంగా పగతీర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. సొంత ప్రాంతం వాడే మోసం చేస్తే ఆ ప్రాంతంలోనే పూడ్చేయాలన్న కాళోజీని ఆదర్శంగా తీసుకొని కే సీఆర్‌పై మరో ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు రాజయ్య బర్త్ఫ్, మంత్రి వర్గంలో 50 శాతం మహిళలకు ఇవ్వాలనే డిమాండ్‌తో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 16 నుంచి ఏప్రిల్ 3 వరకు అన్ని మండల కేంద్రాల్లో దండయాత్ర, ఏప్రిల్ 4న లక్షలాది మందితో ఇందిరాపార్కు నుంచి కేసీఆర్ ఇంటి వరకు దండయాత్ర చేపడతామని చెప్పారు. మార్చి 7న జిల్లా కేంద్రాల్లో, 8న మండల కేంద్రాల్లో ధర్నలు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రవికాంత్, షాబుద్దీన్, మహేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
'పెద్దమాదిగ అంటూ బాబు మోసం చేశారు'
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికలలో మాదిగల ఓట్ల కోసం పెద్దమాదిగ అన్న చంద్రబాబు.. మాదిగ రిజర్వేషన్ల పోరాట వ్యతిరేకులను పార్టీలో చేర్చుకున్నారని ఆయన సోమవారమిక్కడ విమర్శించారు. మాదిగలను చంద్రబాబు మోసం చేశారని, అసెంబ్లీలో మాదిగల రిజర్వేషన్ల బిల్లు పెట్టకుంటే లక్షలాదిమందితో ఆందోళనకు దిగుతామని మందకృష్ణ హెచ్చరించారు. -
మాదిగ ద్రోహి కేసీఆర్: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మాదిగలను అంటరానివారిగా చూస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దొరతనంతో ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను బర్తరఫ్ చేశారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా ఎస్సీలను తొక్కిపట్టిన కేసీఆర్ ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను జీర్ణించుకోలేక ఆయనపై రుసరుసలాడుతూ చివరికి బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కులవివక్షత ఎక్కడో లేదని కేసీఆర్ వద్దే అది కనిపిస్తోందన్నారు. వరంగల్ సభలో తనకన్నా ముందే హెల్త్ యూనివర్సిటీపై రాజయ్య ప్రకటన చేసినప్పటి నుంచి ఆయనను మందలించడం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 600 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ ఉంటే మంత్రినే ఎందుకు బర్తరఫ్ చేశారని ప్రశ్నించారు. -
బాబుకు గుణపాఠం తప్పదు
మంద కృష్ణ మాదిగ హెచ్చరిక బౌద్దనగర్: మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టగతులు లేకుండా చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఆదివారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ సహకరించడం వల్లే చంద్రబాబు తెలంగాణలో తిరుగగలిగాడని, ఆంధ్రాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వర్గీకరణపై మాటమారుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల విషయంలో పెద్ద మాదిగనవుతా, చెప్పులు కుట్టిన చేతులే చరిత్ర సృష్టిస్తాయని అన్న బాబు మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.తాము చంద్రబాబును నమ్మి నడిపించి సహకారం అందించగా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అడ్డు చెప్పిన వారిని టీడీపీలో చేర్చుకుంటున్నారని మంద కృష్ణ విమర్శించారు. చంద్రబాబు విశ్వాసఘాతుకానికి పాల్పడుతుండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిగ జాతిపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని ఆరోపించారు. మాదిగలకు చిన్నచిన్న పదవులు ఇచ్చి వారిని తాబేదారులుగా మార్చుకున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం హోదాలో అసెంబ్లీలో ఎందుకు బిల్లు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తీర్మానం చేసి చేతులు దులుపుకోకుండా ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ఆయన సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాల కులానికి చెందిన ఘంటా చక్రపాణి ఉంటే మాదిగ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంద కృష్ణ ఆరోపించారు. ఆయనను తప్పించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లేకుంటే ఎస్సీ వర్గీకరణ చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పడేసిన పనికిమాలిన పోస్టులకు ఆశపడి మాదిగ సోదరులే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. లక్ష ఉద్యోగాలకు ఏ రిజర్వేషన్లు అమలు చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుందని ఏ రిజర్వేషన్లు అమలు చేసి వీటిని భర్తీ చేస్తారో స్పష్టం చేయాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 6, మైనార్టీలకు 4, మహిళలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని వాటినే ఇప్పుడూ అమలు చేయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. గిరిజనులకు 12, మైనార్టీలకు 12, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపరిచిందని, దీనిపై మార్చి 7వ తేదీన లక్షలాది మంది మహిళలతో నగరంలో భారీ ప్రదర్శన చేపడతామన్నారు. -
ఇద్దరు ‘చంద్రులదీ’ ఒకే దారి
వినాయక్‌నగర్ : రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌రావులది ఒకేదారని, మాదిగలకు పట్టిన గ్రహాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో ని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే దళి తుడి ముఖ్యమంత్రినే చేస్తానని పలుమార్లు చెప్పిన కేసీఆర్ దురహంకారంతో తానే ఆ కుర్చీలో కూర్చున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పని చేసిన కొప్పుల ఈశ్వర్‌ను కొడుకు కోసం బలి చేశారన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలో నల్లాల ఓదెలు తెలంగాణలోనే ప్రథమస్థానంలో నిలిచినా మంత్రి పదవికి నోచుకోవడంలో చివరకు కూడా నిలవలేదన్నారు. పార్టీలు మారిన ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి నాలుగుసార్లు గెలిచిన నల్లాల ఓదెలును పక్కకు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ దళితులపై చూపుతున్న వివక్షకు ఇదే తార్కాణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన రెండునెలలలో నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుంటమన్న మాటలు మరుగున పడేసారన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఘం టా చక్రపాణి నియామకంతో మాదిగలకు అన్యా యం జరిగిందన్నారు. మాదిగల రుణం తీర్చుకుం టామన్న ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టుకెక్కినాక తెప్పకాల బెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు మాదిగలె అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు తెలంగాణలో పాద యాత్ర చేసేసమయంలో మాదిగలు ముందుండి జైలుకు వెళ్లడంతోపాటు, ఆదిలాబాద్ జిల్లా బైంసా నుంచి తిరుగు ప్రయాణంలో ముగ్గురు మాదిగలు మృతి చెందారని గుర్తు చేశారు. మహిళలను విస్మరించిన కేసీఆర్ కల్లు తెరిపించేవిధంగా మార్చి7వతేదీన మహిళలతో హైదరాబాద్‌లో మహాయాత్ర నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రెండుగా చీలి టీఎంఆర్పీఎస్గా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కలిసి పోరాడితే ఏదైనా తొందరగా సాధిం చవచ్చుకదా అని విలేకరులు ప్రశ్నించగా వారు ప్రభుత్వం ఏజేంట్లు,పాలకులకు అమ్ముడుపోయి,పాలేరుల పనిచేస్తున్నరని మందకృష్ణ విమర్శిం చారు. సమావేశంలో జిల్లాఅధ్యక్షులు గందమాల నాగభూషణం,మైలారం బాలు,కిష్టయ్య,గంగాధర్ తార, తదితరులు పాల్గొన్నారు. -
మాట మరిస్తే టీడీపీ మునుగుతుంది
సాక్షి, హైదరాబాద్: మాదిగ జాతిని నట్టేట ముంచాలని చూస్తే మునిగిపోయేది టీడీపీనేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎస్సీల వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకోకుంటే తెలంగాణలో పార్టీని రద్దు చేసుకోవాల్సి వస్తుందని, ఏపీలో ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 14న విజయవాడలో ‘మహా విశ్వరూపం’ మహాసభను నిర్వహించనున్నట్లు చెప్పారు. జాతీయ అధ్యక్షుడిగా మాణిక్యరావ్ మాదిగ ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు మాదిగ (ప్రకాశం) ఎన్నికైనట్లు మంద కృష్ణ తెలిపారు. కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా రాగాటి. సత్యం మాదిగ (హైదరాబాద్), అధికార ప్రతినిధిగా జి.ఈశ్వరయ్య (కర్నూలు), ఎంఇఎఫ్ కమిటి జాతీయ అధ్యక్షులుగా ప్రసాద్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా బోయ జగన్నాథ్‌లు జాతీయ సమావేశంలో ఎన్నికైనట్లు తెలిపారు. ఏపీ కమిటీ..: ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ(ప్రకాశం), కార్యనిర్వాహక అధ్యక్షులుగా మల్లవరపు నాగయ్య మాదిగ (గుంటూరు), అధికార ప్రతినిధిగా సొట్ట. నరేంద్రబాబు మాదిగ ( చిత్తూరు), ఎంఇఎఫ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా సిహెచ్. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా బండారు శంకర్లు ఎన్నికయ్యారని మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. -
మాదిగల వరినాట్లు ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
దగదర్తి మండలం కాట్రాయపాడు గ్రామ సర్వే నంబర్ 152/2లో అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎనిమిది కుటుంబాల మాదిగలు గత యాభైఏళ్లుగా సాగు చేసుకుని బతుకుతున్నారు. వారిలో నలుగురికి డి.కె. పట్టాభూములు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాటిపై అనేకసార్లు వ్యవసాయ రుణాలు కూడా తీసుకున్నారు. ఆ ఎనిమిది కుటుంబాలు సాగులో ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో కూడా ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వరినాట్లకు సిద్ధం కాగా, తెలుగుదేశం నేత మాలపాటి రవీంద్రనాయుడు, అతడి అనుచరులు 50 మంది నవంబర్ 25న మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లో వచ్చి నారు మడిని తొక్కించారు. ఇలా రెండు మూడు పర్యాయాలు దళితులు మళ్లీ నాట్లు వేయడం రవీంద్రనాయుడు, మాధవరం శ్రీహరి (బాడుగు పాడు) తమ అనుచరులతో మళ్లీ దాడి చేసి నారుమడిని తొక్కించడం జరిగింది. ఈ అన్యాయంపై స్పందించాల్సిన పోలీసులు తెలుగుదేశం నేతలతోనే జత కట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాదిగలు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసినా వారు కూడా దళితుల మొర వినలేదు. డిసెంబర్ 2న మాదిగలు మళ్లీ వరినాటితే 17వ తేదీన మాదిగవాడపై దాడిచేసి పైరను తొక్కించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలుగా రవీంద్రనాయుడి అక్క మాలపాటి లలిత, తమ్ముడు సుబ్బానాయుడు పోటీ చేయగా దగదర్తి జడ్పీటీసీగా నాయుడి వదిన మాలపాటి పద్మావతి పోటీచేశారు. లలితమ్మ, పద్మావతి గెలువగా, సుబ్బానాయుడు ఓడిపోయాడు. కాట్రాయపాడు మాదిగలు ఓట్లేయ నందునే కేవలం 14 ఓట్ల తేడాతో తన తమ్ముడు ఓడిపో యాడన్న కక్షతో వారి పొలాలను మూడుసార్లు ధ్వంసం చేశారు. పైగా కేవలం చారెడు నేల ఉన్నందునే మాదిగలు తనను ధిక్కరించారని, అది లేకుండా చేస్తే అణిగి మణిగి ఉంటారని, ఆ భూమి నుండి మాదిగల్ని తరిమేసే లక్ష్యం తోనే ఈ దాడులకు పాల్పడ్డారు. మాదిగల కుండలోని గంజిలో మెతు కుల్ని కూడా సహించలేని అగ్రకుల దురహంకారంతో పైరును ధ్వంసం చేసి వారి బిడ్డల నోటికాడి కూడును కాలితో తన్నారు. 1979 నుండి కాట్రాయపాడు మాదిగలకు పలుమార్లు ప్రభుత్వం దాదాపు 430.66 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. కాని వారి వద్ద పట్టాలు, పాస్ పుస్త కాలు మాత్రమే ఉండగా భూమి మాత్రం రవీంద్ర నాయుడి అనుచ రుల కబ్జాలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 430 ఎకరాల భూమిలో కేవలం 5 ఎకరాలు మాత్రమే మాదిగలు సాగుచేసుకుంటున్నారు అది కూడా లేకుండా చేయాలని రవీంద్రనాయుడు, అతడి ముఠా దౌర్జన్యా లకు తెగబడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక రవీంద్రనాయుడి దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుండాపోయింది. పైగా బహిరంగంగానే కాట్రాయపా డును మరో కారంచేడును చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఎప్పు డు పల్లెపైదాడి చేస్తారోనని మాదిగలు బిక్కుబిక్కుమంటూ గడుపుతు న్నారు. దగదర్తి మండలంలో సుమారు 7 వేల ఎకరాల భూమి అగ్ర కుల భూస్వాముల కబ్జాలో ఉంది. దీంట్లో సగం భూమికి డికె పట్టాలు, పాస్ పుస్తకాలు ఉన్నా, భూమి మాత్రం రవీంద్ర నాయుడి అనుచరుల చేతిలోనే ఉంది. పైగా వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు, వ్యవసాయ రుణాలు అన్నీ రవీంద్రనాయుడి ఇష్టప్రకారమే జరగాలి. మండలంలో చీపురుపుల్ల కూడా అతని ఇష్టానికి భిన్నంగా కదిలితే సహించడు. ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం, వారు చేసిందే శాసనం, వారు చెప్పిందే చట్టం అయితే ఇక రెవెన్యూ, పోలీసు, కోర్టులు ఎందుకున్నట్లు? కాట్రాయపాడు మాదిగల పైర్లను ధ్వసం చేసిన రవీంద్రనాయుడు, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. మాదిగలకు నష్టపరిహారం చెల్లిం చాలనీ, రవీంద్ర నాయుడి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ, ఎస్సై లను సస్పెండ్ చెయ్యాలనీ డిమాండ్ చేస్తున్నాం. దుడ్డు ప్రభాకర్ కుల నిర్మూలనా పోరాట సమితి, నెల్లూరు -
విజయవాడకు మకాం మార్చుకో..
ఉస్మానియా యూనివర్సిటీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని వర్గీకరణ అంశంపై డ్రామాలాడుతున్న ఎంఎస్పీ నేత మంద కృష్ణమాదిగ విజయవాడకు మకాం మార్చుకోవడం మంచిదని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ధ్వజమెత్తారు. సోమవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ గతంలో తెలంగాణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి సకల జనుల సమ్మెను నిర్వీరం చేసేందుకు కుయుక్తులు పన్నారని ఆరోపించారు. దండోరా ఉద్యమాన్ని దగాకోరుల పాలు చేసి మాదిగ కులస్తులను మోసగించాడన్నారు. ఉద్యమాన్ని సొమ్ముచేసుకుని మాదిగ జాతికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. టీడీపీని, చంద్రబాబును నమ్ముకొని ఇన్ని రోజులు కాలయాపన చేసిన మంద కృష్ణమాదిగ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టించలేక పోయారని వివరించారు. మాదిగ అమరులను పూర్తిగా విస్మరించి, రాజకీయ లబ్ధికోసం కార్యకర్తలను బానిసలుగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణలో నివసించే అర్హత కోల్పోయిన మంద కృష్ణమాదిగ విజయవాడకు మకాం మార్చుకొని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా ప్రకటించుకోవాలని ఎద్దేవా చేశారు. మాదిగ బిడ్డలను టీడీపీ నేతలు చావకొడుతుంటే చోద్యం చూస్తున్నారని, బాబుతో ఒకవైపు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని మరోవైపు దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలంటూ నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యమాలంటే దాడులు కాదని, మాదిగలపై జరుగుతున్న దాడులకు మంద కృష్ణమాదిగ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో నర్సింహమాదిగ, అలెగ్జాండర్, కొల్లూరి వెంకట్, పాల్వాయి నగేష్, కొంగరి శంకర్‌మాదిగ, రమేష్, సైదులు, వెంకట్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం
కరీంనగర్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ఉత్సాహంగా దరువేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.రాజయ్య ఆదివారం డప్పు పట్టుకుని దరువేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని డప్పు వాయించారు. వీరితో పాటు మరో ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా పాల్గొన్నారు. -
టీడీపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ ఆందోళన
కొరిటెపాడు (గుంటూరు): ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లోనే తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు, కార్యకర్తలు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. వినతిపత్రం ఇవ్వటానికి వచ్చామని చెప్పి టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, నాయకులు కాకర్ల హరికృష్ణ, సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్లను కార్యాలయంలోకి తీసుకెళ్లి 3 గంటల పాటు నిర్బంధించారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు, టీడీపీ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో గందరగోళం నెలకొంది. తొలుత ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీడీపీ కార్యాలయూనికి చేరుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోపలికి వెళ్లి నేతలను నిర్బంధించి బైఠాయించారు. అన్ని తలుపులకు గడియలు పెట్టారు. దీనిపై సమాచారం అందటంతో అరండల్‌పేట, గుంటూరు రూరల్, పట్టాభిపురం సీఐలు సిబ్బందితో చేరుకున్నారు. టీడీపీ నేతలు బోనబోయిన శ్రీనివాసయాదవ్, వెన్నా సాంబశివారెడ్డి, ఇక్కుర్తి సాంబశివరావు తదితరులు కూడా వచ్చి తలుపులు తీయూలని ఎంఆర్పీఎస్ నేతలను బతిమలాడారు. అరుునా ప్రయోజనం లేకపోవటంతో పోలీసు లు, టీడీపీ కార్యకర్తలు తలుపులు నెట్టే ప్రయత్నం చేశారు. లోపలవున్న ఆందోళనకారులు తలుపులకు అడ్డంగా నిలుచున్నారు. దీంతో బయటవున్న పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బయట ఉన్నవారిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో టీడీపీ నాయకులు చర్చలు జరిపారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని ఆందోళనకారులు భీష్మించారు. చివరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుతో ఫోన్లో మాట్లాడించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని, త్వరలో తీర్మానం చేస్తామని మంత్రి హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. ఆత్మాహుతికి కూడా సిద్ధం.. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు మాదిగ మాట్లాడుతూ అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయకుంటే ఆత్మాహుతికి కూడా సిద్ధమని చెప్పారు. వర్గీకరణకు అనుకూలమని అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. మాదిగలకు పెద్ద దిక్కుగా ఉండి పెద్దమాదిగను అవుతానని చెప్పారన్నారు. చంద్రబాబు మీ కోసం వస్తున్నా పాదయాత్రను తెలంగాణలో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భంలో మాదిగలు రక్షణ కవచంలా నిలిచారని గుర్తుచేశారు. జూపూడి ప్రభాకరరావు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టనిరోజు లేదన్నారు. ఇప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయకపోతే 24న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ జరగకపోతే మాదిగ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మల్లవరపు రవిరాజా, ఎస్.శివ, కట్టా బాబు, రావెల వరప్రసాద్, మందా ప్రేమానందం, గురవయ్య, బి.డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు మాట్లాడుతూ వినతిపత్రం ఇస్తామని చెప్పి లోపలకు ప్రవేశించిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తమను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
మాదిగల మహా ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న హక్కుల కోసం మాదిగలు గొంతులు విప్పాల్సిన అవసరం వచ్చిం ది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే మాదిగలతో హైదరా బాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చలో ఏపీ అసెంబ్లీ పేరిట మంగళవా రం మహాధర్నా జరుగనుంది. ఈ మహాధర్నాలో రాష్ట్రంలోని మాది గలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ పలు డిమాండ్లు చేయబోతున్నాం. రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీ ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణపై, కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేస్తూ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తీర్మానం చేయడానికి, ప్రధాన మంత్రితో మాట్లాడటానికి సీయం చర్యలు తీసుకోవాలి. దండోరా ఉద్యమంలో పాల్గొని అమరులైన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. జనాభా నిష్పత్తి ప్రకారం పథకాలు, నిధులు, లబ్ధి అందే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సవరించాలి. ఏపీ నూతన రాజధానిలోను, ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోను మాదిగ సంక్షేమ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. మాదిగల విద్యా వికాసాల కోసం చర్యలు చేపట్టాలి. మాదిగలంతా పెద్ద సంఖ్యలో తరలిరండి! హక్కుల కోసం గొంతులు విప్పుదాం! మాదిగ మహాధర్నా 23-12-2014 మంగళవారం ఉ. 10 గంటల నుండి, స్థలం: ధర్నా చౌక్, ఇందిరాపార్క్ వద్ద, హైదరాబాద్ - కృపాకర్ మాదిగ రాష్ట్ర మాదిగల నేత, ఒంగోలు -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
ఒంగోలు టౌన్ : ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. స్థానిక అంబేద్కర్ భవన్ నుంచి ప్రదర్శనగా బయల్దేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పూనూరి నరేంద్ర మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ తమ ద్వారే సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారని, టీడీ పీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేసి మాదిగలకే పెద్ద మాదిగ అవుతానని హామీ ఇచ్చారని, హామీని ఇప్పుడు నెరవేర్చాలని నరేంద్ర కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మాదిగలపై వివక్ష చూపిందని, అందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల యుద్ధభేరీ చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆందోళనలో జిల్లా అధికార ప్రతినిధి సండ్రపాటి కాలేబుమాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చాట్ల డానియేల్మాదిగ, తిరువీధుల బాబూమాదిగ, రాష్ట్ర కార్యదర్శి తాతపూడి ప్రభుదాస్ మాదిగ, నాయకులు అంగలకుర్తి ప్రసాద్, కందుకూరి కృపాకర్, గర్నెపూడి యోహాన్, కర్ణప్రసాద్, మందా సుకుమార్, దుద్దుకూరి అనీల్, అట్లూరి వెంకటేశ్వర్లు, శేషం మోషే బంకా యోబు, రాచేటి ప్రసాద్, దుడ్డు పోతురాజు, మహిళా నాయకురాలు దాసరి మేరీ, జిల్లా కన్వీనర్ ఎన్.నాగలక్ష్మి, ఇండ్లా సంపూర్ణ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. రెండు గేట్ల ముందు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతిభద్రతలు పరిరక్షించారు. -
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సుబేదారి : తెలంగాణ ప్రభుత్వం మాదిగ, మాదిగ ఉపకులాలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిడమర్తి రవి కోరారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో బుధవా రం తెలంగాణ మాదిగ విద్యార్థి యువజన సదస్సు నిర్వహించా రు. సదస్సుకు ముఖ్యఅతిథిగా పిడమర్తి రవి హాజరై మాట్లాడారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇందులో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత కల్పించడం ఎం తవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టీఎమార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ కోసం ముందుండి పోరాటాలు చేసిన మాదిగలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని కోరారు. బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి కిశోర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేయూ ప్రొఫెసర్ సాంబయ్య, టి.మనోహర్, టీమాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వీరేందర్, చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణపతితో పాటు యాదగిరి, వెంకట్, రవి, మల్లేష్, విజయ్, కార్తీక్, మురళి, సుభాష్, సుధాకర్, చిరంజీవి పాల్గొన్నారు. -
హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలి
ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని వసతి గృహ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం విద్యార్థులు భారీ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అంజయ్య రోడ్డులోని ఎస్సీ బాలుర కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ కర్నూలు రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్ మస్తాన్‌దర్గా మీదుగా కలెక్టరేట్ వర కూ సాగింది. ఈ సందర్భంగా మాదిగ విద్యార్థుల ఫెడరేషన్ జిల్లా నాయకుడు జలదంకి నరసింగరావు మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 116, బీసీ వసతి గృహాలు 76, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 32 ఉన్నాయన్నారు. దాదాపు 90 శాతానికిపైగా వసతి గృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని చెప్పారు. కనీసం మరుగుదొడ్లు, వంటగదులు, తాగునీరు లేక విద్యార్థులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా లేనందున విద్యార్థులకు కనీస ఆహారం కూడా అందడం లేదన్నారు. ప్రతి విద్యార్థి మెస్ చార్జీలను రూ.2,500 పెంచాలన్నారు. బాలికల వసతి గృహాలకు ప్రహరీలు లేనందున ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాస్మొటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని, వసతి గృహాల్లో రెగ్యులర్ వంట మనుషులను నియమించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తొరటి ఆనంద్ మాదిగ, కొమ్ము సృజన్ మాదిగ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. -
దళిత ద్రోహి మందకృష్ణ
బోధన్ టౌన్ : ఎస్సీ వర్గీకరణ పేరిట మాదిగలను, దళితులను మోసం చేస్తున్న మందకృష్ణ మాదిగ దళితద్రోహి అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గైని గంగారాం విమర్శించారు. ఆదివారం మాల మహానాడు బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గైని గంగారాం, బల్దియా చెర్మైన్ ఆనం పల్లి ఎల్లంలను డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం గైని గంగారాం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం 2004 లో తీర్పునిచ్చిందని తెలిసీ కూడా మందకృష్ణ మాదిగ వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వర్గీకరణ పేరిట దందా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మాలలు ఏడు శాతం ఉంటే కేవలం మూడు శాతం ఉన్న ట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. దళితులకోసం మంద కృష్ణ పాటు పడితే తాము వెంట వస్తామని, దళితుల్లో చిచ్చు పెట్టి వర్గీకరిస్తే సహించేది లేదన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలబడిన ఆయనకు డిపాజిట్ దక్కలేదన్నారు. రాష్ట్రంలో 25 శాతం ఎస్సీ, ఎస్టీ లు ఉ న్నారని, మరో 5 శాతం బీసీలు కలిస్తే అధికారం చేజి క్కించుకోవచ్చన్నారు. బ్లాక్ మెయిల్ పోరాటాల ద్వారా దళితుల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. దళితుల హక్కులను కాపాడేదిశగా మాలమహానాడు ముందుకు సాగుతుందన్నారు. మాల మహానాడు కేవలం మాల జాతి కోసం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు, దళితులకు మేలు జరిగేలా, ప్రభుత్వం నుంచి దళితులకు అందే ప్రతీ సంక్షేమ పథకం అమలుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, క ల్యాణ లక్ష్మి పథకం, సబ్ ప్లాన్ నిధులు వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాలమహానాడు ముందు వరుసలో నిలుస్తుందన్నారు. ఉద్యమంలో ఏనాడు తెలంగాణ జెండా పట్టని మందకృష్ణ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు. రాబోవు మంత్రి వర్గ విస్తరణలో మాలలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. టీపీపీఎస్సీని త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్ళు లేని దళితులకు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఎన్డీఎస్ఎస్ఎల్ రైతులకు బకాయి ఉన్న చెరుకు బిల్లులు రూ. 3 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మాల మహానాడు ను గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేస్తామన్నారు. బోధన్ డివిజన్లో రెసిడెన్షియల్ పాఠశాలతో, అంబేద్కర్ భవన నిర్మాణానికి కృసి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యద ర్శి హసన్, జిల్లా అధ్యక్షులు దయానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు దశరత్, కార్యదర్శి గిరి తదితరులు పాల్గొన్నారు. -
మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలి
- ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు పోరాటం ఆగదు - ఎంఎస్ఎఫ్ జిల్లా మహాసభలో మంద కృష్ణమాదిగ నకిరేకల్: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంతోపాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాగ్దానాలను, మోసాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మాదిగ విద్యార్థి ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి రిజర్వేషన్ల విధానంతో మాదిగలకు మూడు శాతం వాటా కూడా దక్కడం లేదన్నారు. అదే వర్గీకరణ జరిగితే 11 నుంచి 12 శాతం వరకు రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తొలి తెలంగాణలో దళితులకు సీఎం పదవిని అప్పగిస్తానని ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదవి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని ఆరోపించారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధా న మంత్రికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.ఈ రెండు అంశాలతో పాటు అగ్ర పక్షాలను కూడా వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒత్తిడి తేవాలని కోరారు. కూతురు, కుమారుడు, అల్లుడు వాళ్ల శాఖలకు, స్థాయిలేని హమీలిచ్చినా వారిపై నోరు మెదపని కేసీఆర్.. దళిత డిప్యూటీ సీఎం అయిన రాజయ్యను అవమాన పరిచేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాచర్ల సైదులు, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాట్లాడారు. అంతకుముందు నకిరేకల్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ పాల్వయి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమయ్య, నాయకులు తూర్పింటి రవి, కత్తి వెంకటేశ్వర్లు, గణేష్, కందుల మోహన్, కొమిరి స్వా మి, బొజ్జ సైదులు, మా చర్ల కిరణ్, వంటెపాక తిరుపతయ్య, మాచర్ల సుదర్శన్, బోడ సునీల్, వంటల వెంకటేశ్వర్లు, పరమేష్, కందికంటి అంజయ్య, మల్లెపాక వెంకన్న, జాన్, గుండ్లపల్లి నాగరాజు పాల్గొన్నారు. -
రెండు నెలల్లో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
ఉట్నూర్ : వచ్చె రెండు నెలల్లో మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధంగా కావాలని ఏ,బీ,సీ,డీ వర్గీకరణ సాధించడమే ఎమ్మార్పీఎస్ ముందున్న లక్ష్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చె రెండు నెలల్లో క్షేత్రస్థాయి నుంచి గ్రామ, మండల కమిటీలు పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు.మాదిగలను ఏకం చేయడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించానని గత నెల 28 నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నానన్నారు. అక్టోబర్ ఒకటి లేదా రెండు తేదీల్లో ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు వర్గీకరణకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలపై ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ అంటే బయపడుతున్న సీఎం కేసీఆర్ ఎమ్మార్పీస్లో చిలికలు తేవాలని ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ తూర్పు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు శరత్, శంకర్, ఉట్నూర్ మండల ఇన్చార్జి బిరుదుల లాజర్, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు విజయ్, సమావేశ అధ్యక్షుడు నాతరి రాజు, ఎంపీటీసీ బెరిగెడి మనోహర్, నాయకులు మల్లేశ్, నర్సయ్య, తుకారం, కుటికల ఆశన్న, రజీహైదర్, కేశవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ దారిలో పయనిస్తున్న టీఆర్ఎస్ మంచిర్యాల టౌన్ : సామాజిక, ఆర్థిక గణన అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల 19న చేపడుతున్న ఒక్కరోజు సర్వే మోసమని, వారం రోజులపాటు సర్వే జరపాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తేల్చి చెప్పారు. మంగళవారం మంచిర్యాల ఒడ్డెర కాలనీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు, యువకులు, మహిళలు ఎంఎస్పీ పార్టీలో చేరగా వారికి మంద కృష్ణమాదిగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా లేకపోయిందని, ఇప్పుడు ఎంఎస్పీ మద్దతుగా నిలిచి ప్రజల హక్కులు, సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు. తెలంగాణలో మొదటి స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించడంపై గడిలో అంటే రాజరిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడమేనని అన్నారు. ఈ సంస్కృతిని చూస్తే కాంగ్రెస్ దారిలో టీఆర్ఎస్ పార్టీ పయనిస్తుందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎవ్వరూ ప్రశ్నించే వారు లేక గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు పక్కనపెట్టి దొరల పాలన, కేసీఆర్ కుటుంబ పాలనలా మారేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు గోడిసెల దశరథం, చుంచు శంకర్‌వర్మ, బోయ రంజిత్‌కుమార్, కొట్నాక విజయ్, శరత్ పాల్గొన్నారు. -
మాదిగలను విస్మరిస్తే.. ఖబడ్దార్
హిందూపురం అర్బన్, : మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలను విస్మరిస్తే ఖబడ్దార్ అంటూ హిందూపురంలో దళితులు హెచ్చరించారు. 19వ వార్డు టికెట్ తమకు కేటాయించకపోతే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయమని పేర్కొన్నారు. హిందూపురం మున్సిపాల్టీ పరిధిలో మాదిగలు ఎదగకుండా టీడీపీ నాయకులు అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకుడు మోదశివ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం రాత్రి ఆయన 19వ వార్డు దళితులతో కలిసి వచ్చి ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ ఇంటి ఎదుట ధర్నా చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని రోడ్డుపై బైఠాయించారు. మాదిగలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న టీడీపీ నాయకులు చేతల్లో ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 19వ వార్డులో పట్టుమని పది ఓట్లు కూడా లేని వారికి టికెట్టు కేటాయించారని, ఎక్కువ ఓట్లు ఉన్న మాదిగలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. టీడీపీలో చేరిన అంబికా లక్ష్మినారాయణ వర్గీయుడైన తనకు టికెట్టు కేటాయిస్తే పార్టీలో అంబికా వర్గం బలపడుతుందని ఎమ్మెల్యే అబ్దుల్ ఘని తనకు టికెట్టు కేటాయించలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. హిందూపురం పట్టణంలోని 20 వేల ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గానికి టీడీపీలో కనీసం రెండు మూడు టికెట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. పార్టీలో ఎమ్మెల్యే నిరంకుశంగా వ్యవహరిస్తూ దళితులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. మాదిగలకు న్యాయం చేయకపోతే మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీని ఓడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం మాదిగ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపడుతామని చెప్పారు.