చర్మకారులకు రూ.2వేల పింఛన్‌ ఇవ్వాలి | pension request for skinmans | Sakshi
Sakshi News home page

చర్మకారులకు రూ.2వేల పింఛన్‌ ఇవ్వాలి

Published Mon, Jul 25 2016 11:43 PM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM

pension request for skinmans

  • ఎమ్మార్పీఎస్‌ నాయకుల డిమాండ్‌
  • దండేపల్లి : మాదిగకులస్తుల చర్మకారులకు, డప్పులు వాయించే వారికి నెలకు రూ.2వేల ఫించన్‌ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు బిరుదుల ధర్మయ్య, లింగంపల్లి బాపు, బచ్చల అంజన్న డిమాండ్‌ చేశారు. దండేపల్లి ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో మండంలోని అన్ని గ్రామాల మాదిగ కులస్తులు సోమవారం సమావేశమై సమస్యలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీరణ చేపట్టాలన్నారు. అట్రాసిటి కేసులపై అవగాహన కల్పించాలని, సపాయి పని చేసే వారందనీ పర్మినెంట్‌ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన  వినతి పత్రం  తహసీల్దార్‌ అశోక్‌కు అందజేశారు. ఎమ్మార్పీఎస్‌ మండల నాయకులు జిల్లపెల్లి వెంకటేశ్, కొల్లూరి సతీశ్, తగరపు సత్యం, మల్యాల శ్రీనివాస్, శనిగారపు శంకరయ్య, మండలం లోని పలు గ్రామాల ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement