memorandam
-
ఔట్ సోర్సింగ్ టెండర్లు రద్దు చేయాలి
సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి చేపట్టిన ఔట్ సోర్సింగ్ టెండర్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ అడ్వైజర్ దమ్మాలపాటి శేషయ్య డిమాండ్ చేశారు. గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం రమణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ క్లరికల్ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరారు. గతంలో డైరెక్టర్ పా సింగరేణి వ్యాప్తంగా ఉన్న క్లరికల్ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతో తాత్కలికంగా నియమించి, అనంతరం వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారిని శాశ్వత పద్ధతిపై నియమిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గుత్తుల సత్యనారాయణ, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంగా వెంకట్, బ్రాంచి కార్యదర్శి జి వీరస్వామి, కె రాములు, ఎస్ సుధాకర్, మెంగెన్ రవి, గట్టయ్య, పి చంద్రయ్య, ఎంవీ రావు, ఎస్ శ్రీనివాస్, ఎమ్ ఎ నభి,హుమాయిన్, హనీఫ్, బి సత్యనారాయణ, ఆర్ సాంభమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
యూత్ ప్యాకేజీలో అవకతవకలపై ఫిర్యాదు
కాశీబుగ్గ : ఆఫ్సోర్ యూత్‌ప్యాకేజీలో అవకతవకలు జరుగుతున్నాయని నిర్వాసితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం వీరు అమరావతిలో సీఎంని కలిశారు. పలాస నియోజకవర్గ పరిధిలోని ఆఫ్సోర్ నిర్వాసిత గ్రామాల్లో అందిస్తున్న యూత్ ప్యాకేజీలో అధికారులు, ప్రజా ప్రతినిధులందరూ కలిసి సుమారు రూ.10కోట్లకు టెండర్ వేశారని వివరించారు. వాళ్లు నిజమైన లబ్ధిదారులు కాదని, పెళ్లిళ్లు అయిన, ఊరువదిలి వెళ్లిన, స్థానికేతరులు ఇలా కొంతమంది అనర్హులు యూత్ ప్యాకేజీలు పొందుతున్నారని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని నిర్వాసితులు అంబల చినబాబు, గణేష్, ప్రసాదరావు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించారు. -
తహసీల్దార్‌ను తొలగించండి
జయపురం : జయపురం తహసీల్దార్ రంజిత మల్లిక్‌ను పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి, జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్‌ల నేతృత్వంలో సోమవారం ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కలెక్టర్, సబ్ కలెక్టర్ నిరాకరించినా తహసీల్దార్ క్వారీలకు అనుమతినిచ్చి ఇద్దరి మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జుధిష్టర్ రౌళో మాట్లాడుతూ..కొరాపుట్ జిల్లా ప్రజల అమాయకత్వాన్ని అధికారులు తమ స్వలాభం కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. క్వారీ సంఘటనలో ఇద్దరు ఆపరేటర్లు మరణానికి పరోక్షంగా జయపురం తహసీల్దార్ కారకులని ఆయన ఆరోపించారు. క్వారీ లీజ్‌కు అనుమతులు ఇవ్వొద్దని కొరాపుట్ జిల్లా కలెక్టర్ జయపురం తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసినా వాటిని బేఖాతరు చేసి తహసీల్దార్ క్వారీకి అనుమతులు ఇచ్చారన్నారు. రాణిగుడ సమీపంలోని బొరిపుట్ క్వారీకి డీడీ బిల్డర్స్‌కు ఆమె అనుమతినిచ్చారని పేర్కొన్నారు. ఆ క్వారీలో బండరాళ్లు పడి ఇద్దరు జేసీబీ ఆపరేటర్లు మరణించారని గుర్తుచేశారు. వారి మృతదేహాలను వెలికితీయడానికి రూ.కోటిపైనే ఖర్చయిందని ఆయన వెల్లడించారు. ఆ ఖర్చును తహసీల్దార్ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మరణానికి పరోక్షంగా కారణమైనా తహసీల్దార్ బాధ్యులని అందుచేత రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డీడీ బిల్డర్స్‌కు ఏ నియమం ప్రకారం క్వారీ లీజుకు ఇచ్చారో తహసీల్దార్ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తహసీల్దార్ ద్వారా ప్రజలకు అందించిన బోగస్ పట్టాలపై విజిలెన్స్‌చే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరూపిస్తే శిక్షకు సిద్ధం: తహసీల్దార్ గవర్నర్‌ను ఉద్దేశించిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు అందజేశారు. వెంటనే ఆమె వినతిపత్రాన్ని చదివి జుధిష్టర్ రౌళోతో వాగ్వాదానికి దిగారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యాలని తాను చట్టపరంగానే క్వారీలకు అనుమతినిచ్చానని తెలిపారు. కలెక్టర్ గాని సబ్‌కలెక్టర్ గానీ క్వారీలకు అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించలేదని, అటువంటి లేఖలు తనకు రాలేదని, మీవద్ద ఉంటే చూపించండని ఆమె సవాల్ చేశారు. తాను తప్పు చేశానని నిరూపిస్తే తగిన శిక్షకు సిద్ధమని స్పష్టంచేశారు. వెంటనే రౌళో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడంతో ఆమె వెంటనే క్యాబిన్ లోపలికి వెళ్లిపోయింది. ఆందోళననలో పార్టీ నేతలు ఉత్తమ మల్లిక్, బలరాం నాయక్, కేశవ నాగ్, నంద హరిజన్, నిత్యానంద పాత్రో, హరి పంగి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల పిల్లలకు ‘ప్రైవేటు’లో ఉచిత విద్య
మెదక్ మున్సిపాలిటీ : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసించే అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్లూజే హెచ్143) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ధర్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనందించాలన్నారు. ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేందర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, స్టిఫెన్, శ్రీనివాస్, ఆంజనేయులు, రహమత్, దుర్గెష్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాష్ట్రంలో బీసీలకు అన్యాయం’
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, బస్వ లక్ష్మీనర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్, జిల్లా ఇన్చార్జి నీలకంఠ రాజు తదితరులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు. బీసీల సంక్షేమానికి నిధులివ్వాలని కోరుతూ కలెక్టర్ రామ్మోహన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించినా వాటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం రూ. 5,919.83 కోట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓబీసీలకు చట్ట సభలు, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, ఉపాధ్యక్షులు రాజన్న, నాయకులు అరుణ్, శ్రీనివాస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
కంకిపాడు : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డీ.శ్రీను డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డిని విజయవాడలో గురువారం కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందించారు. ప్రొద్దుటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉద్యోగ విరమణల కారణంగా జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన ఇబ్బందికరంగా మారిందన్నారు. నెలవారీ ప్రమోషన్ కౌన్సెలింగ్ విధానం ద్వారా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాప్రమాణాల మెరుగునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సీనియారిటీ జాబితా అనుమతి కోసం ఆర్జేడీకి నివేదించామని, అన్ని క్యాడర్ పోస్టులు ప్రమోషన్ కౌన్సిలింగ్ విధానంలో చేస్తామని డీఈవో సుబ్బారెడ్డి మామీ ఇచ్చారన్నారు. 2009-10 సంవత్సరంలో జిల్లాలో కొందరు ఉపాధ్యాయుల అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్లు నకిలీవనే ఆరోపణలపై సీబీసీఐడీ విచారణ చేసిందన్నారు. విచారణ పూర్తిచేసిన నకిలీవి కావని ధ్రువీకరించిన సర్టిఫికెట్లు డీఈవో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్లు ఏ.వీ. సుబ్రహ్మణ్యం, డీ. కార్తీక్, వీ.ఎస్. బోస్ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వినతి
అలంపూర్: కేజీ టు పీజీ గురుకుల పాఠశాలను నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అలంపూర్ నాయకులు సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. కేజీటూ పీజీ పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5 ఎకరాల రెండు కుంటల స్థలం ఉందని తెలిపారు. అందుకు సంబంధించిన భూమి పత్రాలను అందజేశారు. అలంపూర్ విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి సహాయ సహకారాలను అందించాలని కోరారు. అలంపూర్‌కు మంజూరైన పాఠశాలను ఇక్కడికే తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని విన్నవించారు. స్పందించిన ఆయన సెప్టెంబర్ 5వ తేదిన కేజీటూ పీజీ గురుకుల పాఠశాలను అలంపూర్‌లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రSమంలో సర్పంచ్ జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్, సీపీఎం నాయకులు రేపల్లె దేవదాసు, టీఆర్ఎస్ నాయకులు జాన్, పోలీస్ చెన్నయ్య, గురుదేవ్ పాఠశాల ప్రిన్సిపాల్ నంద కుమార్, మైనార్టీ నాయకులు షేక్ అహ్మద్ తదితరులు ఉన్నారు. -
అనాథ బిడ్డలకు గుర్తింపునివ్వాలి
మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య జఫర్‌గఢ్ : అనాథ బిడ్డలకు చట్టపరంగా వారికి గుర్తింపు ఇవ్వాలని మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హెల్పింగ్ హర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నయ్య నేతృత్వంలో బృందం ఢిల్లీలోని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి శనివారం వినతిపత్రం ఇచ్చారు. ఆయనతో పాటు కేంద్ర మహిళ అభివృద్ధి శాఖ మంత్రి మేన క సంజయ్‌గాం«ధీని కూడ కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఇన్నయ్య మాట్లాడుతూ దేశంలో 4 కోట్ల మంది అనాథ బిడ్డలు ఉన్నారన్నారు. వీరికి ఇప్పటి వరకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేదన్నారు. వారి హక్కుల కోసం 8 ఏళ్లుగా తాము పోరాటం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ గుర్తింపు ఉన్న అనాథ బిడ్డలకు చట్ట పరంగా గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. దీనికోసం పార్లమెంట్ ద్వారా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పార్లమెంట్లో 9 మార్లు ప్రైవేట్ బిల్లు పెట్టించడం జరిగిందన్నారు. చట్టపరంగా గుర్తింపు నివ్వడంతో పాటు 18 ఏళ్లు నిండినఅనాథలకు ఓటు హక్కు కల్పించేలా గుర్తింపుకార్డు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిుçషన్ను కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సంస్థ ప్రతినిధులు శ్రీశైల్‌రెడ్డి, రజినీకాంత్‌రావు, వెల్మల విక్రమ్, అనాథ ఆశ్రమ బిడ్డలు ఉన్నారు. -
చర్మకారులకు రూ.2వేల పింఛన్ ఇవ్వాలి
ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ దండేపల్లి : మాదిగకులస్తుల చర్మకారులకు, డప్పులు వాయించే వారికి నెలకు రూ.2వేల ఫించన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బిరుదుల ధర్మయ్య, లింగంపల్లి బాపు, బచ్చల అంజన్న డిమాండ్ చేశారు. దండేపల్లి ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మండంలోని అన్ని గ్రామాల మాదిగ కులస్తులు సోమవారం సమావేశమై సమస్యలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీరణ చేపట్టాలన్నారు. అట్రాసిటి కేసులపై అవగాహన కల్పించాలని, సపాయి పని చేసే వారందనీ పర్మినెంట్ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ అశోక్‌కు అందజేశారు. ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జిల్లపెల్లి వెంకటేశ్, కొల్లూరి సతీశ్, తగరపు సత్యం, మల్యాల శ్రీనివాస్, శనిగారపు శంకరయ్య, మండలం లోని పలు గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.