
చంద్రబాబుకు వినతిపత్రం అందిస్తున్న ఆఫ్‌సోర్ నిర్వాసితులు
కాశీబుగ్గ : ఆఫ్‌సోర్ యూత్‌ప్యాకేజీలో అవకతవకలు జరుగుతున్నాయని నిర్వాసితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం వీరు అమరావతిలో సీఎంని కలిశారు. పలాస నియోజకవర్గ పరిధిలోని ఆఫ్‌సోర్ నిర్వాసిత గ్రామాల్లో అందిస్తున్న యూత్ ప్యాకేజీలో అధికారులు, ప్రజా ప్రతినిధులందరూ కలిసి సుమారు రూ.10కోట్లకు టెండర్ వేశారని వివరించారు.
వాళ్లు నిజమైన లబ్ధిదారులు కాదని, పెళ్లిళ్లు అయిన, ఊరువదిలి వెళ్లిన, స్థానికేతరులు ఇలా కొంతమంది అనర్హులు యూత్ ప్యాకేజీలు పొందుతున్నారని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని నిర్వాసితులు అంబల చినబాబు, గణేష్, ప్రసాదరావు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment