అనాథ బిడ్డలకు గుర్తింపునివ్వాలి
Published Sun, Jul 31 2016 1:32 AM | Last Updated on Mon, Aug 20 2018 8:47 PM
మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య
జఫర్‌గఢ్ : అనాథ బిడ్డలకు చట్టపరంగా వారికి గుర్తింపు ఇవ్వాలని మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హెల్పింగ్ హర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నయ్య నేతృత్వంలో బృందం ఢిల్లీలోని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి శనివారం వినతిపత్రం ఇచ్చారు. ఆయనతో పాటు కేంద్ర మహిళ అభివృద్ధి శాఖ మంత్రి మేన క సంజయ్‌గాం«ధీని కూడ కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఇన్నయ్య మాట్లాడుతూ దేశంలో 4 కోట్ల మంది అనాథ బిడ్డలు ఉన్నారన్నారు. వీరికి ఇప్పటి వరకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేదన్నారు. వారి హక్కుల కోసం 8 ఏళ్లుగా తాము పోరాటం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ గుర్తింపు ఉన్న అనాథ బిడ్డలకు చట్ట పరంగా గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. దీనికోసం పార్లమెంట్ ద్వారా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌లో 9 మార్లు ప్రైవేట్ బిల్లు పెట్టించడం జరిగిందన్నారు. చట్టపరంగా గుర్తింపు నివ్వడంతో పాటు 18 ఏళ్లు నిండినఅనాథలకు ఓటు హక్కు కల్పించేలా గుర్తింపుకార్డు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిుçషన్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సంస్థ ప్రతినిధులు శ్రీశైల్‌రెడ్డి, రజినీకాంత్‌రావు, వెల్మల విక్రమ్, అనాథ ఆశ్రమ బిడ్డలు ఉన్నారు.
Advertisement