ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్‌'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే.. | Luke Coutinho And PM Modi Meet At NXT Conclave Inagurate Bharat Dish | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్‌'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..

Published Mon, Mar 10 2025 6:07 PM | Last Updated on Mon, Mar 10 2025 6:09 PM

Luke Coutinho And PM Modi Meet At NXT Conclave Inagurate Bharat Dish

ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో ‘భారత్ డిష్‌'ని ఆవిష్కరించారు. దీన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రతిష్టాత్మక NXT కాన్‌క్లేవ్‌ 2025లో ప్రారంభించారు. ఇది స్వదేశీ ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలను హైలెట్‌ చేసేలా లైఫ్‌స్టైల్‌ నిపుణుడు రూపొందించారు. ఇది భారతదేశ గొప్ప పాకకళ వారసత్వానికి నివాళి. భారతదేశ ఆహార సంస్కృతిలో పాతుకుపోయిన పోషకాహారాలు, వాటి రుచి సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ ‘భారత్ డిష్‌'. అంతేగాదు రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని భాగం చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తుందని చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో . దీన్ని అగ్రశ్రేణి చెఫ్‌లచే రూపొందించినట్లు తెలిపారు. మరి ఇంతకీ అందులో ఎలాంటి ఆహార పదార్థాలు, వంటకాలు ఉంటాయంటే..

ప్రధాని మోదీ క్రమశిక్షణా జీవనశైలిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించానని అన్నారు ల్యూక్ కౌటిన్హో. ఇందులో ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సత్తు, సాంప్రదాయ మఖానా, రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, తాజా శీతాకాలపు ఆకుకూరలు, స్థానికంగా లభించే, కాలానుగుణ పదార్థాలు తదితరాలు ఉంటాయి. అంతేగాదు భారతీయ వంటకాలు సమతుల్యతకు పెద్దపీట వేసేలా కాలనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు జీవనశైలి నిపుణుడు. 

కలిగే లాభాలు..

  • పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తయారు చేస్తారు. ఇవి దీర్ఘాయువుని, ఆరోగ్య ప్రయోజనాలని అందించే పదార్థాలు. ఆరోగ్యకరమైన భోజనాన్ని హైలెట్‌ చేయడమే గాక, అతిగా తినడం, బరువు సమస్యలకు చెక్‌పెట్టేలా ఉంటుందట. 

  • భారతీయ ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా మనసులో భావోద్వేగాలకు కూడా ఔషధమేనట. 

  • దీన్ని ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ప్రజలు అనారోగ్య సమస్యలతో పోరాటాన్ని నివారించడమేనట. 

  • ఇక ఈ భారత్‌డిష్‌ అనేది పూర్వీకులు చేసినట్లు కాలనుగుణంగా ఉండటమేగాక, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునేలా ప్రోత్సహిస్తుందట.

  • ప్రధాని మోదీ చెప్పినట్లుగా వంట నూనెల వాడకం తగ్గించి, ఏ2 నెయ్యి,  కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, నట్స్‌ వంటివి మాత్రమే ఉంటాయట.

  • చివరిగా ఇది శాకాహారులైన, మాంసాహారులైన బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన వంటకాలే ఉంటాయట ఇందులో.

     

ఈ మేరకు జీవనశైలి నిపుణుడు ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ..ప్రపంచ నాయకులు భాగస్వామ్యం అయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత్‌ డిష్‌ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. భారతీయ వెల్‌నెస్‌ జ్ఞానాన్ని ప్రపంచవేదికపై తీసుకువెళ్లేందుకు ఉపకరించిన అద్భుత అవకాశం అని అన్నారు. 

ఈ 'భారత్‌ డిష్‌' అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించే ఒక ఉద్యమం, ప్రభావంతమైన మార్పుకి నాంది. ఇది ఇక్కడితో ఆగదు. ప్రతి కుటుంబం, పాఠశాలు, ఇతర సంఘాలకు చేరకునేలా చేసే ఒక గొప్ప చొరవ. అంతేగాదు ఆరోగ్య స్ప్రుహతో కూడిన సాధికారతకు మార్గం వేస్తుందని కూడా చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో.

(చదవండి: కశ్మీర్‌ వివాదాస్పద ఫ్యాషన్‌ షో: నిర్వహించింది ప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్‌..ఆ డిజైనర్లు ఎవరంటే..?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement