newdelhi
-
ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..
ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో ‘భారత్ డిష్'ని ఆవిష్కరించారు. దీన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రతిష్టాత్మక NXT కాన్క్లేవ్ 2025లో ప్రారంభించారు. ఇది స్వదేశీ ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలను హైలెట్ చేసేలా లైఫ్‌స్టైల్ నిపుణుడు రూపొందించారు. ఇది భారతదేశ గొప్ప పాకకళ వారసత్వానికి నివాళి. భారతదేశ ఆహార సంస్కృతిలో పాతుకుపోయిన పోషకాహారాలు, వాటి రుచి సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ ‘భారత్ డిష్'. అంతేగాదు రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని భాగం చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తుందని చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో . దీన్ని అగ్రశ్రేణి చెఫ్‌లచే రూపొందించినట్లు తెలిపారు. మరి ఇంతకీ అందులో ఎలాంటి ఆహార పదార్థాలు, వంటకాలు ఉంటాయంటే..ప్రధాని మోదీ క్రమశిక్షణా జీవనశైలిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించానని అన్నారు ల్యూక్ కౌటిన్హో. ఇందులో ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సత్తు, సాంప్రదాయ మఖానా, రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, తాజా శీతాకాలపు ఆకుకూరలు, స్థానికంగా లభించే, కాలానుగుణ పదార్థాలు తదితరాలు ఉంటాయి. అంతేగాదు భారతీయ వంటకాలు సమతుల్యతకు పెద్దపీట వేసేలా కాలనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు జీవనశైలి నిపుణుడు. కలిగే లాభాలు..పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తయారు చేస్తారు. ఇవి దీర్ఘాయువుని, ఆరోగ్య ప్రయోజనాలని అందించే పదార్థాలు. ఆరోగ్యకరమైన భోజనాన్ని హైలెట్ చేయడమే గాక, అతిగా తినడం, బరువు సమస్యలకు చెక్‌పెట్టేలా ఉంటుందట. భారతీయ ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా మనసులో భావోద్వేగాలకు కూడా ఔషధమేనట. దీన్ని ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ప్రజలు అనారోగ్య సమస్యలతో పోరాటాన్ని నివారించడమేనట. ఇక ఈ భారత్డిష్ అనేది పూర్వీకులు చేసినట్లు కాలనుగుణంగా ఉండటమేగాక, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునేలా ప్రోత్సహిస్తుందట.ప్రధాని మోదీ చెప్పినట్లుగా వంట నూనెల వాడకం తగ్గించి, ఏ2 నెయ్యి, కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, నట్స్ వంటివి మాత్రమే ఉంటాయట.చివరిగా ఇది శాకాహారులైన, మాంసాహారులైన బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన వంటకాలే ఉంటాయట ఇందులో.At the NXT Conclave 2025, I had the honor of unveiling The Bharat Dish & Lifestyle Tips, inspired by Hon. Prime Minister Narendra Modi Ji’s disciplined lifestyle and health practices.This is more than just a dish—it’s a celebration of India’s rich culinary wisdom and the power… pic.twitter.com/OR8PzeGV8b— Luke Coutinho (@LukeCoutinho17) March 1, 2025 ఈ మేరకు జీవనశైలి నిపుణుడు ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ..ప్రపంచ నాయకులు భాగస్వామ్యం అయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత్ డిష్‌ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. భారతీయ వెల్నెస్ జ్ఞానాన్ని ప్రపంచవేదికపై తీసుకువెళ్లేందుకు ఉపకరించిన అద్భుత అవకాశం అని అన్నారు. ఈ 'భారత్ డిష్' అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించే ఒక ఉద్యమం, ప్రభావంతమైన మార్పుకి నాంది. ఇది ఇక్కడితో ఆగదు. ప్రతి కుటుంబం, పాఠశాలు, ఇతర సంఘాలకు చేరకునేలా చేసే ఒక గొప్ప చొరవ. అంతేగాదు ఆరోగ్య స్ప్రుహతో కూడిన సాధికారతకు మార్గం వేస్తుందని కూడా చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో.#StopObesity | Today, Mr. @LukeCoutinho17, Co-Founder, Luke Coutinho Holistic Healing Systems while visiting an Anganwadi Centre in New Delhi stressed on the importance of tackling obesity to build a healthier India. Highlighting Prime Minister Shri @narendramodi’s vision for a… pic.twitter.com/WgNqoM1pzk— Ministry of Health (@MoHFW_INDIA) February 28, 2025(చదవండి: కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: నిర్వహించింది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్..ఆ డిజైనర్లు ఎవరంటే..?) -
విలాసవంతమైన నివాస భవనాల్లో టాప్ నగరాలు ఇవే..
ప్రపంచంలోనే విలాసవంతమైన నివాస భవనాల ధరలు పెరుగుతున్నాయి. అలా ధరలు పెరుగుతున్న జాబితాలో గ్లోబల్‌గా ముంబయి నాలుగోస్థానంలో ఉంది. అందుకు సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ3 2023’ నివేదికలను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్ నాలుగో స్థానంలో ఉంది. ఈ నివేదిక లగ్జరీ గృహాల సగటు వార్షిక ధరల వృద్ధిని సూచిస్తుంది. ఇదీ చదవండి: దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు దేశంలోని ముంబయి(నాలుగోస్థానం), దిల్లీ పదో స్థానం, బెంగళూరు 17వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 46 నగరాల్లో సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. గతేడాది ముంబయి 22వ స్థానం ఉంది. ఏడాది కాలంలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో 6.5 శాతం పెరిగాయి. దాంతో 18 స్థానాలు ఎగబాకింది. దిల్లీ, బెంగళూరు సైతం వాటి ఇండెక్స్‌ను మెరుగుపరుచుకున్నాయి. గ్లోబల్ ఇండెక్స్‌లో తొలి మూడు స్థానాల్లో మనీలా(ఫిలిప్పీన్స్), దుబాయ్(యూఏఈ), షాంఘై(చైనా) నిలిచాయి. -
ఇప్పటికే దేశంలో 4లక్షల 5జీ బేస్స్టేషన్లు: ప్రధానిమోదీ
న్యూదిల్లీలోని ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశం ప్రస్తుతం 6జీ దిశగా అడుగులు వేస్తోందన్నారు. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా..ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. ఇటీవలే గూగుల్.. భారత్‌లో పిక్సెల్ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. శామ్సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని గుర్తచేశారు. ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. భారత టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని, అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. -
టపా టప్: మాట్లాడుతుండగా టపాసుల్లా పేలిన స్మార్ట్‌ఫోన్.! యువకుడికి గాయాలు!
Oneplus Nord 2 Blast: స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్. ఇటీవల కాలంలో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్ పేలుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఓ వినియోగదారుడు చైనా స్మార్ట్ తయారీ సంస్థకు చెందిన 5జీ వన్‌ప్లస్ నార్డ్2 మాట్లాడుతుండగా పేలింది. ఫోన్ పేలడంతో బాధితుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు స్మార్ట్ ఫోన్ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూఢిల్లీ చెల్లి చెందిన 'లక్ష్య వర్మ' అనే ట్విట్టర్ మార్చి31,2022న యూజర్ వన్‌ప్లస్ నార్డ్2 విషయంలో తన తమ్ముడికి జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా తమ్ముడు వన్‌ప్లస్ నార్డ్2 స్మార్ట్‌ఫోన్'లో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆఫోన్ పేలింది. తమ్ముడిని వెంటనే ఆస్పత్రికి తరలించాం. న్యాయం కోసం వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్ ప్రతినిధుల్ని ఆశ్రయించాను. 2,3 రోజుల తర్వాత సర్వీస్ సెంటర్ ప్రతినిధులు పేలిన స్మార్ట్‌ఫోన్‌ను కలెక్ట్ చేసుకున్నారే తప్పా ఏం చేయలేదు. @OnePlus_IN Is that your NEVER SETTLE?? This is not a joke! He could have got serious injuries too but luckily he is alive! We just asked for a healthy solution for this, not any compensation or anything else.All I get from you is NO NO NO NO, we can’t do anything pic.twitter.com/RTVUaDln67 — Lakshay Verma (@lakshayvrm) March 31, 2022 @OnePlus_IN హ్యాష్ ట్యాగ్‌కు వన్‌ప్లస్ మోటివేషనల్ కోట్ NEVER SETTLE?? ను యాడ్ చేస్తూ.. ఇది జోక్ కాదు. నా తమ్ముడు ఫోన్ మాట్లాడుతుండగా వన్‌ప్లస్ నార్డ్2 ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నష్టపరిహారమో, ఇంకేదో కావాలని మేం అడగం లేదు. ఒకటే అడిగేది మాకు న్యాయం చేయమని. కానీ ఇప్పటి వరకు మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంకేం చేయలేం' అంటూ విచారం వ్యక్తం చేశాడు. @OnePlus_IN Stop promoting/introducing new phones and start working on your existing products. My brother’s phone One Plus Nord 2 burst out suddenly while he was talking on phone. Portions of melted metal got clinged on his palm and face. We will get this reported shortly. pic.twitter.com/x1pVoDosZM — Lakshay Verma (@lakshayvrm) March 26, 2022 ఫోన్ మెటల్ మొహంపై గుచ్చుకున్నాయి ఫోన్ మెటల్ మొహంపై గుచ్చుకున్నాయంటూ వర్మ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. మాట్లాడుతుండగా వన్‌ప్లస్ నార్డ్2 పేలడంతో..ఆఫోన్ మెటల్ నా తమ్ముడి మొహంపై, చేతిలో గుచ్చుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అంటే వర్మ పోస్ట్ చేసిన వీడియోలో వన్ ప్లస్ నార్డ్2 ఫోన్ పేలి పొగలు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Hi Lakshay! Thank you for bringing this to our notice. We hope your brother is alright! Please connect with us over DM so we can look into your claim. https://t.co/Y6rHuMx1Yh — OnePlus Support (@OnePlus_Support) March 26, 2022 అయితే వర్మ వరుస ట్వీట్లతో వన్‌ప్లస్ యాజమాన్యం స్పందించింది. మీ తమ్ముడి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాం. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీరు మాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామంటూ రిప్లయి ఇచ్చింది. చదవండి: అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను.. -
దేశంలో జోరుగా స్టార్టప్ కల్చర్.. ప్రపంచంలోనే 3వ స్థానంలో!
దేశంలో రోజు రోజుకి స్టార్టప్ కల్చర్ భారీగా పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వందలాది కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ(గతంలో బెంగళూరు) భారత స్టార్ట్-అప్ రాజధానిగా మారింది. ఏప్రిల్ 2019 - డిసెంబర్ 2021 మధ్య కాలంలో బెంగళూరులో ఏర్పడిన 4,514 స్టార్టప్ కంపెనీలతో పోలిస్తే ఢిల్లీలో 5,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీలు వెలిసినట్లు నేడు పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22లో తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో(11,308) స్టార్ట్-అప్ కంపెనీలు ఉన్నాయి. జనవరి 10, 2022 నాటికి భారతదేశంలో 61,400కు పైగా స్టార్ట్-అప్ కంపెనీలను గుర్తించినట్లు ఈ నివేదిక తెలిపింది. 2021లో 44 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. దీంతో, అమెరికా & చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో యునికార్న్ సంస్థలు భారతదేశంలోనే ఉన్నాయి. 2021లో అమెరికాలో 487 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందితే, చైనాలో 301 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. జనవరి 14, 2022 నాటికి, భారతదేశంలోని మొత్తం 83 యునికార్న్ కంపెనీల సంపద విలువ 277.77 బిలియన్ డాలర్లు. ఈ స్టార్ట్-అప్ కంపెనీలలో చాలా వరకు కంపెనీలు సేవ రంగంలో ఉన్నాయి. అలాగే, దేశంలోని స్టార్ట్-అప్ కంపెనీలలో ఎక్కువ భాగం ఐటీ/నాలెడ్జ్ ఆధారిత రంగంలో ఉన్నాయి. 2016-17లో 733 స్టార్ట్-అప్ కంపెనీల నుంచి కొత్తగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2021-22 నాటికి 14,000కు చేరుకుంది. గత మూడు సంవత్సరాలుగా, అంతరిక్ష రంగంలో స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2019లో ఉన్న 11 నుంచి 2021 నాటికి 42కు పెరిగింది. ఇస్రో/డివోఎస్ ఎలాంటి స్టార్ట్-అప్ కంపెనీలను నమోదు చేయనందున, స్టార్టప్ ఇండియా పోర్టల్‌లో స్పేస్ టెక్నాలజీ కేటగిరీ కింద సుమారు 75 స్టార్ట్-అప్ కంపెనీలు మాత్రమే చూపిస్తున్నాయి. 2021లో 555 జిల్లాలు కనీసం ఒక కొత్త స్టార్ట్-అప్ కంపెనీ వెలిసింది. 2016-17లో 121 జిల్లాలో మాత్రమే ఒక స్టార్ట్-అప్ కంపెనీ స్థాపించబడింది. (చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు!) -
బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు!
గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఉక్రెయిన్ - రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో 1850 డాలర్లకు చేరిన ఔన్స్ బంగారం ధర 1 శాతానికి పైగా తగ్గి 1815 డాలర్లకు దిగి వచ్చింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంచుతున్నందున డాలర్ బలోపేతం కావడం ఇందుకు కారణం. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి(999 స్వచ్చత) బంగారం ధర రూ.380కి పైగా తగ్గి రూ.48,502 వద్ద నిలిచింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,428గా ఉంది. మన హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే 999 స్వచ్చత గల బంగారం ధర రూ.50,100 నుంచి రూ.49,640కి తగ్గింది. అంటే, ఒక్కరోజులో రూ.460కి పైగా తగ్గింది అన్నమాట. ఇక 916 స్వచ్చత గల పసిడి ధర రూ.400 తగ్గి రూ.45,500కి చేరుకుంది. బంగారంతో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఒక కేజీ వెండి ధర రూ.1000కి పైగా తగ్గి రూ.62,765కు పడిపోయింది. విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: ఐదు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..!) -
Gold Price Today: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!
గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈ రోజు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. న్యూఢిల్లీ బులియన్ ఇండియన్ జ్యూవెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.48,414గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర సుమారు రూ.439 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.44,347గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా అదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,350గా ఉంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.47,350కు చేరుకుంది. విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.700కి పైగా పెరిగి రూ.61,074కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!) -
ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!
న్యూఢిల్లీ: 2022, జనవరి 1 నాటికి పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లు పైబడిన అన్ని డీజిల్ వాహనాలను డీరిజిస్టర్ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి) ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ డీరిజిస్టర్డ్ డీజిల్ వాహనాలకు ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు దిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతించొద్దని ఏప్రిల్ 7, 2015న ఎన్టీటీ సంబంధిత శాఖను ఆదేశించింది. అనంతరం దశలవారీగా ఇలాంటి వాహనాలను డీరిజిస్టర్ చేయాలంటూ 2016, జులై 18న ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు తొలుత రిజేస్ట్రేషన్ రద్దు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దిల్లీ వెలుపల వీటిని నడిపేందుకు నిరభ్యంతర పత్రం కూడా ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఎన్జీటి ఆదేశాలకు అనుగుణంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను మొదట డీరిజిస్టర్ చేస్తుందని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను దేశంలో ఎక్కడ నడవకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) కూడా జారీ చేయము అని పేర్కొంది. 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను వినియోగించుకోవాలంటే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశం ఉంటుందని ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని వారాల క్రితం, ఢిల్లీ ప్రభుత్వం ఈవి కిట్ తో పాత డీజిల్ & పెట్రోల్ వాహనాలను రెట్రోఫిట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోకపోతే పాత వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ఢిల్లీ రవాణా శాఖ, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు బృందాలు ఇప్పటికే అటువంటి పాత వాహనాలను గుర్తించి అధీకృత విక్రేతల ద్వారా స్క్రాపింగ్ కోసం పంపుతున్నాయి. (చదవండి: ఎంజీ మోటార్స్ అరుదైన ఘనత..! భారత్‌లో తొలి కంపెనీగా..!) -
బంగారం ప్రియులకు భారీ శుభవార్త!
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర రూ.400కి పైగా తగ్గింది. వచ్చే ఏడాది నాటికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన నెలవారీ బాండ్ కొనుగోళ్లను సడలించినట్లు పేర్కొన్న తర్వాత భారతదేశంలో బంగారం ధర భారీగా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర సెప్టెంబర్ 23న 0.62 శాతం క్షీణించి రూ.46,383కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ ఫెడ్ ఊహించిన దానికంటే త్వరగా వడ్డీ రేటు పెంపును ప్రకటించడంతో బంగారం ధర పడిపోయింది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!) ఇండియన్ బులియన్ జువెలరీ ప్రకారం నేడు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి సుమారు రూ.400లు తగ్గడంతో రూ.46,468కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.42,934 నుంచి రూ.42,565కు తగ్గింది. మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.600లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ.60,362కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.60,954లుగా ఉంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.47,840ల నుంచి రూ.47,560కు పడిపోయింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి. -
త్వరలో దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!
న్యూఢిల్లీ: ఢిల్లీ, జైపూర్ మధ్య త్వరలో దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే నిర్మించే అవకాశం ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు మీడియాతో తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య రహదారిని నిర్మించడానికి తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక విదేశీ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఢిల్లీ-జైపూర్ మధ్య రహదారి విస్తరణతో పాటు, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే విషయంలో కూడా ఎలక్ట్రిక్ హైవే విస్తరణ కోసం స్వీడిష్ సంస్థతో కూడా చర్చలు జరుగుతున్నాయి అని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 22 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలు నిర్మించాలని చూస్తున్నట్లు, ఇప్పటికే వాటిలో ఏడింటి పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. (చదవండి: గంటల వ్యవధిలోనే రూ.21 కోట్ల ఆర్జన!) "ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడం నా కల. ఇది ఇప్పటికీ ప్రతిపాదిత ప్రాజెక్ట్. దీని కోసం మేము ఒక విదేశీ సంస్థతో చర్చిస్తున్నాము" అని నితిన్ గడ్కరీ వార్తా సంస్థ పీటీఐతో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, బస్సులు & ట్రక్కులు వంటి ప్రజా రవాణా వాహనాలను త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, నితిన్ గడ్కరీ ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని సమీక్షించారు. ఈ రహదారి వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుంచి సగానికి తగ్గనున్నట్లు పేర్కొన్నారు. జైపూర్ - ఢిల్లీ మధ్య ప్రయాణం త్వరలో రెండు గంటలకు తగ్గనున్నట్లు ఆయన ప్రకటించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి ఢిల్లీ, జైపూర్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది అని అన్నారు. -
తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడి రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు చేపడుతున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆధారాలతో ఎన్జీటీని తప్పుదోవ పట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సృష్టించిన (ఫ్యాబ్రికేటెడ్) ఆధారాలతో వీడియోలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 192 మేరకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల వద్ద పనులు చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన విషయం విదితమే. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి ఎన్జీటీకి అధికారం ఉందా అనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లో ప్రస్తావించింది. అనంతరం ఎన్జీటీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. ఆయా పిటిషన్లను గురువారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద చేపడుతున్న పనులు, సర్వే.. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు రూపొందిస్తున్న డీపీఆర్‌కు సంబంధించినవి మాత్రమేనని తెలిపారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల వద్ద పరిశీలించిన కృష్ణాబోర్డు గతనెల 13న, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈనెల 8న ఎన్జీటీకి సమర్పించిన నివేదికల్లో.. ప్రాజెక్టు పరిసరాల్లో ఎలాంటి పనులు కొనసాగడంలేదని స్పష్టం చేశాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి జరుగుతున్న పనులను రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులుగా వీడియో క్లిప్పింగ్‌లు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కల్పించుకున్న ధర్మాసనం..ట్రిబ్యునల్ తీర్పులు అమలు కాకపోతే చూస్తూ ఉండాలా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని గవినోళ్ల శ్రీనివాస్ న్యాయవాది శ్రావణ్‌కుమార్, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు తెలిపారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రపంచ స్థాయి ఎగ్జిక్యూటివ్ లాంజ్
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో కొత్త ప్రపంచ స్థాయి ఎగ్జిక్యూటివ్ లాంజ్ త్వరలో ప్రారంభించనున్నట్లు ఒక అధికారి మీడియకు వెల్లడించారు. "రైల్వే ప్రయాణీకులు కోసం సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసం ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఐఆర్సీటీసీ నిర్మించినట్లు" అధికారి తెలిపారు. " ఈ లాంజ్ ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపొందించినట్లు" అని ఆయన తెలిపారు. ఈ కొత్త లాంజ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 1 మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు.(చదవండి: సామాన్యులకు భారీ షాక్.. మరింత పెరగనున్న గ్యాస్ ధరలు) "ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో సందర్శకులకు సంగీతం, వై-ఫై, టీవీ, రైలు సమాచార ప్రదర్శన, పానీయాలు, చాలా రకాల బఫెట్లు వంటివీ ఇందులో అందించనున్నారు" అని అధికారి తెలిపారు. ఇందులో ప్రవేశించడం కోసం ప్రయాణీకులు ప్రవేశ రుసుముగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ప్రతి గంటకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనిలో వై-ఫై ఇంటర్నెట్ ఫెసిలిటీ, పుస్తకాలు, మ్యాగజైన్ల రిటైలింగ్, కాంప్లిమెంటరీ టీ, కాఫీ పానీయాలు వంటి అనేక సేవలు ఉంటాయి. ఇక శాఖాహార భోజనం కోసం రూ.250, మాంసాహార భోజనం కోసం రూ.385 చెల్లించాలి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన రెండవ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఇది. మొదటిది ఇప్పటికే ప్లాట్ ఫారం నెంబరు 16 వద్ద గ్రౌండ్ ఫ్లోర్ లో 2016 నుంచి అమలులో ఉంది. ఇతర రాష్ట్రాల రాజధానులలో ఇలాంటి లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. -
జమ్మూకశ్మీర్: బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రత సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా- శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జమ్ముకశ్మీర్ పరిధిలోని బారాముల్లాలో బిఎస్ఎఫ్ భద్రత దళాలపై.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాగా, ఉగ్రవాదులు.. గ్రనైడ్లు, రాకేట్ లాంచర్లతో దాడిచేశారు. దీన్ని భద్రత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాదిని భద్రత సిబ్బంది హతమార్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న(గురువారం) అర్ధరాత్రి భద్రత సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు కాల్పులలో మరణించిన ఉగ్రవాది.. పాకిస్థాన్ కు చెందిన ఉస్మాన్‌గా అధికారులు తెలిపారు. బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఎకె-47 రైఫిల్స్, గ్రనైడ్లు, రాకెట్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రత సిబ్బంది ప్రకటించారు. కాగా, వరుస ఉగ్రదాడులతో ప్రస్తుతం బారాముల్లాలో అధికారులు హైఅలర్ట్‌ను ప్రకటించారు. -
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకంగా యూరియాను కేటాయించాలని విజ్జప్తి చేశారు. అదే విధంగా, ఎఫ్‌బీవోల ఏర్పాటుకు ఏపీఎండీసీ సంస్థను ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా గుర్తించాలని కోరారు. కాగా, ఏపీలో జాతీయ వ్యవసాయ వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. -
భారత్‌లో ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. తస్మాత్ జాగ్రత్త
న్యూఢిల్లీ: సక్రమమైన అనుమతులు లేకుండా నడుస్తున్న 24 ఫేక్ యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫేక్ యూనివర్సిటీలను చెల్లవని చెప్పినట్లు వెల్లడించారు. మరో రెండు యూనివర్సిటీలు సైతం నిబంధనలను మీరాయని, వాటి వ్యవహారంప ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో వచ్చిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఫేక్ యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులకు ప్రత్యేక లేఖలను రాసి ఆయా ఫేక్ వర్సిటీలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయా ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. ఉత్తరప్రదేశ్ (8): వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయ, వారణాసి; మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్; గాంధీ హింది విద్యాపీఠ్, అలహాబాద్; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్; నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలీగఢ్; ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, మథుర; మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్; ఇంద్రప్రస్త శిక్షా పరిషద్, నోయిడా ఢిల్లీ (7): కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడిసియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ) పశ్చిమబెంగాల్ (2): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా; ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా ఒడిశా (2): నవభారత్ శిక్షా పరిషద్, రూర్కెలా? నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. వీటితో పాటు పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీలు కూడా ఫేక్ యూనివర్సిటీలని యూజీసీ తెలిపింది. 17.94 లక్షల ‘కరోనా’ క్లెయిమ్‌లు సెటిల్ దేశంలో గత 15 నెలల్లో కోవిడ్–19కు సంబంధించి రూ.21,837 కోట్ల విలువైన 17.94 లక్షల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ సంస్థలు సెటిల్ చేసినట్లు భగవత్ కరాడ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసేందుకు ఐఆర్డీఏఐ చర్చలు చేపట్టిందని అన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 15 వరకూ 17.94 లక్షల క్లెయిమ్‌లు సెటిల్ అయ్యాయని వివరించారు. 204 ప్రైవేటు చానెళ్ల నిలిపివేత నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 2016–20ల మధ్య 204 ప్రైవేటు చానెళ్ల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మరో 128 కేసులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 916 ప్రైవేటు శాటిలైట్ టీవీ చానెళ్లకు అప్–లింకింగ్, డౌన్–లింకింగ్ల మార్గదర్శకాల ప్రకారం అనుమతులు ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. నిబంధలను పాటించలేకపోవడం వల్లే 204 చానళ్ల అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించారు. కొత్త చానెళ్ల వ్యవహారంపై స్పందిస్తూ.. 2016–17లో 60 చానెళ్లు, 2017–18లో 34 చానెళ్లు, 2018–19లో 56 చానెళ్లు, 2020–21లో 22 చానెళ్లకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ►దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 2.96 కోట్ల మంది స్కూలు విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఆన్లైన్ విద్య కోసం ఉపయోగించాల్సిన మొబైల్/లాప్‌టాప్‌లు లేని విద్యార్థులు అత్యధికంగా బిహార్‌లో ఉన్నారని పేర్కొంది. మరి కొన్ని రాష్ట్రాల్లో సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపింది. ►కరోనా కారణంగా మరణించిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ. 5.05 కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించిన విధానాలకు లోబడి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్హెచ్ఏఐ రుణాలు రూ.3.06 లక్షల కోట్లు: గడ్కరీ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తీసుకున్న రుణాలు 2021 మార్చి నాటికి రూ.3,06,704 కోట్లకు చేరాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో చెప్పారు. 2017 మార్చి నాటికి ఈ రుణాలు రూ.74,742 కోట్లు ఉండేవని తెలిపారు. రుణాలపై ఎన్హెచ్ఏఐ 2020–21లో రూ.18,840 కోట్ల వడ్డీని చెల్లించిందని పేర్కొన్నారు. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలంటూ కేంద్రం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు పాత వాహనాలపై అత్యధికంగా గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు రివోల్ట్ గుడ్‌న్యూస్...!
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీదారు రివోల్ట్ ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరలో ఆర్వీ1 అనే కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా ఈ బైక్ ధర ప్రస్తుతం ఉన్న ఆర్వీ300 కన్నా తక్కువ ధరలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి ఆర్వీ1 ఉత్పత్తిలోకి వస్తుందని రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్(ఆర్ఈఎల్) ప్రమోటర్ అంజలి రట్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. గుర్గావ్కు చెందిన రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం ఆర్వీ400, ఆర్వీ300 అనే రెండు ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లో లభిస్తున్నాయి. రివోల్ట్ మోటార్లో సుమారు 43 శాతం వాటాను 150 కోట్ల రూపాయలతో రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది. వచ్చే ఐదేళ్లలో సంవత్సరానికి ఐదు లక్షల బైక్‌లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్-2 తాజా సవరణల్లో భాగంగా రివోల్ట్ బైక్ ధరలు గణనీయంగా తగ్గాయి. రివోల్ట్ ఆర్వీ 400 ప్రస్తుతం ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ. 90, 799గా ఉంది, అయితే రివోల్ట్ నుంచి వచ్చే కొత్త ఆర్వీ1 మోడల్ ధర రూ. 75 వేల నుంచి రూ. 80 వేల మధ్య ఉండొచ్చునని తెలుస్తోంది. తాజాగా రివోల్ట్ కంపెనీ డోమినోస్ పిజ్జాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్ది రోజుల క్రితం రివోల్ట్ ఉంచిన ప్రీ బుకింగ్స్‌లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. -
ఏషియన్ పెయింట్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 574 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 220 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 91 శాతం జంప్‌చేసి రూ. 5,585 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ. 2,923 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం వ్యయాలు 26 శాతం పెరిగి రూ. 1,006 కోట్లకు చేరాయి. దేశీయంగా డెకొరేటివ్ బిజినెస్ అమ్మకాల పరిమాణం రెట్టింపైనట్లు ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఆదాయం పడిపోయినట్లు ప్రస్తావించారు. షేరు దూకుడు... ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 3,145 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,179ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టానికి చేరింది. బీఎస్ఈలోనూ ఇదే స్థాయిలో ఎగసింది. ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈలో 67.55 లక్షలు, బీఎస్ఈలో 2.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
భౌతిక దూరం లేదు..!
న్యూఢిల్లీ: హిల్ స్టేషన్లలో పర్యాటకులు, మార్కెట్లలో వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులు,గుంపులుగా తిరుగుతుం డడంపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ధర్డ్ వేవ్‌ను విజయవంతంగా అడ్డుకోవాలంటే ప్రజలు నిర్లక్ష్యం వీడి, అత్యంత అప్రమత్తతతో ఉండాలని కోరారు. జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్‌ను అడ్డుకోగలుగుతామన్నారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మంగళవారం ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న కరోనా కట్టడి చర్యలపై వర్చువల్‌గా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని తెలిపారు. ‘భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లను ధరించడం, టీకా వేసుకోవడం ద్వారా నివారణ.. అనుమానితులను గుర్తించడం, పరీక్షలు జరపడం, వైద్యం అందించడం ద్వారా చికిత్స.. కరోనా కట్టడిలో ఇది విజయవంతమైన వ్యూహం’ అని వ్యాఖ్యానించారు. ‘కరోనాతో పర్యాటకం, వ్యాపారం దెబ్బతిన్నమాట వాస్తవమే కానీ.. హిల్ స్టేషన్లలో, మార్కెట్లలో ప్రజలు మాస్క్‌లు లేకుండా తిరగడం సరికాదు’ అని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ రావడానికి ముందే ఎంజాయ్ చేయాలనుకునే ధోరణిని ప్రధాని తప్పుబట్టారు. థర్డ్ వేవ్ దానికదే రాదని, మన నిర్లక్ష్యం వల్లనే వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని ప్రధాని సీఎంలను కోరారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన సుమారు 23 వేల కోట్ల ప్యాకేజీతో ఈశాన్య ప్రాంతంలోనూ వైద్య వసతులను మరింత మెరుగుపర్చాలన్నారు. ఈ సమావేశంలో అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా, ప్రధాని ఈనెల 16న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ సీఎంలతో కోవిడ్‌పై సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. -
బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్!. కేవలం ఆరు రోజుల్లో బంగారం ధర 1,000 రూపాయలకు పైగా పెరగింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు మూడు వారాల గరిష్టాన్ని తాకాయి. స్పాట్ బంగారం 0.4% పెరిగి ఔన్స్ కు 1,798.46 డాలర్ల వద్ద ఉంది. జూన్ 17 తర్వాత ఇదే అత్యధికం. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ కు 0.8% పెరిగి 1,798.10 డాలర్లకు చేరుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. న్యూఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.47,425 నుంచి రూ.47,758 పైకి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.305 పెరిగి రూ.43,441 చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 నుంచి రూ.44,400కి పెరిగితే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,340 నుంచి రూ.48,440కు పెరగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర రూ.115 పెరిగి కిలో రూ.69,910కు చేరింది. అంతకుముందు కిలో రూ.69,795గా ఉన్న సంగతి తెలిసిందే. -
15 సంవత్సరాల తర్వాత రైలెక్కిన భారత రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం రైలు ప్రయాణం చేశారు. తన సతీమణి సవితాదేవితో కలిసి తమ స్వస్థలం కాన్పూర్‌కు రైలులో బయలు దేరారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్టపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేబోర్డు చైర్మన్, సీఈఓ సునీల్ శర్మ వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వెళ్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. 15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2006లో అప్పటి భారత రాష్టపతి అబ్దుల్ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురా వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్ తన పాత పరిచయస్థులను,తన పాఠశాల స్నేహితులను కలిసి మాట్లాడనున్నారు. ఆ తరువాత తన స్వగ్రామానికి చేరుకుంటారు. స్వగ్రామాన్ని సందర్శించిన అనంతరం జూన్ 28వ తేదీన కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషనులో రైలు ఎక్కి లక్నోకు చేరుకుంటారు. లక్నో పర్యటన అనంతరం జూన్ 29వ తేదీన రామ్‌నాథ్ ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు -
ఎన్టీపీసీ లాభం హైజంప్..!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసింది. రూ. 4,649 కోట్లకుపైగా ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,630 కోట్లు మాత్రమే సాధించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 31,330 కోట్ల నుంచి రూ. 31,687 కోట్లకు నామమాత్రంగా పుంజుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 3.15 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ఫిబ్రవరిలో రూ. 3 మధ్యంతర డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. క్యూ4లో స్థూల విద్యుదుత్పత్తి 68.27 బిలియన్ యూనిట్ల నుంచి 77.63 బి.యూకి పెరిగింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 11,192 కోట్ల నుంచి రూ. 14,969 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,12,373 కోట్ల నుంచి రూ. 1,15,547 కోట్లకు ఎగసింది. రుణాల ద్వారా నిధుల సమీకరణ పరిమితిని బోర్డు రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.25 లక్షల కోట్లకు పెంచింది. గతేడాది విద్యుదుత్పత్తి 259.61 బిలియన్ యూనిట్ల నుంచి 270.9 బీయూకి పెరిగింది. మొత్తం గ్రూప్ కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 314.07 బీయూని సాధించినట్లు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. 2019–20లో ఇది 290.19 బీయూ మాత్రమేనని తెలియజేసింది. కాగా.. క్యూ4లో బొగ్గు ఉత్పత్తి 2.6 మిలియన్ టన్నుల నుంచి 3.7 ఎంటీకి పుంజుకుంది. పూర్తి ఏడాదికి మాత్రం 9.63 ఎంటీ నుంచి 9.46 ఎంటీకి తగ్గింది. క్యూ4లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 69.52 శాతం నుంచి 77.12 శాతానికి మెరుగుపడింది. పూర్తి ఏడాదికి 68 శాతం నుంచి 66 శాతానికి నీరసించింది. సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.9 నుంచి రూ. 3.77కు తగ్గింది. చదవండి: 5జీ నెట్వర్క్: ఎయిర్టెల్ కీలక నిర్ణయం..! -
ఢిల్లీ: ఈ ఏడాదిలోనే అత్యల్ప సంఖ్యలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అత్యల్ప సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం మరింత ఊరటనిచ్చింది. గడిచిన 24గంటల్లో 89కేసులు మాత్రమే నమోదయ్యాయి. సోమవారం నమెదైన కేసులు 2021 సంవత్సరంలోనే అత్యంత తక్కువగా రికార్డులు చెబుతున్నాయి.అంతేకాకుండా కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా 0.16శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ లో వెయ్యి 1996మంది కొవిడ్ చికత్స పొందుతున్నారు. 563 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మార్చి 10న నమోదైన 1900 యాక్టివ్ కేసుల తర్వాత మళ్లీ అంత తక్కువ సంఖ్యలో నమోదు కావడం ఇదే మెదటి సారి .ఇప్పటి వరకూ ఢిల్లీలో 14లక్షల 32వేల 381 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.గడిచిన 24గంటల్లో 24మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 24వేల 925కు చేరింది. చదవండి:గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు -
వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా.. స్పైడర్‌మాన్‌లా..
న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు ఒకప్పుడు అడవులలో ఎక్కువగా ఉండేవి. పాపం.. వాటికి సరైన ఆహారం దొరక్క జనావాసాల మధ్యన చేరుకున్నాయి. అయితే, కోతులు చేసే హంగామా.. మాములుగా ఉండదు. అవి ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఇళ్లపై దాడిచేసి, చేతికందినవి ఎత్తుకు పోతుంటాయి. ఈ క్రమంలో కోతులు ఒక్కోసారి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి పెద్ద చెట్లపై అమాంతం ఎక్కి, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. అదే విధంగా, ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపై దూకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి దాడిచేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో రెండు కోతులు ఎనిమిది అంతస్థుల భవనంపైకి ఎక్కాయి. అవి వెళ్లిన పని అయిపోయిందేమో.. మరేమో.. కానీ ఆ తర్వాత ఒక గోడను ఆధారంగా చేసుకుని.. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా, పాకుతూ నేలను చేరుకున్నాయి. కాగా, ఈ వీడియోను టైకూన్‌కు చెందిన వ్యాపారవేత్త హార్ష గొయెంకా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఆ కోతులు అంత ఎత్తున ఉన్న బిల్డింగ్‌పై నుంచి కూడా.. ఎంత తెలివిగా, జాగ్రత్తగా దిగుతున్నాయో.. మనిషి కూడా అదే విధంగా ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా ఎదుర్కొవచ్చని ’ చెప్పారు. ఇదే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుషాంత్నందా కూడా తన ఇన్‌స్టాలో వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ఆయన ‘మనిషి జీవింతంలో సమస్యలు ఉండటం సహాజం.. కానీ, వీటిని మరింత జటిలం చేసుకుంటున్నారని ’ అని కోడ్ చేశారు. ఈ వీడియో ఎంతో స్పూర్తీవంతంగా ఉందని అన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఈ కోతులకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా..’, ‘స్పైడర్‌మెన్ ఏంటా జారటం..’, ‘పట్టు తప్పితే.. ఇంకేమైనా ఉందా..’, ‘వాటి తెలివికి జోహర్లు..’ ‘హమ్మయ్య.. మొత్తానికి కిందకు చేరుకున్నాయి.’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. There are simple things in life you see and they light up your day….. pic.twitter.com/ceciyhKTox — Harsh Goenka (@hvgoenka) June 19, 2021 చదవండి: సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు.. -
పన్నుల వసూళ్లులో కేంద్రం పీహెచ్డీ: రాహుల్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూలులో పీహెచ్డీ చేసిందని మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా కన్నా పెట్రోలు, డీజిల్‌ల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందని చెప్తున్న ఓ పత్రిక కథనాన్ని జత చేస్తూ ఈ ట్వీట్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక రోజు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం మళ్ళీ పెరిగాయి. దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. మరికొన్ని నగరాల్లో ఈ ధర రూ.100కు చేరువలో ఉంది. భోపాల్‌లో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ. 105 గా వుంది. చదవండి:అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్ -
Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట!
మీరు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఒక్కరోజులో పుత్తడి ధర భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగిరావడంతో ఆ ప్రభావం దేశీయ గోల్డ్ ధరల మీద కూడా పడింది. దీంతో బంగారం రేటు పడిపోయింది. అలాగే, బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 24 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.911లు తగ్గడంతో రూ.47,611కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.48,529గా ముగిసింది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.841 తగ్గడంతో రూ.43,612కి చేరుకుంది. గతంలో ఇంత మొత్తం మేర తగ్గిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, ఇక హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ధర దిగొచ్చింది. నేడు (జూన్ 17) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 క్షిణించి రూ.49,470కు తగ్గింది. 22 క్యారెట్ల 122 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 క్షిణించి రూ.45,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో, 2023లో వడ్డీ రేటు పెంపు జరగవచ్చని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు. దీంతో బుధవారం పుత్తడి ధర ఒకశాతం తగ్గింది. తాజాగా 2.31 శాతం ధర పడిపోవడంతో ఔన్స్ పసిడి ధర 1,821 డాలర్లు పలుకుతోంది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1,311లు తగ్గడంతో 70,079గా ట్రేడ్ అవుతోంది. చదవండి: స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త! -
భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జితిన్ ప్రసాద తాను భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు, ఆయన ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఇంటికి చేరుకొని తన నిర్ణయాన్ని వెల్లడించారు. గతంలో జితిన్ ప్రసాద యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా ఉక్కు మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 2019 కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్ కీలకంగా వ్యవహరించారు. అయితే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద..‘ బ్రాహ్మిన్ చేత్న పరిషత్’ను గత సంవత్సరం ప్రారంభించారు. తాజాగా, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వెస్ట్‌బెంగాల్ జనరల్ సెక్రెటరీగా నియమించింది. ఇలాంటి తరుణంలో జితిన్ ప్రసాద బీజేపీలోకి చేరుతుండటం రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరిక కీలకంగా మారింది. చదవండి: ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం -
3 రోజులు.. 3 ఎయిర్‌పోర్టులు..285కోట్లు
దేశంలోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీయెత్తున హెరాయిన్ పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల వ్యవధిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారి వద్ద నుంచి సుమారు 42 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో పట్టుకున్న దీని విలువ సుమారు రూ.285 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆదివారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో నలుగురు ఆఫ్రికన్ మహిళలు కాగా ఇద్దరు అఫ్గాన్లు ఉన్నారు. సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఇంతపెద్ద మొత్తంలో మాదకద్రవ్యం పట్టుబడటం కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం తెలిపారు. దీని విలువ రూ.78 కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. వారి కథనం ప్రకారం.. ఉగాండాకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు విమానాశ్రయంలో తాను పోగొట్టుకున్న లగేజీని తీసుకునేందుకు శనివారం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. ఆ మహిళ ఇటీవల జింబాబ్వే నుంచి దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్, దోహా మీదుగా హైదరాబాద్ వచ్చింది. ఆమెకు లగేజీ తిరిగి ఇచ్చే సమయంలో అధికారులు అనుమానంతో తనిఖీలు నిర్వహించగా అందులో 4 కిలోల హెరాయిన్పౌడర్ లభించింది. దీంతో ఆమెను మాదకద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్ యాక్ట్–1985) కింద అరెస్టు చేసి విచారిస్తున్నారు. బ్యాగ్ పైపుల్లో దాచి.. ఆదివారం తెల్లవారుజామున మకుంబా కొరెల్ అనే మరో మహిళ జాంబియా నుంచి జోహెన్నస్ బర్గ్, దోహా మీదుగానే హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది. ఆమె బ్యాగుపై అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. బ్యాగుకు అమర్చిన పైపుల్లో అనుమానిత పౌడర్ కనుగొన్నారు. దాన్ని పరీక్షించగా.. అది హెరాయిన్‌గా తేలింది. సుమారు 8 కిలోల పౌడర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. సూత్రధారులు మాత్రం చిక్కట్లేదు... అధికారులు అనుమానంతో తనిఖీలు నిర్వహించినప్పుడు చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా... ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాక, ఏదో ఒక ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్ళి సరుకు తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని అధికారులు అంటున్నారు. గతంలోనూ శంషాబాద్‌లో ఇలాంటి ఘటనలెన్నో... దుబాయ్ నుంచి కొకైన్క్యాప్సుల్స్ను కడుపులో దాచుకుని వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసాను పట్టుకుంటే 793 గ్రాముల డ్రగ్ దొరికింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మాఫియా పనే? ప్రపంచవ్యాప్తంగా హెరాయిన్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్తరువాత భారతదేశం ఉంది. అయితే పాకిస్తాన్‌నుంచి పంజాబ్‌లోకి భూభాగం ద్వారా, ముంబై, గోవాలకు సముద్రమార్గం ద్వారా కూడా కొంత సరుకు చేరుతుంటుంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో ఔషధాల తయారీ, వాణిజ్యపంటల ముసుగులో కొందరు అక్రమంగా హెరాయిన్‌ను ఉత్పత్తి చేసి చెన్నై, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల ద్వారా బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా కొకైన్, ఒపియంలు మనదేశానికి అధికంగా దిగుమతి అవుతాయి. అందులోనూ సముద్రమార్గం ద్వారానే అధికంగా అవుతాయి. కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో స్మగ్లర్లు వాయుమార్గంలో తీసుకువచ్చేందుకు అంతగా ఆసక్తి చూపరు. అలాంటిది మనదేశంలో భారీగా ఉత్పత్తి అయ్యే హెరాయిన్కిలోల కొద్దీ దిగుమతి కావడం, అందులోనూ వాయుమార్గంలో తీసుకురావడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. శనివారం చెన్నై విమానాశ్రయంలోనూ భారీగా 10 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ కూడా రూ.70 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసింది. శంషాబాద్‌లో పట్టుబడ్డ ఇద్దరు, చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డ మరో ఇద్దరు మహిళలు.. ఈ నలుగురు ఆఫ్రికన్లే కావడం, అందరి వద్దా హెరాయిన్లభ్యం కావడంతో దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్పిన్కూడా ఒకరేనన్న సందేహాలు కలుగుతున్నాయి. మహిళలపై నిఘా ఉండదనే..! అంతర్జాతీయ స్మగ్లర్లు ఎక్కువగా మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇలా బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ పలు సందర్భాల్లో ఏకంగా తొమ్మిది మంది మహిళలు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. స్మగ్లర్లు అనగానే సాధారణంగా పురుషులనే అనుకుంటారు. ఇక మహిళలు... అందునా నిండు గర్భంతోనో, చంకలో పసి పిల్లలతోనో, అంగవైకల్యంతోనో వచ్చే వారిని అధికారులు పెద్దగా అనుమానించరు. ఈ కారణంగానే వివిధ దేశాల నుంచి వచ్చే ఈ తరహా పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ఎర వేస్తూ బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లర్లు అప్పగిస్తున్నారు. వారు వివిధ పంథాల్లో, శరీరంపైనా వాటిని అమర్చుకుని తీసుకువస్తున్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారికి గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: దేశీయంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బ్యాటరీ ఆధారిత వాహనాలకు (బీవోవీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ, రెన్యువల్‌కి సంబంధించిన ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునివ్వాలని ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేయనున్నట్లు పేర్కొంది. సాధారణ ప్రజలు, పరిశ్రమవర్గాలు దీనిపై 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. -
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం కొనుగోలు చేయాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. నేడు బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. పసిడి బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,975 నుంచి రూ.49,422కు పెరగింది. ఇక, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,861 నుంచి రూ.45,271కు చేరుకుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.45,900 నుంచి రూ.46,100కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.230 పెరిగి రూ.50,070 నుంచి రూ.50,300కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఏర్పడటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.1,058 పెరగడం ద్వారా రూ.72,428కు చేరుకుంది. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్! -
కరోనా కల్లోలం: ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, రుచి తెలియక పోవడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవ్వడం మొదలైన లక్షణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకొన్న కూడా కోవిడ్ నెగెటివ్ అనంతరం కూడా అనేక శారీరక సమస్యలు కొత్తగా ఉత్పన్న మవుతున్నాయి. వీటిని పోస్ట్ కోవిడ్ సమస్యలుగా పేర్కొంటారు. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కోవిడ్ అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు. కాగా, 61 ఏళ్ల వయస్సున్న పోఖ్రియల్ నిశాంక్ గత ఏప్రిల్ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ల సూచన మేరకు ఆయన ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఇప్పటికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా వుండగా కేంద్ర విద్యాశాఖ గత కొన్ని రోజులుగా సిబిఎస్ఇ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ వెంటనే సిబిఎస్ఇ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆసుపత్రిలో ఉన్న తరుణంలో, సిబిఎస్ఇ పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కేంద్ర విద్యాశాఖ సుప్రీం కోర్టును కోరింది. చదవండి: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. నల్లగా మారిన మహిళ చేయి -
రూ.50 వేలు దాటేసిన బంగారం ధర
ప్రపంచంలో బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందు ఉంటుంది. భారత్‌లో బంగారానికి ఉన్నంత డిమాండ్ దేనికి ఉండదు. మహిళలు అలంకరణ కోసం తీసుకుంటే, మగవారు పెట్టుబడుల కోసం కొనుగులు చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బంగారం ధర భారీగా పెరగింది. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు మాత్రం భారీగా పెరిగింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,587 నుంచి రూ.48,975కు పెరగింది. ఇక, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,506 నుంచి రూ.44,861కు చేరుకుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.45,810 నుంచి రూ.45,900కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,070కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఏర్పడింది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.782 పెరగడం ద్వారా రూ.71,370కు చేరింది. చదవండి: ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే పర్సనల్ లోన్ -
Wrestler Sushil Kumar: ఆ రాత్రి ఏం జరిగింది?
‘రెండు వర్గాల మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు మధ్యవర్తిగా మాత్రమే నేను అక్కడకు వెళ్లాను’... పోలీసుల విచారణ సందర్భంగా సుశీల్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఇది. అయితే అతను చెబుతున్న మాటల్లో నిజమెంత...? విచారణ సమయంలో పలుమార్లు మాట మార్చిన సుశీల్‌లో ఆ తడబాటు ఎందుకు...? ఇప్పుడు పోలీసులు ఇవన్నీ తేల్చే పనిలో పడ్డారు. సుశీల్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తమ పనిలో మరింత వేగం పెంచగా... స్వయంకృతంతో జైల్లో స్టార్ ఒలింపియన్ రెజ్లర్ కుమిలిపోతుండటం క్రీడా విషాదం. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు చురుగ్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌తో కలిసి మంగళవారం పోలీసులు ఘటన జరిగిన ఛత్రశాల్ స్టేడియం వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ‘సీన్ రీకన్స్ట్రక్షన్’ ద్వారా మే 4 రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘ఘటన జరిగిన రోజు అతను ఎక్కడ ఉన్నాడు. ఏం చేశాడని ప్రశ్నించాం. అనంతరం సుశీల్ దాక్కునేందుకు సహకరించిన సన్నిహితులు, మిత్రుల వివరాలు కూడా అడిగాం. మేం అన్ని కోణాల్లో విచారించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఛత్రశాల్ స్టేడియంతో పాటు వివాదానికి కారణమైన మోడల్ హౌస్‌లోని ఫ్లాట్‌కు, షాలిమార్ బాగ్‌లో సుశీల్ నివాసం ఉంటున్న చోటుకు కూడా అతడిని పోలీసులు తీసుకెళ్లి పలు వివరాలు సేకరించారు. ‘ఆ రోజు రాత్రి సుశీల్‌తో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటున్నాం. అతను సాగర్‌ను కొడుతున్నట్లుగా వచ్చిన వీడియోపై మరింత స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం’ అని అధికారులు చెప్పారు. పొంతన లేని జవాబులు మంగళవారం కూడా నాలుగు గంటలపాటు సుశీల్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘విచారణ సందర్భంగా ఒకసారి సాగర్, సోనూలను తాను అక్కడకు లాక్కు రాలేదని, తగవు తీర్చేందుకు మాత్రమే వెళ్లానని అతను మాతో చెప్పాడు. మరోసారి దీని గురించే చెబుతూ తాను సాగర్‌ను కాస్త బెదిరించి భయపెట్టాలని మాత్రమే భావించానని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతని జవాబుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సహజంగానే ఆందోళన గా ఉన్న సుశీల్ పదే పదే మాట మార్చాడు. గొడవ జరిగాక కూడా తాను ఛత్రశాల్ స్టేడియం లోనే ఉన్నానని, మరుసటి రోజు సాగర్ చనిపోయాడని తెలిశాకే పారిపోయానని మాతో చెప్పాడు’ అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు వెల్లడించారు. అంతటి పహిల్వాన్ కూడా జైలు గోడల మధ్య కన్నీళ్లు కార్చినట్లు ఆయన చెప్పారు. ‘లాకప్‌లో పెట్టగానే సుశీల్ ఏడ్చేశాడు. రాత్రంతా మెలకువతోనే ఉండి పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న అతను ఏమీ తినేందుకు ఇష్టపడలేదు’ అని కూడా ఆయన వివరించారు. ‘పద్మశ్రీ’ వెనక్కి తీసుకుంటారా... హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌కు 2011 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి తీసుకునే విషయంలో చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఏ అవార్డీపై రాలేదు కాబట్టి దీని విషయంలో ప్రభు త్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావి స్తోంది. అవార్డు నిబంధనల్లో ఇలా వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి స్పష్టమైన సూచనలు లేకపోయినా... అవార్డు గ్రహీతలు నైతికపరంగా ఉన్నతంగా ఉండాలనే కోణంలో భారత రాష్ట్రపతి కి మాత్రం అవార్డును రద్దు చేసే అధికారం ఉంది. నార్నర్త్ రైల్వేస్ సస్పెన్షన్ వేటు ఊహించినట్లుగానే నార్తర్న్ రైల్వే సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా అతను పని చేస్తున్నాడు. ‘సుశీల్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడంతోపాటు 48 గంటలకు మించి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుశీల్‌ను సస్పెండ్ చేస్తున్నాం’ అని నార్తర్న్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది. కాంట్రాక్ట్ ఖతమ్! మరోవైపు సుశీల్‌ను భారత రెజ్లింగ్ సమాఖ్య కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. తాజా ఘటనకంటే మ్యాట్‌పై అతని ప్రదర్శన కారణంగానే సుశీల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడు. 2019లో ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ (ఏడాదికి రూ. 30 లక్షలు) దక్కిన అనంతరం సుశీల్ ఆ తర్వాత ఆటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో విఫలమైన సుశీల్... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత అతను ఏ టోర్నమెంట్లోనూ పాల్గొనలేదు. గ్యాంగ్స్టర్లతో సంబంధాలపై కూడా.. మరోవైపు సుశీల్‌కు, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాకు మధ్య ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సుశీల్‌తో కలిసి దాడికి పాల్పడిన వారంతా బవానా మనుషులే అని భావిస్తున్న పోలీసులు ఈ కేసులో మరో ఏడుగురిని అనుమానితులుగా గుర్తించారు. ఘటనా స్థలం వద్ద దొరికిన ఒక స్కార్పియో ఎస్యూవీ వాహనం బవానా సన్నిహితుడిదేనని తేలింది. అన్నింటికిమించి కొన్నాళ్ల క్రితం వచ్చిన ఒక బెదిరింపు కేసులో కూడా సుశీల్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడితో సంబంధాలు బాగున్న సమయంలో ఇది జరిగింది. ఒక కేబుల్ ఆపరేటర్‌ను రూ. కోటి కోసం బెదిరించడం వెనక సుశీల్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ శివార్లలోని టోల్ గేట్లపై కూడా తమ పట్టు ఉంచుకునేందుకు జఠేడితో కలిసి సుశీల్ ప్రయత్నించినట్లు చెబుతున్నారు. -
గుంతలో పడ్డ లారీ ...ఎలా పడిందో చూడాల్సిందే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టికి ఢిల్లీ ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.ఎక్కడికక్కడ రహదారులపై నీళ్లు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా చోట్ల రోడ్లు మీద గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నజాఫ్‌గఢ్‌లో ప్రధాన రహదారి మీదగా వస్తున్న ట్రక్కు రోడ్డు మీద ఏర్పడిన గుంతలో పడిపోయింది. లారీ వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Delhi: A truck fell into a caved in portion of the road in Najafgarh pic.twitter.com/MfW8iRigsO — ANI (@ANI) May 20, 2021 (చదవండి:వింత పదార్థం.. ఇదేంటో తెలిస్తే మాకు చెప్పగలరు) -
చిన్నారులను కాపాడేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్‌తో అతలాకుతలమైన ఢిల్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే, కొవిడ్-19 ధర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ మూడో దశలో చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చర్యలకు సమయాత్తమయ్యారు. పిల్లలను కరోనా బారినుంచి కాపాడేందుకు ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయించామని ఆయన బుధవారం ప్రకటించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ నియంత్రణ, తగినన్ని ఆక్సిజన్ బెడ్లు, కీలక ఔషధాలు, ఆక్సిజన్ పరికరాలను సిద్దం చేయడంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో జరిగిన భేటీలో కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు సింగపూర్ స్ట్రెయిన్ థర్డ్ వేవ్ భారత్ లో చిన్నారులపై ప్రభావం చూపుతుందని కేజ్రీవాల్ చేసిన మంగళవారం చేసిన వ్యాఖ్యలను చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలను సింగపూర్ ఆక్షేపించడంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొవిడ్ వేరియంట్స్ పై మాట్లాడే సాధికారత కేజ్రీవాల్ కు లేదని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తీరుపై ఆప్ విరుచుకుపడింది. భారత్ లో థర్డ్ వేవ్ తో చిన్నారులకు వాటిల్లే నష్టంపై ఢిల్లీ ప్రభుత్వం కలత చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం సింగపూర్ తో సంబంధాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చురకలంటించారు. (చదవండి:సీఎం కుమారుడు రూల్స్ బ్రేక్: భార్యతో కలిసి..) -
సింగపూర్ వేరియంట్ థర్ఢ్‌వేవ్ కు కారణం కావచ్చు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. సింగపూర్ లో విజృంబిస్తున్న కొవిడ్-19 కొత్త వేరియంట్ భారతదేశం థర్ఢ్ వేవ్ కు కారణం కావచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్ లో కొవిడ్-19 కొత్త వేరియంట్‌ను కనిపెట్టారని అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని, సింగపూర్‌తో విమాన సేవలను తక్షణమే నిలిపివేయాలని, పిల్లల టీకా డ్రైవ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పదివేలు లోపు నమోదు కావడం కొంత ఊరట కలిగి ఇస్తుంది. (చదవండి:సహజీవనం నైతికంగా ఆమోదయోగ్యం కాదు: హైకోర్టు) -
ఎగ్జిట్ పోల్స్: నువ్వా.. నేనా!
న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం టీఎంసీ, బీజేపీ మధ్య దోబూచులాడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య గట్టిపోటీ నెలకొందని, నువ్వా–నేనా అన్నట్లుగా పరి స్థితి ఉందని గురువారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే– యాక్సిస్ సర్వే బీజేపీకి 134–160 సీట్లు, టీఎంసీకి 130–156 సీట్ల దాకా వస్తాయని తెలిపింది. అయితే మిగతా పలు చానల్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అతికష్టం మీద సాధారణ మెజారిటీ (147) కంటే కొద్దిసీట్లు ఎక్కువ సాధిస్తారని పేర్కొన్నాయి. ఇక తమిళనాడులో ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ల కజగం (డీఎంకే) ఘన విజయం సాధించబోతోందని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి చూస్తే... అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనపడుతోంది. కేరళలోనూ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి సంప్రదాయాన్ని తోసిరాజని వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న ట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. పుదుచ్చేరిలోనూ అధికారం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్లో ఉనికి కోసం పాట్లు పడుతోంది. అందరి దృష్టి బెంగాల్ పైనే... బెంగాల్లో లెఫ్ట్ కంచుకోటలను బద్దలుకొట్టి 2011, 2016లలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన దీదీ గట్టిపట్టు సాధించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం 42 సీట్లలో బీజేపీ దాదాపు 40 శాతానికి పైగా ఓట్లతో 18 లోక్‌సభ సీట్లను సాధించింది. దాంతో గత రెండేళ్లుగా కమలనాథులు బెంగాల్‌పై గురిపెట్టి... ఇంకా బలపడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీంట్లో భాగంగా తృణమూల్ ముఖ్యనేతలను పలువురిని బీజేపీలోకి ఆకర్షించారు. మమత కుడిభుజమైన సువేందు అధికారి కొద్దినెలల కిందట బీజేపీ గూటికి చేరడంతో బెం గాల్ రాజకీయం వేడెక్కింది. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగ్గా... ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పలుమార్లు బెంగాల్‌ను చుట్టివచ్చారు. మమత లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టి... ముప్పేటదాడి చేశారు. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలను నెగ్గిన బీజేపీ ఇప్పుడు అధికారపీఠానికి దగ్గరగా వచ్చేంతగా ఎదిగింది. ఇండియా టుడే– యాక్సిస్ సర్వే బీజేపీకి 134–160, టీఎంసీకి 130–156 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్– సీఎన్ఎక్స్ కూడా కొంచెం అటుఇటుగా బీజేపీకే అధికస్థానాలు వస్తాయని తేల్చింది. అయితే టైమ్స్ నౌ– సీ ఓటర్, ఏబీపీ– సీ ఓటర్ ఎగ్జిట్‌పోల్స్ మాత్రం తృణమూల్ సాధారణ మెజారిటీ సాధిస్తుందని, 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాయి. ముప్పేటదాడి జరుగుతున్నా... ఏమాత్రం వెరవకుండా ఒంటరిపోరాటం చేసిన దీదీకి స్వల్పమొగ్గు ఉంటుందని ఈ రెండు సంస్థలు తేల్చాయి. ఎగ్జిట్‌పోల్స్ ఓటరు నాడిని ఏమేరకు ప్రతిఫలిస్తాయో చూడాలి. సువేందు అధికారితో మమత నేరుగా తలపడ్డ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో గట్టిపోటీ ఉందని, విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమని పలు సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు వామపక్షాలు– కాంగ్రెస్ కూటమి దారుణంగా దెబ్బతిననుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ తేల్చిచెప్పాయి. ఈ రెండు పార్టీలకు కలిపి గరిష్టంగా 25 సీట్లు... కనిష్టంగా 2 సీట్లు వస్తాయని లెక్కగట్టాయి. ఒకవేళ తృణమూల్, బీజేపీలలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే అప్పుడీ కూటమి కీలకమయ్యే అవకాశాలుంటాయి. తమిళనాడులో డీఎంకే హవా మొదటిసారిగా అమ్మ జయలలిత లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్న అన్నాడీఎంకే (బీజేపీతో జతకట్టి) దారుణంగా దెబ్బతిని అధికారం కోల్పోనుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ ముక్తకంఠంతో చెప్పాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (మిత్రపక్షం కాంగ్రెస్) ఏకపక్ష విజయంతో అధికారం చేపట్టనుందని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. డీఎంకే కూటమికి 175–195 స్థానాలు వస్తాయని, అన్నాడీఎంకే కూటమి 38 నుంచి 54 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ డీఎంకే భారీ విజయం ఖాయమని చెప్పాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 సీట్లు అవసరం కాగా... అన్ని ఎగ్జిట్‌పోల్స్ కూడా డీఎంకే కూటమికి కనిష్టంగా 160, అంతకుపైనే స్థానాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం. అస్సాంలో వరుసగా రెండోసారి... ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. బీజేపీ కూటమికి 75–85 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 40 నుంచి 50 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ఉద్దేశంలో అస్సాంలో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఇది సత్ఫలితాలను ఇచ్చినట్లే కనపడుతోంది. శర్వానంద సోనోవాల్ (ప్రస్తుత సీఎం), హిమంత బిశ్వ శర్మలు ఇక్కడ బీజేపీ గెలిస్తే సీఎం కుర్చీకి గట్టిపోటీదారులు కానున్నారు. టైమ్స్ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ బీజేపీకే మొగ్గు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి భారీ ఆధిక్యంతో అధికారంలోకి తేనున్నారని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. ఎల్డీఎఫ్కు ఏకంగా 104– 120 స్థానాలు వస్తాయంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్కు సాధారణ మెజారిటీ (71) కంటే ఎక్కవే సీట్లు వస్తాయని ప్రతి సంస్థా చెప్పడం గమనార్హం. ప్రతి ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే అలవాటున్న కేరళ ఓటర్లు ఈసారి అందుకు భిన్నమైన తీర్పును ఇచ్చారనేది ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కేవలం 20–36 స్థానాలకే పరిమితం అవుతుందని ఇండియా టుడే– యాక్సిస్ పేర్కొనగా... మిగతా సంస్థలు ఈ కూటమికి 50 పైచిలుకు స్థానాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్– బీజేపీ– అన్నాడీఎంకే కూటమి అధికారం చేపట్టే అవకాశాలున్నాయి. -
టెస్లా ప్రియులకు గుడ్ న్యూస్!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశంలోని మూడు మహా నగరాల్లో షోరూమ్‌లను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కడైతే బాగుంటుందనే ప్రదేశాల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. దేశంలో తన వ్యాపారకలాపాలు విస్తరించడానికి ఒక ఎగ్జిక్యూటివ్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఇండియాలో వ్యాపారసేవలు కొనసాగించడానికి జనవరిలో స్థానికంగా సంస్థను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2021 మధ్య నాటికి మోడల్ 3 సెడాన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై, దక్షిణాదిన టెక్ సిటీ అయిన బెంగళూరులో షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు తెరిచేందుకు టెస్లా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ మూడు నగరాలలో షోరూంలు తెరిచేందుకు 20,000 నుంచి 30,000 చదరపు అడుగుల వరకు ఉన్న వాణిజ్య భవనాల కోసం గాలిస్తున్నారు. టెస్లాకు అవసరమైన షోరూం స్థలాన్ని చూసిపెట్టే బాధ్యతను గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ గ్రూప్‌నకు అప్పగించినట్లు సమాచారం. ఈ సంస్థ గత కొన్ని వారాలుగా స్థలాలను సర్వే చేస్తున్నది. సంపన్న కస్టమర్లు సులభంగా వచ్చేలా చూసేందుకు షోరూంలకు స్థలాలను గుర్తించడంపై ఈ సంస్థ దృష్టి సారించింది. చదవండి: ప్రతి నెల పదివేల పెన్షన్ కావాలా? -
రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు...!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హార్వర్డ్ కెనడీ స్కూల్ ప్రొఫెసర్ నికోలస్ బర్న్స్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ సమావేశంలో పలు అంశాలపై రాహుల్ గాంధీ చర్చించారు. ప్రొఫెసర్ నికోలస్ ‘మీరు ఒక వేళ భారత్‌కు ప్రధానమంత్రి ఐతే ఏం చేస్తార’ని రాహుల్ గాంధీని అడిగారు. రాహుల్ సమాధానమిస్తూ.. తాను భారత ప్రధాని అయితే దేశంలో ఉద్యోగ కల్పనపైనే ఎక్కువగా దృష్టి సారిస్తా. అభివృద్ధి అనేది దేశానికి అవసరమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోయింది. అసలు వృద్ధికి, ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా అభివృద్ధి ఉంది. చైనాలో ఉద్యోగ కల్పన లాంటి సమస్యలు లేవు. ఆ దేశంలో ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పే చైనా నేతను ఎప్పుడు కలవలేదు. వృద్ధి రేటు 9 శాతం ఉండడం కంటే దానికి తగ్గట్లుగా ఉద్యోగాల కల్పన జరగడం ముఖ్యం. అసలు ఉద్యోగాల కల్పన లేని వృద్ధి రేటు ఎందుకు పనికిరాదు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే దేశంలో మౌలిక వ్యవస్థలు ఉండాలి. ఆ వ్యవస్థలకు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ ఉండాలి. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో మీడియా స్వేచ్ఛ కల్పించాలి. దేశంలో జాతీయ మీడియా తమ స్థాయిని మరిచిపోయింది. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పటిష్ఠమైన సంస్థాగత నిర్మాణాలు అవసరం. బీజేపీ ప్రదర్శిస్తోన్న వైఖరీ దేశ ప్రజలను అసంతృప్తికి గురి చేస్తోంది’’ అని అన్నారు. LIVE: My interaction with Ambassador Nicholas Burns from Harvard Kennedy School. https://t.co/KZUkRnLlDg — Rahul Gandhi (@RahulGandhi) April 2, 2021 చదవండి: నా పేరు మోదీ కాదు.. నేను అబద్దాలు చెప్పడానికి రాలేదు -
మోస్ట్ పవర్ఫుల్ ఫోన్...ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో మరొక మొబైల్‌ను లాంచ్ చేసింది. భారత్‌లో పోకో ఎక్స్ 3 ప్రోను మంగళవారం లాంచ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన పోకో ఎక్స్3 కి అప్‌గ్రేడ్‌గా ఈ ఫోన్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌ను అమర్చారు. పోకో ఎక్స్ 3 ప్రో క్వాడ్ రియర్ కెమెరాతో పాటు 120 హెర్ట్జ్ డిస్ప్లేను కలిగి ఉంది. పోకో ఫోన్ 25 జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. పోకో ఎక్స్ 3 ప్రో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62, రియల్ మీ ఎక్స్ 7, వివో వి 20 మొబైల్ ఫోన్లతో పోటీపడనుంది. కాగా, పోకో ఎక్స్ 3 ప్రో( 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) వేరియంట్‌కు రూ. 18,999 కాగా, (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) మోడల్ ధర రూ. 20,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్ లో రానుంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 6, మధ్యాహ్నం 12 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.1000 వరకు 10శాతం డిస్కౌంట్ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్ 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 48+8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా 20 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్ 5160ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.20,999 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.18,999 చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త మాల్వేర్..! -
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఆ లేఖ కేంద్ర హోంశాఖకు, ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక ప్రక్రియ పూర్తైనట్లు అధికారిక ప్రకటన విడుదల అవుతుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. కాగా ‘‘జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి 2020 అక్టోబర్ 6న అందిన ఆరోపణల లేఖపై విచారణ జరిపి తిరస్కరించడమైనది. ఇది పూర్తిగా అంతర్గత విచారణ అయినందున ఆ వివరాలు బహిర్గతం చేయడం సాధ్యం కాదు’’అని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పేర్కొంది. తెలుగువారిలో రెండో వ్యక్తి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ రమణ ఆ పదవి పొందిన తెలుగు వారిలో రెండో వ్యక్తి. అంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావు (జూన్ 30, 1966– ఏప్రిల్ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ సుబ్బారావు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ సుబ్బారావు సీజేఐగా ఉన్న సమయంలోనే రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజయం పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే. పొన్నవరం నుంచి.. కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆగస్టు 27, 1957న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జూన్ 27, 2000 నుంచి సెప్టెంబరు 1, 2013 వరకు కొనసాగిన జస్టిస్ రమణ కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబరు 2, 2013 నుంచి ఫిబ్రవరి 16, 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 17, 2014న పదోన్నతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉన్నారు. -
కరోనా కట్టడికి యుధ్దప్రాతిపదికన చర్యలు అవసరం..
న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్టాల సీఎంలతో వీడియో కాన్సరేన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కట్టడికి మరిన్నిచర్యలు అవసరమన్నారు. గడచిన కొన్నిరోజులుగా కేసులు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో దీని తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. ఆయా రాష్ట్రాలు అవసరమైతే లాక్డౌన్ విధించి కరోనా తీవ్రతను అదుపుచేయాలని కోరారు. దీని కట్టడి కోసం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రోజుకు దాదాపు 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. కరోనాపై ప్రభుత్వాలు ఏమాత్రం నిర్లక్క్ష్యం చేయోద్దని అన్నారు. దీనిపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకొవాలన్నారు. ప్రతిచోట ట్రేసింగ్ నిర్వహించాలని తెలిపారు. ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ మాస్క్‌ను విధిగా ధరించడం,సామాజిక దూరం, శానిటైజేషన్ వంటివి ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. కోవిడ్ టెస్టుల సంఖ్యలను పెంచాలని కోరారు. ఆర్‌టీపీసీఆర్‌ల టెస్టులను పెంచాలని అన్నారు. గడచిన 24 గంటలలో మహరాష్ట్రలో 17,864 కేసులు, కేరళ లో 1,970..పంజాబ్‌లో 1,463 కేసులు నమోదయ్యాయని తెలిపారు. చదవండి: షాకింగ్: 150మంది సాధువులకు కరోనా -
అత్యంత కలుషిత నగరాల్లో 22 భారత్‌లోనే!
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల జాబితా విడుదలైంది. దీనిప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాలు అత్యంత కలుషితమైనవిగా గుర్తించారు. దీనిలో 22 నగరాలు భారత్‌లోనే ఉండటం గమనార్హం. కాగా, స్విస్ అనే సంస్థ వరల్డ్ ఎయిర్ క్వాలీటీ ఇండెక్స్ రిపోర్ట్ - 2020ను విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా చైనాలోని జిన్జియాంగ్ తొలి స్థానంలో నిలిచింది. కాగా, దీని తర్వాత మిగతా 9 నగరాలు మనదేశానికి చెందినవే. ఇక..రెండో స్థానంలో ఘజియాబాద్, మూడో స్థానంలో బులంద్‌షహర్ ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ పదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కలుషిత రాజధాని నగరాలలో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. వీటి తర్వాత బిస్రఖ్ జలాల్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా మరియు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్, రాజస్థాన్‌లోని భీవారీ, జింద్ , హిసార్, ఫతేహాబాద్, బాంధ్వరి, గురుగ్రామ్, యమునా నగర్, హర్యానాలోని రోహ్తక్ మరియు ధారుహేరా, మరియు బీహార్‌లోని ముజఫర్‌పూర్ లు నిలిచాయి. అయితే కరోనా నేపథ్యంలో ఢిల్లీలో 2019 నుంచి 2020ల మధ్య వాయునాణ్యత 15 శాతంమెరుగుపడింది. ఈ రిపోర్ట్ 106 దేశాల నుంచి వచ్చిన పీయమ్ 2.5 డేటా ఆధారంగా తీసుకున్నారు. వీటిని ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహిస్తాయి. భారత్‌లో ప్రధానంగా వంటచెరకు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వచ్చేపోగ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. అయితే..దీనిపై గ్రీన్ ఇండియా క్యాంపెయినర్ అవినాష చంచల్ మాట్లాడుతూ..లాక్డౌన్ కాలంలో వాయునాణ్యత స్వల్పంగా పెరిగిందని అన్నారు. కాగా, ప్రభుత్వాలు ఎలక్టిక్ వాహనాలను , సైక్లింగ్, వాకింగ్, ప్రజారవాణాను ప్రొత్సహించాలని అన్నారు. అయితే, పరిశుభ్రమైన గాలిని పీల్చడంతో, ఆరోగ్యసమస్యలు దూరమవుతాయని చంచల్ అన్నారు. ప్రజలు పర్యావరణాన్ని, కాపాడుకొంటు, కాలుష్యాన్ని తగ్గించుకొవాల్సిన అవసరం ఉందని ఐక్యూ ఎయిర్సీఈవో ఫ్రాంక్ హమ్స్ తెలిపారు. చదవండి: దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు.. -
మరోసారి భగ్గుమన్న పెట్రో ధరలు
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా రెండోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. నేడు పెట్రోల్ ధరలపై రూ.0.26 పైసలు, డీజిల్ ధరలు లీటర్‌పై 27పైసల చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర రూ.89.77కు, డీజిల్ ధర రూ.83.46కు చేరింది. గత 10 రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.88.37 నుంచి రూ.89.77 మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.86.30కు చేరింది. డీజిల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.76.48కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలా ఉన్నాయి... పెట్రోల్ ధర 24 పైసలు పెరుగుదలతో రూ.92.86కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.83.30కు ఎగసింది. ఈ రేట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు.(చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!) -
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్ని కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన కొందరు వాహనదారులు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ ఉంటారు. వీరి వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందికి గురి అవుతుంటారు. అయితే ఇలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భీమా రెగ్యులేటర్ ఐఆర్డిఎఐ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది.(చదవండి: లండన్‌ను వెనక్కినెట్టిన బెంగళూరు) ట్రాఫిక్‌కు ఇన్సూరెన్స్‌కు సంబంధం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక లింకు ఉంది. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తారో.. వారి వాహనం యొక్క భీమా ప్రీమియం కూడా పెరిగిపోతుంది. ఈ కొత్త రూల్ వల్ల మీరు ట్రాఫిక్ చలనాతో పాటు మీ వెహికల్ భీమా ప్రీమియాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబందించిన తుది నివేదికను ఐఆర్డిఎఐ సిద్ధం చేసింది. తొలిసారిగా ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి రావచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ప్రీమియం సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను పరిగణలోకి తీసుకొని మీకు ప్రీమియం నిర్ణయిస్తారు. -
మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం వాహనదారుల జేబులకు చిల్లుపడుతుంది. సోమవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 84.95 రూపాయలకు చేరుకుంది. ముంబైలో లీటరుకు పెట్రోల్ ధర రూ.91.56గా ఉంది. హైదరాబాద్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై 26 పైసలు చొప్పున పెరగడంతో దీంతో లీటర్ ధర రూ.88.37కు, డీజిల్ ధర రూ.81.99గా ఉంది. పెరుగుతున్న ధరలను చూస్తుంటే త్వరలోనే హైదరాబాద్ లో పెట్రోల్ ధర 90 రూపాయలు దాటిపోయేలా కనిపిస్తుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు జనవరి 7న పెట్రోల్‌కు 0.23 రూపాయలు, లీటరుకు 0.26 డీజిల్ పెంపును ప్రకటించడంతో గత 15 రోజుల్లో రెండవసారి ధరల పెంచారు. 2020 సంవత్సరం మధ్యలో పెట్రోల్ ధర మొదటిసారిగా లీటరుకు 80 రూపాయలకు చేరుకోగా.. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇంతకుముందు అక్టోబర్ 4, 2018న అత్యధికంగా నమోదైన పెట్రోల్ రేటు లీటరుకు 84 రూపాయలు. ఐఓసిఎల్ ధరల ప్రకారం పెట్రోల్ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. చెన్నైలో రూ.87.63, కోల్‌కతాలో రూ.86.39కి చేరింది. ఇక డీజిల్ ధర ముంబయిలో రూ.81.87, చెన్నైలో రూ.80.43, కోల్‌కతాలో రూ.78.72గా ఉంది. -
మున్సిపల్ గ్రాంట్లు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు గ్రాంట్ల కింద విడుదల చేయాల్సిన మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.581.60 కోట్ల త్వరితగతిన విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏపీలోని మున్సిపాలిటీలకు రూ. 3,635.80 కోట్ల గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. మొత్తం నిధులను పట్టణాలు, నగరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల సంరక్షణ, ఆట స్థలాల అభివృద్ధి వంటి పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సించి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం మంజూరు చేసిన మొత్తం గ్రాంట్లలో ఇప్పటి వరకు రూ.3054.20 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. తదుపరి గ్రాంట్ల విడుదలకు అవసరమైన అన్ని నియమ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి వినిమయ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందన్నారు. అలాగే ఆర్థిక సంఘం నిర్దేశించిన మూడు ప్రధాన సంస్కరణలు సైతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేసిన వార్షిక అకౌంట్లను సమర్పించిందని వివరించారు. మున్సిపాలిటీల ఆదాయ వనరులను పెంపొందిచేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. నిర్దేశిత స్థాయిలో పౌర సేవల ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పౌర సేవలు నిరాటంకంగా కొనసాగించేందుకు, వారికి కనీస సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ. 581.60 కోట్ల మున్సిపల్ గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని లేఖలో ప్రస్తావించారు. -
దేశంలో తగ్గుతున్న కరోనా ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. సోమవారం పాజిటివ్ కేసులు 40 వేల కంటే తక్కువ నమోదైనట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,730కి చేరాయి. గత 24 గంటల్లో (మంగళవారం) 38,073 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు కరోనా కారణంగా 448 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,27,059 కి చేరిన్నట్టు కరోనా హెల్త్‌బులిటెన్‌లో తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి మొత్తం 79,59,406 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 92.64% గా నమోదైంది. మరణాల శాతం 1.48% గా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,05,265 గా ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రల వారీగా మరణాల సంఖ్య ఇప్పటి వరకు దేశంలో 1,27,059 మంది కరోనాకు బలయ్యారు. ఇందులో మహారాష్ట్రలో 45,325, కర్ణాటకలో 11,362, తమిళనాడులో 11,362, పశ్చిమ బెంగాల్లో 7350, ఉత్తరప్రదేశ్‌లో 7231, ఢిల్లీలో 7060, ఆంధ్రప్రదేశ్‌లో 6802, పంజాబ్‌లో 4338, గుజరాత్లో 3765 మంది మరణించారు. సోమవారం కరోనా బారినపడి 448 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో మహారాష్ట్రకు 85 మంది, ఢిల్లీలో 71 మంది, బెంగాల్లో 56 మంది, 25 మంది ఉత్తర్‌ప్రదేశ్‌లో, 22 మంది కేరళలో, 20 మంది పంజాబ్‌లో మరణించారు. కరోనా బారిన పడి మరణించిన వారిలో అధిక శాతం మంది దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఇదే అంశం స్పష్టం చేసినట్టు తెలిపారు. కేసుల సంఖ్య ఎప్పుడు..ఎలా..! దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్క్‌ను ఆగష్టు 7న , 30 లక్షల మార్క్‌ను ఆగష్టు 23న, సెప్టెంబర్ 5న 40లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్కను దాటి ప్రస్తుతం 85 లక్షల పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 11,96,15,857 కరోనా టెస్టులు నిర్వహించినట్టు, నవంబర్ 9న 10,43,665 టెస్ట్‌లు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ తెలిపింది. -
బొగ్గు స్కాంలో దోషిగా తేలిన మాజీమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేను బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలుస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతం, సీఎంల్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌లను కూడా దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 1999లో ఝార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు గనులను కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దశాబ్ధాలుగా ఈ విషయంపై విచారణ కొనసాగింది. ఈ కేటాయింపుల్లో దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్లు ప్రత్యేక కోర్టు గుర్తించింది. మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ హయంలో దిలీప్ రే ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నెల 14న దిలీప్ రేతో పాటు దోషిగా తేలిన మరో ముగ్గురుకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. చదవండి: యూఎన్‌ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్ -
ఇకపై స్విగ్గీలో స్ట్రీట్ ఫుడ్
న్యూఢిల్లీ: రోడ్డుపక్కన తినుబండారాలను త్వరలోనే తమ ఇళ్ళవద్దనే రుచి చూసే అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో కలిసి, ఈ చిన్న వీధి వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురానుంది. పైలెట్ పథకంలో భాగంగా దేశంలోని ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, ఇండోర్, వారణాసి నగరాల్లోని 250 వీధి ఆహార సరఫరా దారులతోటి ప్రారంభించి, దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది. వీధి వర్తకులు, వేలాది మంది వినియోగదారులను ఆన్లైన్లో చేరడానికి ఈ పథకాన్ని ‘ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్నిధి’ కిందకు తీసుకువస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. వీధి వర్తకులకు పాన్ కార్డ్ పొందడానికి, ఆహారభద్రతా ప్రమాణాల అథారిటీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, యాప్‌ల వినియోగంపై సహకరించనుంది. ఈ దుకాణం పెట్టుకోవడానికి, 50 లక్షల మంది వీధి వర్తకులకు రూ.10 వేల æసాయాన్ని అందించనుంది. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!) -
పొట్ట నింపుకునేందుకు పొడవాటి క్యూల్లో...
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆహారం అందుకునేందుకు పేదలు, అన్నార్తులు పడరాని పాట్లు పడుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని బద్లీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉచిత భోజనం కోసం 500 మంది ఉదయం ఆరు గంటలకే క్యూలో వేచిచూశారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 1200కు ఎగబాకింది. ఉచిత భోజనంలో పప్పు, అన్నం, కూర అందిస్తున్నారు. లంచ్ కోసం త్వరగా క్యూలో నిలుచునేందుకు తాము కొన్నిసార్లు ఉదయం ఆరు గంటలకే వస్తామని ఓ ఆటో రిక్షా డ్రైవర్ చెప్పుకొచ్చారు. లాక్డౌన్ అమలుతో జీవనోపాధి కోల్పోయిన అలాంటి వారందరికీ ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం కడుపు నింపుతోంది. పేదలకు ఉచిత లంచ్, డిన్నర్ సరఫరా కోసం ఢిల్లీ అంతటా 2500కు పైగా కేంద్రాల్లో ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 1 నుంచి రోజుకు పది లక్షల మందికి సరిపడా భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్రస్ధాయిలో పరిస్థితి గమనిస్తే చాలామంది ఉచిత భోజనం లభించక వెనుతిరిగిన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాను కొన్నిసార్లు గంటల తరబడి వేచిచూసినా తన వంతు వచ్చేసరికి భోజనం అయిపోతోందని క్యూలో నిల్చున్న ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవం వివరించారు. లంచ్‌కు కొద్దిగంట ముందే తాను ఖాళీ టిఫిన్ బాక్స్‌ను క్యూలో ఉంచుతున్నానని, అప్పటికీ తన వరకూ వచ్చేసరికి ఆహారం ఉంటుందా అనేది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉచిత భోజన పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా ప్రజలు సామాజిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకూ 1154 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. చదవండి : ఢిల్లీలో మళ్లీ భూకంపం -
గృహ హింసకు ఎర్ర చుక్క పరిష్కారం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకొచ్చిన లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటున్న ఆడవారిపైగృహ హింసకు పాల్పడుతున్న పురుషులను పట్టుకునేందుకు ఎర్ర చుక్క ఉపయోగపడుతోంది. అర చేతిలో రెడ్ డాట్ (ఎర్ర చుక్క)ను చూపిస్తూ మెయిల్ చేస్తే, బాధితురాలు ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకునేలా వెఫ్ట్ అనే ఫౌండేషన్ ఈ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎర్ర చుక్కను సోషల్ మీడియా ద్వారా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ చూపించడం లేదా 181 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయడం ద్వారా గానీ గృహ హింస జరుగుతోందని అధికారులకు తెలియజేయవచ్చని వెఫ్ట్ ఫౌండేషన్ ను ప్రారంభించిన రావత్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కొందరు మహిళలకు బయటి కంటే ఇంట్లోనే ఎక్కువ ప్రమాదం దాగి ఉందని అభిప్రాయపడ్డారు. ఎర్ర చుక్క గుర్తును ప్రపంచ వ్యాప్తం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ మహిళా కమిషన్, ఐరాస మహిళా విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. (లాక్డౌన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!) -
కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకినవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేస్తూ గుంపులు గుంపులుగా తిరగకుండా, సామాజిక దూరం పాటించే విధంగా భారత రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి 21 నుంచి ఏప్రిల్ 15 మధ్య రద్దు చేసిన రైళ్లలో ప్రయాణికులు బుక్ చేసుకున్న రైలు టికెట్ల డబ్బును 100 శాతం ప్రయాణికులకు రీఫండ్ చేయనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఇక భారత రైల్వే పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్ ఇచ్చే టికెట్ల నిబంధనలను సడలించింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆయా వ్యాలెట్లు, అకౌంట్లలో డబ్బు రీఫండ్ అవుతుందని ఇండియన్ రైల్వే తెలిపింది. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా) ఈ- టికెట్ కోసం అన్ని నియమాలు ఒకే విధంగా ఉంటాయని, ప్రయాణికులు టికెట్ వాపసు కోసం స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు పలు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్ పరిధిలోని సబ్ అర్బన్ సర్వీసులు (లోకల్ ట్రైన్స్) సంఖ్యను కూడా తగ్గించనున్నారు. చాలా తక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు రద్దు చేసిన మొత్తం రైళ్ల సంఖ్య 245కి చేరింది. (యూపీ సీఎం కీలక నిర్ణయం, 35లక్షల మందికి లబ్ధి) చదవండి: భారత్‌లో 271కి చేరిన కరోనా బాధితుల సంఖ్య -
తల్లీకూతుళ్ల దారుణ హత్య..
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని న్యూఅశోక్ నగర్లో తల్లీకూతుళ్లను దుండగులు కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఘటన వెలుగుచూసింది. మృతులను సుమిత (65), సమ్రిత (25)లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించగా ఇద్దరు వ్యక్తులు ఆ ఇంట్లోకి వెళ్లడం, బయటకు రావడం రికార్డయింది. నిందితుల్లో ఒకరు రాజస్ధాన్‌లోని జైపూర్‌కు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినయ్ అలియాస్ విక్రాంత్ నాగర్‌గా గుర్తించారు . రాజస్ధాన్ పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, తల్లీకూతుళ్ల హత్య కేసులో కొన్ని క్లూలు లభించాయని డీసీపీ(ఈస్ట్) జస్మీత్ సింగ్ చెప్పారు. కాగా సుమిత ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె కుమార్తె సమ్రిత హాస్పిటాలిటీ రంగంలో శిక్షణ పొందుతున్నారని పోలీసులు చెప్పారు. కాగా సుమిత భర్త 20 ఏళ్ల కిందటే మరణించారని, సమ్రిత కోసం వచ్చిన వ్యక్తే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని స్ధానికులు చెబుతున్నారు. నిందితులు సమ్రిత కారులోనే పరారయ్యారని వారు పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. -
షహీన్‌బాగ్‌లో నిషేధాజ్ఞలు..
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన షహీన్‌బాగ్‌లో 144వ సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను తరలించామని ఢిల్లీ జాయింట్ కమిషనర్ డీసీ శ్రీవాస్తవ వెల్లడించారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో మరోసారి ఎలాంటి ఉద్రిక్తతలు తల్తెతకుండా శాంతి భద్రతలను సవ్యంగా నిర్వహించాలనే ఉద్దేశంతో షహీన్‌బాగ్‌లో ఈ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. 1000 మంది జవాన్లతో పాటు 12 కంపెనీ పారామిలటరీ బలగాలను షహీన్‌బాగ్‌కు రప్పించారు. ఈ ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదని, వారి నిరసనలను విరమించాలని, ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. చదవండి : సామరస్యం మిగిలే ఉంది! -
ఢిల్లీ అల్లర్లు : రాహుల్, ప్రియాంకలపై పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : డిల్లీ అల్లర్లకు సంబంధించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలపై చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం,ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఏఏ వ్యతిరేక నిరసనల వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పైనా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరిగౌతమ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సి హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ ఢిల్లీ ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఇక సామాజిక కార్యకర్తలు హర్ష్ మందర్, ఆర్జే సయేనా, నటి స్వర భాస్కర్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సంజీవ్ కుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సోనియా, రాహుల్, ప్రియాంక, ఓవైసీ సోదరులు, వారిస్ పఠాన్, మనీష్ సిసోడియా, అమనతుల్లా ఖాన్, మహ్మద్ ప్రచాలు ద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ లీగల్ సెల్ సభ్యులు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. చదవండి : ఢిల్లీ పోలీసులపై మాలివాల్ అసంతృప్తి -
‘కేజ్రీవాల్‌కు డబుల్ పనిష్మెంట్’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఆప్ నేతలు దోషులుగా తేలితే రెండింతలు శిక్ష ఉండాలన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఎద్దేవా చేశారు. అసలు ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌నూ శిక్షించాలని దుయ్యబట్టారు. ఐబీ ఉద్యోగి హత్యోదంతంలో ఆప్ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్‌పై కేసు నమోదైన క్రమంలో మనోజ్ తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డబుల్ పనిష్మెంట్ అంటే..ఇప్పుడు తాహిర్‌తో పాటు ఆయన బాస్‌ను కూడా కఠినంగా శిక్షించాలి..ఐబీ అధికారిని అమానుషంగా కత్తితో 400 సార్లు పొడిచి చంపిన ఈ కేసులో నిందితులను, కుట్రదారులను నిర్ధిష్ట కాలపరిమితి విధించి ఉరితీయాల’ని మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ అల్లర్లలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై కౌన్సిలర్ తాహిర్ హుసేన్‌ను ఆప్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఐబీ అధికారిని తాహిర్ హుస్సేన్ మనుషులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకువెళ్లారని బాధితుడి కుటుం సభ్యులు సైతం ఆరోపించారు. ఐబీ అధికారి మృతదేహం ఆ తర్వాత చాంద్‌బాగ్ ప్రాంతంలోని డ్రైనేజ్‌లో లభ్యమైంది. ఈ హత్య కేసులో ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి : అంకిత్ శర్మ హత్య: తాహిర్పై ఆప్ వేటు -
ఢిల్లీ పోలీస్ చీఫ్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్ శనివారం పదవీవిరమణ చేయనున్నారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఆర్పీఎఫ్ నుంచి స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు)గా హోంమంత్రిత్వ శాఖ శ్రీవాస్తవను తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆయనకు ఢిల్లీ పోలీస్ చీఫ్ బాధ్యతలను కట్టబెట్టారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరింది. చదవండి : ఐబీ అధికారి హత్య : గంటల తరబడి అరాచకం -
సీఏఏ అల్లర్లు : సీబీఎస్ఈ పరీక్ష వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం జరగాల్సిన సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసినట్టు అధికారులు వెల్లడించారు. సీఏఏ ఆందోళనలతో నెలకొన్న ఉద్రిక్తతను పురస్కరించుకుని ఢిల్లీ ప్రభుత్వం వినతి మేరకు విద్యార్ధులు, సిబ్బంది, తల్లితండ్రులకు తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి బుధవారం తెలిపారు. మరోవైపు సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. ఈశాన్య ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటించారు. ఢిల్లీలో ప్రస్తుతం పరిస్ధితి పూర్తి అదుపులో ఉందని చెప్పారు. -
ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏపై ఢిల్లీలో అల్లర్లు తీవ్రరూపం దాల్చి మృతుల సంఖ్య బుధవారం 20కి చేరడంతో పాటు క్షతగాత్రుల సంఖ్య 150కి పెరిగింది. అల్లర్లను తక్షణమే నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి..సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సోదరభావాలను సంయమనంతో అన్ని సమయాల్లో కొనసాగించాలని అభ్యర్ధిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలో సత్వరమే శాంతి, సాధారణ పరిస్ధితులు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల వెనుక నజీర్, చెను గ్యాంగ్‌లకు చెందిన 12 మంది ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. గత మూడురోజులుగా దుండగులు 600 రౌండ్ల బుల్లెట్లను కాల్చినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఖజౌరీ ఖాస్‌లో అల్లరి మూకలు ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మను బలితీసుకున్నాయని పోలీసులు తెలిపారు. కాగా ఢిల్లీలో చెలరేగిన హింసను అదుపు చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. చదవండి : సీఏఏపై వెనక్కి వెళ్లం -
హస్తినలో ఆగని ఘర్షణలు
-
సీఏఏపై మళ్లీ భగ్గుమన్న ఢిల్లీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని మౌజ్‌పూర్, బాబర్పూర్, గోకుల్‌పురి తదితర ప్రాంతాల్లో తాజాగా అల్ల్రర్లు చెలరేగడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణల్లో ఇప్పటివరకూ హెడ్ కానిస్టేబుల్ సహా ఏడుగురు మరణంచారు. కాగా, ఘర్షణల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని పది ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హింస చెలరేగిన క్రమంలో 35 కంపెనీల పారామిలటరీ బలగాలతో పాటు స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సహా ఆర్థిక నేరాల విభాగం అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిసర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి ఈశాన్య ఢిల్లీలో మోహరించారు. కాగా హింసాకాండలో మరణించిన ఇద్దరు పౌరులను షాహిద్, పుర్ఖాన్‌లుగా గుర్తించారు. ఘర్షణలల్లో పది మంది పోలీసులు గాయపడగా, పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ రతన్ లాల్ ప్రాణాలు కోల్పోయారు. చదవండి : ‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’ -
సీఏఏ రగడ : హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. గోకుల్‌పురి ప్రాంతంలో ఆదివారం జరిగిన రాళ్లదాడిలో తీవ్ర గాయాలైన ఢిల్లీ హెడ్‌కానిస్టేబుల్ రతన్ లాల్ మరణించగా, డీసీపీ షహ్దారా, అమిత్ శర్మలకు గాయాలయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. రతన్ లాల్ ఢిల్లీ ఎస్పీ కార్యాలయంలో రీడర్ విధులు నిర్వహిస్తున్నాడని ఏసీపీ వెల్లడించారు. పరస్పర రాళ్ల దాడులు, ఘర్షణల్లో 37 మందికి గాయాలయ్యాయి. అల్లరి మూకలు షాపులు, ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశాయి. ఆందోళనకారులు భజన్‌పురాలో పెట్రోల్ పంపు వద్ద నిలిచిన కారును, అగ్నిమాపక యంత్రాన్ని దగ్ధం చేశారు. మరోవైపు దేశ రాజధానిలో సోమవారం సైతం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. మౌజ్‌పూర్, కర్దాంపురి, చాంద్‌బాగ్, దయాళ్‌పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులతో పాటు ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కర్ధాంపురిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. చదవండి : సీఏఏ సెగ: మెట్రోకు బ్రేక్ -
రాజధానిలో మళ్లీ సీఏఏ రగడ
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇరు వర్గాలు నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. దుండగులు కొన్ని ఇళ్లపైన కూడా రాళ్లు రువ్వారు. ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆదివారం కూడా మౌజ్‌పూర్ ప్రాంతంలో ఇరు వర్గాలు రాళ్ల దాడులకు దిగాయి. మౌజ్‌పూర్ చౌక్‌కు బీజేపీ నేత కపిల్ మిశ్రా చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. జఫరాబాద్ ప్రాంతంలోనూ సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు బాహాబాహీకి దిగాయి, బహజన్‌పురాలో కొందరు రాళ్లదాడికి పాల్పడుతూ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పుపెట్టారు. ఇక్కడ చదవండి: ‘సీఏఏ’ వర్గాల మధ్య ఘర్షణ చదవండి : సీఏఏ సెగ: మెట్రో స్టేషన్ తాత్కాలికంగా మూసివేత -
‘జేఎన్‌యూ దాడి మా పనే’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన ముసుగు దుండగుల భీకర దాడి తమ పనేనని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జాతి విద్రోహ, హిందూ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నందునే ఆదివారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లోకి హిందూ రక్షా దళ్ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారని ఆ సంస్థ నేత భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి చెబుతున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో ఇనుప రాడ్లతో వీడియోలో కనిపించిన సాయుధ దుండగులు ఇద్దరు ఆరెస్సెస్‌కు చెందిన విద్యార్థి సంఘ నేతలేనని ఏబీవీపీ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి అనిమా సోంకర్ అంగీకరించిన నేపథ్యంలో ఈ ట్విటర్ వీడియో వెలుగుచూడటం గమనార్హం. ‘జేఎన్‌యూ కమ్యూనిస్ట్‌లకు హబ్‌లా మారింది..ఇలాంటి హబ్‌లను మేం సహంచం..వారు మా దేశాన్ని మతాన్ని దూషిస్తూన్నా’రని తోమర్ ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు తలపెడితే ఇతర యూనివర్సిటీల్లోనూ ఇవే చర్యలు పునరావృతమవుతాయని ఆయన హెచ్చరించారు. జేఎన్‌యూ విద్యార్ధులు ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడి తిండి తింటూ వర్సిటీలో చదువుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జేఎన్‌యూ దాడి ఘటనలో పాల్గొన్నది తమ కార్యకర్తలేనని, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.మరోవైపు తోమర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ముసుగు దుండగులను గుర్తించేందుకు వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ఆదివారం సాయంత్రం చొచ్చుకువచ్చిన ముసుగు దుండగులు విచక్షణారహితంగా విద్యార్ధులు,ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి : ఆ రోజుల్లో తుక్డే-తుక్డే గ్యాంగ్‌ను చూడలేదు: కేంద్ర మంత్రి -
మంచు దుప్పటిలో రాజధాని : పలు రైళ్లు జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ వెళ్లే పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఫైజాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు మంగళవారం ఉదయం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్ధాయి ప్రమాదకర స్ధాయికి చేరడంతో వెరీపూర్ క్యాటగిరీగా నిర్ధారించారు. శీతలగాలులకు తోడు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచాయి. పొగమంచు తాకిడితో రహదారులు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
జేఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాస్క్‌లు ధరించిన కొందరు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో విద్యార్థి సంఘం నేతతో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. తమపై దాడికి తెగబడిన గూండాలు ఇప్పటికీ క్యాంపస్ హాస్టల్స్‌లోనే ఉన్నారని విద్యార్ధులు ఆరోపించారు. క్యాంపస్‌లో దుండగులు భయోత్పాతం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చోద్యం చూశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్ మూన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఏబీవీపీ గూండాలే తమపై దాడికి తెగబడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించగా, వామపక్ష విద్యార్ధులు తమ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముసుగు ధరించిన 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించి హాస్టల్ రూమ్‌ల్లోకి చొరబడి విద్యార్ధులను చితకబాదారు. కనిపించిన ప్రొఫెసర్లపై సైతం వారు విరుచుకుపడ్డారు. -
బ్రేకింగ్ : ప్రధాని నివాసంలో అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని 7 లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని నివాసంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్ధలానికి తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటనా ప్రాంతానికి హుటాహుటిన అంబులెన్స్‌లు చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.కాగా, ప్రధాని అధికారిక నివాసంలో ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎల్‌కేఎం కాంప్లెక్స్‌లోని ఎస్పీజీ రిసెప్షన్ ప్రాంతంలో స్పల్వ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది. -
పొగమంచుతో నిలిచిన ట్రాఫిక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం నెలకొంది. మంచు కప్పేయడంతో రహదారి కనిపించక ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో కాలవలో కారు పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. మంచు ప్రభావంతో ఐదు విమానాలు రద్దవగా, 500 విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంది. ఢిల్లీ మీదుగా రావాల్సిన 21 విమానాలను దారిమళ్లించారు. ఇక దాదాపు 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశరాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరుకుంది. మంచు కారణంగా రహదారులు కనిపించక మెయిన్ రోడ్లపై వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. -
పౌర రగడ : మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటడంతో దేశ రాజధానిలో మొబైల్ సేవలు, ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాలతో పాటు సమస్యస్మాతక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సర్వీసులను నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ సహా టెలికాం ఆపరేటర్లను కోరారు. పోలీసుల ఆదేశాలతో ఉత్తర, మధ్య జిల్లాల్లోని పలు ప్రాంతాలు, మండీ హౌస్, సీలంపూర్, జఫ్రాబాద్, ముస్తఫాబాద్, జామియా నగర్, షహీన్ బాగ్, బవానా ప్రాంతాల్లో ఆయా సేవలను నిలిపివేశామని ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కువ మంది గుమికూడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కాగా కనెక్టివిటీ ఫిర్యాదులపై టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ ట్విటర్లో స్పందించింది. ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చిన సూచనల మేరకే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, డేటా సర్వీసులను ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నిలిపివేశామని, ఈ ఉత్తర్వులను ఎత్తివేసిన తర్వాత సాధారణ సేవలను పునరుద్ధరిస్తామని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. మరోవైపు పౌర చట్టంపై నిరసనలను హోరెత్తడంతో ఢిల్లీ మెట్రో 19 స్టేషన్లను మూసివేసింది. మెట్రో స్టేషన్లను మూసివేసిన క్రమంలో ట్రాఫిక్ జామ్‌లు ఇవిపరీతంగా పెరిగాయి. ఇక ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దును పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రాజకీయ, సామాజిక కార్యకర్త యోగీంద్ర యాదవ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. -
ఇండియా గేట్ వద్ద యువకుడి సజీవ దహనం
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద ఓ యువకుడు తనకుతాను నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. ఇండియా గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం పాతికేళ్ల యువకుడు తనకు తాను నిప్పంటించుకోగా అక్కడికి దగ్గరలో ఉన్న ఢిల్లీ పోలీసులకు చెందిన పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్‌లో బాధితుడిని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. యువకుడికి 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా, బాధిత యువకుడిని ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనకు పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
‘అది మరో జలియన్ వాలాబాగ్’
ముంబై : జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసుల చర్యను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. వర్సిటీలో పోలీసుల దమనకాండను జలియన్ వాలాబాగ్ ఊచకోతతో పోల్చారు. యువశక్తి బాంబు వంటిదని, దానితో చెలగాటం తగదని హెచ్చరించారు. మహారాష్ట్రలో అధికార పంపకంపై గతంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన వైరిపక్షాలుగా మారిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా వర్సిటీ విద్యార్ధుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి వారిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మరోవైపు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు క్యాంపస్‌లోకి చొచ్చుకువచ్చి తమను అకారణంగా చితకబాదారని విద్యార్ధులు చెబుతున్నారు.పోలీసులు తమపై లాఠీచార్జ్‌కు దిగడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించి క్యాంపస్‌లో భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. జామియా మిలియా క్యాంపస్‌లో పోలీసుల దమనకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. -
‘వర్సిటీలో ఆగని పౌర చిచ్చు’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన తెలుపుతున్న విద్యార్ధులు, పోలీసుల మధ్య ఘర్షణతో ఆదివారం వర్సిటీ రణరంగాన్నితలపించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. మరోవైపు పోలీసులు తమ ఆందోళనను బలప్రయోగంతో అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని విద్యార్ధులు ఆరోపించారు. మరోవైపు పౌర నిరసనలను కవర్ చేసేందుకు వచ్చిన తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని బీబీసీ జర్నలిస్ట్ బుస్రా షేక్ ఆరోపించారు. మగ పోలీసులు తనను జుట్టుపట్టి లాగారని, లాఠీతో కొట్టి తన ఫోన్‌ను గుంజుకున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు తనను దుర్భాషలాడారని, తాను తమాషా కోసం ఇక్కడికి రాలేదని విద్యార్ధుల ఆందోళనను కవర్ చేసేందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఇక పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దక్షిణ ఢిల్లీలో ఆందోళనకారులు మూడు బస్‌లను తగలపెట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు వస్తున్న ఫైరింజన్‌ను అడ్డుకుని ధ్వంసం చేశారు. -
భగ్గుమంటున్న దేశ రాజధాని
-
భగ్గుమంటున్న దేశ రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కు చెందిన రెండు బస్సులను దగ్ధం చేశారు. భరత్ నగర్లో డీటీసీ బస్‌కు ఆందోళనకారులు నిప్పంటించగా ఆ ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. మరోవైపు ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుంటుండగా ఓ ఫైరింజన్‌ను జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డగించి ధ్వంసం చేశారని ఢిల్లీ ఫైర్ సర్వీసు అధికారులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న మధురా రోడ్డుకు వెళ్లకుండా ఆ మార్గాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. ఫైరింజన్‌ను దగ్ధం చేసిన ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో సరితా విహార్‌కు వెళ్లే ఓఖ్లా అండర్‌పాస్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రహదారి నిర్బంధంతో బదార్పూర్, ఆశ్రమ్ చౌక్ నుంచి వచ్చే వాహనాలను దారిమళ్లించారు. చదవండి: ‘పౌరసత్వం’ అపోహలు.. నిజాలు తెలుసుకోండి..! -
ఉల్లి షాక్ నుంచి ఉపశమనం..
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఉల్లి ధరలతో సామాన్యుడు బెంబేలెత్తుతుంటే వీటి ధరలు క్రమంగా దిగివస్తాయనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఉల్లి సరఫరాలు మెరుగవడంతో పాటు ఆప్ఘనిస్తాన్, టర్కీల నుంచి దిగుమతవుతున్న ఉల్లితో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్లో గత వారం కిలో ఉల్లి రూ 65 నుంచి 80 వరకూ పలుకగా, ఈ వారం రూ 50-75కే పరిమితమైంది. రాజధానిలోని దేశంలోనే అతిపెద్దదైన కూరగాయల మార్కెట్ ఆజాద్‌పూర్ మండీకి దేశీ ఉల్లితో పాటు 200 టన్నుల దిగుమతులు చేరుకోవడంతో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గత రెండు రోజులుగా 80 ట్రక్కుల ఉల్లి ఆప్ఘనిస్తాన్, టర్కీల నుంచి చేరుకుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఆప్ఘన్ ఉల్లిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక పలు నగరాలు, పట్టణాల్లోనూ ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గడంతో ఉల్లి ఘాటు నుంచి త్వరలోనే ఉపశమనం కలుగుతుందన్న అంచనాలు వెల్లడవుతున్నాయి. -
‘ఢిల్లీ కాలుష్యానికి పాక్, చైనాలే కారణం’
మీరట్ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రతకు పాకిస్తాన్, చైనాలే కారణమని యూపీ బీజేపీ నేత నిందించారు. భారత్‌లోకి ఈ రెండు పొరుగు దేశాలు విష వాయువులను వదిలిఉండవచ్చని బీజేపీ నేత వినీత్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. భారత్ అంటే భయపడుతున్న పాకిస్తాన్, చైనాలు ఈ చర్యకు పాల్పడిఉండవచ్చని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పాక్ కుయుక్తులను నిరోధిస్తుండటంతో పొరుగు దేశానికి దిక్కుతోచడం లేదని దుయ్యబట్టారు. పాకిస్తాన్ విషపూరిత వాయువులను విడుదల చేసిందా అనే కోణంలో మనం పరిశీలించాల్సిన అవసరం ఉందని వినీత్ అగర్వాల్ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో కాలుష్య తీవ్రతకు పొరుగు రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్ధాలను తగులబెట్టడం కారణమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న వాదన అర్థరహితమని అన్నారు. దేశానికి రైతు వెన్నెముకని, రైతులను, పరిశ్రమలను నిందించడం తగదని వినీత్ అగర్వాల్ చెప్పారు. -
కాలుష్య తీవ్రతతో అమల్లోకి సరి-బేసి విధానం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరడంతో వాహనాల నియంత్రణ కోసం సరి-బేసి విధానం సోమవారం ఉదయం నుంచి తిరిగి అమల్లోకి వచ్చింది. తమ కుటుంబాలు, పిల్లలను కాపాడుకునేందుకు ఈ పద్ధతికి సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తల్లితండ్రులను కోరారు. నవంబర్ 15 వరకూ సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం నుంచి ద్విచక్రవాహనాలు, ఎలక్ర్టిక్ వాహనాలను మినహాయించారు. 12 ఏళ్లలోపు చిన్నారులతో కూడిన మహిళలు నడిపే వాహనాలకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. రాష్ట్రపతి, ప్రధాని, ఎమర్జెన్సీ సహా 29 కేటగిరీలకు చెందిన వాహనాలను కూడా ఈ విధానం నుంచి మినహాయించారు. ఢిల్లీ సీఎం, మంత్రుల వాహనాలకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేకపోవడం గమనార్హం. సరి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే రూ 4000 జరిమానా విధిస్తారు. నగరమంతటా ఈ విధానం పకడ్బందీగా అమలు చేసేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులతో కూడిన 600కి పైగా టీంలను రహదారులపై నియోగించారు. ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తిరిగి సరి- బేసి విధానాన్ని అమలుచేయడాన్ని వాహనదారులు స్వాగతించారు. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్ధాలను తగలబెట్టడం ఆపివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలతో కాలయాపన చేయకుండా కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో ఢిల్లీలో నివసించేందుకు జనం భయపడుతున్నారు. సంక్లిష్ట సమయంలో తాము మరో నగరానికి వెళ్లే యోచనలో ఉన్నామని 40 శాతం మంది ఢిల్లీ వాసులు ఓ సర్వేలో పేర్కొనడం గమనార్హం. -
అమెరికన్‌కు క్యాబ్‌డ్రైవర్ టోకరా
న్యూఢిల్లీ : వరుస పండుగలతో ఢిల్లీలో వాణిజ్య సంస్థలను మూసివేశారని ట్యాక్సీ డ్రైవర్ ఓ అమెరికన్‌ను రూ 90,000కు టోకరా వేసిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికా జాతీకయుడు జార్జ్ వన్మిటర్ ఈనెల 18న ఢిల్లీకి చేరుకుని తాను బుక్ చేసుకున్న హోటల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీ డ్రైవర్‌ను సంప్రదించగా పండగల నేపథ్యంలో సిటీలో షట్‌డౌన్ కొనసాగుతోందని నమ్మించే ప్రయత్నం చేశాడు. టూరిస్ట్‌ను నకిలీ ట్రావెల్ ఏజెన్సీ వద్దకు తీసుకువెళ్లి తన టూర్‌ను తిరిగి ప్లాన్ చేసుకునేలా చేశాడు. తాను పహర్‌గంజ్‌లోని ఓ హాటల్లో రూమ్‌ను బుక్ చేసుకోగా అక్కడికి తీసుకువెళతానని చెప్పిన ట్యాక్సీ డ్రైవర్ కన్నాట్‌ప్లేస్‌లోని నకిలీ ట్రావెల్ ఏజెన్సీకి తీసుకువెళ్లాడని, అక్కడి సిబ్బంది కూడా తనకు నగరంలో షట్‌డౌన్ ఉందని , పహర్గంజ్లో తాను బుక్ చేసిన హోటల్‌ను కూడా మూసివేశారని చెప్పారని బాధితుడు తెలిపారు. అక్కడి నుంచి తనను నిందితుడు మరో నకిలీ టూర్ ఏజెన్సీ వద్దకు తీసుకువెళ్లగా, వారు తనకు జైపూర్, ఆగ్రాలోని హోటల్స్‌లో రూమ్ బుక్ చేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి డబ్బు చెల్లించి తాను ఆగ్రా వెళ్లానని చెప్పారు. ఆగ్రా వెళ్లిన తర్వాత వారు చేసిన మోసం గుర్తించి ఢిల్లీలోని హోటల్‌కు తాను చెల్లించిన డబ్బును వెనక్కిఇవ్వాలని కోరానని తెలిపారు. అమెరికన్ జాతీయుడ్ని మోసం చేసిన ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. -
జైలుకు పంపారనే కోపంతో..
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో జైలుకు పంపారనే కోపంతో స్ధానికులు, పోలీసులకు బుద్ధి చెప్పాలని పార్క్ చేసిన వాహనాలను దగ్ధం చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రోహణి ప్రాంతంలోని ఖంజవాలా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 23 రాత్రి పార్క్ చేసిన వాహనాలను దగ్ధం చేసిన ఘటనలు వరసగా మూడు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 12కు పైగా కార్లు, రెండు ద్విచక్రవాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారని పోలీసులు చెప్పారు. మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆకాష్ (19), కుల్దీప్(30)లు ఈ నేరానికి పాల్పడినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారని చెప్పారు. కాగా మద్యానికి బానిసైన ఆకాష్‌ను గతంలో ఓ బాధితురాలి ఫిర్యాదుపై జైలుకు తరలించారు. జైలు నుంచి తిరిగివచ్చిన అనంతరం తనను జైలుకు పంపిన స్ధానికులపై కుల్దీప్తో కలిసి పగ తీర్చుకోవాలని పథకం ప్రకారం కాలనీల్లో పార్క్ చేసిన వాహనాలను దగ్థం చేయాలని నిర్ణయించుకున్నాడు. తమ పథకంలో భాగంగా సెప్టెంబర్ 23 రాత్రి జేజే కాలనీలో మూడు కార్లు, ఒక బైక్‌కు నిప్పంటించి పరారయ్యారు. తిరిగి మరుసటి రోజు రాత్రి భగత్ సింగ్ కాలనీ, శివ్‌విహార్‌లో రెండు కార్లు, నాలుగు బైక్‌లకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. -
కార్పొరేట్ పన్నుకోత : దేవతలా ఆదుకున్నారు
న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర సర్కార్ కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకొని మార్కెట్లో జోష్ నింపిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మందగమనంలో ఉన్న ఉపాధి రంగానికి ఊతమిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మందగమనంతో డీలా పడ్డ ముఖ్యమైన రంగాలకు ఊరట లభించింది. కాగా, కన్స్యూమర్, రిటైల్, నిర్మాణం వంటి రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వ, పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ప్రధానంగా భారీగా అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో చిక్కుకున్న ఆటో పరిశ్రమ ఉపశమనం లభించినట్ల యిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మ్యాన్ పవర్ సర్వీసెస్ ఇండియా ప్రెసిడెంట్ మన్మీత్ సింగ్ మాట్లాడుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పోరేట్ పన్నుకోత తయారీ రంగంలో పెట్టుబడులు పెరిగి లక్షలాది ఉద్యోగ కల్పనకు సాధ్యపడుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంనుంచి కోలుకునే ఆశలు కోల్పోతున్న తరుణంలో, నిర్మలా సీతారామన్ నిజమైన లక్ష్మీ దేవత అవతారంలో ఆదుకున్నారని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా ప్రశంసించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలని ప్రార్థిస్తున్న లక్షలాదిమంది భారతీయుల్లో ఆశలునింపారని, మూలధన వ్యయ పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగాలు సృష్టికి ఈ చర్య సహాయ పడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాజా నిర్ణయంతో ఇప్పుడే దీపావళి వచ్చినట్లుందని మహేంద్ర అండ్ మహేంద్ర ఎండీ పవన్ గోయంకా ట్వీట్ చేశారు. మరోవైపు కాంటినెన్షియల్ ఇండియా టైర్ల కంపెనీకి చెందిన ప్రశాంత్ దొరస్వామి స్పందిస్తూ పెట్టుబడులకు ఎంతో ఉపకరిస్తుందని ఉపాధి రంగానికి సానుకూల అంశమని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందేనని అయితే పెట్టుబడులు పెరిగినప్పుడే అనుకున్న లక్ష్యాలు సిద్ధిస్తాయని ఆదిత్య బిర్తా గ్రూపుకు చెందిన సంతృప్త మిశ్రా అన్నారు. ప్రభుత్వం తీసుకున్న పన్ను మినహాయింపులు, అందులో తమ కంపెనీకి చెందిన చాలా ఉత్పత్తులు ఉండడం హర్షించదగ్గ విషయమని డాబర్ కంపెనీకి చెందిన హెచ్ఆర్ వికృష్ణన్ అన్నారు. ఉద్యోగులు జీతాల పెరుగుదలకు మరికొంత సమయం వేచి చూడక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రూ లక్ష కోసం కుమార్తెను అమ్మిన తల్లి
న్యూఢిల్లీ : రూ లక్ష కోసం కన్న కుమార్తె(15)ను వేశ్యా గృహానికి తల్లి విక్రయించగా బాధిత బాలికను ఢిల్లీ మహిళా కమిషన్ కాపాడిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించారు. సోదరి ఇంటికి తీసుకువెళతానని చెప్పి కుమార్తె నిషా (పేరు మార్చాం)ను ఈనెల 8న తల్లి నిజాముద్దీన్‌లో ఓ హోటల్‌కు తీసుకువెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్ధుల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదిరిన అనంతరం నిషా తల్లి బాధిత బాలికను అతడితో వెళ్లాలని, షాహిద్ అనే వ్యక్తి ఇంటికి తీసుకువెళతాడని చెప్పింది. అయితే బాలికను ఢిల్లీలోని భవానా గ్రామం ఐశ్వర్ కాలనీలోని తన ఇంటికి షాహిద్ తీసుకువెళ్లాడు. షాహిద్ ఇంటిలో ఉన్న ఇతర బాలికలు బాధితురాలిని అసలు విషయం చెప్పారు. రూ లక్షకు నిషాను ఆమె తల్లి అమ్మేసిందని ఆ సొమ్ము వారికి తిరిగివచ్చేవరకూ ఈ నరకకూపంలో ఉండాలని వెల్లడించారు. ఒక్కరోజులోనే అక్కడి నుంచి తప్పించుకున్న నిషా స్ధానికుల సహకారంతో ఢిల్లీ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఆశ్రయించారు. మహిళా కమిషన్ బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుని బాలికను స్ధానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ కేసులో నిషా తల్లి సహా నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని, సవతి తండ్రి పాత్రపైనా దర్యాప్తు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పోలీసులను కోరారు. -
మెట్రో రైలుకు ఎదురెళ్లి..ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ : కదులుతున్న రైలు ముందుకు దూకి మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఢిల్లీ మెట్రో మోడల్ టౌన్ స్టేషన్లో వెలుగుచూసింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఉదంతం స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వేగంగా స్టేషన్ వద్దకు దూసుకొస్తున్న మెట్రో రైలుకు ఎదురుగా 26 సంవత్సరాల మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత మహిళను ఢిల్లీలోని పహల్‌గంజ్‌లో నివసించే అకౌంటెంట్ మీనాక్షి గార్గ్‌గా గుర్తించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని రాసిఉన్న సూసైడ్ నోట్‌ను ఘటనా స్ధలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. కాగా ఆమె వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలో ఢిల్లీ మెట్రోలో ముగ్గురు ఆత్మహత్మ పాల్పడటం గమనార్హం. సెప్టెంబర్ 2న జందేలవలన్ స్టేషన్లో 45 ఏళ్ల మహిళ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడగా, మరుసటి రోజే 22 సంవత్సరాల ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు అక్షర్ధామ్, నొయిదా ఎలక్ర్టానిక్ సిటీల మధ్య వేగంగా దూసుకెళుతున్న మెట్రో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. -
అరెస్ట్ వారెంట్.. షమీ బెయిల్ ప్రయత్నాలు
న్యూఢిల్లీ : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పై కోల్‌కతాలోని అలిఫోర్ కోర్టు గత సోమవారం అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్ టూర్ సందర్భంగా అమెరికా వెళ్లిన షమీ అక్కడి నుంచే బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. షమీ అమెరికాలో ఉండిపోవడంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. "వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న షమీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. సెప్టెంబర్ 12న షమీ భారత్‌కు తిరిగి రానున్నాడని, అంతవరకు తన లాయర్ సలీమ్ రెహమాన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని బోర్డు సభ్యుల్లో ఒక అధికారికి తెలిపినట్లు సమాచారం అందించాడు. కోర్టు షమీపై వేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు బీసీసీఐ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోదని" వెల్లడించారు. మహ్మద్ షమీ తనను వేదిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో గతేడాది కొద్ది రోజుల పాటు బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ నిమిత్తం షమీ న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. షమీకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం షమీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ సందర్భంగా షమీ భార్య హసీన్ జహాన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాక్ష్యాలన్నీ తనకూ అనుకూలంగా ఉన్నాయని, ఈ కేసు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ షమీ తప్పించుకోలేడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అద్భుతంపై నా గురి: గగన్
న్యూఢిల్లీ: వరుసగా ఐదోసారి ఒలింపిక్స్ బరిలో నిలువాలనుకుంటున్నట్లు వెటరన్ షూటర్ గగన్ నారంగ్ చెప్పారు. టోక్యో కోసం సన్నాహాలు ప్రారంభించిన తను ‘అద్భుతం’పై గురిపెట్టినట్లు చెప్పాడు. ‘నేను ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. టోక్యో వెళ్లేది లేనిది త్వరలో ప్రారంభమయ్యే పోటీలే చెబుతాయి. వచ్చే నెలలో మాకు సెలక్షన్ ట్రయల్స్ ఉన్నాయి. అక్కడ అద్భుతం జరిగితే ఆసియా చాంపియన్‌షిప్‌కు ఎంపికవుతా. అక్కడ్నుంచి ఒలింపిక్స్ దాకా మరెంతో దూరం ప్రయాణించాల్సి వుంటుంది’ అని లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత నారంగ్ అన్నాడు. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఈ తెలంగాణ సీనియర్ షూటర్ ‘గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్’ ద్వారా యువ షూటర్లకు శిక్షణ ఇస్తున్నాడు. గత కొన్నేళ్లుగా పలు నగరాల్లో షూటింగ్ కేంద్రాలను నెలకొల్పారు. ఎట్టకేలకు నారంగ్ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డుకు ఎంపిక చేసింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌ను తొలగించడంతో బాయ్‌కాట్ ప్రతిపాదనను నారంగ్ తప్పుబట్టారు. అది సరైన నిర్ణయం కాదన్నాడు. కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ప్రతి దశలోని కోచ్‌లకు ఇవ్వాలన్నాడు. -
సెలెక్షన్స్‌కు అందుబాటులో ఉన్నా: మిథాలీ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టుతో స్వదేశంలో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథాలీ రాజ్‌ను టి20 జట్టులోకి ఎంపిక చేస్తారో లేదో అనుమానంగా ఉంది. జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 5న సెలెక్టర్లు సమావేశం కానున్నారు. 36 ఏళ్ల మిథాలీ 2021 వన్డే వరల్డ్ కప్‌లో ఆడతానని చెప్పినా... టి20 ఫార్మాట్లో మాత్రం ఆమెను జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ‘దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు నేను అందుబాటులో ఉన్నాను. అయితే వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతమైతే ఒక్కో సిరీస్‌పైనే దృష్టి పెట్టాను’ అని మిథాలీ తెలిపింది. ‘మిథాలీ గొప్ప క్రికెటర్. కానీ టి20 కెరీర్‌పై ఆమె తొందరగానే ఓ నిర్ణయం తీసుకోవాలి. టి20 వరల్డ్ కప్ మరో ఆరు నెలల్లోనే ఉంది. ఈలోపు కొంతమంది యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలి. మిథాలీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి’ అని బీసీసీఐ అధికారొకరు తెలిపారు. -
ముగిసిన జైట్లీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 66 సంవత్సరాల అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో బాధపడుతున్నారు. -
పోటెత్తిన వరద : వంతెన మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుండటంతో లోహ పులిగా పేరొందిన పాత ఇనుప బ్రిడ్జిపై వాహన రాకపోకలను సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. యమున నదిలో ప్రమాదస్ధాయి 205.33 మీటర్లు కాగా నది ప్రవాహం 205.20 మీటర్లకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యమున నది ప్రవాహం మరింత పెరుగుతుందనే అంచనాలతో పురాతన ఇనుప వంతెనను మూసివేయాలని జిల్లా మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేశారని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేసిన తర్వాత యమునా నదికి వరద ప్రవాహం పోటెత్తింది. మరోవైపు వరద తీవ్రతతో ఢిల్లీలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
నోట్లరద్దు అక్రమార్కులపై ఐటీశాఖ నజర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో జరిగిన అక్రమ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ 17 పాయింట్ల చెక్లిస్ట్ను విడుదల చేసింది. లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకునే క్రమంలో సమన్వయంతో పని చేస్తున్నామని ఆదాయపు శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) తెలిపింది. పన్ను చెల్లింపుదారుడు తన నిజాయితీని నిరూపించుకునే నిబంధనను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 31, 2016 వరకు జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. అక్రమ లావాదేవీలు గుర్తించాక వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో వ్యాట్ రాబడిలో హెచ్చుతగ్గులను సమీక్షించనున్నారు. అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిరూపణ అయితే జరిమానా విధించనున్నట్లు ఆ చెక్‌లిస్ట్‌లో పేర్కొన్నారు. -
స్పైస్‌జెట్ రికార్డ్ లాభం
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా, రికార్డ్ స్థాయి త్రైమాసిక లాభాన్ని ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో సాధించింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపేసినప్పటికీ, ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.262 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.38 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్ తెలిపింది. గత క్యూ1లో రూ.2,253 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,145 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నిలిపివేత.. ఈ జూన్ క్వార్టర్లో బాగానే ప్రభావం చూపించిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిర్వహణ ఆదాయం రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సగటు విమాన చార్జీ 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 107 విమానాలతో సర్వీసులు ఈ ఏడాది అక్టోబర్ కల్లా బోయింగ్ 737 ఎన్జీ విమానాలను 5–10 వరకూ కొత్తగా సర్వీసుల్లోకి తీసుకోనున్నామని కోటేశ్వర్ తెలిపారు. జూన్ చివరినాటికి మొత్తం 107 విమానాలతో సర్వీసులనందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలోస్పైస్జెట్ షేర్ 1 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. -
భారీ అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జకీర్నగర్లోని ఓ బహుళ అంతస్ధుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా 11 మందికి గాయాలయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకోగానే ఘటనా స్ధలానికి చేరుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి 20 మందిని భవనం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలతో అక్కడ పార్క్ చేసిన ఏడు కార్లు, ఎనిమిది బైక్‌లు దగ్ధమయ్యాయి. -
రూ 60 లక్షల విలువైన డైమండ్స్ కొట్టేశారు..
న్యూఢిల్లీ : ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బొమ్మలు అమ్ముకునే మహిళలు కొందరు పార్ట్‌టైమ్‌గా పాకెట్స్ కట్ చేసే పనిలో పడ్డారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో చోరీలకు తెగబడుతూ రాజధాని పోలీసులకు పట్టుబడ్డారు. ఢిల్లీ మెట్రోలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డ ఏడుగురు మహిళల ముఠా నుంచి చోరీకి గురైన రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నగరానికి చెందిన నిందితులు చిమ్నా, అంజలి, రీటా, ఆశా, పూనం, అనితా, రేష్మాలుగా గుర్తించిన పోలీసులు వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఓ ముఠాగా ఏర్పడి మెట్రో స్టేషన్లు, బస్సులు, రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. వ్యాపార పని నిమిత్తం ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తి వీరి బారిన పడటంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 28న బాధితుడు కరోల్‌బాగ్ నుంచి ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్‌కు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో డైమండ్స్ ఉన్న బ్యాగ్ అదృశ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అదే ట్రైన్లో బరకంబ మెట్రో స్టేషన్ వద్ద ఏడుగురు మహిళలు రైలు దిగినట్టు వెల్లడైంది. అనుమానిత మహిళలు దిగిన ట్రైన్ కోచ్‌లోనే బాధితుడు ప్రయాణిస్తుండటం, నిందితుల్లో ఓ మహిళ బాధితుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలిన బ్యాగ్‌ను తీసుకువెళుతుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. దొంగిలించిన డైమండ్స్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న మహిళలను షాదిపూర్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బొమ్మలు అమ్ముకుంటూ జీవనం గడిపేవారని , రోజువారీ ఖర్చుల కోసం చోరీలకు తెగబడుతున్నారని పోలీసులు తెలిపారు. -
ఎన్నారై అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ : అమెరికాలో స్థిరపడ్డ భారత వ్యాపారవేత్త ఆదివారం శవంగా తేలాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మున్ని జైట్లీ(35) అనే ప్రవాస భారతీయుడు తన కుటుంబంతోపాటు అమెరికాలో స్థిరపడ్డాడు. గురువారం వ్యాపారరీత్యా న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లోకి అద్దెకు దిగారు. ఈ క్రమంలో శుక్రవారం జెట్లీకి అతడి తండ్రి ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో హోటల్ స్టాఫ్‌కు కాల్ చేసి కొడుకుతో మాట్లాడాలని చెప్పారు. హోటల్ యజమాన్యం ల్యాండ్ లైన్ ద్వారా కాల్ కలపగా.. జైట్లీ ఫోన్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది వారి దగ్గరున్న మరో కీ గది తాళం తీసి చూడగా అతడు స్పృహ కొల్పోయి ఉన్నాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జైట్లీది సాధారణ మృతిగానే భావిస్తున్నామని అయితే ఇప్పుడే అతడి మృతికి గల కారణాలను వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. మరిన్ని పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఫోరెన్సిక్ లాబొరేటరీకి తరలించినట్లు పేర్కొన్నారు. ఇక మున్ని జైట్లీ అకాల మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ముగిసిన షీలా దీక్షిత్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాల మధ్య ఆమె పార్థివ దేహానికి ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దివంగత నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అంతిమ యాత్రకు తరలివచ్చారు. అంతకుముందు షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ పీసీసీ కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ సహా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు దివంగత నేతకు నివాళులు అర్పించారు. మరోవైపు దివంగత నేతతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోనియా గాంధీ ట్వీట్ చేశారు. ఇక షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని, ఆమె విలువైన మార్గదర్శకత్వాన్ని తాను కోల్పోయానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. కాగా షీలా దీక్షిత్ గుండెపోటుతో శనివారం ఉదయం ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరగా వైద్యులు తీవ్రంగా శ్రమించినా మరోసారి గుండె పోటు రావడంతో మధ్నాహ్నం 3.55 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే. -
మహానేత అడుగు జాడల్లోనే వైఎస్ జగన్ పాలన
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తారని వైఎస్సార్సీపీ ఎంపీలు విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి కేక్ కట్ చేశారు. తొలుత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మాటాడుతూ.. రైతే దేశానికి వెన్నెముక అని బలంగా నమ్మి రైతు సంక్షేమానికి, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రతి గింజ మీద దాన్ని తినే వారి పేరు రాసి ఉంటుందని చెప్పినట్టుగానే.. రాష్ట్రంలో రైతు పండించే ప్రతి గింజ మీద ఆ రైతు పేరుతోపాటు వైఎస్సార్ పేరు కూడా ఉంటుందన్నారు. ఆ స్థాయిలో రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ రక్తం పంచుకుని పుట్టిన ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తండ్రి అడుగు జాడల్లోనే పనిచేస్తారని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే నంబర్–1గా నిలుపుతారని అన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. రైతులతో మహానేతకు విడదీయలేని బంధం ఉందన్నారు. రైతుల గుండెల్లో ఆయన చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ తామంతా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి, మాంగుట శ్రీనివాసులురెడ్డి, రఘురామకృష్ణంరాజు, రెడ్డెప్ప, నందిగం సురేష్, గొడ్డేటి మాధవి, దుర్గాప్రసాద్, తలారి రంగయ్య పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. వైఎస్సార్ విగ్రహానికి మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి, మాజీ మేయర్ రత్నబిందు, పార్టీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ, మాజీ కార్పొరేటర్లు జె.దామోదరరావు, చోడిశెట్టి సుజాత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అడపా శేషు, జానారెడ్డి, మైలవరపు దుర్గారావు, అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అరుణ్, యువజన విభాగం రాష్ట్ర నేత రామిరెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. పదిమందికీ పట్టెడన్నం పెట్టే రైతులు చల్లగా జీవించాలని కలలుగన్న మనసున్న మహారాజు వైఎస్ రాజశేఖరరెడ్డి అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజశేఖరరెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజకీయాలను హుందాగా నడిపిన గొప్ప నేత రాజన్న అని, భ్రష్టుపట్టిన నేటి రాజకీయాలను సమూలంగా మార్చేందుకు జగన్మోహన్రెడ్డిని మనకు అప్పగించి వెళ్లిపోయారన్నారు. తెలంగాణ నేతల నివాళి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ తెలంగాణ నేతలు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. అంధులకు చెస్ కిట్లను పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకూ, గుండెకూ చేరినందున వైఎస్సార్ పేరు చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, జె.మహేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షులు కె.అమృతాసాగర్, సేవాదళ్ విభాగం నేత బండారు వెంకటరమణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎన్.రవికుమార్ పాల్గొన్నారు. -
రూ లక్ష బాకీ తీర్చలేదని స్నేహితుడిని..
న్యూఢిల్లీ : రూ లక్ష అప్పుతీసుకుని తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితుడిని కొట్టిచంపిన ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. ఢిల్లీలోని ఎర్రకోట వెనుక రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన అనంతరం ఈ ఘటన వెలుగుచూసింది . బాధితుడి షర్ట్ వెనక ఉన్న స్టిక్కర్‌ను చూసిన పోలీసులు అతడిని బులంద్‌షహర్ నివాసిగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీకి చెందిన నిందితుడు అజయ్ సింగ్ రాఘవ్ పీతంపురాలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. నిందితుడు సింగ్ తన స్నేహితుడికి రూ లక్ష అప్పుగా ఇచ్చాడు. తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో బాధితుడిని సింగ్ దారుణంగా కొట్టి తన కారులో నిర్భందించి ఊపిరాడకుండా చేసి మరణించిన తర్వాత ఎర్రకోట వెనకాల పడేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని ఢిల్లీ ఏసీపీ (నార్త్) హరీంద్ర సింగ్ తెలిపారు. -
ఎంపీల కోసం ముస్తాబవుతున్న ఫ్లాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో కొత్త ఎంపీలు కొలువుతీరనున్న వేళ ఎంపీలకు నూతన ఫ్లాట్లను ప్రభుత్వం సమకూర్చనుంది. దేశ రాజధానిలో అధికారిక నివాసం లేని ఎంపీలకు ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి అందించడంలో దుబారా అవుతుండటంతో లోక్‌సభ సెక్రటేరియట్ ఖర్చు తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ నార్త్ ఎవెన్యూ ప్రాంతంలో ఎంపీలకు అత్యాధునిక వసతులతో ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అందించేందుకు ఇప్పటివరకూ అన్ని హంగులతో 36 ఫ్లాట్లు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మించిన ఈ ఫ్లాట్లు అన్ని ఆధునిక సదుపాయాలతో పాటు ఎంపీల అవసరాలకు అనుగుణంగా రూపొందాయి. ఈ డూప్లెక్స్ ఫ్లాట్లు భూకంపాన్ని తట్టుకునే విధంగా, గ్రీన్ బిల్డింగ్ విధానాలను అనుసరిస్తూ నిర్మితమయ్యాయి. ప్రతి అపార్ట్మెంట్లో రెండు ఫోర్లతో పాటు సెంట్రలైజ్డ్ ఏసీ, చిన్నపాటి దేవాలయం, సర్వెంట్ రూమ్, బేస్మెంట్ పార్కింగ్, ఎటాచ్డ్ వాష్‌రూమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లును తగ్గించేందుకు ఫ్లాట్స్‌పై సోలార్ ప్యానెల్స్, సెన్సర్ లైట్లు అమర్చారు. ఇక 300 మంది ఎంపీల కోసం నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లు అన్నీ సిద్ధమయ్యేవరకూ మరికొందరు ఎంపీలకు ఆయా రాష్ట్రాల అతిధి గృహాలతో పాటు నగరం మధ్యలో పునరుద్ధరించిన వెస్ర్టన్ కోర్టులోనూ వసతి కల్పించాలని లోక్‌సభ సెక్రటేరియట్ భావిస్తోంది. -
ప్రాణం తీసిన మూత్ర విసర్జన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో తన ఇంటి ముందు ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడని దాడి చేయడంతో జరిగిన ఘర్షణలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. మృతుడిని నెహ్రూ క్యాంప్ స్లమ్‌కు చెందిన లిలూగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. లిలూ ఇంటి వద్ద మాన్ సింగ్ (65) మూత్ర విసర్జన చేయడంతో లిలూ మాన్‌సింగ్‌పై చేయిచేసుకోగా ఘర్షణ జరిగింది. మాన్సింగ్ కుమారులు రవి, నీల్కమల్ అక్కడికి చేరుకుని సిమెంట్ స్లాబ్‌తో లిలూపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన లిలూ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
మహిళా డాక్టర్‌ను గొంతుకోసి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పాతికేళ్ల వయసు కలిగిన ఓ మహిళా డాక్టర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఢిల్లీలోని రంజిత్ నగర్లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ చదివి మాస్టర్స్ కోసం ప్రిపేరవుతున్న గరీమా మిశ్రా అనే వైద్యురాలు విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె గొంతు కోసి హతమార్చినట్టు ఆనవాళ్లు లభించాయి. కాగా హత్య జరిగిన అనంతరం ఆమె పొరుగున ఉండే ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో హత్యతో వారికి సంబంధం ఉందనే అనుమానాలు బలపడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరితో ఆమె సన్నిహితంగా ఉండేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్నేహితుడు సైతం ఎండీ కోర్సుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. -
ఆ పార్టీ మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సీజన్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు పార్టీలు వరాలు, హామీలు గుప్పించడం సహజమే. ఢిల్లీ ఓటర్లకు సంజి విరాసత్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఓటర్లకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే మద్యంపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ముస్లింలకు ఈద్ రోజు ఉచితంగా మేకల పంపిణీ, మహిళలకు ఉచితంగా బంగారం వంటి పలు హామీలను ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. సంజి విరాసత్ పార్టీ అభ్యర్థి అమిత్ శర్మ ఈ హామీలతో ఏకంగా పోస్టర్లను రూపొందించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ శర్మ ఆ పార్టీ తరపున ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. ఇక ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో మద్యంపై రాయితీ, ఉచిత మేక పధకంతో పాటు పీహెచ్డీ వరకూ ఉచిత విద్య, ఢిల్లీ విద్యార్థులకు మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రైవేట్ స్కూల్స్‌లోనూ ఉచిత విద్య, యువతుల వివాహానికి రూ 2.5 లక్షల నగదు సాయం, నిరుద్యోగ యువతకు రూ 10,000 భృతి, వృద్ధులకు, వికలాంగులకు రూ 5000 పెన్షన్ వంటి పలు హామీలను గుప్పించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలకు మే 12న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. -
మీరు లేని ఎన్ని‘కళా’?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఎక్కడో పుట్టారు. ఎక్కడో పెరిగారు.. రాజకీయాల చెట్టు నీడలో కలిశారు.. ఒకే పార్టీలో ఉంటూ కరచాలనం చేసుకున్నారు.. వేర్వేరు పార్టీల్లో కత్తులూ దూసుకున్నారు.. రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులతో ఓటర్లను ఫిదా చేసింది కొందరైతే, నిండు సభలో కవిత్వపు జల్లులతో పన్నీరులా పలకరించినవారు మరొకరు.. ఎన్నికల సభల్లో హాస్య చతురతతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరి టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు ఫక్కున నవ్వేలా చేసిన నేతలు కొందరైతే.. మహిళలైనా మహారాణుల్లా వెలిగిపోయి సంక్షేమానికి మరో రూపంలా మారింది కొందరు. కాల చక్రంలో గిర్రున అయిదేళ్లు తిరిగిపోయాయ్. జీవిత కాలం చివరి మలుపులో వీడలేమంటూ వీడుకోలంటూ ఒకనాటి రాజకీయ యోధులు ఈసారి ఎన్నికల రణక్షేత్రానికి దూరమయ్యారు. మరణం కొందరినీ, వయోభారం, అనారోగ్యం మరికొందరిని ఈ సార్వత్రిక ఎన్నికలకు దూరం చేశాయి. తమ వ్యక్తిత్వాలతో ఓటర్ల మదిలో మరపురాని తిరిగిరాని గుర్తులను వేసిన రాజకీయ దిగ్గజాలు వాజ్‌పేయి, కరుణానిధి, జయలలిత, మనోహర్ పరికార్ వంటి నేతలు లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. మై డియర్ సర్స్, మేడమ్స్, రాజకీయ ఉద్ధండుల్లారా.. రియల్లీ వి మిస్ యూ.. వాజ్‌పేయి: జోహారోయి రాజకీయానికి – భావ కవిత్వానికి అవినాభావ సంబంధం ఉందని ఎవరైనా అనుకోగలరా? మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సభలోకి అడుగుపెట్టాక ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆయన మాటే ఒక మంత్రం.. ఆయన ఉపన్యాసం స్వరరాగ కవితా ప్రవాహం. 12 సార్లు పార్లమెంటేరియన్‌గా వాజ్‌పేయి ప్రదర్శించిన రాజనీతిజ్ఞత భావితరాలకు ఆదర్శం. బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది. అద్వానీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజ్‌పేయి ‘నేను దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను‘ అంటూ ఎదురుదాడికి దిగిన ఘనత ఆయనది. గత ఏడాది ఆగస్టు 16న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వాజ్‌పేయి వ్యక్తిత్వం చరిత్ర పుటల్లో ఒక పేజీగా మిగిలిపోయింది. రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీగా పేరు సంపాదించిన ఈ అజాతశత్రువు ఇక లేరని తలచుకుంటే అభిమానుల మనుసులు భారమైపోతాయి. వి మిస్ యూ అటల్జీ అంటూ మౌనంగా రోదిస్తాయి. పురుచ్చితలైవి: సంచలనాలేవీ? ఆమెను చూస్తే అమ్మ గుర్తుకు వస్తుంది. ప్రజల ఆకలి తెలుసుకొని కడుపు నింపే అమ్మ. నడిచొచ్చే సంక్షేమానికి నిలువెత్తు రూపం. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన ద్రవిడ నాట ఉక్కు మహిళ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణం ఒక మిస్టరీ. ఆమె సృష్టించారు ఒక హిస్టరీ. రాజకీయాల్లో జయలలిత ప్రభావం, పార్టీపై ఆమె సాధించిన పట్టు ఎంత అంటే 2016లో అనుమానాస్పదంగా జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకేకి సమర్థుడైన నాయకుడు లేక పార్టీ ‘ఆకులు’ ఆకులుగా విడిపోయి ఛిన్నాభిన్నమైంది. జయ లేకుండా తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేయగలదా అన్న సందేహాలతో ఆమె అనుచరగణం కంటతడి పెడుతున్నారు. కరుణానిధి: జ్ఞాపకాల నిధి ద్రవిడ భాషా ఉద్యమ సూరీడు కరుణానిధి. తమిళ రాజకీయాల్లో ఈయనదీ ఒక చరిత్ర. డీఎంకే పార్టీ అధినేతగానే కాదు, పదునైన మాటలతో ఒక సినీ కవిగా ఆయన వేసిన ముద్ర తిరుగులేనిది. స్నేహానికి ప్రాణమిచ్చే కరుణ మనస్తత్వానికి ఎవరైనా తలవంచి జోహార్ అనాల్సిందే. ప్రాణమిత్రుడు ఎంజీఆర్ తన పక్కనే ఆయనకి ఒక పడక సిద్ధం చేశారేమో మరి వయోభారంతోనే నింగికెగిశారు. నిండు జీవితాన్ని గడిపినప్పటికీ కరుణానిధి ఇక లేరన్న వార్త తమిళ తంబిల మనసుల్లో అగ్నిపర్వతాల్ని బద్దలు చేసింది. అందులోంచి లావా ఎప్పటికీ ఎగజిమ్ముతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాల కన్నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. పారికర్: ఎక్స్ట్రార్డినరీ.. రాజకీయాల్లో అతి సామాన్యుడిగా బతికిన అసామాన్యుడు ఎవరైనా ఉన్నారంటే ఠక్కుమని మనోహర్ పారికర్ పేరు చెప్పొచ్చు. గోవా ముఖ్యమంత్రిగా సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లగలరు. జనంతో మనోహరంగా కలిసిపోగలరు. రక్షణ మంత్రిగా సరిహద్దుల్ని సమర్థవంతంగా కాపలా కాయగలరు. అత్యంత కష్టపడే మనస్తత్వంతో పొలిటికల్ బరిలో విజేతగా నిలిచిన ఆయన కేన్సర్ వ్యాధిని జయించలేక ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. మనోహర్ లేకపోవడం నిజంగా బీజేపీకి తీరని లోటే. అడ్వాణీ నుంచి పవార్ వరకు రేసులో లేనివారెందరో.. తన రథయాత్రలతో పెరిగి పెద్దదైన భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతూ కూడా అడ్వాణీని సాధారణ ఓటరుగా మార్చేసింది. 75 ఏళ్ల వయసు దాటిందని సాకుగా చూపించి మురళీ మనోహర్ జోషి వంటి నేతని ఎన్నికలకి దూరం చేసింది. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చే సుష్మా స్వరాజ్ అనారోగ్యం వేధిస్తుంటే తనకు తానుగా ఈ రాజకీయ ప్రహసనం నుంచి తప్పుకున్నారు. దళిత పతాకం మాయావతి తన లక్ష్యమైన మోదీని ఓడించడానికి పోటీకి దూరంగా ఉంటూ ప్రచారానికే పరిమితమయ్యారు.రాజకీయాలను ఓ ఆటాడుకుని, క్రీడల్లోకి రాజకీయాల్ని దట్టించిన మరాఠా యోధుడు శరద్ పవార్ వయోభారం చేతో, వారసుడిని బరిలో నిలపడం వల్లో.. రేసు నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఈ స్వార్వత్రిక ఎన్నికల బరిలో లేనని ప్రకటించి అభిమానుల్ని విస్మయానికి గురి చేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి గంగా ప్రక్షాళన చేయడం కోసం ఎన్నికలనే విడిచి పెట్టేశారు. భారతీయ జీవన వేదమైన గంగానదిని కాపాడుకోవడం కోసం ఆమె ఏడాదిన్నర పాటు యాత్ర చేయనున్నారు. లోక్‌జనశక్తి నేత రామ్‌విలాస్ పాశ్వాన్‌ని అనారోగ్యం వేధిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసే శక్తి లేక ఆయన కూడా దూరంగా ఉన్నారు.ఇలా అరుదైన రాజకీయ నేతలు బరిలో లేని ఎన్నికలు ఎందరో అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. ప్చ్.. అని నిట్టూర్చడం తప్ప ఎవరైనా ఏం చేయగలరు?. -
కాలుష్య నగరాల్లో భారత్ టాప్..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత 20 కాలుష్య నగరాల్లో 15 నగరాలు భారత్‌వే కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.పర్యావరణ ఎన్జీవో గ్రీన్‌పీస్ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2018లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ పొరుగున ఉన్న గురుగ్రామ్, ఘజియాబాద్‌లు ముందువరసలో నిలవగా, దేశ రాజధాని ఢిల్లీ 11వ స్ధానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం కలిగిన దేశ రాజధానుల్లో ఢిల్లీ ఈ జాబితాలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక 20 అత్యంత కాలుష్య నగరాల్లో మిగిలిన ఐదు నగరాలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో విస్తరించిఉన్నాయి. దశాబ్ధకాలంగా కాలుష్యంతో సతమతమవుతున్న చైనా కాలుష్యాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యల్లో కొంత మేర సఫలీకృతమైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చైనా రాజధాని బీజింగ్ 122వ స్ధానంలో నిలిచి కాలుష్య నియంత్రణలో కొంతమేర విజయం సాధించింది. ఇక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పీఎం 2.5 కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వాహన రాకపోకలు, పంట వ్యర్ధాల దగ్ధం వంటివి పరిస్థితి చేజారేందుకు దోహదపడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత నగరాలు వరుసగా గురుగ్రాం, ఘజియాబాద్ తొలి రెడు స్ధానాల్లో నిలవగదా ఫరీదాబాద్, భివాడి, నోయిడా, పట్నా, లక్నో, ఢిల్లీ, జోధ్‌పూర్, ముజఫర్‌పూర్, వారణాసి, మొరదాబాద్, ఆగ్రా, గయ, జింద్ నగరాలు టాప్ 20 జాబితాలో ఉన్నాయి. -
గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి జైషే స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించారనే ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారని ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు. వీరు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ ఇంటిలోకి కొందరు అనుమానితులు వస్తున్నారని పసిగట్టిన పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో రాజ్‌ఘాట్‌లో కొందరిని కలిసేందుకు ఘనీ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ మాటు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘనీ నుంచి ఆయుధాలు, కొంత మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనీ అనుచరులను పట్టుకునేందుకు జమ్ము కశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం బండిపోరలో మరో ఉగ్రవాది అహ్మద్ భట్‌ను అరెస్ట్ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్ర దాడులకు సన్నాహకంగా ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో భట్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా తాము జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో చురుకుగా పనిచేస్తామని వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. -
పర్హీన్ ప్రభాకర్‌పై దోపిడీ ముఠా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య, బాలీవుడ్ నటి పర్హీన్ ప్రభాకర్‌పై దేశ రాజధానిలో దోపిడీ దొంగల ముఠా దాడికి పాల్పడింది. థక్ థక్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దాడికి తెగబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. పర్హీన్ దక్షిణ ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లో ఉండే పర్హీన్ తన కారులో సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌కు వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దోపిడీ ముఠా అడ్డగించిందని పోలీసులు చెప్పారు. ఆమె తన కారును పార్క్ చేసి వారితో మాట్లాడుతుండగా దాడికి దిగి ఆమె వద్దనున్న రూ 16,000 నగదు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని రోడ్డుకు ఎదురుగా పార్క్ చేసిన వారి కారులో పరారయ్యారు. దోపిడీ ముఠా దాడికి గురైన పర్హీన్ రోడ్డుపై కుప్పకూలారు. ఓ ఆర్మీ అధికారి ఆమెకు సాయం అందించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పోలీసులకు అందచేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దక్షిణ ఢిల్లీ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి
-
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా అమిత్ షా తన నివాసానికి చేరుకున్నారని బీజేపీ నేత అనిల్ బలూనీ వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ సోకిన అమిత్ షాకు ఎయిమ్స్ డైరెర్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులెరియా పర్యవేక్షణలో చికిత్స అందించారు. కాగా తాను స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని, భగవంతుడి దయ, మీ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని అమిత్ షా ట్వీట్ చేశారు. -
వేడుకల్లో విషాదం : ఇద్దరు బాలురపై కాల్పులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే క్రమంలో ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలురిపై కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది సంవత్సరాల బాలుడు బుల్లెట్ గాయాలతో మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో తమ ఇంటి టెర్రేస్‌పై నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా కొందరు వ్యక్తులు ఎనిమిదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపారు. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బాణాసంచా పేలుళ్లు తమకు వినిపించాయని, అనంతరం బాలుడు స్పృహ కోల్పోయి పడిఉండటాన్ని గమనించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్ధానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని ప్రశ్నించామని విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక ఈశాన్య ఢిల్లీలోని వెల్కం ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో 12 ఏళ్ల బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
ఢిల్లీ ‘చిల్’ మార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ శీతాకాలంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఇవాళ ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. చలిగాలికి తోడు మంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఉదయం వేళల్లో శీతల గాలులు, మంచు ఢిల్లీని వణికిస్తున్నా ముందుముందు గరిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌కు పైగా చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంన్నారు. ఇక బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు ఢిల్లీలో వాయునాణ్యత సూచీ 319 పాయింట్లతో వెరీ పూర్ కేటగిరీలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో రాజధాని గాలిలో తేమ పెరుగుతోందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ : చలిగాలుల తీవ్రతతో దేశరాజధాని గజగజ వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో చలిపులి పంజా విసురుతోంది. సోమవారం ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్ సగటుతో పోలిస్తే కనిష్ట ఉష్ణోగ్రత మరింత తక్కువగా 6.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఢిల్లీని ఈ ఉదయం మంచుపొరలు కమ్మేశాయని, అయితే ఆకాశం నిర్మలంగా ఉందని, వర్షం కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు చలిగాలులతో పాటు ఢిల్లీని కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత ప్రమాణాలు ఢిల్లీలో ఇంకా దారుణంగానే ఉన్నాయని వాయు కాలుష్య తీవ్రతను తెలిపే పీఎం 2.5, పీఎం 10 ప్రమాదకరస్ధాయిలోనే ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. -
బస్‌లో వికృత చేష్ట..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో వసంత్‌కుంజ్ ప్రాంతంలో బస్సులో విద్యార్థిని పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించాడు. సీటులో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లి జననాంగాన్ని చూపుతూ అమర్యాదకరంగా వ్యవహరించాడు. బాధితురాలు తేరుకుని దుండగుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. సాయాన్ని కోరుతూ అరిచినా తోటి ప్రయాణీకులు స్పందించలేదు. ధైర్యంగా అతడిని ఎదుర్కొన్న యువతి పోలీసులను పిలవడంతో పాటు కామాంధుడిని తీవ్రంగా కొడుతూ బస్సు నుంచి కిందకు తోసేసింది. మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించినందుకు దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఈ తరహా ఘటనలు ఇటీవల పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బస్సులో ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని ఎదుట ఓ వ్యక్తి ఇలాగే వ్యవహరించగా, బాధితురాలు వీడియోలో రికార్డు చేసి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌లో ఊబర్ ప్రయాణీకురాలి ఎదుట డ్రైవర్ అసభ్యంగా వ్యవహరించాడు. అదే నెలలో వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ టైక్వాండో ట్రైనర్ మహిళ ఎదుట ఇలాగే వ్యవహరించాడు. -
సెక్రటేరియట్లో సర్వీస్ రివాల్వర్‌తో..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సెక్రటేరియట్లో శుక్రవారం ఉదయం డ్యూటీలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని వీఐపీ పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని 35 సంవత్సరాల హెడ్ కానిస్టేబుల్ సొహన్వీర్గా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో సూసైడ్ నోట్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సమస్యలతోనే హెడ్ కానిస్టేబుల్ ఈ తీవ్ర చర్యకు ఒడిగట్టినట్టు ప్రాధమికంగా వెల్లడైందన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.విధి నిర్వహణలో ఒత్తిళ్లతో ఇటీవల పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. -
రూ. 80 కోసం కత్తితో పొడిచి చంపారు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ. 80 కోసం వాదన జరగడంతో ప్రయాణీకులు ఆటోడ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని జనసమ్మర్ధ కన్నాట్ ప్లేస్‌లో జరిగింది. నిందితులు నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరణించిన ఆటో డ్రైవర్‌ను జామియా నగర్‌కు చెందిన జహంగీర్ అలాంగా గుర్తించారు. నిందితులందరూ తొమ్మిది, పదో తరగతి విద్యార్దులు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి నలుగురు నిందితులు దక్షిణపురిలో ఆటో మాట్లాడుకుని మూల్‌చంద్‌లో పరాటాలు తినేందుకు వెళ్లారు. అయితే అక్కడా పరాటాలు లేకపోవగడంతో కన్నాట్ ప్లేస్‌కు వెళ్లాలని రూ. 120 ఇస్తామని చెప్పారు. ఆటో కస్తూర్బా గాంధీ మార్గ్ బస్‌స్టాప్ వద్దకు రాగానే అర్ధరాత్రి కావడంతో ఒక్కొక్కరికి రూ. 20 చొప్పున అదనంగా ఇవ్వాలని ఆటో డ్రైవర్ కోరడంతో వాగ్వివాదం జరిగింది. నిందితుల్లో ఒకరు జహంగీర్ ఆలంపై కత్తితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో స్ధానికులు రాగా ఒక నిందితుడు పట్టుబడగా, మిగిలిన వారు పరారయ్యారు. గాయపడిన ఆలంను పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెప్పారు. ఆలంపై కత్తితో దాడి చేసిన నిందితుడిని స్ధానికులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. -
ఆ ఉత్తర్వులపై మైనారిటీ కమిషన్ అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ స్కూల్స్‌లో గాయత్రి మంత్రం పఠించాలనే నిబంధన దుమారం రేపింది. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులచే గాయత్రి మంత్రం పఠించాలని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఢిల్లీ మైనారిటీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు సంస్థకు మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల అసెంబ్లీలో ఉదయాన్నే గాయత్రి మంత్రం జపించాలని ఎందుకు ఉత్తర్వులు జారీ చేశారో వివరణ ఇవ్వాలని కోరామని ఢిల్లీ మైనారిటీ కమిషన్ చీఫ్ జఫరుల్ ఇస్లాం ఖాన్ తెలిపారు. ఎన్డీఎంసీ ఉత్తర్వులు లౌకిక స్ఫూర్తికి విఘాతమని, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులు ఓ మతానికి చెందిన మంత్రాలను పఠించేందుకు ఇష్టపడరని చెప్పారు. కాగా, గాయత్రి మంత్రం జపించాలనే ఉత్తర్వులను ఎన్డీఎంసీ అధికారులు సమర్ధించుకున్నారు. స్కూళ్లలో గాయత్రి మంత్రం పఠించాలనే ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాల్సినవి కాదని స్పష్టం చేశారు. ఎన్డీఎంసీ పరిధిలో 765 పాఠశాలలు నిర్వహిస్తున్నక్రమంలో 2.2 లక్షల మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు. -
రుణమాఫీపై ఎటూ తేల్చని కేంద్ర ప్రభుత్వం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. అయితే రుణ మాఫీ సహా మరికొన్ని డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతులు ప్రభుత్వం ముందుంచిన 11 డిమాండ్లలో ఏడు డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి యుధ్వీర్ సింగ్ మంగళవారం పేర్కొన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లను నెరవేర్చడంపై కేంద్రం తీరు పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం యుధ్వీర్ చెప్పారు. నాలుగు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడినందున వీటిపై తదుపరి సమావేశంలో వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. రుణ మాఫీపై విస్తృతంగా చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించిందన్నారు. కాగా బీకేయూ సారథ్యంలో రైతు సంఘాల పిలుపు మేరకు యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాల నుంచి దాదాపు 70,000 మందికి పైగా రైతులు దేశ రాజధానికి ప్రదర్శనగా తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో రాజ్‌ఘాట్ వరకూ రైతులు బారీ ర్యాలీ నిర్వహించారు. -
తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిపై తన క్లాస్మేట్ సహా ఇద్దరు బాలురు స్కూల్ ప్రాంగణంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది మే-జూన్‌లో పాఠశాల నిర్వహించిన సమ్మర్ క్యాంప్ సందర్భంగా తన క్లాస్మేట్ సహా వేరే సెక్షన్ విద్యార్థి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారని తూర్పు ఢిల్లీ డీసీపీ పంకజ్ సింగ్ చెప్పారు. పాఠశాల భవనంలోని మూడో అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి తనను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు లైంగికంగా వేధించారని విద్యార్థి ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఎవరికైనా ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి నిందితులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. జరిగిన విషయం తల్లితండ్రులకు చెప్పగా వారి చొరవతో బాలుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు. -
ముద్దివ్వబోతే భర్త నాలుక కొరికి..
సాక్షి, న్యూఢిల్లీ : ముద్దిచ్చేందుకు ముందుకొచ్చిన భర్తను ఇదే అదనుగా భావించిన భార్య అతడి నాలుకను కొరికేసింది. గొడవకు దిగిన భార్యను శాంతింపచేసేందుకు భర్త చేసిన ప్రయత్నం అతడి నాలుకకు ఎసరు తెచ్చింది. ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టిస్ట్‌గా పనిచేసే కరణ్‌కు రెండేళ్ల కిందట వివాహమైనా భార్యతో సఖ్యత లేదు. ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారని పోలీసులు తెలిపారు. భర్త అందంగా లేడని ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కరణ్ భార్య వాపోతుంటుందని స్ధానికులు చెబుతున్నారు. వీరి మధ్య శనివారం రాత్రి సైతం ఘర్షణ జరిగింది. కోపంతో ఉన్న భార్యను శాంతింపచేసేందుకు కరణ్ ముద్దు ఇవ్వగా అతడి నాలుకను సగం వరకూ ఆమె కొరికేసింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపుతోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా బాధితుడు మాట్లాడే అవకాశం లేదని సప్ధర్‌జంగ్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు తెలిపారు. -
ఎయిమ్స్‌లో బిహార్ సీఎం నితీష్..
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆయన ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నితీష్ కుమార్ మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఎయిమ్స్ ప్రైవేట్ వార్డులో చేరారని తెలిపాయి. జ్వరం, కన్ను, మోకాలి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలపడంతో నితీష్‌ను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. నితీష్ ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులు వెల్లడిస్తారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
నాపై దాడికి వారే బాధ్యులు..
సాక్షి, న్యూఢిల్లీ : తనపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం వెనుక బీజేపీ ప్రతినిధులు, కొన్ని టీవీ ఛానెళ్లు, ప్రైమ్‌టైమ్ యాంకర్ల ప్రమేయం ఉందని జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ ఆరోపించారు. నిర్ధిష్టంగా ఖలీద్ ఏ ఒక్కరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. తనపై దాడివెనుక అసలైన కుట్రదారులు పాలక పార్టీ ప్రతినిధులు, ప్రైమ్ టైమ్ యాకంర్లు, కొన్ని టీవీ చానెళ్లని చెప్పుకొచ్చారు. అవాస్తవాల ప్రాతిపదికన తనను దేశ వ్యతిరేకిగా ముద్ర వేశారని, తనపై మూకదాడులను ప్రేరేపించడంతో తన జీవితం దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమర్ ఖలీద్‌పై దేశ రాజధానిలో అత్యంత భద్రతతో కూడిన కాన్సిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద స్వాతంత్ర్య వేడుకలకు రెండు రోజుల ముందు ఓ వ్యక్తి కాల్పులతో తెగబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌కు సమీపంలోని వేదిక వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఖలీద్ అక్కడికి వచ్చారు. తనపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించిన క్రమంలో తన ప్రాణాలకు ముప్పుందని భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు దాడిచేసిన వ్యక్తి ఘటనా ప్రాంతంలో గన్ను వదిలివేసి పారిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. 2016లో ఉమర్ ఖలీద్‌తో పాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్, అనిర్బన్ భట్టాచార్యలను దేశద్రోహం కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో వారు బెయిల్‌పై విడుదలయ్యారు. -
పోలీసు పోస్టుల భర్తీకి సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ : పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నామని, ఢిల్లీ పోలీసు విభాగంలో 4000 పోస్టుల నియామకాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలో గత నాలుగేళ్లుగా శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందని, తీవ్ర నేరాలను పోలీసులు అదుపుచేయగలిగారని ప్రశంసించారు. ఢిల్లీలో పోలీసు బలగాల నియామకం అవసరముందని, త్వరలోనే 4000 పోలీసు పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు.ఢిల్లీలో శుక్రవారం నూతన డీసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పోలీసు విభాగంలో 3149 పోస్టుల నియామకానికి హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతించిందని చెప్పారు. దేశ రాజధానిలో ట్రాఫిక్ నిర్వహణ పోలీసులకు పెనుసవాల్‌గా పరిణమించిందన్నారు. కృత్రిమ మేథ ఆధారంగా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)ను ప్రవేశపెట్టేందుకు హోంమంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. -
గదిలో బంధించాడంటూ మెసేజ్..
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం ఢిల్లీలో ఎయిర్‌హోస్టెస్ అనీసియా బత్రా ఆత్మహత్యకు ఆమె భర్త మయాంక్ చిత్రహింసలే కారణమని మృతురాలి ఫ్రెండ్ వెల్లడించారు. ఈ తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు తన భర్త ప్రవర్తనే కారణమని అనీసియా తనకు మెసేజ్ పంపారని ఆమె చెప్పారు. తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అనీసియా స్నేహితురాలు పలు వివరాలు తెలిపారు. భర్త తనను రూమ్‌లో బంధించాడని, పోలీసులకు కాల్ చేసేందుకు నీ సహకారం కావాలని.. వీలైతే తన వద్దకు రావాలని అనీసియా తనకు వాట్సాప్ మెసేజ్ చేశారని చెప్పారు. మయాంక్ (భర్త) వైఖరితో విసుగెత్తి తాను చనిపోతున్నానని ఆమె చివరిగా మెసేజ్ చేశారని అనీసియా ఫ్రెండ్ తెలిపారు. ఆమె మరణానికి కొన్ని నిమిషాల ముందు తన భర్త తనను గదిలో బంధించి బయట తాళం వేశాడని చివరి మెసేజ్ చేశారని, ఆ పరిస్థితిలో ఆమె ఎంతగా భయకంపితురాలై, అసహాయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని బాధితురాలి తరపు న్యాయవాది ఇష్కరణ్ సింగ్ పేర్కొన్నారు. ఆమె బయటికి వచ్చి పోలీసులకు కాల్ చేసేందుకు ఎవరైనా సహకరిస్తారేమోనని ఆశగా వేచిచూశారని, ఇదే ఆమె మరణ వాంగ్మూలమని సింగ్ చెప్పుకొచ్చారు. జూన్ 27నే ముందస్తుగా బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని, అప్పుడే మయాంక్‌పై చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. -
అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి చర్చ చేపడుతామని స్పీకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. టీడీపీ అవిశ్వాస నోటీసుపై టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. చర్చలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. విభజన హామీలపై రాజ్యసభలో వచ్చే సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..
సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలను శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 13,336 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. సివిల్ మెయిన్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది ఎంపికయ్యారు. -
ఎడారి నగరాలను మించిన ఎండ..
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు వడగాలులతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్),ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇదే రోజు దుబాయ్, అబుదాబి, మస్కట్ వంటి ఎడారి నగరాల్లో ఉష్ణోగ్రత కంటే ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. మంగళవారం ఢిల్లీలో రెండేళ్ల గరిష్టస్థాయిలో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక దుబాయ్‌లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయని అంచనా కాగా. అబుదాబి, ఒమన్‌లలోనూ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఇక రాజస్ధాన్‌లోని బికనీర్, జోథ్‌పూర్‌లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి నగరాలను మించి భారత నగరాల్లో ఉష్ణోగ్రతలు నమోదవడం బెంబేలెత్తిస్తోంది. -
‘ప్రధాని అందుబాటులో లేకున్నా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు తలపెట్టిన ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వేను జూన్ 1న ప్రారంభించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధానమంత్రి అందుబాటులో లేకున్నా 135 కిమీ పొడవైన ఈ మార్గాన్ని అదేరోజున జాతికి అంకితం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వే ద్వారా న్యూఢిల్లీతో ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుధ్ నగర్ (గ్రేటర్ నోయిడా) పల్వాల్‌లకు సిగ్నల్ రహిత కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈస్ర్టన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు పూర్తయ్యాయని కేంద్రం ఏప్రిల్‌లో సుప్రీం కోర్టుకు వివరించింది. అయితే ఈ ఏడాది జూన్ నాటికి పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వే పనులు పూర్తవుతాయని హర్యానా ప్రభుత్వం సుప్రీం బెంచ్‌కు నివేదించింది. యూపీలో ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులకు ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని గత ఏడాది డిసెంబర్లో ఎన్హెచ్ఏఐ సుప్రీంకు తెలిపింది. ఢిల్లీకి రాకుండా సరిహద్దు రాష్ట్రాలకు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలతో 2006లో రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా రెండు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించాలని నిర్ణయించారు. పర్యావరణవేత్త ఎంసీ మెహతా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ చర్యలు చేపట్టింది. -
పారిస్‌ను తలపించే ఆ గల్లీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునికత, అభివృద్ధితో గ్రామాలు సైతం నగరాల్లో కలిసిపోతుంటే దేశ రాజధాని ఢిల్లీలోని ఆ గల్లీ మాత్రం కృత్రిమ మెరుపులకు, హంగు ఆర్భాటాలకు దూరంగా యువతను ఆకట్టుకుంటోంది. చంపా గలీగా పేరొందిన సాకేత్‌లోని సైదుల్ అజైబ్ విలేజ్ ఒత్తిడి నుంచి సేదతీరాలనుకునే నగరజీవిని సాదరంగా ఆహ్వానిస్తోంది. ఢిల్లీలోని యువతకు చిరునామాగా మారడంతో పాటు స్టార్టప్‌లకూ ఊతమిస్తోంది. వారాంతాల్లో కాఫీ, గరమ్ ఛాయ్‌లను ఆస్వాదించేందుకు నయా అడ్డాగా అవతరించింది. ఐదేళ్ల కిందట ఫర్నీచర్ గోడౌన్లు, గ్రాఫిక్ డిజైన్ షాపులతో బిజీగా ఉన్న ఈ గల్లీ ఇప్పుడు సుందరమైన పెయింటింగ్‌లు, తీరైన కళాకృతులతో కళలను ఆస్వాదించేవారికి, భోజన ప్రియులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. ఈ చిన్న గల్లీని అలంకరించిన సుందరంగా మలిచిన తీరు చూస్తుంటే పారిస్‌ను తలపిస్తుంది. కేఫ్‌లు, ఫుడ్ జాయింట్లు పారిస్‌ను పోలిన వాతావరణం, కళాకృతిని పోలిఉంటాయి. సాయంత్రాలు ఇక్కడ మ్యూజికల్ బ్యాండ్స్, సోలో ఫెర్ఫామెన్స్లతో ఈ గల్లీలో సందడి నెలకొంటుంది. చంపా గల్లీలో ప్రతి ఈటింగ్ జాయింట్, కేఫ్‌ల్లో చిన్న రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. సందర్శకులు రుచికరమైన కాఫీ, వేడివేడి ఆహారాన్ని ఆరగిస్తూ తమకిష్టమైన పుస్తకాలను తిరగేయవచ్చు. -
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి..
ఘజియాబాద్ : ఆస్తి వివాదంలో 38 ఏళ్ల మహిళను అత్యంత కిరాతకంగా చంపి ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లో పడేసిన ఉదంతం దేశ రాజధానిలో వెలుగుచూసింది. ఎనిమిది నెలల కిందట దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని లోని ప్రాంతంలో కుళ్లిపోయిన మహిళ శవాన్ని వెలికితీసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జౌరీపూర్కు చెందిన బేబీ ఆగస్ట్ 29 నుంచి అదృశ్యమైంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా బయటపడ్డ ఆధారాల ప్రకారం బేబీ సోదరి రేఖతో సహజీవనం చేస్తున్న జాన్ మహ్మద్‌ను పోలీసులు ప్రశ్నించగా దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. బేబీ సోదరి రేఖ తన ప్రియుడు, మరో నలుగురు ఇతరులతో కలిసి బేబీని హతమార్చినట్టు స్వయంగా జాన్ మహ్మద్ అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. తమ పుట్టింటి ఆస్తికి సంబంధించి రేఖ, బేబీ మధ్య వివాదం నడిచింది. రేఖతో పాటు వారి సోదరుడు ఆస్తిని అమ్మాలని ప్రయత్నించగా బాధితురాలు బేబీ వారిని వారించేది. దీంతో రక్తంపంచుకుని పుట్టిన సోదరి బేబీని ప్రియుడు, మరో నలుగురి సహకారంతో రేఖ అంతమొందించింది. తాజా ఆధారాలతో రేఖతో పాటు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి త్యాగి తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు పంపామని, కేసు విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
టెక్నాలజీ సాయంతో వారు ఏంచేశారంటే ?
టెక్నాలజీని వినాశనానికి ఉపయోగిస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో ఇప్పటికే ఎన్నో ఘటనల ద్వారా తెలిసింది. అదే టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే ఎంతటి ప్రయోజనాలుంటాయో ఢిల్లీ పోలీసులు చాటిచెప్పారు. ఇంతకీ టెక్నాలజీ సాయంతో వారు చేసిన మంచిపని ఏంటో తెలుసా? ఇది చదవండి... న్యూఢిల్లీ : సెల్‌ఫోన్‌లాంటి చిన్న వస్తువు పోతేనే విలవిల్లాడిపోతాం. మరి కన్నబిడ్డలు దూరమైతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించలేనిది. కనిపించకుండా పోయిన బిడ్డ గురించే ఆలోచిస్తూ రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిపేస్తున్న తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. మరి వారి గర్భశోకాన్ని తీర్చేదెలా? ఇందుకు పరిష్కారం చూపారు ఢిల్లీ పోలీసులు. తప్పిపోయిన చిన్నారులను ఓ సాఫ్ట్వేర్ సాయంతో, వారి సొంతవారెవరో గుర్తించేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లో 3వేల మంది చిన్నారులను గుర్తించి, కన్నవారి చెంతకు చేర్చారట. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏంటో తెలుసా? ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్). సాఫ్ట్వేర్ ప్రయోగాత్మకంగా ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకునేందుకు ఓ నాలుగు రోజులు ప్రయత్నిస్తేనే 3 వేల మంది చిన్నారులను కాపాడగలిగామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను వాడేందుకు ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఎప్రిల్ 5న ఢిల్లీ హైకోర్టు అనుమతిని కోరారు. కానీ హైకోర్టు మాత్రం ఈ అప్లికేషన్‌ను వాడేందుకు అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతేగాక పిల్లల డేటాను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టవద్దని హెచ్చరికలు జారీచేసింది. దాంతో పోలీసులు వివిధ చిల్డ్రన్స్ హోమ్స్‌లో ఉంటున్న 45 వేలమంది పిల్లలపై ఎఫ్ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీంతో వారి ముఖాల ద్వారా 2,930 మంది పిల్లల వివరాలను గుర్తించారు. ఈ విషయాన్నే మహిళాశిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్లో వివరించింది. తప్పిపోయిన పిల్లలను వెతకడానికి ఈ సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడడంతో అనేక ఎన్జీవో సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ.. సాఫ్ట్‌వేర్‌ను పోలీసులకు ఉచితంగా అందించాలని సూచించాయి. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్సైతం పిల్లలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ సాఫ్ట్‌వేర్‌ను సమర్థించింది. తప్పిపోయిన చిన్నారులను తమ వారి దగ్గరు చేర్చేందుకు ఈ సాఫ్ట్వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. -
ఐదేళ్ల బాలుడిపై వృద్ధుడి అరాచకం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని గోవింద్‌పురిలో ఐదేళ్ల బాలుడిపై 55 సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలుడిని సమీపంలో నివసించే 55 ఏళ్ల వృద్ధుడు లైంగికంగా వేధించాడు. తల్లితండ్రులు తిరిగి ఇంటికి చేరుకున్న అనంతరం జరిగిన విషయాన్ని బాలుడు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసకుని దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధానిలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. పసిమొగ్గలను కామాంధులు చిదిమివేస్తున్న ఘటనలు పెచ్చుమీరడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
డేంజర్ జోన్లో ఢిల్లీ
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి ముంచుకొచ్చినా ఢిల్లీని విషవాయువులు వీడటం లేదు. విపరీతమైన వాయు కాలుష్యం రాజధానిని కమ్మేసింది. శీతాకాలంలో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన వాయుకాలుష్యం ఇప్పటికీ అదే స్ధాయిలో కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలో మంగళవారం ఉదయం ప్రమాదకర పీఎం 2.5 స్ధాయి 200గా నమోదైంది. ఇది సురక్షిత స్ధాయి 100 కంటే రెట్టింపు కావడం గమనార్హం. ఇక లోధి రోడ్లో పీఎం 2.5 స్థాయి 190గా నమోదవగా, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరంగా 463గా నమోదైంది. దేశ రాజధానిలో నెలకొన్న వాతావరణం ప్రమాదభరితమని, కలుషిత వాయువులతో ప్రజల ఆరోగ్యానికి పెను సవాల్ ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా అధికారుల్లో కదలిక లేదు. పరిస్థితి విషమించేలా ఎలాంటి ఆంక్షలు లేకుండా వాహన ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతూ నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్ధాలను తగలబెట్టడం ఢిల్లీ వాయు కాలుష్యానికి కారణమని అధికారులు అప్పట్లో చెప్పినా వేసవి ప్రారంభమైనా నగరంలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. కాలం చెల్లిన వాహనాలపై కఠిన ఆంక్షలు విధించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన ఇంధనాలను వాడేలా వాహనాలను అప్‌గ్రేడ్ చేయడంలో అధికారుల అలసత్వం పరిస్థితి తీవ్రతకు కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తిరుపతి హుండీ లెక్కలే నయం..
-
తిరుపతి హుండీ లెక్కలే నయం..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్లీనరీ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దుపై ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ ఇంకా లెక్కలు కడుతూనే ఉందని, పాతనోట్ల రూపంలో ఎంత మొత్తం తిరిగివచ్చిందనేది ఇప్పటికీ వెల్లడించలేదని దుయ్యబట్టారు. ‘ మీరు (ఆర్బీఐ) తిరుపతి హుండీలెక్కలను ఎందుకు పరిశీలించరు..? వాళ్లు మీకంటే వేగంగా డబ్బును లెక్కిస్తార’ని చిదంబరం వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయం బూటకమని..బ్లాక్‌మనీ, అవినీతిని నిర్మూలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర పాలకులు నమ్మబలకడం హాస్యాస్పదమని చిదంబరం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రతి ర్యాలీకి నల్లధనాన్నే ఖర్చు చేశారని ఆరోపించారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈ-వాహనాలు తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలను సంప్రదాయ కార్లకు స్వస్తి పలికి ఎలక్ర్టానిక్ వాహనాలకు మళ్లాలని ఇంధన మంత్రిత్వ శాఖ కోరింది. 2030 నాటికి వాహన ట్రాఫిక్‌లో 30 శాతం బ్యాటరీలపై నడిచే వాహనాలు ఉండాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుకూల ఎలక్ర్టికల్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది. పలు మంత్రిత్వ శాఖలకు ఇంధన వనరుల మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ర్టిక్ వాహనాలకు మళ్లాలని నిర్ణయించినట్టు లేఖలో పేర్కొన్నారు. తొలిదశలో జాతీయ రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల్లో ఎలక్ర్టిక్ వాహనాలను ప్రవేశపెడతారు. విద్యుత్ మంత్రిత్వ శాఖలోని పీఎస్‌యూలతో కలిసి పనిచేసే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎస్) ఇప్పటికే 10,000 ఎలక్ర్టిక్ వాహనాలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలను కూడా పలు ప్రాంతాల్లో నెలకొల్పనున్నట్టు లేఖలో ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
హోలీ వేడుకల్లో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. హోలీ పేరుతో కొందరు దుండగులు తమపై వీర్యం నింపిన బెలూన్లను విసిరివేస్తూ వేధిస్తున్నారని లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థినులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ద్రవపదార్థం నిండిన బెలూన్ను తనపై కొందరు విసిరివేశారని, అది తన దుస్తులపై పడిందని ఓ విద్యార్థిని తన ఫ్రెండ్‌తో చెప్పగా, అయితే అవి రంగు నీళ్లు కాదని, వీర్యమని గుర్తించిన వారు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు పలువురు విద్యార్థినులకు ఎదురయ్యాయని కాలేజ్ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ విచారణలో వెల్లడైంది. తమపై కొందరు ఇలాంటి బెలూన్లు విసిరారని ముగ్గురు విద్యార్థినులు చెప్పారని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై కళాశాల విద్యార్థి సంఘం, కళాశాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపు ఘటనలపై తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు పోలీసు అధికారులు ఓ మొబైల్ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు. మరోవైపు విద్యార్థినులపై వేధింపులు నివారించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (విమెన్)ను కలిసి ఫిర్యాదు చేశామని లేడీ శ్రీరాం కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారు. -
బ్రూనై సుల్తాన్ ఎలా వచ్చారంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరంటే ఆ హంగామా, దర్పం వేరు. వాళ్లు మనలా కార్లు, విమానాలను నడుపుకుంటూ రావడం జరిగే పనికాదు. వారు వచ్చారంటే వారి పరివారం..ఆ హడావిడే వేరు. అయితే ఇలాంటి సీన్ ఈ వీవీఐపీ విషయంలో మాత్రం రివర్స్ అయింది. భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బ్రూనై సుల్తాన్ హసనై బొకీ తన జంబో జెట్‌ను డ్రైవ్ చేసుకుంటూ నేరుగా ఢిల్లీలో ల్యాండవడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అధికారగణం సంబ్రమాశ్చర్యాల్లో మునిగితేలింది. ఆయనను కాక్‌పిట్‌లో చూసిన వారంతా విస్తుపోయారు. 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన అనంతరం బ్రూనై సుల్తాన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇతర దక్షిణాసియా దేశాల మాదిరిగా బ్రూనై వార్తల్లో నిలవకపోయినా 71 ఏళ్ల సుల్తాన్ చేసిన ఈ ఫీట్‌తో ఆ దేశం హైలైట్ అయిందని అధికారులు చెప్పుకుంటున్నారు. 2008, 2012లో సుల్తాన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడూ తన విమానాలకు ఆయనే కెప్టెన్‌గా వ్యహరించారని అధికారులు గుర్తుచేసుకున్నారు. విదేశీ పర్యటనల సందర్బంగా సుల్తాన్ తన 747-700 ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆయనే పైలెట్‌గా వ్యవహరిస్తారు. గత ఏడాది అక్టోబర్ 5తో ఆయన అయిదు దశాబ్దాల సుదీర్ఘ అధికార ప్రస్ధానం పూర్తిచేసుకోవడం గమనార్హం. -
గణతంత్ర వేడుకలు : ఢిల్లీలో హైఅలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకలకు ఆసియాన్ దేశాధినేతలు ముఖ్య అతిధులుగా హాజరవనుండటంతో ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎదురవచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికలతో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. దేశరాజధానిలో శుక్రవారం రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్రమంలో జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు తొలిసారిగా ప్రపంచ నేతలు పలువురు తరలివస్తున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడ, వియత్నాం ప్రధాని న్యూయెన్ ఫుక్, మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ అంగ్ సాన్ సూకీ, లావోస్ ప్రధాని సిసోలిత్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు చన్ ఓచా, బ్రూనై సుల్తాన్ హసనాయ్ బొల్కియా సహా ఉన్నతస్ధాయి విదేశీ ప్రతినిధులు రానుండటంతో భద్రతా సంస్ధలు మునుపెన్నడూ లేని రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వేడుకల నేపథ్యంలో ఉగ్ర దాడుల ముప్పు పొంచిఉందని, అదే సమయంలో పాక్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల కదలికలు పెరగడాన్ని ప్రస్తావిస్తూ నిఘా సంస్థలు హెచ్చరించాయి. హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోనిజామా మసీదు, బాట్లా హౌస్, కృష్ణనగర్, అర్జున్ నగర్ సహా ఉగ్ర కదలికలపై అనుమానాలున్న పలు కాలనీల్లో, వ్యూహాత్మక ప్రదేశాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. -
రాజ్యసభకు ముగ్గురు ఆప్ అభ్యర్థులు ఎన్నిక
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్.డి.గుప్తాలు సోమవారం రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల కమిషన్ తరపున రిటర్నింగ్ అధికారి నిధి శ్రీవాత్సవ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. -
కూల్ జోన్లో రాజధాని
సాక్షి,న్యూఢిల్లీ: మంచుదుప్పటి కప్పుకున్న దేశ రాజధాని రాబోయే వారం రోజుల్లో మరింత వణకనుంది. పొగమంచు, చలిగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజధానిలో వచ్చే వారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలకు పడిపోతుందని ఐఎండీ తెలిపింది. రాజధాని ప్రాంతంలో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 7.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. జనవరి 4 తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు దిగివస్తాయని పేర్కొంది. ఉత్తరాది నుంచి శీతలగాలులు ఢిల్లీని తాకుతున్నాయని, గాలుల ఉధృతి అధికమయ్యే కొద్దీ ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. -
రిజర్వేషన్లకు అవి ముప్పే..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రయివేటీకరణ, అవుట్‌సోర్సింగ్‌లను నిరసిస్తూ రాజధానిలోని రాంలీలా మైదానంలో అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య భారీ ఆందోళన చేపట్టింది. ప్రయివేటీకరణ, ఉద్యోగాల అవుట్సోర్సింగ్ రిజర్వేషన్ల విధానానికి ముప్పుగా పరిణమించాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సమకూరి దశాబ్ధాలు గడిచినా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ఎంపీ ఉదిత్ రాజ్ అన్నారు. యూపీ, బీహార్, హర్యానా, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలకు చెందిన కార్యకర్తలు తరలివచ్చారు. -
జాతీయ ప్రాజెక్టుగా కాళేశ్వరం : ఎంపీ బూర డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని టీఆర్ఎస్కు చెందిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య డిమాండ్ చేశారు. ఏపీలో పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినట్లే కాళేశ్వరానికి కూడా కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఆయన కోరారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం రికార్డు సమయంలో సాంకేతిక, అటవీ అనుమతులు మంజూరుచేసిందని ఆయన పేర్కొంటూ అందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక శక్తులు ప్రయత్నించినా వాటన్నింటినీ తాము అధిగమించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని, ఈ ప్రాజెక్టు అన్నపూర్ణగా నిలుస్తుందని చెప్పారు. విభజన చట్టం ప్రకారం శాసనసభ స్థానాల పెంపుకోసం తాము పట్టుపడతామని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్‌పై ఉందన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు, హైకోర్టు విభజన, షెడ్యూల్ 9,10 సంస్థలు, ఉద్యోగుల విభజన అంశాలపై తాము పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఆయన వివరించారు. -
కొండెక్కిన ఉల్లి ధర
న్యూఢిల్లీ: ఉల్లి ధర చుక్కలనంటుతోంది. దేశ రాజధానిలో కిలో ఉల్లి చిల్లరధర రూ.80 పలుకుతోంది. సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర మెట్రో నగరాల్లోనూ రూ. 50 నుంచి 70 దాకా ఉంది. ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరఫరా చాలా తగ్గిందని.. దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి కూడా పడిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్ర లసల్గావ్ మండికి వచ్చే ఉల్లి సరఫరా 47 శాతం తగ్గింది. గతేడాది ఇదే సమయంలో 22,933 క్వింటాళ్ల ఉల్లి అందుబాటలో ఉండగా.. ఇప్పుడు అది 12 వేల క్వింటాళ్లకు తగ్గింది. గతేడాది లసల్గావ్లో కేజీ ఉల్లి రూ.7.50కి విక్రయించగా.. ఇప్పుడు రూ. 33కు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. -
నాలుగింతలు పెరిగిన పార్కింగ్ ఫీజు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో తీవ్ర స్థాయికి చేరిన కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగించిన నేపథ్యంలో వాహనాల పార్కింగ్ ఫీజును నాలుగు రెట్లు పెంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంది. సుప్రీంకోర్టు నియమించిన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)తో మంగళవారం సమావేశమైన అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజలు సొంత వాహనాలను వాడకుండా చేసేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పార్కింగ్ ఫీజును నాలుగు రెట్లు పెంచాలని తీర్మానించారు. రాజధానిలో కాలుష్య స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతుండటంపై అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈపీసీఏ కమిటీ సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వాహనాల ఉపయోగాన్ని నిరోధించేందుకు ప్రజారవాణాను తక్షణమే మెరుగు పర్చాలని ఆదేశించింది. కీలక సమయాల్లో (పీక్ అవర్స్) కనీసం పది గంటల పాటు ఢిల్లీ మెట్రో రేట్లను తగ్గించాలని సిఫారసు చేసింది. అలాగే వాహనాల సరి-బేసి నంబర్ల స్కీమ్‌ను పునరుద్ధరించాలని గ్రీన్ ప్యానెల్ కోరింది. అలాగే పరిస్థితి మరింత దిగజారకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సాయంత్రానికి పొల్యూషన్‌పై ఒకనివేదిక సమర్పించాలని ఢిల్లీ ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. దాదాపు 8వేల మాస్క్‌లను సీఐఎస్ఎఫ్ జవాన్లను పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఢిల్లీలో ప్రమాదస్థాయికి చేరిన కాలుష్యంతో తీవ్రమైన పొగమంచు కప్పేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం హెచ్చరికలు చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో అతి భయంకరమైన గాలి నాణ్యత మరింత క్షీణించింది. -
రెండు రాజధానుల మధ్య...
సాక్షి,న్యూఢిల్లీ: ఒకటి దేశ రాజధాని..మరోటి దేశానికి ఆర్థిక రాజధాని.. ఈ రెండు రాజధానులను కలుపుతూ సోమవారం నుంచి న్యూ స్పెషల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఢిల్లీ, ముంబయిల మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని కల్పించేందుకు ఈ రైలు సర్వీసును ప్రవేశపెడుతున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైలుకు ఫ్లెక్సి ఫేర్ వర్తించదని, అయితే ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే సెకండ్, థర్డ్ ఏసీ చార్జీలు దాదాపు 19 శాతం తక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. రెండు మెట్రో నగరాలను కలుపుతూ ఇప్పటికే రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, 30 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. న్యూ రాజధాని ఎక్స్‌ప్రెస్ రాకతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటల వరకూ తగ్గుతుందని అధికారులు చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్ మార్గమధ్యంలో కోట, వదోదర, సూరత్‌లలో మాత్రమే ఆగుతుందని తెలిపారు. -
జర్నలిస్టుపై జైట్లీ సీరియస్
-
జర్నలిస్టుపై జైట్లీ సీరియస్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్ అయ్యారు. జైట్లీ ఓ సెమినార్లో బుల్లెట్ రైలు గురించి ప్రసంగిస్తున్నారు. జైట్లీ సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని ఓ జర్నలిస్టు హిందీలో బుల్లెట్ ట్రైన్‌ను ఏమంటారని అడిగారు. దీనికి ఆగ్రహించిన జైట్లీ కొంతసేపు అయినా సీరియస్‌గా ఉండండి ఇలా మధ్యలో అడ్డు రావడం మంచిది కాదంటూ అతనిని మందలించారు. -
జీవితకాలం మరో పదేళ్లు పెరగాలంటే...
సాక్షి, న్యూఢిల్లీః ఆరోగ్యకర జీవనానికి పరిసరాల ప్రభావం అత్యంత కీలకమని మరో అథ్యయనం తేల్చింది.కాలుష్య కోరల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని పౌరులు ఆరోగ్యకర జీవనం కోసం శుభ్రమైన గాలిని పీల్చాల్సిందేనని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారిస్తే నగర వాసుల జీవిత కాలం మరో తొమ్మిదేళ్లు పెరుగుతుందని తాజా అథ్యయనం తేల్చింది. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం నియంత్రిస్తే భారతీయుల జీవన కాలం మరో నాలుగేళ్లు పెరుగుతుందని చికాగో వర్సిటీకి చెందిన ఎనర్జీ పాలిసీ ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఈ వివరాలు వెల్లడించింది. ఢిల్లీ గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్, పీఎం 2.5గా నమోదైంది. 2.5 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటే అది మానవుల శ్వాసకోశ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లచేస్తుంది. జాతీయ సగటు స్ధాయిలో ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించినా దేశ రాజధాని వాసుల జీవితకాలం మరో ఆరేళ్లు పెరుగుతుందని ఈ అథ్యయనం పేర్కొంది.ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాల జాబితాలో ఢిల్లీ ముందువరుసలో ఉంది. -
కేంద్ర కేబినెట్లోకి కొత్త ముఖాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం ముహూర్తం ఖరారవడంతో పదవుల కోసం నిరీక్షిస్తున్న ఆశావహుల్లో క్షణక్షనానికి ఉత్కంఠ పెరుగుతోంది. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు, రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకున్న జరుగనున్న అతిపెద్ద మంత్రివర్గ విస్తరణ ఇదే అవడం వల్ల ఇప్పుడు పదవి దక్కకపోతే మరో టర్మ్ వరకు పదవి దక్కదని ఆశావహులు భావిస్తున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణనకు పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే దాదాపు పది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషికి కొత్త కేబినెట్లో చోటు దొరికే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ ఠాకూర్ లేదా మాజీ ముఖ్యమంత్రి పీకే ధుమాల్లో ఒకరిని పదవి వరించనుంది. ఉమాభారతి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీసీ నాయకుడు ప్రహ్లాద్ పటేల్‌కు కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ నుంచి ఓపీ మాథూర్ కేబినెట్‌కు రంగంలో ఉన్నారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఆయన్ని కేబినెట్లోకి తీసుకోకూడదంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేబినెట్ విస్తరణలో వ్యక్తుల ప్రతిభా పాటవాలను పరిగణలోకి తీసుకోవడంతోపాటు ప్రాంతీయ సమతౌల్యతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలను దష్టిలో పెట్టుకోవడంతోపాటు ఇటీవల ఎన్డీయే కూటమిలో చేరిన కొత్త మిత్ర పక్షాలకు కూడా చోటు కల్పించాల్సి ఉంటుంది. నితీష్ కుమార్ పార్టీ అయిన జనతాదళ్–యూ కూటమిలో చేరినందున ఆ పార్టీ నుంచి ఆరీసీపీ సింగ్, అఖిల భారత అన్నా డిఎంకె నుంచి వి. మైత్రేయన్, ఎం. తంబిదురైలకు కేబినెట్లోకి అవకాశం లభించవచ్చు. ఇక మనోహర్ పర్రీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే శాఖకు రాజీనామా చేస్తానని సురేశ్ ప్రభు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరి స్థానాలను కూడా మోదీ ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. పర్రీకర్ నిర్వహించిన కీలకమైన రక్షణ శాఖను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదనపు బాధ్యతగా ప్రస్తుతం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇంతటి కీలకమైన రక్షణ శాఖను ఎవరికి అప్పగిస్తారా? అన్న అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొనే ఉంది. ఇక సురేశ్ ప్రభు స్థానంలో కేంద్ర రైల్వే శాఖను ఇప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న గడ్కారీకి ఇవ్వొచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. -
పార్లమెంట్లో తిరుపతి లడ్డూల పంపిణీ
న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని బీజేపీ.. తిరుపతి ప్రసాదం లడ్డూలను పార్లమెంట్లో సభ్యులకు పంపిణీ చేసి అందరితో పంచుకుంది. తిరుపతి ఆలయ అధికారులకు సుమారు 1200 లడ్డూలను ఆర్డరివ్వగా వారు బుధవారం సాయంత్రానికి 600 మాత్రం సిద్ధం చేశారు. వాటిని వెంటనే రాజధానికి తరలించిన బీజేపీ శ్రేణులు.. గురువారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు పంపిణీ చేశారు. తిరుపతి లడ్డూలకు ఎంతో పేరున్న విషయం విదితమే. ముందుగా ఈ లడ్డూలను బీజేపీ పార్లమంటరీ పార్టీ సమావేశంలో అందజేయాలనుకున్నామని, చివరి నిమిషంలో ఓ నాయకుడు ఇచ్చిన సూచన మేరకు ఆ నిర్ణయం మార్చుకున్నామని వివరించారు. -
యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలు ఎవరు?
ఆదివారం సాయంత్రం పార్లమెంటరి బోర్డు మీటింగ్ నిర్ణయించునన్న బీజేపీ పార్టీ న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ శనివారం వెలవడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భారీ విజయం సాధించడంతో పార్టీ పార్లమెంటరి బోర్డు ఆదివారం సాయంత్రం భేటీ కానుంది. రెండు రాష్ట్రాలలో సీఎంలుగా ఎవరిని నియమించాలనే విషయంపై భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. గోవా, మణిపూర్‌లో పార్టీ స్థితిగతులపై మాట్లాడనున్నారు. రెండు రాష్ట్రాలలో పూర్తి మెజారీటీ దక్కకపోవడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భవిష్యత్ ప్రణాళికలు వెయ్యనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ భేటీకి హాజరుకానున్నారు. ఎన్నికలు జరిగిన సంబంధిత రాష్ట్రాలకు చెందిన ప్రముఖమైన నాయకులు మాత్రమే భేటీలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. -
ఎండగా ఉన్న ఉదయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం ఉదయం దాదాపుగా 13.5 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ అధికారి తెలపారు. ఈ సీజన్లో ఆకాశంలో గరిష్ట ఉష్ణోగ్రత రోజుంతా స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రోజు మొత్తంలో దాదాపుగా ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణ శాఖ అదికారి తెలిపారు. శనివారం ఉదయం 8.30 గంటలకూ వాతావరణంలో తేమ 62 శాతంగా ఉంది. శుక్రవారం ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత కన్నా శనివారం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
ఢిల్లీలో ఎర్రకోట వద్ద కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద కలకలం రేగింది. సోమవారం ఉదయం ఎర్రకోట సమీపంలో పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఎన్ఎస్జీ బాంబ్ స్క్వాడ్ వెంటనే రంగంలో దిగి ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తోంది. ఎర్రకోటకు నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. రద్దీగా ఉండే ఈ చారిత్రక ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారా అనే కోణంలో జాతీయ భద్రత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక్కడ ఈ పేలుడు పదార్థాలను ఎవరు ఉంచారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ భారీగా భద్రత బలగాలను మోహరించారు. అణువణువూ క్షుణ్నంగా తనికీ చేస్తున్నారు. -
అనాథ బిడ్డలకు గుర్తింపునివ్వాలి
మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య జఫర్‌గఢ్ : అనాథ బిడ్డలకు చట్టపరంగా వారికి గుర్తింపు ఇవ్వాలని మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హెల్పింగ్ హర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నయ్య నేతృత్వంలో బృందం ఢిల్లీలోని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి శనివారం వినతిపత్రం ఇచ్చారు. ఆయనతో పాటు కేంద్ర మహిళ అభివృద్ధి శాఖ మంత్రి మేన క సంజయ్‌గాం«ధీని కూడ కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఇన్నయ్య మాట్లాడుతూ దేశంలో 4 కోట్ల మంది అనాథ బిడ్డలు ఉన్నారన్నారు. వీరికి ఇప్పటి వరకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేదన్నారు. వారి హక్కుల కోసం 8 ఏళ్లుగా తాము పోరాటం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ గుర్తింపు ఉన్న అనాథ బిడ్డలకు చట్ట పరంగా గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. దీనికోసం పార్లమెంట్ ద్వారా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పార్లమెంట్లో 9 మార్లు ప్రైవేట్ బిల్లు పెట్టించడం జరిగిందన్నారు. చట్టపరంగా గుర్తింపు నివ్వడంతో పాటు 18 ఏళ్లు నిండినఅనాథలకు ఓటు హక్కు కల్పించేలా గుర్తింపుకార్డు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిుçషన్ను కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సంస్థ ప్రతినిధులు శ్రీశైల్‌రెడ్డి, రజినీకాంత్‌రావు, వెల్మల విక్రమ్, అనాథ ఆశ్రమ బిడ్డలు ఉన్నారు.