
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇరు వర్గాలు నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. దుండగులు కొన్ని ఇళ్లపైన కూడా రాళ్లు రువ్వారు. ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆదివారం కూడా మౌజ్‌పూర్ ప్రాంతంలో ఇరు వర్గాలు రాళ్ల దాడులకు దిగాయి. మౌజ్‌పూర్ చౌక్‌కు బీజేపీ నేత కపిల్ మిశ్రా చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. జఫరాబాద్ ప్రాంతంలోనూ సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు బాహాబాహీకి దిగాయి, బహజన్‌పురాలో కొందరు రాళ్లదాడికి పాల్పడుతూ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పుపెట్టారు.
ఇక్కడ చదవండి:
Comments
Please login to add a commentAdd a comment