సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన షహీన్‌బాగ్‌లో 144వ సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను తరలించామని ఢిల్లీ జాయింట్ కమిషనర్ డీసీ శ్రీవాస్తవ వెల్లడించారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో మరోసారి ఎలాంటి ఉద్రిక్తతలు తల్తెతకుండా శాంతి భద్రతలను సవ్యంగా నిర్వహించాలనే ఉద్దేశంతో షహీన్‌బాగ్‌లో ఈ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. 1000 మంది జవాన్లతో పాటు 12 కంపెనీ పారామిలటరీ బలగాలను షహీన్‌బాగ్‌కు రప్పించారు. ఈ ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదని, వారి నిరసనలను విరమించాలని, ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment