
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం జరగాల్సిన సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసినట్టు అధికారులు వెల్లడించారు. సీఏఏ ఆందోళనలతో నెలకొన్న ఉద్రిక్తతను పురస్కరించుకుని ఢిల్లీ ప్రభుత్వం వినతి మేరకు విద్యార్ధులు, సిబ్బంది, తల్లితండ్రులకు తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి బుధవారం తెలిపారు. మరోవైపు సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. ఈశాన్య ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటించారు. ఢిల్లీలో ప్రస్తుతం పరిస్ధితి పూర్తి అదుపులో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment